ముస్లిం ప్రపంచం

వికీపీడియా నుండి
(ఇస్లామిక్ దేశాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

Countries with more than 5% Muslim population.[1]     Sunni     Shia   Ibadi
దస్త్రం:IslamicWorldNusretColpan.jpg
ప్రపంచంలో గల మస్జిద్ లను చూపించే ఒక మీనియేచర్.

ముస్లిం ప్రపంచం లేదా ఇస్లామీయ ప్రపంచం అనగా ప్రపంచంలో నివసించే ముస్లిం సముదాయం లేదా ఉమ్మహ్.

ది ఫోరం ఆన్ రెలిజియన్ అండ్ పబ్లిక్ లైఫ్ 2009 నివేదిక విశేషాలు

[మార్చు]

ప్రపంచంలో 220 కోట్ల మంది క్రైస్తవులున్నారు.ముస్లిం జనాభా 157 కోట్లు. 232 దేశాల్లో ముస్లిమున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ముస్లిం.లెబనాన్ కంటే జర్మనీలోనే ఎక్కువగా ముస్లింలు .సిరియాలో కంటే చైనాలోనే ఎక్కువ మంది ముస్లింలున్నారు. జోర్డాన్, లిబియా రెండు దేశాల్లో ఉన్న ముస్లింల కంటే రష్యాలోనే ఎక్కువమంది ముస్లింలు ఉన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో ఉన్నంతమంది ముస్లింలు ఇథియోపియాలోనూ ఉన్నారు.దీన్ని బట్టి ముస్లింలు అంటే అరబ్‌లు అనేదానికి ఇక అర్థం లేదు.మొత్తం ముస్లింలలో 60 శాతం మంది ఆసియాలోనే ఉన్నారు.మరో 20 శాతం మంది మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లోనూ, 15 శాతం మంది ఆఫ్రికాలోని సబ్ సహారా ప్రాంతంలోనూ, 2.4 శాతం మంది యూరప్‌లోనూ, 0.3 శాతం మంది అమెరికాలోనూ ఉన్నారు.ఆసియాలో ముస్లింలు అధికంగా ఉన్న దేశాలే ఎక్కువ.ఇస్లాం ప్రధాన మతంగాలేని దేశాల్లోనే సుమారు ఐదో వంతు ముస్లింలు (31.7 కోట్లు) ఉన్నారు.ముస్లింలను మైనారిటీలుగా పరిగణిస్తున్న ఐదు దేశాల్లోనే (భారత్‌లో 16.1 కోట్లు, ఇథియోపియాలో 2.8 కోట్లు, చైనాలో 2.2 కోట్లు, రష్యాలో 1.6 కోట్లు, టాంజానియాలో 1.3 కోట్లు) ప్రపంచ ముస్లింలలో 3/4 వ వంతుమంది ఉన్నారు.ఇండోనేషియాలో అత్యధికంగా 20.3 కోట్ల మంది ముస్లింలు ఉండగా, మూడోస్థానంలో ఉన్న భారత్‌లో 16.1 కోట్ల మంది ఉన్నారు. అయినప్పటికీ హిందూ దేశమైన భారత్‌లో వీరి జనాభా 13 శాతమే. మొత్తం ముస్లింలలో 2/3 వంతు మంది పది దేశాలలో కేంద్రీకృతమై ఉండగా, అందులో ఆరు దేశాలు ఆసియాలోనే ఉన్నాయి. మిగిలిన మూడు ఉత్తర ఆఫ్రికాలో, ఒకటి ఆఫ్రికాలోని సబ్ సహారన్ ప్రాంతంలో ఉన్నాయి.ముస్లింలలో 10 నుంచి 13 శాతం మంది షియాలు ఉన్నారు. షియాల్లో 80 శాతం మంది నాలుగు దేశాలలో (ఇరాన్, పాకిస్థాన్, భారత్, ఇరాక్) ఉన్నారు.[2] దాదాపు 85% సున్నీ ముస్లింలు, 15% షియా ముస్లింలు.ఇస్లామీయ దేశాలు దాదాపు 50 గలవు. ముస్లింల జనాభాలో 20% వరకు అరబ్బులు గలరు. ఆసియా ఖండంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. అందులోనూ దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా దేశాలైన ఇండోనేషియా, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ముస్లింల జనాభా అధికంగా కానవస్తుంది. ఈ ఉదహరించిన దేశాలలో ప్రతిదేశంలోనూ 10 కోట్ల జనాభాకంటే అధికంగా ముస్లింలు కానవస్తారు.[3] అమెరికా ప్రభుత్వ 2006 లెక్కల ప్రకారం చైనాలో దాదాపు 2కోట్ల మంది ముస్లింలు గలరు.[4] మధ్య ప్రాచ్యములో అరబ్బేతర దేశాలైన టర్కీ, ఇరాన్ దేశాలు పెద్ద ముస్లింమెజారిటీ గల దేశాలు; ఆఫ్రికాలో, ఈజిప్టు, నైజీరియా దేశాలలో అధిక ముస్లిం జనాభా గలదు.[3] అనేక యూరప్ దేశాలలో క్రైస్తవం తరువాత, ఇస్లాం అతి పెద్ద రెండవ మతం.[5]

ఇస్లామిక్ దేశాలు, ప్రపంచంలో దాదాపు 55 ఇస్లామిక్ దేశాలున్నాయి. వాటి పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి.

  1. ఆఫ్ఘనిస్తాన్
  2. అల్బేనియా
  3. అల్జీరియా
  4. అజర్‌బైజాన్
  5. బహ్రయిన్
  6. బంగ్లాదేశ్
  7. బెనిన్
  8. బ్రూనై
  9. బర్కినాఫాసో
  10. కామెరూన్
  11. చాద్
  12. కొమొరోస్
  13. జిబౌటి
  14. ఈజిప్టు
  15. గాంబియా
  16. గినియా
  17. గినియా బిస్సో
  18. గయానా
  19. ఇండోనేషియా
  20. ఇరాన్
  21. ఇరాక్
  22. జోర్డాన్
  23. కజకస్తాన్
  24. కువైట్
  25. కిర్గిజిస్తాన్
  26. లెబనాన్
  27. లిబియా
  28. మలేషియా
  29. మాల్దీవులు
  30. మాలె
  31. మారిటానియా
  32. మొరాకో
  33. మొజాంబిక్
  34. నైగర్
  35. నైజీరియా
  36. ఒమన్
  37. పాకిస్తాన్
  38. పాలస్తీనా
  39. కతర్
  40. సౌదీఅరేబియా
  41. సెనెగల్
  42. సియెర్రాలియోన్
  43. సోమాలియా
  44. సూడాన్
  45. సురినామ్
  46. సిరియా
  47. తజకిస్తాన్
  48. ట్యునీషియా
  49. టర్కీ
  50. తుర్కమేనిస్తాన్
  51. ఉగాండా
  52. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  53. ఉజ్బెకిస్తాన్
  54. వెస్టర్న్ సహారా పశ్చిమ సహారా
  55. యెమన్
ముస్లిం మెజారిటీగల దేశాలు
మతము, రాజ్యము, ముస్లిం మెజారిటీగల దేశాలు.
  ఇస్లామిక్ రాజ్యము: Adopted Islam as the ideological foundation for their political institution.
  రాజ్య మతము: Religious body or creed officially endorsed by the state.
  సెక్యులర్ రాజ్యము: Officially neutral in matters of religion, neither supporting nor opposing any particular religions.
  No Declaration: No announcement formally or officially.

విశేషాలు

[మార్చు]
  • దార్ ఉల్ ఇస్లాం = అరబ్బీ భాషలో సలాం అంటే శాంతి అని అర్థం. దార్ ఉల్ ఇస్లాం ఆంటే శాంతియుత సీమ అని అర్థం. ఇందుకు విరుద్ధమైనది దార్ ఉల్ హర్బ్.
  • దార్ ఉల్ హర్బ్ = అరబ్బీ భాషలో దార్ ఉల్ హర్బ్ అంటే యుద్ధ భూమి. దార్ ఉల్ ఇస్లాం అను పదజాలం ఇందుకు విరుద్ధం. ముస్లింల దృష్టిలో నాస్తికులు (కాఫిర్ లేదా అవిశ్వాసులు లేదా తిరస్కారులు) గల ప్రదేశాలు.

ముస్లింలు గల నాన్-ఇస్లామిక్ దేశాలు

[మార్చు]

ఈ దేశాలు ప్రధానంగా సెక్యులర్ దేశాలు.


ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Source for distribution is the CIA World Factbook, Shiite/Sunnite distribution collected from other sources. Shiites may be underrepresented in some countries where they do not appear in official statistics.
  2. ఆంధ్రజ్యోతి 2009 అక్టోబరు 8[permanent dead link]
  3. 3.0 3.1 "Number of Muslim by country". nationmaster.com. Retrieved 2007-05-30.
  4. "International Religious Freedom Report 2006—China (includes Tibet, Hong Kong, and Macau)". U.S. department of State, Bureau of Democracy, Human Rights, and Labor. 2006. Retrieved 2007-05-30.
  5. See:
    • Esposito (2004) pp.2,43
    • "Islamic World". Encyclopaedia Britannica Online.
    "Major Religions of the World Ranked by Number of Adherents". Adherents.com. Archived from the original on 2008-06-15. Retrieved 2007-01-09.