Jump to content

బి.ఎస్.యడ్యూరప్ప

వికీపీడియా నుండి
(యడియూరప్ప నుండి దారిమార్పు చెందింది)
బి.ఎస్.యడ్యూరప్ప
బి.ఎస్.యడ్యూరప్ప

బి.ఎస్.యడ్యూరప్ప


కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలం
2019 జులై 26 – 2021 జులై 26
గవర్నరు వాజుభాయ్ వాలా
తల్వార్ చాంద్ గెహ్లాట్
ముందు కుమారస్వామి
తరువాత --
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత డి.వి.సదానంద గౌడ
పదవీ కాలం
2007 నవంబరు 12 – 2007 నవంబరు 19
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత రాష్ట్రపతి పాలన

5వ డిప్యూటీ ముఖ్యమంత్రి
పదవీ కాలం
2006 ఫిబ్రవరి 3 – 2007 అక్టోబరు 9
ముందు ఏం.పి .ప్రకాష్
పదవీ కాలం
2004 జూన్ 9 – 2006 ఫిబ్రవరి 2
ముందు జగదీశ్ శెట్టర్
పదవీ కాలం
2018 మే – 2019 జులై
ముందు జగదీష్ శెట్టర్
తరువాత సిద్దరామయ్య

వ్యక్తిగత వివరాలు

జననం (1943-02-27) 1943 ఫిబ్రవరి 27 (వయసు 81)[1]
బూకనాకెరా, మాండ్యా జిల్లా, కర్ణాటక
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2012 వరకు ; 2014–)
ఇతర రాజకీయ పార్టీలు కర్ణాటక జనతా పక్ష (2012 నుండి 2014వరకు)
జీవిత భాగస్వామి
మైత్రిదేవి
(m. 1967; died 2004)
సంతానం బి.వై. రాఘవేంద్ర, బి.వై. విజయేంద్ర సహా 5
సంతకం బి.ఎస్.యడ్యూరప్ప's signature

దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నేతలలో ఒకడైన బి.ఎస్.యడ్యూరప్ప 1943, ఫిబ్రవరి 27న మాండ్య జిల్లా లోని బూకనాకెరెలో జన్మించాడు.[2]) 1970లోనే శికారిపుర శాఖకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమించబడి 1972లో తాలుకా శాఖకు జనసంఘ్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1975లో శికారిపుర పురపాలక సంఘపు అధ్యక్షుడిగా వ్యవహరించి అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు కూడా వెళ్ళినాడు.

1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో శికారిపుర తాకుకా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగాను, ఆ తరువాత శిమోగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగాను పనిచేశాడు. 1988 నాటికి కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎదిగాడు.

1983లో శికారిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభలో ప్రవేశించి అప్పటినుంచి వరుసగా అదే స్థానం నుంచి ఎన్నికవుతూ వస్తున్నాడు. 2007 నవంబర్‌లో ముఖ్యమంత్రి పీఠం దక్కిననూ జనతాదళ్ (ఎస్) మద్దుతు కొనసాగించుటకు నిరాకరించడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. 6 మాసాల రాష్ట్రపతి పాలన అనంతరం జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో మే 30, 2008న రెండో పర్యాయం కర్ణాటక ముక్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. యడ్యూరప్ప దక్షిణ భారతదేశంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి భారతీయ జనతా పార్టీ నేతగా రికార్డు సృష్టించాడు.[3] ఇతని అసలుపేరు యడియూరప్ప కాగా 2007లో జ్యోతిష్యుడి సలహాతో యడ్యూరప్పగా పేరుమార్చుకున్నాడు.[4]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

యడ్యూరప్ప 1943, ఫిబ్రవరి 27న కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనాకెరెలో సిద్ధిలింగప్ప, పుట్టథాయమ్మ దంపతులకు జన్మించాడు.[5][6] అతడు నాలుగేళ్ళ వసులో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది.[3] ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తిచేసి 1965లో సాంఘిక సంక్షేమ శాఖలో ఫస్ట్ డివిజన్ క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

యడ్యూరప్ప 1967లో వీరభద్రశాస్త్రి కూతురైన మైత్రిదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు (రాఘవేంద్ర, విజయేంద్ర), ముగ్గురు కుమారైలు (అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి).[7] 2004లో భార్య ప్రమాదావశాత్తు మరణించింది.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

1970లో శికారిపుర యూనిట్‌కు రాష్ట్రీయ స్వంయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమించబడుటలో యడ్యూరప్ప రాజకీయ జీవితం ఆరంభమైంది. 1972లో జనసంఘ్ తాలుకా శాఖకు అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.[7] 1975లో శికారిపుర పురపాలక సంఘపు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1975లోనే ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి విధించుటతో అనేక నాయకులతో పాటు యడ్యూరప్ప కూడా జైలుకు వెళ్ళవలసి వచ్చింది.

1975 నుంచి 1977 వరకు బళ్ళారి, శిమోగా జైళ్ళలో జీవనం కొనసాగించాడు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించుటలో పాత జనసంఘ్ నేతలతో పాటు యడ్యూరప్ప కూడా భారతీయ జనతా పార్టీలో చేరి శిమోగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని పొందినాడు. 1988 నాటికి కర్ణాటక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనాడు. అదే సంవత్సరంలో తొలిసారిగా శాసనసభకు పోటీచేసి శికారిపుర నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. అప్పటి నుంచి వరుసగా ఐదు పర్యాయాలు అదే నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తున్నాడు. కర్ణాటక 10వ శాసనసభకు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు.

1999లో ఎన్నికలలో ఓడిపోయిననూ పార్టీ తరఫున ఎగువసభకు నామినేట్అయ్యాడు.[2] ధరంసిం ప్రభుత్వాన్ని పడగొట్టుటకు జనతాదళ్ (ఎస్) కు చెందిన కుమారస్వామితో జతకట్టి చెరి సగం రోజులు ప్రభుత్వం ఏర్పాటుచేయాలనే ఒప్పందం కుదుర్చుకొని తొలుత కుమారస్వామి ముఖ్యమంత్రిత్వానికి మద్దతు పలికినాడు. యడ్యూరప్ప కుమారస్వామి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 20 మాసాల గడుపు తీరిపోయిననూ కుమారస్వామి భారతీయ జనతా పార్టీకు అధికారం అప్పగించకపోవడంతో భాజాపా అగ్రనేతలు జోక్యం చేసుకొని చివరకు యడ్యూరప్పకు 2007 నవంబరులో అధికారం అప్పగించిననూ కుమారస్వామి మనసుమార్చుకొని వెంటనే మద్దతు ఉపసంహరించడంతొ వారంరోజులకే దక్షిణ భారతదేశంలో ఏర్పడిన తొలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయింది. 6 మాసాల రాష్ట్రపతి పాలన అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో భాజాపా దాదాపు పూర్తి మెజారిటీ సాధించింది. యడ్యూరప్పను ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించినందువల్ల ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి అవాంతరం జరుగలేదు. యడ్యూరప్ప స్వయంగా మళ్ళీ శికారిపుర శాసనసభ నియోజక వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బంగారప్పపై 45 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించాడు. 2008, మే 30న యడ్యూరప్ప రెండో పర్యాయం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[8]

2012లో స్థాపించబడిన కర్ణాటక జనతా పక్షపార్టీకి నాయకత్వం వహించాడు, ఈ పార్టీ 2014లో భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "National Portal of India".
  2. 2.0 2.1 "బి.ఎస్.యడ్యూరప్ప". Online webpage of the Legislative Bodies of India. Government of India. Archived from the original on 2008-05-30. Retrieved 2007-11-12.
  3. 3.0 3.1 "Yeddyurappa's journey from farming to కర్ణాటక ముఖ్హ్యమంత్రి ship". Online Edition of The Hindu dated 2007-11-12. Archived from the original on 2007-11-14. Retrieved 2007-11-12.
  4. "Parade done, over to Raj Bhavan, Path cleared for BJP reins". Online Edition of The Telegraph, dated 2007-10-30. Retrieved 2007-11-12.
  5. "Yeddyurappa to become BJP's first CM in South". Archived from the original on 2007-11-27. Retrieved 2007-11-12.
  6. "బి.ఎస్.యడ్యూరప్ప". Online webpage of the Karnataka Legislature. Archived from the original on 2008-06-06. Retrieved 2007-11-12.
  7. 7.0 7.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; family అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. http://abclive.in/abclive_regional/yeddyurappa-karnataka-cm.html[permanent dead link]