7వ లోక్‌సభ
స్వరూపం
(7వ లోక్ సభ నుండి దారిమార్పు చెందింది)
7వ లోక్ సభ, (1980 జనవరి 18 – 1984 డిసెంబరు 31) 1980 లో జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పడింది. ఈ ఎన్నికలలో రాజ్యసభ నుండి 9 మంది సిట్టింగ్ సభ్యులు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైనారు.[1] 1980 జనవరి 14న భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ ఎన్నికలలో భారత కాంగ్రెస్ తో పాటు దాని మిత్ర పక్షాలకు మొత్తం 373 సీట్లు వచ్చాయి. ఈలోక్‌సభలో 6వ లోక్‌సభలో కన్నా 286 సీట్లు అధికంగా వచ్చాయి. 1984 అక్టోబరు 31 న ఇందిరా గాంధీ హత్య తరువాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాడు. 8వ లోక్‌సభ 1984 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 1984 డిసెంబరు 31న ఏర్పడింది. ఈ సభలో సుమారు 9.3% సభ్యులు ముస్లింలు. భారత దేశ చరిత్రలో 7వ లోక్‌సభలో అత్యధికంగా ముస్లిం పార్లమెంటు సభ్యులు ఎన్నికైనారు.[2]
ముఖ్యమైన సభ్యులు
[మార్చు]- స్పీకర్:
- బలరాం జక్కర్ - 1980 జనవరి 22 - 1985 జనవరి 15
- డిప్యుటీ స్పీకర్:
- జి.లక్ష్మణన్ - 1980 డిసెంబరు 1 - 1984 డిసెంబరు 31
- సెక్రెటరీ జనరల్:
- అవతార్ సింగ్ రికీ - 1980 జనవరి 10 - 1983 డిసెంబరు 31
- సుభాష్ సి కశ్యప్ - 1983 డిసెంబరు 31 -1984 డిసెంబరు 31
ఎన్నికైన వివిధ పార్టీల సభ్యులు
[మార్చు]S.No. | Party Name | Number of MPs |
---|---|---|
1 | భారత జాతీయ కాంగ్రెస్ (INC) | 377 |
2 | జనతాదళ్ (ఎస్) | 43 |
3 | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (CPI (M) ) | 39 |
4 | జనతా పార్టీ | 17 |
5 | ద్రవిడ మున్నేట్ర కఝగం (DMK) | 16 |
6 | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) | 14 |
7 | భారతీయ జనతా పార్టీ (BJP) | 13 |
8 | భారత జాతీయ కాంగ్రెస్ (సోషలిస్టు) | 10 |
9 | Unattached (Unattached) | 7 |
10 | జమ్మూ&కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKN) | 5 |
11 | స్వతంత్రులు | 4 |
12 | రివల్యూషనరి సోషలిస్టు పార్టీ (RSP) | 4 |
13 | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కఝగం (AIADMK) | 3 |
14 | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) | 3 |
15 | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) | 2 |
16 | నామినేటెడ్ చేయబడినవారు | 2 |
17 | తెలుగు దేశం పార్టీ (TDP) | 2 |
18 | ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (APHLC) | 1 |
19 | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | 1 |
20 | జనతాదళ్ | 1 |
21 | కేరళ కాంగ్రెస్ | 1 |
7వ లోక్‌సభ సభ్యులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. Retrieved 29 August 2017.
- ↑ Das, Shaswati (18 May 2014). "Poll data shows large number of Muslims voted for Modi". India Today. New Delhi. Retrieved 23 May 2014.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో 7th Lok Sabha membersకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.