వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం.

ఈ వారపు వ్యాసం

2024 44వ వారం

ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా
నితిష్ కుమార్ (బీహార్ ముఖ్యమంత్రి)
ఖండూ (అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి)
చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి)
భారతదేశ ముఖ్యమంత్రులు

గణతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరిస్తాడు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల లోని 3 ప్రాంతాలకి ముఖ్యమంత్రులు ఉంటారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్థాయి ప్రభుత్వానికి గవర్నరు అధిపతి అయిన నిర్వహణ విషయాలు ముఖ్యమంత్రి చేపడతారు. ఆ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నరు ఆహ్వానం పంపుతాడు, అలా గెలుపొందిన పార్టీ లేదా కూటమి నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. అలాగే వివిధ శాఖలకు మంత్రులను కూడా గవర్నరే నియమిస్తాడు. ప్రభుత్వం ఏర్పరచిన పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు, ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు.ప్రస్తుతం జమ్మూ కాశ్మీరు మినహాయించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలకు అనగా 30 మంది భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరిలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ కు చెందిన చెందిన మమతా బెనర్జీ. 2000 మార్చి 5 నుండి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా 21 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈ పదవిని అత్యధిక కాలంగా చేపడుతున్నాడు. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ అత్యదికంగా 7 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.
(ఇంకా…)




ప్రతిపాదించడం

క్రింద ఇవ్వబడిన సూచనలు గమనించి, మీరు ప్రతిపాదించ దలచుకొన్న వ్యాస చర్చాపేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూసను ఉంచండి. ఏదైనా వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా మొదటిపేజీలో ప్రదర్శించాలంటే, దానికి కింది అర్హతలుండాలి

  • వ్యాసం కనీసం ఐదు కిలోబైట్లకు మించి ఉండాలి. 10 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
  • వ్యాసం గతంలో ఎపుడైనా విశేష వ్యాసముగాగానీ, ఈ వారం వ్యాసంగా కానీ ప్రదర్శింపబడి ఉండరాదు (ఇదివరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసపు నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసులుబాటు ఇవ్వవచ్చు).
  • వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణనలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదం చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
  • వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.

తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.


వ్యాసం వార నిర్ణయం

పండగలు, చారిత్రాత్మక రోజులు, ప్రస్తుత ఘటనలకు సంబంధించిన విషయాలను బట్టి వారం వ్యాసాన్ని నిర్ణయించండి. /2024 ISO కేలండర్ వారం సంఖ్య, /2025 ISO కేలండర్ వారం సంఖ్య లను చూడండి. వారం వ్యాసం ప్రపంచ ప్రామాణిక కాలం (UTC/GMT) ప్రకారం మారుతుందని (అంటే భారతదేశంలో సోమవారం ఉదయం 05:30 గంటలకు) గమనించండి. వారం వ్యాసం పేరు, వారంతో ప్రత్యేక సంబంధము వివరాలు వున్నప్పుడు రాయండి. ఎంపికకు వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు వర్గాన్ని చూడండి. యాంత్రిక అనువాద వ్యాసాలుగా గుర్తించినవాటి నాణ్యత పెంపొందించటంలో (ఎరుపు లింకులు తొలగించటం, స్థానికత దగ్గరైన వివరాలు చేర్చటం లాంటివి) ప్రత్యేక శ్రద్ద కావాలని గమనించండి

నిశ్చయమైన వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} ను చెరిపేసి {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=????|వారం=??}} అన్న మూసను ఉంచండి.

వ్యాస పరిచయ రూపం సృష్టించడం

"ఈ వారం వ్యాసం" పరిచయ రూపంలో దీనిలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మలు మాత్రమే వాడాలి.

2024 జాబితా

2024 సంవత్సరానికి గాను వీలయినంతవరకు ఈ జాబితా ప్రకారం "ఈ వారం వ్యాసం" పరిచయ రూపాన్ని (వ్యాస ప్రవేశికలో మొదటి కొన్ని పేరాలు)(కనీసం వారం రోజుల ముందుగా) తయారు చేయాలి. క్రింద నున్న పట్టికలో సంబంధిత వారం అంకెను నొక్కితే "ఈ వారం వ్యాసం - ఫలాని వారం" అనే ఖాళీ పేజీ {{ఈ వారపు వ్యాసం/preload}} కోడ్ తో తెరుచుకొంటుంది. ఎంపిక చేసిన వ్యాసం పేరు, వ్యాసం బొమ్మ పేరు, వ్యాసం పరిచయంనుండి కొంతభాగం ఆ పేజీలో చేర్చాలి. ఆ వ్యాసపు పేరుని క్రింది పట్టికలో లింకుగా పేర్కొనాలి.

ఈ వ్యాసాలు ప్రదర్శనకు ముందు కొంత మెరుగు పరచవలసిన అవుసరం ఉందని గమనించగలరు. పరిచయం, అక్షర దోషాలు, అంతర్వికీ లింకులు, కాపీ హక్కులు, తటస్థత వంటి విషయాలను తప్పక పరిశీలించండి.

2025 జాబితా

2025 సంవత్సరానికి గాను వీలయినంతవరకు ఈ జాబితా ప్రకారం "ఈ వారం వ్యాసం" పరిచయ రూపాన్ని (వ్యాస ప్రవేశికలో మొదటి కొన్ని పేరాలు)(కనీసం వారం రోజుల ముందుగా) తయారు చేయాలి. క్రింద నున్న పట్టికలో సంబంధిత వారం అంకెను నొక్కితే "ఈ వారం వ్యాసం - ఫలాని వారం" అనే ఖాళీ పేజీ {{ఈ వారపు వ్యాసం/preload}} కోడ్ తో తెరుచుకొంటుంది. ఎంపిక చేసిన వ్యాసం పేరు, వ్యాసం బొమ్మ పేరు, వ్యాసం పరిచయంనుండి కొంతభాగం ఆ పేజీలో చేర్చాలి. ఆ వ్యాసపు పేరుని క్రింది పట్టికలో లింకుగా పేర్కొనాలి.

ఈ వ్యాసాలు ప్రదర్శనకు ముందు కొంత మెరుగు పరచవలసిన అవుసరం ఉందని గమనించగలరు. పరిచయం, అక్షర దోషాలు, అంతర్వికీ లింకులు, కాపీ హక్కులు, తటస్థత వంటి విషయాలను తప్పక పరిశీలించండి.

ఇవి కూడా చూడండి

సంవత్సరం వారీగా సాధారణ జాబితా, కంప్యూటర్ ద్వారా విశ్లేషణకు ఉపయోగం

వ్యాసాల చర్చాపేజీల వర్గాలు

ప్రదర్శిత సంవత్సరం వారీగా

ప్రదర్శిత వారం వారీగా

వ్యాస పరిచయపేజీలు

వ్యాస పరిగణనలు

ఇతరాలు