వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 38

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 37 | పాత చర్చ 38 | పాత చర్చ 39

alt text=2015 జనవరి 31 - 2015 మార్చి 8 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2015 జనవరి 31 - 2015 మార్చి 8

ఆటోవికీబ్రౌజర్ శిక్షణ

[మార్చు]

నేనిదివరకు అదిచేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి చేయకపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి కాబట్టి, మీరు దీన్ని ఒకింత అనుమానపు దృష్టితో చూడ్డంలో తప్పేంలేదు సుమీ. కాకపోతే చాలమంది సభ్యులు బాటులు చెయ్యగలిగే పనులు మేం చెయ్యలేమని చేతులెత్తెయ్యటం చూసి ఈ శిక్షణ ఒకటి కొంతమంది ఆసక్తి ఉన్న సభ్యులకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎలాంటి స్క్రిప్టులు వ్రాయకుండా బాటు చెయ్యగలిగే పనులు చేయించగలగటం ఆటోవికీబ్రౌజర్ విశిష్టత. ఇది ఒక్క చిన్న ఉచిత సాఫ్టువేరు. ప్రోగ్రామింగుతో పనిలేకుండా కాస్త కంప్యూటర్లు ఎలా ఆలోచిస్తాయి అన్న దృష్టి కలవారందరూ దీన్ని అవలీలగా ఉపయోగించగలరు. దీనిపై కొంత సమాచారం ఇక్కడ చూడండి en:Wikipedia:AutoWikiBrowser. శిక్షణ ఒక రెండు గంటల పాటు ఉంటుంది. సైపు + join.me ఉపయోగించి hands-on శిక్షణ ఇవ్వగలను. వారాంతాలు, అపరాత్రులు (మా టైము లెండి) దీనికి సరైన సమయం. ఆసక్తి ఉన్నవారు ఒక చోట చేరితే ఇంకనూ మంచింది. అయినా మీరు అంతదాక కూడా ఆగనవసరం లేదు. సాఫ్టువేరును దింపుకొని మీరే ప్రయత్నించి చూడండి. --వైజాసత్య (చర్చ) 22:40, 31 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇటీవలి కాలంలో సభ్యుల దిద్దుబాట్లను దృష్టిలో ఉంచుకుంటే ఇది చాలా ఆవశ్యకమైన శిక్షణా కార్యక్రమంగా చెప్పవచ్చు. బాటు లేనివారికి ఇది చాలా అవసరం అనుకుంటున్నాను. నేను సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకున్ననూ పనిచేయడం లేదు. శిక్షణా సమయం తెలిపితే నేనూ హాజరౌతాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:22, 1 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నాకూ నేర్చుకోవాలని ఉన్నది. సమయం తెలియజేస్తే స్కైప్ లో నేను కూడా చేరి తెలుగుకుంటాను; ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 10:45, 1 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నాకూ నేర్చుకోవాలని ఉన్నది. సమయం తెలియజేస్తే స్కైప్ లో నేను కూడా చేరి తెలుగుకుంటాను --కశ్యప్ (చర్చ) 05:42, 2 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ, కశ్యప్ గారూ, ఇక తెవికీ ఉత్సవాలు ముగిసాయి కాబట్టి మనం ఈ శిక్షణ కార్యక్రమం పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను. మీరిద్దరూ భాగ్యనగరంలోనే ఉంటారు కాబట్టి, ఒక చోటికి చేరి, ఒక కంప్యూటరు పెట్టుకుంటే నేను శిక్షణ ఇవ్వగలను. మీకు వీలైన సమయాన్ని ప్రతిపాదించగలరు. చంద్రకాంతరావు గారిని వారి వీలున్న సమయం గురించి ఇదివరకే సంప్రదించాను. --వైజాసత్య (చర్చ) 05:19, 20 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మాకు శనివారం రాత్రి అయితే మీకు శనివారం ఉదయం అవుతంది కదా. ఆ సమయమం మాకు మరియు మీకు సౌకర్యంగా ఉంటుంది. అనగా 21 తేదీ రాత్రి 8 గంటలు అందరికీ ఆమోదమైతే ఆ సమయానికి మేము ఏం చేయాలో తెలియజేస్తే మేము సిద్ధంగా ఉంటాము.--Rajasekhar1961 (చర్చ) 06:04, 20 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ, భారత సమయం 21 తేదీ రాత్రి 8:30 కైతే నాకు బాగా కుదురుతుంది. మీ కంప్యూటర్లో join.me ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకోండి. నేను కాన్ఫరెన్సు కోడు ఇస్తాను. దాన్ని ఉపయోగించుకొని లాగిన్ అవ్వచ్చు. అలాగే స్కైపు ద్వారా మాట్లాడుకోవచ్చు. మిగిలిన విషయాలు నేను ఈమెయిల్ చేస్తాను --వైజాసత్య (చర్చ) 06:30, 20 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. నేను ఆ సమయంలో తయారుగా ఉంటాను. join.me నేను వాడుతున్నాను. అవకాశం ఉన్న వికీ సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.--Rajasekhar1961 (చర్చ) 07:08, 20 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. ఆ సమయంలో నేనూ తయారుగా ఉంటాను.--కశ్యప్ (చర్చ) 07:36, 20 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ శిక్షణ నేర్చుకున్న వారు, శిక్షణా కార్యక్రమమును వ్యాసరూపములోనికి తయారు చేసేందుకు అవకాశము ఉంటే (కనీసం ప్రధాన విషయములు) తప్పకుండా ఎక్కడైనా పొందుపరచిన యెడల మా లాంటి వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మీతో పాటు శిక్షణకు కూర్చున్ననూ, అంత త్వరగా నాకు అర్థము కాక, మీకు ఇబ్బంది కలిగించిన వాడను అవ్వవచ్చును. అలాగే నాకు పనికి వచ్చే బాటులు ఏమైనా ఉంటే, ఎందుకు పనికి వస్తాయో ఉటంకిస్తూ నా పేజీలో ఉంచినా, వాటిని వాడుకకు ఉపయోగించ గలను. JVRKPRASAD (చర్చ) 07:17, 20 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక వద్ద సాధారణంగా జరిగే తప్పులను వాటి యొక్క సరైన స్పెల్లింగ్ జాబితా ఉన్నది. దీనిని విస్తరించి; పిదప AWB ఉపయోగించి తెలుగు వికీపీడియా వ్యాసాలలోని దోషాల్ని సుళువుగా సరిచేయవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 05:42, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదివరకు సాఫ్ట్‌వేర్ పనిచేయలేదు కాని నిన్న మళ్ళీ ప్రయత్నం చేసిచూశాను. చక్కగా పనిచేసింది. AWB వల్ల కేవలం అక్షరదోషాలు, చిన్నచిన్న దిద్దుబాట్లే కాకుండా వ్యాసాలలో సమాచారం కూడా చేర్చవచ్చని గమనించాను. దీనిపై మనం పట్టు సాధిస్తే మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. అతి సునాయాసంగా స్వల్పవ్యవధిలోనే వేలాది దిద్దుబాట్లను మనం అనుకున్నట్లుగా చేర్చడానికి మరియు మన విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడానికి దీనివల్ల వీలవుతుంది. ముఖ్యంగా గ్రామ వ్యాసాలలో సమాచారం చేర్చేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయోగాత్మకంగా "if ఫంక్షన్" కూడా ఉపయోగించి ప్రివ్యూ చూశాను. కొద్దిగా లాజిక్ ఉపయోగిస్తే మనం దీన్నుంచి విపరీతమైన ఫలితాలు పొందవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:49, 25 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సి. చంద్ర కాంత రావు గారు, నమస్కారము. ఇదివరకు మూసలు దిగుమతి కాలేదు. ఈ వారంలోనే అన్ని మూసలు దిగుమతి చేశాను. మీ స్పందన మరియు అభిప్రాయముతో ఏకీభవిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 23:27, 25 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారు, మూసలు దిగుమతి చేసి AWB వాడుకను సులభతరం చేసినందుకు కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:12, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అందరూ చక్కగా ఈ పరికరాన్ని ఉపయోగించుకుంటున్నందుకు చాలా సంతోషం. చంద్రకాంతరావు గారూ మీకేమైనా వాడుకలో సందేహాలుంటే నేను సహాయపడగలను. అలాగే ఆటోవికీబ్రౌజరు వాడుతున్న ఇతర వాడుకరులకు, ఏవైనా సందేహాలుంటే సందేహనివృత్తి కోసం మనం మరో చిన్న స్కైపు, జాయిన్.మి సమావేశం ఏర్పాటుచేసుకోవచ్చు. --వైజాసత్య (చర్చ) 20:53, 1 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, అలాగే చేద్దాం. నేను ఈ పరికరాన్ని ఒక్క రోజు మాత్రమే వాడి పరిశీలించాను, మరికొన్ని సార్లు ఉపయోగిస్తే దీన్నుంచి మరెంత ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్నించి గరిష్ట ప్రయోజనం పొందడానికి ప్రయత్నిద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:30, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఫిబ్రవరి నెల మొలకల జాబితా

[మార్చు]

ఫిబ్రవరి నెలకు గానూ మొలకల జాబితా (జనవరి ౨౦౧౫ లో రూపొందించినవి) ఇక్కడ చూడవచ్చు. ఎవరి మొలకల బాధ్యత వారిదే! --రహ్మానుద్దీన్ (చర్చ) 00:33, 1 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]


11 వ వార్షికోత్సవానికి వికీపీడియనులకు ఆహ్వానము గురించి

[మార్చు]

తిరుపతిలో జరుగ బోవు 11 వ వార్షికోత్సవాలకు వికీపీడియనులకు ఆహ్వానము పెట్టారు. అందులో ఆహ్వానించ దగిన వారికి కొన్ని షరతులు గతంలో వుండేవి. అనగా ఇన్ని మార్పులు చేర్పులు చేసి వుండాలని. ప్రస్తుతం అటువంటి నిబందన ఏమీ కనబడ లేదు. అందువలన ప్రతిఒక్కరు తమ పేరును నామోదు చేసుకునే అవకాశమున్నది. కేవలము తిరుపతి కి రావడానికే తమ పేరును నామోదు చేసుకున్నట్లుంది, కొందరు ఒక్క దిద్దుబాటు కూడ చేయకుండా కూడ తమ పేరును నామోదు చేసుకున్నట్టు గమనించాను.

ఇప్పటికే మొత్తం 35 మంది తమ పేర్లను నామోదు చేసుకున్నారు. వీరిలో 2015 లో మాత్రమే తమ పేర్లను వికీపీడియాలోను, తిరుపతి సభలకు ఆహ్వాన పుటలోను, నామోదు చేసుకున్నారు. ఇటువంటి వారు సుమారు 15 మందిగా వున్నట్టు నేను గ్రహించాను. సమయమున్నందున ఇంకా వీరి సంఖ్య పెరిగే అవకాశమున్నది. ఇలాగైతే....... వారికి వసతి, రవాణ సౌకర్యాలను కల్పించడములో చాల అసౌకర్యానికి గురికావలసి వస్తుంది. కనుక ఈ సమావేశాలకు వచ్చే వికీపీడియనులకు ఒక నియమము పెట్టి అట్టి వారికి మాత్రమే ఈ వసతి, రవాణ సౌకర్యాలను పొందడానికి అర్హత వుంటుంది అని ఆహ్వానములోనే పొందుపరచ వలసిన అవసరము ఎంతో వున్నది. ఇది వెంటనే చేయవలసిన కార్యక్రమము. ఎల్లంకి (చర్చ) 03:51, 3 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]


IMPORTANT: Admin activity review

[మార్చు]

Hello. A policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc) was adopted by global community consensus in 2013. According to this policy, the stewards are reviewing administrators' activity on all Wikimedia Foundation wikis with no inactivity policy. To the best of our knowledge, your wiki does not have a formal process for removing "advanced rights" from inactive accounts. This means that the stewards will take care of this according to the admin activity review.

We have determined that the following users meet the inactivity criteria (no edits and no log actions for more than 2 years):

  1. S172142230149 (administrator)

These users will receive a notification soon, asking them to start a community discussion if they want to retain some or all of their rights. If the users do not respond, then their advanced rights will be removed by the stewards.

However, if you as a community would like to create your own activity review process superseding the global one, want to make another decision about these inactive rights holders, or already have a policy that we missed, then please notify the stewards on Meta-Wiki so that we know not to proceed with the rights review on your wiki. Thanks, Openbk (talk) 17:37, 3 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విశిష్ట వికీపీడియన్లు

[మార్చు]

విశిష్ట వికీపీడియన్లు ప్రతి సంవత్సరము విశేష కృషి చేసిన కొంతమందికి ప్రశంసాపత్రము, జ్ఞాపిక అవార్డ్ రూపంలో వార్షికోత్సవాలలో లేదా విడిగా ఏదైనా కార్యక్రమము నందు అందజేసే కార్యక్రమము చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 13:15, 4 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వారి కృషికి తగిన సత్కారం చేసి వారి కృషిిని కొత్తవాడుకరులకు వారి కృషిని చక్కని ఉదాహరణగా నిలపాలన్న ప్రతిపాదన కూడా ప్రస్తుతానికి నడుస్తోంది సర్.--పవన్ సంతోష్ (చర్చ) 14:18, 4 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కార విజేతలు 2014

[మార్చు]

నమస్కారం , తెలుగు వికీపీడియా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రారంభించబడిన కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కారమునకు ఈ సంవత్సరం తెలుగు వికీపీడియా 11 వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న మీవంటి మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ కార్యవర్గము నిర్ణయం చేసినది , సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ తెవికీ 11వ వార్షికోత్సవాలను సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

2014 సంవత్సరం లో దిద్దుబాట్ల సంఖ్య కనీస అర్హత అయినా, అదే ప్రధాన ప్రాతిపదిక కాకుండా ఆయా సభ్యుల యొక్క తెలుగు మీడియావికీ ప్రాజెక్టులలో కృషిని గుణాత్మకంగా పరిగణించి వీరిని ఎంపికచేయటం జరిగింది. ఈ పురస్కారంలో భాగంగా ఒక్కొక్క గ్రహీతకు ఒక ప్రశంసా పత్రంతో పాటు, పదివేల నగదు బహుమతి కూడా ఇవ్వబడుతుంది .


కొలరావిపు-2014 పురస్కార విజేతలు

  • శ్రీమతి టి.సుజాత T.sujatha
  • శ్రీ రాజశేఖర్ Rajasekhar1961
  • శ్రీ షేక్ ఖాదర్ బాష (సుల్తాన్ ఖాదర్)
  • శ్రీ పవన్ సంతోష్ Pavan santhosh.s
  • శ్రీ వెంకట రమణ Kvr.lohith
విజేతలకు అభినందనలు ----కశ్యప్ (చర్చ) 02:17, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
విజేతలకు హార్ధిక అభినందనలు--స్వరలాసిక (చర్చ) 09:13, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
కొలరావిపు-2014 పురస్కార విజేతలకు అభినందనలు ---Naidugari Jayanna (చర్చ) 15:01, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Ya k JVRKPRASAD garu thqq soo much..
అందరికీ ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 04:14, 12 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అభినందనలు తెలియజేస్తున్న సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. --t.sujatha (చర్చ) 04:58, 12 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అభినందనలు తెలియజేసిన సభ్యులందరికీ నా ధన్యవాదాలు. విశేషకృషి చేసిన ఇతర విజేతలకు నా మనస్పూర్తి అభినందనలు.--Rajasekhar1961 (చర్చ) 05:38, 12 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అభినందనలు తెలియజేసిన సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఇతర విజేతలకు నా మనస్పూర్తి అభినందనలు.-- కె.వెంకటరమణ 08:10, 12 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యుల అభినందలనలకు నా ధన్యవాదాలు. పురస్కారానికి ఎంపికైన నా తోటి సభ్యులకు శుభాభినందనలు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:08, 12 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు నివేదిక - Tewiki 11th Anniversary Report

[మార్చు]

తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవాల నివేదిక కొరకు ఇక్కడ చూడగలరు. Pranayraj1985 (చర్చ) 18:35, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఎవరి గురించో వ్రాస్తాము - మనవాళ్ళ కృషి గురించి వ్రాయకూడదు - మనకు తెలియదు

[మార్చు]

ఇక్కడ ఎవరెవరి గురించో వ్రాస్తాము కానీ వాడుకరులు మనవాళ్ళ కృషి గురించి మనము ఇక్కడ వ్రాయకూడదు. మన వాడుకరులు అందరి కృషి, వారు వారు వికీపీడియాకు చేసిన సేవలు గురించి మనకు తెలియదు. తెలియ కూడదు అన్న భావన ఎవరికీ ఉండదు. కానీ వారి కృషి ఎలా తెలుస్తుంది ? ఇది ఆలోచించాల్సిన విషయము. JVRKPRASAD (చర్చ) 07:31, 18 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియన్ల కృషిని గురించి మీ వంటి సీనియర్లు శాస్త్రీయమైన అధ్యయనం చేసి, వారి ఎడిట్లు, క్వాలిటీ వంటివే కాకుండా పలు పాలసీ విషయాల్లోనూ, సాంకేతికాంశాలపైనా వారి కృషిని సవివరంగా తెలియజేస్తూ మీ ప్రయగశాలలో వ్రాయండి. విడివిడిగా వ్యక్తుల గురించి వ్రాసి పెట్టండి. వికీపీడియాలో నిబంధనల కారణంగా మనం వ్రాయలేకపోయినా మీ ప్రాధాన్యతను అనుసరించి వేరేదైనా సాంకేతిక/సాహిత్య పత్రికల్లో ప్రచురణ చెందేలా ప్రయత్నం చేద్దాము. సీరీస్ గా వేయవచ్చు. కానైతే వికీపీడియాలో ఆర్టికల్ రాసినట్టుగానే అత్యంత చక్కని రిఫరెన్సులతో, వికీ వాతావరణానికి ఏమాత్రం పరిచయం లేనివారికి వివరించేందుకు వీలుగా చాలా విపులంగా వ్రాయాల్సివుంటుంది. వికీకి ప్రాథమిక పరిశోధన సరిపడదు కనుక మీవంటివారి విలువైన ఆర్టికల్స్ వేరెక్కడైనా ప్రచురింపజేయడం నా వంతు బాధ్యతగా స్వీకరిస్తాను.--పవన్ సంతోష్ (చర్చ) 10:06, 18 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ , మీ వయసు ప్రాధాన్యం కాదు కానీ, మీకు వికీ అనుభవం ఎంత అని ప్రశ్నించను కానీ, ఇక్కడ అందరూ సమానమే కాబట్టి మీరు నాకు మీకు తోచినది (లేదా ఎవరైనా సలహా అయినా కావచ్చు) వ్రాశారు. చాలా సంతోషం. ఇక్కడ కొత్తకు వింత పాతకు రోత అన్నట్లు భవిష్యత్తులో వికీ సాగకూడదు. మీరు చెప్పినది ఒక ప్రాజెక్టులా చేయాలి. మీరు మొదలు పెట్టండి. నేను సహకరిస్తాను. మీకే తెలుస్తుంది. ఎవరెవరి కృషి ఎంతగా ఉందో. వారందరినీ మనము ఎల్లప్పుడూ మర్యాదతో, గౌరవంతో సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలి. వారందరి కృషి అనన్య సామాన్య మైనది. ఇంతకాన్నా మీకు తెలియజేయడము ఈ సందర్భములో అసందర్బ ప్రస్తావన కావచ్చు. మీరు సూచించిన కార్యములో మీ వంతు సహకారము బాధ్యత పని మొదలు పెట్టి చేయగలరు. JVRKPRASAD (చర్చ) 11:12, 18 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ విషయంగా ఇప్పటికే కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. కాబట్టే టక్కున స్పందించాను. నేను నావంతు ప్రయత్నం ప్రారంభిస్తాను. ప్రచురించేందుకు వెబ్జైన్ల సహకారం తీసుకుందాం. ప్రస్తుతానికి వుంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 11:30, 18 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ మీ స్పందన ముగిసి మూసివేసినందుకు మంచిది. కానీ సరి సమాధానము వచ్చేవరకు ఈ సమస్య ముగిసినట్లు కాదు అని వాడుకరులు గ్రహించగలరు. JVRKPRASAD (చర్చ) 12:01, 18 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
జె.వి.ఆర్.కె గారూ........... మంచి ప్రతిపాదన చేసారు. ధన్యవాదాలు. ఎవరో వచ్చి చేస్తారని ఎదురు చూడకుండా...... మీరే ప్రారంబించండి.......... ఎల్లంకి (చర్చ) 15:31, 18 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సి. చంద్ర కాంత రావు గారి స్పందన

[మార్చు]
వికీపీడియాలో పనిచేయడమనేది ఒక మంచి కార్యం. మనకు తెలిసిన విషయాలను సమాజానికి అందించాలనే ఉద్దేశ్యంతో స్వచ్ఛందంగా రచనలు చేస్తూ ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసే కార్యం ఇది, కాబట్టి మన గురించి మనం ఎందుకు వ్రాసుకోకూడదనే ఆలోచన సమంజసం కాదనిపిస్తుంది. అయితే ఇక్కడ సభ్యులుగా ఉన్నందుకు వికీలలో మనపేజీలు ఉండరాదనే నిబంధనలేవీ లేవు, కాని మనం బయటి సమాజంలో పేరుప్రఖ్యాతులు పొంది మన గురించి బయటివారు తెలుసుకొనే సమయం ఆసన్నమైనప్పుడు, దానికి తగిన మూలాలున్నప్పుడు, మన పేజీలు తప్పకుండా సృష్టించబడతాయి. అయితే దానికి ఒక్కటే నిబంధన- ఆ సభ్యులు స్వయంగా ఆ పేజీలలో మార్పులు చేయరాదనేది మాత్రమే. ఇప్పటికే మన గురించి మన సంక్షిప్త సమాచారం మన సభ్యపేజీలలో వ్రాసుకునే అవకాశం ఉంది. అప్పుడప్పుడు కొందరు కొత్త సభ్యులు ఈ నిబంధనలేవీ తెలుసుకోకుండా స్వయంగా తమ గురించి పేజీలు సృష్టించడం, నిర్వాహకులు వాటిని తొలగించడం తరుచుగా జరిగుచున్న ప్రక్రియే. దాదాపు ఏడేళ్ల క్రిందట ఇప్పుడు నిర్వాహకుడిగా ఉన్న ఒక సభ్యుడు ఐపీ అడ్రస్‌తో తన గురించిన పేజీలో సమాచారం చేర్చాడనే విషయంపై పెద్ద వివాదమే జరిగింది. అదే వివాదం చిలికిచిలికి గాలివానగా మారి మరో నిర్వాహకుడు నిర్వాహకత్వమే స్వచ్ఛందంగా వదిలివేయాల్సి రావడం దురదృష్టకరమైన సంఘటనగా చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా ఇంతగా కాకున్నా ఇలాంటి వ్యవహారాలు అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాము. ఇక్కడ పనిచేసేవారు అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తూ ఎలాంటి ప్రతిఫలం అనగా డబ్బుగాని, పేరుగాని ఆశించకుండా మనకనుకూలమైన సమయంలో మనకు నచ్చిన అంశాలపై రచనలు కొనసాగిస్తున్న కార్యక్రమం, కాబట్టి గత ఏడాది పురస్కారాల సమయంలో ఇదే ఉద్దేశ్యంతో ముందస్తు "ఒప్పుకోలు"కు నేను వ్యతిరేకించాను. అప్పుడు కాకున్నా ఈసారైన ఆ నిబంధన సడలించినందుకు సంతోషమే. అంటే ఇక్కడ పనిచేసేవారు గుర్తింపును ఆశించరాదని కాకుండా మన కృషికి తగిన గుర్తింపు వచ్చినప్పుడు స్వీకరించాలనేదే నా ఉద్దేశ్యం. ఇక్కడ సభ్యులుగా పనిచేసే వారు బయటి ప్రపంచంలో పేరుపొందిన వారూ ఉన్నారు, అలాంటి వారి పేర్ల పేజీలూ సృషించబడ్డాయి. మనగురించి మనం పేజీలు సృష్టించడానికి నిబంధనలు మరింతగా సడలిస్తే అసలు ప్రముఖుల కన్నా సభ్యుల పేజీలే పెరిగే అవకాశమూ ఉంటుందని చెప్పవచ్చు. అదే సమయంలో ఇలాంటి సడలింపులను అవకాశంగా తీసుకొని, కొత్తగా సభ్యులుగా చేరి తమగురించి తాము గొప్పగా వ్రాసుకుంటూ (వ్రాయించుకుంటూ ?) తమ ప్రచారం, తమ సంస్థ ప్రచారం చేసుకుంటూ వికీలను దుర్వినియోగపరిచే వారూ ఉండవచ్చు. మనం ఏదిచేసిననూ ఇంతకు క్రితం అనుభవాలను, ఇప్పటి సంఘటనలను, ఇకముందు జరగబోయే వాటిని ఊహిస్తూ ముందడుగు వేస్తేనే ప్రణాళిక విజయవంతమౌతుంది. ఈ దృష్టితో ఆలోచిస్తే మన గురించి మనం పేజీలు సృష్టించడం విషయంలో ఇదివరకు ఉన్న నిబంధనలే చాలనిపిస్తుంది. తెవికీ సభ్యులు కూడా తమ గురించి ప్రచారం చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడరనుకుంటాను. తెవికీ సభ్యుల కృషిని పరిగణించి వ్యాసాలను తయారుచేసి బ్లాగులో ఉంచే ఉద్దేశ్యంతో ముందుగా నా అభిమాన నిర్వాహకుడిని ఈ-మెయిల్ ద్వారా సంప్రదిస్తే నాకు ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఎవరైనా సభ్యులు తమ వివరాలందిస్తే నా విజ్ఞానసర్వస్వం బ్లాగులో వారిగురించి వ్యాసం ఉంచి వారి కృషి గురించి తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే నేను స్వయంగా పరిశోధన చేసి అనేక వ్యాసాలు తయారుచేశాను. (ఉదా:కు కొన్ని చూడండి 1, 2, 3, 4) సి. చంద్ర కాంత రావు- చర్చ 20:58, 21 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మిత్రుల స్పందనలకు నా స్పందన

[మార్చు]

సి. చంద్ర కాంత రావు గారికి, నమస్కారము. ముందుగా మీ వివరములతో కూడిన సుదీర్ఘ స్పందనకు మరియు తోటి మిత్రుల స్పందనలకు ధన్యవాదములు. చంద్ర కాంత రావు గారు పొందు పరచిన ఆలోచనలు అన్నీ, నాకు ఎల్లప్పుడూ దాదాపు అలాగే ఉంటాయి. కాబట్టి వారితో ఈ విషయములో తప్పక ఏకీభవించుతాను. కానీ ప్రస్తుత విషయము యొక్క ఆలోచన కోణం వేరు. ఒకేసారి నేను సమగ్రంగా సమూలముగా సవివరముగా అందించలేక పోయినా, సంగతులు మాత్రము అర్థము అయ్యే విధముగా వీలయినప్పుడు పొందు పరచగలను.

  1. వాడుకరుల గురించి కొత్తగా పుటలు సృష్టీకరణ గురించి ప్రస్తుత విషయం ఎంత మాత్రము కాదు.
  2. వికీ వాడుకరులకు కూడా పుటలు ఉండాలని కాదు.
  3. నేను వికీ వాడుకరుల కొరకు పుటలు ఇక్కడ వ్రాస్తానని కాదు.
  4. మన గురించి మనమే వ్రాసుకోవాలనే తపన అంతకన్నా కాదు.
  5. నేను ప్రస్తావించిన విషయము ఏమనగా, ఇక్కడ ఎవరెవరి గురించో వ్రాస్తాము కానీ వాడుకరులు మనవాళ్ళ కృషి గురించి మనము ఇక్కడ వ్రాయకూడదు. మన వాడుకరులు అందరి కృషి, వారు వారు వికీపీడియాకు చేసిన సేవలు గురించి మనకు తెలియదు. తెలియ కూడదు అన్న భావన ఎవరికీ ఉండదు. కానీ వారి కృషి ఎలా తెలుస్తుంది ? అనగా, ఎవరెవరి కృషి ఎంతగా ఉందో. వారందరినీ మనము ఎల్లప్పుడూ మర్యాదతో, గౌరవంతో సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలి. వారందరి కృషి అనన్య సామాన్య మైనది అని ప్రసావించడం జరిగింది. దీని ఆంతరార్థ ఆంతర్యం అంతగా అందరికీ అవగాహన అవ్వకపోవచ్చును.
  6. ఏ ఒక్కరికి (కొత్తవారికి లేదా పాతవారికి) అయినా మరొకరి కృషి గురించి ఏవిధంగా తెలుస్తుంది ?
  7. వాడుకరుల మిత్రులందరూ వివిధ రకములయిన అన్ని కోణములు ఆలోచించక, కేవలం వికీపీడియాకు పునాదులు వేసిన వారి దగ్గరనుంచి ప్రస్తుతము ఆ పునాదులు మీద అనేక భవంతులు నిర్మిస్తున్న వారందరి గురించి మాత్రమేనని గ్రహించ గలరు.
  8. ప్రతి ఒక్కరూ వారి వారికి సంబంధించిన పుటలలో వారు చేసిన అన్ని సేవలు పొందుపరచుటకు ఇష్టపడక పోవచ్చును, తగు సమయము కేటాయించక పోవచ్చును. దాని వల్ల వారి సేవలు సంపూర్ణముగా మరొకరు తెలుసుకోలేరు. ఇతరులు తెలుసుకుందామనే కాలం, శ్రద్ధ ఉండక పోవచ్చును. ప్రముఖ వాడుకరుల సేవలు అందించిన జాబితాలుకు సంబంధించిన లింకు ప్రధాన మొదటి పేజీలో ఏర్పాటు చేసిన, వాడుకరులందరకు (కొత్త మరియు పాత) ఎంతో ఉపయుక్తంగా ఉండే అవకాశము ఉంటుంది.
  9. రాబోయే రోజుల్లో జరగబోయే పెద్ద వికీవేడుకల్లో పునాదులు వేసిన, భవంతులు నిర్మిస్తున్న లేదా నిర్మించిన వాడుకరులు, ప్రస్తుతం వికీకి సేవలు కొద్ది సంఖ్యలో అందిస్తున్ననూ, అసలు ఎటువంటి సేవలు ప్రస్తుతము అందించక పోయిననూ, అటువంటి వారి అందరికి కాకపోయిననూ, విడతల వారీగా, అనేక సేవలు అందించిన పెద్దలకు, (ఇక్కడ వయసు ప్రాధాన్యత గురించి కాదు) వారి వివరములు తెలియక పోయినా, అవార్డులు, సన్మానము, సత్కారములు ఇత్యాదులు జరుపవలసిన అగత్యం, అవసరము మెండుగా ఉన్నది. వారు అవార్డులు తీసుకొనుటకు ఇష్టపడినా, పడక పోయిననూ; వికీ తరపున అవార్డులు ప్రకటించి అందజేయ వలసిన అవసరము ఎంతగానో ఉన్నది. ఈరోజున వారి సేవలు అందకపోయిననూ, గౌరవించుకొనుట మన సంప్రదాయం. అటుల చేయనిచో మనము వారిని గౌరవించినట్లు (గౌరవిస్తున్నట్లు) కాక పోవచ్చును. వారిని ఎందుకు విస్మరించారో భవిష్యత్తు తరాల వారికి ఏ మాత్రము అర్థము కాక పోవచ్చును. అటువంటి వారు వ్యక్తిగతముగా హాజరు అయినట్లయిన అభినందించుకొని, పాల్గొనకలేక పోయిన వారికి, వారి తరపున వారికి లేదా కొరియర్ ద్వారా ఇంటికి పంపుటకు అందజేసే ఏర్పాట్లు చేసుకోవాలి.

(కొద్ది కొద్దిగా వ్రాస్తూ ఉంటాను) JVRKPRASAD (చర్చ) 01:33, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, మీ ఉద్దేశం నాకు అర్ధమయ్యింది. జరిగిన కృషిని ఒక వ్యక్తి కోణంలోనుండి కాకుండా ఈ సంవత్సరంలో వికీలో జరిగిన కృషి అన్నట్టు సంవత్సరకాలం కృషిని సమీక్షించవచ్చు. అందులో వివిధ సభ్యులు చేసిన కృషిని మనం సమీక్షించవచ్చు. గతంలో ఇలాంటి సమీక్షలను నేను, కాసుబాసు గారు, అర్జున గారు చేశారు. ఇప్పుడు అలాంటి సమీక్ష వ్రాయటానికి ఎవరైనా ముందుకువస్తే అది ఒక చక్కని వ్యాసం అవుతుంది. ఇలా కృషిని సమీక్షించాలంటే ఆ సంవత్సర కాలం పాటు క్రియాశీలకంగా ఉండి జరిగిన కృషిని గమనించి ఉండాలి. నేను 2014 లో చాలాభాగం ఇక్కడికి రాలేదు. కాబట్టి నాకున్న అవగాహన అంతంతమాత్రమే --వైజాసత్య (చర్చ) 03:23, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు, మీ లాంటి మహానుభావులు ఎందరో వికీకి సేవలు అందించి ఉన్నారు. ప్రస్తుతము వారి వారి వ్యక్తిగత అవసరములు, ఆరోగ్య విషయములు, తగు కాలము ఇక్కడ కేటాయించలేక పోవటము, ఇలా ఎన్నెన్నో కారణాలు కావచ్చు. అంతమాత్రమున పునాదులు వేసిన వారిని విస్మరించ రాదు అని నా అభిప్రాయము. నా మస్తిష్కములోని కొన్ని ఆలోచనలు సదుద్దేశ్యముతో తదుపరి పొందు పరచుతాను. అవి వికీ అభివృద్ధికి ఉపయోగ పడితే మంచిదే. ఒక సంవత్సర కాలము అని కాదండి. అవార్డులు అనేవి ఈ మధ్య కాలములో మొదలు అయినవి. అందువలన క్రియాశీలకముగా లేని వారు అయిననూ వారిని కూడా సత్కరించుకోవాలి అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 03:33, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు - విజయవాడ - ఫిబ్రవరి 22, 23

[మార్చు]

ఫిబ్రబరి 22 మరియు 23వ తేదీలలో విజయవాడలో మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగబోతున్నాయి. ఈ సభలలో తెవికీ సభ్యులు కూడా ప్రాతినిధ్యం వహిస్తే , ప్రపంచం నలు మూలల నుండి వచ్చే రచయితలకు తెవికీ ని పరిచయం చేయవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:48, 19 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఆదివారం ఒక్క రోజు వెళుతున్నాను, వికీ కరపత్రాలతో .. వీలునుబట్టి తెవికీ ని వేదిక మీద పరిచయం చెయగలను లేదా కనీసం కరప్రత్రం అయినా ఇవ్వగలను :) --కశ్యప్ (చర్చ) 07:41, 20 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నన్ను సాంకేతికాంశాలలో తెలుగు అభివృద్ధి ద్వారా ప్రపంచభాషగా తెలుగు అన్న విషయమై మాట్లాడమని శుక్రవారం సాయంత్రానికి తెలిపారు. నిన్న నా ప్రసంగం చేసాను. అందులో కొన్ని ప్రతిపాదనలు రచయితలకు ఇచ్చాను. కొందరు వారి రచనలను వికీసోర్స్ కి అందించారు కూడా. --రహ్మానుద్దీన్ (చర్చ) 10:18, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రపంచ తెలుగు మహాసభలలో తెవికీకి ప్రాతినిధ్యం వహించి మన వాణిని వినిపించిన కశ్యప్ గారికి మరియు రహ్మానుద్దీన్ గారికి అభినందనలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:42, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పొద్దున్న కొంచెం మా విజయవాడ బ్రాంచి ఆఫీసు లో పని ఉండటంతో ముందుగా అనుకోనట్లు లాప్టాప్ లో తెలుగు మీద ప్రాంగణంలో డెమో ఇవ్వలేక పోయాను, లయోలా కాలేజి విద్యార్దుల సహకారంతో అందరికీ తెవికీ కరప్రతంచ్చాను కొందరు ఆసక్తి గా eతెలుగు & వికీ కరపత్రాలు చూసి కొన్ని వివరాలు అడిగారు వారికి కంప్యూటర్ లో తెలుగు మీద వికీ స్వేచ్చా విజ్ఞానం అంటే ఏమిటో , అన్ని కవితలు , కధలు వికిలో ఎందుకు చేర్చకూడదో, వికి బుక్స్ వెసులుబాటు మీద నాకు తెలిసిన సమాచారం ఇచ్చాను. వేమూరి సత్యవతి 9885136308 "బీజాక్షరాలు" , వాణి సరోజినీ దేవి 9491054829 "మానస రవళి " అనే కవితా సంపుటి లు వికి బుక్స్ లో పెట్టమనివారి పుస్తకం పైన లిఖిత పూర్వక అనుమతిని ఇచ్చారు,వారిని PDF లేదా సాఫ్ట్ కాపీలు పంపవలసినదిగా సూచించాను. నెల్లూరు , ఒరిస్సా , ఖమ్మం రచయితల సంఘం ప్రతినిధులు తెలుగు సాంకేతిక అంశాల మీద వర్క్ షాప్ కోసం ఆహ్వానించారు ఖమ్మంలో వచ్చేనెల ఉండవచ్చు,మిగిలిన తేదీలు ఇంకా తెలవవలసి ఉన్నది. --కశ్యప్ (చర్చ) 17:26, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదే సమన్వయలోపమంటే కవితలు, కాల్పనిక రచనలు స్వీకరించవద్దని ఇంతకు ముందే అనుకోటం జరిగింది. తెలిసి ముందుకు సాగగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 18:14, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కవితలు, కాల్పనిక రచనలు తీసుకొకూడదు అని అనుకొన్నారా, ఎవరు ఎప్పుడు అనుకొన్నారు ? రచ్చబండలొ ఎమన్నా చర్చ జరిగినదా, ఎంతమంది సంమ్మతించారు వివరాలు నాకు తెలియవు, తెలియపరచ గలరు,నేను ఆ రచయిత్రులకు ఈ విషయం చెపాలి , వీలయితే మీకు రచనలను వికీసోర్స్ అందించిన రచయితల వివరాలు చెప్పగలరు నేను వీరికి ఎందుకు రచనలను మీరు స్వీకరంచారొ చెప్పగలను --కశ్యప్ (చర్చ) 08:57, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కశ్యప్ గారూ మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు. వికీబుక్స్ అనేది స్వేచ్ఛగా పంచుకోగల పాఠ్యపుస్తకాలకు నెలవు. అక్కడ మీరు సమిష్టిగానో, వ్యష్టిగానో పాఠ్యపుస్తకాలను, రకరకాల మాన్యువల్స్ నీ రాయవచ్చు. దానిలో కవితలు, కథలు వంటివాటికి నేరుగా చోటుండదు. ఏ తెలుగు పాఠ్యపుస్తకాన్నో తయారుచేస్తూ మీరేదైనా కవితలను, కథలను అనువుగా, సముచితంగా చేర్చుకోవచ్చు. దానిలో రీరైటింగ్ కి చాలా ప్రాధాన్యత వుంటుంది కానీ నేరుగా మీరే రాసిన కొన్ని కవితలు, కథలు సంపుటిగా వేసి ఇది వికీబుక్స్ లో పెట్టదగ్గ పాఠ్యపుస్తకం అనడానికి వీలులేదు. ఇక వికీసోర్సు స్వేచ్ఛా పుస్తకభాండాగారం. దానిలో కథలు, కవితల పుస్తకాలు, తోచిన విషయాలపై రాసిన ఆధ్యాత్మిక సైద్ధాంతిక గ్రంథాలు మొదలుకొని ఒక లైబ్రెరీలో ఎన్నెన్నైతే పుస్తకాలు వుండొచ్చో అన్నీ వుండవచ్చు. అక్కడ విషయ ప్రాధాన్యత వంటివాటిపై ఇంకా తీవ్రమైన విధివిధానాలు ప్రారంభం కాలేదు కనుక మీరు చెప్పిన రచయిత్రలు, రచయితలు తాము ఉచితంగా పంచుకోదగ్గ రచనలు అక్కడ పెట్టవచ్చనే నా అవగాహన. దాని వల్ల వికీ సోదర ప్రాజెక్టుల్లో విషయాభివృద్ధికి ప్రయోజనం లేకున్నా వికీసోర్సు గురించిన అవగాహన అభివృద్ధి చెందవచ్చు. ఐతే అక్కడ సీనియర్ సభ్యులు చేస్తూన్న కృషి కన్నా ఎక్కువగా పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన పని ఉన్న కారణంగా చాలా పుస్తకాలకు పనిచేస్తూండడంతో మన రాజశేఖర్ గారూ, భాస్కర నాయడు గారూ, శ్రీరామ్మూర్తిగారూ వంటి సభ్యులపై భారం పడకుండా, ఆ రచయిత్రులనే కుదిరితే వికీమీడియన్లు చేసి వారికే నేర్పితే బావుంటుంది. విషయానికి వస్తే రహ్మానుద్దీన్ గారు అభ్యంతర పెట్టింది ఎక్కడంటే మీరు రాసిన వ్యాఖ్యలో వికీబుక్స్ అన్నారు, బహుశా మీరు వికీసోర్సు అని రాయబోయి అలా అన్నారనుకుంటాను.--పవన్ సంతోష్ (చర్చ) 11:47, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అవును నేను వికీ సోర్సు అని రాయవలసినది..

  • వికీసోర్సు గురించి మరోమారు స్పష్టత కోసం చెప్పేదేమంటే వికీసోర్సులో అన్నివిధాల సాహిత్య ప్రక్రియలలోని పుస్తకాలు, అంటే సినిమా పాటల పుస్తకాలు, స్క్రిప్టులు, చారిత్రికంగా విలువైన పత్రాలు, ప్రాముఖ్యత కలిగిన కరపత్రాలు సహా ఏవైనా వుండొచ్చు. కీలకమైన విషయమేంటంటే కాపీరైట్ ఫ్రీ అయ్యుండాలి అంతే.--పవన్ సంతోష్ (చర్చ) 06:00, 1 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

11వ వార్షికోత్సవాలు - నివేదిక, నిర్ణయాలు

[మార్చు]

11వ వార్షికోత్సవాలకు హాజరైన సభ్యులందరికి,

సభలో తీసుకొన్న నిర్ణయాలు, ముఖ్యంగా రెండవ రోజు జరిగిన 12:00 - 01-00 తెవికీ భవిష్యత్ ప్రణాళీక కార్యక్రమంలో ఏమేమి చర్చించారు, ఏమి నిర్ణయాలు తీసుకొన్నారో ఇక్కడ వ్రాస్తే ఉత్సవాలకు హాజరుకాని మిగిలిన తెవికీలందరినీ ఈ నిర్ణయాలు తెలియజేసి, ప్రణాళికలో భాగం చేసినట్టుగా ఉంటుంది మరియు మీకు అదనపు సహకారం కూడా అందుతుంది. --వైజాసత్య (చర్చ) 13:27, 21 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నాల్గైదు సమూహాలుగా ఏర్పడ్డాం. ముందుగా ఎవరెవరు ఏమేం చేయదలుచుకున్నామో, ఎందుకు చేయదలుచుకున్నామో, ఎలా చేయాలనుకుంటున్నామో ముందుగా రాసుకున్నాం. రాసుకున్నవి ఆయా సమూహాలలో వినిపించగా, సభ్యులు వాటిపై చర్చించి సూచనలు చేశారు. ఓ అరగంట గడిచాకా ఆయా సమూహాల ప్రతినిదులు వివిధ సభ్యుల ఆలోచనలను మైకులో అందరికీ చదివి వివరించారు. వివరిస్తున్నప్పుడు ఆ ఆలోచనలకు ఎవరైనా మెరుగులు దిద్దాలన్నా, మార్పులు చేయాలన్నా సూచనలు అందించారు. లేదూ అందులో పనిచేయదలుచుకున్నవారు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మొత్తం కార్యకలాపాలన్నీ కొందరు రికార్డు చేశారు. ఉదాహరణ కోసం మా గ్రూపులో జరిగిన చర్చ, ఆపైన ప్రణాళికలకు దిద్దిన మెరుగులు ఇక్కడ చూడొచ్చు(కాగితంపై కాక నేను వికీలో రికార్డు చేసుకున్నాను లెండి.)--పవన్ సంతోష్ (చర్చ) 14:15, 21 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు వైజాసత్య గారు. నేను నివేదికను తయారుచేసే పనిలో ఉన్నాను. నివేదిక కొరకు ఇక్కడ చూడగలరు. ప్రస్తుతం ఇది విస్తరణ రూపంలో ఉంది. త్వరలోనే పూర్తిచేయగలను. --Pranayraj1985 (చర్చ) 18:41, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు లేని వ్యాసాలు

[మార్చు]

విశ్వనాధ్ గారు బొమ్మలు లేని వ్యాసాలను గుర్తించి వాటికి {{బొమ్మ అభ్యర్థన}} మూస లాంటిది అంటిస్తే, అందరూ కలిసి ఆయా వ్యాసాలకు అవసరమైన బొమ్మల్ని సేకరించవచ్చు అనే ఆలోచన ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల వ్యాసాలు, సినిమా వ్యాసాలు మినహాయించాలా, వద్దా అని నాకో సందేహం వచ్చింది. మిగిలిన సభ్యులు ఏమంటారు? --వైజాసత్య (చర్చ) 03:39, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారూ, మూస తయారుచేసినందుకు కృతజ్ఞతలు. సినిమా మాత్రం మినహాయించవచ్చు. గ్రామాలలోనూ బొమ్మలు తప్పని సరిగా అవసరం. లేనివాటిలో మూస చూసి కొత్త వాడుకరులు బొమ్మ అంటిచే అవకాశం ఉన్నది..--విశ్వనాధ్.బి.కె. (చర్చ) 04:50, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మలు లేని వ్యాసాలు గుర్తించండంలో ఒక జాబితా తయారు చేసి ఇవ్వగలరా ? JVRKPRASAD (చర్చ) 05:20, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామాల మీదుగా ప్రయాణం చేస్తూన్నప్పుడు ఆయా ఊళ్ళ కూడలిలు ఫోటోలు తీసి ఒకసారి పెట్టాను. గ్రామాలను మినహాయించవలసిన అవసరం లేదు. ఈ పద్ధతిలో చేస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 06:34, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామాలు, సినిమా వ్యాసాలలో కూడా బొమ్మలు చేర్చాలి. ముఖ్యంగా గ్రామ వ్యాసాలలో ఇది బాగా ఉపయోగపడుతుంది.ఈ మూస పెట్టిన వ్యాసాల క్రింద బొమ్మలు కోరబడిన వ్యాసాలు అని వర్గం చేరితే బాగుంటుంది. అప్పుడు వాటిని గుర్తించడం; జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకోవడం సులువుగా సాధ్యపడుతుంది. ఇది AWB ని ఉపయోగించి చేస్తే ఇంకా సుళువుగా అవుతుంది.--Rajasekhar1961 (చర్చ) 08:49, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మ అభ్యర్ధన మూస ఇప్పటికే కొన్ని వ్యాసాలలో ఉన్నది. వానిలో కొన్ని వ్యాసాలలో బొమ్మలున్నాయి. బొమ్మలు చేర్చిన తర్వాత ఆ మూసను తొలగించమని కూడా మూసలో పెడితే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 08:54, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా 11వ వార్షికోత్సవ చర్చలలో కూడా దీనిగురించి చర్చించడం జరిగింది. ఈ పని బాటు ద్వారా చేయవచ్చునా? అలాగే కొత్తగా చేర్చే బొమ్మలు తప్పనిసరిగా కామన్స్ లో ఉండవలెనా లేదా తక్కువ రెజల్యూషన్స్ కలిగిన బొమ్మలను కూడా చేర్చవచ్చునా? తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:37, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పనిని AWB (ఆటోవికీబ్రౌజరు) ద్వారా కూడా చేయించగల విధానాన్ని గుర్తించాను. బొమ్మలు కోరబడిన వ్యాసాలు అనే వర్గం కూడా చేర్చటానికి వీలవుతుంది. అలాగే రాజశేఖర్ గారన్నట్టు ఈ వర్గంలో బొమ్మలు ఇదివరకే చేర్చి ఉంటే, ఆ మూసను, వర్గాన్ని తొలగించే విధంగా కూడా చేస్తాను. సుల్తాన్ ఖాదర్ గారూ, బొమ్మలు ఖచ్చితంగా కామన్స్ లోనే చేర్చాలన్ని నియమేమీలేదు. కానీ వీలైనప్పుడల్లా కామన్సులో చేర్చటం మంచి పద్ధతి --వైజాసత్య (చర్చ) 05:42, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారికి ధన్యవాదాలు. మీరు నేర్పించిన AWB ఉపయోగించి ఇప్పటికే రమణగారు, విశ్వనాథ్, ప్రసాద్ గార్లు స్పెల్లింగ్ దోషాల్నిసరిచేస్తున్నారు. మీరు ఈ బొమ్మలు లేని వ్యాసాల్ని గుర్తించి ఒక దగ్గర చేయగలిగితే వాటిలో బొమ్మల్ని చేర్చే పనిని మరికొంతమంది మొదలుపెడాతారు.--Rajasekhar1961 (చర్చ) 05:47, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియా గురించి ఈ సంవత్సరం మధ్యలో కొన్ని పోటీలను, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. కనుక ఇప్పుడు బొమ్మలు లేని వ్యాసాలను ముందుగా మనం వర్గం ద్వారానో లేదూ మరేదైనా మూస ద్వారానో గుర్తిస్తే, ఆ పోటీల్లో ఈ సమస్యను తీర్చేలా ప్లాన్ చేస్తే వికీకి రెండు విధాలా ఉపయోగకరంగా వుంటుంది. తెవికీలో గ్రామవ్యాసాలు, సినిమా వ్యాసాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి కనుక పోటీలో భాగంగా తమ తమ గ్రామాల ఫోటోలు పెట్టడం చేర్చుకోవచ్చు. గ్రామంలోని వీధి, ప్రముఖమైన పుణ్యస్థలం, చెరువు వంటివి ఫోటో తీయాలని ఉత్తమమైన ఫోటోకి ఎక్కువ గ్రామాల ఫోటోలు తీసి వికీలో చేర్చిన వ్యక్తికి ఈ ప్రైజు ఇచ్చేలా పెట్టుకోవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 09:42, 25 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ వార్త పునః ప్రారంభం

[మార్చు]

తెలుగు వికీపీడియా 11 వ వార్షికోత్సవాలలో చర్చించినట్లుగా తెవికీ వార్త పునః ప్రారంభించడానికి తగిన విధివిధానలను తెలియజేయగలరు. ముందుగా మొదటి పేజీలో ఈ శీర్షికకు స్థానం కల్గించి తగిన మూసను సిద్దం చేస్తే తర్వాత క్రమం తప్పకుండా వార్తలను చేరవేయవచ్చు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:40, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ వార్తను కొనసాగించాలంటే కొందరు క్రియాశీలక సభ్యులు దాని భాద్యతలను తీసుకోవాలి. అలా ముందుకు వచ్చే సభ్యులు ఎక్కువ మంది ఉంటే కొనసాగించవచ్చు. లేదా ప్రస్తుతం అనుకొంటున్న వాటిని పూర్తిచేసాక దానిని పునప్రారంభిస్తే మేలని నా అభిప్రాయం..--విశ్వనాధ్ (చర్చ) 13:49, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియా 11 వ వార్షికోత్సవాలలోని మొదటిరోజు (14వ తేది) రాత్రి సముదాయ సభ్యుల మధ్య జరిగిన తెవికీ భవిష్యత్ ప్రణాళీక చర్చలో భాగంగా తెవికీ వార్త పునః ప్రారంభించాలని అనుకోవడమైనది. దీనికి సుల్తాన్ ఖాదర్ గారు భాద్యతను స్వీకరించగా.. వై.వి.ఎస్. రెడ్డి గారు సహకారమందిస్తామన్నారు. --Pranayraj1985 (చర్చ) 18:46, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పాత పత్రిక వ్యవస్థాపకునిగా ఈ వార్త నాకు సంతోషం కలిగించింది. సుల్తాన్ ఖాదర్ మరియు వై.వి.ఎస్. రెడ్డి గార్లకు, పాత పత్రిక విధానల కొరకు వికీపీడియా:తెవికీ వార్త/గురించి మరియు వర్గం:తెవికీ వార్త నిర్వహణ చూడండి.నిర్వహణకు వాడినవి కొంచెం క్లిష్టమైన మూసలు కాబట్టి ఒక సంచిక చేస్తేనే విధానం మెరుగుగా అర్ధమవుతుంది. ఎమైనా సందేహాలుంటే ఆయా నిర్వహణ పేజీల చర్చలలో రాయండి. --అర్జున (చర్చ) 07:01, 25 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆటో వికీ బ్రౌసర్ తో సమస్యలు

[మార్చు]
—  మండలం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా [[]]
మండల కేంద్రం [[]]
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - సాంద్రత {{{population_density}}}/km2 (సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను./sq mi)
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ {{{pincode}}}
సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం లో [ఆంధ్రప్రదేశ్] పేరును [ఆంధ్ర ప్రదేశ్] గా మార్చడం వలన కనిపించడం లేదు. దయచేసి ప్రసాద్ గారు చేసినదాన్ని ఒకసారి సరిచూసుకోమని మనవి. బొబ్బిలి వ్యాసం చూస్తుండగా ఈ సమస్యను గమనించాను. ఇది అన్ని మండలాల వ్యాసాలలోనూ కూడా జరిగింది. వైజాసత్య గారు దీనికి సమాధానం చూపగలరు.--Rajasekhar1961 (చర్చ) 05:56, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు ఇప్పుడే చెప్పారు. ఇది పెద్ద సమస్య కాదు. సరి చేశాను. కేవలము ఒక నిమిషము కూడా కాలేదు. కొత్త పనులు చేసేటప్పుడు మీ లాంటి అధికారులు దయచేసి సహకరించ గలరు. JVRKPRASAD (చర్చ) 05:57, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్త పనులు చేయడమంటే ఇప్పటికే జరిగిన పని పాడుచేయడం కాదు. మీరు చేస్తున్న AWB మార్పుల్ని గమనిస్తూ నెమ్మదిగా చేయమని నా మనవి. మీరు కూడా సీనియరే కదా అందుకే తెలియజేశాను. కానీ ఇప్పడినే జరగాల్సిన నష్టాం జరిగిపోయింది.--Rajasekhar1961 (చర్చ) 06:06, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు, మీరు చాలా ఆవేశముతో, ఆందోళనతో ఈ విధముగా వ్రాసినారు. ఇప్పటికే జరిగిన పని పాడుచేయడము జరిగినది, నష్టం జరిగినది అని అంటున్నారు. అందుకు కంగారు పడనవసరము లేదు. నేను చేసిన మార్పులు అన్నీ సవ్యముగా సక్రముగా ఉండునట్లు చేయు బాధ్యత నాది. కాస్త స్థిమితముగా ఆలోచించగలరు. నేను చేసిన మార్పులలో ఏమైనా అనవసర మార్పులు జరిగితే అన్నీ సరిదిద్దుతాననే హామీ ఇస్తున్నాను. దయచేసి ఎవరూ చింతించనవసరము లేదు, చర్చలు వద్దని నా మనవి. JVRKPRASAD (చర్చ) 06:17, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మార్పు సరైనది అని కాదు. ఈ మార్పు వల్ల అన్ని మండలాల పేజీల్లో పటం కనిపించకుండా పోయింది. సమస్యకు నేను విరుగుడు వేశాను. ఆంధ్రప్రదేశ్ -> ఆంధ్ర ప్రదేశ్ అనేది చాలా పెద్ద మార్పు. స్థలాల పేరు, రాష్ట్రాల పేర్లు అచ్చుతప్పులుగా సరిదిద్దవద్దు. --వైజాసత్య (చర్చ) 07:05, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు, రాజశేఖర్ గారు ఫోను చేసి, ఇక్కడా అంతలా వ్రాసిన తరువాత వెంటనే మూస దారిమార్పు చేశాను. ఒకసరి సమయము చూడండి. ఆ తదుపరి నాకు వెంట వెంటనే విద్యుత్తు అంతరాయము వస్తున్నది. (దీనికి ఋజువు నాకు దగ్గరలో ఎవరికైనా తెలిసిన వారు ఉంటే ఫోను చేసి కనుక్కోవచ్చును) వారి ఆవేశము, ఆందోళన చూసి ఆ మూసను ఏదోవిధముగా దారి మార్పు చేయాలని చేశాను. అప్పటికే ఆ మూసలు పని చేస్తున్నాయి ఆ తదుపరి మరికొంత మీరు చూసి సొబగులద్దారు. ఇంతలా ఇంత వయసులో అంత చిన్నతనముగా ఎవరినీ భావించరాదు. అదే కొత్త్త వాళ్ళకి మన గురించి రహదారి అవుతుంది. అసలు నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా వల్ల ఏమి నష్టం జరిగినది ? ఇప్పటి వరకు ఏమైనా పాడు చేశానా ? అనవసర నిందలు వేయడము సబబుగా లేదు. ఎవరు వ్యక్తి గతంగా కూడా తక్కువ కాదు. అసలు ఆ భావమే ఇక్కడ అప్రస్తుతము. నా కంటే అన్ని విషయములలో మెరుగైన వారు (నిజ జీవితములో నయినా) మంచి మనసుతో లేదా సదుద్దేశ్యంతో ఏదయినా తెలియజేస్తే, సంతోషంగా వినగలను. అంతేకాని, మానసికంగా బాధ పెట్టడము మంచిది కాదు. నేను నా పని విషయములో ఒకరితో వేలు పెట్టి తప్పు చేశానని చూపించు కోను. ఒకవేళ పొరపాటు చేస్తే నేనే ఆ పని మొత్తము సరిదిద్దుతాను. ఇంక నా గురించి, నా పని గురించి ఎవరికీ ఆందోళన అవసరము లేదు. కాస్త మనసు పెద్దరికంతో ఎవరైనా ఆలోచించాలని ఈ సోదంతా మీకు తెలియ జేస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 07:20, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, అన్యథా భావించవద్దు. రాజశేఖర్ గారు అన్ని పటాలు కనిపించడంలేదన్న కంగారులో అలా అని ఉంటారు. ఆంధ్రప్రదేశ్ -> ఆంధ్ర ప్రదేశ్ దిద్దటం తక్షణమే అపెయ్యండి సార్. ఇందులో ఏది సరైనదో నాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సరైన అవగాహన ఉన్నట్టు లేదు. రెండు వాడుకలు కనిపిస్తాయి. దీని గురించి కాస్త చర్చించాలి --వైజాసత్య (చర్చ) 07:29, 24 ఫిబ్రవరి 2015 (UTC).[ప్రత్యుత్తరం]
అన్నీ ఆపేశానండి. ప్రస్తుతము నేను AWB వాడుట వల్ల ఏమేమి నష్టములు జరిగనవి చూసి దానికి నష్టనివారణ చర్యలు చేపట్టాను. ఆ పేజీలన్నీ చూసి సరిచేయాలంటే చేస్తాను. దీనిలో పెద్దగా ఎవరూ ఆందోళన చెందనవసరము లేదని నా ఉద్దేశ్యము. JVRKPRASAD (చర్చ) 07:33, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారు మీరు నేర్చుకోవాలని తపన, సరదా ఉన్నవారు. మిమ్మల్ని బాధపెట్టేలా ఎవరూ ఏమీ అనరు. మీరు మీ మామూలు మార్పులు కొనసాగించండి. దీని గురించి మరికొంత నేర్చుకొన్నాక అందరం కలసినపుడు ప్రయోగాలు చేద్దాం. కొన్ని వర్గాలు కూడా మాయమవుతున్నాయి. అందువలన అప్పటి దాకా దీన్ని ఉపయోగించడం తగ్గించేస్తే మంచిదేమో..--విశ్వనాధ్ (చర్చ) 07:48, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాధ్ గారు, అసలు వాడింది మాత్రం ఒకసారే, కాని అవగాహన ఉన్నవారి స్పందనలు చాలా బావున్నాయి అంటారా ? ఏవి మాయమయినా అవన్నీ వీలయినంత త్వరలో అన్నీ సరిదిద్దగలను అని హామీ ఇచ్చాను. మీకు కూడా తెలియజేస్తున్నాను. ఇంక సమస్య ఏమిటో అర్థం కాదు. పని చేసేవారికే తప్పులు వస్తాయి, పెత్తనం చేసే వారికి, పని ఎగగొట్టే వారికి అసలు తప్పులు రానేరావు. ఇది తప్పు కాదు పొరపాటు అని నా భావన. ఒకటికి ఎన్నో సార్లు చేస్తేనే తప్పులవుతాయి. ముందు నేను అన్నీ సరిదిద్ది, ఆ తరువాత AWB గురించి ఆలోచిస్తాను. అర్థం చేసుకోగలరని ఆశిస్తాను. JVRKPRASAD (చర్చ) 07:59, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అందరి వాడుకరులకు మనవి

[మార్చు]

ఈ రోజు AWB ద్వారా నేను చేసిన మార్పులలో కొన్ని అపశృతులు దొర్లినవి. అందుకు నేను చేసిన మార్పులు అన్నీ పరిశీలించి, సరి చేశాను. పొరపాటున ఏవైనా మరచినట్లయినా, మీ దృష్టికి ఏమైనా వచ్చిననూ దయచేసి దాని గురించి నా చర్చా పుట (పేజీ)లో పొందుపరచ గలరు. వెంటనే సరి చేయగలను. అయిననూ తిరిగి మరలా AWB ద్వారా చేసిన మార్పులు మరోసారి తప్పక చూసి పునః పరిశీలించుతాను. JVRKPRASAD (చర్చ) 15:48, 24 ఫిబ్రవరి 2015 (UTC)![ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారూ, AWB ద్వారా జరిగిన పొరపాట్లను పరిశీలించి, సరిదిద్దుతున్నందుకు ధన్యవాదాలు. --వైజాసత్య (చర్చ) 03:18, 26 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీవ్యాఖ్యకు లోగో

[మార్చు]
తెలుగు వికీవ్యాఖ్య కోసం విశ్వనాధ్ గారు తొలివిడత రూపొందించిన నాలుగు చిహ్నాలు

వికీవ్యాఖ్యకు లోగో రూపొందించాను. ఆంగ్ల లోగో ఇక్కడున్నది. నెను ఇచ్చినవి నాలుగు లోగోలు ఉన్నాయి. 3వది వి అక్షరం మాత్రమే మెరుగుపరచబడినది. సలహాలు, సూచనలు అందించగలరు..--విశ్వనాధ్ (చర్చ) 07:07, 26 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చేసిన లోగోల్లో మూడోది చాలా బావుంది.--పవన్ సంతోష్ (చర్చ) 10:43, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నాలుగవ లోగో బాగున్నది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:14, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నేను, మూడు, నాలుగు మధ్యలో ఊగిసలాడుతున్నా. మూడోది చాలా ట్రెండీగా ఉంది. నాలుగోది బాగా బల్లగుద్దినట్టు, చూడగానే ముద్రవేసేట్టు బోల్డుగా ఉంది --వైజాసత్య (చర్చ) 04:26, 28 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ అంతర్జాలంలో బల్లగుద్దినట్లుగానే కనిపించడం బాగుంటుంది. ఎవరైనా తెలుపు నలుపులో ముద్రించినా కూడా బాగా కనిపిస్తుంది. అందుకే నాల్గవదానికే నా ఓటు.--Rajasekhar1961 (చర్చ) 04:47, 28 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
డిజైన్ దృష్ట్యా మరియు వాడకం దృష్ట్యా చూస్తే నాల్గవది బాగుందనిపిస్తుంది. --విష్ణు (చర్చ) 19:32, 3 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీవ్యాఖ్య కోసం విశ్వనాధ్ చివరి నిర్ణయం కోసం రూపొందించిన రెండు చిహ్నాలు
దస్త్రం:Logo-w.JPG ఇచ్చిన లోగోలు ఒక సారి పరిశీలించగలరు.వీటిలో ఒకటి తీసుకోవచ్చుననుకుంటాను..--విశ్వనాధ్ (చర్చ) 04:48, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకే, మీరు మొదట అప్లోడు చేసిన బొమ్మలో నాలుగోది (అనగా దస్త్రం:Logo-w.JPG బొమ్మలో మొదటిది) చాలామందికి నచ్చినట్టుంది. కాబట్టి అదే ఖరారు చేసుకుందాం --వైజాసత్య (చర్చ) 05:05, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సరే దానిని పెద్ద మెరుగైన బొమ్మగా ఇస్తాను..--విశ్వనాధ్ (చర్చ) 06:09, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా వరకు అన్ని భాషల వికీ వ్యాఖ్యలు తమ లోగోగా ఆంగ్ల వీకీ కోట్‌నే వాడుతున్నాయి. తమ స్వీయ భాషలో లోగోను రూపొందించుకొని, వాడుకోబోతున్న అతి కొద్ది భాషా వికీ వ్యాఖ్యల్లో తెలుగు ఒకటి. ఇది మనకు ఆనందం,గర్వం. అందుకు కృషి చేసిన విశ్వనాధ్గారికి అభినందనలు, ధన్యవాదాలు. ఆంగ్ల వికీ కోట్‌ను పరిశీలిస్తే ఇక్కడ ఉన్న మన లోగోలో 4 వ దానిలా ముద్రాక్షరాలుగా కాకుండా, 3 వ దానిలా రాతాక్షరాలుగానే కనిపిస్తుంది. అనుకరించాలని కాదు కానీ, నా వరకు నాకు మూడోదే ముచ్చటగా కనిపిస్తుంది.----Naidugari Jayanna (చర్చ) 14:59, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మూడు, నాలుగు మధ్య తేల్చుకోలేక పోతున్నాం. మరికొంతమంది ఈ చర్చలో పాల్గొంటే బాగుంటుంది. ఈ చర్చకు ముగింపు తేదీ మార్చి 15, 2015. అంతలోపల మిగిలిన వాడుకరులు కూడా స్పందించగలరు --వైజాసత్య (చర్చ) 22:04, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారూ రెండు గుర్తులకీ ఓట్లేసేశారేంటి సర్? కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల పద్ధతిలో మొదటి ప్రాధాన్యత ఓటు, రెండవ ప్రాధాన్యత ఓటు కూడా వేస్తే బావుంటుంది. :) --పవన్ సంతోష్ (చర్చ) 07:10, 10 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

@పవన్ సంతోష్ , మరి నాకెప్పుడూ ఎన్నికలలో ఓటేసిన అనుభవం లేదు కదా. అందుకని. హ్హిహ్హిహి --వైజాసత్య (చర్చ) 05:32, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
3వది నచ్చకపోవడానికి అది నీలి వర్ణంలో ఉండటం అయిఉండటం అనుకుంటా. సరిగ్గా తెలిసేందుకు మరొకటి అప్లోడ్ చేశ్తాను. అపుడు నిర్ణయింపవచ్చు...--విశ్వనాధ్ (చర్చ) 07:47, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మూడు, నాలుగు లోగోల మధ్యల ఎటూ తేలలేదు. అసలు ప్రాజెక్టుకు వికీవ్యాఖ్య అన్న పేరు పెట్టాలా వద్దా? ఇది ఇక్కడ చర్చించడం సమంజసమా కాదా అన్ని విషయాలు తేలనందున, ప్రస్తుతం ఈ చర్చను మరెప్పుడైనా, మరింత సముచితమైన వేదికపై కొనసాగించాలని ఈ చర్చను ముగిస్తున్నాను --వైజాసత్య (చర్చ) 01:18, 17 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

'వికీఖోట్' పరిశీలించారా?

[మార్చు]

మనం వికీ ప్రాజెక్టులకు ఆంగ్ల పేర్లనే లిప్యంతరం చేస్తున్నాము కాని అనువాదం చేయడం లేదు. కావున వికీఖోట్ నే బొద్దు అక్షరాలతో వాడడం మంచిది, URL కి పేరుకి దగ్గర సంబంధం వుంటుంది.--అర్జున (చర్చ) 06:13, 10 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు చెప్పింది నిజం. వికీకోట్ అని ఉండాలి..అలా అయినా ఏ ఫాంటు పెట్టాలో చెప్పగలరా?..--విశ్వనాధ్ (చర్చ) 06:37, 10 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వికీకోట్ అన్నప్పుడు దాన్ని కొందరు సభ్యులు వికీసూక్తి అని భావించి ప్రాజెక్టు పరిధిని చాలా పరమితం చేసేస్తున్నారు. వికీవ్యాఖ్య అన్నప్పుడు సుస్పష్టంగా అర్థమవుతోంది. యూఆర్ఎల్ విషయం ఆలోచించవలిసిందే గానీ నేను చెప్పిన సమస్య కూడా ఆలోచించి చూడండి. వికీసోర్సు అన్నప్పుడు సమస్య రావట్లేదు, విక్ష్నరీ అన్నప్పుడూ ఇబ్బంది లేదు. వికీ కోట్ అన్న పదానికి మాత్రం సరైన అనువాదం చేసుకుని ముందుకువెళ్తేనే బావుణ్ణనిపిస్తోంది. పైగా వికీకోట్లో పలువురు సభ్యుల కోరికమేరకు వైజాసత్య గారు ఇప్పటికే wikiquote అన్న పేరుబరిని కూడా వికీవ్యాఖ్య అని మార్చేందుకు ప్రాసెస్ ప్రారంభించారు మరి.--పవన్ సంతోష్ (చర్చ) 07:04, 10 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, విక్షనరీకి తెలుగులో పేరు పెట్టే విషయంలో ఇది వరకు చర్చ జరిగింది. వికీసోర్సుకు వికీమూలలని అని వ్యవహరించబడింది., ఆ తర్వాత సముదాయం వికీసోర్సు అనే ఖరారు చేసుకున్నట్టుంది. వికీకోట్ కు వికీవ్యాఖ్య అన్న పేరు 2007 నుండి వికీ వ్యవహారికంలో ఉన్నదే (మూస చర్చ:ఇతర ప్రాజెక్టులు) అందుకే మొదటి పేజీతో సహా పలుచోట్ల వికీ వ్యాఖ్య అని వ్యవహరించడం జరిగింది. అంతమాత్రం చేత మళ్ళీ ఒకసారి జరగకూడదని కాదు). ఈ విషయంపై మీడియావికీ లీగల్ స్టాండు ఎవరికైనా తెలుసా? అర్జున గారూ? --వైజాసత్య (చర్చ) 05:12, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పాత చర్చల లింకులకు ధన్యవాదాలు. పాత చర్చలలోకూడా ఖరారు నిర్ణయాలేమి తీసుకోలేదనిపించింది. ఇప్పటికే మిగతా ప్రాజెక్టులు లిప్యంతరీకరణ వాడుతున్నప్పుడు అలాగే కొనసాగించడం ఏకరూపతకి మద్దతిచ్చినట్లుంటుంది. తెలుగు అనువాదం తరువాత వరుసలో ఎలానూ వుంటుంది. ఇక చట్టపరంగా అలోచిస్తే వికీమీడియా ఫౌండేషన్ ఈలోగోలని CC-BY-SA 3.0 క్రింద విడుదలచేసింది. అందుకని కావలసిన మార్పులు మార్గదర్శని ప్రకారం స్వేచ్ఛగా వాడుకోవచ్చు.--అర్జున (చర్చ) 09:20, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అసలీ ఓటింగ్ ఇక్కడ జరగాల్సింది కాదు

[మార్చు]

వికీకోట్ అనేది తెవికీకి సమాంతరంగా నడుస్తున్న ఒకే భాషాకు చెందిన సోదర సంస్థ. దాని సముదాయం వేరు, దీని సముదాయం వేరు. అక్కడి నియమాలు వేరు, ఇక్కడి నియమాలు వేరు. సభ్యులు దాదాపుగా వారే ఉండవచ్చు, అంతమాత్రాన ఆ సముదాయంకు చెందిన ఓటింగ్ లాంటి ప్రధాన నిర్ణయాలు ఇక్కడ తీసుకోవడం బాగుండదనుకుంటాను. దానికంటె ఇది బలమైనది కాబట్టి అందరు సభ్యుల దృష్టికి తేవాలంటే అక్కడ ఫలానా విషయంపై ఓటింగ్ జరుగుతోంది అని ఒక లింకిస్తే సరిపోతుంది, కాని ఆ ఓటింగ్ కూడా ఈ సముదాయంతో జరిపించి ఫలితాన్ని అక్కడ రుద్దడం సరైనది కాదనిపిస్తుంది. ఇక్కడ సంతకాలు చేసేవారు తెవికీ సభ్యత్వంతో సంతకాలు చేయాల్సి ఉంటుంది కాని ఈ ఓటింగ్ మాత్రం తెవికోట్‌ది ! మనం ఎలా ఆలోచించిననూ ఇది సరైనదిగా తోచడం లేదు. అసలు తెవికోట్ గురించి చెప్పాలంటే నెలలు గడిచినా ఎలాంటి దిద్దుబాట్లు లేకపోవడంతో ఒకానొక దశలో దీన్ని పూర్తిగా మూసివేయాలని మెటావాళ్ళు నిర్ణయించారు. అలాంటి దశలో నేను రంగప్రవేశం చేసి ఒంటిచేత్తో తెవికోట్‌ను ఏడాదిన్నర కాలంపాటు నడిపించి వాళ్ళు నిర్ణయం మార్చుకొనేట్టు చేసి-చూపించాను. ఇప్పుడు లొగో కింది అక్షరాలను (లోగో మార్పు చేయడానికి మనకు అధికారం లేదు మరి!) తెలుగీకరణ చేయడం మంచిదే, కాని ఈ ఓటింగ్ అక్కడే జరిగితే బాగుంటుంది. నా నిర్ణయం అక్కడే తెలియజేస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:49, 10 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్ర కాంత రావు గారూ, కొన్నాళ్ళు తెవికీకోట్ను నడిపించినందుకు ధన్యవాదాలు. ఆ ప్రాజెక్టు మూసేసే పరిస్థితి అంతకంటే ముందు ఒకసారి వచ్చినప్పుడు. నేను వదిలేద్దామని అనుకున్నాను. కానీ శ్రీనివాసరాజు గారు, ఆసక్తి చూపడంతో, ఆయన్ను నిర్వాహకున్ని చేసి కొనసాగించాము. సాంకేతికపరంగా మీరు చెప్పినది నిజమే. ప్రాక్టికలుగా ఏమయ్యిందంటే కోట్లో విశ్వనాధ్ గారు పనిచేయట్లేదు కదా అని, లోగో తయారుచెయ్యమని ఇక్కడ ఆయన చర్చా పేజీలో అభ్యర్ధించాను. ఆయన కొన్నిలోగోలు చేసి ఇక్కడ అప్లోడు చేసి, రచ్చబండలో చర్చ ప్రారంభించారు. వికీకోట్లో స్థానికంగా బొమ్మలు ఎక్కించే సౌకర్యం ఇంకా లేదు. కేవలం నిర్వాహకులు మాత్రమే ఎక్కించగలిగే పరిస్థితి మొన్ననే వచ్చింది. అది కూడా నా తాత్కాలిక నిర్వాహకత్వం వచ్చిన తర్వాతే. ఎలాగైనా లోగో మార్పుకు మళ్ళీ అక్కడ మద్దతు కూడగట్టుకోవాలి కదా, అప్పుడు చర్చను అక్కడికి తరలిద్దామనుకున్నాను. అంతలోగా సాధారణంగా సముదాయానికి ఏది నచ్చుతుంది అన్న ఆసక్తితో ఇది కొనసాగింది. --వైజాసత్య (చర్చ) 05:26, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మూడవ చిహ్నం (3)

[మార్చు]
  1. పవన్ సంతోష్ (చర్చ) 10:43, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. వైజాసత్య (చర్చ) 04:26, 28 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Naidugari Jayanna (చర్చ) 14:59, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --Meena gayathri.s (చర్చ) 05:39, 9 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నాలుగవ చిహ్నం (4)

[మార్చు]
  1. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:14, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. వైజాసత్య (చర్చ) 04:26, 28 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Rajasekhar1961 (చర్చ) 04:47, 28 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  4. విష్ణు (చర్చ) 19:32, 3 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --t.sujatha (చర్చ) 09:19, 9 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  6. JVRKPRASAD (చర్చ) 12:57, 9 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కారణం

[మార్చు]
  • చిన్నతనములో వ్రాత గుండ్రముగా, అందముగా ఉంటే జీవితము అలాగే ముందుకు సాగుతుంది అని చాలా మంది పెద్దలు దగ్గర తెలుసుకొని, విని ఆచరించాను. వంకర టింకర పదములు మాత్రము ఈ మధ్య కాలములో వ్రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. ప్రస్తుతము మాత్రము అప్రస్తుతము అనుకోండి. ప్రస్తుతము వికీకోట్ నందు కోట్ అంటే సూక్తి. ఎన్నో సందర్భాలలో, ఎంతో మంది, ఎన్నెన్నో విషయాల మీద జీవితాలు సాఫీగా సాగేందుకు సదుద్దేశ్యంతోనే సూక్తులు అందించారు. సూక్తి అనగా మంచిమాట అని కూడా అర్థం. పూర్ణం అనే ప్రారంభం దానితోనే జన్మించిన జీవి జీవితం ఆరంభం అవుతుంది. పూర్ణ సంఖ్య భారతీయతకు దర్పణం. వేదాంతం ఇలా వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడికి ముగిస్తానండి. వివరణ నా వరకు చాలు అనుకుంటా. JVRKPRASAD (చర్చ) 13:09, 9 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించాలి సర్ వికీకోట్ అంటే వికీసూక్తి కాదు. దాని పరిధి ప్రకారం అనువదించాల్సి వస్తే వికీవ్యాఖ్య అంటేనే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 07:05, 10 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అనవసర విమర్శలు

[మార్చు]
పవన్ సంతోష్ , నేను వ్రాశిన విషయ పరిధిని ముందు అర్థం చేసుకోలేదు బాబూ !. వికీవ్యాఖ్య గురించి చర్చ జరిగి చాలా కాలము అయ్యింది. ఇక్కడ చర్చ లోగో గురించి మాత్రమే. మొదట లోగోలు నాలుగు ఇచ్చినప్పుడు నా అభిప్రాయము మొదటగానే చెప్పాను. చివరికి రెండు లోగోలు మిగిలి చర్చకు వచ్చాయి. ఇప్పుడు ఏ లోగో అన్నది ముఖ్యం. నీకు సరిగా అర్థం అయ్యింది అని నేను అనుకుంటున్నాను. తొందరపడి ఏదీ వ్రాయవద్దు. అర్థము కాకపోతే అడిగి తెలుసుకోవాలి. అంతేకాని ఎదుట వ్యక్తి మనసులోని అలోచనలని ముందు తెలుసుకోవాలి. మా అందరకు నిజ జీవితంలో కొన్ని వందల కుటుంబాలతో, లక్షల వ్యక్తులతో ఏదో సంబంద అనుబంధం ఉంటుంది. మీ తెలిసి తెలియని తొందర పడి ఆవేశ ఆలోచనలని అక్షర రూపంలో దయచేసి పెట్టవద్దు ఒక్కొక్కసారి అది మీ నిజ జీవితాల మీద ఎంతో ప్రభావితం చేస్తాయి. నిజ జీవితాన్ని, మనస్థత్వాన్ని చాలా ప్రస్ఫుటముగా ప్రతిఫలించి ప్రతిబింబిస్తుంది. కాస్త జాగ్రత్త అవసరం. కాస్త తెలుసుకుంటే మీలాంటి వారికి మంచిది. మాలాంటి వారు కేవలం శ్రేయోభిలాషులం మాత్రమే. ఇలాంటివి ఎవరూ చెప్పరు. నాలాంటి వారు చెప్పినా వినరు, అర్థం చేసుకోపోగా, విమర్శించి, మా లాంటి వారినే తప్పుగా ఎత్తి చూపుతారు. ఇక్కడకు మాలాంటి వారు వచ్చేది చిన్న వారి దగ్గర విద్య నేర్చుకోవడానికి, అలాగే మాకు తెలిసినది అందరికీ అక్షర రూపంలో తెలియజెప్పడానికి మాత్రమే. అంతేకాని, మీలాంటి చిన్నవయసు వారితో మా తప్పులు ఎత్తి చూపించుకోవటానికి, విమర్శలు చేయించుకోవడానికి కాదని ముందుగా గ్ర్రహించాలి. విద్యకు వయసుతో సంబంధం లేదు. మనము ఏదైన విద్య ఎదుటి వ్యక్తి వద్ద తెలుసుకోవాలనుకుంటే వయసుతో సంబంధం లేకుండా వారిని మాలాంటి వారు గురువుగానే భావించాలి. అందరి దగ్గర విద్య నేర్చుకుంటునే ఉంటాము బ్రతుకు ఉన్నంతవరకూ కూడానూ. JVRKPRASAD (చర్చ) 02:31, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • JVRKPRASAD గారూ మీరు గురుతుల్యులు. కొత్తవిషయాలు నేర్చుకునేందుకు మీరు చూపే ఉత్సాహం, వికీపీడియాను మెరుగుపరిచేందుకు చేసే కృషి నాకు ఆదర్శం. ఇంతకుముందు కూడా మీతో జరిగిన చర్చల్లో నేనెప్పుడూ మిమ్మల్ని విమర్శించలేదు, అది నా తత్త్వం కాదు. ఇప్పటివరకూ ఎప్పుడూ మీ మాటలు సదుద్దేశంతో తప్ప మరోలా నేను అర్థం చేసుకోలేదు. మీకు కూడా ఆ విషయం తెలుసు. పొరపాటున ఈ చర్చలో చిన్న సవరణను మీకు సూచించానే తప్ప మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. చర్చల్లో నా వ్యవహారశైలి కూడా మీకు ఆ అనుమానం కలిగించదనే భావిస్తున్నాను. ఈ విషయంలోనూ మిమ్మల్ని ఏమైనా అనాలన్న ఉద్దేశం నాకేమాత్రం లేదు. మీరు మరోలా అనుకోకండి. --పవన్ సంతోష్ (చర్చ) 07:07, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సాకం నాగరాజ గారు అందించిన ప్రపంచ సాహిత్యం పుస్తకంలోని కంటెంట్

[మార్చు]

తిరుపతి లో జరిగిన 11వ తెవికీ వార్షికోత్సవంలో శ్రీ సాకం నాగరాజ గారు ఉచితంగా అందించిన ప్రపంచ కథా సాహిత్యం పుస్తకంలో రచయితల గురించిన పరిచయం చాలా బాగున్నది. ఈ సమాచారాన్ని తెలుగు వికీపీడియా లో చేర్చుటకు అనుమతి ఉన్నదా? తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:55, 26 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ అందులో ఉన్నది బేసిక్ కంటెంటే కదా. మనం కొంత అటూయిటూగా రాసుకుని రిఫరెన్సుగా వారి పుస్తకాన్ని ఇస్తే సరి. ఐతే ఈ పుస్తకం ప్రాముఖ్యత ఎక్కడంటే మనంగా అంతర్జాతీయ స్థాయిలోని అత్యుత్తమ స్థాయి రచయితల జాబితా వెతుక్కోనక్కరలేకుండా దొరుకుతోంది. ప్రాధాన్యత క్రమంలో వ్యాసాలు తయారుచేసుకోవడానికి జాబితాగా పనికివస్తుంది. ఇందులోని కొటేషన్లను కూడా కొన్నిటిని వికీకోట్స్ లో చేర్చినా బావుంటుంది. --10:34, 27 ఫిబ్రవరి 2015‎ Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు)‎
అలాగే చేద్దాం పవన్ సంతోష్ గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:49, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

[Global proposal] m.వికీపీడియా.org: (అందరూ) పేజీలను మార్చడం

[మార్చు]
MediaWiki mobile

Hi, this message is to let you know that, on domains like te.m.wikipedia.org, unregistered users cannot edit. At the Wikimedia Forum, where global configuration changes are normally discussed, a few dozens users propose to restore normal editing permissions on all mobile sites. Please read and comment!

Thanks and sorry for writing in English, Nemo 22:33, 1 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు యూజర్ గ్రూప్ అవగాహనా సదస్సు

[మార్చు]

తెలుగు వికీపీడియాకు ప్రత్యేక యూజర్ గ్రూప్ గురించి గతంలో కొన్ని చర్చలు జరిగిన విషయం సభ్యులకు తెలిసిందే... తెవికీ యూజర్ గ్రూప్ గా అవ్వాలంటే ఎం చెయ్యాలి అన్న విషయమై రెండు రోజుల కార్యశాల చేస్తున్నాం. ఇది నిర్వహించాలని సీఐఎస్ వారిని సంప్రదిద్దాము. యూజర్ గ్రూప్ అంటే ఏమిటి? తెలుగు యూజర్ గ్రూప్ ఆవశ్యకత, తెలుగు యూజర్ గ్రూప్ ఉంటే వికీపీడియనులకు ఉన్న అవకాశాల మీద చర్చ ఉంటుంది. తెవికీలో, మరియు సోదర ప్రాజెక్టులలో పని చేసే వారు అర్హులు. కనీసం 2000 ఎడిట్స్ ఉన్నవారిని పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నాము. ఆసక్తి ఉన్న సభ్యులు మీ పేరు నమోదు చేసుకోగలరు. --Pranayraj1985 (చర్చ) 12:17, 2 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

  • స్థలం:- థియేటర్ ఔట్రీచ్ యూనిట్
  • తేదీలు:- 14, 15 మార్చి, 2015.
  • చర్చ విషయాలు - తెవికీ చరిత్ర, వికీమీడియా ఫౌండేషన్ ఫండింగ్ విధానాలు, సీఐఎస్-ఏ2కే ఫండింగ్ విధానాలు, ఇతర వికీ సంబంధిత సంస్థల ఫండింగ్ విధానాలు, సంబంధిత పేజీల స్థాపన, ఇప్పటి వరకూ ఫండింగ్ పొందిన వారి వివరాలు, వారు ఖర్చు పెట్టిన తీరును ఎలా ఉటంకించాలి, ఐఈజీ, పీఈజీ, ఏపీజీ విధి విధానాలు, యూజర్ గ్రూప్ కు అర్హతకు తెవికీ సభ్యులు ఎలా సన్నద్ధం కావాలి, ఇతరత్రా.


నాకు కొంత అర్ధం కాలేదు. యూజర్ గ్రూప్ గురించి అవగాహన రెండురోజుల కార్యశాల ఆలోచన బావుంది, రెండురోజుల అవగాహన కార్యక్రమం చేయాలని సభ్యులతో ఎవరితోనైనా ముందుగా చర్చించారా ?, ఇది కేవలం ఆలోచనేనా, ఇప్పటికే నిర్ణయించబడినదా ? CIS వారిని ఎవరు సంప్రదిద్దాం అనుకొన్నారు, 2000 ఎడిట్స్ అని ఎవరు నిర్ణయించారు ? దయచేసి తెలియచేయగలరా ?..--విశ్వనాధ్ (చర్చ) 15:04, 3 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాధ్ గారు మనం బెంగళూరులో జరిగిన భవిష్యత్తులో భారత దేశంలో వికీమీడియా పురొగతి ఎలా? వికీమీడియా ఫౌండేషన్ వారి వ్యూహరచన సమావేశం లో తెలుగు యూజర్ గ్రూప్ గురించి చర్చించుకున్నాము. తెవికీ 11వ వార్షికోత్సవం నిర్వహించే పనిలో ఉండడం వల్ల తెలుగు యూజర్ గ్రూప్ చర్చ కొనసాగలేదు. అంతేకాకుండా తిరుపతి సమావేశాలలో జరగాల్సిన ఈ చర్చ కొన్ని కారణాల వల్ల జరగలేదు. కనుక ఈ విషయమై విష్ణు గారిని సంప్రదించగా... ముందు ఒక సమావేశం ఏర్పాటుచేసుకొని అందులో యూజర్ గ్రూప్ గురించి చర్చించమని, దీనికోసం రహ్మానుద్దీన్ సహాయం తీసుకోమని చెప్పారు. దశలవారిగా జరిగే ఈ చర్చ మొదటగా హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ చర్చ కేవలం నాంది చర్చ, అసలు చర్చ ఆన్ - వికీ లోనే జరుగుతుంది. ముఖాముఖీ పాల్గొనలేని వారు ఆన్-వికీ పాల్గొనవచ్చు లేదా తదుపరి చర్చలలో పాల్గొనవచ్చు. అలాగే యూజర్ గ్రూప్ లో పని చేయాల్సిన వారికి వికీ అవగాహన ఉండాలి కాబట్టి అందుకు ఒక కొలమానం 2౦౦౦ ఎడిట్లుగా నిర్ణయిద్దామని రహ్మానుద్దీన్ చెప్పడం జరిగింది. అయితే ఇది కేవలం ఆలోచన మాత్రమేననీ, నిర్ణయాలు అందరి సమక్షంలో జరుగుతాయని సభ్యులు గమనించాలి. --Pranayraj1985 (చర్చ) 09:18, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుగా అందరూ ఈ m:Wikimedia_user_group_creation_guide మార్గదర్శినిని చదవండి. నాకర్ధం అయిన దానిబట్టి ఏవిటంటే, ఇది ఒక మినీ వికీమీడియా ఇండియా చాప్టరు లాంటిదే. కాకపోతే ఇక్కడ ప్రణాళిక, కార్యక్రమాలు అన్నీ భారతదేశపు స్థాయిలో కాకుండా తెలుగు స్థాయిలో జరుగుతాయి. ఇక ప్రణాళికలు వేసుకోవటం, వికీమీడియా నుండి సంవత్సర ప్రణాళికకు అనుగుణంగా నిధులు పొందడం, వాటిని నిర్వర్తించడం. మొదలైనవి ఉంటాయి. ఈ ప్రక్రియ ఒక దాఖలు చేసిన సంఘం ఏర్పరచడం లాంటిదే, ఒక స్వరూపం, కొన్ని బైలాసు ఏర్పరచుకోవాలి. ఈ యూజర్ గ్రూపులు చార్టర్ల కంటే కాస్త సులువుగా నిర్వహించే వీలుందని వికీమీడియా అంటున్నది. ఎంతో కొంత బ్యూరోక్రసీ మాత్రం తప్పదు. దీనికి సమయం కేటాయించగల సభ్యులు, ఒక సమూహంగా వికీని ముందుకు నడిపించడానికి వికీ బయట ఏం చేయగలమన్న విషయంలో ఒక overarching vision ఉంటే తప్పకుండా చెయ్యెచ్చు. అయితే, ముందుగా మనం కొన్ని కఠినమైన ప్రశ్నలు వేసుకోవాలి. ఉదాహరణకు: ఒక్క అర్జునరావు గారు తప్ప ఇండియా చాప్టరులో తెలుగు వికీయులెవరూ అంత క్రియాశీలకంగా పాల్గొన్నట్టు లేదు. ఇండియా చాప్టరు చెయ్యలేనిది కొత్తగా తెలుగు యూజర్ గ్రూప్ ఏం చేస్తుంది? మనకు కావలసిన నిధులు ఇండియా చాప్టరు ద్వారానో, నేరుగా వికీమీడియాకి ధరఖాస్తు చేసుకొని తెచ్చుకోలేమా? అసలు ప్రత్యేక తెలుగు యూజర్ గ్రూప్ ఎందుకు అన్న ప్రశ్నకు మనం బలంగా సమాధానం చెప్పగలగాలి. --వైజాసత్య (చర్చ) 08:08, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మన తెలుగు వికీమీడియన్లు ఇటువంటి బ్యూరోక్రాటిక్ వ్యవహారాలు నిర్వహించేందుకు సరైన సమయం కేటాయించలేకున్నారని, మెటా-వికీలోని వివిధ నిబంధనల పట్ల అవగాహన లేకున్నారని నా భావన. తెవికీకి అత్యంత అవసరమైన 11వ వార్షికోత్సవ కార్యక్రమం విషయమే తీసుకున్నా మనం పేజీని రూపొందించడం, వాటిలో వచ్చిన చికాకులు, చివరకు ఆ కార్యక్రమంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన స్థితికి తీసుకురావడం కార్యక్రమ సహ నిర్వాహకులందరికీ తెలియంది కాదు. ఆ పిఇజితో పోల్చితే యూజర్ గ్రూప్ చాలా పెద్ద విషయం. యూజర్ గ్రూప్ వంటివి బయటకు ఆకర్షణీయంగానే ఉన్నా, వికీమీడియన్లకు ఆ బ్యూరోక్రాటిక్ విధానాలపై వ్యక్తిగతంగా కొందరికైనా ఆకర్షణ, శ్రద్ధ లేకుంటే చివరకు ఓ తెల్ల ఏనుగులా తయారవుతుంది. మనం 11వ వార్షికోత్సవాన్ని ఇంకా పూర్తిచేసుకోలేదు. ముందుగా వేసుకున్న ప్రణాళికలో కేవలం స్ట్రాటజిక్ యాన్యువల్ మీట్ మాత్రమే తిరుపతిలో నిర్వహించుకున్నాం. ఈ సంవత్సరం మధ్యలో వికీమీడియా ఫౌండేషన్ వారి సహకారాన్ని తీసుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చేసుకున్న నిర్ణయాన్ని కనీసం ప్రతిపాదనల స్థాయిలో కూడా అభివృద్ధి చేసుకోలేదు. కనుక ముందుగా ఈ ఏడాదంతా ఇటువంటి కమ్యూనిటీ కలిసి చేయాల్సిన గ్రాంట్ రైటింగ్, రిపోర్టింగ్, బ్యూరోక్రాటిక్ వ్యవహారాలపై పట్టుసాధించి ఆయా కార్యకలాపాల ద్వారా సమూహం తనకుతానుగా ఫలితాలు సాధిస్తే మరుసటి సంవత్సరానికి మనలో ఎవరెవరికి ఏయే సామర్థ్యాలున్నాయి, ఎవరెవరు ఎంతవరకూ సమయం కేటాయించగలుగుతున్నారు, ఎవరెవరు మెటా-వికీ యాక్టివిటీల్లోనూ, రిపోర్టింగ్ లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు అనేవి అర్థమైపోతాయి. ఈలోగా క్రమాంతరంగా ముందుకువెళ్తే అప్పటికి మనకు అవగాహన కూడా వస్తుంది. ఇది ఒకరు వివరిస్తూంటే అందరూ విని, సలహాలు సూచనలు తీసేసుకుని గబుక్కున ముందుకు దూకే వ్యవహారం కాదు. మన చేతల ద్వారా మనల్ని మనం రీ ఎసెస్ చేసుకుని తీసుకోవాల్సిన గట్టి నిర్ణయం. అందుకని ఇది శరవేగంతో చేయాల్సిన పని కాదేమోనన్న విషయం అందరూ ఆలోచించి చూడండి.--పవన్ సంతోష్ (చర్చ) 10:15, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇది ఒక నాందీ సమావేశం మాత్రమే! అంటే కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయించడం జరగదు. పిఇజిలో అనుభవమున్న సభ్యుల సూచనలు పాటించడం జరుగకపోవడం వలనే ఇలాంటి అవగాహన రాహిత్యం వస్తుంది. అవగాహన పెంచేందుకే ఈ సమావేశం. నా దృష్టిలో కనీసం రెండేళ్ళు తెవికీ సభ్యులకు ఈ యూజర్ గ్రూప్ సాధించుకునేందుకు పట్టే సమయం. ఇప్పటి వరకూ వచ్చిన గ్రాంటులన్నీ తెవికీ సభ్యులు ఎలా వాడుకున్నారు అనే విషయమై కూడా చర్చించుకోవాలి. --రహ్మానుద్దీన్ (చర్చ) 10:51, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
కార్యక్రమం ఏదైనా ఇలాంటి గ్రాంట్ల విషయాలు కొన్ని అందరకూ తెలియడం అవసరమే. గ్రూప్ అవసరమా వద్దా అనేదానికంటే - అసలు గ్రాంట్స్ ఎలా వస్తాయి?, మార్గదర్శకాలు ఏమిటి అనేది అందరకూ తెలియాలి..--విశ్వనాధ్ (చర్చ) 11:46, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను ఈ శీర్షికను ముందస్తుగానే చూసి, వైజాసత్యగారు చెప్పినట్లు ఆంగ్ల వికీలో చదివి వ్యాసము వ్రాద్దామనుకున్నాను. ఇప్పటికే నా పని, తదిర విషయముల మీద సరి అయిన అవగాహన పొందలేక పోతున్నారు. నా ప్రశ్నలు, సలహాలు, ఇలాంటి నాకు అర్థం కానివి వ్రాయమంటే వ్రాస్తాను. ఎందుకో చాలామంది వ్యక్తిగతంగా వాటిని తీసుకుంటారు, ఒక్కోక్కసారి ఆవేశంగా కూడానూ. అదే అర్థం కాదు. నేను అడుగుతాను మీరు చర్చించుకోండి అన్నట్ట్లు గా ఉండాల్సి వస్తోంది. (1) నేను గ్రూపులకు, వర్గాలకు వ్యతిరేకం (2) బానిసత్వం, బాసిసిజం ఇసుమంతయైనా ఇష్టముండదు. (3) నాకు ఎవరైనా ఒకటే, ఒకే అభిప్రాయము కలిగి ఉంటాను. (4) నాకు ఎవరైనా సదుద్దేశ్యంతో సలహాలు, పనిలో లోపాలు తెలియజేసినా తప్పక వింటాను. అంతేకాని, నా మనసు దురుద్దేశ్యంతో కెలకాలనుకుంటే అటువంటి వారి పునాదులు వరకు కెలికికెలికి పెట్టాలని నా మనసు కూడా గోల పెడుతుంది. కాని అంత తేలికపాటి తొందర నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోను. Pranayraj1985 గారు ప్రతిపాదించారు. ఒకనాడు వికీపీడియాకు సేవలు అందించిన, (విష్ణు గారి సిఐఎస్ నందు ఇప్పుడు పనిచేస్తున్న ?)రహ్మానుద్దీన్గారు సమర్ధించుతున్నారు. ఇటువంటి కార్యక్రమములకు అనుభవము ముఖ్యం. 11వ వార్షికోత్సవాన్ని ఇంకా పూర్తిచేసుకోలేదు అని పవన్ సంతోష్ అంటున్నారు. మరి తిరుపతి వార్షికోత్సవము గురించి ఎప్పుడు స్పందించాలో తెలియలేదు. సర్లెండి. నా ప్రశ్నలు తదుపరి అడుగుతాను. JVRKPRASAD (చర్చ) 12:03, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారూ, విశ్వనాధ్ గారూ చెప్పినదానితో నేను అంగీకరిస్తున్నాను. ఈ విషయమై తెలుసుకొని క్షుణ్ణంగా చర్చించడంలో తప్పేమీ లేదు. అవగాహనా సదస్సుకు వీలైన క్రియాశీలక సభ్యులందరూ వెళతారని ఆశిస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 12:15, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చ ప్రయోజనకరంగా ఉన్నది. నాకైతే తెవికీ ఆస్థితికి ఇంకా చేరలేదేమో అనిపిస్తుంది. మనలో అంత పెద్ద భారాన్ని మోయగల శక్తిసామర్ధ్యాలు లేవని నా అభిప్రాయం. సాంకేతికంగా అర్జునరావు, రహ్మానుద్దీన్లను కోల్పోయిన తర్వాత మనలో అంత ఫుల్ కమిట్ మెంట్ తో పనిచేసే వారు కొరతగా ఉన్నది. తప్పని పరిస్థితులలో వైజాసత్యగారి సహకారంతో కొంతవరకు నెట్టుకొస్తున్నాము. ఇంక ఫండింగ్, దానితో ధనాశ మొదలౌతుంది. దానితో గొడవలు మొదలౌతాయి. ఇవేవి లేకుండా వ్యాసాల రచన అభివృద్ధి మీద కేంద్రీకరించి అవసరమైనప్పుడు మన ఫండ్స్ ను వికీమీడియా ఫౌండేషన్ నుండి తెచ్చుకోవడం ఉత్తమమని అనిపిస్తుంది. ఒక చాప్టర్ ను నిర్వహించేంత దమ్ము తెవికీకి లేదని నిరుత్సాహ పరుస్తున్నాననుకోవద్దు. కానీ మన ప్రగతి కుంటుపడుతుందని నా విచారం.--Rajasekhar1961 (చర్చ) 12:23, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు, చాలాచాలా వరకు మీతో ఎకీభవిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 12:32, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • నిజానికి ఈ కార్యక్రమానికి ఇంత చర్చ జరగడానికి కారణం బహుశా ముందస్తుగా ఏ వివరాలు తెలియనే తెలియకుండా(నిజానికి కమ్యూనిటీ కన్సల్టేషన్ కి వచ్చిన వారిలో ప్రణయ్ గారికి తప్ప మరెవరికీ ముందుగా తెలియదు) నేరుగా ఈ కార్యక్రమం నిర్వహణ గురించి రచ్చబండలో వ్రాయడం కావచ్చునని భావిస్తున్నాను. ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకుంటే ఆఫ్ వికీ గానీ, ఆన్ వికీ గానీ ముందుగా కనీసం ముఖ్యులైన మరికొందరితోనైనా చర్చిస్తే మంచిదని గతానుభవాలు చెప్తున్న పాఠం. అదేదైనా వికీపీడియా అవగాహన సదస్సో, పుస్తకాల కాపీహక్కుల రీరిలీజో, స్వంతంగా నిర్వహించే పోటీనో, ఎడిట్-అ-థాన్లో, వ్యక్తిగత ఎంగేజ్మెంట్ ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాలో అయితే ఏ ఒక్కరైనా ముందుకువెళ్ళొచ్చు. కానీ సముదాయం చర్చించి తీసుకోవాలన్నప్పుడు ముందుగా కొందరితోనైనా చర్చిస్తే బావుంటుంది. లేదంటే హఠాత్తుగా తెలిసేందువల్ల వచ్చే అయోమయానికి అందరూ గురవువుతూ కార్యక్రమ నిర్వహణ గురించే చర్చించే స్థితిలో ఉన్నారు. కార్యక్రమంలో అవగాహన ఎవరు కల్పించాలి? ఎవరు మాట్లాడాలి? ఏయే కార్యకలాపాలు జరగాలి వంటివి చర్చల ద్వారానో, ఏ ముందస్తు సమావేశం ద్వారానో మాట్లాడుకుంటే కార్యక్రమంలో పాలుపంచుకునేవారి సమయాన్ని గౌరవించినట్టవుతుంది.--పవన్ సంతోష్ (చర్చ) 12:37, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అయితే ఇది కేవలం ఆలోచన మాత్రమేననీ, నిర్ణయాలు అందరి సమక్షంలో జరుగుతాయని సభ్యులు గమనించాలన్న విషయం ముందుగానే తెలియజేశాను. --Pranayraj1985 (చర్చ) 12:42, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అందరూ కలిసి ప్రణయ్ రాజ్ గారిని నిరుత్సాహ పరచవద్దు. విషయాలు తెలుసుకొని, క్షుణ్ణంగా చర్చించుకునేందుకు ఈ సమావేశం చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది --వైజాసత్య (చర్చ) 12:50, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఎంతమంది అయినా, ఎన్నిసార్లు అయినా, అందరూ కలిసి కేవలము తప్పకుండా చర్చలు చేసుకోవచ్చును. ఆ తదుపరి వర్గాలు, గ్రూపులు, కోటరీ, ఇలాంటి పద్దతులలోనికి వెళ్ళకుండా ఉంటే మంచిదే. లేకపోతే వికీమాఫియా అనే పెద్ద అనవసర పదాన్ని ఎవరో ఒకరు భవిష్యత్తులో వాడే ప్రమాదము ఉంది. అందరూ దయచేసి గమనించగలరు. JVRKPRASAD (చర్చ) 13:02, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్య గారూ నా అభిప్రాయం వ్యక్తం చేయడంలో కొంత వేరే అర్థాలకు దారితీసినట్లుంది. కార్యక్రమం విషయంలో నిరుత్సాహపరిచేదేమీ లేదు 11వ వార్షికోత్సవ నిర్వహణలో ఇటువంటి విషయాలు నలుగురితోనూ త్వరితంగా పంచుకోకపోవడం వల్ల తీవ్రమైన పరిస్థితులు ఏర్పడి కొందరు సభ్యులు(నేను కారణమూ కాదు, నాకు ఆగ్రహమూ రాలేదు. కేవలం సాక్షిని అంతే) తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే నేను ప్రణయ్‌తో ఉన్న వ్యక్తిగతమైన చనువు కారణంగా చెప్పానంతే. --పవన్ సంతోష్ (చర్చ) 13:13, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ , మీరు సాక్షి అయి ఉండి ఆ విషయాలు ఏమిటో కనీసం ఇంతవరకు చాలామందికి తెలియదు. చెప్పకూడని విషయాలంటారా ? తెలిసినంత మాత్రాన పెద్ద సమస్య కాదనుకుంటే ఎవరైనా తెలియజేస్తే ముందు ముందు మరింత జాగ్రత్తగా ఉండటానికి అవకాశము ఉంటుంది. JVRKPRASAD (చర్చ) 14:03, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరచాలి. అయితే నిర్ణయించేటపుడు కనీసం ఇలా చేస్తే బావుంటుంది అనే ఆలోచన మాత్రమే అని రాస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవు. ఇక యూజర్ గ్రూప్ గురించి తిరుపతిలో విష్ణుగారు చెప్పినట్టుగా నాకు తెలియదు. తెలిస్తే ఇలా అన్నారని మిగతా సభ్యులకు ఒకమాట చెప్పి ఇక్కడ చర్చమెదలుపెట్టాల్సినది. కార్యక్రమం ఏర్పాటు చేసి ఎవరు పాల్గొనాలి, ఎవరు పాల్గొనవచ్చు నుండి నమోదు మొదలైన తరువాత వివరణ ఇచ్చుకోవడం వివేకమైన చర్యగా అనుకోను. కేవలం దీనిపై చర్చమాత్రమే అయితే నమోదులు అవీ అవసరం లేదు. యూజర్ గ్రూప్ అని ఒక పేజీ ప్రారంభించి దానిలో సభ్యుల చర్చలు జరిగి అందరూ ఒక సమావేశం అనో అవగాహన అనో పెట్టాలి అన్నట్టయితే రెండురోజులు కాకపోతే మూడు రోజులు చేయచ్చు. CIS వారి ద్వారానే జరగాలి అని సభ్యులు అనుకొంటే అలాగే వారి ద్వారా జరపచ్చు. కనుక ఇలాంటి కార్యక్రమాలకు ముందుగా వికీ సముదాయాన్ని సన్నద్దం చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. ఇందులో ఎవరినీ నేను వ్యక్తిగతంగా తప్పుపట్టటం లేదు. ఇప్పటికి జరిగిన కార్యక్రమాల వ్యక్తిగత అనుభవంతో మీతో పంచుకుంటున్నాను..--విశ్వనాధ్ (చర్చ) 14:07, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ అదేమీ పంచుకోకూడదని కాదుగానీ అప్పటికే అదొక పెద్ద రణరంగంగా మారి బహిరంగంగా పూర్తి వివరాలు వెల్లడించరాదని అప్పటికి వార్షికోత్సవ కమిటీలో భావించాం. అందుకు అనుగుణంగా నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అదంతా చర్చిస్తే మరింత అనవసర గొడవలకు కారణమై విషయాలు పక్కదోవ పడతాయి. నేను మీకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్తానులెండి. మరీ కావాల్సివస్తే గ్రూప్ మెయిల్లో వెల్లడించగలను. --పవన్ సంతోష్ (చర్చ) 14:12, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు రెండువేల ఎడిట్లు లేవు కావున నేను పాల్గొనటం లేదు, సరిఅయిన ప్రణాళిక , ఒకే విధంగా వికి స్పుర్థితో, అందరినీ కలుపుకొనిపొయయే వారు , పారదర్సకంగా వ్యవహరించేవారు , బ్యూరోక్రాటిక్ వ్యవహారాలు నిర్వహించేదుకు ఇంకా మరింత మంది క్రియాశీల వాడుకదారులు ఇంకా అవసంరం ఇప్పుడే యూజర్ గ్రూప్ అవసరం లేదు అని నా విన్నపం .--కశ్యప్ (చర్చ) 14:23, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ , సంతోషం. అలాగే చేయండి. అందరికీ సంయమనం ఎల్లప్పుడూ చాలా అవసరము. అందరూ మంచి మనసున్న వారే. అన్నీ తప్పకుండా సర్దుకుంటాయి అని ఆశిస్తున్నాను.
సమావేశ ప్రతిపాదన మంచిదే అయితే "2000 ఎడిట్లు చేసిన వారిని ప్రోత్సహిస్తున్నాము " అనే పదబంధం కొందరిని నిరుత్సాహపరిచే అవకాశముంది. అది ప్రస్తుత పరిస్థితులో హేతుబద్ధమనిపించలేదు.అవగాహన తక్కువగా వున్నవారికి సమావేశంలో మొదటి గంట అవగాహన కలుగచేయటం మంచిది. --అర్జున (చర్చ) 04:16, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
యుజర్ గ్రూపు నా అలొచన కాదు ,నేను లీడ్ చేయాలని చెప్పటం సరికాదు , శనివారం ఆఫీసు ఉన్నది. దయచేసి రెండు రొజులపాటు ఎమి చర్చిస్తారో వీలయితే ఇక్కడ చెప్పండి ఆదివారం హాజరు అవ్వటానికి ప్రయత్నం చేస్తాను , అందరి కన్నా ఎక్కూవ గ్రాంటులు తీసుకొన్నది నెనేనా ! నేను, వికి 11 , పుస్తక్క ప్రదర్శ్ననకు రెండిటికి మాత్రమే గ్రాంటుగా ఉన్నాను అనుకుంటుంన్నానును , వికి10 కి నేను సమర్పించిన ₹.1,53,297 లెక్కలకు మీరు రహ్మానుద్దీన్ PEG లొ సమర్పించిన లెక్కలకు ₹.6,62,100/- కు పోంతన లేదు కావున మీరు రెండు మార్లు గ్రాంటు తీసుకున్న అనవలసినది :) మనం గ్రాంటు,పారద్శకత, రిపోట్ల వివరాలు గురించి మాట్లాడుకొవాలి కాబట్టి ఈ వివరాలు సబ్యుల అవగాహన కొరకు తెలపటం అయినది --కశ్యప్ (చర్చ) 17:06, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుల నమోదు

[మార్చు]
  1. --ఎల్లంకి (చర్చ) 16:53, 2 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --గుళ్ళపల్లి 16:55, 2 మార్చి 2015 (UTC)
  3. యూజర్ గ్రూప్ గురించి అవగాహన ఉన్నవారు ఎవరైనా దీని గురించిన వివరాలు తెలియజేస్తే బాగుంటుంది. రెండు రోజుల సమావేశం చేయడానికి సన్నద్ధమైన సందర్భంలో ఎవరైనా యూజర్ గ్రూప్ ను నిర్వహిస్తున్నవారిని ఆహ్వానిస్తే; అందులోని లోటుపాట్లు, సాంకేతిక విషయాలు, నిర్వహణ సమస్యలు మొదలైనవి లోతుగా అందరికీ అవగాహన కలుగుతుంది. లేకపోతే తెలుగు వికీపీడియా సమూహం తిరిగి నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుంది. వైజాసత్య మరియు Arjunaraoc వంటి అనుభవం వున్న సీనియల్ సభ్యులు ఈ విషయంలో వారి అభిప్రాయాల్ని తెలియజేయమని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 05:56, 3 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --Pranayraj1985 (చర్చ) 06:15, 3 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:08, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం నా పనుల్లో చాలా బిజీగా ఉన్నాను.(వికీలో, బయటా కూడా) పదిరోజుల క్రితం ఖాళీగా ఉన్నప్పుడు రాగలననిపించింది. ఇఫ్పుడు రాలేను.--Meena gayathri.s (చర్చ) 14:13, 13 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నిన్న అనగా 14.03.2015 నాడు గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగిన ‘‘తెలుగు వికీపీడియా యూజర్ గ్రూప్’’ మొదటి అవగాహాన సదస్సు ఇంకా పూర్తికాలేదు. అయితే నిన్న జరిగిన సదస్సు వివరాలు అందరి వికీ సభ్యులకు తెలియాలని సదస్సు హాజరైనవారు కోరడంతో నా ప్రయోగశాలలో రాసిన వివరాలు ఇక్కడ ఇవ్వడమైనది. అయితే ఇది సంపూర్ణంకాదు... సదస్సులు జరుగుతున్నకొద్ది చర్చలలో మార్పులు రావచ్చు... సభ్యులు గమనించగలరు. ఆ సదస్సు యొక్క వివరాలు ఇక్కడ చూడగలరు. --Pranayraj1985 (చర్చ) 05:34, 15 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికి 11 కి సంబందించిన లెక్కలు పూర్తి చెయాటానికి మిగిలిన రుసుము 6229/- రుపాయలు సి.ఐ.స్ ప్రతినిధి రహ్మన్ గారికి ఇవ్వటానికి నేను మద్యాహర్నం మూడు గంటల ప్రాంతంలో వెళ్ళాను , వారి సూచన మేరకు బిల్లు కాపీ లేని ఓచరు బిల్లులకు మరల అద్యక్షులు భాస్కర్ నాయుడు , ప్రణయ్ గారి సంతకాలతో ఇచ్చాను.రహ్మన్ యూజర్ గ్రూప్ పెడితే వచ్చేలాభాలు వివరించారు రాబోయే కాలంలో సి.ఐ.స్ నుండి తెలుగుకు ప్రాతినిద్యం వహిస్తాను అని రహ్మన్ తెలిపారు ఆలోపల యూజర్ గ్రూప్ కార్యకమాలు పూర్తి చేయవచ్చు అని సూచించారు.తెవికీ 10 గ్రాంటు బిల్లుల గురించి చర్చజరిగింది కార్యక్రమం తరువాత తెవికీ 10 నేను 20 ఫిబ్రవరి 2015 కల్లా మొత్తం బిల్లు లెక్క ఇచ్చి, 14 మార్చి 2014 బ్యాంకు స్టెట్మెంట్తొ సహాఇచ్చాను ఆతరువాత నేను ఒంగోలు పక్కన గ్రామం లో ఉన్నప్పుడు అందుబాటులొ లేని కారణంగా 12 మార్చి 2015 న ఇంటర్ నెట్టు సరిగా లేని కారణంగా ప్రణయ్ , రహ్మన్ ని WMF /PEG అబ్యర్ధించాను అ తరువాత ఏటువంటి సందేశము వారి నుండి రాలేదు. రహ్మన్ , ప్రణయ్ కలిసి 6 July 2014 న PEG‎ లొ పెట్టారు , నేను సమర్పించిన లెక్కలకు , PEG లొ సమర్పించిన లెక్కలకు పోతనలేదు అని నేను చర్చా పెజీలో చేసినవి ఆరోపణలు అని నేటి యూజర్ గ్రూప్ మీటింగ్ లొ రహ్మన్ కాగితం మీద్ రాసి ఇవ్వమని చెప్పారు నేను దానికి అంగీకరంచలేదు!. వారు మరల హోటల్ ఖర్చు , మిగిలిన వివరాలతొ నాకు బిల్లు స్టేట్మెట్ ఇస్తాము అనిచెప్పారు దానిని చూసి నేను ఆరోపణలు వెనకకు తీసుకోగలను.వీలయితే మిగిలిన సభ్యులు కూడా తెవికీ 10, కార్యక్రమాలకు కి పెట్టిన రెండు ఖర్చుల చిట్టాలు,సరి పొల్చుకొగలరు. ఇహ అవగాహాన సదస్సు విషయానికి వస్తే నేను ఉన్నంత వరకు యూజర్ గ్రూప్ కొరకు తీర్మానాలు,నిర్ణయాలు తీసుకోలేదు.ఆటోవికి వాడేవారు రచ్చబండ లొ ఒక సూచన చేయాలని రాజశేఖర్ గారు చెప్పినదానితో నేను ఎకీభవిస్తుంన్నాను,మరి కొన్ని అవగాహన సదస్సులు రెండు సంవత్సరాల పాటు జరిగినది తరివాత ముందుకు వెళ్ళాలి అని చర్చిచటం జరిగినది, నేను మటుకు ఇప్పుడే యూజర్ గ్రూప్కు నేను వ్యతిరేకం అని చెప్పివచ్చాను --కశ్యప్ (చర్చ) 17:58, 15 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

యూజర్ గ్రూప్ గురించి

[మార్చు]
  1. తెలుగుకి యూజర్ గ్రూప్ అనేది కొంత కాలంగా నానుతున్న విషయమే. ప్రస్తుతము జరుప నిశ్చయించినది కేవలము సహ వికీపీడియనులకు ముందస్తు అవగాహన కొరకే నన్నది సుస్పష్టము. ఈ విషయములో ఇలాంటి సమావేశాలు చాల జరపవలసి వున్నది. కూలంకషంగా చర్చించ వలసివున్నది. ఇది ఒక క్రొత్త ప్రయోగము గనుక అందరి అభిప్రాయము పరిగణలోనికి తీసుకోవలసి వున్నది. కనుక అప్పుడే తొందర పడవద్దని/ ఏదో నిర్ణయం జరిగిపోతున్నదని అపోహ పడ వద్దని సహ సబ్యులకు మనవి. ఏనిర్ణయమైనా అందరి సమక్షంలో చర్చించిన తర్వాతనే ఏనిర్ణయమైనా బయటకు వస్తుంది. కనుక మనమందరము రెండుమూడు సార్లు కలసి మాట్లాడుకుందాము. చొరవ తీసుకొని జరగబోవు సమావేశంలో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలపండి..... సమిష్టిగా నిర్ణయం తీసుకుందాము. ఇటు వంటి యూజర్ గ్రూప్ ఎక్కడా (ఇతర భాషలలో) వున్నట్లు నాకు తెలియదు. ఒక వేళ అటువంటిది వున్నట్లు మీకు తెలిసి వుంటే తెలపండి ..... వారితో కూడ సంప్రదించి, అందులోని సాదక బాదకాలు తెలుసుకుందాము. ఇది తొందరలో తేలే విషయం కాదు. గమనించగలరు. ఎల్లంకి (చర్చ) 14:40, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

-- ఇదిఅందరికీసమ్మతమే ఎంతోవుపయోగకరం ఇది వచ్చేమీటింగులో సంప్రదింపులు జరుపుదాము. --గుళ్ళపల్లి 02:39, 6 మార్చి 2015 (UTC)

New Wikipedia Library Accounts Available Now (March 2015)

[మార్చు]

Apologies for writing in English, please help translate this into your local language. Hello Wikimedians!

The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for, free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

Many other partnerships with accounts available are listed on our partners page. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 21:14, 2 మార్చి 2015 (UTC)

Help us coordinate Wikipedia Library's distribution of accounts, communication of access opportunities and more! Please join our team at our new coordinator page.
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

విజయనగరం, శ్రీకాకుళం

[మార్చు]

నేను గత రెండురోజులుగా శ్రీకాకుళం, విజయనగరంలో విషయసేకరణ కొరకు తిరుగుతున్నాను. వికీ మిత్రులు కె.వెంకటరమణ గారితో కలసి శ్రీకాకుళంలో అనేక ప్రదేశాలకు వెళ్ళి వాటికి సంభందించిన సమాచారం, చిత్రాలను సేకరించాము. మరికొంత సమాచారం మరొకసారి అందుబాటులోకి వస్తుంది. మునుపు వికీలో ఉత్సాహంగా పనిచేసిన డా.వండాన శేషగిరిరావుగారిని కలవడం జరిగింది. వారు అనారోగ్య కారణాల వలన రాయలేకపోతున్నానన్నారు. ఇపుడు మళ్ళీ రాయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. రమణ గారిని తరచు కల్వమని చెప్పారు.

అలాగే విజయనగరం మహారాజా కళాశాల, సంగీత నృత్యకళాశాల, సంసృత కళాశాలలకు వెళ్ళాం. కళాశాలలను గురించి, వాటిలో పనిచేసిన మునుపటి తరం ప్రాచార్యుల సమాచారం ఇస్తామన్నారు. అందులో పని చేసిన వారందరూ ప్రసిద్దులే. ఒక్కోక్కరికి ఒక్కో వ్యాసం రాయచ్చు. కళాశాల ద్వారా అనేక వ్యాసాల సమాచారం లభ్యత ఉన్నది. అన్ని కళాశాలలో మరొకసారి కలవమన్నారు.

సమాచార సేకరణలో నాతోపాటు అలుపెరుగక తిరిగిన రాజశేఖర్ గారి మావయ్య గారైన కృష్ణమూర్తి గారు, వెంకటరమణ గార్ల సహకారానికి అనేకానేక కృతజ్ఞతలు..--విశ్వనాధ్ (చర్చ) 15:21, 3 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు అభినందనలు. మరింత ముందుకు సాగుతారని ఆశిస్తూన్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:27, 3 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి విషయం తెలియజేసారు. మీరు సమాచారాన్నే కాక పాత కొత్త వికీపీడియనులను తెవికీలోకి తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలాగే ముందుకు సాగండీ.--విష్ణు (చర్చ) 19:38, 3 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
విజయనగరంలోని కళాశాలలో ఘంటసాల గారి ఆడియోలు ఏమైనా వారు వికీకి ఇవ్వగలరేమో కనుక్కోండి. చాలా మంచి చొరవ. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:53, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సంగీత కళాశాల ప్రినిపాల్ మాకు అందుబాటులో లేకపోయారు. మిగతా వారిని కలిసాము. మళ్ళీ వెళ్ళినపుడు ఆవిడను కలసి అడుగుతాను..--విశ్వనాధ్ (చర్చ) 07:32, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]


పవన్ సంతోష్ గారి I.E.G గురించి

[మార్చు]

పవన్ సంతోష్ గారు ...... భారత దేశ భాషలలో ఏ ఇతర భాషల వారికి రాని ఐ.ఇ.గ్రాంట్ మీకు వచ్చింది. ఇది మనందరికెంతో (తెలుగు వికీపీడియన్ లకు) గర్వకారణము. అందులకు మీకు మరొక్కసారి ధన్యవాదములు. ఈ విషయంలో మీరు నేర్చుకున్న అనుభవాలు, ఎదుర్కొన్న ఆటుపోట్లు, సాధకబాధకాలు సహ వికీపీడియన్లందరితో పంచుకుంటే చాలా బాగుంటుంది. కనుక దయతో మీ అనుభవాలను ఉటంకిస్తూ, ఈ విషయమై ఈ క్రింద కనబరచిన విషయాలపై సమగ్రమైన ఒక నివేదిక ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

  1. మీరు IEG గ్రాంటు కొరకు నామోదు చేసుకున్నప్పుడు డిఎల్.ఐ. నుండి ఎన్ని గ్రంధాలను పొందుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. అవి ఎలాంటి గ్రంధాలు. (కాల్పనిక రచనలా?, విజ్ఞాన సంభందిత విషయ గ్రందాలా?, పురాణ సంభందిత గ్రంధాలా?, పత్రికలు వంటివా? ...... మరింకేమైనా గ్రంధాలా?
  2. అందులో మీరు ఎంతవరకు సఫలీకృతమైనారు. ఇంకా ఏమైనా మిగిలాయా? లేదా అనుకున్న దానికన్నా అధనంగా చేశారా?
  3. మీ ప్రాజెక్టు లో మీరు పొందు పరచిన గ్రంధాల నుండి వికీపీడియాకు ఎన్ని వ్యాసాలు కొత్తగా వచ్చి చేరాయి?
  4. ఈ విషయంలో మీకు సహకరించిన సహ వికీపీడియనులు ఎవరు.... ఎటువంటి సహకారము అందించారు?
  5. ఈ ప్రాజెక్టును మీరు అనుకున్నట్టు (ప్రపోజల్సు ప్రకారము) పరిసమాప్త పరిచారా? ఇందులో మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక వేళ ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని ఏ విధంగా అధిగమించారు ?.
  6. మీ ప్రాజేక్టు వలన వికీపీడియాలోని మిగతా సోదర ప్రాజెక్టులు అనగా, వికీసోర్సు, విక్షనరీ, వికీ బుక్స్ వంటి వాటికి ఏదైనా అధనపు సమాచారము చేరిందా? ఎలాంటి సమాచారము చేరింది?
  7. మీ ప్రాజెక్టును రిన్యూయల్ చేసే అవకాశమున్నదా..... దానికి సహవికీ పీడియనులు ఎలాంటి సహకారము అందిచాలి?
  8. ఐ.ఇ.జి ప్రాజెక్టు క్రింద ఇంకా ఎటువంటి (మీరు చేసిన ప్రాజెక్టు కాక) విషయాలపై ఐ.ఇ.జి. లభించే అవకాశమున్నది?

పైవిషయాలపై ఒక మంచి నివేధికను తయారు చేసి సహ వికీపీడియనులకు తెలియజేస్తే ..... మన తెలుగు వికీపీడియన్లలో మరికొందరు ఉత్సాహ వంతులు ఇటువంటి గ్రాంటు కొరకు ప్రయత్నించి సాధించి ప్రాజెక్టును పూర్తి చేసి మన తెలుగు వికీపీడియాకు యనలేని గౌరవాన్ని ఆపాదించ గలరు. ఇటు వంటి గ్రాంటు తీసుకోవడములో మీరే ప్రధములు గనుక మీరే అందరికి ఆదర్శప్రాయులు, మార్గదర్శకులూను. ఆ విధంగాకూడ మీకు గౌరవము ఆపాదించ బడుతుంది. ధన్యవాదములు. ఎల్లంకి (చర్చ) 15:30, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారికి: పైన కనపర్చిన విషయము ఎంతో ఉపయోగకరము మీకు గౌరవాన్ని ఆపాదిస్తుంది. మిగిలిన వికీపీడియన్లకు అవగాహనకొరకు ఎంతోఉపయోగకరంగావుంటుంది కనుక సంపూర్ణమైన నివేదికను అందరికి అందుబాటులోవుంచగలరు.--గుళ్ళపల్లి 02:31, 6 మార్చి 2015 (UTC)
సభ్యులకు నమస్కారం. నిన్ననే నేను వికీపీడియన్లను ప్రాజెక్టులో పాలుపంచుకోగలరేమో పరిశీలించమని కోరాను, దానిపై వైజాసత్య గారి వంటి సీనియర్లు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై ఆ కోణంలో చర్చ జరుగుతోంది. గతంలో నేను వికీమీడియన్లందరి సహకారం కోరాను. మళ్ళీ ఇప్పుడు కింది లింకు ద్వారా మళ్ళీ సహకారం కోసం కోరాను. ప్రాజెక్టుపై ఆసక్తి కలిగినవారు పనిచేస్తే అటు కమ్యూనిటీ మరింతగా సహకరించినట్లూ ఉంటుంది, ఇటు మరింతగా అవగాహన పెరుగుతుంది. ఇక మీరు పైన వేసిన ప్రశ్నలే కాక అంతకన్నా ముఖ్యమైన అంశాలతో కూడి నా అనుభవాన్ని, దీని వల్ల నేర్చిన పాఠాలను కూడా ప్రాజక్టు ముగింపు సందర్భంగా ఓ నివేదిక తయారుచేస్తాము. అది మెటా-వికీలో పెట్టడంతో పాటు తెనిగించి తెవికీలో కూడా చేరుస్తాను. ప్రస్తుతానికి ప్రాజెక్టు సమన్వయం చేస్తున్న నేను, ప్రాజెక్టులో గట్టి కృషి చేస్తున్న మీనా గాయత్రి, రాజశేఖర్ గార్లు కూడా వేర్వేరు కారణాల వల్ల బిజీగా ఉండడంతో వెంటనే పెద్దస్థాయిలో నివేదిక వ్రాసి, దానిపై చర్చలో పాల్గొనే పరిస్థితి లేదు. ఈ అంశాన్ని గుర్తించగలరు. నిజానికి ఎంతవరకూ సఫలీకృతమయ్యాము, ఎవరెవరు సహకరించారు వంటివి చెప్పేందుకు ప్రాజెక్టు పరిపూర్తి మాత్రమే సరైన సమయం. ఆసక్తి కనబరిచినందుకు సంతోషం. ఇదే ఉత్సాహంతో మీకు నచ్చితే ప్రాజెక్టు పనుల్లో కూడా పాలుపంచుకొమ్మని నా చిరు విన్నపం. --పవన్ సంతోష్ (చర్చ) 10:32, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Inspire Campaign: Improving diversity, improving content

[మార్చు]

This March, we’re organizing an Inspire Campaign to encourage and support new ideas for improving gender diversity on Wikimedia projects. Less than 20% of Wikimedia contributors are women, and many important topics are still missing in our content. We invite all Wikimedians to participate. If you have an idea that could help address this problem, please get involved today! The campaign runs until March 31.

All proposals are welcome - research projects, technical solutions, community organizing and outreach initiatives, or something completely new! Funding is available from the Wikimedia Foundation for projects that need financial support. Constructive, positive feedback on ideas is appreciated, and collaboration is encouraged - your skills and experience may help bring someone else’s project to life. Join us at the Inspire Campaign and help this project better represent the world’s knowledge!

(Sorry for the English - please translate this message!) MediaWiki message delivery (చర్చ) 20:01, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము (సిఆర్‌డిఎ)

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము (సిఆర్‌డిఎ) కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లా ల పరిధి యందు విస్తరించి ఉన్నది. అందువలన, ఈ జిల్లాల పేజీలలోని ఖాళీగా ఉన్న విభాగములను మాత్రము తొలగించుట జరుగు చున్నది. ప్రస్తుతము, తెలంగాణ రాష్ట్రములోని, గచ్చిబౌలి, మణికొండ, వంటి గ్రామములు సైబర్‌సిటీ లేదా ప్రత్యేక ఆర్ధిక మండళ్ళుగా రూపాంతరము చెందినవి. అలాగే కొత్తగా ఏర్పడిన సిఆర్‌డిఎ ప్రాంతములోని గ్రామములు కలసి ఉంటాయి. ఈ కారణము వలన పుటలలోని ఖాళీగా ఉన్న విభాగములను తొలగించుతున్నాను. దయచేసి, అర్థము చేసుకొనగలరని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 05:12, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామచరిత్ర వరకూ వదిలిపెట్టేస్తే మంచిదేమో ..
ఖాళీగా ఉన్నవి మీరు పూర్తి చేస్తారా ? ఎంతకాలానికి చేయగలరు ? ఆ విధంగా ఖాళీల వల్ల వచ్చే అపారమైన నష్టం అస్సలు ఎవరికయినా తెలుసునా ? తెలిస్తే ఎంత మందికి తెలుసు ? పని చేసేవారు తగ్గిపోయారు, ఉచిత సలహాలు ఇచ్చేవారు, ప్రశ్నించేవారు, పెత్తనం చేసేవారు ఎక్కువయి పోయారు. JVRKPRASAD (చర్చ) 06:13, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సహ వికీపీడియన్లకు విజ్ఞప్తి

[మార్చు]

సహ వికీపీడియన్లుకు,
నమస్తే. నేను కొన్ని నెలల క్రితం తెలుగు వికీపీడియాలో ఇండివిడ్యువల్ ఎంగేజ్‌మెంట్ గ్రాంట్ పొందిన విషయం, ఆపైన విశ్వనాథ్ గారి గ్రాంట్ వచ్చేందుకు నాకు సాధ్యమైనంత సహకారం అందించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై నెలల తరబడి నేను పలువురు వికీపీడియన్ల సహకారంతో కృషి చేస్తున్నాను. ప్రస్తుతానికి ముగింపు దశకు చేరుకుంది. ఐతే నేను ముందుగా అందరు వికీపీడియన్లను సహకరించమని కోరాను. కొందరు సహకరించారు. కొందరు కొత్తవారు కూడా ఈ ప్రాజెక్టు నచ్చి వికీపీడియన్లు అయ్యారు. కాకుంటే క్రియాశీలకంగా ఉన్న ఇతర వికీపీడియన్లు మీమీ సమయం, ఆసక్తి చూసుకుని ఇందులో మరింతగా భాగస్వాములైతే ఈ కృషిపై మరింత అవగాహన కలిగి మరింతకాలం కొనసాగి బాగా సఫలమౌతుందని భావిస్తున్నాను. కనుక వీలైనంత మంది ప్రాజెక్టు పేజీని సందర్శించి, మీమీ ఆసక్తులకు అనుగుణమైనవేవైనా అందులో కనిపిస్తే కృషి చేయమని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:17, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నాలాగా ఈ ప్రాజెక్టు గురించి అవగాహన లేనివాళ్ళు వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి చూడండి. పవన్ సంతోష్ గారూ, ప్రస్తుత స్థాయిలో ఒక సభ్యుడు ఏం చెయ్యచ్చో నిర్ధిష్టంగా చెబితే, మీకు మరింత సహకారం అందవచ్చు. ఉదాహరణకి, "అయ్యా వైజాసత్య, ఈ తో మొదలయ్యే ఈ వంద పుస్తకాలన్నాయి, వీటిని వివరాలు మీరు ఫలానా పేజీలో ఎక్కించగలరా?" అలాగా అనమాట. చూడబోతే దాదాపు అన్ని అక్షరాలకి పేజీలున్నట్టున్నాయి. ఇంతకీ ఒక అక్షరం జాబితా మొత్తం డీ.ఎల్.ఐలో ఎక్కడ దొరుకుతుంది? ఏది, ఎంత వరకు పూర్తయ్యింది? ఎక్కడ నేను సహాయం చేయగలను? మొదలైన సందేహాలు నాకున్నాయి --వైజాసత్య (చర్చ) 17:34, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ స్పందించినందుకు ధన్యవాదాలు. ప్రాజెక్టులోని పలు పుస్తకాలు వికీపీడియన్లు వికీపీడియాలో సోర్సులుగా వినియోగించుకునేందుకు, వికీసోర్సులో కాపీహక్కులు లేని పుస్తకాలను చేర్చేందుకు తమ అభిరుచుల మేరకు కృషిచేయడం సామాన్యంగా వికీపీడియన్లందరి ఆసక్తులకు దగ్గరగా ఉంటుంది. ఈ పనిలో వాడుకరి:Rajasekhar1961 గారు, స్వరలాసిక గారు, జెవిఆర్కే ప్రసాద్ గారు వంటివారు కృషిచేస్తున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ గారు పత్రికలు, పుస్తకాల సంచికలను కాపీహక్కులు లేనివి గుర్తిస్తూ వికీసోర్సులో చేరుస్తూన్నారు. ఐతే ప్రస్తుతం మీనా గాయత్రి, గతంలో లక్ష్మీదేవి గారు వంటి కొందరు జాబితాలో తమకు నచ్చిన పుస్తకాలను చేర్చడమూ చేశారు.(లక్ష్మీదేవి గారు అచ్చంగా పుస్తకాలను చదివి ఆస్వాదిస్తూ నచ్చినవి ఎక్కిస్తూనే హాయిగా కొనసాగారు. ఈ ప్రాజెక్టు ఆలోచన ఫేస్ బుక్ లో చదివి నచ్చి వికీలో అక్కౌంట్ క్రియేట్ చేసుకున్నారన్నమాట. గాయత్రి మాత్రం వరుసగా అక్షరాల వారీగా పేజీలు తయారుచేస్తున్నారు.) వాటిలో కొన్నిటికి నేను డిస్క్రిప్షన్ పుస్తకాలు తెరచి వ్రాశాను. మిగిలినవాటిలో తమకు అవగాహన ఉన్న రకం పుస్తకాలను తెరచి క్లుప్తంగా డిస్క్రిప్షన్లు వ్రాసినా బావుంటుంది. కాకుంటే ఇది అందరికీ ఆసక్తికరంగా అనిపించే పని కాదు. ఈ ప్రాజెక్టులోనే కాక వికీపీడియాలో ఎక్కడైనా వాలంటీర్లు వాలంటీరిజాన్నే పెద్దపీట వేయాలి కనుక మీకు మనస్సు ఎటువెళ్తోందో అటే పనిచేయమని సూచిస్తూన్నాను. ఇప్పటికే తాము నడిపిస్తూన్న ప్రాజెక్టుల్లోకి తప్పనిసరిగా ఈ పుస్తకాలు, మేగజైన్ల తాలూకా సమాచారం ఉపయోగపడుతుంది కనుక ఆ దిశగా గమనించినా బానేవుంటుంది. నా మరో సూచన ఏమిటంటే ఫోటోలు చేర్చే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఆసక్తి ఉన్న కొందరు వికీపీడియన్లు కొన్ని పుస్తకాలు తెరిస్తే వాటిలో పలువురు రచయితల విలువైన ఫోటోలు కూడా దొరుకుతాయి. అవి కాపీహక్కుల పరిధికి ఆవలే ఉండే అవకాశం ఉంది. కనుక కామన్స్‌లో చేర్చుకోవచ్చు కూడాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:49, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వాలంటీర్లమేనయ్యా. వాలంటీర్లు, సార్ మేం ఏ చెయ్యమంటారు, మీరు చెబితే అది చేస్తామని అడుగుతున్నారు. మరో విషయం, ప్రాజెక్టన్నాక ఒక పరిధి, దానికో ముగింపు ఉండాలిగా? పరిధిని నిర్వచించకుండా అనంతంగా ఆస్వాదిస్తూ ఉండిపోలేం. అఫ్‌కోర్సు దీని వళ్ళ వచ్చే ఫలాలను తరతరాలుగా ఆస్వాదిస్తాం. అంతమాత్రం చేత ప్రాజెక్టు తరతరాలుగా కొనసాగకూడదు. చక్కని జాబితాను తెలుగులో తయారు చెయ్యటం వరకేనా మీ గ్రాంటు పరిధి, లేక అన్నీ వికీసోర్సులో చేర్చాలన్నది మీ పరిధా? (ఈ ప్రశ్నలకు ఆలోచింపచేయడం తప్ప మరో ఉద్దేశ్యం లేదు. చమత్కారమేకానీ, వెటకారం అస్సలులేదు సుమా!!) --వైజాసత్య (చర్చ) 20:10, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు నేను పైన వేసిన ప్రశ్నల గురించి ఆలోచించండి. నేను అన్ని తెలుగు పుస్తకాల జాబితా సంపాదించాను. అంతలోగా నేను వాటిని ఒక వికీ టేబుల్లాగా పొందుపరచి మీకిస్తాను. ఔత్సహికులతో జాబితాను తెలుగులోకి అనువదింపజేసి పూర్తి జాబితా ఇక్కడ ఎక్కించవచ్చు. లేదా ఇక్కడ ఎక్కించి అనువదించినా ఫర్వాలేదు --వైజాసత్య (చర్చ) 02:20, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్య గారూ ఈ ప్రాజెక్టు పరిధి ఆయా జాబితాల్లో డీఎల్ఐలోని తెలుగు గ్రంథాలు మొత్తంగా ఓ ఆరువేలు పెట్టడం, వాటి నుంచి తెవికీలో వేయి వ్యాసాలు అభివృద్ధి చేయడం. వికీసోర్సులో కొన్ని(నిర్దిష్టమైన అంకె లేదు) కాపీహక్కులు లేని పుస్తకాలు వీటి నుంచి చేర్చడం. వీలుంటే విక్ష్నరీకి కూడా సమాచారాలను అందించడం. వికీపీడియన్లకు అవగాహన పెంచేందుకు అవసరమైతే వీటిపై ఎడిట్-అ-థాన్లు కూడా చేయవచ్చు.(ఈ పరిధిలోనే కొన్ని ఎడిట్-అ-థాన్లు జరిగాయి. కాకుంటే వికీపీడియన్లు గేదర్ అయ్యే చోట్లు చూసుకుని నేను ఇన్స్టంట్‌గా చేసినవి ఎక్కువ) ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో పుస్తకాలు కాటలాగ్ చేసే పని(డిస్క్రిప్షన్ ఒక్కటీ కొన్నిటికి వదిలి) మీనాగాయత్రి చేస్తున్నారు. నేను ఈ పుస్తకాల నుంచి వికీపీడియాలో వ్యాసాలు అభివృద్ధి చేసే పనిచేస్తూన్నాను. రాజశేఖర్ గారు మంచి పుస్తకాలను ఎంపికచేసి(ఇందుకోసం ఆయన క్లినిక్‌కి సంస్కృత, తెలుగు సాహిత్యాలపై అభినివేశం, అవగాహన ఉన్న వ్యక్తితో కలిసి వెళ్ళి డాక్టర్ గారి కోరిక మేరకు ప్రాధాన్యతలు చర్చించాము) వికీసోర్సులో చేర్చి వాటి పని కూడా చూస్తున్నారు. ప్రస్తుతానికి పుస్తకాల మొదటి కొన్ని పేజీలు తెరచి, వాటి వివరాలు గమనించి కొద్దిపాటి డిస్క్రిప్షన్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిపై ముందుకువస్తే గనుక మనం ప్రాజెక్టు చర్చపేజీల్లో మాట్లాడుకోవచ్చు. మరో విషయం-మీరు చెప్తున్న తెలుగు పుస్తకాల జాబితాను అనువదించి వికీసోర్సులో చేర్చవచ్చు కానీ డీఎల్ఐ లింకులు ఉండిన తెలుగు పుస్తకాలే ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. --పవన్ సంతోష్ (చర్చ) 06:03, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఓహ్ మీరంటున్నది ఈ జాబితా గురించా? వాటితో ఉన్న సమస్య ఏంటంటే పుస్తకం పేరు, రచయిత పేరు చాలావరకూ తప్పుగా రాసేశారు. దానిని నమ్మకుండా పుస్తకం తెరచి మరీ చూసి వ్రాస్తున్నాము. ఉదాహరణకు ఎ అనే పేరున్న పుస్తకాన్ని, బి అనే రచయిత వ్రాస్తే దానిని స్కాన్ చేసినప్పుడు మొదటిపేజీ చినిగిపోయింది. మొదటిపేజీలో అంకితం నూజివీడు జమీందారు ఫలానా ప్రసాద్ గారికి అనివుంటే పుస్తకం పేరు అంకితం రచయిత పేరు నూజివీడు జమీందారు అని రాసేశారు. ఇందువల్ల ప్రతీ పుస్తకం తెరుస్తున్నాము. అలా జాబితా చేసే పని చివరి పావువంతులోపుకి వచ్చింది. కనుక ప్రస్తుతానికి ఉన్న పెద్ద పనుల్లో ముఖ్యమైనది డిస్క్రిప్షన్లు రాసి చేర్చడమే ఎవరూ బాధ్యతవహించి నడపకుండా ఉన్నది. --పవన్ సంతోష్ (చర్చ) 06:25, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఓకే, [[మీరేం చెయ్యాలనుకుంటున్నారో నాకర్ధం అయ్యింది. నేను జాబితాలో ర అక్షరంతో మెదలెడతాను. --వైజాసత్య (చర్చ) 03:20, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

జీవిత చరిత్ర

[మార్చు]

ప్రతి వాడుకరి నిజ జీవిత చరిత్ర ఎంతో కొంత విభాగాలు వారీగా ఎవరి పేజీలలో వారే వ్రాసుకుంటే వాడుకరులందరకు ఎంతో కొంత ఉపయోగ పడవచ్చునని నా అభిప్రాయము. నిజానికి ఎవరి గురించి ఎవరికీ అంతగా తెలియదు. పాత వాడుకరులు గురించి, మరీ ముఖ్యంగా కొత్తగా వచ్చేవారికి, ప్రస్తుతము ఉన్నవారికి, ఏమాత్రము అవగాహన లేకుండా ఉన్నారు. దీని గురించి కొంత చర్చ చేస్తే బావుంటుంది. JVRKPRASAD (చర్చ) 01:59, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా మంచి సూచన JVRKPRASAD గారు. అలాగే చేద్దాం. --Pranayraj1985 (చర్చ) 05:51, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికి 11 వ వార్షికోత్సవము గురించి

[మార్చు]

సహ వికీపీడియనులకు విన్నపము:

తెవికి 11 వ వార్షికోత్సవాలను ఘనంగా జరుపపెట్టి కొన్ని కారణాల వల్ల ఘనంగా జరుపకుండా... తెలుగు వికీపీడియన్లకే పరిమితం చేసి గత నెలలో తిరుపతిలో సమావేశము అయిందనిపించుకున్నాం. ఆ సమావేశంలోనే.... రాయల సీమ ప్రాంతంలో కొన్ని అకాడెమీలు కూడ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. దానికనుగుణంగా... ఈ క్రింది ప్రతిపాదన చేయడమైనది.

తిరుపతి మరియు పరిసర ప్రాంతాలలో వున్న కళాశాలను ఎన్నుకొని (ఎన్ని అనేది నిర్ణయించాలి) తర్వాత రెండు రోజుల 11వ వార్షికోత్సవ సమావేశాలను నిర్వహించాలి. (తేది నిర్ణయించాలి) ఆ సమావేశాల సందర్భంగా ఒక గ్రంధాలయము, (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రాశ్చ్య లిఖిత గ్రంధాలయము) ఒక మ్యూజియం (శ్రీ వేంకటేశ్వర ఆలయ కళ ప్రదర్శన శాల) లో GLAM ప్రోగ్రాము కూడ నిర్వహించాలి.

ఈ ప్రతిపాధనకు సహ వికీపీడియనులు సహకరించి ఈ క్రింద తమ మద్ధతును తెలిపి ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో కూడ తమ సూచనలను ఇతర వివరాలను కూడ పొందు పర్చవలసినదిగా కోరడమైనది. ఎల్లంకి (చర్చ) 03:53, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]


తిరుపతిలో కార్యక్రమం నిర్వహించినా తిరుపతి ద్వారా మనకు వికీపీడియన్ల కొరత ఉంది. అక్కడ కొందరు వికీపీడియన్లను తయారు చేయడం జరగాలి కనుక మీరు చేసిన ప్రతిపాదన బావుంది. దీనిని ఎలా చెయాలనే దానిపై చర్చించుదాము. మీ అలోచనలు ఇక్కడ రాయండి. ఎలా చేస్తే బావుంటుంది ?, ఎవరు మనకు అక్కడ సహాయకారులు ?, ఎవరు ఆశక్తిగా ఉన్నరనేవి..--విశ్వనాధ్ (చర్చ) 06:25, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
తిరుపతి లో స్థానికంగా వున్న తెలుగు భాషోద్యమ సమితి, తిరుపతి వారు మనకు సహకరిస్తారు. మనలో నలుగురు సీనియరు వికీపీడియనులు అక్కడికి వెళ్ళి పరిసరాలలో వున్న కళాశాలలు యూనివర్సిటీలూ, ఇతర సంస్థలలో అకాడమీలను ఏర్పాటు చేసి వికీపీడియా గురించి అవగాహన కలిగిస్తే కొంత మంది వికీ పీడియనులు కొత్తగా చేరవచ్చు. ఎల్లంకి (చర్చ) 08:17, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఎల్లంకి గారు మీరు చేసిన ప్రతిపాదన బావుంది. విశ్వనాధ్ గారి సూచనలు బాగున్నాయి. అయితే ఇది పరీక్షల సమయం కనుక కళాశాలల్లో అకాడమీలు చేయడం కష్టమే అనుకుంటా.. మొదటగా తెలుగు భాషోద్యమ సమితి, తిరుపతి వారికి చేద్దాం --Pranayraj1985 (చర్చ) 05:58, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నావద్ద ఖర్చులకు పొను మిగిలినవి ఆరు వేల రూపాయలు అవి ఎమి చెయాలో ఇంకా సి.ఐ.ఎస్ వారి నుండి వేగు రాలేదు, పొయిన నెల విష్ను గారికి బిల్లులు ఇద్దాము అనుకొన్నాను ఈ నెల నేను డిల్లీ వెళ్ళటంతొ ఒక ఓచర్లు తీసుకొవటానికి అలస్యం జరిగినది, రహ్మన్ సూచన మేరకు సొమవారం మొత్తం బిల్లులు సి.ఐ.ఎస్ వారి పంపగలను. కాబట్టి ఆర్దిక వనరులు పరిమితం కావున సబ్యులు గమనించసూచన --కశ్యప్ (చర్చ) 11:17, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎడిటథాన్

[మార్చు]

ఈ మార్చ్ 8న ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ఆ సందర్భంగా ఈ నెలంతా కూడా వికీపీడియాలో మహిళా విషయ వ్యాసాలు వ్రాయవచ్చు. అందుకు ఈ పేజీని వేదికగా చేసుకోగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 09:20, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా రహ్మానుద్దీన్... --Pranayraj1985 (చర్చ) 05:59, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పరికరాలపెట్టె మరియు పేజీ చరిత్రలో అదనపు లింకులు (ఆంగ్లవికీలోలాగా)

[మార్చు]

పేజీ సమాచారం , పేజీ లో జరిగిన మార్పు ఎవరు చేశారు , పేజీ వీక్షణలు లాంటి కొన్ని సౌలభ్యాలు సులభంగా తెలుసుకోవడానికి, ఆంగ్ల వికీపీడియాలో లాగా మార్పులు చేశాను. ఇవి పేజీ చరిత్రను చూసినపుడు మీకు లింకులు కనబడుతాయి. మీ స్పందనలు మరియు ఏమైనా సమస్యలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 12:13, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది ఎలా సచేతనం చేసుకోవాలి? లేదా అందరు వాడుకర్లకూ సచేతనమై ఉంటుందా?--పవన్ సంతోష్ (చర్చ) 12:24, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్ , అందరికి పనిచేస్తుంది. ప్రయత్నించి చూడండి.--అర్జున (చర్చ) 12:29, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
చూశాను సర్. బావుంది. --పవన్ సంతోష్ (చర్చ) 12:40, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
గణాంక పరికరాల గురించి తెలియని వారికి, కొత్తవారికి కూడా ఇది చాలా ఉపయుక్తంగా ఉంది. పేజీ సమాచారం మరియు గణాంకాలు తెలుసుకొనే సౌలభ్యాన్ని సులభతరం చేసిన అర్జునరావు గారికి కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:21, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
లోహిత్ గారి పేజీలో ముందుగా చాలాకాలాం క్రితం చూశాను. ఆ తదుపరి వారి అనుమతితో కొద్ది కాలం (ఇంతకు ముందుగానే) క్రితము ఇలాంటివి నా పేజీలో మరికొన్ని విశేషాలు విభాగము నందు చేర్చుకున్నాను. అర్జున గారు అందరికీ తెలియ పరచినందులకు చాల సంతోషము. JVRKPRASAD (చర్చ) 13:27, 6 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా బాగుంది అర్జున గారు. --Pranayraj1985 (చర్చ) 06:00, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సౌలభ్యం చాలా బాగున్నది. ప్రవేశ పెట్టిన అర్జున గారికి ధన్యవాదాలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:52, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సౌలభ్యాన్ని ప్రవేశపెట్టిన అర్జున గారికి ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 17:13, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి}} ఎడిట్ టూల్స్ లోని మౌజ్ తో నొక్కి చేర్చగలిగే 'వికీచిహ్నలు' పెట్టెలో

[మార్చు]

2014 జనవరి లో వికీలో సహాయం పొందడానికి వాడే మూసను మార్చి, సహాయం కోరబడిన పేజీలను రచ్చబండలో కనబడేటట్లు చేయడమైనది. ఆ తరువాత దీని వాడుక గణాంకాలు పరిశీలించితే వాడుకరి చర్చలో 39పేజీలు, ఇతర చర్చలలో 29 పేజీలలో వాడబడింది. వ్యాస చర్చాపేజీలలో విశేషంగా వాడిన User:Rajasekhar1961, User:Pavan santhosh.s‎, User:Veera.sj మరియు సందేహాలకు స్పందించిన User:వైజాసత్య, User: C.Chandra Kanth Rao, మరియు చర్చాపేజీలలో వాడిన వాడుకరులందరికి, స్పందించిన User: JVRKPRASAD , User:Sultankhadar మరియు నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన User:Kvr.lohith వారందరికి ధన్యవాదాలు. పూర్తి విశ్లేషణ చేయలేదు కావున, దీనిని వాడిన వారిని నేను పైన పేర్కొనకపోతే మన్నించండి. దీనిని ఇంకా ఎక్కువ వాడటానికి అనుకూలంగా ఎడిట్ పెట్టె క్రింద చేర్చ గలిగే మూసల సమూహములో చేర్చాను.చర్చాపేజీలలో శీర్షిక ప్రారంభం కాగానే {{సహాయం కావాలి}}ని మౌజ్ తో నొక్కి చేర్చి మీ సందేహాన్ని విస్తరించండి. అప్పుడు మీ సందేహాలకు సత్వరంగా సమాధానాలు రావడానికి వీలుంటుంది మరియు తెలుగు వికీ అభివృద్ధికి దోహదపడుతుంది.--అర్జున (చర్చ) 11:17, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ చాలా ఉపయోగకరమైన పనిచేశారు. నా వరకూ నేను కొన్ని సార్లు పేరులో చిన్న చిన్న తేడాలతో పెట్టడం, రెడ్ లింక్ అవ్వడం నాకు ఇబ్బందే కలిగించింది. మరోమారు ఎడిట్ చేసి సమయం వృధా చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడా సమస్య తొలగిపోయింది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 12:26, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

టైపింగ్ సహాయం కొరకు

[మార్చు]

విజ్ఞులు - అని టైపింగ్ చేయాలంటే ఎలా? తెలియజేయగలరు. YVSREDDY (చర్చ) 15:06, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

  1. లేఖిని లో టైపింగ్ చేసి కాపీ చేసుకొని వేయవచ్చు.--శ్రీరామమూర్తి (చర్చ) 15:54, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:సహాయ కేంద్రం/పాత సహాయం 4#శాస్త్రజ్ఞుడు లో రెండేళ్ళ క్రితం సహాయాన్ని అభ్యర్థించాను. సరైన సహాయం లభించలేదు. అర్జున, వీవెన్ , రహ్మానుద్దీన్ లేదా ఎవరైనా సహాయపడగలరు.-- కె.వెంకటరమణ 17:12, 7 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఇన్‌స్క్రిప్టు లో "జ్ఞు" బాగా వస్తున్నది. తెలియజేసినందుకు రహ్మానుద్దీన్ గారికి ధన్యవాదాలు. అదే విధంగా "లిప్యంతరీకరణ" లో కూడా వచ్చేటట్లు చేయగలరు.-- కె.వెంకటరమణ 05:38, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
లిప్యంతరీకరణ లో ప్రస్తుతానికి j~n అని టైప్ చేస్తే "జ్ఞ" అని వస్తుంది. జ్ఞ అక్షరం వెనువంటనే పైన గల "ప్రత్యేక అక్షరాలు" విభాగం లో "తెలుగు" లో మూడవ వరుసలో చివర గల "్" ఒత్తితే చేస్తే " జ్ఞ్ " వస్తుంది. వెంటనే u టైప్ చేస్తే "జ్ఞు" వస్తుంది. అనగా j~n , ్ , u లను కలిపి టైప్ చేస్తే "జ్ఞు" వస్తుంది.-- కె.వెంకటరమణ 05:44, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]