బరన్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బరన్
భంద్ దేవ్రా ఆలయం
భంద్ దేవ్రా ఆలయం
Coordinates: 25°06′N 76°31′E / 25.1°N 76.52°E / 25.1; 76.52
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
ప్రధానకేంద్రంబరన్
Area
 • Total6,992 km2 (2,700 sq mi)
Elevation
262 మీ (860 అ.)
Population
 (2011)[2]
 • Total12,22,755
 • Density170/km2 (450/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
325205
ప్రాంతీయ ఫోన్‌కోడ్07453
Vehicle registrationRJ-28

రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలలో బరన్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా బరన్ పట్టణం ఉంది.1948 అవిచ్ఛిన్న రాజస్థాన్ రూపొందించిన సమయంలో బరన్ రాజస్థాన్ జిల్లాలలో ఒకటిగా ఉంది. 1949 మార్చి 31న రాజస్థాన్ రాష్ట్రం పునర్విభజన చేయబడింది. బరన్ జిల్లా కేంద్రం, కోట జిల్లా సబ్ డివిజవ్ కేంద్రంగా మార్చబడింది. 1991 ఏప్రిల్ 10న మునుపటి కోట జిల్లా నుండి బరన్ జిల్లా రూపొందించబడింది. జిల్లా కేంద్రం బరన్ పేరును జిల్లాకు స్థిరీకరించారు.

చరిత్ర[మార్చు]

1947కు ముందు ప్రస్తుత బరన్ జిల్లాలో అత్యధిక భూభాగం కోట రాజస్థానంలో భాగంగా ఉండేది. మిగిలిన కొంత భూభాగం షహదాబాదు తాలూకా ఝలావర్ రాజాస్థానంలో భాగంగా ఉండేది. అలాగే చబ్రా తాలూకా, టోంక్ రాజాస్థానంలో ఉండేది. 1948లో అవిభాజిత రాజస్థాన్ రాష్ట్రం రూపొందించబడింది. అప్పుడు అవిభాజిత రాజస్థాన్ జిల్లాలలో బరన్ ఒక జిల్లాగా ఉండేది.ఈ జిల్లా ఝలావర్ - బరన్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి (అంటా, కిషంగంజ్, బరన్-అత్రు, చబ్రా, మంగ్రోల్, షహదాబాదు, చిపాబరోద్). 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజాస్థానాల పాలకులు తమ రాజ్యాలను భారతదేశంతో దేశంతో కలపడానికి అంగీకరించారు.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం బరన్ జిల్లా మొత్తం జనాభా 1,222,755.ఇది సుమారుగా ట్రినిడాడ్, టొబాగో దేశానికి లేదా యుఎస్ స్టేట్ న్యూ హాంప్‌షైర్‌ జనాభాకు సమానం.[3][4] ఇది భారతదేశంలోని జిల్లాలలో జనాభా పరంగా 389 వ ర్యాంకును ఇస్తుంది (మొత్తం 640 లో). జిల్లాలో జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 175 మంది (450 / చదరపు మైళ్ళు). 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 19.8%కి పెరిగింది బరన్ జిల్లాలోని ప్రతి 1000 మంది పురుషులకు 926 మంది స్త్రీలు ఉన్నారు.జిల్లాలోని అక్షరాస్యత 67.38%గా ఉంది.2011 భారత జనాభా లెక్కల సమయంలో, జిల్లాలోని ప్రజలలో 96.86% మంది జనాభా హిందీ, 1.92% ఉర్దూ, 0.55%మంది బెంగాలీ భాషలు వారి మొదటి భాషగా మాట్లాడేవారు ఉన్నారు.[5]

చరిత్ర[మార్చు]

14-15వ శతాబ్దంలో బరన్ నగరం సోలంకి రాజపుత్రుల ఆధీనంలో ఉంది. సోలంకి ఆధీనంలో ఉన్న 12 గ్రామాలున్న ఈ భూభాగానికి బరన్ అని పేరు ఎప్పుడు వచ్చిందో కచ్చితంగా తెలియదు.ఈ విషయంలో పలు కథనాలు ఉన్నాయి. కొంతమంది ఇందులో 12 గ్రామాలున్నాయి కనుక ఇది బరన్ అయిందని కొందరు భావిస్తున్నారు. మరికొందరు ఈ నగరం సమీపగ్రామాలలోని 12 మంది గ్రామస్థులచేత స్థాపించబడింది కనుక ఇది బరన్ అయిందని భావిస్తున్నారు. ఉర్ధూలో బరన్ అంటే వర్షం. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఉన్న జిల్లాలలో బరన్ రెండవ స్థానంలో ఉంది కనుక దీనికి బరన్ పేరు వచ్చిందని కొందరు భావిస్తున్నారు.

వాతావరణ అనుకూలం[మార్చు]

జిల్లాను సందర్శించడానికి అనుకూల వాతావరణం సెప్టెంబరు నుండి మార్చి వరకు. జిల్లా రైలు, రహదారి మార్గాలతో చక్కగా అనుసంధానితమై ఉంది. బరన్ నగరంలో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సౌకర్యం ఉంది.

ప్రయాణసౌకర్యాలు[మార్చు]

వాయుమార్గం[మార్చు]

జిల్లాకు సమీప " జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ", ఉదయపూర్ విమానాశ్రయం, జోధ్‌పూర్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాలు రాజస్థాన్ రాష్ట్రాన్ని ముంబయి, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలతో అనుసంధానిస్తున్నాయి. కోట, జైసల్మేర్ వద్ద రెండు విమానాశ్రయాలు ఉన్నప్పటికీ ఇవి పౌర విమానాలను అనుమతించవు.

రహదార్లు[మార్చు]

బరన్ నగరం పొరుగున ఉన్న నగరాలు, రాష్ట్రేతర ప్రాంతాలతో రహదారి మార్గాలతోచక్కగా అనుసంధానించబడి ఉంది. జాతీయ రహదారి 76 (ప్రస్తుతం జాతీయ రహదారి 27) జిల్లా నుండి పయనిస్తున్నాయి. జాతీయ రహదారి 76 ఈస్ట్ - వెస్ట్ కారిడార్‌లో భాగంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లాలో ఉన్న రహదార్ల మొత్తం పొడవు 2052 కి.మీ. ఉంది. ఢిల్లీ, జైపూర్, కోట, అజ్మీర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, ఇండోర్, ఉజ్జయిని నుండి నేరుగా వచ్చే బస్సులు బరన్ జిల్లాకు ఉన్నాయి.

బరన్ నగరం నుండి ఇతర నగరాల మద్య దూరం[మార్చు]

రైల్వే[మార్చు]

బరన్ స్టేషను వెస్టర్న్ స్ర్ంట్రల్ రైల్వే సంబంధిత కోట్- బినా స్టేషను వద్ద ఉంది. ఇది కోట జంక్షన్‌కు 67 కి.మీ దూరంలో ఉంది. కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సదుపాయం ఉంది.

ఆలయాలు[మార్చు]

తాడ్ఖా బాలాజీ (సాకేత్ ధాం)[మార్చు]

శ్రీ తాద్ కా బాలాజీ దేవత

బరన్ నగరంలో తాడ్ఖా బాలాజీ సాకేత్ ధాం ఉంది. ఈ ఆలయంలో పురాతనమైన హనుమాన్, జింద్ మహరాజ్, మాతాజీ, శివాజీ ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఆలయం గురించిన 1000 సంవత్సరాల పైగా చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకోవచ్చు.

షాని ధాం (బోర్డి)[మార్చు]

శ్రీ శని ధామ్, బోర్డి

శ్రీ శని ధాం బోర్డి బరన్ నగరానికి సమీపంలో ఉంది. ఇది ప్రఖ్యాతి చెందిన పురాతన శనిదేవుని, హనుమంతుని ఆలయం. ఇప్పటికీ ఈ ఆలయం గురించిన చరిత్ర క్లుప్తంగా లభిస్తుంది.ఈ ఆలయ సమీపంలో ప్రతి సంవత్సరం శని అమావాస్య సందర్భంలో ఉత్సవం నిర్వహించబడుతుంది. పషర్వనాథ్ చారిటీ ట్రస్ట్ ఆలయపరిరక్షణ బాధ్యతలు తీసుకుంటుంది.

మణిహరా మహదేవ్[మార్చు]

మణిహరా మహదేవ్ మందిర్ బరన్ నగరానికి 3 కి.మీ దూరంలో ఉంది. ఈ మందిరంలో పురాతన మహదేవ్‌జి, హనుమాన్‌జీ ఆలయాలు ఉన్నాయి.ఇప్పటికీ ఈ ఆలయం గురించిన 600 సంవత్సరాలకు పైగా చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకోవచ్చు.ఈ ఆలయ సమీపంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

షహబాద్ కోట[మార్చు]

హదోతీ ప్రాంతంలో షహదాబాదు కోట ఉత్తమమైన, శక్తివంతమైన కోటలలో ఒకటి. ఇది బరన్ నగరానికి 80 కి.మీ దూరంలో ఉంది. 1521లో చౌహాన్ వంశానికి చెందిన ధంధేల్ రాజపుత్ ముకుత్మణి దేవ్ నిర్మించాడు. ఇది దట్టమైన అరణ్యం మద్య ఎత్తైన కొండల మీద నిర్మించబడింది. కోట ఇరువైపులా కుందకో లోయలు ఉన్నాయి. మిగిలిన ఇరువైపులలో కోనేర్లు, ఎత్తైన శిలలు ఉన్నాయి. టాప్ఖాన్, బరుద్ఖానా, కొన్ని ఆలయాలు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. ఈ కోటలో 19 కెనాన్లు ఉండగా ఒక దాని ఎత్తు 18 అడుగులు ఉంటుంది.

  • నాగర్‌కోట్ మాతాజీ
నాగర్‌కోట్ మాతాజీ ఆలయం
  • శీతాబారి: ఇది ఒక విహార ప్రదేశం. బరన్ నగరానికి ఇది 45 కి.మీ దూరంలో ఉంది. జాతీయ రహదారిలో శివ్‌పురి గ్వాలియర్ కూడలిలో ఉంది. ఇది ఒక ఆరాధన ప్రాంతం. రాముడు సీతను అడవిలో విడిచిన తరువాత సీతామాత ఇక్కడ నివసించిందని, ఇక్కడ ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో లవకుశులు జన్మించారని భావిస్తున్నారు. ఇక్కడ వాల్మికి కుండ్, సీతా కుండ్, లక్ష్మణ్ కుండ్, సూర్యకుండ్, లవకుశ్ కుండ్, సీతాకుటీరం మొదలైనవి ఉన్నాయి. మే, జూన్ మాసాలలో ఇక్కడ గిరిజన సంత నిర్వహించబడుతుంది.

షెర్ గర్ కోట[మార్చు]

చారిత్రాత్మకమైన షెర్ గర్ కోట హదోతి ప్రాంతంలో ఉంది. ఇది బరన్ నగరానికి 65 కి.మీ దూరంలో అత్రు తాలూకాలో ఉంది. దుర్భేధ్యమైన షెర్ గర్ కోట పర్బన్ నదీతీరంలో ఒక కొండమీద నిర్మించబడి ఉంది. ఈ కోట పట్టణానికి కొంచం దూరంగా ఉంది. ఇక్కడున్న సా.శ. 790 నాటి శిలాఫలకం ఈ ప్రాంతపు పురాతనత్వం వివరిస్తుంది. ఇది ఒకప్పుడు కొష్వర్దన్ అని పిలివబడింది. రాజస్థాన్లో ఉన్న గొప్ప కోటలలో ఇది ఒకటని భావించబడుతుంది.

నాహర్ గర్ కోట[మార్చు]

ఈ కోట బరన్ నగరానికి 73 కి.మీ దూరంలో కిషంగంజ్ తాలూకాలో ఉంది. ఎర్రని రాళ్ళతో ఆకర్షణీయంగా నిర్మించబడిన మొగల్ నిర్మాణవైభవానికి ఉదాహరణగా నిలిచింది.

కన్యాదేహ్[మార్చు]

కన్యా దేహ్ (బిలాస్ గర్) బరన్ నగరానికి 45కి.మీ దూరంలో కిషంగంజ్ తాలూకాలో ఉంది. కిషంగంజ్ - భంవర్గర్ రహదారిలో ఫల్ది గ్రామానికి వెళ్ళేదారిలో ఉంది. ఖెచి రాజ్యపాలనలో బిలాస్‌గర్ పెద్ద నగరంగా ఉండేది. దీనిని ఔరంగజేబు ఆఙతో శిథిలం చేసారు. ఖెచి రాకుమారి అందానికి ముగ్ధుడైన ఔరంగజేబు రాకుమారి కొరకు పంపిన సైన్యాలు బిలాస్‌గర్‌ను ధ్వంసం చేసాయి.తరువాత రాకుమారి బిలాసినదిలో మునిగి ప్రాణత్యాగం చేసింది. రాకుమారి ప్రాణత్యాగం చేసిన ప్రదేశం ఇప్పటికీ కన్యాదేహ్ అని పిలువబడుతుంది. బిలాష్‌గర్ శిథిలాలు ఇప్పటికీ దట్టమైన అరణ్యం మధ్య ఒంటరిగా దర్శనం ఇస్తున్నాయి.

భంద్ దేవరా (మినీ కజోరహో)[మార్చు]

భంద్ దేవరా (మినీ కజోరహో)

రాంగర్ - భంద్ దేవర ఆలయాలు బరన్ నగరానికి 40 కి.మీ దూరంలో ఉంది. రాంగర్ లోని శివాలయం 10వ శతాబ్దంలో నిర్మించబడిందని విశ్వసిస్తున్నారు. ఇది ఖజూరహోశైలిలో నిర్మించబడింది. ఇక్కడ ఆలయంలోని శిల్పాల ముద్రలను అనుసరించి ఈ ఆలయానికి బంధ్‌దేవర ఆలయం అని పేరు వచ్చింది. ఈ మందిరం ఒక కోనేరు తీరంలో నిర్మించబడింది.ఈ ఆలయం ప్రస్తుతం ఆర్కియాలజీ ఆధ్వర్యంలో ఉంది. ఈ ఆలయం రాజస్థాన్ మినీ కజూరహోగా గుర్తించబడింది.

రాంగర్ మాతాజీ[మార్చు]

రాంగర్ కొండపై రాంగర్ మాతాజీ ఆలయం

రాంగర్ కొండ మీద కిస్నై, అన్నపూర్ణాదేవి సహజసిద్ధమైన గుహాలయాలు ఉన్నాయి. ఈ గుహాలయం చేరడానికి ఝలా జలిం సింగ్ 750 మెట్లు నిర్మించాడు. వీటిలో ఒక దేవతను మేవార్లు ఆరాధిస్తున్నారు. రెండవ దేవతను మాస్ - మదిర వారిచే ఆరాధించబడుతుంది. పరషద్ పూజలో రెండు దేవతల మద్య తెర వేయబడుతుంది. కార్తికపూర్ణిమ నాడు ఈ ఆలయ సమీపంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.

కపిల్‌ధరా[మార్చు]

కపిల్‌ధరా బరన్‌ నగరానికి 50కి.మీ దూరంలో ఉంది. ఇది ప్రకృతి అందాలతో అలరారుతున్న ప్రశాంతప్రదేశంలో ఉంది. ఇది విహారానికి అనువైన ప్రదేశం. ఇక్కడ గోముఖం నుండి నిరంతరంగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది.

కకోనీ[మార్చు]

కకోనీ బరన్ నగరం నుండి 85 కి.మీ దూరంలో చిపాబరోడ్ తాలూకాలో ఉంది. ఇది ముకుంద్రా పర్వతావళిలో మధ్యలో పరవానదీతీరంలో ఉంది. కకీనీ ఆలయాలు 8వ శతాబ్దంలో నిర్మించబడ్డాయని భావిస్తున్నారు. ఇవి వైష్ణవ, శివ, జైనసంప్రదాయాలకు చెందినవి. ఈ ఆలయాల శిథిలాలు 60% కోట, ఖలావర్ జిల్లాలలో భద్రపరచబడి ఉన్నాయి. 1970 నుండి ఈ ప్రదేశం ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో ఉంది.

బ్రహ్మణి మాత ఆలయం[మార్చు]

బ్రహ్మణి మాత ఆలయం బరన్ నగరానికి 20 కి.మీ దూరంలో సొర్సన్ వద్ద ఉంది. ఆలయంలో 400 సంవత్సరాల నుండి అఖండ జ్యోతి నిరంతరంగా వెలుగుతూ ఉంటుంది. రాతి గుహలో సహజ సిద్ధమైన రాతి కింద బ్రహ్మిణీ మాతా శిల్పం ఉంది. శివరాత్రి సమయంలో ఈ ఆలయంలో ఒక ఉత్సవం నిర్వహించబడుతుంది.

భాండ్ దేవ దేవాలయం[మార్చు]

భాండ్ దేవ దేవాలయం (భాండ్ దేవర దేవాలయం) అనేది బరన్ జిల్లా, మంగ్రోల్, రామ్‌ఘర్ గ్రామానికి సమీపంలో ఉంది.

ఉత్సవాలు , పండుగలు[మార్చు]

డోల్ మేళా[మార్చు]

బరన్ నగరంలోని ఝల్ఝుని అకద్షి డోల్ తలాబ్ (సరోవరం) వద్ద డోలా మేళా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించబడుతున్న శోభాయాత్ర. ఈ యాత్రలో 54 దేవ్ విమానం (పవిత్రమైన అలంకృత రథాలు) లలో (వీటిని ప్రస్తుతం డోల్ అంటారు) నగరంలోని ప్రధాన ఆలయాల ఉత్సవమూర్తులు ఉత్సవానికి వస్తారు. ఈ ఉత్సవంలో కొందరు వారి దైవం గురించి వివరిస్తుంటారు. ష్రీజి నుండి ఆరంభమైన ఈ ఉత్సవం డోలాతలాబ్ వద్దకు చేరుతుంది. తరువాత ఇక్కడ దేవ్‌వినాలను పూజించిన తరువాత తిరిగి విమానాలు ఆలయాలకు చేరుకుంటాయి. 15 రోజులపాటు నిర్వహించబడే ఈ ఉత్సవంలో ప్రాంతీయ ప్రజలే కాక రాష్ట్రం మొత్తం నుండి, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రజలు వస్తుంటారు. డోలాఉత్సవానికి ఈ ప్రాంతానికి ఈ ఉత్సవం ఒక చిహ్నంగా ఉంది. రాజస్థాన్ రాష్ట్ర ప్రధాన ఉత్సవాలలో ఇది ప్రధానమైన ఉత్సవంగా గుర్తించబడింది.

పిప్లాడ్ క్రిస్మస్ పండుగ[మార్చు]

బరన్ జిల్లాలోని అత్రూ తాలూకాలోని పిప్లాడ్ గ్రామంలో ఉన్న ఒకేఒక చర్చిలో క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించబడుతుంది. ప్రతిసంవత్సరం డిసెంబరు 25న ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది.

సీతా బరి మేళా[మార్చు]

పవిత్రమైన సితాబరి బరన్ నగరానికి 45 కి.మీ దూరంలో కెల్వారా కస్బా వద్ద ఉంది. జ్యేష్ట ఆమావాస్య నాడు ఇక్కడ పెద్ద గిరిజన ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ప్రాంతంలో పలు కుండాలు ఉన్నాయి. సీతా, లక్ష్మణ్, లవకుశ కుండాలలో భక్తులు పవిత్రస్నానాలు ఆచరిస్తుంటారు. ఈ ఉత్సవానికి ఇక్కడకు లక్షలాది భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంలో సహారియా గిరిజనులు స్వయంబర్ (స్వయంవరం) నిర్వహిస్తారు. ఈ స్వయంవరంలో సహారియా యువతి యువకుని చేతిరుమాలును స్వీకరించడం ద్వారా వివాహానికి తన అంగీకారం తెలుపుతుంది. వధూవరులు బర్నవ చెట్టును 7 మార్లు ప్రదక్షిణం చేసి, పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తరువాత వారి వివాహం అంగీకరించబడుతుంది. ఈ ఉత్సవంలో పశువుల సంత కూడా నిర్వహిస్తారు.ఈ ఉత్సవం గిరిజన జీవనసరళిని గురించి తెలుసుకోవడానికి అవకాశం కలిగిస్తుంది.

ఫుల్డోల్ పండుగ[మార్చు]

రాజస్థాన్ జానపద ఉత్సావాలలో ఇది ఒకటి. హోళీ సందర్భంలో కిషంగంజ్ పట్టణంలో ప్రతిసంవత్సరం నిర్వహించబడుతుంది. 120 సంవత్సరాలుగా ఈ ఉత్సవ సందర్భంలో పట్టణంలోని గృహాలలో తులసీ మాతకు చతుర్భుజనాథునికి వివాహం జరుపుతారు. గృహాలలో వివాహానంతరం వరుడు వధువు గృహానికి హోళీ పండుగ ఉత్సాహంగా జపుకోవడానికి వస్తుంటారు. చతుర్భుజుడు ఆరంభించిన ఈ ఉత్సవం ప్రతిగృహంలో అనుసరించబడుతుంది. హోళి పండుగ సందర్భంలో రాత్రంతా వీధులలో నాటకాలు ప్రదర్శించబడుతుంటాయి. వీధులలో గిధ్- రావణ్ - యుద్ధం, బంద్- బండి - స్వంగ్ మొదలైన ప్రదర్శనలు నిర్వహించబడుతుంటాయి. పట్టణానికి వెలుపల రాత్రి పెద్ద ఎత్తున ఫూల్‌డోలో పేరుతో శోభాయాత్ర నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవానికి సమీపప్రాంతాల నుండి పలువురు ప్రజలు వస్తుంటారు.

బ్రాహ్మణి బాతాజీ మేళా[మార్చు]

ఈ ఉత్సవం బరన్ నగరానికి 20 కి.మీ దూరంలో ఉన్న సొర్సన్‌లోని పురాతన కోట సమీపంలో నిర్వహిస్తారు. ఇది హదోతి భూభాగంలో ఒకేఒక గాడిదల ఉత్సవంగా గుర్తించారు.కోటలో బ్రాహ్మణి మాతాజీ ఆలయం ఉంది. ప్రతిసంవత్సరం మాఘ శుక్ల సప్తమి రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో విక్రయానికి ఇతర జంతువులను కూడా తీసుకువస్తుంటారు. అయినప్పటికీ అధికంగా గాడిదలు మాత్రమే విక్రయాలు జరుగుతాయి.

నదులు[మార్చు]

పార్వతీ నది

కాళి సింధ్[మార్చు]

హదోతి భూభాగంలో ఇది ప్రాముఖ్యత కలిగిన నది. మంగ్రోల్ తాలూకాలో ఈ నది 40 కి.మీ. పొడవున ప్రవహించిన తరువాత పరవన్ నదిలో సంగమిస్తుంది. ఈ నదిలో తరచుగా వరదలు సంభవిస్తుంటాయి. పలయథ వద్ద ఈ నదిమీద పెద్ద వంతెన నిర్మించబడింది. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ వంతెన పొడవైందిగా గుర్తింపు పొందింది.

పార్వతీ నది[మార్చు]

బరన్ జిల్లాలోని ప్రధాన నదులలో పార్వతి నది ఒకటి. ఇది చంబల్ నది ఉపనదులలో ఒకటి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంబా తాలూకా నుండి ప్రవహించి బరన్ జిల్లాలో ప్రవేశిస్తుంది. ఇది చంబ్రా, అత్రు, బరన్, మంగ్రోల్ నుండి కిషంగంజ్ తాలూకాను వేరుచేస్తుంది.

పర్వన్ నది[మార్చు]

పర్వన్ నది కాళిసింధ్ నదికి ఉపనది. హర్నవ్దష్హజి కసబ నుండి ప్రవహిస్తూ ఇది బరన్ జిల్లాలో ప్రవేశిస్తుంది. తరువాత ఇది బరన్, అత్రు, చిపాబరోద్, మగ్రోలిలలో ప్రవహించి కాళిసింధు నదిలో సంగమిస్తుంది.

సరిహద్దులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Census Handbook - Baran" (PDF). Census of India. pp. 10–11, 14. Retrieved 19 January 2015.
  2. "Population". rajasthan.gov.in.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Trinidad and Tobago 1,227,505 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470
  5. 2011 Census of India, Population By Mother Tongue

వెలుపలి లింకులు[మార్చు]