ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
టెలిఫోన్ భవన్ రోడ్డు వద్ద ఉన్న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సామాజిక విజ్ఞాన కళాశాల శాఖ
రకం ప్రభుత్వ విశ్వవిద్యాలయం
స్థాపితం1964
వైస్ ఛాన్సలర్పి రాఘవ రెడ్డి
స్థానంహైదరాబాదు, తెలంగాణ
కాంపస్మెట్రోపాలిటన్ ప్రాంతం
అనుబంధాలుయు.జి.సి

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ విభజన పర్యవసానంగా ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వేరుపరచిన రాష్ట్ర విశ్వవిద్యాలయం.

చరిత్ర[మార్చు]

1964లో హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం, 1963, ప్రకారం ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న వ్యవసాయ, పశువైద్య కళాశాలను, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న బాపట్ల వ్యవసాయ కళాశాలను, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల, ఆంధ్రా పశువైద్య కళాశాల, తిరుపతిలను జూన్ 1964లో ఈ కొత్త విశ్వవిద్యాలయపు పరిధిలోకి తెచ్చారు.

1996 నవంబరు 7న దీని పేరుని ప్రముఖ రైతు నాయకుడు ఆచార్య ఎన్.జీ.రంగా పేరు మీద ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గా పేరు మార్చటం జరిగింది. డిగ్రీ కోర్సులలో ప్రవేశం 'ఎంసెట్' ఆధారంగా జరుగుతుంది.

1964, జూన్ 12న హైదరాబాదులో స్థాపించబడిన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఒ. పుల్లారెడ్డి ప్రథమ ఉపసంచాలకునిగా పనిచేశాడు. విశ్వవిద్యాలయానికి అధికారిగా 1965, మార్చి 20న అప్పటి భారత ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి ప్రారంభించాడు. 1966, జూన్ 23న ఇందిరా గాంధీ విశ్వవిద్యాలయభవన సముదాయానికి ప్రారంభోత్సవం చేసింది.

అర్ధశతాబ్ది పూర్తి చేసుకోబోతూండగా రాష్ట్ర విభజన కారణంగా, తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ భాగాలను, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరుతో వేరు చేశారు. రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం గుంటూరుకు విశ్వవిద్యాలయ కేంద్రం మార్చబడింది. నవ్యాంధ్ర రాజధానికి దగ్గరలోని తాడికొండ మండలంలోని చేరువలో ఉన్న లాం గ్రామం నుండి సేవలను అందిస్తోంది.[1]

విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సులు[మార్చు]

డిగ్రీ కోర్సులు

బి.ఎస్.సి. (వ్యవసాయం), బి.ఎస్.సి. (ఉద్యానవనం), బి.టెక్ (వ్యవసాయ ఇంజినీరింగ్), బి.వి.ఎస్.సి (పశువైద్యం), బి.ఎస్.సి. (సి.ఎ & బి.ఎమ్), బి.ఎచ్.ఎస్.సి (గృహవిజ్ఞాన శాస్త్రం), బి.టెక్ (పుడ్ సైన్సు).

పి.జి. కోర్సులు

ఎమ్.ఎస్.సి (వ్యవసాయం), ఎమ్.వి.ఎస్.సి (పశువైద్యం), ఎమ్.ఎ.బి.ఎమ్, ఎమ్.ఎస్.సి (అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ), ఎమ్.ఎస్.సి (ఎన్విరాన్ మెంటల్ సైన్సు అండ్ టెక్నాలజీ), ఎమ్.ఎస్.సి (గృహవిజ్ఞాన శాస్త్రం), ఎమ్.ఎస్.సి (పుడ్ సైన్సు అండ్ టెక్నాలజీ).

రీసెర్చ్ కోర్సులు

వ్యవసాయం, పశువైద్యం, గృహవిజ్ఞాన శాస్త్రాలలో పి.ఎచ్.డి.

పాలిటెక్నిక్ కోర్సులు

వ్యవసాయంలో డిప్లొమా, ఉద్యానవన శాస్త్రంలో డిప్లొమా, గృహవిజ్ఞాన శాస్త్రంలో డిప్లొమా.

విత్తన పరిశోధన కేంద్రం[మార్చు]

అత్యాధునిక, అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. 7 వేల కోట్లతో 14,652 చదరపు అడుగుల విస్తీర్ణంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని’ 2022, ఫిబ్రవరి 25న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించాడు. దేశంలోనే అతిపెద్దదైన ఈ కేంద్రానికి, స్విట్జర్లాండ్‌ వేదికగా కొనసాగే అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. దేశంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రెండో విత్తన పరీక్ష కేంద్రంగా ఈ పరీక్ష కేంద్ర నిలిచింది.[2][3]

అనుబంధ కళాశాలలు[మార్చు]

ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, జిల్లేళ్ళ గ్రామంలో సిరిసిల్ల వ్యవసాయ కళాశాల ఏర్పాటుచేయబడింది. 35 ఎకరాల్లో 69.50 కోట్లతో నిర్మించబడిన ఈ వ్యవసాయ కళాశాల ఇది రాష్ట్రంలోనే రెండవ వ్యవసాయ కళాశాల.

మూలాలు[మార్చు]

  1. "ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం". Archived from the original on 2019-04-13. Retrieved 2019-04-13.
  2. telugu, NT News (2022-02-25). "తెలంగాణ‌లో 'అంత‌ర్జాతీయ విత్త‌న పరీక్షా కేంద్రం' ప్రారంభం". Namasthe Telangana. Archived from the original on 2022-02-25. Retrieved 2022-02-28.
  3. "80 దేశాలకు విత్తనాల ఎగుమతులు". Sakshi. 2022-02-26. Archived from the original on 2022-02-25. Retrieved 2022-02-28.

వెలుపలి లంకెలు[మార్చు]