లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం
లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం | |
---|---|
అధికార నామం | లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం |
ప్రదేశం | మూలమల్ల, ఆత్మకూర్ మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ |
అక్షాంశ,రేఖాంశాలు | 16°18′47″N 77°46′38″E / 16.31306°N 77.77722°E |
ఆవశ్యకత | విద్యుత్ |
స్థితి | వాడుకలో ఉంది |
నిర్మాణం ప్రారంభం | 2008 నవంబరు 13 |
నిర్మాణ వ్యయం | 1474.83 కోట్లు |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | కృష్ణా నది |
లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | టి.ఎస్. జెన్‌కో |
Type | Run-of-the-river |
టర్బైన్లు | 6 x 40 మెగావాట్లు (54,000 హెచ్.పి) పెల్టన్ టర్బైన్లు[1] |
Installed capacity | 240 మెగావాట్లు (3,20,000 హెచ్.పి) |
Website http://tsgenco.telangana.gov.in/ |
లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రం, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా, ఆత్మకూర్ మండలం, మూలమల్ల గ్రామంలో ఉన్న జలవిద్యుత్ కేంద్రం.[2]
చరిత్ర
[మార్చు]2008లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభించబడి, 2016లో పూర్తయింది. ఇందులో 6 యూనిట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 40 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. మొదటి యూనిట్ 2013 డిసెంబరులో సింక్రొనైజ్ చేయబడగా, రెండవ యూనిట్ 2014 జనవరిలో సింక్రొనైజ్ చేయబడింది. గ్రిడ్‌కు కనెక్ట్ చేయబడింది.[3]
2016 జూలై 28న మూడవ, నాలుగవ యూనిట్లు ప్రారంభించబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర జెన్‌కో ద్వారా ధ్రువీకరించబడిన ప్రతి యూనిట్‌కు 40 మెగావాట్స్ వాణిజ్య కార్యకలాపాలను ప్రకటించారు. టీఎస్ జెన్‌కో 80 మెగావాట్లను గ్రిడ్‌కు జోడించడం వల్ల ఈ రెండు యూనిట్ల ద్వారా రద్దీ సమయాల్లో 120 మెగావాట్లు, నదిలో ఓవర్‌ఫ్లో ఉన్నప్పుడు అదనపు విద్యుత్‌ను సరఫరా చేసే పరిస్థితి ఏర్పడుతుంది.[4]
యూనిట్ల ప్రారంభ వివరాలు
[మార్చు]- యూనిట్ 1: 2013 డిసెంబరు 29[5]
- యూనిట్ 2: 2014 జనవరి 10
- యూనిట్ 3: 2016 జూలై 28
- యూనిట్ 4: 2016 జూలై 28
- యూనిట్ 5: 2016 సెప్టెంబరు
- యూనిట్ 6: 2016 సెప్టెంబరు
మూలాలు
[మార్చు]- ↑ "Projects under Execution - Lower Jurala, India". Alstom technologies. Retrieved 1 September 2014.
- ↑ S, Rajalakshmi (2014-07-31). "Jurala power project". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-05. Retrieved 2022-04-05.
- ↑ "Jurala Hydel Plant Goes on Stream". The New Indian Express. 2015-10-09. Archived from the original on 2020-10-26. Retrieved 2022-04-05.
- ↑ sundarajan, Priya (2016-08-01). "TS Genco commissions unit 3,4 of Lower Jurala Hydroelectric project". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Archived from the original on 2018-07-11. Retrieved 2022-04-05.
- ↑ "Telangana - Projects under construction". Telangana Power Generation Corporation. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 1 September 2014.
బయటి లింకులు
[మార్చు]- http://tsgenco.telangana.gov.in/ Archived 2022-06-08 at the Wayback Machine
- http://www.varksengineers.com/ongoing.html
- https://web.archive.org/web/20130531061601/http://www.cea.nic.in/archives/hydro/proj_mon/proj_status/jun12.pdf
- http://www.thehindubusinessline.com/news/states/jurala-power-project/article6266917.ece
- http://www.thehindubusinessline.com/companies/ts-genco-commissions-unit-34-of-lower-jurala-hydroelectric-project/article8928676.ece