Jump to content

బుదౌన్ జిల్లా

వికీపీడియా నుండి
బదాయూన్ జిల్లా
बदायूँ जिला
ఉత్తర ప్రదేశ్ పటంలో బదాయూన్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో బదాయూన్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుబరేలీ
ముఖ్య పట్టణంబదాయూన్
మండలాలు6
Government
 • శాసనసభ నియోజకవర్గాలు7
విస్తీర్ణం
 • మొత్తం5,168 కి.మీ2 (1,995 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం37,00,245
 • జనసాంద్రత720/కి.మీ2 (1,900/చ. మై.)
 • Urban
8,26,000
జనాభా వివరాలు
 • అక్షరాస్యత52.91 per cent
ప్రధాన రహదార్లుSH33, SH43, SH51, SH18, NH 93
Websiteఅధికారిక జాలస్థలి
కచ్లా వద్ద గంగ

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బుదౌన్ జిల్లా (హిందీ:बदायूँ जिला) ఒకటి. బుదౌన్ పట్టణం ఈ జికుల్లా కేంద్రం. ఇది బరైలి డివిజన్‌లో భాగంగా ఇంది. జిల్లా వైశాల్యం 5168 చ.కి.మీ

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

యునైటెడ్ కింగ్డం చారిత్రక పరిశోధకుడు " గార్జ్ స్మిత్ " వ్రాతలను అనుసరించి ఈ ప్రాంతానికి అహిర్ రాకుమారుడు బుధ్ ఙాపకార్ధం ఈ నగరం స్థాపించబడిందని భావిస్తున్నారు. [1]

చరిత్ర

[మార్చు]

1911 ఎంసైక్లోపీడియా బ్రిటానికా బదాయూన్ గురించి వ్రాసింది. ఈ ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో " యునైటెడ్ ప్రోవింస్ ఆఫ్ ఆగ్రా , ఔధ్ " లోని రోహిల్‌ఖండ్ భూభాగంలో ఉంది. ఈ పట్టణం సాత్ నది ఏడమ తీరంలో ఉంది. 1901లో జనసంఖ్య 39,031. ఇక్కడ బృహత్తరమైన కోటశిథిలాలు, 1223లో నిర్మించబడిన అందమైన మసీదు ఉన్నాయి. శిలాశాసనాల ఆధారంగా 905లో బౌధ్ స్థాపించబడింది. 12 వ శతాబ్దం వరకూ సాగిన బౌధ్ పాలనలో 12 మంది రాధోడ్ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని భావిస్తున్నారు. 1196లో మొదటిసారిగా ఈప్రాతం మీద కుతుబుద్దీన్ ఇతుత్మిష్ దాడిచేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. తరువాత ఈ ప్రాంతం ఢిల్లి సామ్రాజ్య ఉత్తర భూభాగంలో ప్రముఖ స్థానం వహించింది.13వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజప్రతినిధులు షాంసుద్ధీన్ ఇతుతుమిష్ ఆయన కుమారుడు రుకుద్దీన్ ఫిరుజ్ సిహాసనం అధిష్టించారు. 1571లో ఈ పట్టణం అగ్నిప్రదానికి లోనైంది. ఒక శతాబ్దం తరువాత షాజహాన్ చక్రవర్తి అధికారాన్ని షహస్పూర్ - బిలరికి బదిలీ చేసాడు.

ప్రొఫెసర్. గోతి జాన్ ఈ నగరానికి " బేదామూథ్ " (बेदामूथ) అని పేరున్నట్లు పేర్కొన్నాడు. లక్నో మ్యూజియంలో ఉన్న పురాతన శిలాశాసనంద్వారా ఈ ప్రాంతం పాంచాల రాజ్యంలో భాగంగా ఉందని తెలుస్తుంది. నగరానికి సమీపంలో ఉన్న శిలాశాసనం అనుసరించి ఈ ప్రాంతం పేరు బద్గౌన్లక్ అని ఉంది. ముస్లిం పరిశోధకుడు (इतिहासकार), రోజ్ ఖాన్ లోడి ఇక్కడ అశోకుడు బుధ్‌మౌ (बुद्धमउ) పేరుతో బుద్ధ విహారం నిర్మించాడని భావిస్తున్నారు. బదాయూన్ నగరం పవిత్ర గంగా తీరంలో ఉంది..[2]

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బదాయూన్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

విభాగాలు

[మార్చు]
  • జిల్లాలో 6 ఉపవిభాగాలు ఉన్నాయి: సహస్వన్, దతగంజ్,బిల్సి, బిసౌలి, బదాయూన్,
  • జిల్లాలో 7 శాసనసభ జియోజక వర్గాలు ఉన్నాయి:- బిసౌలి, సహస్వన్, బిల్సి, బదాయూన్, షెఖుపుర్, దతగంజ్.
  • అయొన్ల పార్లమెంటు నియోజకవర్గంలో: షెఖుపుర్, దతగంజ్ ఉన్నాయి.
  • బదాయూన్ పార్లమెంటు నియోజకవర్గంలో: మిగిలిన శాసనసభ జియోజక వర్గాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,712,738,[4]
ఇది దాదాపు. లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. ఒక్లహోమా నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 71వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 718 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.96%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 859:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 52.91%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

జిల్లాలో ముస్లిములు, యాదవులు అధికంగా ఉన్నారు. బదయూన్ నగర జనసంఖ్య (3.61 లక్షలు), ఉజ్జయిని (2.01లక్షలు),సహస్వన్ (2.24 లక్షలు), కక్రాల (1.24 లక్షలు). బదయూన్ 27% నగరప్రాంత, 28% నగర శివారు ప్రాంతం మిగిలిన 45% గ్రామీణప్రాంతాలకు చెందినవారు.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. John Murray, The student's geography of India: the geography of British India: political and physical (George Smith: 1982), p. 180
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-21. Retrieved 2014-12-16.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Oklahoma 3,751,351