తానరూపి రాగము
స్వరూపం
(తానరూపి నుండి దారిమార్పు చెందింది)
ఆరోహణ | S R₁ G₁ M₁ P D₃ N₃ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₃ D₃ P M₁ G₁ R₁ S |
తానరూపి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 6వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "తనుకీర్తి" అని పిలుస్తారు. [2][3] ఇందు చక్రంలో ఇది మొదటి రాగం.[4] దీని ధారణానుకూలమైన పేరు "ఇందు-షా"
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- (S R1 G1 M1 P D3 N3 S)
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- (S N3 D3 P M1 G1 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, షట్చ్రుతి ధైవతం, కాకళి నిషాధం. ఇది 42 మేళకర్త రఘుప్రియ రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
[మార్చు]చాలామంది వాగ్గేయకారులు తానరూపి రాగంలో కీర్తనల్ని రచించారు.
- చిదంబర నటరాజమూర్తిం - ముత్తుస్వామి దీక్షితార్ వారి కీర్తన
- శ్రీ రామ సదా భజేహం - మంగళంపల్లి బాలమురళీకృష్ణ [5]
జన్య రాగాలు
[మార్చు]తానరూపి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.
మూలాలు
[మార్చు]- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
- ↑ Hu$tle, Blogger's (2020-11-06). "Download Youtube Videos: An Ultimate Guide". Medium (in ఇంగ్లీష్). Retrieved 2020-11-26.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "Taanaroopi - Shri Ramam - Janaka Raga Kriti Manjari - Dr. M Balamuralikrishna - Video 006 - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.
బాహ్య లంకెలు
[మార్చు]- "06 | Tanarupi | Indu Chakra | Melakarta Ragas | Listen Learn Sing | Indian Classical | G Srikanth | - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.