ఝాలవరాళి రాగము
(ఝాలవరాళి నుండి దారిమార్పు చెందింది)
ఝాలవరాళి రాగము కర్ణాటక సంగీతంలో 39వ మేళకర్త రాగము.[1][2]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- (S R1 G1 M2 P D1 N3 S)
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- (S N3 D1 P M2 G1 R1 S)
ఈ రాగంలోని స్వరాలు : శుద్ధ ఋషభము, శుద్ధ గాంధారము, ప్రతి మధ్యమము, శుద్ధ ధైవతము, కాకళి నిషాధము. ఇదొక ఆరోహణ, అవరోహణ లలో సప్తస్వరాలు కలిగిన సంపూర్ణ రాగము. ఇది 3 వ మేళకర్త రాగమైన గానమూర్తి కి సమానమైన ప్రతి మధ్యమ రాగము.
ఉదాహరణలు
[మార్చు]- s:అంతా రామమయం బీ జగమంతా రామమయం - రామదాసు కీర్తన.
- s:అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి - రామదాసు కీర్తన.
- ఏడనున్నాడో నాపాలిరాము - రామదాసు కీర్తన.
- అడుగుదాటి కదల నియ్యను - రామదాసు కీర్తన.
- అనాధ రక్షక - త్యాగరాజు కీర్తన.
ఝాలవరాళి జన్యరాగాలు
[మార్చు]ఈ రాగం యొక్క ముఖ్యమైన జన్య రాగము వరాళి రాగము. ఇది ఘన పంచక రాగాలలో ఆఖరుది. రాగ విస్తారానికి బాగా అనుకూలమైన రాగం. కరుణరస ప్రధాన రాగం. ఈ రాగం లోని మధ్యమం మామూలు ప్రతిమధ్యమం కన్న కొంచెం ఎక్కువగా పలుకుతారు. అందుకే ఈ స్వరాన్ని “వరాళి మధ్యమం” అని పిలుస్తారు.