Jump to content

భారత హోం వ్యవహారాలశాఖ మంత్రి

వికీపీడియా నుండి
భారత హోం వ్యవహారాల మంత్రి
Griha Mantri
Incumbent
అమిత్ షా

since 2019 మే 30
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
విధంగౌరవనీయుడు
AbbreviationHM
సభ్యుడుకేంద్ర మంత్రివర్గం
రిపోర్టు టుప్రధానమంత్రి,
భారత పార్లమెంట్
స్థానంనార్త్ బ్లాక్, రాష్ట్రపతి భవన్, న్యూ ఢిల్లీ
నియామకంప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
అగ్రగామిరాజ్‌నాథ్ సింగ్
(2014-2019)
ప్రారంభ హోల్డర్సర్దార్ వల్లభాయ్ పటేల్
(1947-1950)
నిర్మాణం1947 ఆగష్టు 15
భారతదేశం

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం



భారత ప్రభుత్వ పోర్టల్


భారత హోం వ్యవహారాల మంత్రి (లేదా హోమ్ మినిస్టర్) భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అధిపతి. కేంద్ర మంత్రివర్గంలోని అత్యంత సీనియర్ అధికారులలో ఒకడు. భారతదేశ అంతర్గత భద్రత నిర్వహణ హోం మంత్రి ప్రధాన బాధ్యతగా ఉంటుంది.దేశానికి చెందిన పెద్ద పోలీసు దళం దాని అధికార పరిధిలోకి వస్తుంది.హోమ్ మినిస్టరుకు అప్పుడప్పుడు, హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి, దిగువ స్థాయి హోం వ్యవహారాల సహాయ మంత్రి సహకారాలు అందిస్తారు.

స్వతంత్ర భారతదేశం మొదటి హోం మంత్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలం నుండి, కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రికి మాత్రమే ఈ కార్యాలయం సీనియారిటీలో రెండవ స్థానంలో ఉంది. పటేల్‌లాగే పలువురు హోంమంత్రులు ఉప ప్రధానమంత్రిగా అదనపు మంత్రిత్వశాఖలను కలిగి ఉన్నారు.2020 ఫిబ్రవరి నాటికి, ముగ్గురు హోం మంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి, చరణ్ సింగ్, పివి నరసింహారావు ప్రధానమంత్రులు అయ్యారు. 1998 మార్చి 19 నుండి 2004 మే 22 వరకు సేవలందిస్తున్న ఎల్‌.కె.అద్వానీ, 2020 ఫిబ్రవరి నాటికి అత్యధిక కాలం పాటు హోం మంత్రిగా పనిచేసాడు.

2014 మే 26 నుండి, 2019 మే 30 వరకు, భారత హోం మంత్రిగా భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్‌నాథ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే నుండి పదవీబాధ్యతలు చేపట్టారు. 2019 మే 31న, రెండవ మోడీ మంత్రిత్వ శాఖ ప్రమాణ స్వీకారం తర్వాత అమిత్ షా దాని 31వ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అంతర్గత భద్రత, సరిహద్దు నిర్వహణ, కేంద్రం-రాష్ట్ర సంబంధాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నిర్వహణ, విపత్తు నిర్వహణ మొదలైన అనేక రకాల బాధ్యతలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.హచ్.ఎ) నిర్వర్తిస్తుంది, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్గత భద్రతా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది, తగిన సలహాలను జారీ చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను పంచుకుంటుంది, భద్రత, శాంతి, సామరస్యానికి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు మానవశక్తి, ఆర్థిక మద్దతు, మార్గదర్శకత్వం, నైపుణ్యాన్ని అందిస్తుంది.[1]

హోం మంత్రుల జాబితా

[మార్చు]

హోం మంత్రుల జాబితా

వ.సంఖ్య చిత్రం పేరు పదవీకాలం పదవీకాలం (సంవత్సరాలు, రోజుల్లో) రాజకీయ పార్టీ (కూటమి) ప్రధాన

మంత్రి

1 సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 ఆగస్టు 15 1950 డిసెంబరు 12 3 సంవత్సరాలు, 119 రోజులు జవాహర్ లాల్ నెహ్రూ
2 జవాహర్ లాల్ నెహ్రూ 1950 డిసెంబరు 12 1950 డిసెంబరు 26 14 రోజులు
3 సి.రాజగోపాలాచారి 1950 డిసెంబరు 26 1951 నవంబరు 5 314 రోజులు
4
కైలాష్ నాథ్ కట్జూ 1951 నవంబరు 5 1955 జనవరి 10 3 సంవత్సరాలు, 66 రోజులు
5 గోవింద్ వల్లభ్ పంత్ 1955 జనవరి 10 1961 ఫిబ్రవరి 25 6 సంవత్సరాలు, 46 రోజులు
6 లాల్ బహదూర్ శాస్త్రి 1961 ఫిబ్రవరి 25 1963 సెప్టెంబరు 1 2 సంవత్సరాలు, 188 రోజులు
7 గుల్జారీలాల్ నందా 1963 సెప్టెంబరు 1 1966 నవంబరు 9 3 సంవత్సరాలు, 69 రోజులు జవాహర్ లాల్ నెహ్రూ,

లాల్ బహదూర్ శాస్త్రి,

ఇందిరా గాంధీ

8 ఇందిరా గాంధీ 1966 నవంబరు 9 1966 నవంబరు 13 4 రోజులు ఇందిరా గాంధీ
9 యశ్వంత్ రావ్ చవాన్ 1966 నవంబరు 13 1970 జూన్ 27 3 సంవత్సరాలు, 226 రోజులు
(8) ఇందిరా గాంధీ 1970 జూన్ 27 1973 ఫిబ్రవరి 5 2 సంవత్సరాలు, 223 రోజులు
10 ఉమా శంకర్ దీక్షిత్ 5 ఫిబ్రవరి1 973 1974 అక్టోబరు 10 1 సంవత్సరం, 247 రోజులు
11 కాసు బ్రహ్మానంద రెడ్డి 1974 అక్టోబరు 10 1977 మార్చి 24 2 సంవత్సరాలు, 165 రోజులు
12 చరణ్ సింగ్ 1977 మార్చి 24 1978 జూలై 1 1 సంవత్సరం, 99 రోజులు జనతా పార్టీ మొరార్జీ దేశాయి
13 మొరార్జీ దేశాయి 1978 జూలై 1 1979 జనవరి 24 207 రోజులు
14 హీరుభాయ్ ఎం.పటేల్ 1979 జనవరి 24 1979 జూలై 28 185 రోజులు
(9) యశ్వంత్ రావు చవాన్ 1979 జూలై 28 1980 జనవరి 14 170 రోజులు భారత జాతీయ కాంగ్రెస్ (Urs) చరణ్ సింగ్
15 జ్ఞాని జైల్ సింగ్ 1980 జనవరి 14 1982 జూన్ 22 2 సంవత్సరాలు, 159 రోజులు భారత జాతీయ కాంగ్రెస్
16 రామస్వామి వెంకటరామన్ 1982 జూన్ 22 1982 సెప్టెంబరు 2 72 రోజులు
17 ప్రకాష్ చంద్ర సేథీ 1982 సెప్టెంబరు 2 1984 జూలై 19 1 సంవత్సరం, 321 రోజులు
18 పి.వి.నరసింహారావు 19 July 1984 1984 డిసెంబరు 31 165 రోజులు ఇందిరా గాంధీ,
రాజీవ్ గాంధీ
19 శంకర్రావు చవాన్ 1984 డిసెంబరు 31 1986 మార్చి 12 1 సంవత్సరం, 71 రోజులు రాజీవ్ గాంధీ
(18) పి.వి.నరసింహారావు 1986 మార్చి 12 12 May 1986 61 రోజులు
20 బూటా సింగ్ 1986 మే 12 1989 డిసెంబరు 2 3 సంవత్సరాలు, 204 రోజులు
21 ముఫ్తీ మహ్మద్ సయ్యద్ 1989 డిసెంబరు 2 1990 నవంబరు 10 343 రోజులు జనతాదళ్ (నేషనల్ ఫ్రంట్) వి.పి.సింగ్
22 చంద్రశేఖర్ 1990 నవంబరు 10 1991 జూన్ 21 223 రోజులు సమాజ్‌వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ) చంద్రశేఖర్
(19) శంకర్రావ్ చవాన్ 1991 జూన్ 21 1996 మే 16 4 సంవత్సరాలు, 330 రోజులు భారత జాతీయ కాంగ్రెస్ పి.వి.నరసింహారావు
23 మురళీ మనోహర్ జోషి 1996 మే 16 1996 జూన్ 1 16 రోజులు భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజపేయి
24 హెచ్.డి.దేవెగౌడ 1996 జూన్ 1 1996 జూన్ 29 28 రోజులు జనతాదళ్ (యునైటెడ్ ఫ్రంట్) హెచ్.డి.దేవెగౌడ
25 ఇంద్రజిత్ గుప్తా 1996 జూన్ 29 1998 మార్చి 19 1 సంవత్సరం, 263 రోజులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్ ఫ్రంట్) హెచ్.డి.దేవెగౌడ,
ఐ.కె. గుజ్రాల్
26 ఎల్.కె.అద్వానీ 1998 మార్చి 19 2004 మే 22 6 సంవత్సరాలు, 64 రోజులు భారతీయ జనతా పార్టీ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) అటల్ బిహారీ వాజపేయి
27 శివరాజ్ పాటిల్ 2004 మే 22 2008 నవంబరు 30 4 సంవత్సరాలు, 192 రోజులు భారత జాతీయ కాంగ్రెస్ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) మన్మోహన్ సింగ్
28 పి.చిదంబరం 2008 నవంబరు 30 2012 జూలై 31 3 సంవత్సరాలు, 244 రోజులు
29 సుశీల్ కుమార్ షిండే 2012 జూలై 31 2014 మే 26 1 సంవత్సరం, 299 రోజులు
30 రాజ్‌నాథ్ సింగ్ 2014 మే 26 2019 మే 30 5 సంవత్సరాలు, 4 రోజులు భారతీయ జనతా పార్టీ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) నరేంద్ర మోదీ
31 అమిత్ షా 2019 మే 30 అధికారంలో ఉన్న వ్యక్తి[2] 5 సంవత్సరాలు, 173 రోజులు

రాష్ట్ర మంత్రుల జాబితా

[మార్చు]
హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రులు
రాష్ట్ర మంత్రి చిత్రం రాజకీయ పార్టి పదవీకాలం సంవత్సరాలు, రోజుల్లో
సుబోధ్ కాంత్ సహాయ్ జనతాదళ్ 1990 ఏప్రిల్ 23 1991 జూన్ 21 212 రోజులు
శ్రీప్రకాష్ జైస్వాల్ భారత జాతీయ కాంగ్రెస్ 2004 మే 23 2009 మే 22 4 సంవత్సరాలు, 364 రోజులు
ముళ్లపల్లి రామచంద్రన్ 2009 మే 28 2014 మే 26 4 సంవత్సరాలు, 363 రోజులు
రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ 2012 అక్టోబరు 28 2014 మే 26 1 సంవత్సరం, 210 రోజులు
కిరణ్ రిజిజు భారతీయ జనతా పార్టీ 2014 మే 26 2019 మే 30 5 సంవత్సరాలు, 4 రోజులు
హరిభాయ్ పార్థిభాయ్ చౌధరి 2014 నవంబరు 9 2016 జూలై 5 1 సంవత్సరం, 239 రోజులు
హన్సరాజ్ గంగారామ్ అహిర్ 2016 జూలై 5 2019 జూలై 25 3 సంవత్సరాలు, 20 రోజులు
జి.కిషన్ రెడ్డి 2019 మే 30 2021 జూలై 7 2 సంవత్సరాలు, 38 రోజులు
నిత్యానంద్ రాయ్ 2019 మే 30 అధికారంలో ఉన్న వ్యక్తి[3] 5 సంవత్సరాలు, 173 రోజులు
అజయ్ కుమార్ మిశ్రా 2021 జూలై 7 అధికారంలో ఉన్న వ్యక్తి[3] 3 సంవత్సరాలు, 135 రోజులు
నిసిత్ ప్రమాణిక్ 2021 జూలై 7 అధికారంలో ఉన్న వ్యక్తి[3] 3 సంవత్సరాలు, 135 రోజులు

మూలాలు

[మార్చు]
  1. "About the ministry | Ministry of Home Affairs | GoI". www.mha.gov.in. Retrieved 2021-11-26.
  2. DelhiMay 31, India Today Web Desk New; May 31, 2019UPDATED:; Ist, 2019 17:24. "Amit Shah is Home Minister, Rajnath is Defence Minister: Full list of new portfolios in Modi govt". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-11-26. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. 3.0 3.1 3.2 "Minister of State | Ministry of Home Affairs | GoI". www.mha.gov.in. Retrieved 2021-11-26.

బాహ్య లింకులు

[మార్చు]