బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం
Appearance
(బాపట్ల లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
బాపట్ల లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1977 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 15°54′0″N 80°30′0″E |
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్ళగా ఈ నియోజకవర్గానికి ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుండి సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం కలుపబడింది.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]- వేమూరు శాసనసభ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- రేపల్లె శాసనసభ నియోజకవర్గం
- బాపట్ల శాసనసభ నియోజకవర్గం
- పరుచూరు శాసనసభ నియోజకవర్గం
- అద్దంకి శాసనసభ నియోజకవర్గం
- చీరాల శాసనసభ నియోజకవర్గం
- సంతనూతల శాసనసభ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
నియోజకవర్గపు గణాంకాలు
[మార్చు]- 2001 లెక్కల ప్రకారము జనాభా: 17,64,955.
- ఓటర్ల సంఖ్య: 12,63,207.
- ఎస్సీ, ఎస్టీల శాతం: 22.19%, 4.16%
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన లోక్‌సభ సభ్యులు
2004 ఎన్నికలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | దగ్గుపాటి పురందరేశ్వరి | 411,009 | 55.88 | +12.96 | |
తెలుగుదేశం పార్టీ | డి.రామానాయుడు | 317,017 | 43.10 | -12.73 | |
తెలంగాణా రాష్ట్ర సమితి | చెల్లమల్ల వెంకటరెడ్డి | 3,753 | 0.51 | ||
Independent | ప్రతిపాటి శ్రీనివాసు | 2,159 | 0.29 | ||
Independent | ఇంగంటి అప్పారావు | 1,434 | 0.19 | ||
మెజారిటీ | 93,992 | 12.78 | +25.69 | ||
మొత్తం పోలైన ఓట్లు | 735,462 | 77.53 | +10.06 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +12.96 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బత్తుల రోశయ్య పోటీచేసారు.[2] కాంగ్రెస్ పార్టీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేసింది.[3]
ఎన్నికల ఫలితాలు
[మార్చు]సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 33 బాపట్ల (SC) పనబాక లక్ష్మి స్త్రీ భారత జాతీయ కాంగ్రెస్ 460757 మల్యాద్రి శ్రీరాం పు తె.దే.పా 391419
2014 ఎన్నికలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | మాల్యాద్రి శ్రీరాం | 578,145 | 48.80 | +11.29 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వరికుటి అమృతపాణి | 545,391 | 46.04 | N/A | |
భారత జాతీయ కాంగ్రెస్ | పనబాక లక్ష్మీ | 23,072 | 1.95 | -42.20 | |
Pyramid Party of India | యల్లమటి రమేష్ | 8,414 | 0.71 | N/A | |
BSP | ద్వారపల్లి ఫిలిపు | 8,113 | 0.68 | N/A | |
AAP | ఏడా చెన్నయ్య | 3,948 | 0.33 | N/A | |
JSP | ఆర్.డి విల్సన్ | 3,657 | 0.31 | N/A | |
NOTA | None of the Above | 6,146 | 0.52 | N/A | |
మెజారిటీ | 32,754 | 2.76 | -3.88 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,184,634 | 85.04 | +6.08 | ||
తెదేపా gain from INC | Swing |
నియోజకవర్గపు ప్రముఖులు
[మార్చు]- నేదురుమల్లి జనార్ధనరెడ్డి
- డిసెంబర్ 17, 1990 నుండి అక్టోబర్ 9, 1992 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేదురుమల్లి జనార్థన్ రెడ్డి 1998లో ఒకసారి ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. 1935లో జన్మించిన ఇతడు 1990లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిగా పేరొందాడు. ఇతడి భార్య రాజ్యలక్ష్మి ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతోంది.
- దగ్గుబాటి పురంధరేశ్వరి
- ఎన్టీ రామారావు కుమారై అయిన ఈమె 14వ లోక్‌సభకు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. ఈమె ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మానవవనరుల శాఖా సహాయమంత్రిణిగా కొనసాగుతోంది. 1991లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఈమె భార్య.
- దగ్గుబాటి రామానాయుడు
- సినీ నిర్మాత అయిన దగ్గుబాటి రామానాయుడు 1999లో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టాడు. శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bapatla". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ సూర్య దినపత్రిక, తేది 18-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009