షిర్డీ

వికీపీడియా నుండి
(షిరిడీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
షిర్డీ (शिर्डी)
—  town  —
Shirdi (शिर्डी)
Location of Shirdi (शिर्डी)
in మహారాష్ట్ర and భారతదేశం
Coordinates 19°46′N 74°29′E / 19.77°N 74.48°E / 19.77; 74.48Coordinates: 19°46′N 74°29′E / 19.77°N 74.48°E / 19.77; 74.48
Country భారత దేశము
రాష్ట్రం మహారాష్ట్ర
District (s) అహ్మద్ నగర్
Population 26,169  (2001)
Time zone IST (UTC+05:30)
Area

Elevation


504 metres (1,654 ft)

షిర్డీ లేదా షిరిడీ (ఆంగ్లం: Shirdi or Shiridi; మరాఠీ: शिर्डी) మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలోని నగర పంచాయితీ, శ్రీ షిర్డీ సాయిబాబా పుణ్యక్షేత్రం. ఇది అహ్మద్ నగర్ నుండి మన్మాడ్ మధ్య రాష్ట్ర ప్రధాన రహదారి సంఖ్య 10 మీద అహ్మద్ నగర్ నుండి 83 కి.మీ., మోపర్గాం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది.

జనాభా

[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం షిర్డీ జనాభా 26,169. ఇందులో 53% పురుషులు కాగా 47% మంది స్త్రీలు. ఇక్కడి సగటు అక్షరాస్యత 70% కాగా ఇది పురుషులలో 76% గాను, స్త్రీలలో 62% ఉంది. షిర్డీ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కన్నా చిన్న పిల్లలు.[1] పుణ్యక్షేత్రం కావడం మూలంగా షిర్డీకి ప్రతిరోజు అధిక సంఖ్యలో యాత్రికులు వస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు సుమారు 25,000 భక్తులు బాబా దర్శనానికి షిర్డీ వస్తారు. ఇదే సెలవు దినాలలో 5 లక్షల మంది వరకు ఉంటారు.

షిర్డీ సాయిబాబా ఆలయం

[మార్చు]
షిర్దీ సాయి నాథుడు

తిరుపతి దేవుని తర్వాత భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది షిర్డీ సాయిబాబా|సాయి నాథుని ఆలయానికి ఉన్న బంగారు, వెండి ఆభరణాల విలువ ముప్పైరెండు కోట్ల రూపాయలు ఉంటుంది. బాంకుల్లో డిపాజిట్లు నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలుంటాయి. షిర్డి సాయిబాబా స్వామి వారికి, వడ్డీరూపంలోను, విరాళాల రూపంలోను ఏడాదికి మూడు వందల కోట్ల పైగా వస్తుంది. ఇక్కడికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి, బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.

దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ సాయిబాబా మందిరాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అనేక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి. సాయి బాబా గురించి అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింప బడుతున్నది. అయితే సాయిబాబా ఆరాధనోద్యమంలో కొద్దిపాటి మాత్రమే షిరిడి సాయి సంస్థానం మార్గదర్శకత్వ వ్యవస్థలో ఉంది

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

బయటి లింకులు

[మార్చు]

హిందూ మతము

"https://te.wikipedia.org/w/index.php?title=షిర్డీ&oldid=4149228" నుండి వెలికితీశారు