నితీశ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నితీష్ కుమార్
నితీశ్ కుమార్


బీహార్ 22వ ముఖ్యమంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2015 ఫిబ్రవరి 22
గవర్నరు
ముందు జితన్ రామ్ మాంఝి
పదవీ కాలం
2005 నవంబర్ 24 – 2014 మే 17
గవర్నరు డి.వై. పాటిల్
డిప్యూటీ సుశీల్ కుమార్ మోడీ (2005-2013)
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత జితన్ రామ్ మాంఝి
పదవీ కాలం
2000 మార్చి 3 – 2000 మర్చి 10

కేంద్ర రైల్వే శాఖ మంత్రి
పదవీ కాలం
2001 మర్చి 20 – 2004 మే 21
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు మమతా బెనర్జీ
తరువాత లాలూ ప్రసాద్ యాదవ్
పదవీ కాలం
1998 మార్చి 19 – 1999 ఆగస్టు 5
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు రామ్ విలాస్ పాశ్వాన్
తరువాత మమతా బెనర్జీ

కేంద్ర వ్యవసాయ మంత్రి
పదవీ కాలం
2000 మే 27 – 2001 2జులై 21
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు అటల్ బిహారీ వాజపేయి
పదవీ కాలం
1999 నవంబర్ 22 – 2000 మర్చి 3
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి

కేంద్ర మంత్రి
పదవీ కాలం
1999 అక్టోబర్ 13 – 1999 నవంబర్ 22
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు ఎమ్ తంబిదురై
తరువాత జస్వంత్ సింగ్
పదవీ కాలం
1998 ఏప్రిల్ 14 – 1999 ఆగస్టు 5
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు జస్వంత్ సింగ్
తరువాత రాజ్‌నాథ్ సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-03-01) 1951 మార్చి 1 (వయసు 73)
[Bakhtiarpur], బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ జనతా దళ్(యునైటెడ్)
ఇతర రాజకీయ పార్టీలు జాతీయ ప్రజాస్వామ్య కూటమి
జీవిత భాగస్వామి మంజు సిన్హా
సంతానం నిశాంత్ కుమార్
పూర్వ విద్యార్థి నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, బీహార్

నితీష్ కుమార్ (జననం 1951 మార్చి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం బీహార్ రాష్టానికి 22వ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. కుమార్ ఇంతకు మునుపు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు.[1]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

నితీష్ కుమార్ 1951 మార్చి ఒకటో తారీఖున బీహార్ లోని భక్తి పూర్ జన్మించాడు. ఇతని తండ్రి కవిరాజ్ రామ్ లఖన్ సింగ్ ఆయుర్వేద వైద్యునిగా పని చేసేవాడు, తల్లి పేరు పరమేశ్వరి దేవి. నితీష్ వ్యవసాయ కులానికి చెందినవాడు.

నితీష్ కుమార్ 1972లో బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టక్నాలజీ) నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తన కెరీర్ మొదట్లో బీహార్ రాష్ట్ర ఎలక్ట్రిక్ బోర్డు జాయిన్ అయిన తర్వాత రాజకీయాల పట్ల మక్కువతో రాజకీయాల్లో చేరాడు.1973 ఫిబ్రవరి 22న మంజు కుమారి తో ఇతని వివాహం జరిగింది.

రాజకీయ జీవితం[మార్చు]

కేంద్రమంత్రిగా[మార్చు]

నితీష్ కుమార్ కేంద్ర క్యాబినెట్ లో పలు పాత్రలు నిర్వహించాడు. మొదటిగా అతను కేంద్ర రైల్వే శాఖ సర్ఫేస్ రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించాడు ఆ తర్వాత 1998-99 లో అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వం లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించాడు

1999 ఆగస్టు లో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అతను మంత్రిగా వ్యవహరించిన కొద్దికాలంలోనే రైల్వే శాఖలో పలు వివాదాస్పద మార్పులు తీసుకొచ్చాడు దీంట్లో ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయంతో రైలు టికెట్ బుక్ చేసుకోవడం వంటివి గమనార్హం, తత్కాల్ టికెట్ బుకింగ్ కూడా ఈయన మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రవేశపెట్టబడింది.[2][3]

ఆ తర్వాత సంవత్సరం కేంద్ర వ్యవసాయ శాఖకు మంత్రిగా నియమించబడ్డాడు. 2001 నుండి 2004 మే వరకు మళ్ళీ కేంద్ర రైల్వే శాఖ కు మంత్రి బాధ్యత నిర్వహించాడు. 2004 బీహార్ లోక్ సభ ఎన్నికల్లో నలందా ఇంకా బర్హ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. నితీశ్ కుమార్‌ 2024 జనవరి 28న రాజ్‌భవన్‌లో బిహార్‌ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి ప్రమాణం చేశాడు.[4]

మూలాలు[మార్చు]

  1. "Nitish Kumar sworn-in as CM for sixth time: A look at the life of the 'Chanakya of Bihar politics'-Politics News , Firstpost". Firstpost. 2017-07-27. Retrieved 2021-06-06.
  2. "Archive News". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2021-06-06.
  3. "Railway Reservation through internet". outlookindia.com/. Retrieved 2021-06-06.
  4. Andhrajyothy (29 January 2024). "నితీశ్‌.. తొమ్మిదోసారి!". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.