రూపవతి రాగము
Appearance
రూపవతి రాగము కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 12వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్నాటక సంగీత పాఠశాశాలలో అదే పేరుతో ఉన్న రాగాలలో ఇది ఒకటి. [2]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- S R₁ G₂ M₁ P D₃ N₃ Ṡ[a]
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- Ṡ N₃ D₃ P M₁ G₂ R₁ S[b]
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, షట్చ్రుతి ధైవతం, కాకళి నిషాధం. ఇది 48 మేళకర్త దివ్యమణి రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
[మార్చు]చాలామంది వాగ్గేయకారులు రూపవతి రాగంలో కీర్తనల్ని రచించారు.
- నీ మొర బెట్టిన - త్యాగరాజ స్వామి
- శ్రీ కృష్ణ భజరే - ముత్తుస్వామి దీక్షితార్
- పాలయమాం శ్రీ పర్వత నందిని : మంగళంపల్లి బాలమురళీకృష్ణ
జన్య రాగాలు
[మార్చు]రూపవతి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.