Jump to content

శ్యామ్ బెనగళ్

వికీపీడియా నుండి
శ్యామ్ బెనగళ్
श्याम बेनेगल
శ్యాం బెనెగల్, అతని ఆఫీసులో, ముంబయి, భారతదేశం , డిసెంబరు, 2010
జననం1934 డిసెంబరు 14
మరణం2024 డిసెంబరు 23(2024-12-23) (వయసు 90)
వృత్తిసినీ దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత, సినీ నిర్మాత, రాజకీయ నాయకులు, director
జీవిత భాగస్వామినీరా బెనెగల్
పిల్లలుపియా బెనెగల్
పురస్కారాలుపద్మభూషణ్ పురస్కారం, కళలలో పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, Filmfare Award for Best Director, honorary doctor of the University of Calcutta, ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం

శ్యామ్ బెనగళ్ (1934 డిసెంబరు 14 - 2024 డిసెంబరు 23) భారతీయ సినీదర్శకుడు, చిత్ర రచయిత. చాలా దూరదర్శన్ సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), మంతన్ (1976), భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు.[1] ఈయన చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగస్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.[2]

జననం‌ 1934 డిసెంబరు 14న తిరుమలగిరి, అల్వాల్ మండలం, హైదరాబాదులో జన్మించిన శ్యామ్ బెనగళ్, ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురుదత్‌ దూరపు బంధువు. ఈయన సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నాడు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా అందుకున్నాడు.

సినిమాలు

[మార్చు]
  1. సమర్
  2. భూమిక
  3. ఆరోహణ్ (1982)
  4. అనుగ్రహం (1978)
దూరదర్శన్‌ ధారావాహికలు
  1. అమరావతి కథలు (తెలుగు, హిందీ)
  2. భారత్‌ ఏక్‌ ఖోజ్‌ (హిందీ) (1988)
  3. కథా సాగర్‌ (హిందీ) (1986)
  4. యాత్రా (హిందీ) (1986)
అవార్డులు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మరణం

[మార్చు]

శ్యామ్ బెనగల్ కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ 90 సంవత్సరాల వయస్సులో 2024 డిసెంబరు 23న ముంబైలో కన్నుమూసాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Indian directors at filmofdesire". Archived from the original on 2007-07-02. Retrieved 2009-07-11.
  2. "ప్రతి సినిమాకీ అవార్డు.. 5 లక్షలమంది నిర్మాతలతో రికార్డు: శ్యామ్‌ బెనెగల్‌ ప్రయాణమిదీ". Eenadu. 24 December 2024. Archived from the original on 24 December 2024. Retrieved 24 December 2024.
  3. "Shyam Benegal: ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ కన్నుమూత | filmmaker-shyam-benegal-passed-way". web.archive.org. 2024-12-23. Retrieved 2024-12-23.
  4. "Filmmaker Shyam Benegal passes away at the age of 90". The Times of India. 23 December 2024.

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

IMDBలో శ్యామ్‌ బెనెగల్‌ పేజీ