ధేనుక రాగము
Appearance
(ధేనుక నుండి దారిమార్పు చెందింది)
ఆరోహణ | S R₁ G₂ M₁ P D₁ N₃ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₃ D₁ P M₁ G₂ R₁ S |
ధేనుక రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 9వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో దీనిని "ధునిబిన్నషడ్జం" అని అంటారు.[2] [3]
రాగ లక్షణాలు
[మార్చు]ఇది 2వ నేత్ర చక్రలో 3వ రాగం. దీని ధారణాపరమైన పేరు "నేత్ర-గో"
ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G2 M1 P D1 N3 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D1 P M1 G2 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కాకళి నిషాధం. ఇది 45 మేళకర్త శుభపంతువరాళి రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
అసంపూర్ణ మేళకర్త రాగం
[మార్చు]ధునిబిన్నషడ్జం రాగం వెంకటమఖిన్ స్వరపరచిన వాస్తవ జాబితాలో 9వ మేళ కర్త రాగం. ఈ రాగం నోట్స్ ధేనుక రాగానికి అమానంగా ఉంటాయి. [4]
ఉదాహరణలు
[మార్చు]చాలామంది వాగ్గేయకారులు ధేనుక రాగంలో కీర్తనల్ని రచించారు.
- తెలియలేదు రామా - త్యాగరాజ స్వామి వారి కీర్తన
- రావయ్య రామా - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
జన్య రాగాలు
[మార్చు]ధేనుక రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.
మూలాలు
[మార్చు]- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
- ↑ Shree Muthuswami Dikshitar Keerthanaigal, by A Sundaram Iyer, Music Book Publishers, Mylapore, Chennai
బాహ్య లంకెలు
[మార్చు]- "9 | Dhenuka | Nethra Chakra | Melakarta Ragas | Listen Learn Sing | Indian Classical | G Srikanth | - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.
- "KJ Yesudas Teliyaleru rama bhakti Dhenuka Raga Tyagaraja Kriti - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.