Jump to content

కోనసీమ

వికీపీడియా నుండి
(కోన సీమ నుండి దారిమార్పు చెందింది)
1.కోనసీమ ముఖ ద్వారం, 2.అమలాపురం గడియార స్తంభం,3.శుభ కలశం

కోనసీమ, ఇది తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి పాయలు, బంగాళాఖాతం మధ్య వున్న ద్వీపాల సమూహం. కోనసీమ ప్రకృతి రమణీయకతకు ప్రసిద్ధి చెందింది.

భౌగోళికం

[మార్చు]
పటం
కోనసీమ
గౌతమీనది దృశ్యము.అప్పనపల్లివద్ద
రావులపాలెం లో కోనసీమ ముఖద్వారం

గోదావరి డెల్టా చుట్టూ గోదావరి పాయలైన వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి, గౌతమి, నీలరేవు వున్నాయి. రాజమండ్రి నగరాన్ని దాటిన తరువాత గోదావరి వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి పాయలుగా చీలుతుంది. వృద్ధ గోదావరి గౌతమి, నీలరేవుగా, వశిష్ట గోదావరి వశిష్ట, వైనతేయగా చీలుతుంది. ఈ పాయలు బంగాళాఖాతం తీరంలో 170 కి.మీ పొడవైన పరివాహక ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. దీనినే కోనసీమ ప్రాంతం అంటారు..[1]

కోనసీమలో అమలాపురం అతి పెద్ద పట్టణం. దీని తరువాత స్థాయిలో రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం వున్నాయి.

కొబ్బరి చెట్లతో ఉన్న పొలాలు

చరిత్ర

[మార్చు]

కోనసీమ పదం మూల (కోన), ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. 1996 సంవత్సరంలో కోనసీమలో తుఫాను వచ్చి పెను నస్టాన్ని కలిగించింది.[2]

సంస్కృతి

[మార్చు]

ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సంప్రదాయాలు చూడవచ్చు. అతిథి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు.

వ్యవసాయం

[మార్చు]
కోనసీమ
అమలాపురంలో కొబ్బరి చెట్లు

కోరమాండల్ తీరంలో ఆత్యంత సారవంతమైన ప్రదేశం. కోనసీమలో పండించని పంట కానరాదు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి బొప్పాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.

వ్యవసాయ ఎగుమతులు

కొబ్బరి, పీచు, కూరగాయలు, పూలు, పండ్లు, కోడి గుడ్లు.

పరిశ్రమలు

[మార్చు]

కోళ్ళ పారమ్స్, కొబ్బరి ఉత్పత్తులు, చేతి బొమ్మల తయారీ.

పల్లె ప్రజల మాండలికం

[మార్చు]
  • రేవు - తీరం.
  • గోదారి - గోదావరి నది
  • లంక - దీవి
  • డిబ్బ/తిప్ప - నది పరీవాహకం వల్ల లంకలో ఏర్పడిన చిన్న మైదానం
  • మేట - పెద్ద డిబ్బ లేదా తిప్పని మేట అని పిలుస్తారు
  • పేట/పాలెం - పల్లె/పట్టణం.
  • కోత - గోదారి తాకిడి లేదా వరదకి నేల (మైదాన ప్రాంతం) అరిగి పోవడం
మాండలికపు ఒక సంభాషణ.

నేను ముందే సెప్పేను (చెప్పాను). సంతకెళ్ళి సేపలట్రమ్మంటే (చేపలు) సింతసిగురట్టుకొచ్చి పులుసెట్టమన్నాడు. కాలవాతల (కాలువ అవతల) పుంతలో పాములున్నయంట. అటేపు ఎల్లొద్దంటే అటేపేఎల్తానంటాడు. తేన్లో నిమ్మరసం పిండి పొద్దేల పరగడుపునే ఏణ్ణీళ్ళతో తాగితే మంచిదంట. ఆడ్ని గోకితే ఊరుకుంటాడా మద్దిలోకెల్లిన ఆడ్ని నిన్ను ఇద్దర్నీ ఇరగతన్నేడు. కొత్తపెల్లికొడుకు పొద్దెరగడు.

ప్రధాన నగరాలు

[మార్చు]

కోనసీమలో ఉన్న ప్రధాన ప్రదేశాలు

రవాణా

[మార్చు]

హైదరాబాద్ నుండి కోనసీమలోని ప్రతి నగరానికీ హైటెక్ బస్సు సర్వీసులు ఉన్నాయి. రాజమహేంద్రవరం కోనసీమకు ప్రక్కనే ఉన్న పెద్ద నగరం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం మధ్య ఉన్న చించినాడ వంతెన మీదుగా రాజోలు పట్టాణానికి ప్రవేశించవచ్చు.

ఆలయాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Konaseema: Hidden Land of the Godavari (in ఇంగ్లీష్). Partridge Publishing India. 2014. ISBN 9781482835687. {{cite book}}: Cite uses deprecated parameter |authors= (help)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-01-24. Retrieved 2007-08-14.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కోనసీమ&oldid=4297024" నుండి వెలికితీశారు