వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2010

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2010 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

1వ వారం


చాగల్లు కనకదుర్గమ్మ మందిరం

చాగల్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ఈ గ్రామంలో ఉన్న కనకదుర్గ ఆలయం ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: గెడ్డంబాబు
2వ వారం
సురేఖ చిత్రంచిన కార్టూను

సురేఖ పేరుతో ప్రసిద్ధి చెందిన కార్టూనిస్టు అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు. ఇతని వ్యంగ్య చిత్రాలు చక్కగా పేరుకు తగ్గట్టుగా శుభ్రంగా ఉంటాయి. బొమ్మలోని మిగిలిన వివరాలకు, పాత్రలకు సరిగ్గా సరిపోయే నిష్పత్తి ఉంటుంది. ఇతని కార్టూన్లు, తెలుగులోని అన్ని ప్రముఖ వార/మాస పత్రికలల ప్రచురింబడినాయి.

ఫోటో సౌజన్యం: సురేఖ మరియు కప్పగంతు శివరామ ప్రసాదు
3వ వారం

[[బొమ్మ:|350px|center|alt=కుందూనది వరద]] కుందేరు' (కుందూ లేక కుముదవతి) నది కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిన దిశలో ప్రవహించి కడప జిల్లా, కమలాపురం సమీపములో పెన్నా నదిలో కలుస్తుంది. 2009 నవంబరులో వరదలు సంభవించిన సమయంలోని ఫొటో ఇక్కడ చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి
4వ వారం
వరూధిని సినిమా పోస్టరు

వరూధిని, 1946లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది యస్.వి.రంగారావు తొలి చిత్రము. మనుచరిత్రములోని "వరూధిని" ఈ సినిమాలో ప్రధాన పాత్ర. ఇందులో ప్రవరాఖ్యునిగా ఎస్.వి. రంగారావు, వరూధినిగా దాసరి తిలకం నటించారు.

ఫోటో సౌజన్యం: కాసుబాబు (రూపవాణి సినిమా పత్రిక నుండి)
5వ వారం
మెండలీఫ్ స్మారక స్తూపం

ఆవర్తన పట్టికను రూపొందించిన మెండలీఫ్ స్మారకచిహ్నంగా స్లొవేకియాలోని బ్రాటిస్లావాలో "స్లోవాక్ సాంకేతిక విశ్వవిద్యాలయం"లో నిర్మించిన స్తూపం.

ఫోటో సౌజన్యం: mmmdirt మరియు Itub
6వ వారం
రామరావణ యుద్ధం

రామాయణం యుద్ధకాండలో రామ రావణ యుద్ధం వర్ణింపబడింది. ఈ కధా సన్నివేశాన్ని చూపే తంజావూరు శైలి చిత్రం - 1820 కాలానికి చెందినది.

ఫోటో సౌజన్యం: బ్రిటిష్ మ్యూజియం [1]
7వ వారం

[[బొమ్మ:|350px|center|alt=తుంగభద్ర పుష్కరాలలో జనసందోహం]] బృహస్పతి మకరరాశిలో ప్రవేశించునప్పుడు తుంగభద్ర నది పుష్కరాలు నిర్వహిస్తారు. తుంగ మరియు భద్ర రెండు నదుల కలయిక వలన కర్ణాటకలో పుట్టిన తుంగభద్రనది ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించి కర్నూలు మరియు మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల గుండా ప్రవహించి ఆలంపూర్ సమీపంలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమిస్తుంది.

ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు
8వ వారం
మొట్టమొదటి ఎక్స్-రే చిత్రం

Hand mit Ringen (ఉంగరాలు ధరించిన చేయి) - విల్హెల్మ్ రాంట్జెన్ తీసిన మొట్టమొదటి మెడికల్ ఎక్స్-రే చిత్రం. అతని భార్య చేయి. 22 డిసెంబర్ 1895న తీసింది.

ఫోటో సౌజన్యం: http://science.hq.nasa.gov/kids/imagers/ems/xrays.html
9వ వారం
పాలపిట్ట

పాలపిట్ట (Blue jay) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పక్షి.

ఫోటో సౌజన్యం: కెన్ థామస్
10వ వారం
కాబూల్‌లో లభించిన వినాయకుని శిల్పం

ఆఫ్ఘనిస్తాన్ లోని Gardez లో లభించిన ఈ వినాయకుని విగ్రహం 5వ శతాబ్దానికి చెందినది. కాబూల్ "దర్గా పీర్ రతన్ నాథ్" లో ఉంచిన ఈ విగ్రహం క్రింద ఇలా వ్రాశారు - "great and beautiful image of Mahāvināyaka" consecrated by the Shahi King Khingala

ఫోటో సౌజన్యం: TEB728
11వ వారం
చదలవాడ ఉమేష్ చంద్ర

చదలవాడ ఉమేశ్ చంద్ర (మార్చి 19, 1966 - సెప్టెంబర్ 4, 1999) ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. "కడప పులి" అను పేరు తెచ్చుకున్నాడు. నక్సలైట్లు జరిపిన కాల్పులలో మరణించాడు. ఉమేశ్ చంద్ర విగ్రహము హైదరాబాదు సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.

ఫోటో సౌజన్యం: Cephas_405
12వ వారం
నీటి బిందువు

నీటిబిందువు

ఫోటో సౌజన్యం: Michael Melgar
13వ వారం
ఫణిగిరి స్తూపంలో శిల్పం

ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక బౌద్ధక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో నల్గొండ జిల్లా, తిరుమలగిరి మండలానికి చెందిన ఫణిగిరి ఒకటి. ఇక్కడ పురాతన బౌద్ధచైత్యారామపు అవశేషాలు లభించాయి.

ఫోటో సౌజన్యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యూజియం మరియు కాసుబాబు
14వ వారం
చేనేతలో అధికంగా వాడు సాంప్రదాయక మగ్గం

చేనేతలో అధికంగా వాడు సాంప్రదాయక మగ్గం.

ఫోటో సౌజన్యం: విశ్వనాథ్.బి.కె
15వ వారం
మేడారం జాతర

మేడారం జాతర భారతదేశంలో పెద్ద ఎత్తున జరిగే గిరిజన జాతర.

ఫోటో సౌజన్యం: శేషగిరిరావు
16వ వారం
మైసూరు రాజభవనం

మైసూరు రాజభవనం అధిక సంఖ్యలో పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నది.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
17వ వారం
వెన్నూతల గ్రామంలోని శివాలయం

ఈ ఆలయం సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. 2006-07 లో పునరుద్ధరించబడింది

ఫోటో సౌజన్యం: S I V A
18వ వారం
ఆలపాటి వెంకట మోహనగుప్త కార్టూను.

ఆలపాటి వెంకట మోహనగుప్త లేదా ఏవిఎమ్ ఒక కార్టూనిస్టు. ఇతను వేసిన ఒక వ్యంగ్యచిత్రాన్ని ఇక్కడ చూడవచ్చును

ఫోటో సౌజన్యం: ఎ.వి.ఎమ్. మరియు శివా
19వ వారం
వినాయక చవితి నిమజ్జనం చూడడానికి వెళ్ళే జనం.

వినాయక చవితి పండుగ తరువాత విగ్రహాలను నిమజ్జనం చేసే సంప్రదాయం ఉంది. ముంబై నగంలోని మెరైన్ డ్రైవ్ వద్ద ఆ ఉత్సవాన్ని చూడడానికి వెళ్ళే జనం

ఫోటో సౌజన్యం: శివా
20వ వారం
పాలేరు రిజర్వాయిర్.

పాలేరు, ఖమ్మం జిల్లాలో ప్రవహిస్తుంది. ఇది కృష్ణానదికి ఉపనది. దీనిపై నిజాం ప్రభుత్వ కాలంలో ఆనకట్ట నిర్మించి రిజర్వాయరు ఏర్పాటు చేశారు. దీని క్రింద కూసుమంచి మరియు నేలకొండపల్లి మండలాలలో కొన్ని వందల ఎకరాల భూములకు నీటి వసతి కలుగుతున్నది

ఫోటో సౌజన్యం: కాసుబాబు
21వ వారం
ముప్పవరం గ్రామ సచివాలయం

సింగనముప్పవరం, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం పంచాయితీ ఆఫీసును ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: గెడ్డం బాబు
22వ వారం
పెదవేగి గ్రామ - ప్రొద్దు తిరుగుడు తీటలు

పెదవేగి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, గ్రామము. గ్రామంలో వ్యవసాయ కార్మికులు. వెనుక భాగంలో ప్రొద్దు తిరుగుడు తోటలు ఉన్నాయి

ఫోటో సౌజన్యం: కాసుబాబు
23వ వారం

[[బొమ్మ:|300px|center|alt=పాపులవీడు శివాలయం]] ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజుపల్లె గ్రామానికి కొద్ది దూరంలో పాపులవీడు వుంది. అక్కడ పురాతనమైన శివాలయం ఉంది.

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి
24వ వారం
బాల వినాయకుని స్నానం

వినాయకుడు హిందూమతంలో పూజలందుకొనే ఒక దేవుడు. 18వ శతాబ్దికి చెందిన ఈ కాంగ్రా శైలి చిత్రంలో పార్వతి, పరమేశ్వరుడు వినాయకునికి స్నానం చేయిస్తున్నారు.

ఫోటో సౌజన్యం: Martin-Dubost, Paul (1997
25వ వారం


లంబాడీ మహిళ

ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా లో నాయక్‌లు 23వ కులం,"లంబాడీ" సుగాలీ లు 29 వకులం. వీరినే లంబాడ, బంజారాలు అని కూడా అంటారు.

ఫోటో సౌజన్యం: రాజేష్ డంగి
26వ వారం
హైదరాబాదులో కరాచీ బేకరీ

హైదరాబాదు నగరంలో నిత్యం ప్రయాణించేవారికి "మొజాంజాహి మార్కెట్" వద్ద సిగ్నల్స్ ఎదురుగా "కరాచీ బేకరీ" సుపరిచితమైన స్థలం

ఫోటో సౌజన్యం: వీర శశిధర్ జంగం
27వ వారం


వదోదర మహారాజా ప్యాలెస్ మహాద్వారం.

గుజరాత్ రాష్ట్రం లోని ప్రముఖ నగరాలలో వడోదర ఒకటి. ఇది గుజరాత్ సాంస్కృతిక రాజధానిగా వర్థిల్లుతోంది. ఇక్కడి మహారాజా ప్యాలెస్ మహాద్వారం ఈ చిత్రంలో ఉంది.

ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు
28వ వారం
29వ వారం
'ఇన్ఫ్రారెడ్' ఆకాశ చిత్రం - పాలపుంత ఆవల గేలక్సీల పంపిణీ.

'ఇన్ఫ్రారెడ్' ఆకాశ చిత్రం, పాలపుంత ఆవల గేలక్సీల పంపిణీ. ఈ గేలక్సీల రెడ్-షిఫ్ట్ రంగుతో కోడ్ చేయబడినది. మహా విస్ఫోటం సిద్ధాంతాన్ని ఈ చిత్రం బలపరుస్తున్నది.

ఫోటో సౌజన్యం: Jarrett (IPAC/Caltech)
30వ వారం
31వ వారం
దేశాల సాయుధ బలగాలు

ప్రపంచంలో సాయుధబలగాల క్రమంలో దేశాలను చూపే మ్యాప్. మరిన్ని వివరాలకు దేశాల జాబితా – సైన్యం సంఖ్యను బట్టి చూడండి.

ఫోటో సౌజన్యం: కెర్మాన్ షాహి
32వ వారం
సత్యవోలు భీమలింగేశ్వరాలయము

సత్యవోలు, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ చాళుక్య శైలిలో నిర్మించబడిన భీమలింగేశ్వర, రామలింగేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందినవి.

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి
33వ వారం
జాతక కథల చిత్రీకరణ

జాతక కథలు, బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం. క్రీ.పూ 300 — క్రీ.శ 400 మధ్యలో రచించబడినట్టుగా చెప్పబడుతున్నవి. భూటాన్‌కు చెందిన ఈ చిత్రంలో జాతక కధలను చిత్రీకరించారు.

ఫోటో సౌజన్యం: Phajoding Gonpa, Thimphu, Bhutan మరియు Wmpearl
34వ వారం


యల్లాయపాలెం క్రికెట్ జట్టు

క్రికెట్, భారతదేశంలో ఒక జనప్రియమైన ఆట. నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలానికి చెందిన గ్రామము యల్లాయపాళెంలో పిల్లల క్రికెట్ జట్టు ఈ చిత్రంలో ఉన్నది.

ఫోటో సౌజన్యం: జితేష్ కుమార్
35వ వారం
కీటకాహార మొక్క - నెపెంథిస్ మిరాబిలిస్

నెపెంథిస్ మిరాబిలిస్ ఒక కీటకాహార మొక్క. దీని ఆకులే ఒక తిత్తిగా ఏర్పడి కీటకాలను పట్టుకొంటాయి.

ఫోటో సౌజన్యం: Marshman
36వ వారం


మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి ప్రతిమ

మంత్రాలయము, కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము. రాఘవేంద్రస్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది.

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
37వ వారం


కుట్టుమిషనులో కుట్టు ఎలా పడుతుంది

కుట్టు మిషను ఆధునిక యుగంలో అత్యంత సాధారణమైన పరికరం. ఇందులో లాక్ స్టిచ్ ఒక కుట్టు విధం. దీంట్లో రెండు దారాలు వాడతారు. ఒక దారం పైన ఉంటుంది. రెండవది కింద బాబిన్ లో ఉంటుంది.

ఫోటో సౌజన్యం: నికొలాయ్స్
38వ వారం
నకిరేకల్లు సెంటర్

నకిరేకల్, నల్గొండ జిల్లాకు చెందిన ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. ఇది తొమ్మిదొ నంబరు జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుండి 110 కి.మీ.ల దూరంలో వున్నది.

ఫోటో సౌజన్యం: వాడుకరి:కాసుబాబు
39వ వారం
రోడ్ షో పై జయదేవ్ కార్టూను

జయదేవ్ ఒక ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. ఇతను ఈ కార్టూనును ప్రత్యేకంగా తెలుగు వికీపీడియా కొరకు వేయడం జరిగింది.

ఫోటో సౌజన్యం: జయదేవ్ మరియు శివా
40వ వారం
రిషికేస్‌లోని లక్ష్మణఝూలా వంతెన

రిషికేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహరాడూన్ జిల్లాలోని ఒక మునిసిపాలిటీ. ఇక్కడి "లక్ష్మణ ఝూలా" అనే వంతెన ప్రసిద్ధి చెందినది.

ఫోటో సౌజన్యం: సుజాత
41వ వారం
కైకలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు

కైకలూరు, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము.
ఈ వూరిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.
42వ వారం
గిద్దలూరు ఖాదర్ వలీ స్వామి దర్గా

గిద్దలూరు, ప్రకాశం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. ఇక్కడి హజరత్ ఖాదర్ వలీ స్వామి దర్గా 157 సంవత్సరాలనాటిది.

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి
43వ వారం
కృష్ణా గోదావరీ నదులు

కృష్ణ, గోదావరి ఆంధ్ర ప్రదేశ్‌లో రెండు ముఖ్యమైన నదులు.
ఉపగ్రహం నుండి తీసిన ఈ నదుల ఛాయాచిత్రం ఇక్కడ చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: నాసా
44వ వారం
45వ వారం
శాలిహుండం స్తూపము

ఆంధ్ర ప్ర్రదేశ్‌లో అనేక బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. వానిలో శాలిహుండం ఒకటి.
శ్రీకాకుళం జిల్లా, గార మండలంలో వంశధార నది ఒడ్డున ఉన్న స్తూపాన్ని చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: మోహన్ విహారి
46వ వారం

[[బొమ్మ:|300px|center|alt=నల్లమల అడవులలో రైల్వే లైను]] నల్లమల అడవులు తూర్పు కనుమలలో ఒక భాగం. కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా మరియు కడప జిల్లాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. అడవుల మధ్యలో రైల్వేలైనును ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి
47వ వారం
గురవాయిగూడెం మద్ది వీరాంజనేయస్వామి ఆలయం

గురవాయి గూడెం, , పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ ఒక మద్దిచెట్టు మొదట్లో వెలసిన హనుమంతుని గుడిని "మద్ది వీరాంజనేయస్వామి ఆలయం" అంటారు. ఈ చిత్రంలో ఆలయంలో ఒక భాగం, మరియు పైన మద్దిచెట్టు భాగాన్ని చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: వాడుకరి:కాసుబాబు
48వ వారం
రామకృష్ణ కార్టూను

మునగపాటి శివరామకృష్ణ ఒక కార్టూనిస్టు. ఇతడు తెలుగులోనె కాక, ఆంగ్లంలోకూడ కార్టూన్లు వేయటం జరిగింది. ఇతను గీసిన ఒక వ్యంగ్యచిత్రాన్ని ఇక్కడ చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: రామకృష్ణ మరియు శివా
49వ వారం
జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద చెరువు పూడిక తీయడం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ప్రాథమికంగా దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింపచేసే దిశగా ప్రవేశపెట్టబడినది. ఈ పధకం క్రింద బి.సింగవరం గ్రామంలో చెరువు పూడిక తీస్తున్న గ్రామస్తులు.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
50వ వారం
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్

శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమ ప్రాంతాలకు సరఫరా చేసే నీటిని జలాశయం నుండి కాలువలోకి తీసుకునే నీటి నియంత్రణా వ్యవస్థే, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌. నీటి సరఫరాను నియంత్రించే వీలు కలిగిన నాలుగు తూములు ఇక్కడ ఉన్నాయి

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి
51వ వారం
రెడ్ క్రాస్ మ్యూజియం ప్రవేశం

అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం ఒక అంతర్జాతీయ మానవతావాద ఉద్యమం. ఈ సంస్థలో దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులున్నారు. జెనీవాలోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ మ్యూజియం యొక్క ద్వారం ఈ చిత్రంలో ఉన్నది.

ఫోటో సౌజన్యం: నికొలాయ్ ష్వెర్గ్
52వ వారం
శ్రీ సీతారాముల పరివారం

రామాయణం భారతదేశంలో ప్రసిద్ధ ఇతిహాసం. జీలకర్రగూడెం ఆలయంలో సీతారాముల పరివారం శిల్పాలు.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
53వ వారం


చాగల్లు కనకదుర్గమ్మ మందిరం

చాగల్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ఈ గ్రామంలో ఉన్న కనకదుర్గ ఆలయం ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: గెడ్డంబాబు