కాజీపేట రైల్వే స్టేషను
కాజీపేట | |
---|---|
భారతీయ రైల్వే జంక్షన్ స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | మెయిన్ రోడ్డు, కాజీపేట భారత దేశము |
Coordinates | 17°58′26″N 79°30′40″E / 17.974°N 79.511°E |
Elevation | 292 మీటర్లు (958 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వే |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే |
లైన్లు | కాజీపేట-హైదరాబాద్ రైలు మార్గము కాజీపేట-విజయవాడ రైలు మార్గము కాజీపేట-నాగపూర్ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 3 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | భూమి మీద ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
Bicycle facilities | లేదు |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | KZJ |
డివిజన్లు | సికింద్రాబాదు |
History | |
Opened | 1874 , 1889 మధ్య |
కాజీపేట రైల్వే స్టేషను తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణ జిల్లా యందలి కాజీపేటలోగల రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనిది.
చరిత్ర
[మార్చు]1929 లో కాజీపేట-బల్లార్షా లింకు పూర్తయిన తరువాత చెన్నై కూడా నేరుగా ఢిల్లీతో కలుపబడింది.[1]
వాడి-సికింద్రాబాదు లైను 1874 లో నిర్మించబడింది. ఈ లైను నిజాం ద్వారా ఆర్థిక సహాయం చేయబడింది. ఆ తర్వాత ఇది నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేలో ఒక భాగమైనది. 1889 లో ప్రధాన నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లైన్ విజయవాడ (అప్పటికి బెజవాడ అనేవారు) వరకు పొడిగించబడింది.[2]
1909 లో "గ్రేట్ ఇండియా పెనిష్యులా రైల్వేలోని వాడి నుండి, నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే తూర్పున వరంగల్ వరకు, తరువాత బెజవాడ వరకు కలుపబడింది".[3]
విద్యుదీకరణ
[మార్చు]డోర్నకల్-ఖాజీపేట సెక్టరు 1988-89 ప్రాంతంలో విద్యుదీకరణ చేయబడింది. ఖాజీపేట-రామగుండం సెక్టర్ 1987-88 లోనూ, ఖాజీపేట-సికింద్రాబాదు సెక్టరు 1991-93 లోనూ విద్యుదీకరింపబడింది.[4]
సదుపాయాలు
[మార్చు]ఖాజీ పేట రైల్వే స్టేషను రిజర్వేషను సౌకర్యం కంప్యూటరీకరింపబడింది. రిజర్వేషను కౌంటర్లు, రిటైరింగ్ గది, విశ్రాంతి గది, శాకాహార, మాంసాహార భోజన వసతి, పుస్తక దుకాణాలు ఉన్నాయి.[5]
ఆర్థిక లాభం
[మార్చు]సింగరేణి, కోతగూడెం, బెల్లంపల్లి, బల్హర్షా గనుల నుండి బొగ్గు రవాణా, సరుకు రవాణాలో 40 శాతం పనులు వరకు కాజీపేట-బల్హర్షా విభాగంలో రైల్వేలు నిర్వహించ బడతాయి.[6]
లోకో షెడ్లు
[మార్చు]కాజీపేటలో డబ్ల్యుడిఎం-2, డబ్ల్యుడిఎం-3ఎ, డబ్ల్యుడిజి-4 లోకోల కొరకు డీజిల్ లోకో షెడ్స్ ఉన్నాయి. 2006 లో ప్రారంభించబడిన కాజిపేట్ ఎలెక్ట్రిక్ లోకో షెడ్ లో 150 కి పైగా డబ్ల్యుఎజి-7 ఎలక్ట్రికల్ లోకోలను నిలుపుదల చేయగల సామర్ధ్యం కలిగి ఉంది. కాజీపేట వద్ద ఒక కోచింగ్ నిర్వహణ డిపో ఉంది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "IR History: Early Days – III". Chronology of railways in India, Part 3 (1900-1947). Retrieved 26 November 2013.
- ↑ "[IRFCA] Indian Railways FAQ: IR History: Early Days - 2". www.irfca.org. Retrieved 2019-11-05.
- ↑ "Hyderabad - Imperial Gazetteer of India". IRFCA. Retrieved 26 November 2013.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 26 November 2013.
- ↑ "Kazipet to Visakhapatnam trains". Make My Trip. Retrieved 26 November 2013.
- ↑ Economic History of Hyderabad State: Warangal Suba, 1911-1950, by V.Ramakrishna Reddy, p. 582<
- ↑ "Sheds and Workshops". IRFCA. Retrieved 26 November 2013.
ఇతర లింకులు
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
కాజిపేట్ రైల్వే స్టేషనులో 1,2 ప్లాట్ ఫారములు.
వెలుపలి లంకెలు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే | ||||
దక్షిణ మధ్య రైల్వే |