కాల్కా మెయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాల్కా మెయిల్
Kalka Mail train
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ రైలు
స్థానికతపశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్,ఉత్తర ప్రదేశ్,ఢిల్లీ,పంజాబ్ మరియుహర్యానా
తొలి సేవ1866 as the "East Indian Railway Mail".
ప్రస్తుతం నడిపేవారుతూర్పు రైల్వే మండలం
మార్గం
మొదలుహౌరా జంక్షన్ రైల్వే స్టేషను
గమ్యంకాల్కా
ప్రయాణ దూరం1,713 కిలోమీటర్లు (1,064 మై.)
రైలు నడిచే విధంరోజు
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్ , ఏ.సి 1,2,3 జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ ఉంది
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలుకలవు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం115 km/h (71 mph) maximum 57 km/h (35 mph) (average with halts)

కాల్కా మెయిల్ భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న పురాతన రైలు సర్వీసుల్లో ఒకటి.ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కాతా సమీపంలో గల హౌరా నుండి బయలుదేరి హర్యానా రాష్టంలో గల కాల్కా వరకు ప్రయాణిస్తుంది.

చరిత్ర

[మార్చు]

కాల్కా మెయిల్ ను ఈస్ట్ ఇండియా రైలే కంపెనీ 1866 లో హౌరా నుండి పాత ఢిల్లీ వరకు ఈస్ట్ ఇండియా రైలే మెయిల్ పేరుతో ప్రారంభించింది.1891 లో దీనిని కల్కా వరకు పొడిగించడమైనది.నాడు కాల్కా మెయిల్ యొక్క ప్రధాన ఉద్దేశం భారత ప్రధాన రాజధాని అయిన కోల్‌కాతా నుండి భారత వేసవి రాజధాని అయిన సిమ్లాకు అనుసంధానం చేయడం.కోల్‌కాతా నుండి సిమ్లా వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని, తరలించడానికి కాల్కా మెయిల్ ను ఉపయోగించేవారు.ప్రభుత్వ యంత్రాంగాన్ని తరలించడానికి వీలుగా కోల్‌కాతా లోను సిమ్లా లోను ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. కాల్కా మెయిల్ ను ప్రస్తుతం తూర్పు రైల్వే మండలం నిర్వహిస్తున్నది.

ప్రయాణ సమయం

[మార్చు]

కాల్కా మెయిల్ మొదటిరోజు రాత్రి 07గంటల 40నిమిషాలకు హౌరా జంక్షన్ రైల్వే స్టేషను 12311 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 04గంటల 30నిమిషాలకు కాల్కా చేరుతుంది.తిరుగుప్రయాణంలో కాల్కాలో 12312 నెంబరుతో రాత్రి 11గంటల 55నిమిషాలకు బయలుదేరి రెండు రోజుల ప్రయాణం తరువాత ముడవ రోజు ఉదయం 07గంటల 55 నిమిషాలకు హౌరా జంక్షన్ రైల్వే స్టేషనును చేరును.హౌరా జంక్షన్ రైల్వే స్టేషను నుండి కాల్కాను చేరుటకు 32గంటల 50నిమిషాలు ప్రయాణసమయం, కాల్కా నుండి హౌరా చేరుటకు 32 గంటల సమయం తీసుకుంటున్నది.

ప్రయాణ మార్గం

[మార్చు]

కాల్కా మెయిల్ హౌరా జంక్షన్ రైల్వే స్టేషను నుండి బయలుదేరి ధన్‌బాద్, గయ, అలహాబాద్, కాన్పూర్, అలీగడ్, ఘజియాబాద్, పాత ఢిల్లీ, అంబాలా, చండీగఢ్ ల మీదుగా కాల్కా చేరుతుంది.

సమయ సారిణి

[మార్చు]
సం కోడ్ స్టేషను పేరు 12311:
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 HWH హౌరా ప్రారంభం 19:40 0.0 1
2 BWN బర్ధమాన్ జంక్షన్ 20:49 20:54 5ని 94.4 1
3 DGR దుర్గాపూర్ 21:41 21:43 2ని 158.2 1
4 ASN ఆసన్సోల్ జంక్షన్ 22:17 22:22 5ని 200.4 1
5 DHN ధన్‌బాద్ 23:26 23:36 10ని 258.7 1
6 GMO గోమోహ్ 00:05 00:15 10ని 288.4 2
7 PNME పరస్నాథ్ 00:29 00:31 2ని 306.4 2
8 HZD హజారీబాగ్ 00:53 00:55 2ని 333.6 2
9 KQR కోడెర్మా 01:28 01:30 2ని 381.9 2
10 GAYA గయ 02:55 03:00 5ని 458.1 2
11 DOS దేహ్రి-ఆన్-సోనే 03:55 03:57 2ని 543.2 2
12 SSM ససారాం 04:11 04:13 2ని 561.0 2
13 BBU భబువ రోడ్ 04:43 04:45 2ని 308.7 2
14 MGS ముఘల్ సరై 06:15 06:30 15ని 663.3 2
15 MZP మిర్జాపూర్ 07:35 07:40 5ని 726.5 2
16 ALP అలహాబాద్ 09:00 09:10 10ని 816.0 2
17 FTP ఫతెహ్ పుర్ 1055 1058 3ని 932.8 2
18 CNP కాన్పూర్ 12:25 12:35 10ని 1010.4 2
19 PHD ఫఫుండ్ 13:42 13:44 1093.5 2
20 ETW ఈటవా జంక్షన్ 14:28 14:30 2ని 1149.8 2
21 SKB షికోహాబాద్ జంక్షన్ 15:09 15:11 2ని 1205.2 2
22 FZD ఫిరోజాబాద్ 15:33 15:35 2ని 1225 2
23 TDL తుండ్ల జంక్షన్ 16:10 16:18 8ని 1241.6 2
24 HRS హథ్రాస్ జంక్షన్ 16:51 16:53 2ని 1289.6 2
25 ALJN అలీగడ్ 17:20 17:25 5ని 1319.8 2
26 KRJ ఖుర్జ 17:55 17:58 3ని 1363.1 2
27 GZB ఘజియాబాద్ 20:00 20:02 2ని 1425.8 2
28 DLI పాత ఢిల్లీ 20:45 21:35 50ని 1446.1 2
29 SZM సబ్జీ మండీ 21:46 21:48 2ని 1449.0 2
30 SNP సోనిపట్ 22:20 22:22 2ని 1489.4 2
31 GNU గన్నుర్ 22:35 22:37 2ని 1505.3 2
32 SMK సమల్ఖ 22:49 22:51 2ని 1517.6 2
33 PNP పానిపట్ 23:07 23:09 2ని 1534.7 2
34 KUN కర్నాల్ 23:37 23:39 2ని 1568.9 2
35 KKDE కురుక్షేత్ర జంక్షన్ 00:35 00:37 2ని 1602.1 3
36 UMB అంబాలా 02:10 02:20 10ని 1644.1 3
37 CDG చండీగఢ్ 03:00 03:50 50ని 1688.8 3
38 CNDM చండి మందిర్ 04:04 04:05 1ని 1698.1 3
39 KLK కాల్కా 04:30 గమ్యం

భోగీల అమరిక

[మార్చు]

కాల్కా మెయిల్ లో 11 స్లీపర్స్, 7 ఎ.సి కోచ్‌లు (1AC, 2AC, 3AC), 1 పాంట్రీ కార్, 3 జనరల్ సిటింగ్, 2 ఎస్.ఎల్.ఆర్ బోగీలు ఉంటాయి.

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
SLR RMS UR S1 S2 S3 S4 S5 PC B1 B2 B3 A3 A1 A2 HA1 S6 S7 S8 S9 S10 S11 UR D1

సంఘటనలు

[మార్చు]

జులై 10 2011 న కాన్పూర్, ఫతెహ్ పుర్ రైల్వే స్టేషన్ ల మద్య కాల్కా మెయిల్ పట్టాలు తప్పడంతో సమారు 69మంది మృతి చెందగా,200మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలైయ్యారు.దీనికి కారణం లోకోమోటివ్ యొక్క నిర్వహణ సరిగ్గా లేకపోవడమని దర్యాప్తూలో తేలింది.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూస:IndianTrains

కోల్‌కాతా