రవితేజ
రవితేజ | |
---|---|
జననం | భూపతిరాజు రవిశంకర్ రాజు [1] 1968 జనవరి 26[2] |
విద్యాసంస్థ | సిద్ధార్థ డిగ్రీ కాలేజీ, విజయవాడ |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1990–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కళ్యాణి (m. 2000) |
పిల్లలు | 2 |
రవితేజ (జననం 1968 జనవరి 26) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.
వ్యక్తిగత సమాచారం
[మార్చు]రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. ముగ్గరు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్ లు కూడా నటులే. రవితేజ తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందు ఉత్తర భారతదేశంలో జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్ మొదలైన ప్రదేశాలన్నీ తిరిగాడు. తరువాత కుటుంబంతో సహా విజయవాడకు వెళ్ళారు. అక్కడ ఆయన సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బి.ఎ కోర్సులో చేరాడు. రవితేజ నాయనమ్మ, తాతగారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఖండవల్లి గ్రామం.
ప్రస్థానం
[మార్చు]మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు, దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడు. 1997 లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేసాడు. కాని జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్లిపోయింది, ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. తరువాత అనేక సినిమాల్లో గుర్తింపు వున్న వేషాలు వేసాడు కానీ బ్రేక్ రాలేదు.1999 లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాలో రవితేజ హీరోగా చేసాడు ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో హీరోగా చేయగా సూపర్ హిట్ అయి హీరోగా గుర్తింపు వచ్చి ఇడియట్ తో సెటిల్ అయ్యాడు. తరువాత ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, వీడే, దొంగోడు, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్,బలుపు,పవర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.2017 లో రాజా ధి గ్రేట్ తో మరొక విజయాన్ని అందుకున్నారు.
చిత్రాలు
[మార్చు]ప్రధాన వ్యాసం: రవితేజ నటించిన సినిమాలు
సంవత్సరం | చిత్రం | పాత్ర | ఇతర విశేషాలు |
---|---|---|---|
1991 | కర్తవ్యం | ||
చైతన్య | |||
1992 | ఆజ్ కా గూండా రాజ్ | గ్యాంగ్ లీడర్ చిత్రం యొక్క హిందీ పునఃనిర్మాణం | |
1993 | అల్లరి ప్రియుడు | ||
1994 | క్రిమినల్ | ||
1996 | నిన్నే పెళ్ళాడుతా | అతిథి పాత్ర | |
1998 | సింధూరం | చంటి | |
పాడుతా తీయగా | |||
1999 | మనసిచ్చి చూడు | ||
ప్రేమకు వేళాయెరా | రవి | ||
నీ కోసం | రవి | విజేత,నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం | |
సముద్రం | చేపల నాని | ||
ఓ పనై పోతుంది బాబు | |||
ప్రేమించేమనసు | |||
2000 | క్షేమంగా వెళ్ళి లాభంగా రండి | అతిథి పాత్ర | |
తిరుమల తిరుపతి వెంకటేశ | తిరుపతి | ||
సకుటుంబ సపరివార సమేతం | అతిథి పాత్ర | ||
అన్నయ్య | రవి | ||
2001 | చిరంజీవులు | చందు | |
అమ్మాయి కోసం | రవి | ||
బడ్జెట్ పద్మనాభం | రవి | ||
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం | సుబ్రహ్మణ్యం | ||
2002 | వందేమాతరం | రవి | |
అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు | అనీల్ | ||
ఇడియట్ | చంటి | ||
అన్వేషణ'' | అవినాష్ | ||
ఖడ్గం | కోటి | విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం | |
2003 | ఈ అబ్బాయి చాలా మంచోడు | వివేకానంద | |
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి | చందు | ||
ఒక రాజు ఒక రాణి | రవి | ||
దొంగోడు | మాధవ | ||
వీడే | ఏడుకొండలు | ||
2004 | వెంకీ | వెంకీ | |
నా ఆటోగ్రాఫ్ | శీను | ||
చంటి | చంటి | ||
2005 | భద్ర | భద్ర | |
భగీరథ | చందు | ||
2006 | షాక్ | శేఖర్ | |
విక్రమార్కుడు | అత్తిలి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాథోడ్ IPS |
ద్విపాత్రాభినయం | |
ఖతర్నాక్ | దాసు | ||
2007 | దుబాయ్ శీను | శీను | |
శంకర్‌దాదా జిందాబాద్ | అతిథి పాత్ర | ||
2008 | కృష్ణ | కృష్ణ | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు |
బలాదూర్ | శీను | ||
నేనింతే | రవి | విజేత, నంది ఉత్తమ నటుడు పురస్కారం | |
2009 | కిక్ | కళ్యాణ్ | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు |
ఆంజనేయులు | ఆంజనేయులు | ||
2010 | శంభో శివ శంభో | కర్ణ | |
మర్యాద రామన్న | వ్యాఖ్యాత | ||
డాన్ శీను | డాన్ శీను | ||
2011 | మిరపకాయ్ | రిషీ | |
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు | అతిథి పాత్ర | ||
దొంగల ముఠా | సుధీర్ | ||
వీర | వీర | ||
2012 | నిప్పు | సూర్య | |
దరువు | బుల్లెట్ రాజా, రవీంద్ర |
ద్విపాత్రాభినయం | |
దేవుడు చేసిన మనుషులు | రవితేజ | ||
సారొచ్చారు | కార్తీక్ నారాయణ | ||
2013 | బలుపు | శంకర్ | |
దూసుకెళ్తా | వాయిస్ | ||
2014 | పవర్ | ద్విపాత్రాభినయం | |
రోమియో (2014)[3][4] | అతిథి పాత్ర | ||
2015 | కిక్ 2 | కిక్ సినిమా యొక్క తరువాయి భాగం | |
బెంగాల్ టైగర్ | ఆకాష్ నారాయణ్ | ||
2017 | రాజా ది గ్రేట్ | రాజా | |
2018 | టచ్ చేసి చూడు | కార్తికేయ | |
నేల టిక్కెట్టు | |||
అమర్ అక్బరు ఆంటోని | |||
2020 | డిస్కో రాజా[5][6] | డిస్కో రాజా | |
2021 | క్రాక్[7] | వీర శంకర్ | |
2021 | ఖిలాడి | మోహన్ గాంధీ | [8] |
2022 | రామారావు ఆన్ డ్యూటీ | రామారావు | [9] |
2022 | రావణాసుర | ||
2022 | టైగర్ నాగేశ్వరరావు | ||
2022 | ధమకా | ||
2023 | వాల్తేరు వీరయ్య | ఏసీపీ విక్రమ్ సాగర్ ఐపీఎస్ | [10] |
2024 | ఈగల్ | నిర్మాణంలో ఉంది.[11] |
నిర్మాత
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | గమనికలు | మూలాలు |
---|---|---|---|
2022 | మట్టి కుస్తీ | తమిళ సినిమా | [12] |
2023 | రావణాసురుడు | [13] | |
ఛాంగురే బంగారు రాజా | [14][15] | ||
సుందరం మాస్టర్ | [16][17] |
సోదరుడు భరత్
[మార్చు]రవితేజ తమ్ముడు భరత్ పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్, జంప్ జిలాని (2014)[18] లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. భరత్ (52) 2017, జూలై 24 రాత్రి హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ దగ్గర తన కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న భరత్ ఆగివున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘోర ప్రమాదంలో భరత్ అక్కడిక్కడే మృతిచెందాడు. శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మూలాలు
[మార్చు]- ↑ AuthorTelanganaToday. "Ravi Teja to appear before SIT on Friday". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 13 July 2020. Retrieved 12 July 2020.
- ↑ 2.0 2.1 "Ravi Teja: Movies, Photos, Videos, News & Biography". The Times of India. Archived from the original on 23 July 2018. Retrieved 30 June 2018.
- ↑ సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
- ↑ సాక్షి, సినిమా (9 October 2014). "రవితేజ నటించడంతో రోమియో స్థాయి పెరిగింది". Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
- ↑ సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 2020-01-24. Retrieved 24 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 జనవరి 2020. Retrieved 24 January 2020.
- ↑ "Krack movie update: Ravi Teja's film shooting resumes". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-07. Retrieved 2020-10-11.
- ↑ "Ravi Teja Khiladi Review: Check out Netizens Reactions". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-02-11. Retrieved 2022-02-12.
- ↑ "Ravi Teja as Honest Officer in Rama Rao on Duty". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-07-13. Retrieved 2022-02-12.
- ↑ "Chiranjeevi introduces Ravi Teja as Vikram Sagar ACP in Waltair Veerayya. See first-look poster - India Today". web.archive.org. 2022-12-29. Archived from the original on 2022-12-29. Retrieved 2022-12-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Ravi Teja: ఆ చూపె మరణం.. ఆ అడుగె సమరం | eagle title announcement". web.archive.org. 2023-08-21. Archived from the original on 2023-08-21. Retrieved 2023-08-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Ravi Teja sir is like a brother figure to me: Vishnu Vishal". Times of India. 5 April 2022. Retrieved 29 November 2022.
- ↑ "Ravi Teja and Sushanth starrer 'Ravanasura' will hit the theatres next year on April 7". Economics Times. Retrieved 15 December 2022.
- ↑ "Ravi Teja's RT Teamworks To Produce Changure Bangaru Raja, Deets Inside". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-08-11. Retrieved 2022-11-10.
- ↑ TV9 Telugu (13 September 2023). "రవితేజ నిర్మాణంలో `ఛాంగురే బంగారు రాజా`.. హీరో కార్తిక్ రత్నం మాటల్లో సినిమా విశేషాలు." Archived from the original on 15 సెప్టెంబరు 2023. Retrieved 15 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Official: Raviteja's Next Is 'Sundaram Master'". Gulte.com (in ఇంగ్లీష్). 2023-06-22.
- ↑ NTV Telugu (23 June 2023). "రవితేజ నిర్మించిన సుందరం మాస్టర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల." Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రవితేజ పేజీ