Jump to content

ఐరోపా

వికీపీడియా నుండి
(యూరోపు నుండి దారిమార్పు చెందింది)
ఐరోపా
ప్రపంచపటంలో యూరప్.
ప్రపంచపటంలో ఐరోపా.
విస్తీర్ణం 10,180,000 కి.మీ.² (3,930,000 చ.మై.)
జనాభా 731,000,000
జనసాంద్రత 70/కి.మీ.² (181/చ.మై.)
ca. 50
ప్రాంతీయత ఐరోపా
భాషా కుటుంబాలు ఇండో-ఐరోపా
Finno-Ugric
Altaic
Basque
Semitic
North Caucasian
పెద్ద నగరాలు ఇస్తాంబుల్, మాస్కో, లండన్, పారిస్, మాడ్రిడ్, బార్సెలోనా, సెయింట్ పీటర్స్ బర్గ్, మిలాన్, బెర్లిన్, రోమ్, ఏథెన్స్, కీవ్, బుచారెస్ట్
టైం జోన్లు UTC (ఐస్‌ల్యాండ్) నుండి UTC+5 (రష్యా) వరకు

సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. ఐరోపా భూఖండము యొక్క పశ్చిమాత్య ద్వీపకల్పము. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, ఆగ్నేయాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం , నల్లసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న కాలువలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు దిశన ఐరోపా , ఆసియా ఖండాలకు సరిహద్దులుగా ఉరల్ పర్వతాలు, ఉరల్ నది , కాస్పియన్ సముద్రం ఉన్నాయి.[1] విస్తీర్ణాన్ని బట్టి ఐరోపా, 10,180,000 చదరపు కిలోమీటర్లు (3,930,000 చ.మై) వైశాల్యముతో ప్రపంచములో రెండవ చిన్న ఖండము. ఇది 2% భూమి వైశాల్యము కలిగి ఉంది. ఐరోపా ఖండంలో దాదాపు 50 దాకా సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. కానీ వీటి కచ్చితమైన సంఖ్య ఐరోపా యొక్క సరిహద్దుల నిర్ణయాన్ని బట్టి, పూర్తిస్థాయి గుర్తింపులేని ప్రదేశాలను పరిగణనలోకి తీసుకోవటం, తీసుకోకపోవటం వంటి విషయాలపై ఆధారపడుతుంది. ఐరోపా దేశాలలో జనాభా వారిగా , వైశాల్యము వారీగా రష్యా అన్నింటికంటే పెద్దదేశం కాగా వాటికన్ అన్నింటికంటే చిన్నదేశం. 71 కోట్ల జనాభాతో ఆసియా, ఆఫ్రికాల తర్వాత ఐరోపా అత్యంత జనాభా కలిగిన ఖండము. ప్రపంచము యొక్క 11% ప్రజలు ఐరోపాలో నివసిస్తున్నారు. అయితే, ఖండము అంటే ఒక భౌగోళిక ఉనికితో పాటు, సాంస్కృతిక , రాజకీయ ఉనికిని కూడా సూచిస్తుంది కాబట్టి ఐరోపా యొక్క సరిహద్దులు , జనాభా గురించి ఏకాభిప్రాయము లేదు.

Sentiero del Viandante లోని Lierna నుండి Bellagio వైపు చూడగా కోమో సరస్సు యొక్క అత్యంత ఐకానిక్ దృశ్యం

రాజకీయ భౌగోళికం

[మార్చు]

అనేక సిద్ధాంతాలు , విపులీకరణల తరువాత ఐరోపా ఖండాన్ని భౌగోళిక , రాజకీయ ప్రాంతాలుగా వర్గీకరించారు. వీటిలో 50 దేశాలు గలవు. ఐరోపా సమాఖ్యలో 27 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి. క్రింది పట్టిక ఐక్యరాజ్యసమితి ఉపయోగిస్తున్నది.[2]

ప్రాంతము లేదా ఉప-ప్రాంతము పేరు ,
పతాకము
విస్తీర్ణం
(కి.మీ²)
జనాభా
( 2002 జూలై 1 నాటి అంచనా.)
జనసాంద్రత
(ప్రతి చ.కి.మీ.)
రాజధాని
ఆలండ్ ఆలాండ్ (ఫిన్లాండ్) 1,552 26,008 16.8 మారీహామ్న్
అల్బేనియా అల్బేనియా 28,748 3,600,523 125.2 తిరానా
అండొర్రా అండోర్రా 468 68,403 146.2 అండోర్రా లా వెల్లా
ఆస్ట్రియా ఆస్ట్రియా 83,858 8,169,929 97.4 వియన్నా
Armenia ఆర్మీనియా 29,800 3,229,900 101 యెరావాన్
అజర్‌బైజాన్ అజర్‌బైజాన్ 86,600 8,621,000 97 బాకు
బెలారస్ బెలారస్ 207,600 10,335,382 49.8 మిన్స్క్
బెల్జియం బెల్జియం 30,510 10,274,595 336.8 బస్సెల్స్
బోస్నియా, హెర్జెగోవినా బోస్నియా , హెర్జెగొవీనా 51,129 4,448,500 77.5 సరజేవో
బల్గేరియా బల్గేరియా 110,910 7,621,337 68.7 సోఫియా
క్రొయేషియా క్రొయేషియా 56,542 4,437,460 77.7 జగ్రెబ్
సైప్రస్ సైప్రస్ 9,251 788,457 85 నికోసియా
చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 78,866 10,256,760 130.1 ప్రేగ్
డెన్మార్క్ డెన్మార్క్ 43,094 5,368,854 124.6 కోపెన్‌హాగన్
ఎస్టోనియా ఎస్టోనియా 45,226 1,415,681 31.3 టల్లిన్
Faroe Islands ఫరోయె (డెన్మార్క్) 1,399 46,011 32.9 తోర్షావన్
ఫిన్లాండ్ ఫిన్లాండ్ 336,593 5,157,537 15.3 హెల్సెంకి
ఫ్రాన్స్ ఫ్రాన్సు 547,030 59,765,983 109.3 పారిస్
జార్జియా (దేశం) జార్జియా 69,700 4,661,473 64 తిబ్లిసి
Germany జర్మనీ 357,021 83,251,851 233.2 బెర్లిన్
జిబ్రాల్టర్ జిబ్రాల్టర్ (యునైటెడ్ కింగ్ డం) 5.9 27,714 4,697.3 జిబ్రాల్టర్
గ్రీస్ గ్రీసు 131,940 10,645,343 80.7 ఏథెన్సు
గ్వెర్న్సీ గెర్నెసీ 78 64,587 828.0 సెయింట్ పీటర్ పోర్ట్
హంగరీ హంగేరి 93,030 10,075,034 108.3 బుడాపెస్ట్
Iceland ఐస్‌లాండ్ 103,000 307,261 2.7 రేక్‌జవిక్
ఐర్లాండ్ ఐర్లండ్ రిపబ్లిక్ 70,280 4,234,925 60.3 డబ్లిన్
ఐల్ ఆఫ్ మ్యాన్ ఐసెల్ ఆఫ్ మ్యాన్ 572 73,873 129.1 డగ్లస్
ఇటలీ ఇటలీ 301,230 58,751,711 191.6 రోమ్
జెర్సీ జెర్సీ 116 89,775 773.9 సెయింట్ హెలియర్
కజకస్తాన్ కజకస్తాన్ 2,724,900 15,217,711 5.6 ఆస్తానా
కోసొవో కొసావో 10,887 2,126,708 220 ప్రిస్టీనా
లాట్వియా లాత్వియా 64,589 2,366,515 36.6 రిగా
లైచెన్‌స్టెయిన్ లీచెన్‌స్టైన్ 160 32,842 205.3 వడూజ్
లిథువేనియా లిథువేనియా 65,200 3,601,138 55.2 విల్నియస్
లక్సెంబర్గ్ లక్సెంబర్గ్ 2,586 448,569 173.5 లక్సెంబర్గ్ (నగరం)
మాసిడోనియా ఉత్తర మేసిడోనియా 25,333 2,054,800 81.1 స్కోప్జే
మాల్టా మాల్టా 316 397,499 1,257.9 వల్లెట్టా
మోల్డోవా మాల్డోవా 33,843 4,434,547 131.0 చిస్‌నావ్
మొనాకో మొనాకో 1.95 31,987 16,403.6 మొనాకో
మాంటెనెగ్రో మాంటెనెగ్రో 13,812 616,258 44.6 పొడ్గోరికా
నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 41,526 16,318,199 393.0 ఆమ్‌స్టర్‌డామ్
నార్వే నార్వే 324,220 4,525,116 14.0 ఓస్లో
పోలండ్ పోలెండు 312,685 38,625,478 123.5 వార్సా
పోర్చుగల్ పోర్చుగల్ 91,568 10,409,995 110.1 లిస్బన్
రొమేనియా రొమేనియా 238,391 21,698,181 91.0 బుచారెస్ట్
Russia రష్యా 17,075,400 142,200,000 26.8 మాస్కో
సాన్ మారినో సాన్‌మారినో 61 27,730 454.6 సాన్ మెరీనో
సెర్బియా సెర్బియా (కొసావోతో కలుపుకుని) 88,361 9,663,742 109.4 బెల్‌గ్రేడ్
స్లొవేకియా స్లొవేకియా 48,845 5,422,366 111.0 బ్రాటిస్లావా
స్లోవేనియా స్లొవేనియా 20,273 1,932,917 95.3 జుబ్లజానా
స్పెయిన్ స్పెయిన్ 504,851 45,061,274 89.3 మాడ్రిడ్
నార్వే స్వాల్‌బార్డ్ , జాన్
మయేన్ దీవులు
(నార్వే)
62,049 2,868 0.046 లాంగియర్‌బెన్
Sweden స్వీడన్ 449,964 9,090,113 19.7 స్టాక్‌హోమ్
స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ 41,290 7,507,000 176.8 బెర్న్
టర్కీ టర్కీ 783,562 70,586,256 93 అంకారా
ఉక్రెయిన్ ఉక్రెయిన్ 603,700 48,396,470 80.2 కీవ్
United Kingdom యునైటెడ్ కింగ్ డం 244,820 61,100,835 244.2 లండన్
వాటికన్ నగరం వాటికన్ నగరం 0.44 900 2,045.5 వాటికన్ నగరం
మొత్తం 10,180,000 731,000,000 70

ఇవి కూడ చూడండి

[మార్చు]

చార్లెస్ హర్బట్

మూలాలు

[మార్చు]
  1. Microsoft® Encarta® Online Encyclopedia 2007. ""Europe"". Archived from the original on 2007-12-14. Retrieved 2007-12-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "United Nations Statistics Division — Countries of Europe". Archived from the original on 2011-07-13. Retrieved 2008-06-10.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐరోపా&oldid=4317717" నుండి వెలికితీశారు