నెల్లూరు రైల్వే స్టేషను
నెల్లూరు | |||||
---|---|---|---|---|---|
భారతీయ రైల్వే స్టేషను | |||||
సాధారణ సమాచారం | |||||
Location | రైల్వే స్టేషన్ రోడ్, సంతపేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||||
Coordinates | 14°27′43″N 79°59′14″E / 14.4618326°N 79.9872789°E | ||||
యజమాన్యం | భారతీయ రైల్వేలు | ||||
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు | ||||
లైన్లు | |||||
ఫ్లాట్ ఫారాలు | 4 | ||||
పట్టాలు | 5 5 ft 6 in (1,676 mm) బ్రాడ్-గేజ్ | ||||
నిర్మాణం | |||||
నిర్మాణ రకం | ప్రామాణిక (భూమిమీద) | ||||
Disabled access | |||||
ఇతర సమాచారం | |||||
స్టేషను కోడు | NLR | ||||
జోన్లు | SCoR | ||||
డివిజన్లు | విజయవాడ | ||||
Classification | నాన్-సబర్బన్ గ్రేడ్-3 (ఎన్.ఎస్.జి-3) | ||||
History | |||||
Opened | 1899 | ||||
విద్యుత్ లైను | 1980–81 | ||||
| |||||
Location | |||||
ఇంటరాక్టివ్ మ్యాప్ |
నెల్లూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్:NLR[1]) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు నగరంలో ఉన్న రైల్వే స్టేషను. విజయవాడ-గూడూరు సెక్షన్‌లోని ఈ రైల్వే స్టేషను, దక్షిణ తీర రైల్వే జోన్ (గతంలో దక్షిణ మధ్య రైల్వే జోన్)లోని విజయవాడ రైల్వే డివిజను పరిధిలో నిర్వహించబడుతుంది.[2]
చరిత్ర
[మార్చు]1899లో విజయవాడ-చెన్నై లింక్ ఏర్పాటుచేయబడింది.[3] 1980-81 మధ్యకాలంలో చీరాల-ఎలవూరు సెక్షన్ విద్యుదీకరించబడింది.[4]
వర్గీకరణ
[మార్చు]ఆదాయాలు, ప్రయాణీకుల నిర్వహణ పరంగా, ఈ నెల్లూరు రైల్వే స్టేషను నాన్-సబర్బన్ గ్రేడ్-3 (ఎన్.ఎస్.జి-3) రైల్వే స్టేషన్‌గా వర్గీకరించబడింది.[5] 2017–18, 2022–23 కాలానికి భారతీయ రైల్వే స్టేషన్‌ల పునః-వర్గీకరణ ఆధారంగా, ఎన్.ఎస్.జి–3 కేటగిరీ స్టేషన్ ₹20 – ₹100 కోట్ల మధ్య సంపాదిస్తుంది. 5–10 million మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది.[6] భారతీయ రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ పథకమైన ఆదర్శ్ స్టేషన్ స్కీమ్ కోసం ఎంపిక చేయబడింది.[7][8]
నిర్మాణం, సౌకర్యాలు
[మార్చు]నెల్లూరు రైల్వే స్టేషనులో 4 ప్లాట్‌ఫారమ్‌లపై ఎస్కలేటర్లు ఏర్పాటుచేశారు.[9] ఎస్.ఎస్.ఆర్. ఇటీవల నెల్లూరు స్టేషనులో ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్‌లను (ఎటివిఎం) కూడా ఇన్‌స్టాల్ చేసింది. [10] భారతీయ రైల్వే టాప్ వంద బుకింగ్ స్టేషన్లలో ఇదీ ఒకటి.[11] ఈ స్టేషను మీదుగా 132 ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, 6 ప్యాసింజర్ రైళ్ళు, 2 ఈఎంయు/డిఎంయు సహా రోజువారీ 140 రైళ్ళు ప్రయాణిస్తున్నాయి.[12] నెల్లూరు రైల్వే స్టేషను దేశంలోనే 28వ పరిశుభ్రమైన రైల్వే స్టేషనుగా నిలిచింది.[13] 100 కోట్లతో "రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి" అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కింద ప్రపంచస్థాయి సౌకర్యాలతో నెల్లూరు రైల్వే స్టేషన్ను సుందరీకరించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.[14]
మూలాలు
[మార్చు]- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. 2015. p. 46. Retrieved 2022-10-18.
- ↑ "Statement showing Category-wise No.of stations" (PDF). Portal of Indian Railways. 28 January 2016. p. 7. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 2022-10-18.
- ↑ "IR History:Early days II". 1870–1899. IRFCA. Retrieved 2013-01-19.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 2022-10-18.
- ↑ "Stations – Category-wise (NEW)". Portal of Indian Railways. Retrieved 2022-10-18.
- ↑ "Categorization of Railway Stations". Press Information Bureau. 21 March 2018. Retrieved 2022-10-18.
- ↑ "Adarsh Railway Station Scheme". Press Information Bureau. 5 April 2017. Retrieved 2022-10-18.
- ↑ "Adarsh Stations" (PDF). Portal of Indian Railways. Retrieved 2022-10-18.
- ↑ "Escalators, lifts at 14 stations". The New Indian Express. 24 December 2012. Archived from the original on 2014-04-16. Retrieved 2022-10-18.
- ↑ "SCR introduces mobile paper ticketing facility in 38 stations".
- ↑ "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 10 May 2014. Retrieved 2022-10-18.
- ↑ "Station: Nellore". South Coast Railway – Indian Railways. Retrieved 2022-10-18.
- ↑ "Cleanliness derails at AP railway stations". The Times of India. 30 July 2016. Retrieved 2022-10-18.
- ↑ Ujwal, Bommakanti (15 February 2019). "Nellore railway station: Andhra Pradesh: Nellore railway station to be revamped with Rs 100 crore | Vijayawada News". The Times of India. Retrieved 2022-10-18.
బయటి లింకులు
[మార్చు]Nellore travel guide from Wikivoyage