వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాబితాలో పుస్తకం గురించి కాలమ్ వివరాలు[మార్చు]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితాల్లో పుస్తకం గురించి అనే కాలమ్ పుస్తకం డిస్క్రిప్షన్‌కు చెందింది. నేను దీన్ని రాయడంలో కొన్ని ప్రమాణాలు అనుభవపూర్వకంగా అభివృద్ధి చేసుకున్నాను. ప్రాజెక్టులో పనిచేస్తున్న రాజశేఖర్ గారు, లక్ష్మీదేవి గారు, గాయత్రి గార్లకు, ఇతర సహ వికీమిత్రులకు తెలిసేందుకు ఇక్కడ పంచుకుంటున్నాను.

 • నేను ఇప్పటివరకూ చేసినవాటిలో ఎక్కువ భాగం కాల్పనికేతర సాహిత్యమే(non-fiction) ఉంది-చారిత్రిక నవలలు తప్ప. కనుక నేను పుస్తకం గురించి వ్రాసేప్పుడు ఆ పుస్తకం యొక్క ముఖ్యాంశాన్ని గురించి నాకు అవగాహన ఉన్న విషయమో, లేక వికీలో దొరికే సమాచారమో స్వీకరించి కొన్ని లైన్లు రాస్తున్నాను. తద్వారా కాటలాగు వినియోగించుకునే వ్యక్తికి పుస్తకం ఎవరి/ఏ విషయం గురించి ఉందో దాన్ని గురించి కొంత సమాచారం ముందుగా తెలియడంతో ఎంపిక సులువవుతుంది. ఐతే ఆ సమాచారంలో అభిప్రాయాల కన్నా నిజాలు, ఆసక్తికరమైన విషయాల కన్నా ప్రాధాన్యత కల విశేషాలపైనే ఎక్కువ మొగ్గుచూపాల్సి ఉంటుంది.
ఉదాహరణ: భారతదేశ స్వాతంత్ర చరిత్రలో సుభాష్ చంద్రబోస్‌కు, ఆయన నడిపిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాను సేనలతో కలసి ఐఎన్‌సి సైన్యం బర్మా మీదుగా భారతదేశాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేసి అస్సాం వద్ద యుద్ధం చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రపక్షాలు విజయం సాధించడం జపాను కోలుకోలేని విధంగా హిరోషిమా, నాగసాకీలపై తొలి ఆటంబాంబులు పడడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఈ చారిత్రిక పరిణామాలన్నిటిలోనూ కీలకమైనది సుభాష్ చంద్రబోసు బ్రిటీష్ వారు కలకత్తాలో ఆయనను ఉంచిన గృహనిర్బంధంలో నుంచి తప్పించుకుని ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ నగరం మీదుగా బెర్లిన్(జర్మనీ)కి చేరుకోవడం. ఆ సాహసవంతమైన అజ్ఞాతయాత్రలో కాబూల్ నగరంలో బోసుకు ఆతిథ్యమిచ్చి రక్షణకల్పించినది ఈ గ్రంథకర్త ఉత్తమ్‌చందే!
 • పుస్తకంలోని విషయం గురించి వ్రాశాకా పుస్తకం గురించిన క్లుప్తమైన వివరాలు ఇస్తూ పూర్తిచేస్తే బావుంటుంది. అంటే పుస్తకం ఎవరు వ్రాశారు,రాసిన వారి ప్రాధాన్యత, ఒకవేళ తెలిసి ఉంటే ఆ పుస్తకం విలువ/ప్రామాణికత వంటివి వివరిస్తూ ముగించవచ్చు. ఒకవేళ పుస్తకానికి కొన్ని పరిమితులు ఉండే అవకాశం ఉంటే దాన్ని కూడా ప్రస్తావించాలి. కొన్ని పుస్తకాలు జాతీయ జీవిత గ్రంథమాల, భారతీయ సాహిత్య నిర్మాతలు వంటి ప్రత్యేకమైన సీరీస్‌లలో భాగంగా వ్రాసినవి వుంటాయి. ఆ సీరీస్ లక్ష్యం, విలువ తెలిసిన పాఠకులు దాన్ని మరింతగా అర్థంచేసుకునేందుకు పనికివస్తుంది. కొన్ని సీరీస్‌లు బాగా ప్రామాణికం కావడంతో సహ వికీపీడియన్లకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
ఉదాహరణలు: పరిమితులు, విమర్శలు ఇలా వ్రాయవచ్చు-ఆంధ్ర కవుల చరిత్రము అన్న పుస్తకానికి నేను వ్రాసిన డిస్క్రిప్షన్‌లో తుదిలైన్లు ఇవి: ఐతే వీరేశలింగం ఆనాటి విక్టోరియన్ విలువలకు ప్రభావితులు కావడంతో సాహిత్యాన్ని ఆలంకారిక ప్రమాణాలతో కాక నీతి అనే ప్రమాణంతో చూశారని, పైగా దక్షిణాంధ్ర యుగానికి చెందిన ముద్దు పళని వంటి కవయిత్రులను గురించి అవమానకరంగా వ్రాశారని వివాదాలు చెలరేగాయి. చాలా వివరాలు సప్రమాణికంగా కాదంటూ అనంతరకాలంలోని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు.
సీరీస్‌ల గురించిన వివరాలు ఇలా ఇవ్వవచ్చు-పటేల్ జీవిత చరిత్రను ఈ గ్రంథం ద్వారా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు జాతీయ జీవిత చరిత్ర గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు
ప్రామాణికత గురించి-భారతదేశంలోని స్వాతంత్ర సమరంపై వచ్చిన సప్రామాణిక గ్రంథాలలో ఇది ఒకటి. ఈనాటికీ సివిల్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల వరకూ ఈ గ్రంథాన్ని విద్యార్థులు ప్రామాణికంగా స్వీకరించి చదువుతూంటారు. దేశం స్వాతంత్రమైన కొత్తల్లో దేశ చరిత్రలు వలసవాదుల కోణం నుంచి వ్రాసినవి కాక ఆనాటి దేశ ప్రభుత్వాల దృక్పథం నుంచి వ్రాయాల్సి రావడంతో వ్యవస్థీకృతంగా చరిత్ర రచన చేయించారు. వాటిని ప్రాథమికోన్నత పాఠ్యపుస్తకాల నుంచి భారత సివిల్ సర్వీసుల వరకూ అన్నిటా ప్రామాణిక చరిత్రగా బోధించారు.

నా సహాయం[మార్చు]

నేను కొంతకాలంగా పుస్తకాల ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించాను. ఈ ప్రాజెక్టు మరియు ఆ ప్రాజెక్టులను అనుసంధించి మంచి పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తేవచ్చని నా అభిప్రాయం. నేను DLI వెబ్ సైట్ లోని పుస్తకాలను తెరవడానికి చాలా కాలం కష్టపడ్డాను. చివరకు నాకది సాధ్యం అయ్యింది. ఈ ప్రాజెక్టులో నేను సభ్యునిగా చేరాను. నేను పుస్తక పేజీని తెరిచి పుస్తకం టైటిల్, రచయిత, వర్గం, కోడ్ సంఖ్య మరియు సంవత్సరం జాబితాలో చేర్చగలను. సమీక్షలు చేయడానికి నాకు సమయం చిక్కడం లేదు. అందువలన పవన్ గారి మరెవరైనా ఈ బాధ్యతను చేపడతారని కోరుతున్నారు. ఈ జాబితా నుండి కొన్ని పుస్తకాలకు లేదా రచయితలకు సంబంధించిన వ్యాసాలను కూడా ప్రారంభిస్తున్నాను. ఈ పుస్తకాలలో కొన్నిటిని వికీసోర్స్ లో చేర్చడానికి ప్రయత్నిస్తున్నాను. సభ్యులు అందులొ కూడా లిప్యంతరీకరణలో చురుకుగా పాల్గొని అందులోని సమాచారంతో కొన్ని వ్యాసాలను వికీపీడియాలో తయారుచేయవచ్చును. ధన్యవాదాలు. పవన్ కు నా శుభాకాంక్షలు.Rajasekhar1961 (చర్చ) 05:55, 15 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ ఈ ప్రాజెక్టులో కృషిచేస్తున్నందుకు కృతజ్ఞతలు. వికీమీడియా ఉద్యమానికి మీ విలువైన భాగస్వామ్యం నేను గమనిస్తూన్నాను. భవిష్యత్ కార్యకలాపాలకు శుభాకాంక్షలు. ఈ ప్రాజెక్టు విషయానికి, మరీ ముఖ్యంగా జాబితా విషయానికి వస్తే, మీరు చేయగలిగిన పుస్తకాలకు టైటిల్, వర్గం, రచయిత, కోడ్, ప్రచురణ తేదీ వంటి వివరాలు చేర్చండి. ఆ పుస్తకాన్ని తెరిచి వివరాలు, చిరు సమీక్షలు చేసే పని నేను చేస్తాను. ఇక మీరు ఆయా పుస్తకాల వ్యాసాలు, గ్రంథకర్తల వ్యాసాలు ప్రారంభించి అభివృద్ధి చేయడం చూస్తున్నాను. ధన్యవాదాలు. వీలుంటే ఇప్పటికే ఆ అంశంపై ఉన్న వ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఇక వికీసోర్సులో కూడా మీరు లేయర్స్‌గా చేస్తున్న కృషికి అభినందనలు. --పవన్ సంతోష్ (చర్చ) 14:31, 16 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ భాషలలో ఆధునిక సాహిత్య ప్రవేశం[మార్చు]

ముందుగా మీకు అభినందనలు పవన్ సంతోష్ గారు. 19 శతాబ్ధం సగభాగం వరకు అంతా గ్రాంధికంలోనే రచనలు సాగాయి. మరి వచన రూపంలో రచనలు ఏలా, ఎపుడు ప్రారంభమయ్యాయో తెలుసుకునేందుకు సంబంధిత పుస్తకాల గురించి తెలుపగలరు. ధన్యవాదాలు...Pranayraj1985 (చర్చ) 16:40, 15 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్‌రాజ్ గారూ మీరు వ్యవహారిక భాషోద్యమానికి సంబంధించి గిడుగు రామమూర్తి గారి రచనలు చదివితే బావుంటుంది. ఆ క్రమంలో భారతీయ సాహిత్య నిర్మాతలు సీరీస్‌లో ఆయనపై వచ్చిన పుస్తకం వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - గలోనే ఉంది. ఆ పుస్తకంలో కొంతవరకూ ఆయన కృషి గురించి ఉన్న క్రమంలోనే మీరడిగిన వివరాలు దొరుకుతాయి. గిడుగు తన భాషోద్యమంలో లక్ష్యంగా చూపడాన్ని ఆధారం చేసుకుని తొలినాటి వ్యవహారిక భాషా గ్రంథాల్లో కాశీయాత్రా చరిత్ర ఒకటి అని నేను భావిస్తున్నాను. మీరు ఆ గ్రంథాన్ని చదివి చూడదలుచుకుంటే వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - కలో దొరుకుతోంది. వికీకి బయట ఈమాటలో వ్యవహారిక భాషోద్యమ చరిత్ర పేరిట ఎక్కడెక్కడో ఉన్న వ్యాసాలు గ్రంథాలు ఒకటి చేసి ప్రచురించారు. ఇది కాక వేరేదైనా కావాల్సివస్తే అడగండి. ఈ ఆకరాల నుంచి మీకు ఉపయోగపడే సమాచారం వాడుకుంటూనే వీలున్నంతలో వ్యవహారిక భాష గురించిన తెవికీ వ్యాసాలు అభివృద్ధి చేస్తే బావుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 14:25, 16 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంధ్ర నాటక పితామహునిగా పేరొందిన ధర్మవరం కృష్ణమాచార్యుల సాహిత్యాన్ని గురించిన విమర్శ గ్రంథం(దివాకర్ల వేంకటావధాని రచన) ఇక్కడ దొరుకుతోంది ప్రణయ్ గారూ ఓమారు పరిశీలించి అవసరమైతే ఉపయోగించుకోండి. ప్రాజెక్టు పనిలో భాగంగా ఇటువంటివి దొరికినప్పుడల్లా ఇక్కడ పెడతాను చూస్తూండండి.--పవన్ సంతోష్ (చర్చ) 11:19, 27 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సహకారానికి ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు. Pranayraj1985 (చర్చ) 17:32, 27 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పేజీలుగా అభివృద్ధి చేయాలా? విషయపు పేజీలుగానా?[మార్చు]

తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ఈ ప్రాజెక్టు ద్వారా 50కి పైగా జాబితా పేజీలు తయారవుతాయి. ప్రతీ పేజీ పేరులో మొదట డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా అని వుండి "-" తర్వాత సంబంధిత తొలి అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకు:వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - క. ఆ పేజీలో పుస్తకం పేరు-లింకు, రచయిత పేరు, విభాగం, చిరు సమీక్ష, డీఎల్‌ఐ కోడ్, సంవత్సరం అన్న కాలమ్స్‌తో పుస్తకాలను జాబితా వేస్తున్నాము. ఐతే వీటిని ప్రాజెక్టుకు ఉప పేజీలుగా చేయాలని రహ్మానుద్దీన్ గారు అనుకోకుండా వేరే చర్చలో సూచించారు. దానికి ఆయన ఇచ్చిన కారణం ఇవి కంటెంట్ పేజీలుగా ఉండేందుకు అర్హమైనవి కాదు. ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తున్నాం కనుక ప్రాజెక్టు పేజీగా ఉండాలని. ఐతే ప్రాజెక్టులో కృషిచేస్తున్న సభ్యులు ఈ పరిణామానికి ముందుగా దీన్ని కంటెంట్ పేజీలుగా చేయకపోతే తెవికీలో వెతికినప్పుడు కంటెంట్ పేజీలతో ఈ పేజీల్లోని సమాచారం కనిపించదని, వికీని వాడుకునేవారిలో చాలామంది ప్రతిఒక్కటీ అన్న ఆప్షన్ పేట్టి వెతకరనీ చెప్పడంతో కంటెంట్ పేజీలుగా అభివృద్ధి చేసాను. ముఖ్యంగా ప్రాజెక్టు మౌలిక లక్ష్యాల్లో ఒకటైన అందుబాటులోకి(accessibility} నెరవేరని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాము. ఐతే రెహమాన్ గారి అభ్యంతరాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో ఇప్పటికే పనిచేస్తున్న రాజశేఖర్ గారు, లక్ష్మీదేవి గారు, మీనా గాయత్రి గారు, ప్రాజెక్టుపై ఆసక్తిగా వ్యాఖ్యానిస్తున్న ప్రణయ్‌రాజ్ గారూ, ఇతర సహ వికీపీడియన్లు దీనిపై చర్చించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 13:07, 17 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇవి విషయపు పేజీలుగా ఉండదగ్గవేనన్నది. ఈ పేజీలన్నిటికీ మూలంగా ఉన్న పేజీని ప్రాజెక్టు ఉపపేజీగా మార్చాను. కారణమేమిటంటే-అది కనీసం జాబితాగా కూడా ఉండదు కనుక. ఐతే ఈ మాత్రం విషయపు పేజీలుగా ఉండవచ్చన్నది సౌకర్యం గురించే కాక ఇంతవరకూ తయారైన ఇతర జాబితాలు(అవి కూడా విషయపు పేజీలుగానే ఉన్నాయి) పరిశీలించి భావిస్తున్నాను. ప్రస్తుతం దాదాపుగా 156(డీఎల్‌ఐ తెలుగు పుస్తకాల జాబితాలైన 31పేజీలు తీసేస్తే) జాబితాలు ఆ వర్గంలో కనిపిస్తున్నాయి. వాటిలో రెండు తప్ప మిగిలిన అన్నిటినీ విషయపు పేజీలుగా అభివృద్ధి చేశారు. వాటిలో తపాలాబిళ్లలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు మొదలుకొని ఇంటర్నెట్లో టాప్ డొమైన్ల వరకూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీఎల్‌ఐ పేజీలు విషయపు పేజీలుగా ఉండడం తగదని భావించలేను, పైగా ఇక్కడ అవసరమూ ఉండడం గమనించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 13:06, 17 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ఈ ప్రాజెక్టు ద్వారా తెవికీ లోనికి చేరిన జాబితాలు కంటెంట్ పేజీలతో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ పేజీలలో విశేష సమాచారం ఉంది.అవి మొలకలు కూడా కాదు. ఈ ప్రాజెక్టు లక్ష్యం "తెలుగు సమాచారం అందుబాతులోకి తేవడం" అనేది నెరవేరాలంటే వాటిని తెవికీలో వెదికినపుడు సులువుగా ఉండేటట్లు కంటెంట్ పేజీగా ఉండాలి.పవన్ సంతోష్ చేస్తున్న పేజీలు కంటెంట్ పేజీలుగా అర్హమైనవని నా భావన.---- కె.వెంకటరమణ చర్చ 13:48, 17 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ జాబితాలను పవన్ సంతోష్ ప్రాజెక్టు సంబంధించిన పనిలో భాగంగా అభివృద్ధిచేస్తున్నా ఇది వికీపీడియాలో వ్యాసాల అభివృద్ధికి కీలకమైనది. నేను నిర్వహిస్తున్న పుస్తకాల ప్రాజెక్టు కూడా దీనితో కలిపితే బాగా అభివృద్ధి చెందుతుంది. అందుకోసం వికీపీడియాలోని సభ్యుల సహాయసహకారాలు చాలా అవసరం. ఇందుకు నా అభిప్రాయంలో ఈ జాబితాలు తెవికీలో విషయపేజీలగానే ఉంచితే బాగుంటుంది. గూగుల్ వెదుకులాట మరియు వికీ వెదుకులాటలలో ఇందులోని పుస్తకాలు, రచయితలు వస్తారు కాబట్టి దీని ద్వారా చాలా మంది దీనిలో వ్యాసాలను అభివృద్ధిచేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వికీపీడియా:డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (DLI ) లో ఉన్న తెలుగు పుస్తకాల వివరాలు పేజీ ఉన్నది కాబట్టి అదనంగా ఇది వికీపీడియా పేరుబరిలో దీనిని కూడా చేర్చడం అంత సమంజసం కాదనిపిస్తుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 07:50, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
 • ఈ ప్రాజెక్టు ఉపపేజీలుగా ఉంచినంత వరకే ఈ ఉపపేజీలు ప్రాజెక్టులో భాగం. కనీసం ఈ ప్రాజెక్టు సమయం పూర్తయే వరకైనా ఇవి ప్రాజెక్టు ఉపపేజీగా ఉంచగలరు. అలానే ఈ ప్రాజెక్టు విషయమై మొదటి పేజీలో కొంత సమాచారం చేర్చితే సరిపోతుంది. వెంకట రమణ లాంటి వారు ఈ ప్రాజెక్టు ఉపపేజీల ద్వారా కావాలంటే విషయపు పేజీలు సృష్టించవచ్చు. లేదా అలా వాడని పక్షంలో ఈ ప్రాజెక్టుకు అర్ధం లేకుండా పోతుంది. --117.195.237.164 13:49, 27 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
117.195.237.164 గారూ! మీ స్పందనలో ప్రాజెక్టు ఉపపేజీలుగా ఉంచినంత వరకే ఈ ఉపపేజీలు ప్రాజెక్టులో భాగమనీ, అలా వాడని పక్షంలో ఈ ప్రాజెక్టుకు అర్థం లేకుండా పోతుందనీ అభిప్రాయపడ్డారు. రెండింటికీ సమాధానం చేప్పే ప్రయత్నం చేస్తాను. వికీప్రాజెక్టుల్లో భాగంగా విషయపు పేజీలు అభివృద్ధి చేస్తూంటారు-ఇప్పటికే విజయవంతమైన ప్రాజెక్టులు పరిశీలిద్దాం. లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టులో 106 విషయపు పేజీలు సృష్టించారు, ప్రధాన పేజీ తప్ప మరే ఉప పేజీలు లేవు. వాటిని ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసినట్టు తెలిసేందుకు వర్గాలు, మూసలు పెట్టారు. విజయవంతంగా నడుస్తున్న మరో ప్రాజెక్టు గ్రామాల ప్రాజెక్టు విషయానికి వస్తే దరిదాపుల్లో 24వేల గ్రామాలున్నట్టు దాదాపుగా వాటన్నిటికీ వ్యాసాలు ప్రారంభమై రెండో విడత ప్రాజెక్టు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కానీ గ్రామాల ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేస్తున్న వేల పేజీలకు కనీసం ప్రాజెక్టుతో లింక్ చేసి చూపించేందుకు వర్గాలు, మూసలు కూడా ఉపయోగించలేదు. ఇలా అన్ని ప్రాజెక్టులూ పరిశీలిస్తే ప్రాజెక్టు ద్వారా తయారుచేసే పేజీలు ప్రాజెక్టు ఉపపేజీలు అయితీరాలనుకోవడం సరికాదని తెలుస్తోంది. రెండో విషయం మీరు ప్రాజెక్టుకు అర్థమే లేకుండా పోతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు అర్థం పరమార్థం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని పుస్తకాలను ప్రాథమికంగా వికీపీడియన్లు, ఆపై మిగిలిన నెటిజన్లకు అందుబాటులోకి వచ్చేలా చేయడం, తద్వారా వికీలో ఉన్న పేజీలు అభివృద్ధి చెందడం, లేని పేజీలు సృష్టి కావడం తప్ప ప్రాజెక్టులకు ఉపపేజీలు తయారు అయ్యాయా లేదా అన్నది విజయానికి సూచిక కాదు. ఒకవేళ ప్రాజెక్టు ఉపపేజీలుగా ఉండిపోయి ఇటు వికీ సెర్చ్‌లో తేలికగా దొరకక, అటు గూగుల్ సెర్చ్‌లోనూ దొరకకుంటే అప్పుడు ప్రాజెక్టుకు అర్థం పరమార్థం దెబ్బతిన్నాయన్న అవగాహనకు వస్తే రావచ్చు. అంటే నా అవగాహన ప్రకారం, వికీప్రాజెక్టులో అభివృద్ధి చేసే పేజీలు ప్రాజెక్టు ఉపపేజీలుగా ఉన్నంతవరకే అవి ప్రాజెక్టులో భాగం అన్నది సరికాదు. ఈ ప్రాజెక్టుకు అర్థం మీరు చెప్పినట్టు ఉపపేజీలుగా అభివృద్ధి చేయడమే కాదు . తెవికీలో ఇప్పటికే ఇటువంటి విషయాలపై చర్చలు జరిగాయి, ఉదాహరణకు వికీపీడియా చర్చ:తెలుగు ప్రముఖుల జాబితా వద్ద జరిగిన చర్చ చూడండి. ఆ చర్చ చివరలో అర్జున గారు ఇంగ్లీషు వికీలో ప్రధానపేరుబరిలోనే జాబితాలను వర్గాలకంటె భిన్నంగా వుండే మార్గదర్శకంగా వాడుతున్నారు. అన్నారు. ఇది మనకు మార్గదర్శకంగా నిలవవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 03:53, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
 • పవన్ సంతోష్ మనం ఇంతకు ముందు చర్చించుకున్నట్టు ఇవి ప్రాజెక్టు ఉపపేజీలుగా చేర్చి మీరు కొత్త ఒరవడిని సృష్టించగలరు. అలానే ప్రాజెక్టుల ను మొదటి పేజీలో చూపటం లేదు, అదీ మీ ప్రాజెక్టుతో మొదలుపెడదాం. ఇక విషయ పేజీలలో ఉండే అర్హత పైనున్న ప్రాజెక్టుల పేజీలకు ఉంది. మీ ప్రాజెక్టు కేవలం కేటలాగ్ వరకూ పరిమితమయితే సరి, అంతకు మించి చేసే పని ప్రాజెక్టు పరిధి కాదు. --రహ్మానుద్దీన్ (చర్చ) 12:15, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారూ నాకైతే మీరన్నవాటిలో మీ ప్రాజెక్టు కేవలం కేటలాగ్ వరకూ పరిమితమయితే సరి, అంతకు మించి చేసే పని ప్రాజెక్టు పరిధి కాదు. అన్నది పూర్తిగా అర్థంకాలేదు. నేను ప్రారంభించిన ఈ ప్రాజెక్టు లక్ష్యంలో కాటలాగింగ్‌తో పాటుగా, కాటలాగ్ చేసిన పుస్తకాలను మూలాలుగా ఉపయోగించి పేజీలను సృష్టించడం(పుస్తకాల పేజీలు, రచయితల పేజీలు, తదితరాలు), ఇప్పటికే ఉన్న పేజీలు అభివృద్ధి చేయడం కూడా ఉంది.--పవన్ సంతోష్ (చర్చ) 12:34, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అవి వేరే వ్యాసాలు అవుతాయి కదా, జాబితాలను ప్రాజెక్టుకి ఉపపేజీలుగా చేయండి! --రహ్మానుద్దీన్ (చర్చ) 17:58, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఎడిట్-అ-థాన్ నిర్వహణ గురించి[మార్చు]

ప్రాజెక్టు గురించిన వివరాలు సహసభ్యులతో పంచుకుని, వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు, ప్రాజెక్టులో పనిచేయని వికీపీడియన్లకు మౌలిక అవగాహన కల్పించేందుకు, వికీపీడియన్లు కాని ఔత్సాహికులకు వికీ పద్ధతులు నేర్పేందుకు గాను పలు ఎడిట్-అ-థాన్‌లు నిర్వహించనున్నాము. అందులో భాగంగా వికీపీడియన్లు మీనాగాయత్రి, వడ్డూరి రామకృష్ణ గారు, తాడేపల్లిగూడెంలోని స్థానిక వయోవృద్ధుల సంక్షేమ సంఘ నాయకులు, సభ్యులు తమకు ఈ ప్రాజెక్టుపై మరింత అవగాహన కల్పించమని కోరిన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించాలని భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరవుతానని విశ్వనాథ్ గారు కూడా ఆసక్తి ప్రకటించారు. అంతర్జాల గ్రంథాలయంపై నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఆదర్శంగా గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్యను స్వీకరించి ప్రాజెక్టు మూసల్లో కూడా ఆయన ఫోటోను స్ఫూర్తి కోసం ఉపయోగించుకోవడం తెలిసిందే. అదే క్రమంలో ఆయన జయంతి తద్వారా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ దినమైన ఆగస్టు 8తేదీన ఈ కార్యక్రమం నిర్వహిస్తే బావుంటుందన్న ఆలోచన చేస్తున్నాము. కార్యక్రమానికి ఉపకరించే సూచనలు ఏవైనా ఉంటే సహ సభ్యులు స్పందించవలసినదిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:13, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ చాలా మంచి పధకం. ఒక ప్రముఖ వ్యక్తిని ఎవరినైనా మీకు తెలిసినవారిని ముఖ్య అతిథిగా స్వాగతం చెప్పండి. తద్వారా మీడియా వారు వచ్చి కవర్ చేస్తారు. ఒక రెండు-మూడు రోజులు ఈ ప్రాజెక్టు గురించి లోకల్ మీడియా న్యూస్ ఐటం గాని లేదా ప్రెస్ రిపోర్ట్ గారి వచ్చేటట్లు జాగ్రత్త వహించండి. ఇక వికీపీడియాలో ఒక సమావేశం పేజీని తయారుచేయండి. అందులో ఔత్సాహికులందరూ చేరి వివరాలను పంచుకొంటారు. రామకృష్ణ గారి తండ్రిగారు రచించిన పుస్తకాలను కూడా CCY కాపీరైట్ ఫ్రీగా విడుదల వీలైతే చూడండి. వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/జనవరి 19, 2014 సమావేశం మాదిరిగా వికీపీడియా:సమావేశం/తాడేపల్లిగూడెం/- తేదీ సమావేశం పేరుతో ఒక పేజీని సృష్టించండి. Rajasekhar1961 (చర్చ) 14:36, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ ఈ ప్రాజెక్టుకు నేరుగా సంబంధం లేని మరో ఈవెంట్ తర్వాతి రోజున చేస్తున్నామండీ. నేను, మా చెల్లెలు మీనా గాయత్రి కలిసి ఈ నెలలో తాడేపల్లిగూడెంలోనే నిర్వహించిన త్యాగరాయ ఆరాధనోత్సవాలలో దాదాపుగా 30 వరకూ కర్ణాటక సంగీత ఆడియోలు నిర్వాహకుల, మరీ ముఖ్యంగా ఆర్టిస్టుల, ముందస్తు అనుమతితో రికార్డ్ చేసాము. ఆ ఆడియో ఫైల్స్‌కు కాపీరైట్ చట్టం ప్రకారం మేము ప్రొడ్యూసర్స్ అవుతాము కనుక దాన్ని ఆగస్ట్ 8తేదీన సీసీ బై ఎస్.ఎ.అట్రిబ్యూట్ కింద విడుదల చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముందు స్థానిక కర్ణాటక సంగీత విద్వాంసులు(వారిలో ఇద్దరు కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు)కు సీసీ బై ఎస్.ఎ.లో విడుదల చేస్తే తమకు, తమ కర్ణాటక సంగీతానికి కలిగే ప్రయోజనాన్ని గురించి ఒక అవగాహన కార్యకమం ఉంటుంది. ఆ విడుదల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రిని ఆహ్వానిస్తే ప్రాచుర్యం కలుగుతుందని భావిస్తున్నాము. మీ సూచనకు ధన్యవాదాలు. ఐతే ఈ ప్రోగ్రాం కూడా విడిగా డాక్యుమెంట్ చేయాలంటారా?--పవన్ సంతోష్ (చర్చ) 04:34, 27 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక ఈ కార్యక్రమం విషయానికి వస్తే లోకల్ మీడియా కవరేజి విషయంలో నేను జాగ్రత్త వహిస్తాను. ముందురోజు తర్వాతి రోజూ కూడా వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నాను. ఐతే ప్రముఖ వ్యక్తిని పిలిచేందుకు ఇది కేవలం ఎడిట్-అ-థాన్ ఐపోయిందేనని ఆలోచిస్తున్నాను. ఎలాగూ తరవాత రోజు జరిగే ఆడియో ఫైల్స్ విడుదలకి కనీసం మంత్రి స్థాయి వ్యక్తి వస్తారు కనుక సరిపోతుందనుకుంటున్నాను. మీ అభిప్రాయం వేరుగా ఉంటే చెప్పండి దీనికి కూడా ఎవరినైనా పిలుద్దాము. కాపీరైట్ విడుదల గురించి ఇప్పటికే రామకృష్ణ గారితో మాట్లాడుతున్నాను. ఆయన పూర్తిస్థాయి అవగాహన కలిగాకా కనీసం ఒకట్రెండు మంచి పుస్తకాలు అయినా విడుదల చేయిద్దాము. ఇక మీరు ఎర్ర లింకుతో ఇచ్చిన పేజీని పూర్తిచేసి డాక్యుమెంట్ చేస్తాను. పశ్చిమగోదావరి జిల్లాలో మరెవరైనా వికీపీడియన్లుంటే చెప్పగలరు. నేను వారిని ఆహ్వానిస్తాను.--పవన్ సంతోష్ (చర్చ) 04:38, 27 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చక్కటి ప్రాజెక్ట్ - అభినందనలు[మార్చు]

చక్కటి ప్రాజెక్టు, పాల్గొంటున్న, రచనలు చేస్తున్న సభ్యులు అందరూ అభినందనీయులు. కొద్దిగా అవగాహన ఏర్పడ్డ తరువాత నేనూ పాల్గొంటాను. అహ్మద్ నిసార్ (చర్చ) 17:46, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు అహ్మద్ నిసార్ గారూ! రంజాన్ శుభాకాంక్షలు. వీలువెంబడి ప్రాజెక్టులో కలిస్తే మీ అనుభవం, నైపుణ్యం ప్రాజెక్టుకు ఎంతగానో ఉపకరిస్తుంది.--పవన్ సంతోష్ (చర్చ) 04:40, 27 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

డీఎల్ఐ లింక్ తెరుచుకోవడం లేదు[మార్చు]

గత మూడు రోజుల నుంచి డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ తెరచుకోవడం లేదు. నేను కొన్ని పుస్తకాల విషయంలో సంప్రదించగా ఈ సమస్య వచ్చింది. ఇది నాకేనా లేక అందరికీ జరుగుతోందా? Pranayraj1985 (చర్చ) 12:52, 29 ఆగష్టు 2014 (UTC)

ప్రణయ్‌రాజ్ గారూ సాంకేతిక సమస్య అందరికీ వస్తున్నట్టు గమనించాను. గత రెండు రోజులుగా నాకు తెరచుకోవడం లేదు. నేను ఎంక్వైరీ చేయగా ప్రాజెక్టులో చురుకుగా పనిచేస్తున్న రాజశేఖర్ గారు, మీనా గాయత్రిలకు కూడా ఇదే సమస్య వస్తోందని తెలియవచ్చింది. దీనిపై మా సర్వీస్ ప్రొవైడర్లను విడివిడిగా సంప్రదించగా వారు కూడా ఈ పేజీలో సాంకేతిక ఇబ్బందుల రీత్యా తెరచుకోవట్లేదని వివరించారు. సమస్యను రేపు కూడా పరిష్కారం కాకుంటే ఏమి చేయవచ్చన్నది వికీలో సాంకేతిక నిపుణులను, వీలున్నంతలో డీఎల్‌ఐ వారిని కూడా సంప్రదించి పరిష్కారం తీసుకుందాము. --పవన్ సంతోష్ (చర్చ) 13:06, 29 ఆగష్టు 2014 (UTC)
దాదాపుగా 8 రోజులు గడిచాకా ఇప్పుడు పూర్తిస్థాయిలో డీఎల్‌ఐ వెబ్సైట్ పనిచేస్తోంది. సాంకేతిక సమస్య ఇప్పటికి సరి అయినట్టుంది. ప్రాజెక్టు పని పునఃప్రారంభమైంది. గమనించండి.--పవన్ సంతోష్ (చర్చ) 13:15, 3 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

డీఎల్ఐ లింక్ తో తాజా సమస్య[మార్చు]

డిఎల్ఐ లింకు 24గంటలుగా పాక్షికంగానూ, ప్రస్తుతం పూర్తిగానూ తెరుచుకోవడంలేదు. ఈ సమస్యను సహసభ్యుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఇక్కడ పెడుతున్నాను. గమనించగలరు. --Meena gayathri.s (చర్చ) 13:04, 19 అక్టోబరు 2014 (UTC)మీనా గాయత్రి[ప్రత్యుత్తరం]

డిఎల్ఐ లింకు దాదాపుగా 2వారాల నుండి పూర్తిగా తెరుచుకోవడంలేదు. ఈ సమస్యను సహసభ్యుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఇక్కడ పెడుతున్నాను. గమనించగలరు. --Meena gayathri.s (చర్చ) 13:04, 19 అక్టోబరు 2014 (UTC)మీనా గాయత్రి[ప్రత్యుత్తరం]

నాకు కూడా ఇదే సమస్య 10 రోజులుగా గమనించాను. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఇది కీలకమైన సమస్యగా మారింది. దీనిని ఎలా అధిగమించాలో సాంకేతిక నిపుణులు తెలియజెయమని మనవి.Rajasekhar1961 (చర్చ) 07:34, 11 నవంబర్ 2014 (UTC)

డీఎల్ఐ వెబ్సైట్ మొరాయింపు[మార్చు]

గత వారం పదిరోజులుగా డీఎల్ఐ వెబ్సైట్ సక్రమంగా పనిచేయట్లేదు. నిన్న మాత్రం మెరుపులో కొద్ది గంటలు పనిచేసి మళ్ళీ పాడయింది. ఈ పరిస్థితి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ పరిష్కారం మాత్రం దొరకడం లేదు.--పవన్ సంతోష్ (చర్చ) 02:35, 10 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పత్రికలు చేర్చాలా? వద్దా?[మార్చు]

ఈ ప్రాజెక్టు పేజీల్లో నేను చాన్నాళ్ళ నుంచి శ్రమించి పనిచేస్తున్న విషయం వికీపీడియన్లంతా చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇన్ని నెలల నుంచి నేను చేస్తున్న పనులు నిష్ప్రయోజనమేమోనన్న అభిప్రాయం కలుగుతోంది. గత వారం బెంగళూరులో ట్రెయిన్ ద ట్రెయినర్ 2015కు వెళ్ళినప్పుడు రెహ్మానుద్దీన్ గారి మాటల వల్ల నాకు అలా అనిపించింది. కానీ సుజాత గారు అప్పట్లోనే కొంత నచ్చజెప్పడంతో తిరిగి నేను ఈ పేజీల్లో రాయడాన్ని కొనసాగిస్తున్నాను. లేకుంటే అక్కడితో ఆపేసేదాన్నే. ఇప్పుడు నాకు మరో పెద్ద అనుమానం వచ్చింది. రెహ్మాన్ పదే పదే ఈ పేజీల్లో మేగజైన్ల సంచికలు చేర్చకూడదని, అందువల్ల ఫిర్యాదులేవో తనకు వస్తున్నాయని అంటున్నారు. నేను ఇంతకుముందు ఈ ప్రాజెక్టు నడుపుతున్న సీనియర్లు రాజశేఖర్ గారూ, సంతోష్లని అడిగే అవన్నీ చేసినా నన్ను చాలా తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు మళ్లీ నాకు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో "ఉదయిని" (సంపాదకుడు-కొంపల్లె జనార్ధనరావు) సంచికలు వచ్చాయి. ఇక్కడ ఒక సంచిక పెడితే చాలు అని, అంతకుమించి మిగిలిన సంచికలు పెట్టవద్దని రెహమాన్ గట్టిగా చెప్పారు. దానిపై మా ఇద్దరికీ వాగ్వివాదం అయి నేను చాలా డిజప్పాయింట్ కూడా అయ్యాను. ఇప్పుడు ఉదయిని సంచిక విషయంలో ఏం చెయ్యమంటారు. మానెయ్యనా. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టు పేజీలలో కేవలం పవన్ సంతోషే పనిచెయ్యాలని, నాలాంటి ఇతర వికీపీడియన్లు పనిచెయ్యకూడదని కూడా చెప్పారు. అదే నిజమైతే గనుక చేసిన పని అంతా తప్పా? మానెయ్యాలా? నాకంతా అయోమయంగానూ, కంగారుగానూ ఉంది. సీనియర్లు ఎవరైనా నాకు గైడ్ చెయ్యకుంటా ఇక్కడితో వికీపీడియాలోనే పనిచేయలేని స్థితిలో ఉన్నాను. నేను వికీపీడియాలో చేసిన కంట్రిబ్యూషన్ వల్ల వికీపీడియా గానీ, ఫౌండేషన్ గానీ, మరెవరైనా గానీ నష్టపోయి ఉంటే క్షమించండి. --Meena gayathri.s (చర్చ) 05:17, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలోని ఏ ప్రాజెక్టులో ఎవరైనా పనిచేయవచ్చును. మీరు చేస్తున్నది చాలా విలువైన పని. ఇంక పత్రికల విషయంలో పుస్తకాలకు ఎలా వర్తిస్తాయో అలానే వర్తిస్తాయని భావించవచ్చును. కాకపోతే ఒక్కొక్క సంచిక కు ఒక పూర్తి పుస్తకానికున్న విలువ లేకపోవచ్చును. కాబట్టి మీరు ఉదయిని పత్రికలను అన్నింటిని ఈ ప్రాజెక్టు పేజీలో నిరభ్యంతరంగా చేర్చవచ్చును. ఒక ప్రాజెక్టును దానిని పొందిన వ్యక్తి ఒక్కరే చేయాలని రూలేమీ లేదు. అంతేకాక ఈ ప్రాజెక్టులన్నింటి ప్రధాన ఉద్దేశం సమూహాన్ని బలోపేతం చేయడం. మరో ఆలోచక లేకుండా ఈ ప్రాజెక్టులోను ఇంకేమైన మీకు నచ్చిన ఇతర పనులు కూడా మొదలౌపెట్టండి. --Rajasekhar1961 (చర్చ) 15:03, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మీనా గాయత్రీ నువ్వు చేస్తున్న పని చాలా విలువైనది. నీ కృషి, రాజశేఖర్ గారి కృషి, స్వరలాసిక గారి కృషి, జెవిఆర్కే ప్రసాద్ గారు వంటివారు చేస్తోన్న పనులు, లక్ష్మీదేవి గారు కేవలం ప్రాజెక్టు నచ్చే వికీలోకి రావడం వంటివి ఈ ప్రాజెక్టు ప్రయోజనాలకు ప్రత్యక్ష నిదర్శనం. మీతో ఉత్సాహంగా పనిచేయించేందుకు ప్రయత్నాలు చేయడమే నేను చేయాల్సిన పని తప్ప మొత్తం ప్రాజెక్టు పని అంతా చేసుకోవడం కాదు. ఇది నాకే కాదు ఆన్-వికీ చేసే ఏ గ్రాంటుకైనా చాలా సహజమైన నియమంగా వర్తిస్తుందన్నది ఈ ప్రాసెస్ ను అర్థం చేసుకోవడంలో మొదటిమెట్టు. ఇక పత్రికల విషయానికి వస్తే విడివిడి సంచికలకు చాలాసార్లు పుస్తకాల కన్నా ఎక్కువ విలువ ఉంటుందన్నది సాహిత్యంపై విపరీతమైన ఆసక్తి ఉన్న నా అభిప్రాయం. వికీపీడియాకు సంబంధించిన కంటెంట్ చాలావరకూ పత్రికల్లో లభిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే రెహ్మానుద్దీన్ గతంలో ఈనాడు-ఆదివారం పత్రికా సంచికలు ఇచ్చి వాటి నుంచి వికీపీడియాలో వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చని సూచించారు నాకు, మరికొందరు వికీపీడియన్లకు. రచ్చబండలో ఇటీవలే రూపవాణి అనే సినిమా పత్రికల గురించి సీనియర్ వికీపీడియన్ వైజాసత్య గారు కోరారు విష్ణు గారిని. నేనూ, రాజశేఖర్ గారూ వికీసోర్సులో పుస్తకాలను చేర్చడంలో వ్యక్తిగతంగా ప్రాధాన్యతలు నిర్ధారించుకునేందుకు సాహిత్యంలో అభినివేశం ఉన్న ఒకరిని కలిశాము. వారు కూడా చాలా విలువైన వ్యాసాలు, పరిశోధనలు మేగజైన్లలో ప్రచురితమై పుస్తకాలుగా రాకుండా ఉండిపోయాయని, కనుక మేగజైన్లకు చాలా విలువ ఉందని చెప్పారు. అందుకే వికీసోర్సులో ప్రస్తుతం పత్రికల ప్రాజెక్టును రాజశేఖర్ గారు చేపట్టి నడిపిస్తున్నారు. ఇప్పుడు నువ్వు ప్రస్తావించిన ఉదయిని సంచిక విషయానికే వస్తే ఆ సంచికల తయారీ కోసం నానా తంటాలు పడి, అత్యంత నాణ్యంగా రూపొందించి ఆ క్రమంలో అనారోగ్యంతో చనిపోయారు కొంపెల్ల జనార్ధనరావు. ఆ పత్రిక విలువ అసామాన్యం. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే తెలుగులో అపురూపమైన గ్రంథాలన్నీ ముందుగా మేగజైన్లలో ప్రచురితమైనవే. ఉదయిని పత్రిక వికీసోర్సులో పెట్టేందుకు, తిరిగి వికీపీడియాలో పలు వ్యాసాలు తయారుచేసేందుకు చాలా విలువైన సోర్సు కనుక నువ్వు అవన్నీ పట్టించుకోకుండా, జాబితాలో చేర్చగలిగితే తప్పనిసరిగా చేర్చాలని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:52, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మీనాగాయత్రీ నువ్వు ఈ విషయాలకు నిరుత్సాహపడకు. నిజానికి నేనూ రెహ్మానుద్దీన్ కలిసి రెండు నెలల క్రితం ప్రాజెక్టు ద్వితీయార్థభాగంలో స్వతంత్ర 2014లో ప్రజంటేషన్ చేశాము. తెలుగు వికీపీడియాలో జరిగిన ఈ ప్రాజెక్టు ఎంత కాస్ట్ ఎఫక్టివ్‌గా, ఎంత సమర్థంగా సాగిందో ఆయన ప్రెజంటేషన్‌లో అనుభవజ్ఞులైన వికీమీడియన్లు, దేశవ్యాప్తంగా వచ్చిన పలువురు ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమకారులు, నిపుణులైన డెలిగేట్స్‌కు వివరించారు. వారందరూ ప్రాజెక్టు తీరుపై ప్రశ్నలు వేసి ఉత్సాహభరితమయ్యారు. రహ్మాన్ గారు ఈ ప్రాజెక్టు విస్తృత ప్రభావాన్ని గురించి ఆ సమావేశంలో విడమరిచి చెప్పారు. ఆయనకు ప్రాజెక్టు గతి నచ్చకుంటే ఇవన్నీ చేసేందుకు వీలే లేదు. ఇదంతా ఏమిటో నాకు తెలియట్లేదు మరి. --పవన్ సంతోష్ (చర్చ) 17:27, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
 • మీనా గాయత్రి నేను చెప్పిన విషయాలను అపార్ధం చేసుకున్నది. నేను చెప్పిన విషయాలు - నా వరకూ ఈ ప్రాజెక్టు నిర్ణీత సమయంలో ఆఱు వేల పుస్తకాల సంఖ్య దాటాలి, అందుకు అందరూ సహకరించాల్సి ఉంది, కానీ కేవలం పవన్ సంతోష్ ఒక్కడే చెయ్యాల్సి వస్తుందని చెప్పాను - దీనిని ఈమె ఆయనొక్కడే చెయ్యాలి అని చెప్పినట్టుగా అర్ధం చేసుకున్నట్టుంది. నేను ఒకే ఒక పర్యాయం ఈ విషయమై తనకు చెప్పాను, పదే పదే కాదు. ఇక పత్రికలది నా అభిప్రాయం కాదనీ, మరొకరిదనీ, ఆ విషయం మర్చిపొమ్మనీ, కనీసం ఆ మెయిల్ ప్రతి కూడా ఇవ్వననీ చెప్పాను. పత్రికలు వచ్చినపుడు ప్రత్యేక పత్రికలోని విశేషాలు తెలిపే బదులు ఒకే సమాచారాన్ని అన్ని పత్రికల్లో చేర్చడం విషయమే నేను అడిగింది. ఉదాహరణగా ఆంధ్ర పత్రికగురించి చూపిస్తూ, ఆ పత్రిక ఎంట్రీలన్నిటిలో ఒకే విషయాన్ని వ్రాసారు, ప్రత్యేక సంచిక విషయాలు వ్రాస్తే బావుణ్ణు అన్నాను. ఇంతకు మించి సంభాషణ జరుగలేదు, ఇంకా ఈ సూచనలను పవన్ సంతోష్ కి చెప్పమని చెప్పాను గానీ, తనని పని చేయవద్దని చెప్పలేదు. పైవన్నీ తన ఆలోచనలే అని చెప్పటానికి ఒకే ఒక ఉదాహరణ, ఆమెను నేను మరిన్ని ప్రాజెక్టులలో పని చేయమనడమే, అలానే మీడియావికీ టీటీటీకీ రమ్మని ఆహ్వానించడమే.. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:03, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
 • మరో చిన్న విషయం(ఇది పై చివరి వ్యాఖ్యలకు సమాధానం కాదు). ఈమధ్య వ్యావహారిక భాషోద్యమానికి సంబంధించిన కీలకమైన గిడుగు వారి పుస్తకాలు, ప్రచురణలు వికీసోర్సులో చేర్చాలని నేనూ, రాజశేఖర్ గారూ ప్రయత్నాలు ప్రారంభించాం. ఏయే పుస్తకాల ప్రాధాన్యత ఏమిటో నాకిప్పటికే సూత్రప్రాయంగా తెలిసినా మరింత స్పష్టంగా తెలుసుకునేందుకు డీఎల్ఐలో దొరికిన గిడుగు రామ్మూర్తిపంతులు, జయంతి రామయ్యపంతులు గార్ల పుస్తకాల(ప్రతిపక్షులు కదా) పీఠికలతో పాటుగా, ఈమాట వారు ప్రచురించిన వ్యవహారిక భాషోద్యమ చరిత్ర ప్రత్యేక సంచిక(పాతది) కూడా చదువుతున్నాను. ఆ క్రమంలో బూదరాజు రాధాకృష్ణ గారు వ్యవహారిక భాషోద్యమ చరిత్ర గురించి సవివరంగా, సంఘటనల క్రమంతో వ్రాసిన వ్యాసాన్ని చదువుతుంటే పత్రికల విలువేంటో మరోమారు తెలియవచ్చింది. ఆ ప్రత్యేక సంచికలో వ్యవహారిక భాషోద్యమాన్ని వివరిస్తూ రాసిన అనేకమైన వ్యాసాలు, వ్యాసపరంపరలు, ప్రశ్న-సమాధానాలు, సభల వివరాలు, సభల్లోని ప్రసంగాల పాఠాలు వంటివి ప్రచురణ కాకుండా అలా ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, ది హిందూ, ఆంధ్రపత్రిక, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలు వంటివాటిలో ఈ చరిత్ర చాలా నిక్షేపం అయివుంది. వాటన్నిటిలోకెల్లా ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక ఈ అంశంలో మరీ ముఖ్యమైనదిగా తెలియవచ్చింది. ఆ వ్యాసంలో సమగ్రమైన వివరాలు ఇచ్చేందుకు ఒక్కో సంచికనూ నాలుగైదు మార్లు ఆయన ఇన్లైన్ రిఫరెన్సుగా వాడడం చూస్తే దాని మౌలికత, ప్రాసంగికత తెలుస్తున్నాయి. ఈ సందర్భంగా పరిషత్పత్రికలను చేరుస్తున్న రాజశేఖర్ గారికీ, ఈ విషయంలో సూచనలు చేసిన కౌటిల్య, రవికృష్ణ వంటి వారికీ అనేకానేక ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 05:17, 23 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు ఈ ప్రాజెక్టు తెగ నచ్చేసింది[మార్చు]

అయ్యా, పవన్ సంతోష్ మీ ఐ.ఈ.జీ కి ఐదు వేలో, ఆరువేలో లక్ష్యం అయి ఉండవచ్చు. కానీ నేను మొత్తం 23వేల పుస్తకాల కేటలాగు తయారుచెయ్యాలని నిశ్చయించుకొన్నాను. నా పరిధి కేటలాగు తయారుచెయ్యటం వరకే (అఫ్‌కోర్సు డిస్క్రిప్షన్లతో సహా). కేటలాగు తయారుచేసి డిజిటల్ లైబ్రరీవారికి బహూకరించాలని నా కోరిక-వైజాసత్య (చర్చ) 02:41, 13 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అద్భుతం. బాద్షా డిసైడైతే వార్ వన్‌సైడ్ అయిపోతుంది :-) --పవన్ సంతోష్ (చర్చ) 03:51, 13 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారికి, మీకు తోడుగా నేను కూడా తోడ్పాటు నందిస్తాను. మొత్తం 23,000 పైబడిన పుస్తకాలను మనం కేటలాగు చేయగలిగితే దీనిద్వారా ఎన్నో అద్భుతమైన తెలుగు గ్రంథాలు బయటకు వస్తాయి. మరోసారి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 04:55, 13 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ, సహాయం చేయటానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మీ తోడ్పాటు నాకు చాలా అవసరం. నేను మన ముందున్న ఈ సమస్యను ఢీకొనటానికి ఒక మార్గం ఎంచుకొని, కొన్ని పనిముట్లు తయారుచేసుకున్నాను. వాటిని మీకూ, పవన్ సంతోష్ కూ వివరించి, నా పద్ధతి సరైనదో లేదో ఒకసారి రూఢీ చేసుకోవటానికి ఈ వారాంతంలో వీలైతే ఒక స్కైపు సమావేశం ఏర్పాటు చేసుకుందామా? ఏమంటారు? --వైజాసత్య (చర్చ) 02:54, 14 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, రాజశేఖర్ గారూ మీకు ఏ సమయం వీలవుతుందో చెప్పండి.--పవన్ సంతోష్ (చర్చ) 03:09, 14 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇండియాలో ఈ రోజు రాత్రి 8-9 మధ్యన వైజాసత్య గారికి అనుకూలంగా ఉంటే మనం ఆ సమయానికి స్కైపు +/_ జాయిన్ మీ లో కలుసుకొందాము.--Rajasekhar1961 (చర్చ) 08:18, 14 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్ , @రాజశేఖర్, ఒకే, నాకీ సమయం కుదురుతుంది. స్కైపులో కలుద్దాం. అలాగే జాయిన్.మీ ఉపయోగిద్దాం --వైజాసత్య (చర్చ) 12:33, 14 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

జాబితా పేజీల్లో ఒకే పుస్తకపు వేర్వేరు ప్రచురణలు చేర్చడం[మార్చు]

ఇన్నాళ్ళుగా ప్రాజెక్టుపై ముమ్మరంగా పనిచేస్తున్న నేనూ, మీనా గాయత్రి, ఇతర వాలంటీర్లూ ఒకే పుస్తకానికి వేర్వేరు ప్రతులుంటే దాదాపుగా ఒక ప్రతి మాత్రం చేర్చి మిగిలినవి పరిహరించాం. ఐతే ఇటీవల ప్రాజెక్టుపై ఆసక్తితో ముందుకువచ్చిన వైజాసత్య గారు అలా పుస్తకపు ఇతర ప్రచురణలను పరిహరించడం వల్ల విలువైన ప్రచురణలను నష్టపోతామని భావించారు. ఒకే పుస్తకానికి వేర్వేరు ప్రచురణకర్తలు వేసే ప్రచురణలు వేర్వేరుగా ఉండేందుకు చాలానే అవకాశం ఉంది. ఆయన తెలిపిన ఉదాహరణ ప్రకారం రాధికాసాంత్వనం లేక ఇళాదేవీయం అన్న చరిత్ర ప్రసిద్ధమైన శృంగార ప్రబంధం దాదాపు నాలుగు వేర్వేరు ముద్రణల్లో దొరుకుతోంది. ఆ నాల్గు ముద్రణల్లో ఒకటి ఆంధ్రసాహిత్య పరిషత్తు, మరొకటి శృంగార గ్రంథమాల, ఇంకొకటి బెంగళూరు నాగరత్నమ్మ ప్రచురణలు. వీటిలో ఆంధ్రసాహిత్య పరిషత్ ప్రచురణలో సముఖం వెంకటకృష్ణప్ప నాయకుడు వ్రాసిన పీఠికతో కలిసివుంది, అలానే శృంగార గ్రంథమాల వారి ప్రచురణలో వెంపటి నాగభూషణం సమీక్ష వుంది, ఇక నాగరత్నమ్మ ప్రచురణ ఆమె పరిష్కరించిన ప్రతి దానికి తెలుగు సాహిత్య, వలసవాద అధ్యయనంలోనూ, స్త్రీవాద చరిత్రలోనూ చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఈ రకంగానే ప్రతి పుస్తకానికి, మరీ ముఖ్యంగా పూర్వపు కావ్యాలకు, ప్రచురణ ప్రచురణకూ భేదాలున్నాయి. ఇక ఇదే విషయానికి మరో కోణం చూస్తే పాశ్చాత్య గ్రంథ పరిష్కరణ విధానాలు తెలుగు సాహిత్యంపై చూపిన ప్రభావాన్ని గురించి అంతర్జాతీయ స్థాయి పరిశోధకులు వెల్చేరు నారాయణరావు గారు, పరుచూరి శ్రీనివాస్ గారూ తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు అనే వ్యాసంలో చర్చించారు. ఆ చర్చలో కీలకమైన విషయం తెలుగులోని పలు కావ్యాలను వ్రాత ప్రతి నుంచి అచ్చు ప్రతికి మార్చే సమయంలో అనేకమైన ప్రతుల ఆధారంగా తయారు చేయబడిన మిశ్రమ ప్రతి తయారుచేసే ఎలక్టిసిజం విధానంలో చేశారని, తద్వారా ఎన్నో ప్రతులు తమ రూపును కోల్పోయాయని వ్రాశారు. అందుకని పండిత ప్రతుల కన్నా పండితులు పరిష్కరించన ప్రతులే విలువైనవని వ్రాశారు. అందుకోసం ఏదైనా పూర్వపు కృతిని ఇప్పుడు పునర్నిర్మించుకోవాలంటే వివిధ ప్రతులు అవసరమౌతాయని వ్రాశారు. ఇటువంటి పరిశోధకుల మాటలను, పీఠికల విలువను పరిగణనలోకి తీసుకుని ఇకపై ఈ పేజీల్లో చేర్చే కావ్యాల్లో వేర్వేరు ప్రచురణలు కానీ, వ్రాతప్రతులు కానీ ఉంటే వాటిని చేర్చాలని నిర్ణయిస్తున్నాము.--పవన్ సంతోష్ (చర్చ) 16:18, 15 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

జాబితాల్లో పుస్తకాల గురించి[మార్చు]

జాబితా పేజీల్లో వీలైనంతవరకూ ఎన్‌సైక్లోపిడిక్ నేచర్ ఉన్న పుస్తకాలు చేర్చాలని మొదట్లో భావించాం. ఆ ప్రకారం ప్రయత్నించడం కూడా గమనించవచ్చు. దానికి ముఖ్యకారణం ప్రాజెక్టు సక్సెస్ మెజర్లలో వికీపీడియాలోని వ్యాసాలను ఈ సమాచారంతో అభివృద్ధి చేయాలని లక్ష్యం నిర్దేశించుకోవడం. వికీపీడియాలో వ్యాసాలు ఈ పుస్తకాల సహకారంత స్వయంగానూ, మరికొందరు వికీపీడియన్ల సహకారంతోనూ అభివృద్ధి చేయడం జరిగింది. ఆ లక్ష్యం అందుకున్నట్టే, ఇక దాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు కూడా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనేవున్నాము. ఇక ప్రాజెక్టు పరిధుల్లో తెలుగు వికీసోర్సు కూడా వుండడమే కాక వికీసోర్సులో గట్టికృషి చేస్తున్న మన రాజశేఖర్ గారు వికీసోర్సులో చేర్చదగ్గ అన్నివిధాల పుస్తకాలనూ ఇందులో చేర్చుకొమ్మని సూచిస్తూండడం, అది చాలా సమంజసమని అనిపించడం కారణాలుగా ఆ విధమైన పుస్తకాలను చేర్చాము. ఎం.ఫిల్ స్కాలర్ గా వున్న ప్రణయ్ రాజ్ గారి పరిశోధనలో భాగంగా ఇక్కడ దొరుకుతున్న అనువాద నాటకాలు వారికి ఎన్నో విధాలుగా ఉపకరించడం, ఆయన అటువంటి పుస్తకాలు ఏమాత్రం దొరికినా ఇవ్వమనడం, నాకు దొరుకుతున్న దొరుకుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఆయనకి ఇవ్వడమూ జరిగింది. ఆ క్రమంలో ఆయన మరికొందరు పరిశోధక విద్యార్థుల గురించీ చెప్పడం, అప్పుడు రాజశేఖర్ గారూ నేనూ మాట్లాడుకున్నప్పుడు అన్నిరకాల పుస్తకాలకూ విలువ ఉన్నట్టూ తెలిసింది. ప్రాజెక్టు పనుల్లో కొద్దికాలం విలువైన కృషిచేసిన వెంకట రమణ గారు పద్యాల్లో గణితాన్ని బోధించిన పూర్వపు పుస్తకాలను చూసి పరమానందభరితులైనారు. ఇటువంటి పలువురు వాలంటీర్ల విలువైన అభిప్రాయాలు ఈ ప్రాజెక్టు పట్ల నాకున్న దృష్టిని మలిచింది. ఇన్ని విధాలుగా నన్ను ప్రభావితం చేసి చక్కని దారుల్లోకి మళ్ళించినందుకు వీరందరికీ ధన్యవాదాలు. ఇటీవలి కాలంలో మీనా గాయత్రి కొన్ని గుండ్రటి ముత్యాల కోవల్లాంటి వ్రాతప్రతులను చూపించి వ్రాతప్రతులు చేర్చాలని ప్రాజెక్టులో ముందుగా రాయనందున వీటిని చేర్చలేదన్నారు. వ్రాతప్రతులకు సాహిత్య పరిశోధనలోనూ, చారిత్రికంగానూ ఉన్న విలువ తెలిసిన నేను నిలువునా నీరైపోయాను. ప్రాజెక్టు పేజీలు కానీ, ప్రతిపాదనలు కానీ కేవలం చుక్కాని వంటివేనని వాటిని స్వేచ్ఛగా మలుచుకునేందుకు కృషిచేస్తున్న వాలంటీర్లకు ఎప్పుడూ హక్కువుంటుందని మరోమారు స్పష్టంచేసి ఆమెను తప్పకుండా ఆ వ్రాతప్రతులు చేర్చమని రిక్వెస్ట్ చేశాను. ప్రాజెక్టుకు పనిచేస్తున్న కృషీవలురు తెలుసుకుంటారని ఇది ఇక్కడ పెడ్తున్నాను. గుర్తించండి.--పవన్ సంతోష్ (చర్చ) 14:42, 16 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ముందుగా పవన్ సంతోష్ గారికి ధన్యవాదాలు... నేను హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. నా పరిశోధనలో భాగంగా ఇతర భాషలనుంచి అనువదించబడిన నాటకాల లిస్టు తయారుచేయాల్సివుంది. ఈ విషయమై పవన్ సంతోష్ ని సంప్రదించగా.. తను చేస్తున్న ప్రాజెక్టు గురించి చెప్పి తనకి లభించిన సుస్తకాల వివరాలను, వాటి లంకెలను నాకు ఇవ్వడం జరిగింది. అవి నా పరిశీలనకు మరింతగా ఉపయోగపడ్డాయి. --Pranayraj1985 (చర్చ) 10:45, 19 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్.. పరోక్షంగా మీ వల్ల ప్రాజెక్టుకు చాలా మేలు జరిగింది. ఏయే పుస్తకాలు ఉండాలో. పుస్తకాల ప్రాధాన్యతలేవిటో పరోక్షంగా తెలియజెప్పినవారు మీరు. అంతవరకూ కేవలం ఎన్సైక్లోపిడిక్ పుస్తకాలు చాలనుకుంటున్న సమయంలో తెలుగు సాహిత్యంలోని పలు ప్రక్రియల ప్రయోజనాలు, విస్తృతి తెలియవచ్చి ప్రాజెక్టును సంకుచితత్వం నుంచి విశాలత్వానికి నడిపించగలిగాం. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 06:49, 23 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పట్టికల రకం[మార్చు]

మొత్తం పట్టికలు అన్నింటిని sortable గా మార్చాను. దీని మూలంగా మనం ఏ రకంగానైనా ఒక వర్గంలోని పేజీలకు ఆకార లేదా సంఖ్యాక్రమంగా మార్చుకొని చూడవచ్చును. ఇది వైజ్యాసత్య గారితో జరిగిన చర్చలో తెలుసుకున్నాను.--Rajasekhar1961 (చర్చ) 10:50, 17 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ ధన్యవాదాలు. సాంకేతికాంశాల్లోనూ, ఇతర విషయాల్లోనూ వైజా సత్యగారూ, మీరూ చేస్తున్న సహకారం, చొరవకు చాలా చాలా కృతజ్ఞతలు.--పవన్ సంతోష్ (చర్చ) 18:17, 21 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ముఖ్యమైన మైలురాయి[మార్చు]

ఈ ప్రాజెక్టులో కీలకమైన కృషిచేస్తున్న వారందరికీ ఓ శుభవార్త. ఈ ప్రాజెక్టులో మనం కృషిచేస్తున్న మైలురాళ్ళలో ఒకానొకటైన ఆరువేల పుస్తకాలను జాబితాలో చేర్చడమనేది సాధించుకున్నాం. నిన్న సాయంత్రమే ఈ మైలురాయి దాటాం. నిన్నటి రోజున వాడుకరి:Meena gayathri.s, వాడుకరి:వైజాసత్య, నేనూ చేర్చిన శతాధిక పుస్తకాలతో మొత్తం జాబితా పేజీల్లో ఉన్న సంచికల సంఖ్య ఆరువేలు దాటింది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు పనుల్లో సహకరించినవారూ, ముందుండి నడిపించి, వెనకుండి వెన్నుతట్టిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇటీవలే వైజాసత్య గారి చొరవ, కృషి మేరకు ఈ ప్రాజెక్టు పనులు డీఎల్ఐలోని అన్ని తెలుగు పుస్తకాలనూ కాటలాగ్ చేయడం అనే మరో పెద్ద అంగవైపుకు వెళ్తోంది. ఆయన అందించిన టూల్స్, సహకారం మరువలేనిది. ప్రాజెక్టు ద్వారా ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావించిన గ్రామాలను గుర్తించి వాటిలో వివరాలు చేర్చడం, విశ్వనాథ సత్యనారాయణ గారి గురించిన వ్యాసాలు మరింత సమగ్రం చేయడం, ఉగ్రాణం నరసింహారెడ్డి గారి నెల్లూరి జిల్లా గ్రామనామాల సామాజిక భాషాపరిశీలన నుంచి గ్రామాల నామాల్లో వివరణలు చేర్చడం, పలువురి సాహిత్యరచనల గురించి, పలువురు సాహిత్యవేత్తల గురించి వ్రాయడం వంటి అనేకానేకమైన విలువైన పనులు ఈ చేశాము. నడుస్తున్న పత్రికల ప్రాజెక్టుకు ఈ జాబితాలోని పుస్తకాలను స్వరలాసిక గారు వంటివారు వినియోగించుకోవడం నేను గమనించాను. ఎప్పటిక్రితమో తయారయి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్న కొన్ని గ్రామాల వ్యాసాలకు ఈ ప్రాజెక్టులోని రెండు పుస్తకాలే ఓ పెద్ద ఊపు తీసుకురావడం చిన్న నమూనా మాత్రమే. ఇందులోని అనేకానేక పుస్తకాలకు అంతకుమించిన శక్తీ సామర్థ్యమూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగానే ఎన్నెన్నో మూలాలే లేని వ్యాసాలకు, ఇన్లైన్ రిఫరెన్సులు లేని వ్యాసాలకు సమగ్రమైన ఇన్లైన్ రిఫరెన్సులు ఏర్పడ్డాయి. వైజాసత్య గారిని సైట్ మూసను ఉపకరణాల్లో చేర్చమని అడిగింది కూడా ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగానే. ఈ ప్రాజెక్టు ద్వారా అప్పుడప్పుడు వికీపీడియాలో మార్పులుచేర్పులు చేస్తూన్న వాడుకరి:Meena gayathri.s పూర్తిస్థాయిలో పనిచేస్తూండడం మాత్రమే కాక ప్రాజెక్టు గురించి ఫేస్ బుక్ ద్వారా తెలుసుకుని వాడుకరి:లక్ష్మీదేవి గారు తనవంతు కృషిచేస్తూ వికీపీడియన్ అయ్యారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా వికీసోర్సు పొందిన ఉపయోగాలు చాలా ఉన్నాయి. మొదటి నుంచీ రాజశేఖర్ గారు ఈ ప్రాజెక్టులో దొరికిన పుస్తకాలను తీసుకుని వికీసోర్సులో చేరుస్తున్నారు. ఆయన చేస్తున్న కృషి మరింత విలువైన పుస్తకాల కోసం చేస్తే బావుంటుందని అందుకై పుస్తకాల విలువ తెలిసినవారెవరినైనా కలవాలని ఆయన ఆశించారు. రాజశేఖర్ గారు కోరినప్పుడు నేను నాకు తెలిసిన సాహిత్య పోషకుడు, పరిశోధకుడు ఐన వ్యక్తి(వారి పేరు వెల్లడించేందుకు అనుమతి లేదు)తో రాజశేఖర్ గారికి సమావేశాన్ని ఏర్పాటుచేశాను. ఆ సమావేశం నుంచి ఆయన మరింత స్పష్టంగా తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమమైన గ్రంథాలను చేరుస్తూన్నట్టు తెలిసింది. మరీ ముఖ్యంగా ఆయన ఈ ప్రాజెక్టు ద్వితీయార్థం నుంచి పత్రికలను వికీసోర్సులో చేరుస్తున్నారు. అందునా ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలు మున్నగు ముఖ్యమైన విలువైన పత్రికలు ఎంచి చేర్చడం ప్రారంభించారు.

ఇదంతా ప్రాజెక్టు వల్ల జరిగిన మేలు. ఇక ప్రాజెక్టు ద్వారా వచ్చిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఈ జాబితాపేజీలు విషయపు పేజీలా, వికీపీడియా పేరుబరిలో ఉండాల్సినవా అన్న అంశం. దీనిపై ఏకాభిప్రాయం కుదిరితే ఎలాగైనా చేయవచ్చు. మూలాల విషయంలో నేను ఎదుర్కొన్న సమస్యలను వైజాసత్యగారు తీర్చారు. తొలినాళ్ళలో పుస్తకాలన్నీ విషయప్రాధాన్యత కలవేనేమోనని పుస్తకాలకు పేజీలు సృష్టిస్తే వైజాసత్యగారితో జరిగిన ఆన్-వికీ చర్చల్లో భాగంగా కాదన్న విషయం స్పష్టమైంది. ఈ చర్చల్లో కొందరు వికీపీడియన్లు(నాతో సహా) స్థూలంగా ఈ విషయంపై ఓ అంగీకారానికి రావడంతో, ఆ అవగాహనపై వైజాసత్య గారూ, రాజశేఖర్ గారూ, వెంకటరమణగారూ ఈ ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన కొన్ని పేజలను రచయితల పేజీల్లో విలీనం చేశారు. ఆ రచయితల పేజీలలో కొన్నిటిని వికీకరించాము. తర్వాత్తర్వాత అలా స్థూలంగా విషయప్రాధాన్యత లేదనిపించిన పుస్తకాలకు వ్యాసాలు సృష్టించే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ సమస్యలుగా కనిపించినా వీటివల్ల జరిగింది మరింత స్పష్టతే. ప్రణయ్ రాజ్ లాంటి పలువురు పరిశోధక విద్యార్థులు, అనిల్ వంటి సాహిత్యాభిమానులు వికీకి ఆవల ఎంతగా ప్రయోజనం పొందారో స్థాలీపులాక న్యాయంగా ప్రస్తావించుకోవలిసిందే కానీ అంచనా వేయలేము.

భారతీయ సాహిత్యం ఇటువంటి ప్రయత్నాలను తరచు వటవృక్షంతో పోలుస్తుంది. మర్రిచెట్టు ఊడదిగితే మరో మర్రిచెట్టు అవుతుంది. ఆ మర్రి మరెన్నో మర్రిచెట్లను సృష్టిస్తుంది. కొన్నాళ్ళకు అక్కడ వీటన్నిటికీ మూలబీజమైన మొదటి మర్రిచెట్టు ఏదో గుర్తించడం దాదాపు అసాధ్యం. ఈ ప్రాజెక్టు ఫలాలు కూడా అలా మరెన్ని అపురూపమైన ప్రయత్నాలకు మూలబీజాలు కావడం కనిపిస్తూనేవుంది. చివరికి ఏది ముందు ఏది వెనక తెలియని స్థితి, ఈ ప్రాజెక్టు కనిపించక ఆ తదుపరి ప్రయత్నాలే కన్నులు మిరుమిట్లు గొలిపే రోజూ వస్తే అంతకన్నా నేను సంతోషించే విషయం లేదు.(ఈ ప్రాజెక్టులో సృష్టించిన పేజీల్లో పుస్తకాలు చేర్చే తదుపరి ప్రయత్నాలు జరుగుతాయి. వైజాసత్యగారూ, రాజశేఖర్ గారూ, మీనాగాయత్రి, నేనూ చేయనున్నాము. మరెవరైనా చేరినా మరింత సంతోషమే.)--పవన్ సంతోష్ (చర్చ) 06:38, 23 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@పవన్ సంతోష్ చాలా సంతోషం. ఈ ప్రాజెక్టును అనుకున్న సమయంలో విజయవంతంగా పూర్తిచేసినందుకు శుభాభినందనలు. ఇంతటితో మీ ఐ.ఈ.జీ పూర్తయినట్టేనా? పైన పవన్ సంతోష్ గారు నన్ను బాద్షా అన్నారు కానీ ఈ ప్రాజెక్టుకు నిజమైన బాద్షా మీనా గాయత్రి గారే. ఈ ప్రాజెక్టు మూలంగా మరింత తెలుగు విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తుందన్నది నిస్సందేహం--వైజాసత్య (చర్చ) 01:07, 24 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్.మీనా గాయత్రి కాంట్రిబ్యూషన్లు మరవలేనివి. ఐఈజీ ఐతే ఇంతటితో పూర్తైనట్టే. --పవన్ సంతోష్ (చర్చ) 12:29, 24 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గతం లో ఆర్కీవ్. ఆర్గ్ గురించి జరిగిన కృషి[మార్చు]

పవన్ సంతోష్ చేపట్టిన ప్రాజెక్టు దిగ్విజయంగా ముగిసే సందర్భంలో దీనికి కృషి చేసిన వారందరికి ధన్యవాదాలు. గతంలో అర్వీవ్. ఆర్గ్ జాబితే పై జరిగిన కృషి గురించి తెలిస్తే ముందు ముందు జరిగే పనులకు తోడ్పాటుగా వుండవచ్చు కావున ఈ వ్యాఖ్య రాయడమైనది. --అర్జున (చర్చ) 06:48, 31 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు అర్జునరావు గారూ. తప్పకుండా పరిశీలిస్తాను. ప్రాజెక్టు కృషివల్ల వికీపీడియాలో, వికీసోర్సులో వ్యాసాలకు, పుస్తకాలకు నాణ్యతాపరంగా కానీ, చేర్పుల పరంగాగానీ జరిగిన మార్పులు (మీరు తిరిగి కృషిని ముమ్మరం చేశాకా మీకైమైనా కంటపడివుంటే) కూడా క్లుప్తంగా ప్రస్తావించగలరా? ప్రస్తుతం గ్రాంటు పనుల ఆవలి దశ ప్రారంభం కానుంది ఒక్కో పుస్తకాన్ని కాటలాగ్ చేసేందుకు అనుసరిస్తున్న విధానం, దానికి వైజా సత్యగారిచ్చిన ఉపకరణాలు వంటివాటి గురించి తగినంత వ్రాసినప్పుడు మీరూ, సుజాత గారూ అక్కడ మీ అనుభవాలు వీలువెంబడి పంచుకోగలిగినా బావుంటుంది. మీ ప్రయత్నంలో భాగస్తులైన రాజశేఖర్ గారు మా ప్రాజెక్టు పనుల్లో, ప్రతి ముఖ్య ప్రణాళిక చర్చలో ఉండడం మాకు చాలా లభించింది కూడాను. ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 08:32, 31 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు ప్రధానంగా కనిపించినది వికీసోర్స్ లో ఎక్కువ పుస్తకాలు స్కాన్లు చేరటం మరియు పాఠ్యీకరణలో పురోగతి. వికీపీడియాలో రచ్చబండలు చర్చలు వరకే చూశాను మరింతగా పరిశీలించలేదు. ఆర్కీవ్.ఆర్గ్ కృషి గురించి మీ ప్రాజెక్ట ప్రతిపాదన సమయంలో మెటాలోనే తెలియచేశాను. మీ ప్రాజెక్టు కి అది ఏమైనా ఉపయోగపడిందో తెలియదు.నా కృషి గురించి వీలైనన్ని వివరాలు అనుభవాలుచేర్చడం కృషి ముగించే సమయంలో నా అలవాటు కావున కొత్తగా చెప్పేది ఎక్కువ లేదు. పాత ప్రాజెక్టు కంటే ఎక్కువమందిపాల్గొనడం సంతోషకరమైనసంగతి. దీనివలన ప్రాజెక్టులో పనిచేయడంలో అనుభవం పెరిగి ముందువచ్చే ప్రాజెక్టులకృషి బలోపేతం అయితేఅది చాలా మంచి పరిమాణం అవుతుంది. ఇంకొక్క సంగతి. డిఎల్ఐ మెటాడాటాలో తప్పుల వివరాలు చాలా సార్లు ప్రస్తావించారు. అటువంటివివరాలు జాబితా చేసి డిఎల్ఐ వారికి పంపటం మరియు మీ నివేదికలో భాగంగా పేర్కొనడం బాగుంటుంది.--అర్జున (చర్చ) 10:45, 1 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
థాంక్యూ. "డిఎల్ఐ మెటాడాటాలో తప్పుల వివరాలు చాలా సార్లు ప్రస్తావించారు. అటువంటివివరాలు జాబితా చేసి డిఎల్ఐ వారికి పంపటం మరియు మీ నివేదికలో భాగంగా పేర్కొనడం బాగుంటుంది"అన్న మీ ఆలోచన బాగానే ఉంది. కాకుంటే వాళ్ళ అవి చాలా మౌలికంగా అంతటా నిండివున్నాయి. ఉదాహరణకు ఎక్కడపడితే అక్కడ అకారణంగా "'" వంటివి పెట్టడం వంటివాటి వల్ల సెర్చబిలిటీ పూర్తిగా దెబ్బతింది పైగా కొన్ని అక్షరాలకు బదులు కొన్ని అక్షరాలు ఇస్తూంటారు. మౌలికంగా వారు వర్గీకరించేందుకు తీసుకున్న ప్రాతిపదికలేమిటో కూడా చెప్పలేము. నా వరకూ నాకు అదంతా వ్రాయాలంటే "నా తరమా భవసాగరమీదను" అనిపిస్తోంది. అదటుంచితే ఇప్పటీకే ఆ పని కొంతవరకూ చేసినవారున్నారు. పుస్తకం.నెట్ సౌమ్య గారు ఆవిడ బ్లాగులో ఈ పోస్టులో అక్షరాల విషయంలో జరిగిన కొన్ని దోషాలు ఎంచారు. ఇది కొంతవరకూ పనికివస్తుంది. ఐతే వీటికి తోడు తెలుగు పుస్తకాల జాబితాలోకి ఇతర భాషల పుస్తకాలు(మరీ సింహళ పుస్తకాలు కూడా చేర్చారు) వంటివి ఎలానూ ఉన్నాయి. ఐతే సౌమ్య గారి బ్లాగ్ పోస్టు మాత్రం ఇంత సీరియస్ విషయానికి కామెడీగా కొన్ని సొల్యూషన్స్ సూచించేలావుంది. నవ్వుకుని సంతోషించేందుకు చాలానేవున్నాయి ఆవిడ పోస్టులో సరదా సంగతులు.--పవన్ సంతోష్ (చర్చ) 11:35, 1 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
 • అర్జున గారూ మీ ఆలోచనకు ధన్యవాదాలు. మీనాగాయత్రిని ఫోనులో సంప్రదించాను. అప్పటికప్పుడే తను దాదాపు ఓ 15-20 టకీటకీమని లిస్ట్ అవుట్ చేసింది. పుస్తకం.నెట్, వికీపీడియా పేరుబరి రెంటిలోనూ వ్యాసాలు వ్రాస్తానన్నది. దాన్ని ఉపయోగించి నేను మీరు చెప్పినట్టు జాబితా చేసి డీఎల్ఐకి పంపడం చేస్తాను. కానీ ఇప్పటికే నివేదిక ఓ టాంప్లెట్‌లో ఉంది. అందులో దీనికి చోటు నాకు కనిపించడంలేదు. ఈ విషయంపై నేను నా ప్రాజెక్ట్ బాధ్యతలు చూస్తున్న వికీమీడియా ఫౌండేషన్ ఎంప్లాయీని అడిగి తదనుగుణంగా చేస్తాను. ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 17:34, 1 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారి స్పందనకు లింకులకు ధన్యవాదాలు.సౌమ్య గారు పడిన పాట్లు మీ కృషి వల్ల కొంత దూరమవుతాయి. మీ పాత వ్యాఖ్యల ప్రకారం రచయిత పేరు లేకపోవడం లేక ఒకరచయిత పేరు బదులుగా ఇంకొక రచయిత పేరు వాడడం ఎక్కువగా వుందేమోనని అనుకున్నాను. ఆర్కీవ్.ఆర్గ్ పని లో చాలావరకు DLI అధారితం కాబట్టి, నాకలా అనిపించలేదు. కేవలం పుస్తకంశీర్షిక, రచయిత పేరు యూనికోడ్ చేయటానికి కాస్త తెలుగు సాహిత్య పరిచయమైన వ్యక్తి పుస్తకాలపేజీలు తెరిచి చూడకుండా ఆంగ్లలిపిలో పేర్లని అర్థం చేసుకొని తెలుగులో రాయటం సులభమేనని నా అనుభవం. ఇక మీ ప్రాజెక్టులో ఎన్ని రచనలకు క్లుప్త వివరణ రాయటం పూర్తయింది, ఎన్నింటికి చేయాలి అనేదికూడా తెలిపితే ముందు చేయవలసిన కృషికి సహకరిస్తుంది. నివేదిక టెంప్లేట్ లో అనుబంధం గా మీరు ఉపయోగమనుకుంటున్న వాటిని చేర్చవచ్చు, --అర్జున (చర్చ) 05:28, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ "కేవలం పుస్తకంశీర్షిక, రచయిత పేరు యూనికోడ్ చేయటానికి కాస్త తెలుగు సాహిత్య పరిచయమైన వ్యక్తి పుస్తకాలపేజీలు తెరిచి చూడకుండా ఆంగ్లలిపిలో పేర్లని అర్థం చేసుకొని తెలుగులో రాయటం సులభమేనని నా అనుభవం." బహుశా సౌమ్యగారి ఇంప్లిమెంటేషన్ గైడ్ లాంటి పోస్ట్ చూడబట్టి మీకలా అనిపించివుండొచ్చు. ఆవిడ రాసిన గైడ్ ఆ సైట్ వినియోగించుకునేవారి కోణం నుంచి, అదీ అటు సీరీయస్ పరిశోధన కోసం కాకుండా పుస్తక ప్రియులు తమ ఆసక్తి కొలదీ చదివేవారి దృక్కోణం నుంచి వ్రాసింది కనుక అలావుంది. నిజానికి ఆవిడ వేలాది పుస్తకాల నుంచి పోయినవి పోగా నాకొక రెండు మంచివి దొరికితే చాలన్న దృక్పథంతో వ్రాసినట్టే నాకు అనిపించింది. ఈ పనిలో దాదాపుగా ఆర్నెల్లు అనుభవం ఉన్న నాకూ, గాయత్రికీ పై సూచన ఆచరణ సాధ్యం కాదనే అనిపిస్తోంది. ఎందుకంటే మేము తేలికగా పని అయ్యేందుకు ఆ మార్గం రెండు మూడు సార్లు ప్రయత్నించి భంగపడి మళ్ళీ పుస్తకాలు తెరిచి చూసే పనిలో పడిపోయాము. రెండు మూడు ఉదాహరణలు చెప్పాలంటే: laqs-and-a gran'dhaalu అన్న పేరుతో, రచయిత పేరు లేకుండా డీఎల్ఐలో పుస్తకం ఉంది. దాన్ని ఏమని అర్థం చేసుకుంటాము? నిజానికి అది రసార్ణవ సుధాసారమన్న పేరుతో చమత్కార చంద్రిక అన్న నామాంతరం కలిగిన అలంకారశాస్త్ర గ్రంథం చిలుకూరి పాపయ్యశాస్త్రి వ్రాశారు. vein'kat'a అన్న రచయిత పేరుతో రాజభక్తి అన్న పుస్తకం వాళ్ళు కాటలాగ్ చేశారు, కానైతే రచయిత పేరు వేంకట పార్వతీశ కవులు అని దాన్నుంచి మనం డిరైవ్ చేయలేము. పోనీ పుస్తకం పేరు, రచయిత పేరు గెస్ చేసేందుకు దగ్గరగా ఉన్న పుస్తకాలైనా తెరవకుండా చేసేద్దాం అని అనుకుందాం. కానీ దానికున్న ముఖ్య సమస్య ఏంటంటే ఓ పది, పదిహేను పుస్తకాలకు ఒకటి ఇలా పేరు, రచయిత పేరు ఒకటి(వివరంగానే వుంటాయి) లోపల పుస్తకం పూర్తిగా వేరొకటి ఉన్న సందర్భాలు దొరుకుతున్నాయి. అలాంటి పొరబాట్లు చేయకూడదన్న లక్ష్యంతో పుస్తకం తెరవాల్సి వుంది. ఇక మరో విషయమేంటంటే వీళ్ళిచ్చిన మొత్తం వర్గీకరణ ఏ మినహాయింపూ లేకుండా దోషభూయిష్టంగా ఉంది. మన ప్రయత్నంలో భాగంగా పుస్తకం నాటకమైతే నాటకం, లేదూ చరిత్ర గ్రంథమైతే చరిత్ర గ్రంథం, ఆధ్యాత్మికమైతే ఆధ్యాత్మికం అని వర్గీకరించి కాటగిరీలో రాస్తున్నాం. దానికి పుస్తకం తెరవాల్సే వస్తోంది. ఇదీ సమస్య. ఈ కోణంలో మనం విశ్లేషించుకోవాలంటే ప్రాజెక్టులో అతిఎక్కువ పుస్తకాలు చేసిన గాయత్రి ముందుగా ఈ కోణంలో నివేదికో, అనుభవాలో రాయాల్సివుంటుంది. "ఇక మీ ప్రాజెక్టులో ఎన్ని రచనలకు క్లుప్త వివరణ రాయటం పూర్తయింది, ఎన్నింటికి చేయాలి అనేదికూడా తెలిపితే ముందు చేయవలసిన కృషికి సహకరిస్తుంది." ప్రయత్నిస్తాను. కానీ దాన్ని ఒక్కో పేజీ తెరిచి వెతుక్కుంటూ పోవాలా లేక వేరేదైనా తేలిక మార్గం ఉందా అన్నది చూసుకోవాలి నేను. --పవన్ సంతోష్ (చర్చ) 07:07, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి, కొన్ని వేల పుస్తకాలు రకరకాల సంస్థలు ఒక్కోసారి పొరుగుసేవల సంస్థలు కేటలాగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు దొర్లే అవకాశం వుంటుంది.అయితే నా ఆసక్తి ఎంత శాతం ఇటువంటి దోషాలు వున్నాయి అన్నదానిమీదనే. క్రితం ఆర్కీవ్.ఆర్గ్ పని, ప్రస్తుతం మీ ప్రాజెక్టు పని ఒక విషయం విస్తృతంగా చేయాలా లేక లోతుగా చేయాలన్న రెండు దృ క్పధాలని చూపిస్తుంది.దేని లాభనష్టాలు దానికుండవచ్చు. రెండింటి ఫలితాలు వున్నాయి కాబట్టి ముందు జరిగే పనులకు మెరుగైన మార్గదర్శకం చేయగలిగితే పని మరింత సమర్ధవంతంగా చేయకలిగే అవకాశం వుంటుంది. అయితే వర్గీకరణ కూడా లోపభూయిష్టంగా వున్నదని మీరు తెలపటం నాకు ఆశ్చర్యం గావుంది. ఎందుకంటే ఇది గ్రంథపాలకుల ఆధ్వర్యంలో జరిగిన పని.వారి పర్యవేక్షణలోటుని చూపిస్తుంది. ఇలాంటి దోషాలగురించి సమగ్రమైన పరిశోధనా వ్యాసాన్ని ప్రచురించితే ముందు ఇలాంటి అంశాలపై పనిచేసేవారికి ఉపయోగం కాగలదు. ఇక మీ కేటలాగ్ కి వికీలో పట్టిక అంత సరియైన తీరు కాదు. దీనిని కనీసం మీరు Excel లో పట్టిక లాగ వుంచితే వివిధ రకాలుగా వర్గీకరించడానికి,( రచయిత, విషయం,పుస్తకపు సంఖ్య లాగా) తరువాత సులభంగా మార్పులు చేయడానికి వీలుంటుంది.ఇది ఇతరులతో పంచుకోవడానికి, సాంకేతికంగా సహాయం దొరికితే వెబ్సైట్ లో Query ద్వారా సమాచారం పొందడానికి మరింత సులభమవుతుంది. వికీపీడియాలో పట్టికని నకలు చేిసి, Excelలో అతికించడం ద్వారా ఇది చేయవచ్చు. అప్పుడు ఎన్ని పుస్తకాలకు క్లుప్తవివరణ లేదు అనేది కనుక్కోవటం చాలా సులభం అవుతుంది. --అర్జున (చర్చ) 04:05, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
కరెక్టే ఈ ప్రాజెక్టు "లోతుగా చేద్దాం" అన్న కోణంలోనే సాగిందనిపిస్తోంది మీరు చెప్తూంటే, ఆరువేల పుస్తకాలు ఆ నాణ్యతతో చేయడం తలకుమించిన భారమే అయినా మా దృక్పథం వల్ల ముందుకే నెట్టుకుని పూర్తిచేసుకున్నాం. ఎప్పటికైనా ఈ ప్రాజెక్టుకు వేగం కన్నా నాణ్యతే ముఖ్యమని నా లెక్క. విస్తృతంగా లోతుతక్కువగా చేసిన పనిని సరిజేయడానికి విస్తృతి కన్నా నాణ్యతే ఎక్కువ ఉపకరిస్తుంది కదా. లేకుంటే డీఎల్ఐ వారి పనికి కొద్దిపాటి మార్పులతో డ్యూప్లికేషన్ అవుతుంది చివరకు. అందుకే వేయి పుస్తకాలు వేగంగా చేయడం కన్నా 50 పుస్తకాలు నిర్దిష్టంగా చేయడమే మేలన్న లక్ష్యంతో సాగాము. ఐతే మా పనిలోనూ లోటుపాట్లుండకపోవులెండి, అది వేరే విషయం. ఇక మీరు చెప్పిన సమగ్ర పరిశోధన వ్యాసం గురించి తప్పకుండా ప్రయత్నిస్తాము. మొదట ఎక్సెల్లోనే చేద్దామనుకున్నాం, కానీ ఎవరు ఏ పుస్తకాలు చేస్తున్నారో తెలియకపోవడం, వంటి కన్ఫ్యూజన్స్ ఎదురై మనవాళ్ళందరికీ అలవాటున్న వికీలోనే చేయడం ఉత్తమమని అలానే ముందుకుపోయాం. ప్రస్తుతం వికీటేబుల్ ఎడిటర్ అనే వెబ్సైట్లో మనకి కావాల్సిన ఫీల్డులు వికీ మార్కప్ కోడ్ లో పేస్ట్ చేసుకుంటే కింద ఎక్సెల్ లాగా గళ్ళు వస్తాయి. వాటిలో నింపితే మనకి కావాల్సిన విధంగా వికీ మార్కప్ కోడ్ ఇస్తుంది. కాపీ పేస్ట్ చేసుకోవడమే. ప్రస్తుతానికి ఈ విధానం వాడుతున్నాం. వీలువెంబడి ఆన్-వికీ ఈ ఉపకరణాలు పంచుకుంటాను. ఇక ఎక్సెల్ షీట్ చేసి, ఏవేవి ఏమాత్రం ఖాళీగా వున్నాయన్నది అంచనాకట్టడం చాలా మంచి సూచన, కాకుంటే ప్రస్తుతానికి నేను ప్రాజెక్టు ఫైనల్ రిపోర్ట్ పనుల్లో చాలా బిజీగా ఉండడంతో వీలుచిక్కాకా మన వికీలోని సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రయత్నం చేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:17, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్ , @అర్జున కొన్ని చెదురుమొదురు ఆలోచనలు..అంతే
నాకు రెండ్రోజుల క్రితమే తెలిసిన విషయమేవిటంటే ఆర్కైవ్లో ఉన్న తెలుగు పుస్తకాలు నిజానికి డీ.ఎల్.ఐ నుండే వచ్చాయని. ఆర్కైవ్లోని తెలుగు పుస్తకాలు, డీ.ఎల్.ఐలోని పుస్తకాల సబ్‌సెట్ అని. మూకుమ్మడిగా డీ.ఎల్.ఐలోని పుస్తకాలన్నీ ఆర్కైవ్లో చేరిస్తే డీ.ఎల్.ఐ వాళ్ళు ఫీలవుతారా?
laqs-and-a gran'dhaalu వంటివాటికి అర్ధంపర్ధం లేదు అనుకుంటాం కానీ, అవి పూర్తిగా అచ్చుతప్పులు కావు. ఈ తిక్క వెనక కొంత లెక్క ఉంది. ఇదో లిప్యాంతరీకరణ పద్ధతి 'd అని ఉంటే అది "ద" అని "డ" కాదని సూచించడానికే. ఈ పద్ధతితో ఈ ఇంగ్లీషులో ఉన్నవి కొంతవరకు తెనుగించవచ్చు కానీ అసలు రచయితే తప్పయినప్పుడు, ఆ తప్పుడు సమాచారాన్ని తెనుగించి ఏం లాభం?
అన్ని ఎంట్రీలకీ వివరణలు అవసరం లేదు. కొన్నింటికి పెద్దగా వివరణలు ఇవ్వలేం కూడాను (ఉదాహరణకు పత్రికా సంచికలు మొదలైనవి. సాంఘీక నాటకాల్లాంటివాటికైతే మొత్తం నాటకం చదివితే కానీ ఏదైనా టూకీగా వ్రాయలేం) --వైజాసత్య (చర్చ) 06:52, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@వైజాసత్య, నాకు తెలిసినంతవరకు, డిఎల్ఐ లోని వాటిని పబ్లిక్ డొమైన్ గా పరిగణించి వాడుకోవచ్చు. డిఎల్ఐ వెబ్సైట్ వాడుకరులకు అంతసరిగాలేదు కాబట్టి, ఆర్కీవ్.ఆర్గ్ లో చేర్చితే పిడిఎఫ్ పొందడానికి, ఆన్లైన్ లో చదువుకోవటానికి సులభంమవుతుంది. చాలా ఆంగ్ల పుస్తకాలను కూడా ఆలానే ఆర్కీవ్.ఆర్గ్ లో ఆంగ్ల వికీపీడియన్లు చేరుస్తున్నారని, వికీమీడియా ఇండియా ఆంగ్ల మెయిలింగ్ లిస్టులో ఇటీవలి చర్చలలో తెలిసింది. @పవన్ సంతోష్ మీ పద్దతిని తప్పుబట్టటము లేదండి. సమాచారాన్ని తెలుగు వాడుకరులకు అందచేయటానికి డీఎల్ఐ వారి పనికి కొద్దిపాటి మార్పులతో డ్యూప్లికేషన్ అయినా చాలావుపయోగం జరుగుతుంది. రాజశేఖర్ గారు ప్రస్తుత ప్రాజెక్టుకి ముందు చేర్చిన పుస్తకాలన్నిటికి ఆర్కీవ్.ఆర్గ్ కృషి తోడ్పడిందని నా అభిప్రాయము. ఇక వైజాసత్య గారు చెప్పినట్లు విషయ వర్గాలు రాయటానికి, క్లుప్తవివరణ రాయటానికి పుస్తకశీర్షిక, ముందుమాటలు, చివరిఅట్టపై పుస్తకంగురించిన సంగతులు వుపయోగంగా వుంటాయి. పూర్తి పుస్తకం చదివి రాయాలనుకోవటం అంత సమర్ధవంతమైన పద్దతి కాదు, అలాచేయటం ఒకరి దృక్కోణాన్ని మాత్రమే ప్రతిబింబించవచ్చు.--అర్జున (చర్చ) 04:23, 4 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఓ సరదా బ్లాగ్ పోస్ట్[మార్చు]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని పుస్తకాల గురించి వెతుకులాటలోని సమస్యల గురించి మళ్ళీ మళ్ళీ రాసి విసిగించను కానీ పుస్తకం.నెట్ పత్రిక సంపాదకురాలు వి.బి.సౌమ్య గారు అప్పుడెప్పుడో చేసిన ఓ హిలేరియస్ పోస్టు ఇదిగోండి. డీఎల్‌ఐ పుస్తకాల గురించి ఆవిడ చేసిన ఈ కామెంట్ మీద సరదాగా ఓ లుక్కెయ్యండి:

నాలాంటి Lazy fellows కి గుణపాఠం నేర్పేందుకే జానపదకథల్లో నిధులని కాపలా కాసే ప్రమాదకరమైన పాముల్లా, ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ సృష్టించి పెట్టిన డీఎల్లై వారికి ధన్యవాదాలు.

మొత్తంగా మనమందరం ఓసారి చదివి నవ్వుకోవడమే కాక మీనా గాయత్రి లాంటి వాళ్ళు బుక్ మార్క్ చేసుకుని చదువుకుంటూండవచ్చు కూడాను.--పవన్ సంతోష్ (చర్చ) 11:42, 1 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రాజెక్టు యొక్క ప్రస్తుత స్థితిని తెలుపగలరు[మార్చు]

అందరికీ నమస్కారం,

నేను కొత్తగా వికీపీడియా లో పాల్గొనడం ప్రారంభించాను. ఈ ప్రాజెక్టు పేజిలను చూస్తే చాలా మంచి పనులు జరిగినట్టు అన్పిస్తుంది. కానీ ఈ పేజీలో సమీప కాలం యొక్క సంభాషణలు లేవు. కాబట్టి ఈ ప్రాజెక్టు యొక్క ప్రస్తుత స్తితిని తెలుపగలరు.

నేను కొన్ని తెలుగు వికీ పేజీలలో ఎర్ర లింకులను సరి చేయడం మొదలు పెట్టాను. ఇవి తెలుగులోని బహు విధములైన స్పెల్లింగుల వల్ల, స్పేసుల వల్ల ఎర్రగా మారాయి. కాబట్టి కొన్ని వాటికి రిడైరెక్ట్ లింకులు పొందు పరుస్తున్నాను.

ఇది కాకుండా ప్రస్తుతము ఉన్న ప్రాజెక్టులలో ఒక చేయి అవసరమైతే చెప్పగలరు.

మంచిది.

--Criticpanther (చర్చ) 14:06, 28 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రధానపేరుబరి నుండి వికీపీడియా పేరుబరికి జాబితా వ్యాసాల తరలింపు[మార్చు]

YesY సహాయం అందించబడింది

డిజిటల్_లైబ్రరీ_ఆఫ్_ఇండియాలోని_తెలుగు_పుస్తకాల_జాబితా_-_అలాంటి జాబితాల పేజీల వర్గం:డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితాను ప్రాజెక్టుపేజీకి ఉపపేజీలుగా చేయాలి. ఇటీవల విశ్వనాథ్ ప్రాజెక్టు పేజీలను కూడా తరలించాము. User:Pavan santhosh.s మరియు ఇతర సభ్యులు స్పందించండి--అర్జున (చర్చ) 10:04, 19 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ! గతంలో నేను వేరేగా స్పందించినా ఆ తర్వాత వికీపీడియా ప్రధాన పేరుబరి ప్రాధాన్యత, వికీపీడియా పేరుబరి ఆవశ్యకత వంటివన్నీ తెలుసుకున్న ఈ దశలో మీ సూచన సరైనదని భావిస్తున్నాను. ఆ ప్రకారం చర్యలు చేపడుతున్నానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 10:25, 19 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. దీనికై బాటు సహాయం కావాలంటే తెలియజేయండి.--అర్జున (చర్చ) 10:28, 19 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్తరలింపు మీ ప్రాజెక్టు పేజీకి ఉపపేజీగా చేయండి. నేరుగా ప్రాజెక్టుకి కాదు.--అర్జున (చర్చ) 10:32, 19 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ మీరు బాటుతో సహాయం చేసిపెట్టండి, మీరే సహాయాన్ని ఆఫర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 10:35, 19 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
/transferred pages .--అర్జున (చర్చ) 18:04, 19 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
తరలింపు పూర్తయింది, మూస సవరించబడింది. ఎమైనా సమస్యలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 18:32, 19 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

లింకులు అర్కైవ్.ఆర్గ్ కి మళ్లించడం[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ ప్రాజెక్టు జాబితా లో పుస్తకాలకు 7270 లింకులు వుండగా 6896 నిర్దిష్ట పుస్తకాలు వున్నాయి. ప్రస్తుతం వున్న లింకులలో barcode ను ఉపయోగించి ఆర్కైవ్.ఆర్గ్ identifier ని కనుక్కొని మార్చాలి. లింకు ఉదాహరణ ఒక యోగి ఆత్మకథ భారత డిజిటల్ లైబ్రరీలో ఒక యోగి ఆత్మకథ 1951 ప్రతి.

ఒక యోగి ఆత్మ కథ, barcode=2020010006604 title:oka_yogi_atma_katha

API ఉపయోగించి identifier కనుగొని

https://archive.org/advancedsearch.php?q=dc.identifier.barcode%3D2020010006604&fl%5B%5D=identifier&sort%5B%5D=&sort%5B%5D=&sort%5B%5D=&rows=50&page=1&output=json&callback=callback&save=yes

callback({"responseHeader":{"status":0,"QTime":46,"params":{"query":"(title:dc.identifier.barcode=2020010006604^100 OR description:dc.identifier.barcode=2020010006604^15 OR collection:dc.identifier.barcode=2020010006604^10 OR language:dc.identifier.barcode=2020010006604^10 OR text:dc.identifier.barcode=2020010006604^1)","qin":"dc.identifier.barcode=2020010006604","fields":"identifier","wt":"json","rows":"50","json.wrf":"callback","start":0}},"response":{"numFound":1,"start":0,"docs":[{"identifier":"in.ernet.dli.2015.328790"}]}})

https://archive.org/details/in.ernet.dli.2015.328790

title పరామితితో వెతికి

title పరామితితో వెతికి title:(Oka Yogi Atma Katha) సరిపోలిన పుస్తకాల ఫలితాలు చూపించడం రెండవ పద్ధతి. https://archive.org/search.php?query=title%3A%28Oka%20Yogi%20Atma%20Katha%29

మొదటి పద్ధతి ఉపయోగించడం మంచిది.--అర్జున (చర్చ) 06:45, 20 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పై పద్ధతి అంత సమర్ధవంతం కాదు. అందుకని మొత్త కేటాలాగ్ ని దింపుకొని, దానిలో barcode సాయంతో వెతికి మార్చవలసిన లింకులు తయారు చేశాను. మొత్తం 7268 లింకులకు 7104 అర్కైవ్.ఆర్గ్ లింకులు కనుగొన్నాను.అనగా 97.7 శాతం 104 లింకులు కనుగొనలేకపోయాను. ఈ పుస్తకాలు ఆర్కైవ్.ఆర్గ్ లో చేరివుండకపోవచ్చు లేక barcode దోషాలు వుండి వుండవచ్చు. అవి మానవీయంగా సరిదిద్దాలి. /dli2archive links found /dli2archive links not found జాబితాలు జతచేస్తున్నాను. ఈ ప్రాజెక్టుకు కృషి చేసిన పవన్ మరియు ఇతరులు ప్రతిపాదనపై స్పందించండి.--అర్జున (చర్చ) 15:01, 23 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ! ధన్యవాదాలు. డీఎల్ఐ తెలుగు పుస్తకాలు ప్రస్తుతం తెలుగు భాషాభివృద్ధి కోసం పనిచేస్తున్న సంస్థ ఒకదాని వద్ద లభ్యమవుతోంది. మీరు ఇచ్చిన 104 పుస్తకాల జాబితా నేను వారి కాటలాగులో పరిశీలించి పుస్తకాలు పట్టుకుని అవకాశం ఉంటే ఆర్కైవ్.ఆర్గ్ లోకి మనమే ఎక్కించే ప్రయత్నం చేయవచ్చు. ఏమంటారు? --పవన్ సంతోష్ (చర్చ) 14:24, 24 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్, మీరు కొన్ని లింకులు తనిఖీ చేసి సరిగా వున్నదో లేదో తెలియచేయండి. నేను లింకులు కనుగొనటానికి వెతుకుపదంలో కొంత దోషం వున్నందున dli.gov.in వెతకనందున, స్క్రిప్ట్ సరి చేశాను.
quarry script

USE tewiki_p;
SELECT el_id,el_from,el_to
FROM externallinks
JOIN page ON page_id = el_from
JOIN categorylinks on cl_from=page_id
WHERE (cl_to = "డిజిటల్_లైబ్రరీ_ఆఫ్_ఇండియాలోని_తెలుగు_పుస్తకాల_జాబితా" AND el_to LIKE '%dli%');

ఈ రోజున 8970 లింకులున్నాయి. వీటిలో కొన్ని ఒకటి కంటె ఎక్కువ సార్లు వచ్చివుండవచ్చు.--అర్జున (చర్చ) 14:59, 24 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా పేరు బరి జాబితా పేజీలలో మార్పులు బాట్ ద్వారా చేశాను. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఋమొత్తం మరియు ఇతర జాబితాలలో కొన్ని చోట్ల మార్పులు వీలవలేదు, యాంత్రికంగా జతపరచడం కుదిరివుండకపోవచ్చు. బార్ కోడ్ లింకు దొరికిన జాబితాలో వుంటే మానవీయంగా ఆ మార్పులు చేయవచ్చు. [వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు_సమాచారం_అందుబాటులోకి/DLI_లోని_తెలుగు_పుస్తకాల_జాబితా_-_అంకెలు&curid=164942&diff=2341949&oldid=2341948 ఉదాహరణ] ప్రాజెక్టు సభ్యులు పరిశీలించవలసినది.--అర్జున (చర్చ) 17:46, 24 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
యాంత్రిక పోల్చటంలో కేవలం barcode వాడితే మిగిలిపోయిన మార్పులు పూర్తి చేయబడినవి. --అర్జున (చర్చ) 07:51, 25 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రధాన పేరుబరి లో మార్పులు[మార్చు]

వాడవలసిన quarry https://quarry.wmflabs.org/query/26663

మొదటి పేరు బరి నుండి ప్రాజెక్టు పేరుబరికి తరలించిన పేజీలను వదిలివేయడానికి

USE tewiki_p;
SELECT el_id,el_from,el_to,page_title
FROM externallinks
JOIN page ON page_id = el_from
WHERE ((page_title NOT LIKE  "వికీపీడియా:%" AND page_title NOT LIKE "%DLI%" AND page_title NOT LIKE "%/%" AND page_namespace=0) AND (el_to LIKE '%dli.ernet.in%' OR el_to LIKE '%dli.gov.in%' ));

1389 వరుసలు కనిపించాయి.--అర్జున (చర్చ) 23:55, 24 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

/namespace 0 dli links not found లో మార్చుటకు కుదరని లింకులు ఇవ్వబడినవి.--అర్జున (చర్చ) 05:40, 25 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కొన్ని పేజీలు పేరుబరి తప్పుగా(వికీపీడీయా) వాడటం వలన పై స్క్రిప్ట్ అవసరమైంది. అది సరిచేశాను.--అర్జున (చర్చ) 04:54, 8 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మిగిలిపోయిన DLI లింకులు సవరించు[మార్చు]

/మిగిలిపోయిన DLI లింకులు లో 130 వరుసలు వున్నాయి. వాటిని Public library of India లింకులతో మార్చాలి.--అర్జున (చర్చ) 07:28, 10 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పని పూర్తయింది. 31 వరుసలు మూల లింకులు, లేక ఆర్కైవ్ లో భద్రపరచిన పిడిఎఫ్ లింకులు వుంచబడినవి.--అర్జున (చర్చ) 11:31, 13 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2020-07-10 నాటికి ప్రభావం[మార్చు]

2015-03-29 నాటి ప్రాజెక్టు చివరి నివేదిక ప్రకారం దాదాపు 1000 పేజీలు DLI లింకుల అధారంగా సృష్టించటం లేక విస్తరించడం జరిగింది. 2020-07-10 నాటికి దాదాపు 1146 పేజీలనుండి DLI లింకులున్నాయి. అనగా దాదాపు 5 ఏళ్లలో 146 పేజీలు అనగా సగటున సంవత్సరానికి 30 పేజీలు లేక నెలకు 3 పేజీలు మాత్రమే కొత్తగా DLI లింకులు వాడుతున్నాయి. ఆర్కైవ్.ఆర్గ్ లోని తెలుగు పుస్తకాలు( చాలావరకు నకళ్లు తొలగించిన తరువాత) వుండగా 17584 తెవికీలో వాడిన పుస్తకాలు 1033 అనగా (5.8 శాతం)మాత్రమే.

5 అంతపైగా DLI లింకులు కల పేజీలు
page_title ఉటంకించిన DLI లింకులు
జె.బాపురెడ్డి 20
సోమరాజు_రామానుజరావు 14
కొండూరు_వీరరాఘవాచార్యులు 9
దిగవల్లి_వేంకటశివరావు 9
వావిళ్ల_రామస్వామి_శాస్త్రులు_అండ్_సన్స్ 9
రాంషా 8
వేంకట్రామ_అండ్_కో 8
ఉదయపూరు_రాజ్యం 7
దివాకర్ల_వేంకటావధాని 7
ధనికొండ_హనుమంతరావు 7
ఉత్తరరామచరిత్ర 6
కవికోకిల_గ్రంథావళి 6
వేమన 6
ఓగేటి_అచ్యుతరామశాస్త్రి 5
కందుకూరి_వీరేశలింగం_పంతులు 5
చరక_సంహిత 5
న్యాయం_(నాటకం) 5
పెండ్యాల_వేంకట_సుబ్రహ్మణ్యశాస్త్రి 5
బి.ఎన్._శాస్త్రి 5
మంత్రిప్రెగడ_భుజంగరావు 5
మరుపూరు_కోదండరామిరెడ్డి 5
మానవసేవ_(పత్రిక) 5
రంగస్థల_రచయితల_జాబితా 5
పుస్తకాల వారీగా 5 లేక అంతకంటే ఎక్కువ ఉటంకింపులు గలవి
book title Number of references Archive.org(dli) link
నెల్లూరు జిల్లా గ్రామనామాలు 166 https://archive.org/details/in.ernet.dli.2015.395087
కథలు గాథలు 76 https://archive.org/details/in.ernet.dli.2015.371485
శ్రీశ్రీ సినిమా పాటలు 20 https://archive.org/details/in.ernet.dli.2015.497696
సింహావలోకనం 16 https://archive.org/details/in.ernet.dli.2015.371392
మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర 13 https://archive.org/details/in.ernet.dli.2015.497178
తెలుగు నవల 10 https://archive.org/details/in.ernet.dli.2015.387391
భారతీయ నాగరికతా విస్తరణము 10 https://archive.org/details/in.ernet.dli.2015.388006
యాత్రాచరిత్ర పూర్వ భాగము 9 https://archive.org/details/in.ernet.dli.2015.372909
ఇట్లు మీ విధేయుడు 9 https://archive.org/details/in.ernet.dli.2015.394446
పిఠాపురం సంస్థానం కవిపండిత పోషణ 9 https://archive.org/details/in.ernet.dli.2015.492155
ఆంధ్ర రచయితలు ప్రథమ భాగము 8 https://archive.org/details/in.ernet.dli.2015.387835
సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక 6 https://archive.org/details/in.ernet.dli.2015.370504
మహానుభావులు(నాటకం) 5 https://archive.org/details/in.ernet.dli.2015.328443
న్యాయం (నాటకం) 5 https://archive.org/details/in.ernet.dli.2015.372025
చారిత్రక వ్యాసములు ప్రథమ భాగము 5 https://archive.org/details/in.ernet.dli.2015.372430
రాయలసీమ చరిత్ర (మొదటి సంపుటం) 5 https://archive.org/details/in.ernet.dli.2015.492188

పై సమాచారం ఈ ప్రాజెక్టు ప్రభావాన్ని చర్చించడానికి, కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు మెరుగుగా చేయడానికి ఉపయోగకరంగా వుంటుందని తెలుపుటమైనది. --అర్జున (చర్చ) 08:05, 14 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అభ్యంతరం[మార్చు]

ఆర్కైవ్.ఆర్గ్‌లోని 17584 పుస్తకాలూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి రావనీ, కేవలం 6000 చిల్లర పుస్తకాల విషయంపైన మాత్రమే ఐదేళ్ళ క్రితం పనిచేయడం జరిగిందనీ, కాబట్టి ప్రభావాన్ని అంచనా కట్టాలన్నా, శాతాలు లెక్కకట్టాలన్నా ఈ ప్రాజెక్టు పరిధిలో కృషిచేయని 11 వేల పుస్తకాలను కూడా ఇందులోకి లెక్కవేసి చూడడం వల్ల ఇదంత ప్రయోజనకరం కాదనీ గుర్తుచేస్తున్నాను. అలాగే, 6000 పుస్తకాల్లో 1033 పుస్తకాలను వ్యాసాల్లో మూలాలుగా వినియోగించగా, 17000ల్లో 1033 అని లెక్కించడం వల్ల ప్రాజెక్టు ప్రభావాన్ని పరిశీలించేవారు తప్పుగా అంచనా కట్టే ప్రమాదమూ ఉంది. అది కాక అర్జున, రవిచంద్ర వంటి ఇతరులు తర్వాత చేసిన కృషి ఫలితంగా తెలుగులో మెటాడేటా ఏర్పడిన మరో పదకొండువేల పుస్తకాలను ఈ పద్దులో లెక్క కట్టడం ప్రాజెక్టు నిర్వాహకుడిగా నాకూ ఆమోదయోగ్యం కాబోదు. (వేరే దశలో జరిగిన కృషిని ఈ పద్దులో లెక్కవేసుకోవడం సరికాదని) ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 08:21, 14 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, మీ అభ్యంతరము పూర్తిగా నిరాధారం. DLI పుస్తకాలు మూలాలుగా వాడడం మీ ప్రాజెక్టు ముందు, తరవాత కూడా జరిగింది. అయితే ఈ విశ్లేషణ ఇక్కడ ఎందుకు చేర్చానంటే, ఇది మీ ప్రాజెక్టు పూర్తయిన తరువాత కాలానికి సంబంధించినది. మీ ప్రాజెక్టులో భాగంగా చేసిన కృషి ఎక్కువ కనుక, ఆ తరువాత సభ్యులు ఏమైనా ప్రభావితమై ఎక్కువ DLI మూలాలు చేర్చారా అన్నది విశ్లేషించటానికి. మీ ప్రాజెక్టు ముగిసిన తరువాత సభ్యులు మూలాలు చేర్చాలనుకున్నప్పుడు, ఆర్కైవ్.ఆర్గ్ లోని సంబంధిత పుస్తకాలు, అలాగే గూగుల్ వెతుకుయంత్ర ఫలితాలలో కనబడే అర్కైవ్ పుస్తకాలు వాడవచ్చు కనుక ప్రభావం అంచనా వేయటానికి ఆర్కైవ్ లోని తెలుగు DLI మూలాల సంఖ్యని వాడడమే సరియైనది.
నేను తెవికీలో చేరిన కొత్తలో తెవికీలో పుస్తక మూలాలు ఎక్కువగా లేకపోవడానికి కారణం నెట్లో తెలుగు పుస్తకాలు అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం అనుకొనేవాడిని. అందుకని DLI గురించి కృషి చేయడమైనది. కాని ఈ విశ్లేషణ తరువాత నాకనిపించేదమంటే, అది ప్రధాన కారణం కాదు అని.
విశ్లేషణపై మీ అభిప్రాయాలు అంటే DLI మూలాల పెరుగుదల అప్పటి మీ అంచనా లేక ఊహతో పోల్చటం, మూలాల ప్రస్తుత స్థితిపై మీ అభిప్రాయాలు పంచుకుంటే ఉపయోగంగావుంటుంది.-- అర్జున (చర్చ) 04:27, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
1. ప్రాజెక్టు లక్ష్యం కేవలం ఆరువేల పుస్తకాలను వెతకగలిగే వీలుండేలా అందుబాటులోకి తీసుకురావడం, తద్వారా ఆ ఆరువేల పుస్తకాల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఈ లక్ష్యాన్ని ఆరువేల పుస్తకాలు అన్న అంకె లేకుండా మదింపు వేయడం తప్పుదోవకే తీసుకుపోతుంది.
2. 2016 నుంచి కొంతకాలం పాటు ఆర్కైవ్‌లోకి చేరేంతవరకూ పుస్తకాలు అందుబాటులో లేకుండా పోయాయి మొత్తానికి. అప్పుడు ఆ ఆరువేల పుస్తకాలు కూడా అనివార్యంగా అందుబాటులో ఉండవు.
3. మీరు పనిచేసిన పన్నెండువేల పుస్తకాల పేర్ల తెలిగీకరణ 2018లో జరిగింది నాకు గుర్తున్నంతవరకూ. "మీ ప్రాజెక్టు ముగిసిన తరువాత సభ్యులు మూలాలు చేర్చాలనుకున్నప్పుడు, ఆర్కైవ్.ఆర్గ్ లోని సంబంధిత పుస్తకాలు, అలాగే గూగుల్ వెతుకుయంత్ర ఫలితాలలో కనబడే అర్కైవ్ పుస్తకాలు వాడవచ్చు కనుక ప్రభావం అంచనా వేయటానికి ఆర్కైవ్ లోని తెలుగు DLI మూలాల సంఖ్యని వాడడమే సరియైనది."
ఇన్ని సంకటాల మధ్య ఇందరు చేసిన ప్రాజెక్టులను మీరు ఈ కొలబద్దతో ఏం అంచనా వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక ప్రాజెక్టు ప్రభావాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ మదింపు వేయడానికి ఏవైనా స్టాటిస్టికల్ పద్ధతులు అవసరం. మరీ ముఖ్యంగా వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులను అంచనా వేసేప్పుడు, ఇంత సమస్యాత్మకమైన పరిస్థితులను అంచనా వేసేప్పుడు తప్పక అన్ని పరిమితులూ పరిగణించి వేయాలి. అది ప్రత్యేకించి ఒక పరిశోధన అవుతుంది. ఇలా గణాంకాలు రాసిపోస్తే అవి మదింపు చెయ్యలేవు. అభ్యంతరం నిరాధారమైనది కాదని చెప్పడానికి ఇంతకు మించి వివరించలేను. ఈ పేజీలో మీరు ఎప్పటి నుంచో మార్పులు చేస్తున్నారు, అలానే ఇప్పుడూ మీ చేర్పును వ్యతిరేకించే పని చేయలేను. సరళంగా, సూటిగా, సవివరంగా చెప్పిన నా అభ్యంతరం నిరాధారం అని కొట్టిపారేయడం మాత్రం సమంజసం కాదు. నమస్కారం. --పవన్ సంతోష్ (చర్చ) 09:31, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఎన్ని పుస్తకాలు పరిగణించాలో మీ అభిప్రాయం నా అభిప్రాయం వేరుగా వుంది. అలానే వుండనిద్దాం. కాని ప్రభావాన్ని అసలు అంచనా వేయలేము అనే దానితో ఏకీభవించలేను. గణాంకాల విశ్లేషణ ప్రాథమిక స్థాయిలో, ఉన్నతస్థాయిలో(మీరనే ఉన్నత స్టాటిస్టికల్ పద్ధతులు) లో చేయవచ్చు. ఉన్నత స్థాయిలో చేసేముందు ప్రాథమిక స్థాయిలో (సాధారణ స్టాటిస్టికల్ పద్ధతులు అనగా సగటు,మీడియన్, మోడ్) లాంటివి చేస్తారు. అసలు ప్రాథమిక విశ్లేషణ చేయటం ఎన్ని పరిమితులు వున్నా ప్రాథమికంగా మార్పులు ఏ స్థాయిలో వున్నాయా అని తెలుసుకోవటానికి. అన్నట్లు ఆర్కైవ్.ఆర్గ్ లో నవంబర్ 2016 నుండి DLI పుస్తకాలు అందుబాటులోకి రావటం ప్రారంభం కాగా DLI వెబ్సైట్ ఆగష్టు 2017 లో పనిచేయడం ఆగిపోయింది (చూడండి పేజీ లో ఇతర లభ్య స్థలాలు విభాగం).
నేను చేసిన ప్రాథమిక స్థాయిలో విశ్లేషణ ద్వారా సగటున కొత్త మూలాలుగల పేజీలు చేరిక (మొత్తం పుస్తకాల సంఖ్యతో ఇక్కడ పనిలేదు) చాలా తక్కువగా వుంది. అటువంటప్పుడు ఉన్నత స్థాయి విశ్లేషణ కాలం, వనరుల దండుగ తప్ప ఉపయోగం లేదు. ఇక నేను చూపిన ఫలితాలమీద మీ స్వంత కృషి ని కాని, అనుభవంలోకి వచ్చిన ఇతరుల కృషి ని పరిగణించియైనా మీ అభిప్రాయం ఏమి తెలుపలేదు. అది విచారకరం. --అర్జున (చర్చ) 09:35, 22 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రాజెక్టు గురించి చదువరి అభిప్రాయం[మార్చు]

ఈ ప్రాజెక్టు గురించి నేను వివరంగా తెలుసుకున్నది ఇప్పుడే. గతంలో దీని గురించి విన్నానే గానీ అంతగా పరిశీలించలేదు. ముందుగా ఒక్క విషయం: ఒక ప్రాజెక్టు ద్వారా వెయ్యికి పైగా వ్యాసాలు సృష్టించడం గానీ, విస్తరించడం గానీ జరిగిందంటే అది చిన్న విషయం కాదు. ఈ పనికి సంకల్పించి ప్రాజెక్టును రూపొందించిన పవన్ గారికీ, అలాగే ఈ ప్రాజెక్టులో పనిచేసిన కింది వారందరికీ పేరుపేరునా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరంతా కలిసి చేసినది మూలాలు ఎక్కడుంటాయో చెప్పడం, ఏయే పుస్తకాలు ఉన్నాయో చెప్పడం, ఏయే అంశాలకు చెందిన పుస్తకాలున్నాయో చెప్పడం. మంచి పని చేసారు.

పవన్ సంతోష్, రాజశేఖర్1961, భూక్యా గోపినాయక్, పి.వి.రామారావు, నాయుడుగారి జయన్న, వాడుకరి:లక్ష్మీదేవి, మీనా గాయత్రి, వెంకటరమణ, స్వరలాసిక, ప్రణయ్ రాజ్, విశ్వనాధ్.బి.కె., పాలగిరి

అర్జున గారూ, గణాంకాలు వెలికితీసినందుకు మీక్కూడా ధన్యవాదాలు. వాటి వలన మన దశ, దిశ మనకు అర్థమౌతాయి. ఐదేళ్ళలో 146 ఉటంకింపులే ఉన్నాయని చెబుతూ "కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు మెరుగుగా చేయడానికి ఉపయోగకరంగా వుంటుందని తెలుపుటమైనది." అని అన్నారు. వాడుక గణాంకాల్లో సంఖ్యలు చిన్నవిగా కనబడినంత మాత్రాన ప్రాజెక్టు విలువేమీ తగ్గిపోదు కదా! తక్కువ ఉటంకింపులు రావడానికి ప్రాజెక్టు రూపకల్పనే కారణమా, ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా చూడాలి. ఇప్పుడూ.., ఈ ప్రాజెక్టు జరిగేటప్పుడు కాకపోయినా గత నాలుగేళ్ళుగా నేను చురుగ్గానే ఉంటున్నానండి. దీని గురించి విన్నాను గానీ ఇంత వివరంగా ఇప్పటిదాకా తెలియదు. మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇవ్వాళే చూసాను. పాతవాణ్ణి నాకే సరిగ్గా తెలీక పోతే, ఇక కొత్త వాళ్ళకు ఎలా తెలుస్తుంది? ఎలా వాడుకుంటారు?

ప్రాజెక్టు చేసినవాళ్ళు తాము తలపెట్టిన పని చేసేసారు. చక్కగా చేసారు. (దానిలో ఇంకా మెరుగు పరచాల్సినవి ఉంటే ఉండవచ్చు. అవేమైనా ఉంటే చెప్పండి, లేదా చేసెయ్యండి.) ఇప్పుడిక ఆ ప్రాజెక్టు ఫలాలను వికీ కోసం ఎలా వాడుకోవాలా అని అందరం ఆలోచించాలి. ఈ గణాంకాలు అంటూ ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ పెట్టారు కాబట్టి (విశాఖపట్నం పేజీలో మూలంపై చర్చకు మూలం ఇదే అయ్యుండవచ్చని నాకు ఇప్పుడు అనిపిస్తోంది), ఇంతటితో ఆపకుండా, దాన్ని వికీకి మరింత ఉపయోగపడేలా ముందుకు తీసుకెళ్ళండి. ఏం చెయ్యాలో ఆలోచించి చెయ్యండి.

 1. "స్వాగతం" మూసలో దీని గురించి చేర్చండి.
 2. మూలాలు గురించి చెప్పే వ్యాసంలో గానీ, మూలాల గురించి ఉన్న ఇతర వ్యాసాల్లో గానీ దీని గురించి చెప్పండి.
 3. "మూలాలు అవసరం", "మూలాలు చేర్చండి" అంటూ వ్యాసాల్లో మూసలు పెడుతూంటాం గదా.. వాటిలో ఈ ప్రాజెక్టుకు లింకు ఇవ్వండి.
 4. మూలాలు చేర్చండి అంటూ వాడుకరులకు పంపించే గమనింపు మూసలు ఉంటాయి గదా.., వాటిలో ఈ లింకులు చేర్చండి.
 5. వర్గాల పేజీల్లో - ఆ వర్గం లోని పేజీలకు సంబంధించి మరింత సమాచారం దొరికే పుస్తకాల జాబితా ఇది అని అంటూ ఈ జాబితాల్లోంచి ఉప జాబితాలు తయారు చేసి పెట్టండి. ఉదాహరణకు తెలుగువారు అనే వర్గం, ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, తెలంగాణ వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భౌగోళిక వ్యాసాలు, తెలుగువారి ఆచార వ్యవహారాలు, సినిమా వ్యక్తులు, రాయలసీమ గురించిన వ్యాసాలు, వవసాయం గురించిన వ్యాసాలు ఇలా వివిధ వర్గాల్లోని పేజీలకు సమాచారం దొరికే పుస్తకాలు అంటూ ఉపజాబితాలు తయారు చేసి ఆయా వర్గాల పేజీల్లో పెట్టండి.
 6. ఇలాంటివి ఇంకా ఆలోచనలుంటే వాటిని కూడా అమల్లోకి పెట్టండి.

ఇవేమీ చెయ్యకపోతే, ఈ ప్రాజెక్టు గురించీ ఈ పుస్తకాల గురించీ జనానికి తెలియదు, వాడుక గణాంకాలూ పెరగవు. ఇవి చేస్తే పెరుగుతాయని గ్యారంటీ ఇవ్వలేకపోవచ్చు. కానీ, వాడుకరులకు ఉపకరించే ఒక సాధనాన్ని ఇస్తున్నామని మాత్రం చెప్పగలను.

అన్నీ ప్రాజెక్టు చేసినవాళ్ళే చెయ్యాలంటే కుదరదు. పై పనులన్నిటినీ ఒక ప్రాజెక్టుగా చేసి, మీరే పని మొదలుపెట్టండి. ఆసక్తి ఉన్నవాళ్ళు మీతో కలుస్తారు. మీరు ప్రాజెక్టుకు రూపుదిద్ది, పని మొదలు పెడితే నేను మీతో కలుస్తాను. మీరే చెయ్యండని ఎందుకు చెబుతున్నానంటే - ఒకటి: మీరు ఈ పని మొదలుపెట్టారు కాబట్టి, రెండు: మనందరికీ బాగా తెలిసిన సంగతి ఒకటుంది.. మన సముదాయం బలహీనంగా ఉందనీ అంచేత ఇక్కడ పనులు "చెబితే" కావు, "చేస్తేనే" అవుతాయనీ. __చదువరి (చర్చరచనలు) 15:30, 22 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు మీ స్పందనకు ధన్యవాదాలు. కొంత స్పష్టత ఇవ్వాలనిపించి రాస్తున్నాను. ప్రాజెక్టు కాలంలో జరిగిన కృషిని తక్కువచెయ్యాలని కాని, పాలుపంచుకున్న వారిని కించపరచే ఉద్దేశ్యం నాకు లేదు. తెవికీ దశ, దిశకు సహకరించే భాగంలో ఈ విశ్లేషణ, నా ఇతర విశ్లేషణలు. ఇక చర్చ:విశాఖపట్నంలో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మూలం ప్రస్తావనకి రావడం కేవలం కాకతాళీయమే. ఆ వ్యాసంలో మార్పుల క్రమం పరిశీలించితే తెలుస్తుంది. ఇక ఇంకోసంగతి ప్రాజెక్టు ముగిసిన తరువాత ఈ ప్రాజెక్టు విలువ పెంచడానికి నా కన్నా ఎక్కువ కృషి చేసినవారు లేరని ధృఢంగా చెప్పగలను. ఇక మీ సలహాలో పేర్కొన్న ఆలోచనలు నేను తెలుగు వికీలో ప్రారంభమై క్రియా శీలమైన దశలో(2012-13) నాకూ వుండేవి. అయితే ఇన్నేళ్ల అనుభవం తరువాత, మీ సూచనల అమలు కృషికి దగ్గ ఫలితం ఇవ్వదని నా నమ్మకం. ఎందుకంటే ఇతర ప్రాజెక్టులకంటే ఈ ప్రాజెక్టు ప్రచారం ప్రత్యేకంగా చేపట్టకుండానే వికీసభ్యులకి తెలుస్తుంది. వ్యాసాలు చదివినపుడు DLI మూలాల లింకులు తప్పక కనబడుతాయి. ఆర్కైవ్ కు వెళ్లినప్పుడు, ఇతర సంబంధిత పుస్తకాలు కనబడతాయి. ఏదైనా వ్యాసం గురించి మూలాల కోసం వెతికినపుడు గూగుల్ ద్వారానూ పుస్తకాలు కనబడతాయి. ఇక తెలుగువికీగురించిన ప్రచార కార్యక్రమాలలో మూలాల గురించి తెలిపినపుడు, దీని ప్రస్తావన తప్పక వుంటుంది. ఇక మీలాగా క్రియాశీలంగా వున్నవాళ్లు కూడా DLI మూలాలు చేర్చలేదంటే, ఇతర ప్రాధాన్యతలు కాని వేరే ఇతర కారణాలు కాని వుండవచ్చు వాటిగురించి మీరు ఇతర క్రియాశీలక సభ్యులు స్పందిస్తే, తదుపరి కృషికి ఉపయోగం. అలా కాక మీ సలహా ఎవరైనా ముందుకి తీసుకెళ్లి మంచి ఫలితాలు పొందితే అభినందనలు తెలపడానికి నేనే ముందుంటాను. --అర్జున (చర్చ) 04:58, 24 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, "..మీలాగా క్రియాశీలంగా వున్నవాళ్లు కూడా DLI మూలాలు చేర్చలేదంటే,.." - మీరు పట్టించుకోలేదు గానీ, నా కారణం నేను చెప్పేసాను -నాకు ఈ ప్రాజెక్టు గురించి వివరంగా తెలవలేదు అని. ప్రాజెక్టు విలువ పెంచడానికి ఎంతో కృషిచేసి కూడా మీరు పైన రాసిన ముక్కలు రాసారంటే దానర్థం అసలు ఈ ప్రాజెక్టు అయిన తరువాత దీని విలువ పెంచడానికి మీరు చేసిన విశేషమైన కృషి (ఏం చేసారో నిజంగా నాకు తెలియదు) అంతా దండగే అని మీరే అన్యాపదేశంగా చెప్పినట్టు.
వీటన్నిటినీ బట్టి చూస్తే అసలు ఈ ప్రాజెక్టు విలువేంటో, ఈ ప్రాజెక్టు పట్టికల్లోని మూడవ, నాలుగవ కాలముల విలువేంటో మీకు గ్రహింపుందా అనే సందేహం కలుగుతోంది నాకు. __చదువరి (చర్చరచనలు) 05:15, 24 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]