Jump to content

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

వికీపీడియా నుండి
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం (వ్యక్తిగతం)
వ్యవస్థాపిత 1954
మొదటి బహూకరణ 1955
క్రితం బహూకరణ 2022- త్రిపురాంతకం నరేంద్ర - మనోధర్మ పరాగం
బహూకరించేవారు కేంద్ర సాహిత్య అకాడమీ, భారత ప్రభుత్వం
వివరణ భారతీయ సాహిత్య పురస్కారం

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్యసృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు అందజేస్తోంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు.2022 సంవత్సరానికి త్రిపురాంతక నరేంద్ర రచన అయిన మనోధర్మ పరాగంకి వచ్చింది

చరిత్ర

[మార్చు]

కేంద్ర సాహిత్య అకాడమీ భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954లో స్థాపించింది. రాజ్యాంగం గుర్తించిన భాషలతో పాటు తాను పరిగణనలోకి తీసుకున్న మరికొన్ని భాషలు కలిపి మొత్తం 22 భాషల సాహిత్యవేత్తలకు ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. తొలి పురస్కారాన్ని 1955 ప్రదానం చేశారు. జ్ఞాపికతో పాటుగా అందజేసే నగదు బహుమతిని ప్రారంభించినప్పుడు రూ.5వేలుగా ఉండగా క్రమంగా ఆ మొత్తాన్ని పెంచారు. 1983లో రూ.10వేలు, 2001లో రూ.40వేలు, 2003లో రూ.50వేలుగా బహుమతి మొత్తాన్ని పెంచారు. 2009 నుంచి పురస్కార గ్రహీతలకు రూ.లక్ష చొప్పున బహుమతిని అందజేస్తున్నారు.

పురస్కారం

[మార్చు]
  1. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు - 2015

సాహిత్య అకాడమీ ఇతర పురస్కారాలు

[మార్చు]

కేంద్ర సాహిత్య అకాడమీ సంస్థ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటుగా కొన్ని ఇతర పురస్కారాలను కూడా ఏర్పాటుచేశారు. ఇతర పురస్కారాల నుంచి వేరుగా గుర్తించేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రధాన పురస్కారంగా వ్యవహరిస్తుంటారు. సాహిత్యాన్ని అభివృద్ధి చేసేందుకు అకాడమీ ప్రకటించే ఇతర పురస్కారాలు:

పురస్కారాల ప్రాతిపదిక

[మార్చు]

నిబంధనలు

[మార్చు]
  1. ఈ అవార్డు కొరకు పుస్తకం అది వ్రాయబడిన భాషలో విశేషమైనదిగా గుర్తింపబడాలి. ఈ పుస్తకం క్రొత్తగా సృష్టింపబడినది గానీ లేదా విశేషమైన కృషితోగాని వ్రాయబడినదై ఉండాలి. కానీ అనువాదం.

భాషలు

[మార్చు]

తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు

[మార్చు]
సంవత్సరం పుస్తకం సాహితీ విభాగం రచయిత
2024 దీపిక విమర్శ పెనుగొండ లక్ష్మీనారాయణ
2023 రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు కథనిక తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి
2022 మనోధర్మపరాగం నవల మధురాంతకం నరేంద్ర
2021 వల్లంకి తాళం కవిత గోరటి వెంకన్న
2020 అగ్నిశ్వాస కవితా సంపుటి నిఖిలేశ్వర్
2019 విమర్శిని వ్యాసాలు కొలకలూరి ఇనాక్
2018 శప్తభూమి నవల బండి నారాయణస్వామి
2017 గాలిరంగు కవిత్వం దేవిప్రియ
2016 రజనీగంధ - కవితా సంకలనం కవిత్వం పాపినేని శివశంకర్
2015 విముక్తి-కథానిక కథ వోల్గా
2014 మన నవలలు-మన కథానికలు విమర్శా వ్యాసాల సంకలనం రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
2013 సాహిత్యాకాశంలో సగం తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం కాత్యాయని విద్మహే[1]
2012 పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు కథా సంకలనం పెద్దిభొట్ల సుబ్బరామయ్య
2011 స్వరలయలు వ్యాసాలు సామల సదాశివ
2010 కాలుతున్న పూలతోట నవల సయ్యద్ సలీమ్
2009 ద్రౌపది నవల యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
2008 పురుషోత్తముడు పద్యరచన చిటిప్రోలు కృష్ణమూర్తి
2007 శతపత్రం ఆత్మకథ గడియారం రామకృష్ణ శర్మ
2006 అస్తిత్వనదం ఆవలి తీరాన చిన్న కథ మునిపల్లె రాజు
2005 తనమార్గం కథా సంకలనం అబ్బూరి ఛాయాదేవి
2004 కాలరేఖలు నవల అంపశయ్య నవీన్
2003 శ్రీ కృష్ణ చంద్రోదయము పద్యరచన ఉత్పల సత్యనారాయణాచార్య
2002 స్మృతి కిణాంకం వ్యాసాలు చేకూరి రామారావు
2001 హంపీ నుంచి హరప్పా దాక ఆత్మకథ తిరుమల రామచంద్ర
2000 కాలాన్ని నిద్ర పోనివ్వను పద్యరచన ఆచార్య ఎన్.గోపి
1999 కథాశిల్పం వ్యాసాలు వల్లంపాటి వెంకటసుబ్బయ్య
1998 బలివాడ కాంతారావు కథలు కథలు బలివాడ కాంతారావు
1997 స్వప్నలిపి కవిత అజంతా (పి. వి. శాస్త్రి)
1996 కేతు విశ్వనాథ రెడ్డి కథలు కథలు కేతు విశ్వనాథరెడ్డి
1995 యజ్ఞంతో తొమ్మిది కథలు కాళీపట్నం రామారావు
1994 కాలరేఖ విమర్శ గుంటూరు శేషేంద్రశర్మ
1993 మధురాంతకం రాజారాం కథలు కథలు మధురాంతకం రాజారాం
1992 హృదయనేత్రి నవల మాలతీ చందూర్
1991 ఇట్లు మీ విధేయుడు కథలు భమిడిపాటి రామగోపాలం
1990 మోహనా ఓ మోహనా కవిత కె.శివారెడ్డి
1989 మణిప్రవాళము వ్యాసాలు ఎస్.వి.జోగారావు
1988 అనువాద సమస్యలు విమర్శ రాచమల్లు రామచంద్రారెడ్డి
1987 గురజాడ గురుపీఠం వ్యాసాలు ఆరుద్ర
1986 ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం సాహితీ విమర్శ ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం
1985 గాలివాన కథలు పాలగుమ్మి పద్మరాజు
1984 ఆగమ గీతి కవిత ఆలూరి బైరాగి
1983 జీవనసమరం వ్యాసాలు రావూరి భరద్వాజ
1982 స్వర్ణ కమలాలు కథలు ఇల్లిందుల సరస్వతీదేవి
1981 సీతజోస్యం నాటకం నార్ల వెంకటేశ్వరరావు
1979 జనప్రియ రామాయణం కవిత్వం పుట్టపర్తి నారాయణాచార్యులు
1978 కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు) కవిత్వం, నాటకాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి
1977 కుందుర్తి కృతులు కవిత్వం కుందుర్తి ఆంజనేయులు
1975 గుడిసెలు కూలిపోతున్నాయి కవిత్వం బోయి భీమన్న
1974 తిమిరంతో సమరం కవిత్వం దాశరథి
1973 మంటలు మానవుడు కవిత్వం సి.నారాయణరెడ్డి
1972 శ్రీశ్రీ సాహిత్యము కవిత్వం శ్రీశ్రీ
1971 విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్య వ్యాఖ్యానం తాపీ ధర్మారావు
1970 అమృతం కురిసిన రాత్రి కవిత్వం దేవరకొండ బాలగంగాధర తిలక్‌
1969 మహాత్మకథ కవిత్వం తుమ్మల సీతారామమూర్తి
1965 మిశ్రమంజరి కవిత్వం రాయప్రోలు సుబ్బారావు
1964 క్రీస్తుచరిత్ర కవిత్వం గుర్రం జాషువా
1963 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవల త్రిపురనేని గోపీచంద్
1962 విశ్వనాథ మధ్యాక్కఱలు కవిత్వం విశ్వనాథ సత్యనారాయణ
1961 ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము జీవిత చరిత్ర బాలాంత్రపు రజనీకాంతరావు
1960 నాట్యశాస్త్రము చరిత్ర పి.ఎస్.ఆర్. అప్పారావు
1957 శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర జీవిత చరిత్ర చిరంతానందస్వామి
1956 భారతీయ తత్వశాస్త్రము పరిశోధన బులుసు వెంకటేశ్వర్లు
1955 ఆంధ్రుల సాంఘిక చరిత్రము చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి

1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.

పురస్కార గ్రహీతలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-12-19. Retrieved 2013-12-19.

బయటి లింకులు

[మార్చు]