Jump to content

అమ్రోహా జిల్లా

వికీపీడియా నుండి
(జ్యోతిబా ఫూలే నగర్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
అమ్రోహా జిల్లా
अमरोहा ज़िला
ضلع امروہہ
ఉత్తర ప్రదేశ్ పటంలో అమ్రోహా జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో అమ్రోహా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుమొరాదాబాద్
ముఖ్య పట్టణంఅమ్రోహా
విస్తీర్ణం
 • మొత్తం2,321 కి.మీ2 (896 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం14,99,193
 • జనసాంద్రత650/కి.మీ2 (1,700/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత50.21%[1]
Websiteఅధికారిక జాలస్థలి
అమ్రోహాలో రౌజా హజ్, షా అబ్బాస్ బదర్-ఎ-చిస్తీ

అమ్రోహా జిల్లా, ఉత్తర ప్రదేశ్ లోని జిల్లా. గతంలో దీన్ని " జ్యోతిబా ఫూలే నగర్ జిల్లా" అనేవారు.[2] అమ్రోహా పట్టణం, ఈ జిల్లాకు కేంద్రం. 2001 సాంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్లాను అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా ఉన్న జిల్లాగా గుర్తించింది.[3]

సరిహద్దులు

[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులో బిజ్నౌర్, తూర్పు సరిహద్దులో మొరాదాబాద్, దక్షిణ సరిహద్దులో బదాయూన్, పశ్చిమ సరిహద్దులో గంగానది తీరంలో బులంద్‌షహర్, ఘజియాబాద్, మీరట్ జిల్లాలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

జిల్లా ప్రాంతాన్ని పూర్వం మొగలు సామ్రాజ్యానికి సామంతులు అయిన సంబల్ సర్కార్ ఆక్రమించింది. తరువాత ఈ ప్రాంతం అవధ్ అధీనంలోకి వెళ్ళింది. 1801లో ఈ ప్రాంతం మీద అధికారాన్ని అవధ్ నవాబు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చాడు. 1997 ఏప్రిల్ 24 న మొరాదాబాద్ జిల్లా నుండి అమ్రోహా, ధనోరా, హస్నాపూర్ తాలూకాలను వేరుచేసి ఈ జిల్లాను ఏర్పరచారు. ముందు ఈ జిల్లాకు " అమ్రోహా " అనే పేరు ఉండేది. తరువాత దానిని అమ్రోహా జిల్లాగా మార్చారు..[2]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 18,38,771, [4]
ఇది దాదాపు. కొసొవొ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. నెబ్రాస్కా నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 258 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 818 [4]
2001-11 కుటుంబ నియంత్రణ శాతం. 22.66%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 907:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 65.7%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10.
  2. 2.0 2.1 "Important Cabinet Decisions". Lucknow: Information and Public Relations Department. Archived from the original on 24 అక్టోబరు 2014. Retrieved 17 January 2013.
  3. "Press Information Bureau English Releases". Pib.nic.in. Retrieved 2012-06-13.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Kosovo 1,825,632 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341