ఆక్రోటిరి, ఢెకెలియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్రోటిరి, ధెకెలియా
(పశ్చిమ, తూర్పు)
సావరిన్ బేస్ ఏరియాలు
Flag of యునైటెడ్ కింగ్‌డమ్ అధినంలో ఉన్న దేశం యునైటెడ్ కింగ్‌డమ్ అధినంలో ఉన్న దేశం యొక్క చిహ్నం
జాతీయగీతం
"గాడ్ సేవ్ ది క్వీన్"
యునైటెడ్ కింగ్‌డమ్ అధినంలో ఉన్న దేశం యొక్క స్థానం
యునైటెడ్ కింగ్‌డమ్ అధినంలో ఉన్న దేశం యొక్క స్థానం
అక్రోటిరి, ధెకెలియా సావరిన్ బేస్ ఏరియాలు గులాబి రంగులో చూపబడ్డాయి.
రాజధానిఎపిస్కోపి కంటోన్మెంట్
అధికార భాషలు ఆంగ్ల భాష, గ్రీక్ భాష
ప్రభుత్వం సావరిన్ బేస్ ఏరియాలు
 -  నిర్వాహకుడు (Administrator) రిచర్డ్ లేసీ

బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం
 -  స్థాపించబడింది 1960 
జనాభా
 -   అంచనా 7,000 సైప్రస్ జాతీయులు, 7,500 బ్రిటిష్ మిలిటరీ వ్యక్తులు, వారి కుటుంబాలు 
కరెన్సీ సైప్రియట్ పౌండ్ (CYP)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ n/a
కాలింగ్ కోడ్ +357

అక్రోటిరి, ధెకెలియా సావరిన్ బేస్ ఏరియాలు (The Sovereign Base Areas of Akrotiri and Dhekelia) సైప్రస్ దీవిలో బ్రిటిష్ వారి నిర్వహణలో (UK administered) ఉన్న భూభాగాలు. ఇవి సావరిన్ బేస్ ఏరియాలు (అనగా స్వాధిపత్యం కలిగిన స్థావర ప్రాంతాలు). యునైటెడ్ కింగ్‌డమ్‌కు ఇవి సీమాంతర భూభాగాలు.

అంతకుముందు బ్రిటిష్ సామ్రాజ్యంలో కాలనీగా ఉన్న సైప్రస్‌కు స్వతంత్ర కామన్‌వెల్త్‌గా అధికారం బదలాయించిన సమయంలో యునైటెడ్ కింగ్‌డమ్ ఈ స్థావరాలను అట్టిపెట్టుకుంది. మధ్యధరా సముద్రంలో సైప్రస్ దీవికి ఉన్న కీలక స్థానం దృష్ట్యా బ్రిటిష్ ప్రభుత్వం ఈ పనిచేసింది. ఈ స్థావరాలలో పశ్చిమాన అక్రోటిరి (ఎపిస్కోపి గారిసన్ దీనిలోనిదే), తూర్పున ధెకెలియా ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన సైప్రస్ 1960 ఒడంబడిక ప్రకారం స్వతంత్ర దేశమైంది. కాని కీలకమైన ఈ స్థావరాలను బ్రిటిష్ ప్రభుత్వం తన అధీనంలో ఉంచుకోదలచింది. బ్రిటిష్ సైన్యానికి ఇవి ముఖ్యమైన వనరులు. మధ్యధరా సముద్రం లోని ఈ స్థావరాలు సూయజ్ కాలువకు, మధ్య ప్రాచ్య దేశాలకు దగ్గరలో ఉన్నాయి.

1974లో టర్కీ దేశం ఉత్తర సైప్రస్‌పై దాడి చేసింది. తద్వారా ఉత్తర సైప్రస్ టర్కిష్ రిపబ్లిక్ ఏర్పడింది. అయితే ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు జోక్యం కలుగజేసుకోలేదు. టర్కీ కూడా వారి జోలికి పోకుండా సైనిక స్థావరాల సమీపంలో యుద్ధం ఆపేశారు. కనుక ఈ స్థావరాల స్థితిలో ఏమీ మార్పు రాలేదు. అందువలన దక్షిణాన ఉన్న 'ఫమగుస్టా' ప్రాంతం గ్రీకు వారి అధీనంలో ఉండిపోయింది. 1974 తరువాత అక్కడ ఎన్నో రమణీయమైన విహార కేంద్రాలు వెలసి పర్యాటకం బాగా అభివృద్ధి చెందింది. అంతకు ముందు అక్కడ ఉన్న చిన్న చిన్న గ్రామాలు పెద్ద విహార స్థలాలుగా రూపొందాయి. అయ్యా నాపా అనేది వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది.

సైప్రస్‌తో వివాదం

[మార్చు]

ఈ స్థావరాలను తమకు తిరిగి అప్పగించమని, పౌర సంబంధమైన అభివృద్ధి కార్యాలకు అవి అవుసరమని సైప్రస్ అప్పుడప్పుడూ కోరడం జరిగింది. 1960నుండి 1964 వరకూ బ్రిటన్ సైప్రస్‌కు ఆర్థిక సహకారం అందిస్తూ వస్తున్నది. 1964 తరువాత ఇది ఆపివేశారు. 1964 తరువాత అన్ని సంవత్సరాలకూ తమకు ఈ దీవుల వినియోగానికి గాను పరిహారం (1 బిలియన్ యూరోల వరకు) చెల్లించాలని ప్రస్తుత సైప్రస్ ప్రభుత్వం వాదిస్తున్నది. ఆక్రోటిరిలో బ్రిటిష్ విమానాల విన్యాసాలు (ఆంగ్ల వికీలో చిత్రం) జూలై 2001లో బ్రిటిష్ సైనికాధికారులు ఎత్తైన రేడియో masts విర్మింప దలచినప్పుడు స్థానిక సైప్రియట్లనుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యింది.

ఏమైనా ఈ స్థావరాలను తిరిగి సైప్రస్‌కు స్వాధీనం చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఏమాత్రం సుముఖత చూపలేదు. అయితే 117 చదరపు హెక్టేరుల వ్యవసాయ భూమిని తిరిగి ఇచ్చేందుకు మాత్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ స్థావరాలలో 3,000 మంది బ్రిటిష్ సైనికులున్నారు. తూర్పు స్థావరంలోని అయియోస్ నికొలౌస్ గూఢచారి వెట్‌వర్క్ ఎకిలన్‌కు సంకేత సేకరణా కేంద్రం అని అంటారు.

రాజ్యాంగం, పాలన

[మార్చు]

సావరిన్ స్థావరాలు (SBAs) 1960లో ఒడంబడిక ప్రకారం బ్రిటన్ స్వాధిపత్య ప్రాంతాలుగా ఉన్నాయి.[1] అంటే ఇవి కాలనీలు కాదు.

1960 ఒడంబడికలో ఈ ప్రాంతాల పాలనకు సంబంధించిన నియమాలు:

  • వీటి వినియోగం మిలిటరీ అవసరాలకు మాత్రమే పరిమితం
  • ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేయరాదు.
  • సావరిన్ స్థావరాలకూ, సైప్రస్ రిపబ్లిక్‌కూ మధ్య కస్టమ్స్ లేదా సరిహద్దు పోస్టులు ఏర్పాటు చేయరాదు.
  • మిలిటరీ అవసరాలకు తప్ప వేరే పరిశ్రమలు స్థాపించరాదు. సైప్రస్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయరాదు.
  • వాణిజ్య, పౌర విమానాశ్రయాలు గాని, నౌకాశ్రయాలు గాని స్థాపించరాదు.
  • తాత్కాలిక అవుసరాలకు మాత్రమే గాని శాశ్వతంగా క్రొత్త జనుల ఆవాసాలు అనుమతించరాదు.
  • ప్రైవేటు ఆస్థులను స్వాధీనపరచుకోరాదు. మిలిటరీ అవసరాలకు కావాలంటే తగిన పరిహారం చెల్లించాలి[2]

ఈ స్థావరాలకు వాటి వ్యాయ వ్యవస్థ ఉంది. వీలయినంత వరకు సైప్రస్ చట్టాలకు అనుగుణంగా ఈ చట్టాలను రూపొందిస్తారు. బ్రిటిష్ సైన్యం స్థావరం - ధెకెలియా (ఆంగ్ల వికీలో చిత్రం)

రాజకీయాలు

[మార్చు]

ఈ సావరిన్ స్థావర ప్రాంతాలు మిలిటరీ అవసరాలకు ఏర్పరచబడినవి గాని వాటిని బ్రిటిష్ ఆధారిత ప్రాంతాలుగా పరిగణించ కూడదు. కనుక ఈ స్థావరాల విర్వహణాధికారులు లండన్‌లోని రక్షణా మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటారు. వారికి నికోషియా (సైప్రస్)లోని విదేశ, కామన్‌వెల్త్ కార్యాలయాలతో అధికారకంగా ఏ విధమైన సంబంధం లేదు. అయితే వ్యావహారికమైన సంబంధాలు ఉంటుంటాయి[3]

స్థావరాలకు ఒక నిర్వహణాధికారి (Administrator of the Sovereign Base Areas) ఉంటాడు. అతనే సైప్రస్ బ్రిటిష్ సేనల కమాండర్. (2006 నుండి ఎయిర్ మార్షల్ లేసీ). ఇతనిని, ఇతర పాలక వర్గాన్ని రక్షణ మంత్రిత్వం సలహాపై బ్రిఒటిష్ పాలకులు నియమిస్తారు. తోడుగా ఇతర అధికారులుంటారు. స్థావరాలలో ఎన్నికలు జరుగవు. అయితే బ్రిటిష్ పౌరులు యు.కె. ఎన్నికలలో వోటు వేయవచ్చును.

భౌగోళికం

[మార్చు]
ఆక్రోటిరి (పశ్చిమ) SBA
ధెకెలియా (తూర్పు) SBA

ఆక్రోటిరి వైశాల్యం 47.5 చదరపు మైళ్ళు. ధెకెలియా 50.5 చదరపు మైళ్ళు. మొత్తం 98 చ.మై. సైప్రస్‌ భూభాగంలో ఇది 3%. ఇందులో 40% సేనల ఆధీనంలోనూ, నిగిలిన 60% (బ్రిటిష్, లేదా సైప్రస్) ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోనూ ఉంది.

అక్రోటిరి ప్రాంతం సైప్రస్ దీవికి దక్షిణాన లిమాస్సోల్ పట్టణం వద్ద ఉంది. దెఖెలియా ప్రాంతం ఆగ్నేయంలో లర్నకా వద్ద ఉంది.

జన విస్తరణ

[మార్చు]

వీలయినంత వరకు జనావాసాలకు దూరంగా ఈ స్థావరాలను ఏర్పరచారు. అయినా ప్రస్తుతం ఈ ప్రాంతాలలో 14,000 మంది నివసిస్తున్నాఆరు. వీరిలో 7,000 మంది స్థానిక సైప్రియట్లు స్థావరాలలో గాని, పొలాలలో గాని పనిచేస్తారు. మిగిలినవాఱి బ్రిటిష్ మిలిటరీలో పని చేసేవారు, వారి కుటుంబాలు.

ఈ స్థావరాలలో పౌరసత్వం అనే విధానం లేదు. కొందరు బ్రిటిష్ సీమాంతర పౌరసత్వానికి అర్హులు కావచ్చును. కాని ఇక్కడ సైనికేతర పాలన నిషిద్ధం కనుక బ్రిటిష్ సీమాంతర చట్టం ఇక్కడికి వర్తించదు.

ఆర్ధిక వ్యవస్థ

[మార్చు]

ప్రధానంగా మిలిటరీ కార్య కలాపాలు, కొద్దిపాటి వ్యవసాయం ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు. ఈ ప్రాంతానికి ఆర్థిక గణాంకాలు లెక్కింపబడలేదు. 2008లో తక్కిన సైప్రస్‌తో బాటు ఆక్రోటిరి, ధెకెలియాలో కూడా యూరో కరెన్సీ సాధారణ వినియోగంలోకి వస్తుంది..

మూలాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

Wikimedia Atlas of Akrotiri and Dhekelia


మూస:British dependencies మూస:Dependent and other territories of Europe అక్షాంశరేఖాంశాలు: 34°35′N 32°59′E / 34.583°N 32.983°E / 34.583; 32.983