Jump to content

కాజీపేట రైల్వే స్టేషను

(ఖాజీపేట రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
కాజీపేట
కాజీపేట రైల్వేస్టేషనులో ముఖద్వారం
General information
Locationమెయిన్ రోడ్డు, కాజీపేట
భారత దేశము
Coordinates17°58′26″N 79°30′40″E / 17.974°N 79.511°E / 17.974; 79.511
Elevation292 metres (958 ft)
Systemభారతీయ రైల్వే జంక్షన్ స్టేషను
Owned byభారతీయ రైల్వే
Operated byదక్షిణ మధ్య రైల్వే
Linesనాగపూర్-హైదరాబాద్ రైలు మార్గము (కాజీపేట-హైదరాబాద్ రైలు మార్గము)
కాజీపేట-విజయవాడ రైలు మార్గము
కాజీపేట-నాగపూర్ రైలు మార్గము
Platforms3
Construction
Structure typeభూమి మీద ప్రామాణికం
Parkingఉంది
Bicycle facilitiesలేదు
Other information
Statusపనిచేస్తున్నది
Station codeKZJ
డివిజన్లు సికింద్రాబాదు
History
Opened1874 , 1889 మధ్య
Location
పటం

కాజీపేట రైల్వే స్టేషను తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణ జిల్లా యందలి కాజీపేటలోగల రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనిది.

చరిత్ర

[మార్చు]

1929 లో కాజీపేట-బల్లార్షా లింకు పూర్తయిన తరువాత చెన్నై కూడా నేరుగా ఢిల్లీతో కలుపబడింది.[1]

వాడి-సికింద్రాబాదు లైను 1874 లో నిర్మించబడింది. ఈ లైను నిజాం ద్వారా ఆర్థిక సహాయం చేయబడింది. ఆ తర్వాత ఇది నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేలో ఒక భాగమైనది. 1889 లో ప్రధాన నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లైన్ విజయవాడ (అప్పటికి బెజవాడ అనేవారు) వరకు పొడిగించబడింది.[2]

1909 లో "గ్రేట్ ఇండియా పెనిష్యులా రైల్వేలోని వాడి నుండి, నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే తూర్పున వరంగల్ వరకు, తరువాత బెజవాడ వరకు కలుపబడింది".[3]

విద్యుదీకరణ

[మార్చు]

డోర్నకల్-ఖాజీపేట సెక్టరు 1988-89 ప్రాంతంలో విద్యుదీకరణ చేయబడింది. ఖాజీపేట-రామగుండం సెక్టర్ 1987-88 లోనూ, ఖాజీపేట-సికింద్రాబాదు సెక్టరు 1991-93 లోనూ విద్యుదీకరింపబడింది.[4]

సదుపాయాలు

[మార్చు]

ఖాజీ పేట రైల్వే స్టేషను రిజర్వేషను సౌకర్యం కంప్యూటరీకరింపబడింది. రిజర్వేషను కౌంటర్లు, రిటైరింగ్ గది, విశ్రాంతి గది, శాకాహార, మాంసాహార భోజన వసతి, పుస్తక దుకాణాలు ఉన్నాయి.[5]

ఆర్థిక లాభం

[మార్చు]

సింగరేణి, కోతగూడెం, బెల్లంపల్లి, బల్హర్షా గనుల నుండి బొగ్గు రవాణా, సరుకు రవాణాలో 40 శాతం పనులు వరకు కాజీపేట-బల్హర్షా విభాగంలో రైల్వేలు నిర్వహించ బడతాయి.[6]

లోకో షెడ్లు

[మార్చు]

కాజీపేటలో డబ్ల్యుడిఎం-2, డబ్ల్యుడిఎం-3ఎ, డబ్ల్యుడిజి-4 లోకోల కొరకు డీజిల్ లోకో షెడ్స్ ఉన్నాయి. 2006 లో ప్రారంభించబడిన కాజిపేట్ ఎలెక్ట్రిక్ లోకో షెడ్ లో 150 కి పైగా డబ్ల్యుఎజి-7 ఎలక్ట్రికల్ లోకోలను నిలుపుదల చేయగల సామర్ధ్యం కలిగి ఉంది. కాజీపేట వద్ద ఒక కోచింగ్ నిర్వహణ డిపో ఉంది.[7]

మూలాలు

[మార్చు]
  1. "IR History: Early Days – III". Chronology of railways in India, Part 3 (1900-1947). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 November 2013.
  2. "[IRFCA] Indian Railways FAQ: IR History: Early Days - 2". www.irfca.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-05.
  3. "Hyderabad - Imperial Gazetteer of India". IRFCA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 November 2013.
  4. "History of Electrification". IRFCA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 November 2013.
  5. "Kazipet to Visakhapatnam trains". Make My Trip. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 November 2013.
  6. Economic History of Hyderabad State: Warangal Suba, 1911-1950, by V.Ramakrishna Reddy, p. 582<
  7. "Sheds and Workshops". IRFCA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 November 2013.

ఇతర లింకులు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే