బులంద్‌షహర్ జిల్లా
బులంద్షహర్ జిల్లా
बुलन्दशहर ज़िला بلند شہر ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మీరట్ |
ముఖ్య పట్టణం | బులంద్షహర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,719 కి.మీ2 (1,436 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 34,98,507 |
• జనసాంద్రత | 940/కి.మీ2 (2,400/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 70.19%[1] |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాల్లో బులంద్‌షహర్ జిల్లా (హిందీ:बुलन्दशहर ज़िला) (ఉర్దూ:بلند شہر ضلع) ఒకటి. బులంద్‌షహర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.
భౌగోళికం
[మార్చు]బులంద్‌షహర్ జిల్లా మీరట్ డివిజన్‌లో భాగంగా ఉంది. ఇది గంగా యమునా నదుల మద్య ఉంది. జిల్లా 28.4 0 నుండి 28.0 0 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 77.0 0 నుండి 78.0 0 తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. జిల్లా 84 కి.మీ పొడవు 62 కి.మీ వెడల్పు ఉంది. సముద్రమట్టం నుండి ఇది సగటున 237.44 అడుగుల ఎత్తున ఉంది. బులంద్‌షహర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలో దిబై, షికార్పూర్, సియన, బుగ్రసి, అనూప్షహ్ర్, జహంగీరాబాద్, ఖుర్జ, బులంద్షహర్ వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి.
సరిహద్దులు
[మార్చు]జిల్లా తూర్పు సరిహద్దులో అమ్రోహా, బదాయూన్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులో అలీగఢ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో గౌతమ బుద్ధ నగర్ జిల్లా జిల్లా, ఉత్తర సరిహద్దులో ఘాజియాబాద్ జిల్లా ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]సా.శ. 1018కు ముందు బులంద్‌షహర్ ప్రాంతం గురించిన చరిత్ర స్పష్టంగా లభించడం లేదు. 1018 లో మహమ్మద్ గజని బరన్ ముందు నిలిచి హిందూ రాజును లొంగదీసుకున్నాడు. 1193లో ఈ నగరాన్ని కుతుబుద్దీన్ స్వాధీనపరచుకున్నాడు. 14వశతాబ్దంలో ఈ నగరం రాజపుత్రులు, మంగోల్ దండయాత్రలకు ఈ నగరం వేదికగా నిలిచింది. తరువాత ఈ ప్రాంతం ముగల్ సామ్రాజ్యంలో భాగం అయింది. ఔరంగజేబు తరువాత ముగల్ సంరాజ్యం పతనం ప్రారంభం అయింది. పొరుగున ఉన్న జాట్, గుజార్ వంటి పలువురు రాజప్రతినిధులు చిన్న చిన్న రాజ్యాలను ఏర్పరచుకున్నారు. ఈ సమయంలో బరన్‌కు ప్రత్యేక చరిత్ర ఏదీ లేదు. అయినప్పటికీ ఇది కొయిల్ మీద ఆధారపడుతూ మరాఠీ ప్రభువుల ఆధీనంలో ఉంది. కొయిల్, అలిగఢ్ కోట 1803లో బ్రిటిష్ ప్రభుత్వానికి స్వాధీనం అయింది. తరువాత బులంద్‌షహర్, పరిసరప్రాంతం 1805లో కొత్తగా ఏర్పాటు చేయబడిన అలిగఢ్ జిల్లాలో భాగం అయింది.1901లో జిల్లా జనసంఖ్య 11,38,101.[2]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 34,98,507, [3] |
ఇది దాదాపు. | లితుయానియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 85 వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 788 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 20.09%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 892:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 76.23%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | అఫ్హికం |
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10.
- ↑ Chisholm, Hugh, ed. (1911). ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 4 (11th ed.). Cambridge University Press. p. 771. .
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Lithuania 3,535,547 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Connecticut 3,574,097