వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 48

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 47 | పాత చర్చ 48 | పాత చర్చ 49

alt text=2016 ఏప్రిల్ 6 - 2016 మే 5 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2016 ఏప్రిల్ 6 - 2016 మే 5

ఇంటర్నెట్ కొరకు అభ్యర్థన[మార్చు]

అందరికి నమస్కారం... తెలుగు వికీపీడియాలో గత మూడు సంవత్సరాల నుంచి వ్యాసరచన ద్వారా, కార్యక్రమ నిర్వహణలో సహకారం ద్వారా, ప్రచారం ద్వారా నేను స్వచ్ఛంద కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకాలంగా గోల్డెన్ థ్రెషోల్డ్ లో ఉన్న ఇంటర్నెట్ ఉపయోగించుకుని ప్రధానంగా పనిచేసేవాడిని. కాని, గతకొంతకాలంగా అక్కడ ఏర్పడ్డ సమస్యల మూలంగా ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం లేదు. విద్యార్థి దశలోనే ఉండడం, పైన వివరించిన పలు సమస్యల కారణంగా ప్రస్తుతం సంవత్సరం పాటుగా ఇంటర్నెట్ సౌకర్యం సీఐఎస్-ఎ2కెను కోరుకుని తీసుకోవాలని భావిస్తున్నాను. ఈ సౌకర్యం తర్వాత నా వ్యాసరచన సహజంగానే నాకు కనీసం నెలకు మరో పది వ్యాసాల నాణ్యత అభివృద్ధి చేయడమో, లేక కొత్త నాణ్యమైన వ్యాసాలు సృష్టించడమో చేయగలిగే వీలు దొరుకుతుంది. ఆన్లైన్లో చేస్తున్న ప్రచారం కొనసాగించడం వంటి అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా వినియోగిస్తాను. అంతేకాక తీసుకునే నెట్ కనెక్షన్ ముందుగా తెలియపరిస్తే తెవికీ సముదాయపు ఇతర అవసరాల కోసం కూడా ఉపయోగిస్తాను. సముదాయ సభ్యులు సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాను. --Pranayraj1985 (చర్చ) 09:33, 6 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందన[మార్చు]

  1. సీఐఎస్-ఎ2కె ద్వారా తీసుకోవచ్చు, కాని దానికి వారి అజెండాను అనుసరించి వారి అవసరాలకు అనుగుణంగా కొంత కృషి చేయవలసి ఉంటుంది. మీకు అంగీకారం అయితే వారి ద్వారా సౌకర్యం పొందడానికి మీకు మద్దతిస్తున్నాను..--Viswanadh (చర్చ) 10:14, 6 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ఈ విషయంలోPranayraj1985 గారికి నా పూర్తి మద్దతును తెలుపుతున్నాను.--స్వరలాసిక (చర్చ) 15:53, 6 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. తెవికీ నెలవారి సమావేశాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ పలు ఇతర సేవలు అందిస్తున్న ప్రణయరాజ్ గారికి అంతర్జాల సౌకర్యం కలిగించడానికి నేను మద్దతు ఉస్తున్నాను. --t.sujatha (చర్చ) 06:21, 7 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4. మద్దతు.Palagiri (చర్చ) 06:39, 7 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5. తెవికీ లో విశేష సేవలందిస్తున్న ప్రణయ్‌రాజ్ గారికి నెట్ కనెక్షన్ సౌకర్యం కలిగించడానికి మద్దతునిస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 09:12, 7 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6. మద్దతు తెలుపుతున్నాను------నాయుడుగారి జయన్న (చర్చ) 15:07, 7 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ లో పుస్తకాలను మూలంగా వాడడానికి కొత్త మూస[మార్చు]

{{Cite wikisource}} అనబడే కొత్త మూసని వికీసోర్స్ పుస్తకాల మూలాలకు వాడండి. ఇది తెలుగు అక్షరాలు మాత్రమే కనబడి సౌలభ్యంగా వుంటుంది. ఉదాహరణ వాడుక--అర్జున (చర్చ) 02:25, 10 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అనుభవజ్ఞులైన వాడుకరులతో నెలరోజుల శిక్షణ[మార్చు]

అందరికీ నమస్కారం,
హైదరాబాద్ ఫిబ్రవరి నెలవారీ సమావేశంలో ఇంటర్న్ షిప్ తరహాలో అనుభవజ్ఞులైన వాడుకరులతో నెలరోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని చర్చించిన విషయం విదితమే. ప్రధానంగా వేసవి సెలవుల్లో ఆసక్తి కలిగిన విద్యార్థి వికీపీడియన్లు తెవికీ గురించి మరింత నేర్చుకునేందుకు, అనుభవజ్ఞులైన వికీపీడియన్లు ఔత్సాహికులైన విద్యార్థి వికీపీడియన్లకు సహకరిస్తూ తెవికీలో వారికి, తెవికీ సముదాయం అవసరాలకు అనుగుణమైన కృషిచేసేందుకు ఉపకరించే భాగస్వామ్యంలా ఉండాలని భావిస్తున్నాము. ఈ నేపథ్యంలో సమావేశంలో కొందరు వికీపీడియన్లు శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. ఐతే ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని కృషిచేసేందుకు ఆంద్ర లొయోలా కళాశాల విద్యార్థి వికీపీడియన్లలో రాయ్ కుమార్ ముందుకువచ్చారు. ఆ విద్యార్థి వికీపీడియన్ కు వసతి, ప్రయాణ ఖర్చులను సీఐఎస్-ఎ2కె స్వీకరించి, నిర్వహణకు కృషిచేసేలా ప్రతిపాదన చేయడం జరిగింది. తెలుగు వికీపడియన్లు ఈ అంశంపై సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:27, 10 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఫిబ్రవరి నెలవారీ సమావేశంలో చర్చించిన అంశం ఇంత త్వరగా ఉపయోగంలోకి రావడం ఆనందదాయకం. విద్యార్ధులను వారి శెలవుల సమయంలో మంచి వికీపీడియన్లుగా తీర్చిదిద్దడాన్ని నేను మరియు ఇతర వికీపీడియన్లు స్వాగతించారు. నేను ఈ విద్యార్ధి రాయ్ కుమార్ ని నెలరోజుల కాలం వికీపీడియాకు అనుగుణంగా శిక్షణను అందించగలను. ఈ విషయంలో చొరవ తీసుకొంటున్న సీఐఎస్-ఎ2కె వారికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:32, 11 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె), Rajasekhar1961 గారు ఇది చాలా మంచి కార్యక్రమం. నేను కూడా ఈ కార్యక్రమంలో నా వంతు సహాయం అందిస్తాను...--Pranayraj1985 (చర్చ) 15:52, 12 ఏప్రిల్ 2016 (UTC)-[ప్రత్యుత్తరం]

విష్ణు ఎడ్యుకేషనల్ అకాడమీ ద్వారా వికీపీడియా శిక్షణ[మార్చు]

విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్
విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

కుముదవల్లి శ్రీవీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం నిర్మాణం గావించిన బి.వి.రాజు గారి యొక్క విష్ణు ఎడ్యుకేషనల్ అకాడమీ, భీమవరంను ఈ రోజు వీరేశలింగ గ్రంథాలయ అద్యక్షులు కృష్ణంరాజు గారి ద్వారా సందర్శించడం జరిగింది. అకాడమీలో ఉన్న నాలుగు కాలేజీలైన డిగ్రీ, ఇంజనీరింగ్, డెంటల్, పార్మసీలలో అవగాహనా కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు జూన్ 15 తరువాత అనుమతి ఇవ్వడం జరిగింది. ఆయా కాలేజీల ప్రాచార్యులు వారి కంప్యూటర్ లాబ్‌లు, ఆడిటోరియాలను నెట్‌తో సహా అందించుటకు సుముఖత వ్యక్తపరచారు. దీని ద్వారా మరింత మంది వికీ సభ్యులు తయారు కాగలరని నా ఆశ. ఇక డి.ఎన్ ఆర్ కళాశాల, ఎస్.ఆర్.కేర్. కళాశాల వారినీ సంప్రదించుచున్నాను. వివరాలు త్వరలో తెలియచేయగలను. దీనికై నాకు సహకరించిన వీరేశలింగ గ్రంథాలయ కార్యవర్గం వారికి వికీ ద్వారా నా కృతజ్నతలు తెలియచేస్తున్నాను.--Viswanadh (చర్చ) 14:53, 12 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ప్రయత్నం Viswanadh గారు... నేను కూడా ఈ కార్యక్రమంలో నా వంతు సహాయం అందిస్తాను...--Pranayraj1985 (చర్చ) 15:50, 12 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
తాంక్యూ ప్రణయ్. మీ సేవలను తప్పక వినియోగించుకుంటాను--Viswanadh (చర్చ) 17:37, 13 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter 2016 March[మార్చు]

Hello,
CIS-A2K has published their March 2016 newsletter. The edition includes details about these topics:

  1. CIS-A2K's work-plan for the year 2016-2017
  2. National-level Wikipedia Education Program review workshop conducted in Bangalore in mid-January;
  3. BHASHA-Indian Languages Digital Festival event and CIS-A2K's participation;
  4. A learning pattern describing the importance of storytelling over demonstration in a Wikipedia outreach;

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscibe this newsletter, click here. --MediaWiki message delivery (చర్చ) 12:58, 13 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Server switch 2016[మార్చు]

The Wikimedia Foundation will be testing its newest data center in Dallas. This will make sure Wikipedia and the other Wikimedia wikis can stay online even after a disaster. To make sure everything is working, the Wikimedia Technology department needs to conduct a planned test. This test will show whether they can reliably switch from one data center to the other. It requires many teams to prepare for the test and to be available to fix any unexpected problems.

They will switch all traffic to the new data center on Tuesday, 19 April.
On Thursday, 21 April, they will switch back to the primary data center.

Unfortunately, because of some limitations in MediaWiki, all editing must stop during those two switches. We apologize for this disruption, and we are working to minimize it in the future.

You will be able to read, but not edit, all wikis for a short period of time.

  • You will not be able to edit for approximately 15 to 30 minutes on Tuesday, 19 April and Thursday, 21 April, starting at 14:00 UTC (15:00 BST, 16:00 CEST, 10:00 EDT, 07:00 PDT).

If you try to edit or save during these times, you will see an error message. We hope that no edits will be lost during these minutes, but we can't guarantee it. If you see the error message, then please wait until everything is back to normal. Then you should be able to save your edit. But, we recommend that you make a copy of your changes first, just in case.

Other effects:

  • Background jobs will be slower and some may be dropped.

Red links might not be updated as quickly as normal. If you create an article that is already linked somewhere else, the link will stay red longer than usual. Some long-running scripts will have to be stopped.

  • There will be a code freeze for the week of 18 April.

No non-essential code deployments will take place.

This test was originally planned to take place on March 22. April 19th and 21st are the new dates. You can read the schedule at wikitech.wikimedia.org. They will post any changes on that schedule. There will be more notifications about this. Please share this information with your community. /User:Whatamidoing (WMF) (talk) 21:07, 17 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks for letting us know about this planned maintenance activity. We will make sure to publicize this in our community. Probably display a notice on the main page. --రవిచంద్ర (చర్చ) 05:18, 18 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఎ2కె ఇంటర్నెట్ సహాయం అందజేయడానికి ఏం నిబంధనలు ఉండాలి[మార్చు]

అందరికీ నమస్కారం,
సీఐఎస్-ఎ2కె నుంచి తెలుగు వికీపీడియాలో ఇంటర్నెట్ లేక ఇబ్బందులు పడుతూ తప్పనిసరి స్థితిలో ఇంటర్నెట్ సౌకర్యం తీసుకునేందుకు అభ్యర్థిస్తున్నవారికి సంబంధించిన నిబంధనలపై చర్చించవలసిందిగా సముదాయాన్ని అభ్యర్థిస్తున్నాము. ఈ చర్చ ఫలితంగా ఏర్పడే నిబంధనలు, సూత్రాల ఆధారంగా ఎవరికి ఇంటర్నెట్ సౌకర్యం సహాయాన్ని అందజేయవచ్చన్నది తేలికగా తెలిసేలా ఉండాలని సూచన. సభ్యులు ఈ కింది విషయాలను చర్చిస్తే ఉపకరిస్తుందని భావిస్తున్నాము:

  1. దీనికి దరఖాస్తు లేదా అభ్యర్థన చేసే విధానం ఎలావుండాలి
  2. ఎవరు అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలి
  3. ఏ అంశాల ప్రాతిపదికన తిరస్కరించవచ్చు (ఎక్స్ క్లూజన్ క్రైటీరియా - ఉదాహరణకు కనీసం చాన్నాళ్ళు వికీపీడియన్ కాకున్నా, ఇన్ని ఎడిట్లు లేకున్నా తిరస్కరించాలి, వంటివి)
  4. సహాయం కారణంగా ఎటువంటి ఫలితాలు ఆశించవచ్చు
  5. ఎంతకాలం పాటు సహాయాన్ని అందించవచ్చు
  6. సహాయాన్ని ఎలా పర్యవేక్షించాలి
  7. ఒక సమయంలో ఎందరికి ఇవ్వవచ్చు, సహాయం అందించే సమయం ముగిశాకా మరొకరికి ఎలా బదిలీ చేయొచ్చు

ఇవి కాక ఈ అంశానికి సంబంధించి మరేవైనా ఉన్నా చర్చించి నిర్ణయించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:34, 18 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తోచినవి
  1. నెలకు ఎంతో కొంత పరిమితి ఉండాలి.
  2. సహాయం తీసుకున్న వారు రోజూ వికీపీడియా కోసం ఇంత సమయం అని కేటాయిస్తే బాగుంటుంది. ఎన్ని దిద్దుబాట్లు అనేదే కాకుండా, ఎంత నాణ్యమైన సమాచారం చేర్చారనేది ముఖ్యం.
  3. కొన్ని నిర్వహణ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది. ఉదా ఈ వారం వ్యాసం సిద్ధం చేయడం, మీకు తెలుసా వాక్యాలు తయారు చేయడం లాంటివి.--రవిచంద్ర (చర్చ) 08:58, 18 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తెలిసి వికి ఒక స్వచ్చంద స్వేచ్చా తోర్పాటును ప్రోత్సహిస్తుంది, ఈ రోజుల్లో తక్కువ ధరకు ఇంటర్నెట్ అందుబాటు లోనే ఉన్నది, అది వికీపీడియా కాక మరెన్నో వ్యక్తిగత అవసరాలకు వాడు తున్నారు , కానీ ఇలా ఇలా కొంత మందికి ఇంటర్నెట్ ఇచ్చి మళ్ళా వారికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించటం వికీ స్పూర్తికి విరుద్దం. ఇప్పటి దాకా వికీలో కృషి చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇచ్చి ఉన్నాం కాని ఆయా పునస్కార విజేతలు అధిక శాతం మళ్ళా తిరిగి క్రియాశీలంగా పని చేసిన దాఖాలు మన తెలుగు వికీ పీడయా లో తక్కువ. కాబాట్టి కొత్తాగా వికీలో రాయాలి అనుకొనే వారికి ఇలాంటి తాయిలాలు కాకుండా ఒక నిస్వార్ధము గా వికీ మూల విలువలకు అనుగుణం గా వారి సేవలు ఒక స్వయం సేవకుడిగా అందిస్తే బాగుంటుంది , లేదా ఆ వ్యక్తి ఎంతో విలువైన సేవలు ఒక చిన్న మొత్తపు సహాయము ద్వారా వాటి విలువ కోల్పోతాయి . --కశ్యప్ (చర్చ) 04:57, 20 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]


నాకెందుకో ఇది సరైన పద్ధతిగా అనిపించడంలేదు. ఇప్పటికే విలువైన పనిచేస్తున్నవారికి, కొంత సహాయం చేయాలంటే ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించవచ్చును. కొత్తవారికి ఇలాంటి ప్రోత్సాహకాలు వికీ నియమాలకు భంగాన్ని కలిగిస్తాయి.--Rajasekhar1961 (చర్చ) 05:42, 20 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ కొత్తవారికి అని ప్రత్యేకించి ఉద్దేశించట్లేదండీ. ఉదాహరణకే ఇన్ని నెలలు అని ఇచ్చాను. మీ సూచనల మేరకు దాన్నీ తీసేస్తున్నాను. సముదాయం మంచీ చెడుల గురించి పరిశీలించి ఎలాగైనా నిర్ణయించుకోవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:06, 20 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నా వ్వక్తి గత అభిప్రాయం ప్రకారము ........ ఇన్ టర్నెట్ సౌకర్యము కల్పించడము (ఒక ఏడాదికి) అతి తక్కువ ఖర్చు. దాన్నివ్వడానికి అనేక నిబందనలు విధించడము ఏమీ బాగోలేదు.

కాక ఫోతే ......... దాన్ని తీసుకొన దలచిన వారు తగిన న్యాయము చేయాలి. అనగా ఎక్కువ సమయము (పూర్తి స్థాయిలో) వికీలో పని చేయ గలగాలి. అలా కాకుండా అప్పుడప్పుడు వ్రాసేవారికి ఇస్తే ...... అది బూడిదలో పోసిన పన్నీరు కాగలదు. ఎవరికి ఉపయోగ కరము కాకుండా వృధా కాగలదు. దీన్ని దృష్టిలో వుంచుకుంటే మంచిదేమో? ఆలోచించగలరు. భాస్కరనాయుడు (చర్చ) 17:26, 23 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఏప్రిల్ నెలవారీ సమావేశ నిర్వహణ[మార్చు]

ఏప్రిల్ నెలవారీ సమావేశానికి ఆఖరి ఆదివారం నిర్వహించడం వీలవుతుందని భావించాను. ఐతే ఆఖరి ఆదివారం సాయంత్రం గోల్డెన్ థ్రెషోల్డ్ లో పుస్తకావిష్కరణ సభ చేస్తున్నారు. ఆదివారం ఉదయం నిర్వహించేందుకు వేదికపరంగా ఏ సమస్యా లేకున్నా మధ్యాహ్నం ఎండవేళ తిరిగి వెళ్ళాల్సివస్తే వచ్చినవారు ఇబ్బందులు పాలవుతారని ఆలోచిస్తున్నాను. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆఖరి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఈసారికి చేయాలని ప్రతిపాదిస్తున్నాను. దీనిపై సభ్యులు ప్రతిస్పందించగలరు. --Pranayraj1985 (చర్చ) 08:54, 19 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

శనివారం సాయంత్రం 6-8 అయితే సరిపోతుంది. ఎండ తగ్గిపోతుంది, కాబట్టి ఫరవాలేదు. చర్చించాల్సిన అంశాల్ని కూడా తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 10:51, 19 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
4 గంటలకు అయితే బాగుంటుంది. లేటయితే దూరం నుంచి వచ్చే వారికి ఇబ్బంది--Nrgullapalli (చర్చ) 07:11, 20 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Wikipedia to the Moon[మార్చు]

Hello! Sorry that this is in English only, but we are using village pump messaging in order to reach as many language communities as possible. Wrong page? Please fix it here.

This is an invitation to all Wikipedians: Wikimedia Deutschland has been given data space to include Wikipedia content in an upcoming mission to the Moon. (No joke!) We have launched a community discussion about how to do that, because we feel that this is for the global community of editors. Please, join the discussion on Meta-Wiki (and translate this invitation to your language community)! Best, Moon team at Wikimedia Deutschland 15:35, 21 ఏప్రిల్ 2016 (UTC)

Moon team at Wikimedia Deutschland, Support; This would allow each language version of Wikipedia to showcase its best articles, representing the Wikimedia movement for what it is: a global effort to sum up human knowledge. JVRKPRASAD (చర్చ) 16:23, 21 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ ఏప్రిల్ 23, 2016 సమావేశం[మార్చు]

అందరికి నమస్కారం...వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ ఏప్రిల్ 23, 2016 సమావేశం… ఏప్రిల్ 23, 2016 (నాల్గవ శనివారం) నాడు మధ్యాహ్నం 4 గంటలకు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏర్పాటు చేయబడుతుంది.

చర్చించాల్సిన అంశాలు[మార్చు]

  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • 12వ వార్షికోత్సవ నిర్వాహణ
  • ఎన్టీఆర్ ట్రస్టుతో భాగస్వామ్యం
  • తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియాతో కలసి పనిచేసే ప్రతిపాదనలు
  • భవిష్యత్ ప్రణాళిక
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు

సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ ఏప్రిల్ 23, 2016 సమావేశం లో చూడగలరు.--Pranayraj1985 (చర్చ) 05:57, 22 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పాలసీ చర్చల గురించి[మార్చు]

నమస్తే,
భారతీయ వికీపీడియాల పాలసీలు, గైడ్లైన్లు అభివృద్ధి చెందడంపైన మేము పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై మీలో కొందరితో మాట్లాడాము. గతంలో ఒకటి రెండు పాలసీ సంబంధిత చర్చలను రచ్చబండలో ప్రారంభించే ప్రయత్నం చేశాం.

దీనిపై మాకు రెండు సూచనలు వచ్చాయి:

  1. ఎడిటథాన్లాగా ఉండే 7 లేక 10 రోజుల పాటు సాగే పాలసీ సృష్టి, విస్తరణ కార్యక్రమం నిర్వహించడం.
  2. పాలసీ చర్చలకు సంబంధించిన మీటప్ లు: ఈ సూచన అయితే అందింది కానీ తెలుగు వికీపీడియాకు ప్రత్యేకించిన అటువంటి మీటప్ ఆంధ్రప్రదేశ్/తెలంగాణా ప్రాంతంలో ఇంతవరకూ జరగలేదు.

దయచేసి దీనిపై వ్యాఖ్యానించడం కానీ సలహాలు, సూచనలు అందించడం కానీ చేయగలరు.
ధన్యవాదాలతో,
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:20, 22 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
(గమనిక:పాలసీలను సీఐఎస్-ఎ2కె ప్రభావితం చేయదు, కేవలం సంబంధిత చర్చల ఆరంభానికే కృషిచేయదలుచుకుంది. పాలసీల విషయంలో సముదాయమే చర్చించి, నిర్ణయం తీసుకుంటుంది.)

తెవికీలో ప్రస్తుతం వాటి అవసరం చాలా చాలా ఉంది. ఇప్పటివరకూ తగిన వ్యాసాలు, తగినంత మంది ఏక్టివ్ వికీపీడియన్లు లేకపోవుట వంటి కొన్ని కారణాల వలన సరియైన నిర్ణయాలు పాలసీలపై తీసుకోలేకపోతున్నాం. కాని ఇప్పటి కొందరు సభ్యుల అసహన వాఖ్యలు, అసంబద్ద మార్పుల వలన తెవికీ స్వరూపం మొత్తం మారిపోతున్నది. మిగతా సభ్యులు కూడా దూరం జరుగుతున్నారు. కనుక తెవికీలో పాలసీలపై పూర్తిగా మనకు ఎలా అవసరమో అలా రూపకల్పన చేయాలి. ప్రతి ఒక్క పాలసీ తెలుగులో అనువదించబడాలి. వాటిపై చర్చలు జరగాలి. తరువాత వాటిని సమగ్రంగా సభ్యులకు అన్ని రూపాలలో(పుస్తక, డిజిటల్) అందుబాటులో ఉండేలా చేయాలి. ఇప్పటికి తెవికీ వ్యాస, మార్పులను కొత్త సభ్యులకు వదిలేసి, పాత సభ్యులు అందరూ ముందు వీటిపై పనిచేసేలా చెయ్యాలి. దీనికి ఆన్లైన్ ఆఫ్లైన్ కార్యక్రమాలు నిర్వహించినా నాకు అభ్యంతరంలేదు..కాని అన్ని పాలసీలకు తుదిరూపం తీసుకురావలసిన అవసరం ఉంది. --Viswanadh (చర్చ) 08:49, 22 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగువారు ప్రత్యేకంగా వారికోసం పాలసీలపై ప్రత్యేక నిర్ణయాలు తీసుకొని వ్రాసుకోవల్సిన అవసరము ఉంది. తెలుగు మనుషులు ఆలోచనలు, అభిప్రాయములు మరో భాష వారు వ్రాసిన వాటిన పాలసీలతో చాలా వరకు సరిపడవు. ప్రతిరోజూ వచ్చే సభ్యులు చాలా తక్కువగా ఇక్కడ ఉన్నారు. దీని వలన నిర్ణయాలు చేయాలంటే త్వరగా అమలు కావు. మనకు ఉన్న అధికారులు కూడా పాలసీలపై పెద్దగా చర్చలు లెవనెత్తడం ప్రస్తుతం పెద్దగా జరుగుట లేదు. ప్రస్తుత పరిస్థితులలో పాలసీలలో తెలుగు వారికోసం చాలా మార్పులు తీసుకు రావల్సిన అవసరం చాలా అత్యంత అవసరము అయి ఉన్నది. నేను కావల్సిన పాలసీలపై సలహాలు సూచనలు తప్పకుండా ఇస్తాను. JVRKPRASAD (చర్చ) 13:07, 22 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ రైల్వేలు - వ్యాసాలు - వాడుకరులు అసహనం[మార్చు]

భారతీయ రైల్వేలు - వ్యాసాలు - వాడుకరులు అసహనం అనే ఆంశం మీద మీ మీ అభిప్రాయములు వ్రాయండి. ఈ వ్యాసాల మీద చాలా మంది తీవ్ర అసహనంతో ఉన్నారని అంటున్నారు. ఆ అసహనం ఎందుకో ఏమిటో ఎవరికో ఇత్యాది వివరాలు తెలియకపోతే జీవితకాలం అలాగే ఉండిపోతాయి. సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు కదా ! ఒకనాడు రంగులు వ్యాసాలలో వాడకూడదు అన్న విషయము మాత్రము నేను కొన్ని వేల వ్యాసాలలో ఉంచిన తరువాత ఏనాటికో చెప్పారు. మరి వ్యాసాలలో రంగులు ఉండకూడదు అంటే అన్ని వేల వ్యాసాలలోని రంగులు అన్నీ వెంటనే తీసివేశాను. అలాగే పెద్ద బొమ్మలు ఉండటము అంతగా బావుండలేదు అన్నారు, మొత్తం బొమ్మలు నిడివి తగ్గించాను. ఇలా సందర్భాన్ని బట్టి మర్పులు చేర్పులు జరుగుతున్నాయి, చర్చలు కూడా జరిగి మరియు జరుగుతున్నాయి. అందరూ నన్నే తప్పు అంటున్నారు. అందుకే, నేను ఇప్పుడు చర్చలు చేయను. ఎవరైనా నా అభిప్రాయము వ్రాయమంటే వ్రాస్తాను. మీకుగా మీ అందరూ వ్యాసాల మీద ఒకరి అభిప్రాయములతో ఒకరు చర్చించుకోండి. సందర్భ అవసరాన్ని బట్టి ఏదైన సలహ, సూచన, సమాచారం, అభిప్రాయం, ప్రశ్నలు, ఇలాంటివి ఏమైనా మాత్రం నేను అందిస్తాను. మీరు చర్చలు చేయండి, నేను మీ చర్చలు అనుసరిస్తాను. మీ మీ అభిప్రాయాల అవసరానికి తగ్గట్లుగా వ్యాసాలలో మార్పులు, చేర్పులు అనుగుణంగా చేస్తూ ఉంటాను. అప్పుడు ఎవరికీ ఈ వ్యాసాల గురించి చర్చల వలన మానసిక సమస్యలు ఉండవు. దయచేసి మీ అభిప్రాయములు వెంటనే వ్రాయండి, చర్చించండి. JVRKPRASAD (చర్చ) 13:38, 24 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారికి నమస్కారం. మీకు రైల్వేల మీద ఉన్న అనుభవం వలన ఈ వ్యాసాలను ఒక ప్రాజెక్టుగా అనుకొని రాస్తుండవచ్చు. అయితే వీటి పై తగినంతమంది స్పందిచకపోవుటచేత ..దానికై నేను ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాను.

భారతీయ రైల్వేలలో ప్రతి రైలుకు ఒకవ్యాసం ఉండవచ్చా లేదా అనేదానిపై సభ్యులు తెలిపిన అభిప్రాయాలపై తదుపరి ప్రసాద్ గారు తమ వ్యాసరూపాల తీరు తెన్నులను మార్చుకొంటారు. తెవికీ మెరుగునకై ప్రతివారూ తమ అభిప్రాయాలను,అందిచి ప్రసాద్ గారి ప్రాజెక్టును అందంగా మల్చేందుకుకృషి చేస్తారని నా మనవి...--Viswanadh (చర్చ) 13:07, 27 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Viswanadh గారు, మీ చర్చలు ఓ కొలిక్కి వచ్చేవరకు నేను ప్రస్తుతం రైల్వే వ్యాసాలు వ్రాయడం విరమించుకుంటున్నాను. అందరి అభిప్రాయాలు నేను మొదలు పెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు ఏకాభిప్రాయంతో ఉన్నారేమో అని భ్రమపడ్డాను. కాని ఎవరూ ఏ అభిప్రాయముతో ఇద్దమిద్దముగా స్థిరముగా లేరని ఇప్పుడే తెలుస్తోంది. నేను అందుకే జాబితాలు వ్రాసాను, వ్యాసలలో పెట్టాను, మూసలు జాబితాలకు కట్టాను, ఇలా ఎన్నో విధములుగా ఇతరులకొరకు విన్యాసములు చేయవలసి వచ్చింది. ఎవరైనా స్పందిస్తారేమో అనుకున్నాను. ఈ నాటి వరకు నాతో అనవసర చర్చలు చేశారే కాని, సరి అయిన నిర్ణయాలతో నాకు సలహాలు, సూచనలు వచ్చినవి చాలా తక్కువ. అందుకని నేను ఇంక నుండి కొంతకాలము రైల్వే వ్యాసములు వ్రాయను. ఇంకనుండి ఎవరికిష్టమయిన రీతిలో వారు వ్యాసములు తొలగించి, కొత్త పంథాలో కూడా వ్రాసుకోవచ్చును. సరి అయిన సూచనలు, సలహాలు ఇతరులు ఇవ్వక అనవసర చర్చల వలన నాకు కొంత ఆసక్తి, ఉత్సాహం తగ్గిన మాట వాస్తవం. మళ్ళీ మీ అభిప్రాయాలకు అనుగుణంగా చర్చలు పూర్తి అయ్యాక వ్రాయాలనిపిస్తే వ్రాస్తాను. ఈలోపున తొలగించుకోవాలనుకున్న వ్యాసములు తొలగించ వచ్చును. మీ అందరికీ ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 17:37, 27 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

"ప్రతి రైలుకు ఒకవ్యాసం అవసరమా?" పై మీ అభిప్రాయం లేదా సంతకం[మార్చు]

  1. ప్రతి రైలుకు ఒక వ్యాసం ఉండవచ్చును (కొన్ని వికీ నియమాలను అనుసరించి) అనేది నా అభిప్రాయం. ఎంతోమంది ప్రజలను వారి గమ్యస్థానానికి చేరుస్తున్న రైలు బండ్ల గురించి వ్రాయాల్సినది చాలా ఉంటుంది. రైలు నంబరు, రకం, పేరు, ఆగే స్టేషన్లు సమయాలు వాటి వివరాలు, సంబంధించిన లింకులు అన్నీ చేర్చవచ్చును. అలాగే ఆ రైలులోని భోగీలు, నడిపిస్తున్న ఇంజను, సిబ్బంది కూడా చేర్చవచ్చును. ఎక్స్ ప్రెస్ రైలు కన్నా పాసింజర్ రైలు ఎక్కువ స్టేషన్లలో ఆగుతుంది; కాబట్టి ఆయా స్టేషన్లకు లింకు చేర్చవచ్చును (ఊర్లకు కాదు). ఇందులో కొన్ని సమాచారపెట్టెలో చేర్చితే సరిపోతుంది; ఒక్కొక్క వివరానికి ముఖ్యపేజీలో ఒక విభాగము అవసరం లేదు. చరిత్ర అవసరం. కానీ అస్సలు నచ్చని విషయాలు కొన్ని: 1. విశాఖపట్నం నుండి హైదరాబాదుకు నడుస్తున్న రైలు మరియు హైదరాబాదు నుండి విశాఖపట్నంకు నడుస్తున్న రైలు అనేదానికి ఒక వ్యాసం సరిపోతుంది. రెండు వ్యాసాలు అవసరం లేదు. 2. అలాగే రైలు బొమ్మలు thumbnail సరిపోతుంది. 3. ప్రతి స్టేషన్లో ఆగే సమయాల పట్టిక కాకుండా స్టేషన్ల పేర్లు జాబితా రూపంలో సరిపోతుంది (లింకులతో), సమయం మారే అవకాశం ఉంటుంది. కానీ స్టేషన్లు సాధారణంగా మారవు. 4. రైళ్ల పేర్లు చాలా తికమకగా ఉన్నాయి కాబట్టి ముందుగా నామకరణం చేయబడిన రైళ్లను అభివృద్ధి చేసి అనామిక బండ్లను గురించి తర్వాత తయారుచేయవచ్చును. ఉదా: హైదరాబాద్ - విశాఖపట్నం రైలు కన్నా గోదావరి ఎక్స్ ప్రెస్ అని ఉంటే బాగుంటుంది. 5. ప్రతి వ్యాసంలో ఆయా స్టేషన్ల మధ్య నడిచే అన్ని రైళ్ల జాబితా అవసరం లేదు; ఆ జాబితా లింకును ప్రతి రైలుబండి వ్యాసంలో ఇవ్వవచ్చును. అందరికీ నచ్చే విధంగా ఒక రైలుబండి వ్యాసాన్ని నమూనా వ్యాసంగా ఎవరైనా తయారుచేసి చూపిస్తే అది ప్రసాద్ గారికే కాకుండా నాలాంటి వారందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.--Rajasekhar1961 (చర్చ) 13:48, 27 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ప్రతి రైలుకు ఒక వ్యాసం ఉండాలి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:51, 28 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ప్రతి రైలుకు ఒక వ్యాసం అవసరం లేదని నా అభిప్రాయం. ఇక్కడ నోటబిలిటీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యాసాలు రాస్తే అవి ఉపయోగకరమైనవిగా ఉంటాయి. ప్రతి రైలుకూ పేరు, నంబరు, రకం, ప్రారంభ స్థానం, గమ్యస్థానం, ఆగే ఊళ్ళు, సమయాలు లాంటి తప్పనిసరి సమాచారం ఉంటాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రత్యేకతలుంటేనే వాటి గురించి వ్యాసం రాస్తే బాగుంటుంది. --రవిచంద్ర (చర్చ) 13:15, 27 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ప్రతి రైలు బండికి ఒక వ్యాసం అవసరం లేదని నా అభిప్రాయం. ప్రత్యేకతలు ఉన్న బండ్లు - డార్జిలింగ్ వెళ్లే బండి, అరకు లోయలోకి వెళ్లే బండి, ధనుష్కోడి దగ్గర సముద్రం మీద వంతెన మీద వెళ్లే బండి, మథిరాల్-నిరాల్ కొండ మీద వెళ్లే బండి, పేలస్ ఆన్ వీల్స్, వగైరాల గురించి కాని, రాజధాని, శతాబ్ది వంటి బండ్ల గురించి కాని, అతి వేగంగా నడిచే ఢిల్లీ-ఆగ్రా బండి గురించి కాని, రాబోయే ముంబయ్-అహ్మదాబాద్ బుల్లెట్ బండి కాని, వగైరా - రాస్తే పరవాలేదు. అదే విధంగా ఆవిరి యంత్రాలు, డీసెలు, విద్యుత్ ఇంజనులు ఎప్పుడెప్పుడు వాడతారో, సిగ్నలింగ్ విధానాలు, ప్రమాదాలు జరగకుండా ఏయే జాగ్రత్తలు తీసుకుంటారు, వగైరా విషయాల మీద రాస్తే బోధనాత్మకంగానూ, పరిచయాత్మకంగానూ ఉంటాయని నా అభిప్రాయం. ప్రతీ విమానం ఎక్కెడెక్కడ ఆగుతూ, ఏయే ఊళ్లు వెళుతుందో రాసేకంటె విమాన మార్గాల గురించి, విమానాలని నియంత్రించే విధివిధానాలు, వగైరాలు ఉపదేశాత్మకంగా ఉంటాయని అనుకుంటున్నాను. ఆలోచించండి. Vemurione (చర్చ) 16:33, 28 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5. విజ్ఞాన సర్వస్వం అంటే ఏమిటో తెలియటానికి వికీపీడియా:ఏది వికీపీడియా కాదు అనే వ్యాసం పరిశీలించాలి. దానినిబట్టి వికీపీడియాలో వ్యాసాలకు పరిధి వుందని తెలుస్తుంది. మన తెలుగు వికీపీడియాలో ఇంతకుముందే ప్రతిపుస్తకానికి ఒక పేజీ, ప్రతి పుస్తకరచయితకు ఒక పేజీలాంటి ప్రయత్నాలు జరిగాయి. వాటిని వ్యతిరేకించడం ఆ తరువాత వాటిని నిలిపివేయడం లేక తొలగించండం జరిగింది. ప్రతిరైలుకి ఒక వ్యాసం అదే కోవలోకి చెందినదని నా అభిప్రాయం. ప్రాముఖ్యతని బట్టి వ్యాసాలుండాలి. కొన్ని రైళ్లకి వ్యక్తి లేక నది లేక ఇతర పేర్లు పెట్టినప్పుడు అవి కొంత వరకు ప్రాముఖ్యత కలిగినవిగా భావించవచ్చు. కాని కేవలం అదే ప్రాతిపదికనకూడా వ్యాసం తప్పక వుండాలనే నియమం ఏమి లేదు. కనీసం రెండు లేక మూడు కోణాలనుండి ప్రాముఖ్యత వున్నప్పుడే ప్రత్యేక వ్యాసం చేయటం బాగుంటుంది. అంతవరకు ఆ రైలుని ఇతర జాబితా వ్యాసంలో ఒక విభాగంగా చేరిస్తే సరిపోతుంది. ప్రజలకు సమాచారం అందించటానికి పలురకాల అధికారిక, అనధికారిక, వ్యాపార వెబ్సైట్లు వున్నాయి. ఇప్పటికే రైల్వే వెబ్సైటు హిందీలో అందుబాటులో వుంది, త్వరలో ఇతర భారతీయ భాషలలో అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలున్నాయి. అందువలన తెలుగువికీలో పనిచేసే కొద్దిమంది సభ్యులు ఎవరికి వారు పెద్ద ప్రాజెక్టులు చేపట్టే బదులు, ప్రాధాన్యతలు నిర్ణయించుకొని కలిసికట్టుగా కొంతవరకు పనిచేస్తే మన పని విలువ మరింత పెరుగుతుంది. --అర్జున (చర్చ) 00:05, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6. ప్రతి రైలుకూ వ్యాసం అవసరం లేదు. ప్రాముఖ్యత కలిగిన రైళ్ళకు మాత్రమే వ్యాసాలుండాలి. భారతదేశంలోని ప్రతి పాసింజరు రైలుకూ వ్యాసం అవసరం లేదని నా అభిప్రాయం.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:32, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  7. 1)తెవికీలో ఏదేని విషయానికి సంబంధించిన వ్యాసాలు అధికసంఖ్యలో ఉండాలంటే ముఖ్యంగా రెండు విషయాలు గుర్తించుకోవాలి. తెవికీ ప్రస్తుత స్థాయి మరియు తెలుగు వారి దృష్టికోణం. ఈ రెండింటిలో కనీసం ఒక్క విషయానికి కూడా సంతృప్తిపర్చని వ్యాసాలు ఉండరాదనేది తెవికీలో వస్తున్న సంప్రదాయమే. ఇదే విషయాన్ని నేను గతంలో పలుసార్లు ప్రస్తావించాను. తెవికీ ప్రస్తుత స్థాయి దృష్ట్యా చూస్తే ఇదింకనూ మొదటిదశను అధికమించలేదు. కాబట్టి ఈ దశలోనే అంతగా ఉపయోగకరం కాని వేలాది వ్యాసాలు ఉంచాల్సిన అవసరం లేదు. తెలుగువారి దృష్టికోణం దృష్ట్యా చూస్తే దేశంలోని ప్రతి రైలుబండికి ఒక వ్యాసం ఉంచాల్సిన అవసరం లేదు. తెలుగువారికి ఏదో రాష్ట్రంలో ఉన్న ఒక ప్యాసింజర్ రైలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం, ఆసక్తి ఉండకపోవచ్చు. అత్యధిక పాఠకులకు అత్యధిక ప్రయోజనం కల్పించే దశ నుంచి అధికమించనంతవరకు ఇలాంటి వ్యాసాలు అవసరం లేదు.
    2)గ్రామవ్యాసాలను, తెలుగు సినిమా వ్యాసాలను ఈ వ్యాసాలతో పోల్చే అవసరం లేదు. గ్రామవ్యాసాలనేవి కేవలం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవి మాత్రమే ఉన్నాయి, కాని దేశంలోని ప్రతి గ్రామానికి తెవికీలో వ్యాసం లేదు. అలాగే సినిమా వ్యాసాలు కూడా తెలుగు సినిమాలకు సంబంధించిన వ్యాసాలే అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆంగ్లవికీలోనో, ఆయా భాషల వికీలో ఉన్నట్లుగా మనం తెలుగేతర రాష్ట్రాల గ్రామవ్యాసాలను చేర్చే అవసరం లేనట్లుగానే ఇతర రాష్ట్రాలలో తిరిగే రైలుబండ్ల వ్యాసాలు (ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రధాన పట్టణాల వ్యాసం మాదిరిగా పేరుపొందిన రైలుబండ్ల వ్యాసాలు మినహా) ప్రస్తుత తెవికీ స్థాయికి సరిపోదు.
    3)వ్యాసాలలో మూసలు పెట్టాలంటే మూసపేరులో కాని మూసలో ఉన్న లింకులకు సంబంధించిన వ్యాసాలలో మాత్రమే పెట్టడం సంప్రదాయం. కాని ప్రతి రైలుబండి వ్యాసంలో సంబంధం లేని ఐదేసి మూసలు పెట్టే అవసరం లేదు. రైలుబండి ఏ భాగంలో ప్రయాణిస్తున్ననూ అన్ని భాగాలకు చెందిన మూసలు (ఉత్తర భారతదేశం రైలు మార్గములు, మధ్య భారతదేశం రైలు మార్గములు, దక్షిణ భారతదేశం రైలు మార్గములు, తూర్పు మరియు ఈశాన్యం భారతదేశం రైలు మార్గములు, పశ్చిమ భారతదేశం రైలు మార్గములు) పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు.
    4)ప్రతి రైలుబండి వ్యాసంలో నాలుగేసి బొమ్మలున్నాయి. కాని ఆ బొమ్మలకు ఆ వ్యాసానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. ఒకవేళ రైలుబండికి చెందిన వ్యాసంలో బొమ్మ పెట్టాలన్ననూ ఆ రైలుకు చెందిన బొమ్మగాని, ఆ రైలు ప్రయాణిస్తున్నమార్గపు బొమ్మగాని పెడితే సరిపోతుంది.
    5)ఒక వ్యాసంలో ఒక విభాగం ఏర్పరుస్తున్నామంటే కనీసం ఒక పేరా సమాచారమైనా ఉండాలి. కాని కేవలం రైలుబండి సంఖ్య కొరకో, ఫ్రీక్వెన్సీ కొరకో ప్రత్యేక విభాగం అవసరం లేదు. ఇవన్నీ ఉండాల్సిన వ్యాసంలో (ప్రధాన రైలుబండ్ల వ్యాసాలలో) వ్రాయాలన్ననూ ఉపోద్ఘాతంలో ఉంచితే సరిపోతుంది.
    6)మనం పనిచేస్తున్న వ్యాసాలలో ఇతర సభ్యుల నుంచి దిద్దుబాట్ల ఘర్షణను అధికమించడానికి లేదా చిన్న వ్యాసం ఇంకనూ అభివృద్ధి దిశలో ఉందనీ, ఇప్పుడే తొలిగించరాదని తెలుపడానికి {{In Use}} మూసను ఉపయోగించవచ్చు. కాని ఒక సభ్యుడు నాలుగైదు వ్యాసాలకు మించి ఇలాంటి మూసను ఉంచుకోరాదు. అదికూడా పరిమిత కాలానికి సంబంధించి మాత్రమే. కాని నేను ఇది వ్రాసే సమయానికి 3000కుపైగా వ్యాసాలలో ఈ మూసను ఉంచినట్లుగా, కొన్ని మాసాలు గడిచిననూ మూసలను తొలగించడం కాని వ్యాసాలలో మార్పులు చేయడం కాని జరుగనట్లుగా గమనించాను. ఇలా చేయడం మూసను దుర్వినియోగపర్చినట్లుగా భావించవల్సి వస్తుంది.
    7)రైలుబండ్ల వ్యాసాలలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పర్చి ఫలానా ప్రాంతం నుంచి ప్రారంభమైయ్యే రైలుబండ్ల లింకులు ఇవ్వడం జరిగింది. దీనికై ప్రత్యేక విభాగం అవసరం లేదు. ఒకవేళ ఇవ్వాలన్ననూ ఆయా ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే రైలుబండ్ల పట్టికలకు సంబంధించిన ఒక లింకును "ఇవికూడా చూడండి" విభాగంలో చేరిస్తే సరిపోతుంది. (ఇప్పుడిప్పుడే ఇలాంటివి తొలిగిస్తున్నారు)
    8)రైలుబండ్ల వ్యాసాలలో సమాచారం అధికంగా ఉన్నట్టుగా కనిపిస్తున్ననూ అందులోంచి అనవసర మూసలు, అనవసర విభాగాలు, అనవసర బొమ్మలు తదితరాలు తొలగిస్తే మిగిలేది కేవలం ఐదేఐదు విషయాలు. రైలుబండి పేరు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది, రైలుబండి సంఖ్య, ఫ్రీక్వెన్సీ, ఏ జోన్‌కు చెందినది అనేవి మాత్రమే. కేవలం ఈ ఐదు విషయాలను తెలుపడానికి ఇన్ని వేల వ్యాసాలు అక్కరలేదు. ఈ ఐదు విషయాలను తెలిపే పట్టిక వ్రాస్తే సరిపోతుంది. రైలుబండ్ల గురించి తెలుగులో తెలుసుకొనే వారెవరైనా ఉన్ననూ ఇలాంటి పట్టిక వారికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. పట్టిక అనేది జోన్ల వారీగా, స్టార్టింగ్ పాయింట్‌ల వారీగా చేసి సార్టింగ్ టేబుల్ ఉపయోగిస్తే మహాభేషుగ్గా ఉంటుంది. (ఇప్పుడే మొదలు పెట్టకండి, రైలుబండ్ల వ్యాసాల తొలగింపు తర్వాతే ఈ పనిచేయండి) సి. చంద్ర కాంత రావు- చర్చ 19:57, 5 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  8. ప్రతి రైలుకు ఒక వ్యాసం అవసరం లేదని నా అభిప్రాయం.Palagiri (చర్చ) 03:03, 6 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం[మార్చు]

ప్రతి రైలుకు ఒక వ్యాసం అవసరం ఉందా లేదా అనే దానిపై చర్చలలో పాల్గొన్న సభ్యులకు కృతజ్నతలు. పైన తెల్పిన వాటిలో అవసరం లేదుకు ఎక్కువ మంది సభ్యులు మొగ్గారు. ముఖ్యంగా చంద్ర కాంత రావుగారు మరియు ఇతర సభ్యులు వ్యక్తీకరించిన కొన్ని అభిప్రాయాలతో కలిపి తొలగించేవి కాక మిగతా వ్యాసాలు ఇలా ఉండాలి.

  • ప్రతి వ్యాసంలో ఆయా స్టేషన్ల మధ్య నడిచే అన్ని రైళ్ల జాబితా అవసరం లేదు; ఆ జాబితా లింకును ప్రతి రైలుబండి వ్యాసంలో ఇవ్వవచ్చును.
  • కేవల్ం తెలుగు రాష్ట్రాలలో తిరిగే ముఖ్యమైన, ప్రాముఖ్యత, ప్రత్యేకతలు కలిగిన రైళ్ళ గురించి మాత్రమే వ్యాసాలు ఉండాలి.
  • ప్రతి రైలుకూ పేరు, నంబరు, రకం, ప్రారంభ స్థానం, గమ్యస్థానం, ఆగే ఊళ్ళు, సమయాలు లాంటి తప్పనిసరి సమాచారం ఉంటాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రత్యేకతలుంటేనే వ్యాసం ఉండాలి
  • సమాచారం కొరకు అధికారిక, అనధికారిక, వ్యాపార వెబ్సైట్లు వున్నాయి, రైల్వే వెబ్సైటు హిందీలో వుంది, ఇతర భాషలలో అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలున్నాయి. కనుక ఇది ఒక ప్రాజెక్టుగా అవసరం లేదు
  • ప్రతి రైలుబండి వ్యాసంలో నాలుగేసి బొమ్మలున్నాయి. కాని ఆ బొమ్మలకు ఆ వ్యాసానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. రైలుబండికి చెందిన వ్యాసంలో బొమ్మ పెట్టాలన్ననూ ఆ రైలుకు చెందిన బొమ్మగాని, ఆ రైలు ప్రయాణిస్తున్నమార్గపు బొమ్మగాని పెడితే సరిపోతుంది.
  • 3000కుపైగా వ్యాసాలలో మొలక, తొలగింపు మూసను ఉంచారు, కొన్ని మాసాలు గడిచిననూ మూసలను తొలగించడం కాని వ్యాసాలలో మార్పులు చేయడం కాని జరుగలేదు. ఇలా చేయడం మూసను దుర్వినియోగపర్చినట్లుగా భావించవల్సి వస్తుంది.

పైన తెలిపిన అంశాల ఆధారంగా ఇప్పటికి ఉన్న వ్యాసాలలో ఏవి అనర్షమైనవి అనేది సభ్యులు పరిశీలించి వాటికి తొలగించ మనవి......--Viswanadh (చర్చ) 04:15, 6 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నా అభిప్రాయం[మార్చు]

తోటి సభ్యవాడుకరులు వారి వారి అభిప్రాయములు తెలియపరచినందులకు ముందస్తుగా ధన్యవాదములు. విషయము ఒక కొలిక్కి వచ్చింది కనుక పైన సూచనలు సూచించినట్లుగా వీలుయినంత త్వరలో వ్యాసములు తొలగిస్తాను. ఈ విషయము నాకు ఇన్ని నెలలు నా ముఖ్య కాలము వృథా అయ్యేంత వరకు కాకుండా ముందస్తుగా తెలియజేస్తే బావుండేది. ఈ వ్యాసములు వీద ఎన్నో చర్చలు కొన్ని నెలలుగా జరుగుతునే ఉన్నాయి. ఎవరికి తోచినది వారు చెప్పారు, అందుకు అనుగుణంగానే పని చేస్తునే ఉన్నాను. ఇందులో చంద్రకాంతరావుగారు వ్యక్తం చేసిన ప్రతి సూచన, సలహా, ఇంకా ఏమైనా సరే వాటికి పనిలో ఎటువంటి లోపం వారు అనుకున్నట్లుగా లేదు అని వివరణ తగు విధంగా ఇచ్చి వారిని సంతృప్తి పరచే నా అభిప్రాయము తెలియజేయగలను. కానీ కొత్తవారు చర్చలు లోకి రారు. ఉండటానికి వేలాది వాడుకరులు ఉన్నారు ఇక్కడ, కానీ ఒకసారి కూడా అత్యవసరానికి ముందుకు రారు. కానీ ప్రస్తుతం అందరితో అనవసర చర్చలు సాగుతాయి, ఎలాగూ నా మాట ఇక్కడ చెల్లదు, దానికి కారణం నాకు తెలియనిది కాదు, చెప్పవలసిన అవసరము కూడా లేదు. ఈ వ్యాసాలు వ్రాస్తూ ఉన్నంతకాలం జరిగిన చర్చలు చాలా మందికి తెలుసు వారు అర్థం చేసుకోగలరు అని అనుకుంటున్నాను. మీ అభిప్రాయములు మీద ఎంత కాలమైన చర్చలు చేయగలను. ఈనాటి కాలం గురించి మీరు ఆలోచిస్తారు, నేను భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తాను. నేను ఏదైనా పెద్ద పని అనుకున్నప్పుడు, దానిని వాడుక పదం ప్రాజెక్టు అంటాను. అంతే కాని నేను వ్రాసే వ్యాసాలు మీరనుకునే ప్రాజెక్టు కాదు. రైల్వేలలోని అతి కొద్ది వ్యాసాలకే ఇలా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి అసలు ఎన్ని బండ్లు అన్ని జోన్లలలో తిరుగుతూ ఉన్నాయో చూడండి. అందుకనే ఇటువంటి సమస్య ఏదో వస్తుందనే నేను ఒక జోన్లలోని కేవలం ప్యాసింజర్ బండ్లను మాత్రమే ఎక్కించాను. నాకు ఇక్కడి సాంకేతికంగా, పరిపాలన పరమైన పాలసీలు గురించి పెద్దగా అనుభవం లేదు, కనుకనే అటువంటి మీ సందేహాలు నాకు సలహాలు ఇచ్చిన వారు తీర్చగలరు. నేను ఏదీ కూడా నాకుగా నేను తెలిసి మీరందరూ అనుకున్నట్లుగా అంత పెద్దగా ఏ విషయములోనూ నా సొంత పాత్రలేదు. ఎవరి (పూర్వపు) సలహా అయినా అయి ఉండాలి లేదా తెలియక పోయి ఉండాలి. కానీ కొత్త విషయాలు, పంథా, ఇంకా ఏమైనా సరే కనిపెట్టి చేయాలనుకుంటాను. సరే., ఇంక ముగిస్తాను. మీ అందరి మనసులలోని కోరిక, అభిప్రాయములు, నిర్ణయాల ప్రకారం, నేను వీలయినన్ని వ్యాసాలు తొలగిస్తాను. ఈ సందర్భముగా తొలగించాల్సినవి జాబితా సాంకేతికంగా ఏమైనా తయారు చేయగలిగితే, పని తేలికగా అవుతుంది. ఎవరు తొలగించినా మంచిదే. ఇక్కడ మనకు అవసరము లేనివి అన్నీ తొలగించడము మంచిది. మీ అందరకు మరో మారు ధన్యవాదములు. నమస్కారములు. JVRKPRASAD (చర్చ) 13:35, 6 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

  • పాలసీ పరమైన చర్చను సంయమనంతో ప్రారంభించడం, చర్చను సాగించి, చివరకు సభ్యుల అభిప్రాయాలను విశ్లేషించి నిర్ణయానికి తీసుకురావడంలో విశ్వనాధ్ గారు అభినందనీయమైన పాత్ర పోషించారని తెవికీ స్వచ్ఛంద రచయిత స్థాయిలో అభిప్రాయపడుతున్నాను. ఇందుకు వారికి వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:18, 10 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారు చర్చను సమర్ధవంతంగా నిర్వహించినందులకు అభినందనలు. పాల్గొన సహ సభ్యులందరికి మరియు నిర్ణయాన్ని స్వాగతించిన JVRKPRASAD గారికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 15:42, 11 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఉండదగిన వ్యాసములు[మార్చు]

వికీ పెద్దలకు నమస్కారము. అయ్యా ! నేను పై మీ పెద్దల నిర్ణయ సూచనల మేరకు నాకుగా నేను సృష్టించిన రైల్వే తాలూకు వ్యాసములు ప్రస్తుతము ఉన్నటువంటివి చాలా వరకు తొలగింపు కార్యక్రమము చేపట్టి ప్రస్థుతము ఆ పనిలో యున్నాను. ఈ సందర్భముగా వికీ మూల సూత్రములకు అనుగుణంగా పనికి వచ్చే వాటికి ఈ పెద్దలు దయచేసి ప్రతి వ్యాసము యొక్క చర్చ పేజీలో ఉంచవచ్చును అనే పదమును చేర్చిన నేను తొలగించకుండా ఉంచెదను. రాబోయే రోజులలో వాడుకరులతో ఎటువంటి సమస్యలు రాకుండా, అనవసర చర్చలు లేకుండా ఉండుటకు అవకాశము ఉన్నది. ఈ పెద్దలు నుండి ఎటువంటి స్పందనలు లేనపుడు, నా తొలగింపు కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగించుతూ ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 06:09, 18 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సంఘటనలు థీమ్ తో ఎడిటథాన్ ప్రతిపాదన[మార్చు]

ఇటీవల నెలవారీ సమావేశంలోనూ, ఫేస్ బుక్ వేదికపైనా చర్చల్లో తెలుగు వికీపీడియా సముదాయం కలసి సమిష్టిగా కొంత కృషిచేస్తే బావుంటుందని అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎడిటథాన్ నిర్వహిస్తే బావుంటుందని భావించాము. అలానే రవిచంద్ర గారు, రాజశేఖర్ గారుతో చేసిన చర్చల్లో భాగంగా తెలుగు వికీపీడియాలో వ్యక్తులు, పుస్తకాలు, సినిమాలు, గ్రామాలు వంటివాటితో పోలిస్తే సంఘటనలపై దృష్టి తక్కువగానే పెట్టామన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సంఘటనలు అన్న థీమ్ పై ఆన్లైన్ ఎడిటథాన్ నిర్వహిస్తే ఎలావుంటుందన్న ప్రతిపాదన చేస్తున్నాము. ఉదాహరణకు ఎన్నికలు, రాజకీయ పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాలు, సమావేశాలు (ప్రపంచ తెలుగు మహాసభలు) వంటివన్నీ ఈ సంఘటనలు, పరిణామాల థీమ్ క్రిందకు వస్తాయి. మూలాలను చూసి, అవసరమైనవి తెవికీలో లేనివి జాబితా చేసుకుని ఎడిటథాన్ ప్రారంభిస్తే బావుంటుందని మా ప్రతిపాదన. సభ్యులు స్పందించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:44, 25 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

విషయ ప్రాముఖ్యం (notability) ఉన్న వ్యాసాలను ముందుగా ఎంచుకుందాం. దీనికోసం ఏదైనా రెఫరెన్సు తీసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అలాగే మనం రాయబోయే వ్యాసాలకు నమ్మదగ్గ మంచి వనరులు(వెబ్ సైట్ల కన్నా ఒక మాదిరి పేరున్న రచయితలు రాసిన పుస్తకాలైతే బాగుంటుంది) ఉండాలి. మనం సృష్టించే వ్యాసం కనీస పరిమాణం ఐదు కెబీలకు మించి ఉండాలని నియమం పెట్టుకుందాం. ఆంగ్లవికీలో ఉన్న ముఖ్యమైన సంఘటనలకు తగు వ్యాసాలు రాస్తే అక్కడ నుంచి చదువరులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందేమో. --రవిచంద్ర (చర్చ) 10:12, 26 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ఆలోచన. మనం తుఫానులు, వరదలు లాంటి వాని గురించి వ్యాసాలకు మూలాలు అప్పటికప్పుడు దొరకుతాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలు, ఉదా: రాజీవ్ గాంధీ హత్య వంటి వానికి పుస్తకాలున్నాయి, ఆంగ్ల వికీలో వ్యాసాలున్నాయి. అలాగే బాంబు పేలుళ్లు, ఉప్పు సత్యాగ్రహం, జలియన్ వాలా బాగ్ ఉదంతం ఇలా ముఖ్యమైన సంఘటనలకు ఎడిటథాన్ చేయడం బాగుంటుంది. ఒక వారం-పది రోజులు అందరం కలిసి చేస్తే ముఖ్యమైన సంఘటనలు అన్నీ కవర్ చేయవచ్చును. అయితే ఒక జాబితా తయారుచేసుకొని ప్రారంభించాలా, లేదా సభ్యుల ఇష్టాయిష్టాలకనుగుణంగా జరపాలా అన్నది చూడండి.--Rajasekhar1961 (చర్చ) 10:56, 26 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
జాబితా తయారుచేసుకుని, మూలాలు చూసుకుని మరీ చేస్తే ప్రయోజనకరంగా ఉండొచ్చు. ఇలాంటి వ్యాసాల రచనపై అభిరుచి ఏర్పడితే ఆపైన వాడుకరులు తమకు తామే ఎంచుకుని చేస్తారని నా భావన. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:36, 28 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ప్రాజెక్టులో జాబితాలను తయారుచేస్తే బాగుంటుంది. మూలాలు ఎలాగైనా అంతర్జాలంలొ దొరికే అవకాశం ఉంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:27, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఎడిటథాన్ కొనసాగింపు?[మార్చు]

ఎడిటథాన్ లో వాడుకరులు ఉత్సాహకరంగా పాల్గొంటున్నందున దీన్ని మరో మూడు రోజులపాటు కొనసాగించాలన్న ప్రతిపాదనపై సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:04, 8 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

WikiConference India 2016 Update[మార్చు]

Hi,

After an elaborate community participation process, we are planning to host Wikiconference India 2016 in Chandigarh during August 5, 6 and 7.

Please help us by

We will be calling applications for travel scholarship and paper presentations soon.

We look forward to your contribution in making this conference successful. Please sign up to our mailing list and follow the discussion in Meta for updates.

Thanks.

--Ravidreams (చర్చ) 20:47, 27 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

WikiConference India 2016 team.

As a stakeholder of the Wikimedia India community in India, please express your support and comments regarding the selection of host city, date and other aspects of this conference planning.

Support[మార్చు]

  1. I support it. --రవిచంద్ర (చర్చ) 13:17, 29 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నా మద్దతు తెలియజేస్తున్నాను. భాస్కరనాయుడు (చర్చ) 11:21, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. I support it.--Pranayraj1985 (చర్చ) 12:11, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4. నా మద్దతు తెలియజేస్తున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:25, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5. checkY --రహ్మానుద్దీన్ (చర్చ) 13:16, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6. మద్దతు --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:33, 8 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  7. మద్దతు - --Viswanadh (చర్చ) 03:23, 9 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  8. నా మద్దతు తెలియజేస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 03:49, 9 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  9. మద్దతు----Nrgullapalli (చర్చ) 09:57, 27 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Neutral[మార్చు]

Oppose[మార్చు]

Comments[మార్చు]

Train-the-Trainer and MediaWiki Training: Capacity building initiatives for the Wikimedia community[మార్చు]

[[[File:Sticky_note_-_Train-the-trainer.png|right|250px]] Like the previous years [1][2] CIS-A2K is planning for a capacity building activity for the Indic-language Wikimedia communities this year. This 3-4 day event, that is planned to be organized in Bengaluru, will include several parallel training sessions. The general sessions will broadly include:

  • How to conduct Wikimedia outreach (workshops, GLAM activities, edit-a-thons)
  • Ways to groom new contributors
  • Advanced Wikipedia editing and Wikipedia policy and guidelines

Similarly, the MediaWiki training will include:

  • MediaWiki - installation, analysis, understanding
  • Working with MediaWiki
  • How bots work on Wikimedia projects with an emphasis on pywikibot
  • Bug triage, bug life cycle, raising a bug, fixing a bug
  • General overview of FOSS, Openness, social media, Copyright, Creative Commons

We are looking forward to nominate yourself or nominate any other member of your community to participate in this event. We will be selecting the participants based on the community recommendation. We are looking forward to hearing your inputs on the program design and anything in particular that you would like to see.

Please note that the Wikimedians who have not attended the previous iterations of this training will be given more preference.
You can learn more about the event here.

Footnotes[మార్చు]

  1. Train-the-Trainer
  2. MediaWiki Training

Thanks. -- CIS-A2K (sent using MediaWiki message delivery (చర్చ) 10:03, 29 ఏప్రిల్ 2016 (UTC))[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాకు ఉపకరించే వనరుల ప్రచురణ[మార్చు]

తెలుగు వికీపీడియా అభివృద్ధికి సముదాయం, సీఐఎస్-ఎ2కె వగైరాలు నిర్వహించే కార్యక్రమాల్లో, కార్యకలాపాల్లో ఉపయుక్తంగా ఉండడానికి కొన్ని వనరులను ముద్రించే యోచనలో ఉన్నాము. ఆ క్రమంలో ఈ క్రింది 3 బుక్ లెట్లను సముదాయం ఆసక్తిమేరకు ప్రచురించదలిచాము. ఈ అంశంపై సూచనలు ఉంటే తెలియజేయదలరు.

  1. తెలుగు వికీపీడియా తోడ్పాటు మార్గదర్శిని - తెలుగు వికీపీడియా గురించి పలు అంశాలు కొత్తవారికి తెలియజేసేందుకు వీలుగా ఉండే ఈ పుస్తకాన్ని వెయ్యి కాపీలు ప్రచురించాలని ప్రతిపాదన.
  2. తెవికీలో తెలుగులో ఎలా రాయాలన్న అంశాన్ని పలు కీబోర్డుల లే అవుట్లతో వివరించే బుక్లెట్ ని వెయ్య కాపీలు
  3. స్వేచ్ఛా లైసెన్సుల గురించి తెలియజేసే నాలుగు పేజీల చిన్న బుక్లెట్ ఫోటోగ్రాఫులు, పుస్తకాలు డొనేట్ చేసేవారికి వివరించేందుకు ప్రధానంగా ఉపకరిస్తుంది. ఇదీ వెయ్యి కాపీలు.

వీటిలో తెలుగు వికీపీడియా తోడ్పాటు మార్గదర్శిని, తెవికీలో టైపింగ్ గురించిన బుక్లెట్ గురించి ఇప్పటికే సముదాయం నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. మూడవది కొత్త ప్రతిపాదన. ఈ అంశంపై సముదాయం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:30, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాకు ఉపకరించే వనరుల ప్రచురణలను ముద్రించాలనే పై నిర్ణయము చాల ముదావహము. వికీపీడియన్ల ఉపయోగార్థము ఒక పుస్తకము ముద్రించ వచ్చుననే నా వూహ రెండేండ్ల క్రిందిటి మాట. వికీపీడియాకు సంబందించి చాల విషయాలు క్రోడీకరించి నేను తయారు చేసిన పుస్తకము ఈ క్రింద ఇస్తున్నాను వికీపీడియా మార్గదర్శిని చూడండి. దానికి ఒక పేరు పెట్టాలని అప్పట్లో కోరగా వెంకట రమణ గారు తెలుగు వికీపీడియా మార్గ దర్శిని అనే పేరును సూచించారు (చూడుము. రచ్చబండ చర్చ: 36 ది. 30.12.2014) తిరుపతి జరిగిన వార్షికోత్సవాల నాటికి దాన్ని ముద్రించ వలసినదిగా కోరాను. కాని కొన్ని కారణాల వలన అది సాద్య పడలేదు. అదే విధంగా వికీపీడియా కరపత్రము అనే చిరుపొత్తాన్ని కూడ తయారు చేశాను.
ప్రస్తుతం అటు వంటి పుస్తకాన్ని ముద్రించ దలుచుకోవడము ఎంతో ముదావహము. దానికి నేను ఈక్రింద పొందుపరచిన పుస్తకము ఉపయోగకరముగా వుంటుందని నాకనిపిస్తున్నది. కాని ఇందులోని కొన్ని విషయాలు కాల దోషము పట్టి ఉండవచ్చు. మరికొన్ని కొత్త సాంకేతిక విషయాలు ఇందులో లేక పోవచ్చు . కనుక ఇందులోని అనవసర విషయాలను తొలగించి, క్రొత్త విషయాలను చేర్చి మరికొంత మెరుగు పరిస్తే చాల ఉపయోగ కరంగా వుండొచ్చని నా అభిప్రాయము. భాస్కరనాయుడు (చర్చ) 11:18, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
భాస్కరనాయుడు గారు మీ పుస్తకం గురించి మునుపు ఒకసారి చర్చ జరిగింది. సి.ఐ.ఎస్ ద్వారా సాద్యం అయితే వేయించాలనే నా కోరికకు పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) సానుకూలంగా స్పందించాడు. తదుపరి ఏదైనా సంధర్భంగా దీనిని పుస్తకరూపంలో తీసుకురావాలని అనుకొన్నాం. మరొకసారి దీనిపై పవన్ సంతోష్ శ్రద్ద తీసుకోవాలని మా ఆకాంక్ష. అయితే దీనిని కొంత మెరుగుపరచవలసి ఉన్నది. సుమారు 30 పేజీల వరకూ వస్తున్న దీనిని కొంత కత్తిరించి తగ్గించాలి...--Viswanadh (చర్చ) 11:42, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పైన తెల్పిన పుస్తకాలు ఖచ్చితంగా ఉపయుక్తం. వీటి వలన ప్రతి వాళ్ళకూ ఎప్పటికపుడు వివరించవలసిన అవసరం ఉండదు, సమయం వృదా కాదు, ఆశక్తి ఉన్నవారికి అందచేయదం ద్వారా సభ్యుల సహాయం లేకపోయినా వాటిని చూస్తూ మార్పులు చేయగలుగుతారు. కొన్ని కొన్ని సముదాయాలలో కొందరు వ్యక్తులకు మన సోది వినే అంత సమయం ఉండదు. అలాంటి వారికి ఇవి ఇస్తే తరువాత నిదానంగా చూస్తారు..--Viswanadh (చర్చ) 11:42, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పైనుదహరించిన పుస్తకాల ప్రచురణ ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతీ వారికీ తెవికీ విధానాలు, పద్ధతులు వివరంగా తెలుస్తాయి. వాడుకరులకు అందజేస్తే వికీ విధానాలను స్వయంగా తెలుసుకొని వికీలో సులువుగా మంచి రచనలు చేసే అవకాశం ఉంది. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:24, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి, మీరు ప్రతిపాదిస్తున్న పుస్తకాల లింకులు లేక పిడిఫ్ ప్రతులు ఇవ్వండి. ఇప్పటికే వికీపీడియా పుస్తకాలకొరకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వాటిలో నేను సంపాదకత్వం వహించిన s:వికీపీడియాలో రచనలు చేయుట వాటిలో ఒకటి. వాటిని అన్నిటిని పరిశీలించి ఎంపిక చేయటము మంచిది. --అర్జున (చర్చ) 00:19, 2 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ మనవాళ్ళు చేసిన ప్రయత్నాలేవీ ప్రింట్ రెడీ పీడీఎఫ్ వెర్షన్లలో లేవు. కనుక వీటిని ప్రచురణకు ఉపకరించేలా మలుచుకోవాలి. ఈ క్రమంలో మీరు రాసిన టెక్స్ట్ పనికి వస్తోంది. ఐతే ప్రింటింగ్ లో ఏ విధమైన మార్జిన్లు వదలాలి, ఎలాంటి ప్రింటర్ కి ఎలాంటి ప్రింటింగ్ కి ఎలాంటి రంగులో డిజైన్ చేయాలి వంటిది ప్రత్యేకమైన సబ్జెక్టు కాబట్టి దీనికి డీటీపీ చేయిస్తున్నాము. ఆ డీటీపీ వెర్షన్ కూడా వికీ కామన్స్ లోకి అప్లోడ్ చేస్తాము. (తద్వారా భవిష్యత్తులో ఇటువంటి ప్రయత్నాలు చేసేవారికి ప్రింట్ రెడీగా ఉంటుంది, డీటీపీ-డిజైనింగ్ శ్రమ కూడా తప్పుతుంది) అంతేగాక అనువాదానికి, డిజైనింగ్ కీ కృషిచేసిన వికీపీడియన్ల పేరూ దానిలో క్రెడిట్ చేస్తాము. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:51, 2 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారు, అనువాదము చేయవలసినవి ఇంకా ఏమైనా ఉంటే ఒక విభాగములో ఉంచగలరు. అనువాదము చేయాలనుకున్న వారు చేయగలరు. అలాగే డిజైనింగ్ సంబంధించిన డ్రాఫ్ట్ లేదా ప్రూఫ్ కాపీ కూడా మరో విభాగంగా ఉంచితే ఏవైనా సలహాలు, సూచనలు అందులో పొందు పరచ వచ్చును. JVRKPRASAD (చర్చ) 04:19, 2 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి, నేను ఇచ్చిన లింకు ఆధారంగా ముద్రణా ప్రతిని తయారు చేయలన్న ప్రతిపాదన వివిధ కారణాల వల్ల ముందుకి పోలేదు. అ పని వికీమీడియా ఫౌండేషన్ వారి కృషిపై ఆధారపడినది కాబట్టి మూల ఆంగ్ల ప్రతిని అనుసరించి డిటిపి చేయటం చాలా సులభం. అయినా డిటిపి చేయించే ముందు పాఠ్య ప్రతిని సముదాయ చర్చలతో ఖరారు చేయటం మంచిది. మీరు అప్పట్లో చర్చాపేజీలో అంత అర్ధవంతంకాని వ్యాఖ్యలు వ్యక్తం చేయడం వాటిని ఆయా పేజీలలో అర్ధవంతంగా చేర్చమని కోరడం చేరింది. ఆ తరువాత ఆ చర్చలు ముందుకు పోలేదు. ఇప్పుడు అవసరమనుకుంటే ఇంకొక కొత్త చిత్తు ప్రతి మొదలుపెట్టి, అందరి అభిప్రాయాలతో పాఠ్యాన్ని ఖరారు చేయటం మంచిది. అలాగే మీరు ప్రతిపాదించిన ఇతర ముద్రణా ప్రతులకు కూడా పాఠ్యాన్ని ఖరారు చేయండి. డిటిపి చేసిన తరువాత మూల పాఠ్యాన్ని పొందాలంటే గూగుల్ OCR వున్నా మరల చాలా శ్రమపడవలసి వుంటుంది.--అర్జున (చర్చ) 22:43, 2 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ మీరు గతంలో అనువదించిన వికీపీడియాలో రచనలు చేయడం ఎలా అన్న పుస్తకాన్నే స్వీకరించాము. ఆంగ్లంలోని ప్రతిని అనుసరించి చేసేప్పుడు మన పాఠ్యం ఎక్కువైపోయి (ఆంగ్ల, తెలుగు పాఠ్యాలకు ఆ భేదం ఉంటుంది. ఆంగ్ల అక్షరాలు ఒత్తులు, గుణింతాలు లేకుండడం వల్ల పట్టే సైజుకీ తెలుగు అక్షరాలు పట్టే సైజుకీ డీటీపీ పరంగా తేడా వస్తోంది) ఉండడంతో సమాచారంలో లోపం లేకుండా కొంత తగ్గించడం అవసరం. కనుక దీన్ని ప్రస్తుతం వికీపీడియా:ప్రచురణ కోసం/వికీపీడియాలో రచనలు చేయుట అన్నదగ్గర ప్రచురిస్తున్నాను. దానిలో కొంత సైజు తగ్గించి, సమకాలీనం చేసే ప్రయత్నం చేయగలరు. అలానే మిగిలిన రెండు పుస్తకాలూ ప్రచురిస్తాము, వాటిలో ఒకటి వాడుకరి:విశ్వనాధ్.బి.కె. గారు తయారుచేసిన కృతి. ఆయనను ప్రచురించమని కోరాను. వాటి పాఠ్యాన్ని కూడా సముదాయం సరిజూశాకే మిగిలిన దశకు వెళ్ళవచ్చు. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:25, 3 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. తెలుగు రూపంలో కొంత అదనపు సమాచారము చేర్చడం జరిగింది. దానివలన మరియు తెలుగు అక్షరాల పాఠ్యానికి ఆంగ్లం కన్నా ఎక్కువ పేజీలు అవసరమైతే అలానే ముద్రించడం మంచిది. మీరు పరిశీలించి పుస్తకం ఉపయోగ సమర్ధత తగ్గకుండా కొంత పాఠ్యం తగ్గించదలిస్తే దానిని చర్చాపేజీలో ప్రతిపాదించి చర్చించండి. నేను డిటిపిరూప నిర్మాణానికి ప్రత్యక్షంగా పాల్గొనటం లేదు కాబట్టి, నేను చర్చలో పాల్గొనడం తప్పించి బాధ్యత తీసుకొనడం కష్టం. అలాగే మిగతా ప్రతిపాదిత పుస్తకాలలో ముఖ్యంగా కీ బోర్డుల గురించిన వివరం ఈ పుస్తకంలో కలపటమే మంచిదేమో పరిశీలించండి. --అర్జున (చర్చ) 23:28, 3 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు నేను వికీపీడియా:ప్రచురణ కోసం/వికీపీడియాలో రచనలు చేయుట వద్ద కొన్ని మార్పులు సూచించాను, అయితే దానిపై సభ్యుల స్పందన లేదు. మీరొకసారి పరిశీలించి.మీ సలహాలు ఇవ్వగలరు...--Viswanadh (చర్చ) 03:31, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి :విశ్వనాధ్.బి.కె. గారికి, వికీపీడియా చర్చ:ప్రచురణ కోసం/వికీపీడియాలో రచనలు చేయుట లో స్పందించాను. మరింత మంది పాల్గొనేందుకు {{సహాయం కావాలి}}చేర్చాను. --అర్జున (చర్చ) 04:21, 7 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా - విక్షనరీ[మార్చు]

వాడుకరి:‎Vemurione గారు సరిచేసి వ్రాస్తున్న వారి పదకోశం విక్షనరీకీ లేదా మరోచోటికి తరలించాలని సదరు రచయిత మరియు వికీ వాడుకరులు చర్చించారు. మరి ఆ పని జరుగక పోవుట వలన వారు చేస్తున్న కృషి ఉండవలసిన చోట ఉండక వికీపీడియా నందు నమోదు అవుతున్నది. ఒకచోట ఉండవలసిన కృషి ఇలా మరోచోట ఉండటం సరి అయినదేనా అని సందేహాం. వారు ఈ చేసిన కృషి మొత్తం సరయిన చోటికి తరలించేందుకు ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయంటారా ? ఈ విధంగా మాలాంటి వారకు కూడా సంస్కృత నిఘంటువును ఇక్కడ చేర్చుకుని వారు చేసిన కాల ప్రమాణమును నాకు కూడా కేటాయించు తున్నట్లు ఉన్న పదిమంది పెద్దలు వీలు కల్పిస్తే కొత్తగా మరో పని చేసుకునే అవకాశము కల్పించ గలరని మనవి చేసుకుంటున్నాను. దయచేసి నిరభ్యంతర అనుమతిని త్వరలో తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 00:33, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారు మీరు రాసినది నాకు సరిగా అర్ధం కాలేదు. మరికొంచెం వివరించగలరా..--Viswanadh (చర్చ) 05:18, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • :::Viswanadh గారు, చక్కగా అడిగారు. చాలా సంతోషం. విడమరచి మరీ మీకు విశదీకరిస్తాను.
  • వాడుకరి:‎Vemurione గారు మనకు ఒక పాత వాడుకరి. వారి యొక్క డిక్షనరీ రచనలు స్వంత మైనవి ఉన్నాయి. వాటిని ఇక్కడ డౌన్ లోడ్ చేసుకునో మరేదైనా కానీండి, వారి డిక్షనరీ రచనలు కొద్ది కొద్దిగా మెరుగులు దిద్దుతున్నారు. వారి చర్చలు [1] అక్కడక్కడా కూడా ఉన్నాయి.
  • డిక్షనరీ పనులు వికీపీడియాలో చేయకూడదని మన వాడుకరుల చర్చలు ఫలితం యొక్క సారాంశం.
  • వేమూరి వారు, వారి పేజీలను తరలించమని కూడా అడిగారు. వీలయితే సిఐఎస్ ద్వారా అయినా తరలిస్తామని వికీ వాడుకరులు అన్నారు.
  • కానీ వేమూరి వారి రచనలు, వారితో పాటుగా కెపిశాస్త్రి గారు కూడా తమ వంతు ఇక్కడ సహకరిస్తూ ఇక్కడే వారి దిద్దుబాట్లు జరుగుతున్నాయి.
  • విక్షనరీ లేదా సోర్స్ నందు ఉండ వలసిన సమాచారము, అక్కడే జరగవలసిన దిద్దుబాట్లు ఇక్కడ కొనసాగుతున్నాయి.
  • ఇప్పటి వరకు ఎవరూ అభ్యంతరము వ్యక్తం చేయలేదు.
  • వికీలన్నీ సోదర ప్రాజెక్టులే కదా అనే ఉద్దేశ్యముతో కొనసాగిస్తున్నారేమో మాత్రం తెలియదు.
  • ఒకవేళ అటువంటి సదుపాయము, సౌకర్యము ఈ మధ్యన ఏమైనా వెసలుబాటు కల్పిస్తే నేను కూడా ఒక సంస్కృత నిఘంటువును ఇక్కడ చేర్చుకుని వారు చేసిన కాల ప్రమాణము కాలమును నాకు కూడా కేటాయించు తున్నట్లు ఉన్న పదిమంది పెద్దలు వీలు కల్పిస్తే కొత్తగా మరో పని చేసుకునే అవకాశము కల్పించమని కోరుతున్నాను.
  • మీకు అర్థము కాని యెడల మరలా మీరు అడిగిన వాటికి సమాధానము మరింత విడమర్చి చెప్పగలను.
  • మీ స్పందనకు మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 05:48, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]


వాడుకరుల స్పందనలు[మార్చు]

చూశాను, సమాధానము తెలియదు[మార్చు]

  1. వేమూరి వారు చేరుస్తున్న నిఘంటువు చూశాను. కానీ అవి విక్షనరీకి ఎలా తరలిస్తారో తెలియదు. మీరు కూడా ఓ సంస్కృత నిఘంటువును చేర్చడానికి నాకేమీ అభ్యంతరము లేదు.--రవిచంద్ర (చర్చ) 05:53, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారికి మీ స్పందనలకు ముందుగా ధన్యవాదములు . నాకు మీరు ఒక మంచి సలహా ఇచ్చారు. నన్ను కూడా ఏదైనా మరో భాష అనగా తెలుగు కానిది ఇక్కడ చేర్చుకొని తెలుగులోకి వ్రాయవచ్చునని, అభ్యంతరము లేదని అన్నారు. చాలా సంతోషము. కానీ ఈ సందర్భముగా భవిష్యత్తులో మనకు వికీ మూలసూత్రాలకు విరుద్ధం, ఇక్కడ ఉండవలసిన సమాచారము కాదు, ఇలాంటి అభ్యంతరకరమైన పనికి అడ్డుపుల్లలు వేసే వాడు ఎవడినయినా, వాడు ఎంతటి వాడయినా ఉపేక్షించక ఇక్కడి నుండి తరిమికొట్టే భాద్యత తీసుకుంటానంటే ఇప్పుడే నా పని మొదలు పెట్టి చేసుకుంటాను. దానికి మీరు ఇచ్చిన భరోసాకు అభ్యంతరము ఏమైనా ఉంటే ఇప్పుడే తెలియజేయండి. ఎందుకంటే ఈ పని చాలాకాలం పడుతుంది. చాలా మంది వెధవలు పని చెడగొట్టడానికి రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి పని ఆపు చేసుకునేవరకు చేస్తారు. ఎవడిని వారు ముందుకు వెళ్ళనీయరు. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు నిజానికి భరోసా కల్పించినవారు తప్పించుకొని ఎంత వెతికినా తుపాకీకి కూడా దొరకరు. అంత పనిచేసి, ఎవడో పనికిరానివాడు కొత్తగా వచ్చిన వాడు పనికిరాదు అంటే అందరూ భజనలు చేసి నిజం చేస్తే, నా సమయం అంతా పనికి రాని పనికి వృథా అయ్యిందని మళ్ళీ మనసుపాడు చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మీ అభిప్రాయము తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 06:09, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  1. ప్రసాద్ గారూ, వికీపీడియాలో ఎవరైనా సముదాయం అంతా కలిసి తీసుకున్న నిర్ణయానికి తలవంచాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వెలిబుచ్చింది కేవలం నా అభిప్రాయం మాత్రమే. చర్చలో పాల్గొనే అందరూ నాలాగే మీరు చేసే మార్పులు బాగున్నాయి అంటే అదే అంతిమ నిర్ణయం అవుతుంది. వేమూరి వారు తనకు నిఘంటువును విక్షనరీ లో చేర్చడం ఎలాగో తెలియదన్నారు. కాబట్టి ఆయన్ను ఇక్కడ మార్పులు చేసిన తరువాత విక్షనరీకి తరలించాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. మీకు అన్ని వికీపీడియా ప్రాజెక్టులలో పనిచేసిన అనుభవం ఉంది. లేకపోయినా మీరు తొందరగా నేర్చుకొనగలరు కాబట్టి. వాటిని డైరెక్టుగా విక్షనరీలోనే చేర్చమని నా అభ్యర్థన. మీరు నా కన్నా వయస్సులో పెద్దవారు. ఏమీ అనుకోకుండా ఆ వెధవలు లాంటి పదాలు ఎవరిని ఉద్దేశించైనా రాయకండి. దయచేసి తప్పుగా అనుకోవద్దు. --రవిచంద్ర (చర్చ) 11:17, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారికి, వికీ వాడుకరులు వేలల్లో ఉంటే సముదాయం ప్రస్తుతం పదిమందితో నిర్ణయాలు నెట్టుకు వస్తోంది. ఏ నిర్ణయమైనా, ఎవరు చేసినా ఆమోదం ఉంటుంది కానీ తలవంచటం అనేది ఉండదనుకుంటాను. కేవలం మీరు వెలిబుచ్చిన మీ అభిప్రాయానికి, సూచనలకు ధన్యవాదములు. అసలు నేను అడిగిన దానికి సరయిన సమాధానము తెలిసిన వారు ఎప్పటికైనా చెబుతారేమో. మరికొన్ని మాటల పదాల నా స్పందన క్రింద వ్రాశాను. దయచేసి వీలయితే జవాబు పొందుపరచ గలరు.JVRKPRASAD (చర్చ)

చూశాను, సమాధానము తెలుసు తదుపరి చెప్తాను[మార్చు]

చూశాను, సమాధానము తెలుసు, చెప్తాను[మార్చు]

  1. వేమూరి గారి డిక్షనరీని తెలుగు విక్షనరీకి తరలించడమే సరైన విధానం. అది అంతా సాంకేతికంగా చేయాల్సిన పని. వారితో చర్చలు జరుగుతున్నాయి. వారు తమ నిఘంటువు మరియు ఇతర రచనలను వికీపీడియాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అవి ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాము. ఒక వికీ సమావేశం ద్వారా నిర్ణయం తీసుకోవచ్చును. కానీ వారు అమెరికాలో మనం ఇండియాలో ఉండడం వలన అందరికీ వీలైన సమయం దొరకడం లేదు. ప్రసాద్ గారు ఇప్పటికే విక్షనరీలో చాలా కృషిచేశారు. ఇతర ఏభాషకు సంబంధించిన పనినైనా విక్షనరీలో చేర్చవచ్చును. కానీ తెలుగు భాషకు పరిమితమైన తెలుగు వికీపీడియాలో కాదు.Rajasekhar1961 (చర్చ) 13:53, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తిగత దూషణము[మార్చు]

JVRKPRASAD గారు మీరు వెదవ అనే పదాన్ని తరచుగా వాడుతున్నారు. వికీలో రాసే ఎవరైనా వారు మీకు అభ్యంతరం చెప్పేవారైనా అందరూ సేవాగుణం, పరోపకారం కోరే ఇక్కడ రాస్తున్నారు. వారి విలువైన సమాయంలో కొంత ఇక్కడ ఖర్చు చేస్తున్నరంటే దానర్ధం వారు వెదవలు అని కాదు. ఇలాంటి విషయాలలో మీరు మీ అనుభవాన్ని, వయసుని ఎందుకు ప్రక్కన పెడతారో నాకు తెలియడం లేదు..--Viswanadh (చర్చ) 06:46, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Viswanadh గారు, మీరు చాలా తప్పు అర్థం తీసుకుంటున్నారు ప్రతిసారి. ఏ పని ఒక్కటి కూడా జీవితంలో ఇక్కడ ఛేయకుండా అప్పుడే వచ్చిన కొత్త వాడుకరి మనలాంటి వారికి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళని ఏమని అనాలంటారు ? మీలాంటి వాళ్ళు వ్రాసే వారు అని భ్రమ పడుతున్నారు. వ్రాసేవాళ్ళని, అభ్యంతరం చెప్పే పని చేసే వాళ్ళని ఎక్కడయినా అన్నా దాఖాలాలు ఉన్నాయా చూపించండి. నేను ఏనాడూ పని చేసే వారిని ఎవరినీ మీరనుకున్నట్లు నేను అనుకోవటము లేదు. నాకు ప్రతిసారి ఇంతటి నీతి సూత్రాలు ఎందుకు చెబుతున్నారో నాకు అర్థం నాకు కావడము లేదు. మీరు చెప్పే నీతులు నాకు కూడా వర్తిస్తాయి, నేను అదే భావనలతో పనిచేస్తున్న వాడిని. మీకు ఎవరికీ నా మాటలు సరిగా ఎందుకు అర్థం కావడము లేదో నాకు అస్సలు తెలియడము లేదు. నేను వ్రాశినది ఒకటికి నాలుగు సార్లు చదవండి. ఎవరిని ఉద్దేశ్యించి ఆ మాటలు ఉటంకించ బడ్డాయో విశదమవుతుంది. పనిచేసే వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు తెలియనిదా ? ఇంతటి చిన్న పదము మీకు ఎవరికీ అర్థం కావటము లేదంటే ఇంక నేను ఏమి వ్రాశినా మీకు తప్పుగానే అనిపిస్తుంది. మీరు నా మాటల పదాల లోని అర్థం చెడు రంధ్రాన్వేషణతో ఆలోచించకుండా ఈ సారి సవ్యంగా సరిగా మళ్ళీ చదవండి. ఎవరిని ఉద్దేశ్యించి వ్రాశానో బాగా అర్థం అవుతుంది. మొత్తం సమాచారము ఒకేసారి చదవండి. అంతేకాని ఒక పదాన్ని పట్టుకొని నాకు మర్యాద తెలియదని, వ్యక్తిగత దూషణములు అంటూ నా నడవడి, ప్రవర్తన మీద దయచేసి ఎవరూ కాటు వేయుటకు ప్రయత్నించకండి. ఇంతకు ముందు చాలాసార్లు చెప్పారు జవాబు ఇచ్చాను. మీరు మరొకమారు ఈ విషయము గురించి నాకు తెలియజేయకండి. ఎందుకంటే మీకు అర్థం కావడం లేదు నా భాష అని అనుకుంటున్నాను. నేను వ్రాశినది ఎక్కడ సందర్భము అని ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. అంతేకాని ఆ పదాన్ని పట్టుకొని తప్పులు దయచేసి ఎంచవద్దని, సరిగా సవ్యంగా అర్థం చేసుకోమని నా సలహా, సూచన మరియు మనవి. మీ స్పందనలకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 08:03, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర మరియు Viswanadh గార్లకు, ఇద్దరికీ కలిపి ఇక్కడ సమాధానము వ్రాస్తున్నాను. మీ ఇద్దరికీ సదభిప్రాయముతో సవ్యంగా నేను వ్రాశిన విషయము బోధపడినట్లుగా లేదు. వీలయితే కొంతమంది బయటవారితో నేను వ్రాశినది చదివించండి. వారికి ఎలా అర్థం అవుతుందో గమనించండి. తదుపరి మీరిద్దరూ నాకంటే ఎక్కువ మేధస్సు గలవారు కనుకనే నా పదాలలో తప్పులు మీకు ద్యోతకమవుతున్నాయి. మీరిద్దరి మేధస్సు ముందు నా పాతకాలం తెలివితేటలు పనికిరావు. నేను మీలాంటి వారి దగ్గర చదువు నేర్చుకునేందుకే అంతర్జాలంలో ఉన్నాను. నేను ఎవరిని అనవసరముగా మాట అనను, అలాగే మాట పడను. ఇప్పుడు నా పదాలు తప్పుగా అర్థం అవుతున్నాయి మీకు. ఈ సందర్భముగా, న్యాయశాస్త్రము లోని తర్కశాస్త్రము ఒక విభాగము. ఇది ఒక విధంగా విచారణా విభాగము అనుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక తప్పుగా నాపదాలు అనిపించాయి, నేను సవ్యంగానే వ్రాశాను అని అంటున్నాను. ఇప్పుడు ఒకసారి విస్తారంగా ఆలోచించండి. ఇక్కడ నాకు దాదాపు అందరూ తెలిసిన వారే. అలాగే ఏనాటి నుండో పనిచేస్తున్న తెలియని వారు ఉన్నా ఎవరితోనూ సమస్యలు రాలేదు. పనిచేస్తున్న వారు తెలియని వారైనా, తెలిసిన వారైనా సరే మీరు ఇద్దరూ నాకు సూచించే "పదము" ఎప్పుడైనా వ్యక్తిగతంగా వారికి వాడితే నేను మాత్రం ఇక్కడ ఇంతకాలం పని చేయడానికి ఉండను. తదుపరి, నాకు మీరిద్దరూ ఒక పదము దానికి బదులుగా సూచించండి. రాబోయే రోజులలో ఆ పదమే వాడుటకు ప్రయత్నిస్తాను. మీరు నాకు సూచించ వలసిన పదము మీకు తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఆ "పదము" వాడుట వలన నాది తప్పు అంటున్నారు. ఇప్పుడు మీరు నాకు ""ఏ పని ఒక్కటి కూడా జీవితంలో ఇక్కడ ఛేయకుండా అప్పుడే వచ్చిన కొత్త వాడుకరి మనలాంటి వారికి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళని ఏమని అనాలంటారు ?""" ఒక కొత్త పదము సూచించండి. మీ స్పందనలకు ధన్యవాదములు.13:56, 4 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • (2) నేను ఇక్కడ కొన్ని పదాలు ఇస్తాను. మీకు తోచిన విధముగా, మీకు అర్థమయిన రీతిలో, అవకాశాన్ని బట్టి కొన్ని పదాలు పూరణ చేస్తూ, వీలయితే సందర్భాన్ని వివరించుతూ, ఇచ్చిన పదాలు మాత్రము వరుస క్రమముగా మాత్రము ఉంచి వివరంగా తెలియ పర్చండి. ఇది కేవలం హాస్యానందానికి మాత్రమే కానీ నాకు సుద్దులు చెప్పేందుకు కాదని నాకంటే మేధావులయినా మీరు దయచేసి గమనించ గలరు.
వికీ చర్చలలో పాల్గొనే ఎవరైనా ఎవరినైనా వారి సభ్యు నామంతోనో లేదా అసలు పేరుతోనే పిలిస్తే బాగుంటుంది. ఇక్కడ జరిగే సంభాషణలు నిజాయితీగా, గౌరవంగా, హుందాగా సాగితే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదో మనసులో పెట్టుకుని, పేరు బయటికి చెప్పకుండా ఆయనెవరో మీకు తెలుసు లాంటి నర్మగర్భ సంభాషణలు అంత మంచి సాంప్రదాయం కాదని నా భావన. పార్లమెంటులో భాషకు హద్దులుంటాయు కదా. ఇదీ అలాంటిదే. మేము మీ కన్నా మేథావులం లాంటి మాటలు వద్దు. నాకైతే అందులో వ్యంగ్యం ధ్వనిస్తుంది ఎందుకంటే అనుభవం రీత్యా, వయసు లో మా కన్నా మీరే పెద్దవారు. ఎవరూ ఎవరికన్నా మేథావులు కాదు. --రవిచంద్ర (చర్చ) 02:09, 5 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారు నాదీ రవిచంద్ర గారి అభిప్రాయమే. వికీలో సంభాషణలు నిజాయితీగా సాగాలి. ఇక్కడ మీరు రాసినదాంట్లో వ్యంగ్యం, ఎవరినో ఎంచుకొని దానికి గుంపుగా శూన్యంగా సంభోదిస్తూ రాయడం ఉంది. మేధావితనం అనేది జనాలతో మన నడవడిక ఎలాఉంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. సలహాలు ఇచ్చిన ప్రతివారూ మనకు మార్గదర్శకులు అనుకుంటే అసలు చర్చలు, సమస్యలు రానేరావు - సలహా ఇచ్చిన ప్రతివాడూ నాకు శత్రువు అనుకొంటేనే అసలు సమస్య. - సరే మీ దారిలోనే సలహాలు ఇచ్చేవాళ్ళను ఏమనాలి అన్నారుగా, కొత్తపదం సూచించమన్నారుగా, కొత్తది ఎందుకు - వ్యంగ్యంగా మీ వాడుక పదాన్నే పూర్తిగా రాయండి, వెదవ అనేకంటే వ్యక్తి పేరున - "వాడూకరి----- వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లు" - అని రాసి మిగతా మీరు చెప్పే సారాంశం రాయండీ. అపుడు ఎవరూ తప్పుగా అనుకోరు. గొప్పగా అనుకుంటారు...--Viswanadh (చర్చ) 02:32, 5 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు సమాధానం కొంత క్రింద ఇచ్చాను. మీ స్పందన నేను తొలగించలేదు. ఇద్దరం ఒకసారే పోస్ట్ వేసినందువలన మీది ఇక్కడ రాలేదు. పైన వ్రాశిన వాక్యాలు నాకు సరిగా అర్థం కావడము లేదు. సూటిగా వ్రాస్తే అర్థం అవుతుంది. మీ భాషా ప్రయోగాలు నాకు అర్థం కావు, నా భాష మీకు అర్థం కాదు. ఇంక చర్చలు ఎందుకు అనవసరం ఏమో అని అనిపిస్తోంది. సలహాలు ఇచ్చేవాళ్ళను ఏమనాలి అని నేను అడిగానా ? ఎక్కడ అడిగాను ? అనవసరంగా ప్రతిచర్చలోనూ మీ సొంత వాక్యాలు వ్రాసి నేను అన్నాను అని అంటారు. ఇదేం పద్ధతి ? ఎక్కడ అడిగానో ఇక్కడ పోస్టే పెట్టండి. నేను అడిగింది ఏమిటి ? మీరు అంటున్నది ఏమిటి ? అస్సలు పొంతన, సారూప్యం ఏమైనా ఉందా ? మరొక మాట, ప్రతిసారి నన్ను మీ పదాలతో దూపణ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సలహాలాగా కూడా ఉండదు. నేను ఎవరిని శత్రువులాగా చూడవలసిన అవసరము లేదు. ఇంక ముందు ఇలా నాకు వ్రాయవద్దు. ఇలాంటి సలహాలు చెప్పించుకునే స్థితి పరిస్థితిలో నేను లేను. మీకు చాలాసార్లు చెప్పాను కూడా. మీ సలహాలు, స్పందనలకు, ఇంకా ఏమైనా ఉంటే అన్నింటికీ మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 03:49, 5 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]


రవిచంద్ర గారు, నిజం అయిన వ్యక్తికి పేరు ఉంటుంది, అలాగే పిలుస్తాము. ఇక్కడ జరిగే సంభాషణలు నిజాయితీగా, గౌరవంగా, హుందాగా సాగితే బాగుంటుందనేదే నా అభిప్రాయం. మీరు ఎవరినో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారు అని నేను అనుకుంటున్నాను. నేను వ్యక్త పరచిన వ్యక్తి ఒక ఊహాజనిత వ్యక్తి. అటువంటి వారిని గురించి నేను ఎల్లప్పుడూ మాట్లాడేది. మీరన్నట్లు నేను ఫలనా వ్యక్తి తెలుసు అని చెప్పలేదు. ఎక్కడ చెప్పానండి ? ఊహాజనిత వ్యక్తి. (వారు) వికీ మరియు వాడుకరుల బాగుకోరే వారే అయితే మనకు ఈ చర్చలు ఉండవు. అసలు నేను అడిగిన సందేహం వేరు. నేను ఏ మనిషి గురించి మనసులో పెట్టుకోలేదు, చర్చించటము లేదు. నాకు ఎందుకు ఇదంతా చెబుతున్నారో అర్థం కావటం లేదు. మీరు నాకు చెప్పిన విషయాలు తెలియనివా ? నేను ఏది మాట్లాడినా చెప్పినా మీకు తప్పులు కనిపిస్తున్నాయంటే నా మీద మీకు ఎటువంటి సదభిప్రాయం లేదనే అనుకోవాలంటారా ? ఎందుకండి మనకి ఇటువంటి అనవసర చర్చలు ? వీటి వల్ల ఏమిటి ప్రయోజనం ? నేను వాడిన వెధ... పదం ఒక ఊహాజనిత వ్యక్తికి సూచించినది. దానిని పట్టుకొని నాకు ఎక్కడా ఊహించని పదాలు నాకు అందిస్తున్నారు. నా రచనా శైలి మీకు అంత తేలికగా అర్థం కాదేమో అని అనుకోవాలి. నా శైలి మొదటి నుండి ఒకటే. నేను ప్రగతి వీక్లీ, ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, విజయ మంత్లీ ..... ఇలాంటి వారికి ఆ రోజుల్లో నా రచనలు శైలి బాగా నచ్చింది. మీకు నచ్చలేదు. అందరికి నచ్చాలని లేదు. నేను అస్సలు అనుకోను. నేను ఎప్పుడూ ఎదుటివారు నాకన్నా మేధావులు అనే ఎప్పుడూ నా నిజ జీవితంలోనే ఎల్లప్పుడూ మనసులో అనుకుంటూ జాగ్రత్తగా ఉంటాను. ఇందులో వ్యంగ్యం ఏముందో నాకు తెలియడం లేదు. నా పద్ధతి అది. ఒకరి కోసం నేను నా పద్ధతి ఎలా మార్చుకుంటాను ? వయసుకు మేధావితనానికి అస్సలు సంబంధమే లేదు. మరి నా వారసుడు ప్రపంచంలోని ఎన్నో దేశాలలో తిరిగి పనిచేసి మరియు ఇప్పటికీ విదేశాలలోనే ఉంటూ ఉండటం జరుగుతున్నది. నా కన్నా పెద్ద చదువులు చదివి స్వదేశీ, విదేశీ ప్రయాణాలు నా ఇంటివాళ్ళందరికీ అటువంటి అనుభవాలు ఉన్నాయి. మరి నాకు అందులో చాలా లేవనే చెప్పాలి. నేను ఇప్పటికీ కూడా వయసులతో సంబంధం లేకుండా ఎవరి దగ్గర అయినా నేర్చుకోవాల్సిన విద్య(లు) వారిని గురువులుగానే భావించి నేర్చుకుంటూనే ఉంటాను. ఆ విధంగానే మీకు జవాబులో కొన్ని పదాలు గౌరవభావంగానే జోడించాను. అందులో మీరనుకున్నట్లు వ్యంగ్య చలోక్తి విసుర్లు లేవు. ఇంతకు ముందు ఎవరికో ఇలాగే వ్రాస్తే ఇంతలా ఈ ధోరణితో వ్రాయలేదు, కానీ ఆ చర్చ దొరికితే మీకు లింకు ఇస్తాను. నేను, నా మాటలు, నా రచనలు.ఇత్యాది మీకు అంత తేలికగా అర్థమయ్యేవి కావని మాత్రం సుస్పష్టం. మరి నేను మీ మనసు సంతోషపడే విధంగా పదాలు పట్టుకొని కూర్చుకొని వ్రాయాలంటే కాస్త సమయము పడుతుంది. అప్పటి వరకు నాకు మీరు నా గురించి ఏమీ నీతి వాక్యాలు, హితబోధనలు, మర్యాదలు నేర్పడం, విమర్శించడం లాంటివి వ్రాయక మౌనంగా ఉండి మరో విధంగా నాతో చర్చించండి. అప్పుడు మీ మనసు కుదుటపడవచ్చు. మీ స్పందనలకు ధన్యవాదములు. ఈ సమాధానము రవిచంద్ర మరియు Viswanadh గార్లకు, కూడా సరిపోతుందని అనుకుంటున్నాను. ఇంకా కావాలంటే వివరంగా ఇద్దరికీ తెలియజేస్తాను. ఏ సంగతి తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 03:06, 5 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]