Jump to content

బాహుబలి:ద బిగినింగ్

వికీపీడియా నుండి
బాహుబలి
సినిమా పోస్టరు
దర్శకత్వంఎస్.ఎస్.రాజమౌళి
రచనవిజయేంద్ర ప్రసాద్
నిర్మాతశోభు యార్లగడ్డ
దేవినేని ప్రసాద్
కె. రాఘవేంద్రరావు
(సమర్పణ)
తారాగణంప్రభాస్
రానా దగ్గుబాటి
అనుష్క
తమన్నా భాటియా
ఛాయాగ్రహణంకె.కె.సెంథిల్ కుమార్
కూర్పుకోటగిరి వేంకటేశ్వరరావు
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఆర్కా మీడియా వర్క్స్
విడుదల తేదీ
10 జూలై 2015 (2015-07-10)
సినిమా నిడివి
158 నిమిషాలు
దేశంభారత దేశం
భాషలుతెలుగు
తమిళం
హిందీ
బడ్జెట్125 కోట్లు
బాక్సాఫీసు650కోట్లు[1]

ఓ జానపద కథతో రెండు భాగాలుగా రూపొందించబడిన “బాహుబలి” క్రమంలో మొదటి భాగంగా “బాహుబలి – ద బిగినింగ్” సినిమా 2015వ సంవత్సరం జూలై 10వ తేదీన విడుదలయింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించగా, కె.రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించగా, రాజమౌళి సోదరుడు, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మించడం జరిగింది. హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమాను అనువదించి విడుదల చేయడం జరిగింది. భారతదేశంలో అత్యంత వసూళ్ళు సాధించిన సినిమాలలో ఒకటిగా ఈ సినిమా పేరొందింది. రాజమౌళి ఈ సినిమా కోసం ఎలాంటి స్ట్రాటజీ అనుసరించారు. సక్సెస్ సీక్రెట్ ఏంటి? Archived 2023-07-12 at the Wayback Machine

ప్రాణాత్యాగం చేసి రాజమాత శివగామి (రమ్యకృష్ణ) కాపాడిన బిడ్డ అంబులగ్రామం అనే ఓ గూడెంలో శివుడు (ప్రభాస్)గా ఎదుగుతాడు. తన గూడెంకి దగ్గరున్న కొండపై ఏమున్నదో తెలుసుకోవాలనే కుతూహలంతో చిన్నతనం నుండి అనేకసార్లు ఆ కొండ ఎక్కబోయి విఫలమవుతాడు శివుడు. అతడి వింత ప్రవర్తన విడవాలని శివుడి తల్లి సంగ (రోహిణి) తమ గూడెంలోని శివలింగానికి 1016 సార్లు అభిషేకం చేస్తానని మ్రొక్కుబడి పెట్టుకుంటుంది. ఆ క్రమంలో తన తల్లి పడే కష్టం చూడలేక ఆ శివలింగాన్నే పెకలిస్తాడు శివుడు. అతడి బాహుబలాన్ని చూసి గూడెంలోని ప్రజలందరూ నివ్వెరపోతారు. తమ గూడెంలోని జలపాతం క్రింద ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. తన తల్లి కోరిక తీర్చినందుకు తల్లితో సహా అందరూ సంతోషిస్తారు.

ఇంతలో ఆ జలపాతంలోంచి ఓ ముసుగు జారిపడుతుంది. అది చూసి ముగ్ధుడైన శివుడు ఆ ముసుగు వెనుకనున్న ముఖం ఎవరిదో తెలుసుకునేందుకు మళ్ళీ కొండెక్కే ప్రయత్నం చేస్తాడు. ఈసారి అతడి ఊహాసుందరి సాయంతో ఆ కొండను ఎక్కేస్తాడు. ఆ ముసుగు అవంతిక (తమన్నా) అనే అమ్మాయిదని, ఆ అమ్మాయి మాహిష్మతి మహారాజు భల్లాలదేవుడి (రానా దగ్గుబాటి) చెర నుండి తమ మహారాణి దేవసేన (అనుష్క)ని విడిపించే తిరుగుబాటుదారులలో ఒకరని తెలుస్తుంది. దేవసేనను కాపాడే అవకాశం ఈసారి అవంతికకు అప్పజేప్తాడు వారి నాయకుడు (మేక రామకృష్ణ). తన కోసమే మహాపర్వతాలను ఎక్కివచ్చాడని తెలిసి శివుడితో ప్రేమలో పడుతుంది అవంతిక. దేవసేనను విడిపించి అవంతిక ఆశయాన్ని తాను నెరవేరుస్తానని మాహిష్మతి రాజ్యానికి బయలుదేరుతాడు శివుడు.

ఇదిలావుండగా, మాహిష్మతి రాజ్యంలో భల్లాలదేవుడి పాలనలో ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. ఓ అడవి దున్న నుండి తనను కాపాడే ప్రయత్నంలో గాయపడిన కట్టప్ప (సత్యరాజ్)ను ఏదైనా వరం కోరుకోమంటాడు భల్లాలదేవుడు. పాతికేళ్ళుగా దేవసేన అనుభవిస్తున్న శిక్ష నుండి ఆమెని విముక్తురాలిని చేయమని కట్టప్ప కోరగా, అందుకు బదులుగా దేవసేనను చంపి ఈ లోకం నుండే విముక్తురాలిని చేయమంటాడు భల్లాలదేవుడు. అది కుదరకపోతే దేవసేన శిక్షను అనుభవించాల్సిందేనని చెబుతాడు. ఆ రాత్రి దేవసేనను రహస్యంగా కలిసిన కట్టప్ప తనను తప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పగా, భల్లాలదేవుడు చనిపోయేంతవరకూ తన సంకెళ్ళను తెంచనని చెప్పి అతడికోసం చితిని పేర్చడం కొనసాగిస్తుంది దేవసేన.

మాహిష్మతి రాజ్యంలో శివుడు ప్రవేశించిన రోజున భల్లాలదేవుడి వందడుగుల స్వర్ణ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూవుంటుంది. ఆ ప్రయత్నం మధ్యలో తడబడగా, శివుడు దాన్ని మోసే మనుషులకు సాయపడతాడు. శివుడిని చూసి “బాహుబలి” అని ఓ వ్యక్తి గుర్తుపట్టగా, ఆ ప్రాంగణమంతా ఆ పేరుతో మారుమ్రోగిపోతుంది. అందుకు, భల్లాలదేవుడు పరాభవంతో నొచ్చుకుంటాడు.

చీకటి పడగా, శివుడు దేవసేనను తప్పించే ప్రయత్నం మొదలుపెడతాడు. అది చూసిన భల్లాలదేవుడి కొడుకు భద్రుడు (అడివి శేష్), కట్టప్ప శివుడిని అడ్డుకుంటారు. ఆ క్రమంలో భద్రుడితో పోరాడి అతడి తల నరికిన శివుడిని చంపబోయిన కట్టప్పకు అతడు శివుడు కాదని అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కొడుకు మహేంద్ర బాహుబలి అని తెలుసుకొని జరిగిన కథను చెప్పడం మొదలుపెడతాడు.

విక్రమదేవుడు (ప్రభాస్), బిజ్జలదేవుడు (నాజర్) అన్నదమ్ములు. బిజ్జలదేవుడి అవలక్షణాలు అతడిని రాజ్యాధికారానికి దూరం చేయగా, విక్రమదేవుడు రాజ్యబాధ్యతను స్వీకరిస్తాడు. కానీ తన అవిటితనమే తనకు రాజ్యాన్ని దక్కనివ్వలేదని కుమిలిపోతూవుంటాడు బిజ్జలదేవుడు. విక్రమదేవుడు మరణించిన తరువాత రాజ్యం బాధ్యత బిజ్జలదేవుడి భార్య శివగామి, కట్టప్ప సాయంతో నిర్వర్తిస్తూవుంటుంది. అమరేంద్ర బాహుబలికి జన్మనిచ్చిన విక్రమదేవుడి భార్య పురిట్లోనే ప్రాణాలు కోల్పోగా, తన కొడుకు భల్లాలదేవుడితో పాటు బాహుబలిని కూడా అక్కున చేర్చుకుంటుంది శివగామి. రాజు లేని సింహాసనాన్ని ఆక్రమించే ఆలోచనతో తిరుగుబాటు చేస్తాడు మార్తాండ (భరణి శంకర్). కట్టప్ప సాయంతో అతడ్ని, అతడి అనుచరులను హతమార్చిన శివగామిని సింహాసనం అధిస్టించమని మంత్రులు కోరగా, అందుకు ఆమె నిరాకరిస్తుంది. సింహాసనంపై అర్హత తన బిడ్డలిద్దరికే ఉన్నదని. పెద్దయ్యాక ఎవరు పెట్టిన పరీక్షలలో నెగ్గి, దేశ ప్రజల మన్నన పొందుతారో వారిదే సింహాసనమని చెబుతుంది శివగామి.

యుక్తవయసులోకి వచ్చిన యువరాజులిద్దరూ అన్ని పరీక్షలలో సమానమైన ప్రతిభను కనబరుస్తారు. ఇంతలో రాజ్యంలోని సాకేతుడు మాహిష్మతి సైన్య రహస్యాలను అపహరించి కాలకేయులకు అమ్మేస్తాడు. దాంతో కాలకేయులతో యుద్ధం తథ్యమవుతుంది. ఆ యుద్ధంలో కాలకేయులతో తలపడిన బాహుబలి, భల్లాలదేవుళ్ళలో ఎవరైతే విజయం సాధిస్తారో వారిదే సింహాసనమని చెప్పి, సైన్యాన్ని యువరాజులకు సమంగా పంచమని చెబుతుంది శివగామి. త్రిశూల వ్యూహం పన్ని కాలకేయునితో తలపడతారు. కాలకేయ నాయకుడు (ప్రభాకర్)తో తలపడిన బాహుబలి అతడిని చంపబోగా, బాహుబలికంటే ముందే కాలకేయుని అంతం చేస్తాడు భల్లాలదేవుడు. తన కొడుకే రాజు కాబోతున్నాడన్న ఆనందంతో పొంగిపోతాడు బిజ్జలదేవుడు. కానీ భల్లాలదేవుడిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి, అమరేంద్ర బాహుబలిని కాబోయే మహారాజుగా ప్రకటిస్తుంది శివగామి. కారణం, భల్లాలదేవుడు శతృసంహారం చేయాలన్న ధ్యేయంతో, ఆపదలోనున్న తన ప్రజలను కాపాడుకోలేకపోతాడు. బాహుబలి ఓ ప్రక్క శతృవుతో పోరాడుతూనే మరో ప్రక్క తన ప్రజలను కూడా కాపాడుకుంటాడు. రాజుకి ఉండాల్సిన లక్షణాలు బాహుబలిలోనే కనిపించడంతో రాబోయే ముహూర్తానికి అతడిని మాహిష్మతికి మహారాజుగా పట్టాభిషిక్తుడుగా చేయాలని ప్రకటిస్తుంది శివగామి.

ఈ కథ చెబుతూ అమరేంద్ర బాహుబలి చనిపోయాడని చెబుతాడు కట్టప్ప. ఎవరు చంపారని శివుడు ప్రశ్నించగా, తానే బాహుబలిని వెన్నుపోటు పొడిచి చంపానని కట్టప్ప చెప్పడంతో మొదటి భాగం ముగుస్తుంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

అభివృద్ది

[మార్చు]

ఈ కథకు బీజం రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ నది దాటుతూ ఓ బిడ్డని కాపాడి తన ప్రాణాలను కోల్పోయిన శివగామి పాత్రను గురించి చెప్పగా పడింది. ఆ తరువాత కొన్నేళ్ళకు కట్టప్ప పాత్ర గురించి చెప్పడం ఈ సినిమా తీయడానికి రాజమౌళిని ప్రేరేపించింది. పురాణాల పట్ల రాజమౌళికి ఉన్న ఆసక్తి, అమర్ చిత్ర కథల ప్రభావం ఈ సినిమా చేయడానికి అతడిపై పడింది. ఈ కథ మొదటి డ్రాఫ్టుని పూర్తి చేయడానికి రచయితలకు మూడు నెలలు పట్టింది.[3]

కిలికిలి భాష

ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి “కిలికిలి” లేదా “కిలికి” అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించారు. సినిమాలో కనిపించే కాలకేయులు అనే తెగ ఈ భాష మాట్లాడుతుంది. ఒక సినిమా కోసం ఓ భాషను రూపొందించడం భారతదేశంలో ఇదే ప్రథమం.[4]

కార్కి ఆస్ట్రేలియాలో పీ.హెచ్.డి చదువుతున్న సమయంలో, పార్ట్ టైం పనిగా ఓ శిశు సంరక్షణాలయములో పని చేసేవారు. ఆ సమయంలో అవలీలగా అర్థమయ్యే ఓ భాషను కనిపెడితే బాగుండును అనే ఆలోచనలో ఈ భాషకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా, మొదట కొన్ని చిన్న పదాలు రూపొందించి వాటిని తిరగేసి వాటి వ్యతిరేకాలు రూపొందించారు. ఉదాహరణకు, “మిన్” అంటే “నేను” అని, “నిమ్” అంటే “నువ్వు” అనే అర్థాలు వచ్చేలా రూపొందించారు. 100 పదాలతో రూపొందిన భాషను “క్లిక్” అని వ్యవహరించారు. ఇదే “కిలికి” అనే పదానికి బీజం వేసింది.[5]

ఈ భాషను 750 పదాలతో, 40 వ్యాకరణ సూత్రాలతో రూపోదించారు. కార్కి పదము యొక్క అర్థాన్ని బట్టి కొన్ని కఠినమైన హల్లులు, మరికొన్ని సున్నితమైన హల్లులను వాడడం జరిగింది. సినిమా విడుదలయిన తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఈ భాష ఒకేలాగే వినిపిస్తుంది.[6]

నటీనటుల ఎంపిక

[మార్చు]

ఫిబ్రవరి, 2011లో రాజమౌళి తన తదుపరి సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్నాడని ప్రకటించారు.[7] జనవరి, 2013లో ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ని బాహుబలిగా ప్రకటించారు. క్రమంగా, సినిమాకు కూడా అదే పేరుతో నామకరణం చేశారు.[8] ప్రభాస్ కు జోడిగా అనుష్కను, ప్రతినాయకుడిగా రానా దగ్గుబాటిని ఎంచుకున్నారు.[9] సినిమాలో ముఖ్యపాత్రైన కట్టప్పకు తమిళ నటుడు సత్యరాజ్ ను ఎంపిక చేశారు.[10] మరో ముఖ్యపాత్ర శివగామి కోసం మొదట శ్రీదేవితో సంప్రదింపులు జరిపింది. శ్రీదేవి అధిక పారితోషికం కోరడంతో ఆ అవకాశాన్ని రమ్యకృష్ణకు ఇవ్వడం జరిగింది.[11] మరో తమిళ నటుడు నాజర్ ని మరో ముఖ్యపాత్రకు ఎంపిక చేసిన చిత్ర బృందం కన్నడ నటుడు సుదీప్ ని ఓ చిన్న పాత్రకు ఎంపిక చేసింది.[12] పంజా సినిమాలోని తన నటన రాజమౌళిని ఆకట్టుకోవడంతో మరో ముఖ్య ప్రతినాయక పాత్రకు అడివి శేష్ ని ఎంచుకున్నారు.[13] డిసెంబరు 20, 2013న ఈ సినిమాలో మరో కథానాయికగా తమన్నాను ఎంచుకున్నట్టుగా చిత్రబృందం ఒక ప్రెస్ నోట్ లో తెలిపింది.[14]

ప్రీ ప్రొడక్షన్

[మార్చు]

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. 15,000 స్టొరీ బోర్డు స్కెచ్చులు రూపొందించారు. ఓ భారతీయ సినిమాకు ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం ఈ సినిమాకే మొదటిసారి.[15] ఈ సినిమాలోని తమ పాత్రలకు అనుగుణంగా ప్రభాస్, అనుష్క, రానాలు కత్తిసాము నేర్చుకోగా, ప్రభాస్, రానాలు అదనంగా గుర్రపుస్వారీలు నేర్చుకోవడం జరిగింది.[16]

చిత్రీకరణ

[మార్చు]

ఈ సినిమా చిత్రీకరణ జూలై 6, 2013న కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాతి ఉద్యానవనంలో మొదలైంది.[17] సినిమాలో భాగమైన మాహిష్మతి రాజ్యానికి సంబంధించిన భారీ సెట్టుని రామోజీ ఫిలిం సిటీలో కళా దర్శకుడు సాబు సిరిల్ నేతృత్వంలో నిర్మించారు. ఆగష్టు, 2013లో ప్రధాన తారాగణంపై అక్కడే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కొనసాగింది.[18] ఆగష్టు 29, 2013కి రెండో షెడ్యూల్ పూర్తయింది.[19] మూడో షెడ్యూల్ హైదరాబాదులో అక్టోబర్ 17, 2013న మొదలైంది.[20] ఆ నెల చివరికి రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సన్నివేశాల కోసం ఒక మొక్కజొన్న పంటను ప్రత్యేకంగా పండించడం జరిగింది. కానీ చిత్రీకరణ మొదలయ్యే వారం ముందు అకాల వర్షాల కారణంగా అది ధ్వంసమైంది. నవంబర్, 2013 లో కర్నూలులో చిత్రీకరణ మళ్ళీ ప్రారంభమైనప్పటికీ, వర్షాల కారణంగా నిలిపివేయడం జరిగింది. సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, చిత్రీకరణ జరిగే ప్రదేశానికి దాదాపుగా 30వేల మంది జనాలు రావడంతో వారిని అదుపు చేయడం చిత్రబృందం వల్ల కాలేదు. ప్రభాస్, రానాల చొరవతో జనాలు అదుపులోకి వచ్చాక, దర్శకుడు రాజమౌళి వారి మధ్యలో నిలబడి “జై బాహుబలి” అని గట్టిగా నినాదాలు చేయమని పిలుపునిచ్చారు. ఆ నినాదాలను సినిమాలో కావలసిన చోట దాన్ని వాడుకోవాలని సినిమా శబ్దగ్రహణ విభాగం వారు రికార్డు చేశారు.[21]

సంగీతం

[మార్చు]

ఎం.ఎం.కీరవాణి స్వరపరిచిన ఈ సినిమా పాటలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో జూన్ 13, 2015న విడుదలయ్యాయి.[22][23]

సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."మమతల తల్లి"కె.శివశక్తి దత్తసత్య యామిని4:04
2."జీవనది"ఇనగంటి సుందర్గీతా మాధురి1:55
3."ధీవర"కె.శివశక్తి దత్త, రామజోగయ్య శాస్త్రిరమ్య బెహ్రా, దీపు5:43
4."శివుని ఆన"ఇనగంటి సుందర్ఎం. ఎం. కీరవాణి, మౌనిమ3:32
5."పచ్చ బొట్టేసిన"అనంత శ్రీరాంకార్తీక్, దామిని4:33
6."మనోహరి"చైతన్య ప్రసాద్మోహన భోగరాజు, రేవంత్3:52
7."నిప్పులే శ్వాసగా (మాహిష్మతి)"ఇనగంటి సుందర్ఎం. ఎం. కీరవాణి3:26
8."ధీవర (ఆంగ్లం)"నోయెల్ సేన్, ఆదిత్యరమ్య బెహ్రా, ఆదిత్య3:26
మొత్తం నిడివి:27:08

వివాదం

[మార్చు]

ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ ఈ చిత్రంలో ఉపయోగించిన పదానికి సంబంధించిన వివాదాన్ని ఎదుర్కొంది. 22 జూలై 2015 న, మదురైలోని 'తమిళ, జయ' మల్టీప్లెక్స్ వెలుపల దళిత సమూహం పురచ్చి పులికల్ ఇయక్కం కార్యకర్తలు ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌ను ప్రదర్శించారు. ‘పగడై’ (జూదగాడు) అనే పదాన్ని చేర్చడంపై ఈ చిత్రానికి వ్యతిరేకంగా దళిత సమూహం పురచ్చి పులికల్ ఇయక్కం నిరసన వ్యక్తం చేశారు. అరుణతియార్ దళిత ఉప కుల సభ్యులను ఉద్దేశించి కుల హిందువులు ఉపయోగించే పదాలను దళితుల పట్ల అవమానకరంగా భావిస్తున్నట్లు ఈ బృందం సభ్యులు పేర్కొన్నారు. తమిళ వెర్షన్ డైలాగ్ రచయిత మాధన్ కార్కీ క్షమాపణలు చెప్పారు.[24]

సినిమా ప్రచారం

[మార్చు]

దర్శకుడు రాజమౌళి తెరకెకిస్తున్న ఈ చిత్రరాజాన్ని మొదులు పెట్టిన నాటి నుంచి ఈ సినిమాని నిత్యం ప్రచార మాద్యమాలలో ఎల్లప్పుడు కానవస్తూనే ఉంది. ఎన్ని విధాలుగా ప్రచారం చేయాలో అన్ని విధాలని అచరణలో ఉంచారు ఈ చిత్ర నిర్మాతలు. మొదట ప్రభాస్ జన్మదినం సందర్భంగా సినిమా యొక్క నిర్మాణ వీడియోని విడుదల చేసారు అది మొదలుకొని నిత్యం ఏదో ఒక సందర్భన్ని పురస్కరించుకొని సినిమాని జనాన్ని అనుసందానిస్తూనే వున్నారు చిత్ర నిర్మాతలు. ఆ తరువాత అనుష్క జన్మదినం సందర్భంగా ఒక వీడియో, రానా జన్మదినం సందర్భంగా ఒక వీడియో,[25][26][27][28][29][30] తమన్నా జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్, ఇంకా దేశ రాజధానిలో జరిగిన ప్రఖ్యాత "కామిక్ కాన్" సమ్మేళనంలో బాహుబలి మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది.[31][32]

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2015 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ సినిమా నిర్మాత: శోభు యార్లగడ్డ , అర్క మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్.
దర్శకుడు: ఎస్. ఎస్. రాజమౌళి
విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ చిత్రం శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ సహాయనటి రమ్యకృష్ణ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ విలన్ రానా దగ్గుబాటి విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం కె.కె.సెంథిల్ కుమార్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ సంగీతదర్శకుడు ఎం. ఎం. కీరవాణి విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ నేపథ్య గాయకుడు ఎం. ఎం. కీరవాణి విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ కళా దర్శకుడు సాబు సిరిల్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ నృత్య దర్శకుడు ప్రేమ్‌ రక్షిత్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ శబ్ద గ్రాహకుడు పి.ఎం.సతీష్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్ రమా రాజమౌళి, ప్రశాంతి విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ స్టంట్ మాస్టర్ పీటర్ హేన్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ వి.శ్రీనివాస మోహన్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడు పి.రవిశంకర్ విజేత
2015 సైమా అవార్డులు ఉత్తమ చిత్రం శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని విజేత
2015 సైమా అవార్డులు ఉత్తమ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విజేత
2015 సైమా అవార్డులు ఉత్తమ ప్రతినాయకుడు శ్రీకాంత్ విజేత
2015 సైమా అవార్డులు ఉత్తమ సహాయనటి రమ్యకృష్ణ విజేత
2015 సైమా అవార్డులు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ విజేత

మూలాలు

[మార్చు]
  1. Baahubali budget to go beyond 175 cr. - The Times of India Retrieved 8 September 2014
  2. The Hans India, Vijayawada (24 June 2021). "Theatre personality Devabattula George passes away". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2021. Retrieved 25 June 2021.
  3. "Baahubali: The Beginning". Wikipedia. Retrieved 23 September 2018.
  4. "Baahubali does a Lord of the Rings! The film establishes a new language called Kilikili – Firstpost". 14 July 2015. Archived from the original on 20 December 2016.
  5. "5 Sentences And Their Translations in Kiliki, The Fictitious Language Used In 'Baahubali'". Huffington Post India. Archived from the original on 2016-11-14. Retrieved 24 సెప్టెంబరు 2018.
  6. Cinema, Telugu. "Welcome to new language 'Kilikili' from Baahubali". Archived from the original on 2016-11-14. Retrieved 24 సెప్టెంబరు 2018.
  7. "Prabhas-Rajamouli film announced". Archived from the original on 24 September 2015.
  8. "Rajamouli-Prabhas' film is titled Bahubali". The Times of India. 13 January 2013. Archived from the original on 5 అక్టోబరు 2013. Retrieved 14 January 2013.
  9. "Rana's groundwork for 'Baahubali'". raagalahari.com. 7 March 2013. Archived from the original on 23 అక్టోబరు 2013. Retrieved 23 సెప్టెంబరు 2018.
  10. "Sathyaraj joins Baahubali's cast". 123telugu.com. 25 April 2013. Archived from the original on 27 April 2013. Retrieved 26 April 2013.
  11. "Baahubali: Ramya Krishnan was not SS Rajamouli's first choice to play Sivagami. It was Sridevi". indianexpress.com. 7 May 2017. Retrieved 23 September 2018.
  12. Shekhar (18 April 2013). "I am doing a small role in Rajamouli's Bahubali: Sudeep". Oneindia Entertainment. Archived from the original on 21 April 2013. Retrieved 19 April 2013.
  13. "Adivi Sesh in Rajamouli's Bahubali". The Times of India. 6 April 2013. Archived from the original on 10 ఏప్రిల్ 2013. Retrieved 7 April 2013.
  14. "Tamanna To Star With Prabhas in Baahubali: First Look Released As Birthday Gift". Oneindia Entertainment. 20 December 2013. Archived from the original on 21 December 2013. Retrieved 21 December 2013.
  15. "Baahubali: The Beginning". Wikipedia. Retrieved 23 September 2018.
  16. "Prabhas,rana,anushka practicing sword fighting". IndiaGlitz. Archived from the original on 5 February 2013. Retrieved 23 February 2013.
  17. "'Baahubali' shooting starts tomorrow". IndiaGlitz. 5 July 2013. Archived from the original on 6 August 2015. Retrieved 19 July 2014.
  18. "Prabhas shooting at RFC for Bahubali". The Times of India. 29 August 2013. Archived from the original on 5 July 2015. Retrieved 19 July 2014.
  19. "'Bahubali' Second Schedule Finished". IndiaGlitz. 29 August 2013. Archived from the original on 6 August 2015. Retrieved 19 July 2014.
  20. "Prabhas' Bahubali begins new schedule". The Times of India. 17 October 2013. Archived from the original on 5 July 2015. Retrieved 19 July 2014.
  21. "'Baahubali' captures public's attention in Kurnool". IndiaGlitz. 6 November 2013. Archived from the original on 6 August 2015. Retrieved 19 July 2014.
  22. "Official: Baahubali Audio Launch On June 13". Filmibeat. 9 June 2015. Retrieved 12 December 2016.
  23. "Baahubali (@BaahubaliMovie) on Twitter".
  24. https://www.newindianexpress.com/states/tamil-nadu/2015/jul/23/Dalit-Party-Members-Hurls-Bomb-on-Baahubali-Theatre-790146.html
  25. "Watch: The making of SS Rajamouli's 'Baahubali'". CNN-IBN. 23 October 2013. Archived from the original on 31 డిసెంబరు 2014. Retrieved 16 ఏప్రిల్ 2014.
  26. Karthik, Pasupulate (14 December 2013). "Rana Baahubali making video goes viral". The Times of India. Retrieved 16 ఏప్రిల్ 2014.
  27. Shekhar (6 February 2014). "Baahubali New Video: Rajamouli Teaches How To Climb Elephant". entertainment.oneindia.in. Archived from the original on 31 మార్చి 2014. Retrieved 16 ఏప్రిల్ 2014.
  28. Karthik, Pasupulate (23 October 2013). "Prabhas Bahubali first look goes viral". The Times of India. Archived from the original on 2014-01-30. Retrieved 16 ఏప్రిల్ 2014.
  29. Sangeetha, Seshagiri (19 March 2014). "'Baahubali' Team's Video on Exam Tips Goes Viral".
  30. Sangeetha Seshagiri (7 November 2013). "Anushka Shetty Gets 'Baahubali' Making Trailer, 'Rudhramadevi' First Look as Birthday Gifts [VIDEO+POSTER]". International Business Times. Retrieved 16 ఏప్రిల్ 2014.
  31. "Baahubali Motion Print". reveye.in. 7 February 2014. Archived from the original on 23 మార్చి 2014. Retrieved 21 March 2014.
  32. "IF ONLY YOU WERE A 'BAAHUBALI'". wowsomeapp.com. Archived from the original on 2015-05-21. Retrieved 2015-05-19.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు