చలనాట రాగము
Appearance
(చలనాట నుండి దారిమార్పు చెందింది)
చలనాట రాగము కర్ణాటక సంగీతంలో 36వ మేళకర్త రాగము.[1]ముత్తుస్వామి దీక్షితులు కూడా ఇదే పేరుతో పిలుస్తారు.[2]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ: స రిగా మ ప ధని స
- (S R3 G3 M1 P D3 N3 S)
- అవరోహణ: సని ధ ప మగా రి స
- (S N3 D3 P M1 G3 R3 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : షడ్జమం, షట్స్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, షట్స్రుతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 72వ మేళకర్త రాగమైన రసికప్రియ రాగానికి శుద్ధ మధ్యమ సమానం.
జన్య రాగాలు
[మార్చు]చలనాట రాగానికి రెండు బహుళ ప్రాచుర్యం పొందిన జన్య రాగాలు ఉన్నాయి. అవి నాట, గంభీరనాట రాగాలు. ముఖ్యంగా నాట రాగంలోని కృతులు ఎక్కువగా కచేరీలలో వినిపిస్తాయి.[3]
- ఉదాహరణ
- నాగాత్మజ - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
నాట రాగం
[మార్చు]- ఉదాహరణ
- జగదానంద కారక - త్యాగరాజ స్వామి కీర్తన