తడ ఖండ్రిగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తడ ఖండ్రిగ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం తడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,123
 - పురుషులు 3,066
 - స్త్రీలు 3,057
 - గృహాల సంఖ్య 1,616
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

తడ ఖండ్రిగ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ మండలానికి చెందిన గ్రామం.[1].

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

తడకండ్రిగ గ్రామదేవత పోలేరమ్మకు 2014, జూన్-11, బుధవారంనాడు, ఘనంగా అంబళ్ళుపోసినారు. మంగళవారం సాయంత్రం నుండియే వీధులలో వేపాకు తోరణాలు కట్టి, విద్యుద్దీపాల ఆర్చీలతో జాతరను తలపించేలా ఏర్పాట్లు చేసారు. ఉదయం అమ్మణ్ణికి సర్వాభిషేకాల అనంతరం, ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. తప్పెట్లు వెంటరాగా, బాణాసంచా వేడుకల మధ్య, స్త్రీల సంఖ్య అంబళ్ళను ఊరేగింపుగా తెసుకొనివచ్చి, అమ్మణ్ణికి నైవేద్యం సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పొంగలి సామాగ్రితో స్త్రీల సంఖ్య ఊరేగింపుగా తరలి వెళ్ళి, చెల్లాతమ్మకు పొంగళ్ళు పెట్టి పూజలు చేసారు. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ పంచాయితీ పరిధిలోని బోడిలింగాలపాడు గ్రామంలోని మర్రి చెట్టుని ఆశ్రయించుకొని ఏటా నారాయణ పక్షులూ, నీటికాకులూ విడిది చేస్తుంటాయి. వర్షాలు ఆరంభం కాగానే ఇవి భారీ సంఖ్యలో వచ్చి, చుట్టుపక్కలనుంచి పుల్లలు సేకరించి చెట్టుమీద గూళ్ళు కట్టుకొని ఇక్కడ కొంతకాలం నివసించుతవి. ఇవి చూపరులను బాగా ఆకట్టుకొంటవి. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 6,123 - పురుషుల సంఖ్య 3,066 - స్త్రీల సంఖ్య 3,057 - గృహాల సంఖ్య 1,616

  • విస్తీర్ణం 688 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు

మూలాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

  • పశ్చిమాన వరదయ్యపాలెం మండలం
  • ఉత్తరాన సూళ్లూరుపేట మండలం
  • దక్షణాన సత్యవేడు మండలం
  • దక్షణాన గుమ్మిడిపూండి మండలం

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు ఆగస్టు-20, 2013. పేజీ-3. [2] ఈనాడు నెల్లూరు; 2014, జూన్-12; 11వ పేజీ.  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.