వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 58
← పాత చర్చ 57 | పాత చర్చ 58 | పాత చర్చ 59 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2018 మార్చి 2 - 2018 ఏప్రిల్ 28
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
Editing News #1—2018
[మార్చు]Read this in another language • Subscription list for this multilingual newsletter
Since the last newsletter, the Editing Team has spent most of their time supporting the 2017 wikitext editor mode, which is available inside the visual editor as a Beta Feature, and improving the visual diff tool. Their work board is available in Phabricator. You can find links to the work finished each week at mw:VisualEditor/Weekly triage meetings. Their current priorities are fixing bugs, supporting the 2017 wikitext editor, and improving the visual diff tool.
Recent changes
[మార్చు]- The 2017 wikitext editor is available as a Beta Feature on desktop devices. It has the same toolbar as the visual editor and can use the citoid service and other modern tools. The team have been comparing the performance of different editing environments. They have studied how long it takes to open the page and start typing. The study uses data for more than one million edits during December and January. Some changes have been made to improve the speed of the 2017 wikitext editor and the visual editor. Recently, the 2017 wikitext editor opened fastest for most edits, and the 2010 WikiEditor was fastest for some edits. More information will be posted at mw:Contributors/Projects/Editing performance.
- The visual diff tool was developed for the visual editor. It is now available to all users of the visual editor and the 2017 wikitext editor. When you review your changes, you can toggle between wikitext and visual diffs. You can also enable the new Beta Feature for "Visual diffs". The Beta Feature lets you use the visual diff tool to view other people's edits on page histories and Special:RecentChanges. [1]
- Wikitext syntax highlighting is available as a Beta Feature for both the 2017 wikitext editor and the 2010 wikitext editor. [2]
- The citoid service automatically translates URLs, DOIs, ISBNs, and PubMed id numbers into wikitext citation templates. It is very popular and useful to editors, although it can be a bit tricky to set up. Your wiki can have this service. Please read the instructions. You can ask the team to help you enable citoid at your wiki.
Let's work together
[మార్చు]- The team will talk about editing tools at an upcoming Wikimedia Foundation metrics and activities meeting.
- Wikibooks, Wikiversity, and other communities may have the visual editor made available by default to contributors. If your community wants this, then please contact Dan Garry.
- The
<references />
block can automatically display long lists of references in columns on wide screens. This makes footnotes easier to read. You can request multi-column support for your wiki. [3] - If you aren't reading this in your preferred language, then please help us with translations! Subscribe to the Translators mailing list or contact us directly. We will notify you when the next issue is ready for translation. కృతజ్ఞతలు!
20:56, 2 మార్చి 2018 (UTC)
వీడియో వనరుల ప్రచురణ
[మార్చు]అందరికీ నమస్కారం,
తెరపట్టు వీడియోలు ఉపయోగించి, తెలుగు వికీపీడియాలో ఎలా కృషిచేయాలో తెలియజేసేలా వీడియో వనరుల తయారీ అన్నది తెలుగు వికీపీడియా బోధన, ప్రచార వీడియో వనరులు/వీడియో వనరుల తయారీ - 2017లో భాగంగా జరుగుతూ ఉన్నది. ఈ వీడియో వనరులను దయచేసి ఉపయోగించుకోవడం కానీ, రూపకల్పనలో సూచనలు చేయడం కానీ చేయగలరు. ఈ కింది అంశాలపై వీడియోలు తయారుచేసి వికీమీడియా కామన్సులో Telugu Wikipedia tutorials అన్న వర్గంలో చేర్చుతున్నాం.
-
కొత్తపేజీని సృష్టించడం ఎలా? (రూపొందించినవారు చదువరి)
-
వాడుకరి పేజీని సృష్టించుకోవడం ఎలా?
-
ఎటువంటి మూలాలు ఇవ్వవచ్చు?
-
వికీపీడియా కంటెంట్ ట్రాన్స్ లేషన్ టూల్ గురించి స్క్రీన్ కాప్చర్ వీడియో
-
నిర్వాహకుల కోసం ఇప్పటికే ఉన్న పేజీకి మరో పేజీని ఎలా తరలించాలి
వీటిలో కొన్నిటిని సోషల్ మీడియాలో పంచుకోవడం, సదరు అంశం గురించి అడిగిన వాడుకరులకు వారి పేజీల్లో చేర్చడం వంటివి ఇప్పటికే చేస్తున్నాం. సభ్యులు నచ్చితే యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ వీటిని స్వేచ్ఛగా ప్రచురించి ఉపయోగించగలరని ఆశిస్తున్నాం, అలానే ఏవైనా సూచనలు ఉన్నా తెలియమని కోరుతున్నాం (ప్రస్తుత వెర్షన్ మీద మెరుగైన కొత్త వెర్షన్ ప్రచురించవచ్చు). ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:54, 8 మార్చి 2018 (UTC)
- ఈ క్రమంలో మరిన్ని వీడియో వనరులు, మరీ ముఖ్యంగా కొత్త వాడుకరులకు ఉపయోగపడేవి రూపొందించి ప్రచురించే ప్రయత్నం జరుగుతోంది, గతంలో వేర్వేరు ప్రయత్నాల్లో భాగంగా రూపకల్పన చేసిన వీడియో వనరులను కూడా పైన ఉన్న వర్గంలోకి తీసుకువస్తున్నాం. ఈ ప్రయత్నానికి సూచనలు, సలహాలు అందించడమే కాక, ఓ వీడియో రూపకల్పన చేసినందుకు వాడుకరి:Chaduvari గారికి ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:57, 8 మార్చి 2018 (UTC)
- ఆడియో గొంతుతో ఆ పదాలను పలికే విధంగా ఉంటే బావుండేదేమో..పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె), వాడుకరి:Chaduvari గారు నాకు ఒక ఇబ్బంది తరచుగా తలెత్తుతుంది. అది ఎక్కడైనా వికీ గురించి చెప్పాలంటే తెలుగులో మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేదు.మంచి ప్రజంటేషన్ ఉంటే ఎవరైనా ఎవరికైనా వివరించగలిగే వీలుంటుంది. అందరికీ అర్ధమయ్యేలా సులభంగా ఒకటి తయారు చెస్తే బావుంటుంది.--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 16:43, 8 మార్చి 2018 (UTC)
- విశ్వనాధ్ (Viswanadh) గారూ, మంచి సూచనలు. అయితే ముందుగా వీడియోలు, అదీ పాఠ్యం ఆధారిత వీడియోలు తయారుచేయడానికి కారణం ఏమంటే సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకునే వీడియోలు బహిరంగ ప్రదేశాల్లో చూసేవారు చాలావరకూ మ్యూట్ చేసి చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా పాఠ్యం-ఆధారిత వీడియోలు తయారుచేశాం. ఐతే మీ సూచనలు అనుసరించి ఈ వీడియోల రూపకల్పన తర్వాత ఇవే వీడియోలకు ఆడియో వివరణలు కూడా తేలికగా చేర్చి మరో వీడియోగా ప్రచురించవచ్చు, అలా చేద్దాం. ఏమంటారు! --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:06, 9 మార్చి 2018 (UTC)
- విశ్వనాధ్ (Viswanadh) గారూ, వికీపీడియాను పరిచయం చేసే ప్రజెంటేషన్ ఉంటే బాగానే ఉంటుంది. కొత్తవారు దాన్ని చూసి వికీపీడియా గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. చెయ్యగలమేమో చూద్దాం.--చదువరి (చర్చ • రచనలు) 09:24, 9 మార్చి 2018 (UTC)
- వికీపీడియా:5 నిమిషాల్లో వికీ తో మొదలుపెట్టి ఆయా సహాయా వ్యాసాలను మార్గదర్శకంగా తీసుకుని, ఒక స్టోరీబోర్డు తయారుచేసుకుని ముందుకు పోవచ్చనుకుంటా.__చదువరి (చర్చ • రచనలు) 09:28, 9 మార్చి 2018 (UTC)
- చదువరి గారు మీరు చెప్పేటట్టుగా అయితే అది నాప్రయోగశాలలో నిర్మాణంలో ఉంది. కొద్ది రోజుల్లో అది పూర్తి అవుతుంది. పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. కాని ప్రజంటేషన్ అంటే చెప్పేది కాబట్టి తక్కువ స్లైడ్స్, కొన్ని ముఖ్యాంశాలు, మద్యలో కొన్ని లింక్స్, వీడియో లింక్స్ లేదా ఆ వీడియోలు పోల్డర్స్ లో పెట్టుకొని మొత్తంగా వివరణకు సిద్దంగా (నెట్ లేకున్నా కూడా) ప్రతి ఒక్కరికీ అందుబాట్లో గూగుల్ డ్రైవ్‌లో ఉండాలనేది నా ఆకాంక్ష.. దాన్ని ఇక్కడ చర్చించడం కూడ సులభం కాదనుకుంటా. అవి ఆఫ్‌లైన్‌లో కూర్చొని చేస్తే బాగా వస్తాయనుకుంటాను. ఏదైనా సి.ఐ.ఎస్ నుండి పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) చేస్తున్న ప్రయత్నాలూ మంచివే...--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 12:05, 9 మార్చి 2018 (UTC)
- విశ్వనాధ్ (Viswanadh) గారూ! మీ సూచన అర్థమైంది. తక్కువ స్లైడ్లు, స్లైడ్లలో సమాచారం తక్కువ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండేలా ప్రజెంటేషన్లు రూపొందించుకున్నా చదువరి గారు సూచించిన 5 నిమిషాల్లో వికీ ఒక దారీతెన్ను చూపించేందుకు పనికివస్తుందని అనుకుంటున్నాను. నేనొకసారి ప్రయత్నించి పై ప్రాజెక్టులో ప్రచురిస్తాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 01:27, 10 మార్చి 2018 (UTC)
- చదువరి గారు మీరు చెప్పేటట్టుగా అయితే అది నాప్రయోగశాలలో నిర్మాణంలో ఉంది. కొద్ది రోజుల్లో అది పూర్తి అవుతుంది. పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. కాని ప్రజంటేషన్ అంటే చెప్పేది కాబట్టి తక్కువ స్లైడ్స్, కొన్ని ముఖ్యాంశాలు, మద్యలో కొన్ని లింక్స్, వీడియో లింక్స్ లేదా ఆ వీడియోలు పోల్డర్స్ లో పెట్టుకొని మొత్తంగా వివరణకు సిద్దంగా (నెట్ లేకున్నా కూడా) ప్రతి ఒక్కరికీ అందుబాట్లో గూగుల్ డ్రైవ్‌లో ఉండాలనేది నా ఆకాంక్ష.. దాన్ని ఇక్కడ చర్చించడం కూడ సులభం కాదనుకుంటా. అవి ఆఫ్‌లైన్‌లో కూర్చొని చేస్తే బాగా వస్తాయనుకుంటాను. ఏదైనా సి.ఐ.ఎస్ నుండి పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) చేస్తున్న ప్రయత్నాలూ మంచివే...--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 12:05, 9 మార్చి 2018 (UTC)
- ఆడియో గొంతుతో ఆ పదాలను పలికే విధంగా ఉంటే బావుండేదేమో..పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె), వాడుకరి:Chaduvari గారు నాకు ఒక ఇబ్బంది తరచుగా తలెత్తుతుంది. అది ఎక్కడైనా వికీ గురించి చెప్పాలంటే తెలుగులో మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేదు.మంచి ప్రజంటేషన్ ఉంటే ఎవరైనా ఎవరికైనా వివరించగలిగే వీలుంటుంది. అందరికీ అర్ధమయ్యేలా సులభంగా ఒకటి తయారు చెస్తే బావుంటుంది.--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 16:43, 8 మార్చి 2018 (UTC)
అత్యంత చురుకైన కొత్త వారి సంఖ్య భారీఎత్తున పెంచేందుకు ఒక ప్రయత్నం
[మార్చు]తెలుగు వికీపీడియా దశ దిశ మారాలంటే మరింత సంఖ్యలో కొత్తవారు తెలుగు వికీపీడియాలో చురుకైన సభ్యులు అవ్వాలన్న ఆలోచనతో, చదువరి గారు, నేనూ చేసిన చర్చల ఫలితంగా కొన్ని ప్రతిపాదనలు చేస్తూన్నాం. వీటిలో కనీసం 50 మందిగా ఏడాదికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, ఆసక్తి కలిగిన సభ్యులందరూ కొందరు కొత్తవారిని వికీదత్తత తీసుకుని గురుత్వం వహించాలని పలు ప్రతిపాదనలను ఈ చర్చ పేజీలో చేస్తున్నాం. ఈ ప్రతిపాదనపై లోతుగా చర్చించి, పట్టుదలగా, సమిష్టిగా అమలుచేయాలని ఆశిస్తున్నాం. ఐతే సహసభ్యులు ఈ అంశంపై తమ అభిప్రాయాలు, సూచనలు, భాగస్వామ్యం గురించి రాయాలని కోరుతున్నాం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 09:44, 12 మార్చి 2018 (UTC)
Galicia 15 - 15 Challenge
[మార్చు]Wikipedia:Galicia 15 - 15 Challenge is a public writing competition which will improve improve and translate this list of 15 really important articles into as many languages as possible. Everybody can help in any language to collaborate on writing and/or translating articles related to Galicia. To participate you just need to sign up here. Thank you very much.--Breogan2008 (చర్చ) 14:40, 12 మార్చి 2018 (UTC)
సంచిక ఆన్‌లైన్ పత్రికలో తెలుగు వికీపీడియా గురించి
[మార్చు]పవన్ సంతోష్ "సంచిక" ఉగాది ప్రత్యేక సంచికలో తెలుగు వికీపీడియా గురించి ఒక సమగ్రమైన వ్యాసం వ్రాశారు. అభినందనలు! ఆ వ్యాసం ఈ క్రింది లంకెలో చదవవచ్చు.
http://sanchika.com/తెలుగు-వికీపీడియా-కథ/
ఈ వ్యాసాన్ని చదివి మరికొంతమంది కొత్త వికీపీడియన్లు తయారవుతారని ఆశిద్దాం.--స్వరలాసిక (చర్చ) 01:35, 18 మార్చి 2018 (UTC)
- స్వరలాసిక గారూ! మీవంటి సాహిత్యకారుడు, వికీపీడియన్ మెచ్చుకోవడం చాలా చాలా సంతోషకరమండీ. సంచిక సంపాదకుడు కస్తూరి మురళీకృష్ణ గారి ప్రోద్బలంతో ఇలాంటి వ్యాసం రాయగలిగానండీ. నాలుగేళ్ళుగా నన్ను నిత్యం ఆకర్షిస్తూ, తనతో నడిపిస్తూన్న వికీపీడియా, వికీపీడియా సముదాయాలే రాసేందుకు స్ఫూర్తిని ఇచ్చాయి. ఐతే అన్నివిధాలా దోషరహితమని చెప్పలేను, లోటుపాట్లు ఉంటే మన్నించి, గుణాలను స్వీకరించమని పాఠకులందరినీ కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:05, 19 మార్చి 2018 (UTC)
- వికీపీడియాకు నావంతు సహాయ సహకారములు ఎల్లపుడూ అందిస్తూనే ఉంటాను. నాగురించి కొత్తవారు, తెలియని వారు ఎవరైనా వికీపీడియా నందు నాసేవలు ఒకసారి శ్రద్ధగా, మంచి మనస్ఫూర్తిగా తెలుసుకుని అర్థం చేసుకోగలరు. JVRKPRASAD (చర్చ) 07:48, 19 మార్చి 2018 (UTC)
- పవన్ సంతోష్ వ్రాసిన వ్యాసం బాగుంది. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 07:38, 5 ఏప్రిల్ 2018 (UTC)
ప్రత్యేక కథనాలకై ప్రయత్నాలు - వ్యాస శైలి, రాయదగ్గ అంశాలు
[మార్చు]తెలుగు వికీపీడియా, సోదర ప్రాజెక్టులు, సముదాయం చేస్తున్న కృషి విస్తృత తెలుగు సమాజానికి తెలిసేలా వివిధ కథనాలు, ముఖాముఖీలు ప్రచురించేలా అంతర్జాల, ప్రచురణ మాధ్యమాలకు చెందిన పలు మీడియా సంస్థలతో మేం జరిపిన సంప్రదింపులు, ప్రయత్నాలు, వాటి ప్రస్తుత పురోగతితో పాటు అసలు ప్రత్యేక కథనాల్లో తెలుగు వికీపీడియా గురించి, వికీపీడియా ఉద్యమం గురించి రాయదగ్గ అంశాలు, శైలి వంటి వివరాలతో సవివరమైన పేజీ రూపొందించాం. పరిశీలించి సూచనలు, భాగస్వామ్యం అందించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:21, 28 మార్చి 2018 (UTC)
నెలవారి ముఖాముఖి సమావేశం
[మార్చు]అందరికి నమస్కారం. ఏప్రిల్ నెలలో హైదరాబాద్ నెలవారీ సమావేశాన్ని నిర్వహించుకుందాం. అందరికి అనువుగా ఉండేందుకు రెండవ శని లేదా ఆదివారం సాయంత్రం నిర్వహించడానికి సభ్యులు సమయం చూసుకుని తమ సమ్మతిని తెలుపగలరని మనవి.--Ajaybanbi (చర్చ) 04:53, 29 మార్చి 2018 (UTC)
- అభినందనలు అజయ్ గారూ. మీరు దీన్ని నిర్వహించేందుకు ఈ క్రమంలో నా నుంచి ఏ సహకారాన్నైనా కోరవచ్చు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:49, 29 మార్చి 2018 (UTC)
- నెలవారీ సమావేశాన్ని తిరిగి పునరుద్ధరించడం బాగుంటుండి. మూడవ వారం కాకుండా ఎప్పుడైనా నేను సిద్ధం. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 08:36, 30 మార్చి 2018 (UTC)
- మళ్లీ మనం నెలవారి సమావేశాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సమావేశాల నిర్వాహణకు తమ్ముడు అజయ్ ముందుకురావడం మంచి పరిణామం. నేను కూడా సహకారాన్ని అందిస్తాను. గతంలో మాదిరిగానే మూడవ ఆదివారం నెవారి సమావేశం నిర్వహించుకుందాం. ఖైరతాబాద్ సదన్ కళాశాల ఎదురుగా ఉన్న తన ఆఫీసులో సమావేశం నిర్వహించుకోవచ్చని కశ్యప్ గారు తెలిపారు. అది అందరికి అనుకూలమైన ప్రాంతమేనని అనుకుంటున్నాను. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:27, 31 మార్చి 2018 (UTC)
- కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను రాజశేఖర్ గారి నుంచి స్వీకరించి వహిస్తున్న నేనూ, ప్రణయ్ గత కొన్ని నెలలుగా కొత్త సభ్యులు ఉత్సాహంగా స్వీకరిస్తే బావుంటుందని భావిస్తూ, కొత్త వాడుకరులను ఆ దిశగా ప్రోత్సహిస్తూ వస్తున్నాం. మొత్తానికి ఈ ప్రయత్నం ఇలా సఫలమవుతున్నందుకు చాలా సంతోషకరం. మరి వచ్చే నెలల్లో అవసరాన్ని బట్టి ముందస్తుగా రవీంద్రభారతిలో రిక్వెస్టు చేస్తే లభిస్తుంది, అలానే నిర్వహణ పరంగా ఇతర సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమే. నిరాఘాటంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని ఆశిస్తూన్నాం. --పవన్ సంతోష్ (చర్చ) 14:24, 1 ఏప్రిల్ 2018 (UTC)
- మళ్లీ మనం నెలవారి సమావేశాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సమావేశాల నిర్వాహణకు తమ్ముడు అజయ్ ముందుకురావడం మంచి పరిణామం. నేను కూడా సహకారాన్ని అందిస్తాను. గతంలో మాదిరిగానే మూడవ ఆదివారం నెవారి సమావేశం నిర్వహించుకుందాం. ఖైరతాబాద్ సదన్ కళాశాల ఎదురుగా ఉన్న తన ఆఫీసులో సమావేశం నిర్వహించుకోవచ్చని కశ్యప్ గారు తెలిపారు. అది అందరికి అనుకూలమైన ప్రాంతమేనని అనుకుంటున్నాను. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:27, 31 మార్చి 2018 (UTC)
- నెలవారీ సమావేశాన్ని తిరిగి పునరుద్ధరించడం బాగుంటుండి. మూడవ వారం కాకుండా ఎప్పుడైనా నేను సిద్ధం. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 08:36, 30 మార్చి 2018 (UTC)
AWB ఎడిట్స్ - ఒక మార్పు ప్రతిపాదన
[మార్చు]సభ్యులకు నమస్కారం. మనకు ఇటీవలి మార్పులలో నిర్వహణాపరంగా కొన్ని మార్పులను వడకట్టే అవకాశం ఉంది. అయితే వీటిలో ఒక సెక్షన్ AWB మార్పులకోసం కావాలనేది. అంటే ఇటీవలి మార్పులను వడకటుతున్నపుడు మనం కొందరి మార్పులను లేదా ఒక బాట్ లేదా కొత్త వాడుకరుల మార్పులను అలా కొన్నిటీని కావాలనుకొంటే కనబదకుండా చేయచ్చు, తిరిగి కనబడేట్టు చేయవచ్చు అలానే వీటిని కూడా ఏదో ఒక సెక్షన్ (బాట్ లేదా మనిషి)లో చేర్చగలిగితే మనకు ఇటీవలి మార్పుల పర్యవేక్షణ సులభం అవుతుందనేది. నా అభిప్రాయంపై చర్చ సాగించగలరు...విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
- బాట్ ఖాతాలు వడకట్టే వీలు ఉంది. తెలుగు వికీపీడియా సభ్యులు స్వచ్ఛందంగా వేరే ఏడబ్ల్యుబి ఖాతాలు సృష్టించుకున్నారు. ఐతే వీటికి బాట్ హోదా లేదు, ఏడబ్ల్యుబి అన్నది సెమీ-ఆటోమేటెడ్ మార్పులు చేస్తుంది కనుక బాట్ హోదా ఉండడం తగునా అన్నది చర్చనీయాంశం. ఐనా ఒక దారిలో వీటిని గుర్తించవచ్చు - ఈ మార్పులకు ఏడబ్ల్యుబి టాగ్ ఉంటుంది. దాని ఆధారంగా గుర్తించే వీలుంటుంది కాబట్టి మనం చర్చించి, వాటిని వడగట్టమని మీడియా వికీలో నివేదించే వీలుంటుందనే భావిస్తున్నాను. సహ-సభ్యులు ఏమంటారో చూద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 07:10, 30 మార్చి 2018 (UTC)
- ఇక్కడ ఒక్కరు మాత్రమే స్పందించారు. మనకు AWB మార్పులు అవాసరమే కాని వాటిని ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఇటీవలి మార్పులలో చూడటం కాస్త కష్టసాధ్యమనుకుంటాను. కనుక దీనినీ ఒక ఆప్షన్‌గా చేరిస్తే వాటిని ఇనాక్టివ్(హైడ్) చేయవచ్చు, మనకు నిర్వహణాపరంగా సులభం అవుతుంది. దీనిపై ఎక్కువ మంది స్పందిస్తే మార్పులకొరకు ప్రతిపాధన కోరవచ్చు...విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
- గతంలో నేనొక వడపోతను సృష్టించాను -AWB తో చేసిన మార్పులకు AWB అనే ట్యాగును తగిలించేందుకు. ఎంచేతనో గుర్తు లేదు గానీ.., తరువాతి కాలంలో దాన్ని అచేతనం చేసాను. దాన్ని ఇప్పుడు మళ్ళీ చేతనం చేసాను. ఇకపై AWB తో చేసిన మార్పులన్నిటికీ ఆ ట్యాగు చేరుతుంది. AWB వాడుకరి చెయ్యాల్సిందల్లా -దిద్దుబాటు సారాంశంలో "AWB" అనే మాట ఉండేలా చూసుకోవడం. అయితే..
- దీనివలన AWB మార్పులను కనబడకుండా చెయ్యలేం. కానీ వాటిని ఫలానా రంగులో హైలైటు చేసుకునే వీలుంది. పరిశీలించండి. నేను ఇప్పుడే ఒక AWB మార్పు చేసి పరిశీలించాను.__చదువరి (చర్చ • రచనలు) 01:27, 3 ఏప్రిల్ 2018 (UTC)
- ఇక్కడ ఒక్కరు మాత్రమే స్పందించారు. మనకు AWB మార్పులు అవాసరమే కాని వాటిని ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఇటీవలి మార్పులలో చూడటం కాస్త కష్టసాధ్యమనుకుంటాను. కనుక దీనినీ ఒక ఆప్షన్‌గా చేరిస్తే వాటిని ఇనాక్టివ్(హైడ్) చేయవచ్చు, మనకు నిర్వహణాపరంగా సులభం అవుతుంది. దీనిపై ఎక్కువ మంది స్పందిస్తే మార్పులకొరకు ప్రతిపాధన కోరవచ్చు...విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
సీఐఎస్-ఎ2కె జూలై 2018 - జూన్ 2019 సంవత్సర కార్యప్రణాళిక
[మార్చు]సీఐఎస్-ఎ2కె వచ్చే సంవత్సరపు కార్యప్రణాళిక సమర్పించింది. కొన్ని సంక్షిప్త విశేషాలు ఇలా ఉన్నాయి:
వచ్చే సంవత్సరం సీఐఎస్-ఎ2కె ప్రణాళిక ప్రకారం తెలుగు, మరాఠీ, పంజాబీ, కన్నడ, ఒడియా భాషలలో పనిచేయనుంది, అలాగే ప్రోగ్రాములు కేంద్రంగా సంబంధిత భారతీయ భాషల్లోనూ పనిచేస్తుంది. భాషల కేంద్రంగా పనిచేసే పూర్వపు వ్యూహం నుంచి పనిచేస్తున్న భాషలతో పాటుగా ఇతర సముదాయాలను చేర్చుకుంటూ ప్రోగ్రాములు (పథకాలు) కేంద్రంగా పనిచేసే పద్ధతిని (ఫోకస్ ప్రోగ్రామ్ ఏరియా స్ట్రాటజీ) ఈ సంవత్సరపు కార్యప్రణాళికతో ప్రారంభించనుంది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా వికీసోర్సును ముఖ్య అంశంగా తీసుకుని భారతీయ వికీసోర్సు ప్రాజెక్టులు కేంద్రంగా వికీసోర్సు కాన్ఫరెన్సు ఇండియా నిర్వహిణ ప్రారంభించనుంది. ట్రైన్-ద-ట్రైనర్ 2.0 నిర్వహించే ప్రణాళిక వేసింది. ఏ2కె వచ్చే ఏడాది ప్రణాళికను నాలుగు ప్రధాన భాగాలుగా విభజించింది. ఆయా భాగాలు అందులోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
- సమాచార అభివృద్ధి (కంటెంట్ ఎన్‌రిచ్‌మెంట్)
- వికీపీడియన్లు సమాచారం అభివృద్ధి చేయడానికి ఆధారపడదగ్గ వనరులను అందజేయడం, అందుకు ఉపకరించేలా స్కాన్ రూపంలో అందుబాటులో ఉన్న వనరుల సంచయాలకు సూచికలు వంటివి అభివృద్ధి.
- వికీసోర్సులో మరింత కార్యకలాపాల పెంపుకు వీలుగా ఆసక్తి కలిగివుండే సముదాయాలకు (సీనియర్ సిటిజన్ క్లబ్‌లు, ఆసక్తి జట్టులు, డిజిటల్‌గా భాషపై ఆసక్తి ఉన్న సముదాయాలు వగైరా) వికీసోర్సు స్ప్రింట్లు, కార్యశాలల నిర్వహణ, వగైరా
- నైపుణ్యాభివృద్ధి యత్నాలు (స్కిల్ బిల్డింగ్ ఇనిషియేటివ్స్)
- సముదాయం నైపుణ్యాలు వృద్ధి చేసే వనరులు (వీడియో, డిటిటల్ ప్రచురణలు, వగైరా) అభివృద్ధి, మహిళావరణం కార్యక్రమాల నిర్వహణ
- ఆసక్తిగల ప్రస్తుత సభ్యులకు సాంకేతికతపై మెరుగైన అవగాహనకు, సాంకేతికంగా కృషిచేయగల మీడియావికీ సాంకేతికతపైన సాంకేతిక సామర్థ్యాలు మెరుగుపరిచేలా కార్యక్రమాల నిర్వహణ వంటివి
- భాగస్వామ్యాల అభివృద్ధి (పార్టనర్‌షిప్ డవలప్‌మెంట్)
- తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం, హైదరాబాద్ విశ్వవిద్యాలయ అనువర్తిత భాషాశాస్త్రం, స్వేచ్ఛ, అనువాద అధ్యయన కేంద్రం, ఆంధ్ర లొయోలా కళాశాల, ఎన్టీఆర్ ట్రస్టు వంటి వివిధ రకాల సంస్థలు వగైరా
- నాయకత్వ అభివృద్ధి (లీడర్‌షిప్ డవలప్‌మెంట్)
- కొత్త సముదాయ సభ్యులు నిలబడేలా సముదాయం ప్రారంభిస్తున్న వికీదత్తత/వికీ గురుత్వం కార్యక్రమానికి మద్దతు, సంబంధిత కృషి.
- మహిళా వికీపీడియన్ల భాగస్వామ్యం పెంపొందేలా కృషికి మద్దతు వంటివి
పూర్తి కార్యప్రణాళిక ఇక్కడ చూడవచ్చు. ప్రణాళికలో సలహాలు, సూచనలను అందించాలని మా అభ్యర్థన. ఈ విషయమై మీరు అవసరమైతే tanveer@cis-india.org లేదా tito@cis-india.org లేదా pavansanthosh.s@gmail.comలకు సంప్రదించవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:59, 4 ఏప్రిల్ 2018 (UTC)
గమనిక: కార్యప్రణాళిక ప్రధాన భాగాలు, ముఖ్యాంశాలు ప్రతిబింబిస్తూ పేజీగా ప్రకటించినది, అత్యంత త్వరలో తెలుగులోకి అనువదిస్తున్నాం. దయచేసి సముదాయ సభ్యులు గమనించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:59, 4 ఏప్రిల్ 2018 (UTC)
2018 ఏప్రిల్ నెలలో చేపడుతున్న కార్యకలాపాల జాబితా
[మార్చు]అందరికీ నమస్కారం,
ఏప్రిల్ నెలలో సీఐఎస్-ఎ2కె కార్యప్రణాళిక అమలు విషయమై చేపడుతున్న కార్యకలాపాల జాబితా సముదాయ సభ్యులు ఇక్కడ చూడవచ్చు. దయచేసి వికీపీడియన్లు పరిశీలించాల్సిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:15, 4 ఏప్రిల్ 2018 (UTC)
విజువల్ ఎడిటర్ తో <nowiki/> అనే స్పాము
[మార్చు]ఉదాహరణ విజువల్ ఎడిటర్ మార్పు లో చూపినట్లు, లింకులు చేర్చునప్పుడు <nowiki/> అనే స్పాము పదం చేర్చబడుతున్నది. ఈ సమస్య పరిష్కరించేవరకు విజువల్ ఎడిటర్ వాడుకని ఇతరమైన వాటికి పరిమితం చేస్తే మంచిది.వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) మరింత పరిశీలించి సరిచేయటానికి సహాయపడగలరా?--అర్జున (చర్చ) 05:29, 5 ఏప్రిల్ 2018 (UTC)
- అర్జున గారూ తప్పకుండా. ఐతే చిన్న సూచన. సీఐఎస్-ఎ2కె మెటా రిక్వెస్టు పేజీలో టెక్నికల్ విభాగం క్రింద ఈ సాంకేతిక అంశాల అభ్యర్థనలు స్వీకరించి పరిష్కారానికి పనిచేస్తున్నాం. దయచేసి అక్కడ ఈ అభ్యర్థన పెట్టగలిగితే బావుంటుంది. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:13, 5 ఏప్రిల్ 2018 (UTC)
- లింకు చేర్చాను.--అర్జున (చర్చ) 07:32, 5 ఏప్రిల్ 2018 (UTC)
201803లో అధిక వీక్షణల వ్యాసాల వివరాలతో వికీప్రాజెక్టుల అభివృద్ధి
[మార్చు]వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/201803 లో అధిక వీక్షణలు గల వ్యాసాలను వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ లో తెలిపినట్లు అభివృద్ధి చేయడంలో సహకరించవలసినది. వికీసోర్స్ లో కొంతవరకు పుస్తకాలు చేరినందున, వాటిని మూలాలుగా విస్తరించడానికి కృషి చేస్తే వికీప్రాజెక్టులు అభివృద్ధి వీలవుతుంది.--అర్జున (చర్చ) 10:28, 5 ఏప్రిల్ 2018 (UTC)
- ఈ వ్యాసాలు విధ్వంసక చర్యలకు గురి అయ్యే అవకాశం ఎక్కువ. ఉదాహరణ. అందుకని ఈ వ్యాసాలను తరచూ పరిశీలించటం మంచిది.--అర్జున (చర్చ) 10:43, 5 ఏప్రిల్ 2018 (UTC)
స్పాము సహాయం వర్గం:
[మార్చు]ఏదైనా ఒక వర్గం ప్రధాన పేరుబరిలోని (వర్గం:బొతాద్ జిల్లా) వర్గం: అనే ఒక పదాన్ని కాపీ చేసి మరొకచోట పేస్ట్ చేస్తే సహాయం వర్గం: అని రెండు పదాలు పేస్ట్ అవుతున్నాయి. ఇది సమస్య అవునో కాదో, దయచేసి ఎవరైనా గమనించండి. JVRKPRASAD (చర్చ) 01:45, 8 ఏప్రిల్ 2018 (UTC)
వికీసోర్స్ మూలాలను చేర్చడం, ఎడిటర్ లోని మూసలు చేర్చు ఆదేశ వరుసతో
[మార్చు]ఇప్పుడు వికీసోర్స్ లోని పుస్తకాలకు మూలాలుగా వాడడం సులభం. సాధారణ సవరణ చేస్తున్నప్పుడు, మూలాలు చేర్చండి అనే అదేశాన్ని విస్తరిస్తే ఇంతకు ముందు మూసలతో బాటు cite wikisource అనేది కూడా కనబడుతుంది. దానితో పుస్తకం పేరు, అధ్యాయం పేరు, రచయిత పేరు, ముద్రణ సంవత్సరము, ముద్రాపకుల వివరాలు చేర్చితే లింకు చేర్చబడుతుంది. ప్రయత్నించి చూడండి. --అర్జున (చర్చ) 09:09, 8 ఏప్రిల్ 2018 (UTC)
- విజువల్ ఎడిటర్ లో ఇది పూర్తిగా పనిచేయడంలేదు, కావున సాధారణ ఎడిటర్ లో వాడండి. --అర్జున (చర్చ) 09:40, 8 ఏప్రిల్ 2018 (UTC)
అనవసర విక్షనరీ వికీసోర్స్ లింకుల తొలగింపు
[మార్చు]ఉదాహరణ(సరిచేసిన) దాని లో చూపినట్లు, అనవసరమైన విక్షనరీ, వికీసోర్స్ లింకులు చాలా వ్యాసాలలో చేర్చబడినట్లుగా (విక్షనరీ లింకుల శోధన ఫలితంతెలిసింది. వికీపీడియా నాణ్యత పెంచడానికి వీటిని బాట్ ద్వారా తొలగించాలి. విక్షనరీ లో వుండే సమాచారం స్వల్పం కాబట్టి వికీపీడియా నుండి లింకు అవసరం లేదు.స్పందనలు తెలియచేయండి--అర్జున (చర్చ) 12:32, 10 ఏప్రిల్ 2018 (UTC)
- లక్ష్యిత పేజీ సదరు ప్రాజెక్టులో ఉందనుకోండి, ఆ లింకును ఉంచెయ్యవచ్చు గదా. ఉదాహరణకు "wikt:దాక్షాయణి" పేజీ విక్షనరీలో ఉంది, వికీసోర్సులో లేదు. మొదటి లింకును ఉంచి రెండో దాన్ని తీసెయ్యొచ్చేమో. కన్యాశుల్కం (నాటకం) పేజీ చూడండి.. అందులో వికీసోర్సు లింకు లేదు. ఆ లింకు ఉండి ఉంటే, ఈ వ్యాసం చదివిన వాళ్ళకు పుస్తకం పూర్తిగా చదివే అవకాశం కలిగించి ఉండేవాళ్ళం.__చదువరి (చర్చ • రచనలు) 13:42, 10 ఏప్రిల్ 2018 (UTC)
- చదువరి, అవసరమైన వికీసోర్స్ లింకులు తొలగించాలని ప్రతిపాదించడం లేదు. కొన్ని అనువాదిత వ్యాసాలలో వికీసోర్స్ మూసలు వాడినప్పుడు భాష కోడ్ లేకపోతే, తెలుగు వికీసోర్స్ లో లేని పేజీలు చూపిస్తున్నాయి. కొన్ని వాటిని సరిచేశాను. విక్షనరీలో గల సమాచారం ప్రధానంగా అర్ధం, వికీపీడియా వ్యాసంలో తప్పుక వుంటుంది కాబట్టి, విక్షనరీకి లింకు ఇవ్వడము వలన పెద్ద ఉపయోగము లేదు కావున విక్షనరీ లింకులు తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను.--అర్జున (చర్చ) 23:51, 10 ఏప్రిల్ 2018 (UTC)
- {{wikisource}} మూసలో కోడ్ తప్పుగా ఉంది. s: అని ఉండటానికి బదులు wikisource: అని ఉంది. ఈ కారణంగా అది ఇంగ్లీషు వికీసోర్సునే చూపించేది. దాన్ని సరిచేసాను. ఇప్పుడు తెలుగు వికీసోర్సునే చూపిస్తోంది.
- విక్షనరీలో కేవలం అర్థమే కాకుండా.. నానార్థాలు, వ్యతిరేకపదాలు, ఇతర భాషల్లో పదాలూ వగైరాలు ఉంటాయి. అంచేత ఉంచెయ్యొచ్చనుకుంటాను.__చదువరి (చర్చ • రచనలు) 01:56, 11 ఏప్రిల్ 2018 (UTC)
- @చదువరి, మన విక్షనరీ నాణ్యత ఆ స్థితి లో లేదు. అయినా ఎక్కువమంది స్పందించనందున, ఈ తొలగింపు ప్రతిపాదన విరమిస్తున్నాను.--అర్జున (చర్చ) 04:34, 24 ఏప్రిల్ 2018 (UTC)
- చదువరి, అవసరమైన వికీసోర్స్ లింకులు తొలగించాలని ప్రతిపాదించడం లేదు. కొన్ని అనువాదిత వ్యాసాలలో వికీసోర్స్ మూసలు వాడినప్పుడు భాష కోడ్ లేకపోతే, తెలుగు వికీసోర్స్ లో లేని పేజీలు చూపిస్తున్నాయి. కొన్ని వాటిని సరిచేశాను. విక్షనరీలో గల సమాచారం ప్రధానంగా అర్ధం, వికీపీడియా వ్యాసంలో తప్పుక వుంటుంది కాబట్టి, విక్షనరీకి లింకు ఇవ్వడము వలన పెద్ద ఉపయోగము లేదు కావున విక్షనరీ లింకులు తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను.--అర్జున (చర్చ) 23:51, 10 ఏప్రిల్ 2018 (UTC)
Problem in typing in Telugu?
[మార్చు]I am not able to type in Telugu even I used ctrl + M.can anybody solve this?Palagiri (చర్చ) 03:54, 11 ఏప్రిల్ 2018 (UTC)
- నా కంప్యూటర్ లో సరిగానే పనిచేస్తున్నది.--Rajasekhar1961 (చర్చ) 03:56, 11 ఏప్రిల్ 2018 (UTC)
- I am not able To type?Palagiri (చర్చ) 04:10, 11 ఏప్రిల్ 2018 (UTC)
Rajasekhar1961 గార్కి మీస్పందనకు ధన్యవాదాలు. సమస్య తీరింది. భాషా అమరికలో తేడా వలన అలా జరిగింది.Palagiri (చర్చ) 04:13, 11 ఏప్రిల్ 2018 (UTC)
వికీలలో ఎడిట్లు
[మార్చు]నేను అన్ని వికీలలో కలిపి 5,00,000 ఎడిట్లు చేసినట్లుగా అవి దాటినట్లు యంత్రం చూపిస్తోంది.[4] నాతో పోటీ పడి పనిచేయండి, పెద్ద వయసును నేను అస్సలు లెక్క చేయను. తెలుగు రాజకీయాలు ఇక్కడ అవసరం లేదు.JVRKPRASAD (చర్చ) 11:52, 16 ఏప్రిల్ 2018 (UTC)
తెలుగు అడ్మిన్స్
[మార్చు]తెలుగు వికీపీడియాలో ఈ లింకు ద్వారా తెలుగు అడ్మిన్స్ యొక్క సేవలు వివరాలు తెలియజేస్తుంది. 01.01.79 తొ 16.04.18 వరకు చూస్తే, నన్ను తొలగించి సంవత్సరాలు అయినా సరే ఇంకా నేను రెండవ స్థానంలో ఉండటానికి కారణం ఏమిటో అర్థం కాని విషయం.[5] మొత్తం 46 మంది అడ్మిన్స్ లలో ప్రస్తుతం 15 మంది యాక్టివ్ మరియు 31 మంది నాన్-యాక్టివ్ లేదా నాన్-అడ్మిన్స్ అని ఉంది. ఇంతమంది అడ్మిన్‌లు ఉండి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాతో పోటీ పడి పని చేయలేని కొందరు నన్ను రెచ్చగొట్టి అడ్మిన్ నుండి తొలగించారు. కొందరు పని చేయరు వాళ్ళే పని చేసే వారిని చేయనివ్వరు మరియు చెడగొడతారు అనేది స్పష్టం. నాతో పోటీ పడి పనిచేయండి, పెద్ద వయసును నేను అస్సలు లెక్క చేయను. తెలుగు రాజకీయాలు ఇక్కడ అవసరం లేదు. నేను అడ్మిన్‌గా నా స్కోరు 941 మరియు ప్రస్తుతం నన్ను కొందరు మాజీని చేసారు.[6]JVRKPRASAD (చర్చ)
- నేను తెలుగు వికీపీడియాలో సమయాభావం మూలంగా అధికారిగా ఎక్కువగా సేవ చేయలేకపోతున్నాను. కాబట్టి నన్ను ఎవరైనా తొలగించమని మనవి. ఒక వికీపీడియన్ గా నా రచనలు మరియు ఇతర పనులు కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. మీ సహకారానికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 04:16, 17 ఏప్రిల్ 2018 (UTC)
- Rajasekhar1961 గారూ, మన వృత్తి భాద్యతలు నిర్వర్తిస్తూ తెలుగు వికీపీడియాలో స్వచ్ఛందంగా సేవచేయడానికి మనం వికీలో చేరాము. అన్నికాలాలలో అనేక గంటలు మనం పనిచేయలేక పోవచ్చు. నిరంతరం పనిచేయాలనే నియమం ఏమీ లేదు కదా. వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే మాతృభాష అయిన తెలుగు మీద ఉన్న మక్కువతో తెలుగు వికీపీడియా సభ్యత్వం తీసుకుని తరువాత నిర్వహణా బాధ్యతలు చేపట్టిన మీరు కొంత కాలం సమయాభావం వల్ల ఎక్కువ సేవలందించడంలేదని తొలగించమనడం సముచితం కాదు. మీ సేవలు తెవికీకి అవసరం. --కె.వెంకటరమణ⇒చర్చ 16:54, 17 ఏప్రిల్ 2018 (UTC)
- నన్ను తొలగించి సంవత్సరాలు అయినా సరే ఇంకా నేను రెండవ స్థానంలో ఉండటానికి కారణం ఏమిటో అర్థం కాని విషయం. అన్నారు. ప్రసాద్ గారూ! మీ మాట మీద నేను కారణాన్ని పరిశీలించి చూశాను. మీరు రెండో స్థానంలో ఉండడానికి గల కారణం 5,575 పేజీలను తొలగించడం. ఆమాటకి వస్తే తొలగించడాలు మాత్రమే పరిగణిస్తే మీరు మొదటి స్థానంలో ఉంటారు. (అర్జున గారు నిర్వాహకచర్యల్లో మొదటి స్థానం 6 వేల 3 వందల పైచిలుకు ఇంపోర్ట్‌లు చేయడం వల్ల వచ్చిందే కానీ ఆయనా ఏమీ పెద్ద తొలగింపులు చేయలేదు) అయితే మీ ఈ తొలగింపులు కూడా ఆశ్చర్యకరంగా నూటికి తొంభై శాతం మీరు సృష్టించిన పేజీలే తొలగించారు. తొలగింపు చర్యల్లో రెండో స్థానంలో 3,279 పేజీ చర్యలతో ఉన్న వాడుకరి:Kvr.lohith గారి తొలగింపుల చిట్టా పరిశీలిస్తే ఇలా కాక ఆయన ప్రధానంగా వేరే వారు పొరబాటున సృష్టించిన పేజీలు తొలగిస్తూ కూర్చోవడం వల్లనే 5000 మార్కును అందుకోలేకపోయారని తెలుస్తోంది. --పవన్ సంతోష్ (చర్చ) 06:36, 17 ఏప్రిల్ 2018 (UTC)
- వికీపీడియా అభివృద్ధికీ, గణాంకాలకు ఎటువంటి సంబంధం లేదని నా అభిప్రాయం. కొంతమంది సభ్యులు తక్కువ మార్పులతో మంచి వ్యాసాలను చేర్చడం మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. నాణ్యమైన వ్యాసాలను రాసేవారు, వికీ విధానాలకనుగుణంగా మార్పులు చేసేవారు, వికీ అభివృద్ధికి కృషిచేసేవారు, వికీని ప్రాచుర్యంలోనికి తేవడానికి సమావేశాలద్వారా విశేష కృషిచేసేవారు, మనం రాస్తున్న పుటలకు సాంకేతిక సహకారాన్నందించేవారు, మనం రాస్తున్న వ్యాసాలలో అక్షరదోషాలను సరిదిద్దేవారు, అనామక వాడుకరులు చేస్తున్న దుశ్చర్యలను పరిశీలించి త్రిప్పికొట్టేవారు, కొత్త వాడుకరులకు మార్గనిర్దేశనం చేసేవారు వికీలో ఉన్నారు. కానీ వారి గణాంకాలు తక్కువగా ఉండవచ్చు. అంతమాత్రాన వారు వికీ అభివృద్ధికి తోడ్పడలేదని ఎలా భావిస్తాము? --కె.వెంకటరమణ⇒చర్చ 16:20, 17 ఏప్రిల్ 2018 (UTC)
- గణాంకాల మోజులో పడి విపరీతంగా అనవసర దిద్దుబాట్లు చేసిన కొందరి సభ్యుల వల్ల తెవికీ దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు నిర్వాహకపనులు కూడా గణాంకాలతో పోల్చడం బాగుండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:45, 17 ఏప్రిల్ 2018 (UTC)
- వికీపీడియా అభివృద్ధికీ, గణాంకాలకు ఎటువంటి సంబంధం లేదని నా అభిప్రాయం. కొంతమంది సభ్యులు తక్కువ మార్పులతో మంచి వ్యాసాలను చేర్చడం మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. నాణ్యమైన వ్యాసాలను రాసేవారు, వికీ విధానాలకనుగుణంగా మార్పులు చేసేవారు, వికీ అభివృద్ధికి కృషిచేసేవారు, వికీని ప్రాచుర్యంలోనికి తేవడానికి సమావేశాలద్వారా విశేష కృషిచేసేవారు, మనం రాస్తున్న పుటలకు సాంకేతిక సహకారాన్నందించేవారు, మనం రాస్తున్న వ్యాసాలలో అక్షరదోషాలను సరిదిద్దేవారు, అనామక వాడుకరులు చేస్తున్న దుశ్చర్యలను పరిశీలించి త్రిప్పికొట్టేవారు, కొత్త వాడుకరులకు మార్గనిర్దేశనం చేసేవారు వికీలో ఉన్నారు. కానీ వారి గణాంకాలు తక్కువగా ఉండవచ్చు. అంతమాత్రాన వారు వికీ అభివృద్ధికి తోడ్పడలేదని ఎలా భావిస్తాము? --కె.వెంకటరమణ⇒చర్చ 16:20, 17 ఏప్రిల్ 2018 (UTC)
- నన్ను తొలగించి సంవత్సరాలు అయినా సరే ఇంకా నేను రెండవ స్థానంలో ఉండటానికి కారణం ఏమిటో అర్థం కాని విషయం. అన్నారు. ప్రసాద్ గారూ! మీ మాట మీద నేను కారణాన్ని పరిశీలించి చూశాను. మీరు రెండో స్థానంలో ఉండడానికి గల కారణం 5,575 పేజీలను తొలగించడం. ఆమాటకి వస్తే తొలగించడాలు మాత్రమే పరిగణిస్తే మీరు మొదటి స్థానంలో ఉంటారు. (అర్జున గారు నిర్వాహకచర్యల్లో మొదటి స్థానం 6 వేల 3 వందల పైచిలుకు ఇంపోర్ట్‌లు చేయడం వల్ల వచ్చిందే కానీ ఆయనా ఏమీ పెద్ద తొలగింపులు చేయలేదు) అయితే మీ ఈ తొలగింపులు కూడా ఆశ్చర్యకరంగా నూటికి తొంభై శాతం మీరు సృష్టించిన పేజీలే తొలగించారు. తొలగింపు చర్యల్లో రెండో స్థానంలో 3,279 పేజీ చర్యలతో ఉన్న వాడుకరి:Kvr.lohith గారి తొలగింపుల చిట్టా పరిశీలిస్తే ఇలా కాక ఆయన ప్రధానంగా వేరే వారు పొరబాటున సృష్టించిన పేజీలు తొలగిస్తూ కూర్చోవడం వల్లనే 5000 మార్కును అందుకోలేకపోయారని తెలుస్తోంది. --పవన్ సంతోష్ (చర్చ) 06:36, 17 ఏప్రిల్ 2018 (UTC)
- రాజశేఖర్ గారూ ఈ సందేశానికి స్పందించకూడదని అనుకున్నాను. ఎందుకంటే ఇది అర్థం లేనిది. కానీ ఇంతమంది నిర్వాహకులుండగా మీరు అంతర్మథనానికి లోనై ఉన్నట్లున్నారు కాబట్టి చెబుతున్నాను. వికీ అంటేనే స్వేచ్ఛ. అంటే మన పనులు చేసుకుంటూ మనకిష్టం వచ్చిన సమయంలో మన సేవలను అందించడం. వికీ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించనంతవరకూ ఎవరు ఎన్ని అనుకున్నా అంటే పట్టించుకోనవసరం లేదు. మీ కృషి కొనసాగిస్తూ వెళ్ళండి అంతే. రవిచంద్ర (చర్చ) 17:21, 17 ఏప్రిల్ 2018 (UTC)
- మనం చేసిన కృషి వల్ల ఎన్ని వ్యాసాలు మెరుగయ్యాయి. మనం కృషిచేసిన వ్యాసాల్లో ఎన్నిటిని మొదటి పేజీ ప్రదర్శన స్థాయిలో చేయగలిగాం. మనం రాసిన ఎన్ని విశేషాలు మీకు తెలుసా?లో చోటుచేసుకున్నాయి. ఎన్ని నాణ్యతలేని వ్యాసాలను మనం ఆమూలాగ్రం సంశోధించి మెరుగుచేయగలిగాం లాంటి లెక్కలు వేసుకోవడం కొంతలో కొంత మేలు. కాపీహక్కుల ఉల్లంఘనలు, అక్షరదోషాలు, శైలీ సమస్యలు, పాక్షికత సమస్యలు లేకుండా ఉన్నతమైన నాణ్యత అందించే వ్యాసం ఒక్కటి రాయగలిగినా చాలు. "నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు" అన్నట్టుగా. అన్నిటికీ మించి "ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి" అని 4వ మూల స్తంభం చెప్తున్న విషయాన్ని గుర్తించడం ముఖ్యం. --పవన్ సంతోష్ (చర్చ) 18:33, 17 ఏప్రిల్ 2018 (UTC)
- గణాంకాలు కేవలం సూచికలు మాత్రమే. ఎవరు ఏమాత్రపు విలువైన పని చేసారో గణాంకాలు చెప్పవు. పవన్ సంతోష్ గారు గణాంకాల మేడిపండును పగలగొట్టి చూపనే చూపారు. కె.వెంకటరమణ గారు చెప్పినట్టు గణాంకాలు వివరించలేని విలువైన పనులు ఎన్నో ఉన్నాయి. Rajasekhar1961 గారూ, వెంకటరమణ గారు, రవిచంద్ర గారు సరిగ్గా చెప్పారు. మనం ఇక్కడ స్వచ్ఛందంగా పని చెయ్యడానికొచ్చాం. వీలున్నప్పుడే చేద్దాం, విలువైన పనే చేద్దాం. ఎవరో ఏదో అనుకున్నారని నిర్ణయాలు తీసుకోవద్దు సార్. __చదువరి (చర్చ • రచనలు) 01:55, 18 ఏప్రిల్ 2018 (UTC)
- అడ్మిన్ అనేవాడు నెల జీతం మీద పనిచేస్తాడు కనుక అడ్మిన్ తప్పని సరిగా డ్యూటీ అవర్స్‌లో సొంత పని చేయరాదు. రోజులో తప్పని సరిగా ఎనిమిది గంటలు పనిచేయాలి. ఈ మద్య బయోమెట్రిక్ పద్దతి ప్రవేశపెట్టి వేలిముద్ర వేయిస్తున్నారు కనుక దానిని కూడా ఇక్కడ అడ్మిన్ కొరకు ప్రవేశపెట్టాలని నా గట్టి డిమాండ్... దీనికి నాకు అందరూ మద్దతు తెలపాలి(తెలపకపోతే కఠిన చర్యలు తీసుకోబడును)..--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 03:10, 18 ఏప్రిల్ 2018 (UTC)
- కొంతమందిని తొలగించేందుకు నేను ప్రతిపాదిస్తాను. నన్ను ఎలా, ఎటువంటి పద్ఢతులలో తొలగించారో, ఏ విధానాలు అవలంభించారో, అనామక వాడుకరులుతో చర్చలు, ఇలా అనేక విధానలతో వికీలలో నా జీవితకాలంలో చేసిన మంచి పనులకు గండి కొట్టారో అదేవిధంగా ఇతర వాడుకరులతో చేయిస్తాను అని మనసులో బాగా ఉంది. నేను ప్రతిపాపదిస్తే వ్యతిరేకంగా ఉండే వారు 10-20 మంది ఉంటే అంతకంటే ఎక్కువమంది మద్ధతుతో ఓటింగ్ చేసి తొలగించాలని ఉంది. నాతో పెట్టుకుని, నన్ను హింస పెట్టిన వారిని జీవితకాలంలో వదిలి పెట్టకూడదు, ఎవరినీ వదిలే సమస్య లేదు అని మనసు అందరికీ చెప్పమంటోంది. తొలగింపు ప్రతిపాదన ప్రతిదీ ఆమోదించే బాధ్యత అధికారులతో అవుతుంది. నన్ను అధికారులు కనీసం ఎకాఎకీగా నిర్వాహకునిగా నియమించవచ్చు. అదీ ఇంతవరకు చేయలేదు. నన్ను నిర్వాహక పదవి నుండి కొద్దికాలం తొలగించమన్నాను. ఎవరు ఏది వ్రాసినా జరిగిన చర్చలు మొత్తం పుస్తకరూపంలో ప్రతిదీ వచ్చిన తదుపరి, ప్రతి వాళ్ళ సంగతి ప్రజలకు తెలుస్తుంది. నేను నిర్వాహకునిగా అసలు ఏమీ చేయలేదని వ్రాస్తున్నారు, అదీ బయటకు వస్తుంది. నేను కేవలం గణాంకాలు కోసం పని చేసే వాడిని కాదని ఎన్నో లక్షలసార్లు చెప్పాను, మనిషికి ఎందుకు అర్థ్దం కాదో మరి. నేను దరిద్రపు చండాలపు చర్చలు వల్ల వికీలో చాలా కాలం నుండి పని చేయటం బాగా తగ్గించాను. కాని అప్పుడప్పుడు చేస్తున్న అసలు పని చేసే వాళ్ళు అరుదుగా ఉన్నారు. పాత బ్యాచ్ లోని కొందరి దాష్టీకాలు తగ్గాలి. వాళ్ళు లేనప్పుడే వికీ పని బాగా జరిగింది. వికీ పేరుతో స్వంత వ్యాపారాలు, సొమ్ము తినటం, ఇలా అనేకం తప్పుడు విధానాలు జరుగుతున్నాయి అని ప్రజలు అనుకుంటున్నారు. వికీ అనేది బారతదేశ చట్టాలకు పని చేయదని అంటున్నారు. ఇందులోని ప్రతి సమాచారం మొత్తం బయట పెట్టి వాడుకోవచ్చు అనే సంగతి తెలియనట్లు ఉంది. ప్రజలు నిర్ణయం ఎలా ఉంటుంది అనేది వేచి చూస్తే మంచిది. కొన్ని వందల మంది కొంతమందిని తొలగించాలని అంటే తొలగించకుండా ఉంటారా ? నన్ను కలుపుకు పోకుండా కొంతమంది నా మీద మానసిక హింస దాడి చేస్తూ ఉంటే మరికొంత మంది వత్తాసు పలకటం ఎంత కాలం సాగుతుంది ? నా మీద వేసిన బురద మొత్తం మరియు మరి కొంత కలిపి వేసే రోజులు ఎంతో దూరంలో లేవని, నాకంటే ఘోరంగా కొంతమందికి జరగటం ఖాయం అని మనసు చెబుతోంది. ఎవరు తక్కువ ఇక్కడ ? ఎవరు వికీకి ఎంత సేవ చేస్తున్నారో ప్రజలకి తెలుసు. ఎకసెక్కాలు ఇతరుల మీద చేసే రోజులు కావు, ఎవడు ఊరుకోడు. తెలుగు సినిమా ప్రస్తుత రోజులలో ఎలా ఉందో అలాగే తెవికీ కూడా చాలా విషయాలలో ఏమీ తీసిపోదు అన్నటుగా ఉందని జనాలు అనుకుంటున్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరినీ అనాల్సిన అవసరం లేదు. ఎవడి ఖర్మకు వాడిని వదిలి వేయడమే ఉత్తమం. మంచి మాటలు ఎవరికీ నెత్తికెక్కవు. కొంతమంది నన్ను ఎన్ని అనుకునా నాకు ఊడేది ఏముంటుంది ? ఇవాళో రేపు నేను చచ్చిపోయే వాడిని, నాకు ఎవరో నీతులు చెప్పనవసరం లేదు. ఈ తరం అయిన తదుపరి రాబోయే 50 సం.లో వచ్చే వాడుకరులకు ఎవరు ఎలాంటి వారు అనేది వారు నిర్ణయం చేస్తారు. నేను వికీకి సంబంధించి అడ్డదారులు, నిలువుదారులు, దరిద్రపు పనులు చేయను. నాకు వచ్చిన సమస్య కేవలం కొంతమంది వ్యక్తుల నడవడి, ప్రవర్తన, సభ్యత, సంస్కారాల వల్లనే కాని వికీకి సంబంధించినది కాదు. అందుకే వికీలో పని చేస్తునే ఉంటాను. ఎప్పటికైనా ద్రోహ బుద్ధి కలవారు ఎక్కువకాలం ఏ వికీలో మనలేరు. ఇది సత్యం.JVRKPRASAD (చర్చ)
- అడ్మిన్ అనేవాడు నెల జీతం మీద పనిచేస్తాడు కనుక అడ్మిన్ తప్పని సరిగా డ్యూటీ అవర్స్‌లో సొంత పని చేయరాదు. రోజులో తప్పని సరిగా ఎనిమిది గంటలు పనిచేయాలి. ఈ మద్య బయోమెట్రిక్ పద్దతి ప్రవేశపెట్టి వేలిముద్ర వేయిస్తున్నారు కనుక దానిని కూడా ఇక్కడ అడ్మిన్ కొరకు ప్రవేశపెట్టాలని నా గట్టి డిమాండ్... దీనికి నాకు అందరూ మద్దతు తెలపాలి(తెలపకపోతే కఠిన చర్యలు తీసుకోబడును)..--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 03:10, 18 ఏప్రిల్ 2018 (UTC)
- Rajasekhar1961 గారూ, మన వృత్తి భాద్యతలు నిర్వర్తిస్తూ తెలుగు వికీపీడియాలో స్వచ్ఛందంగా సేవచేయడానికి మనం వికీలో చేరాము. అన్నికాలాలలో అనేక గంటలు మనం పనిచేయలేక పోవచ్చు. నిరంతరం పనిచేయాలనే నియమం ఏమీ లేదు కదా. వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే మాతృభాష అయిన తెలుగు మీద ఉన్న మక్కువతో తెలుగు వికీపీడియా సభ్యత్వం తీసుకుని తరువాత నిర్వహణా బాధ్యతలు చేపట్టిన మీరు కొంత కాలం సమయాభావం వల్ల ఎక్కువ సేవలందించడంలేదని తొలగించమనడం సముచితం కాదు. మీ సేవలు తెవికీకి అవసరం. --కె.వెంకటరమణ⇒చర్చ 16:54, 17 ఏప్రిల్ 2018 (UTC)
- వాడుకరి:Rajasekhar1961 గారూ! మిగిలిన వికీప్రాజెక్టులకు ఇంత సమయాన్ని కేటాయిస్తూ కూడా ఏప్రిల్ నెలలో వికీసోర్సు పుస్తకాలకు వికీపీడియాలో వ్యాసాలు రాశారు. ఈ నెల మొదట్లోనూ నిర్వాహకత్వ చర్య చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా వికీపీడియా మౌలిక సూత్రాలకు, పాలసీలకు వ్యతిరేకంగా పోయే మనిషి కాదు. సాధ్యమైనంతవరకూ వికీపీడియా నాణ్యత, భాగస్వామ్యం పెంచాలనే ప్రయత్నిస్తూంటారు. మీ వంటి వారి సేవలు వికీపీడియాకు అవసరం. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొమ్మని మనవి. --పవన్ సంతోష్ (చర్చ) 09:43, 18 ఏప్రిల్ 2018 (UTC)
పుస్తకం.నెట్‌లో తెలుగు వికీసోర్సు గ్రంథం ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి
[మార్చు]పుస్తకం.నెట్‌లో తెలుగు వికీసోర్సు ప్రదర్శిత గ్రంథం - ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి ప్రచురితమైంది. తెలుగువారి వెయ్యేళ్ళ జీవనచిత్రం - ఆంధ్రుల సాంఘిక చరిత్ర (వికీసోర్సు ప్రదర్శిత గ్రంథాలు) అన్న శీర్షికతో ఈ వ్యాసం ప్రచురించారు.
పుస్తకం.నెట్ 2009లో ప్రారంభమై నేటికీ అంతర్జాలంలో పుస్తకప్రియులకు, పాఠకులకు ప్రియమైన వేదికగా కొనసాగుతున్న ఇ-మ్యాగజైన్. పుస్తకం.నెట్ ప్రపంచ సాహిత్యంపై పుస్తకప్రియుల వ్యాఖ్యానాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో అందించే అంతర్జాలపత్రిక.పుస్తకాల పై సమీక్ష, విమర్శ, పరిచయ వ్యాసాలే కాక రచయితలతో ఇష్టాగోష్టి, ప్రచురణకర్తలతో, పుస్తకవిక్రేతలతో మాటా-మంతీ, పుస్తకప్రియత్వాన్ని చాటి చెప్పే వ్యాసాలెన్నో చోటు చేసుకుంటాయి. వికీసోర్సును పుస్తకప్రియులకు చేరువచేయడానికి మంచి వేదిక.
ఈ వ్యాసాన్ని ఒక నమూనాగా పనికివచ్చేలా మలచడం జరిగింది. మొదట కొంత భాగం ఆ పుస్తకంలో పాఠకులకు ఆసక్తి కలిగే వాక్యాలను ఏర్చికూర్చాను (ఇది పుస్తకాన్ని బట్టి చేయాలి), తర్వాత భాగం నేరుగా వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/ఆంధ్రుల సాంఘిక చరిత్రలో పరిచయం పాఠ్యాన్ని అతికొద్ది మార్పులు చేసి ప్రచురించాను. పుస్తకానికి వికీసోర్సు లంకె ఇచ్చాను. పుస్తకం గురించి మరో వ్యాసం విడిగా వ్రాయగలిగినా ఇలా ఒక నమూనా తయారుచేస్తే ఆసక్తి ఉన్న వికీపీడియన్లు ఎవరైనా అనుసరించడానికి వీలుగా ఉంటుందని చేశాను. ప్రదర్శిత గ్రంథాల గురించే కాదు మరి ఏ వికీసోర్సు పుస్తకం గురించైనా ఇలా రాయవచ్చు. పుస్తకంలో ఆసక్తికరమైన ఒక భాగాన్ని నేరుగా ప్రచురించనూ వచ్చు, తద్వారా పాఠకుల ఆసక్తిని మనవైపుకు లాగవచ్చు. ఉదాహరణకు సహస్ర దళ పద్మం - హైదరాబాద్ అంటూ సలాం హైదరాబాద్ నవలలోని కొంతభాగాన్ని చాన్నాళ్ళ క్రితం పుస్తకంలోనే రచయిత అనుమతితో నేను ప్రచురించడాన్ని గమనించండి.
వికీసోర్సులోని పుస్తకాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా రాస్తానంటే వీలైనంత సాయం చేయడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. పుస్తకం.నెట్‌కు రాయడానికి ఇక్కడ చూడొచ్చు. నేను మీ ప్రయత్నంలో సహకరించాలనుకుంటే చర్చ పేజీలో కానీ, pavansanthosh.s@gmail.comకి మెయిల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:01, 17 ఏప్రిల్ 2018 (UTC)
మండల కేంద్రం వ్యాసంలో జనగణన ద్వారా చేర్చదగ్గ సమాచారం
[మార్చు]మండలంలోని గ్రామాలు, సౌకర్యాలు, ప్రజల వృత్తులు వంటి అంశాల గురించి కొంతమేరకు సమాచారాన్ని జిల్లాల సెన్సెస్ హ్యాండ్‌బుక్ ఉపయోగించి చేర్చవచ్చు. ఈ మేరకు ఒక మండల వ్యాసాన్ని నమూనాగా తీసుకుని రెంజల్#మండల_గణాంకాలు వద్ద అభివృద్ధి చేయడం జరిగింది. నోట్స్, మూలాలు వంటివి ఇచ్చి సమాచారాన్ని సమర్థించడం జరిగింది. సముదాయ సభ్యులు ఒకసారి దీనిని పరిశీలించి అభిప్రాయాలు, సూచనలు తెలియజేయగలరు. తద్వారా భావి కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:47, 17 ఏప్రిల్ 2018 (UTC)
తెలుగు వికీపీడియా అంచనా కోసం ఒక రీడింగ్ లిస్టు
[మార్చు]తెలుగు వికీపీడియా నాణ్యత, సాగుతున్న దిశ, జరిగిన అభివృద్ధి, లోటున్న అంశాలు వంటివి అంచనా వేసేందుకు సముదాయ సభ్యులకు కానీ, బయట ఉన్న ఆయా రంగాల నిపుణులకు కానీ ఒక రీడింగ్ లిస్టు ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. అటువంటి జాబితా తయారీ కోసం అనుసరించవచ్చని ప్రతిపాదిస్తున్న విధానాలు ఇవి:
- ప్రాతిపదిక: ఈవారం వ్యాసం జాబితా.తెలుగు వికీపీడియన్లు ఈవారం వ్యాసంగా వారానికి ఒక్కో వ్యాసాన్ని ప్రదర్శిస్తూ, పదేళ్ళకు పైగా నిర్విరామంగా తెలుగు వికీపీడియా సముదాయం కొన్ని మౌలిక సూత్రాలను (కనీసం 5 కిలోబైట్లు, ఒక బొమ్మ ఉండాలని, అనువాదం చేయాల్సిన భాగాలు, ఇదే రూపంలో ఇప్పటివరకూ విశేష వ్యాసంగా ప్రదర్శింపబడి ఉండకూడదనీ) అనుసరించి 550 పైచిలుకు వ్యాసాలను ప్రదర్శించాం. వీటినే తీసుకోవచ్చని ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే ఇది తెలుగు వికీపీడియాలో అత్యుత్తమ వ్యాసాల జాబితా కాదు (కొన్ని అత్యుత్తమ వ్యాసాలు ఉండవచ్చు, ఈవారం వ్యాసం నిబంధనలు కచ్చితంగా అత్యుత్తమ వ్యాసం అని నిశ్చియించే విధంగా ఉండవు), తెలుగు వికీపీడియా ప్రదర్శించవచ్చు అనుకున్న వ్యాసాల జాబితా. కాబట్టి వీటి నాణ్యత పరిశీలించడం, అసలు వీటిలో ఏయే అంశాలున్నాయో, ఏవేవి లేవో చూడడం మంచి ప్రయత్నమే అవుతుంది.
- జాబితాలో విభాగాలు: చదివేవారి సౌకర్యం కోసం మాత్రమే కాదు, విస్తృతమైన అవగాహన కోసం కూడా ఈ జాబితాలోని వ్యాసాలను విభాగాలు విభజించుకోవాలి. అందుకు వ్యక్తులు (పౌరాణిక కాల్పనిక వ్యక్తులు సహా), చరిత్ర, భౌగోళికం, కళలు, తత్త్వం-మతం, నిత్యజీవితం-మానసిక-మానవ విజ్ఞాన శాస్త్రం, సమాజం-సామాజిక శాస్త్రం, జీవశాస్త్రం-ఆరోగ్యం, భౌతికశాస్త్రాలు, సాంకేతికత (కొత్త ఉపకరణాలే కాదు, మొత్తం మానవ సాంకేతికత అంతా), గణితశాస్త్రం అన్న విభాగాలుగా విభజిద్దామని ప్రతిపాదిస్తున్నాను. ఈ విభాగాలకు మళ్ళీ ఉప విభాగాలు ఉంటాయి. ఒక ఉదాహరణ కోసం వికీపీడియా:చదవదగ్గ వ్యాసాల జాబితా, వికీపీడియా:చదవదగ్గ వ్యాసాల జాబితా/వ్యక్తులు అన్నవి చూడండి.
- ఏం చేయవచ్చు?: ఈ జాబితాలోని వ్యాసాలను పరిశీలించి సాధారణంగా వికీపీడియాలో మంచి వ్యాసాల్లోనూ కనిపిస్తున్న లోటుపాట్లేమిటో గ్రహించవచ్చు, తెలుగు వికీపీడియా వ్యాసాలను స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రాధాన్యత గ్రహించిన బయటి నిపుణుల నుంచి వీటిపై అభిప్రాయాలు, విశ్లేషణ, పరిశోధనలు స్వీకరించవచ్చు, ఈ ప్రదర్శిత వ్యాసాలు అభివృద్ధిలో పాలుపంచుకున్న (ఎక్కువ బైట్లు చేర్చిన) వికీపీడియన్లను ప్రతీ వ్యాసానికి జాబితా వేసుకుని వారికి తాము చేసిన కృషి ఎంత చక్కనిదో తెలిసేలా చేయవచ్చు, ఇతరులను ఈ వ్యాసాల మీద సమిష్టిగా పనిచేయమని కోరవచ్చు, అలా పనిచేయడానికి పనికివచ్చే మూలాలు తెచ్చి పెట్టుకోవచ్చు - ఇలాంటి పనులకు ఇవి పనికివస్తాయని భావిస్తున్నాం. మరింక ఎన్నో చేయవచ్చని ఆశిస్తున్నాం.
దయచేసి ఈ విషయంపై ఆసక్తి గల సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయగలరు. ప్రతిపాదిత విషయాలను తగురీతిన చర్చించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:26, 20 ఏప్రిల్ 2018 (UTC)
స్వాగత సందేశాలలో లోపాలు
[మార్చు]కొంతమంది సీనియర్ వికీపీడియనులు కొత్తగా చేరినవారికి స్వాగత సందేశాలను సరిగా పంపడంలేదు. స్వాగత సందేశాలను వాడేటపుడు ట్వింకిల్ ఉపకరణం వాడితే సరిపోతుంది. లేదా {{subst:welcome}} అని చర్చాపేజీలో చేర్చి భద్రపరిస్తే సరిపోతుంది. ప్రస్తుతం భాస్కరనాయుడు గారు అనేక సందేశాలలో ఉపకరణాలను, మూసలను వాడకుండా స్వాగత సందేశ సమాచారాన్ని చేరుస్తున్నారు. ఆ క్రమంలో చేసే లోపాల వల్ల కొన్ని చర్చాపేజీలలో "సహాయం" మూస చేతనమై, మీరు సందేశాలు చేర్చిన వాడుకర్లందరూ సహాయం కోరబడుచున్నవారిగా రచ్చబండలో సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలు లోకి చేరిపోతున్నవి. ఈ లోపాన్ని వాడుకరికి తెలియజేయడమైనది. అదే విధంగా ఈ రోజు స్వాగత సందేశాలు సంతకం లేకుండా ఉన్నవి. ఈ విషయాన్ని కూడా తెలియజేసాను. కానీ తరువాత వాడుకరులకు కూడా ఇటువంటి స్వాగత సందేశాలు పెడుతున్నారు. కనుక ఎవరైనా వారికి తగు రీతిలో స్వాగత సందేశాలు చేర్చే విధానాన్ని తెలియజేగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 10:13, 23 ఏప్రిల్ 2018 (UTC)
పనిచేయని DLI లింకులను Archive.org లింకులతో మార్చుట
[మార్చు]నేను బాట్ సాయంతో పనిచేయని DLI తెలుగు పుస్తకాలు లింకులను Archive.org లింకులతో మార్చాను. మొత్తం 1001 పేజీలలో DLI లింకులు శుద్ధి చేయబడినవి. యాంత్రిక మార్పులో జరిగిన కొన్ని దోషాలు సరిదిద్దాను. ఏవైనా మిగిలివుంటే నా దృష్టికి తీసుకురండి లేక సరిదిద్దండి. మరింత సమాచారంకోసం వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు_సమాచారం_అందుబాటులోకి#లింకులు_అర్కైవ్.ఆర్గ్_కి_మళ్లించడం చూడండి. --అర్జున (చర్చ) 05:43, 25 ఏప్రిల్ 2018 (UTC)
ఈ వారం వ్యాస పరిగణనలు
[మార్చు]ప్రస్తుతం ఈ వ్యాస పరిగణల వర్గంలో శుద్ధి చేయబడని గూగుల్ అనువాదం వ్యాసాలు, మూలాలు లేని వ్యాసాలు, చిత్రాలు లేని వ్యాసాలు, వికీకరణ చేయని వ్యాసాలు, తక్కువ పరిమాణం గల వ్యాసాలు ఉన్నాయి. ఈ వారం వ్యాసంగా ప్రచురిద్దామంటే ఆ వ్యాసాన్ని శుద్ధి చేయవలసి వస్తున్నది. ప్రస్తుతం అటువంటి వ్యాసాలను ఈ వర్గం నుండి తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం. మనలో కొంతమంది ప్రస్తుతం నాణ్యత కలిగిన వ్యాసాలు రాస్తున్నందున, ఇది వరకు ఉన్న వాడుకరులు రాసిన నాణ్యమైన వ్యాసాలు ఉన్నందున ఆ వ్యాసాలను గుర్తించి వాటి చర్చా పేజీలలో "ఈవావ్యా" మూసను ఉంచితే బాగుంటుంది. ప్రాజెక్టు టైగర్ పోటీలో ఉన్న నాణ్యమైన వ్యాసాలను కూడా చేర్చవచ్చు. ప్రస్తుతం ఈ వర్గంలో ఉన్న ఈ వారం వ్యాసంగా పరిగణించబడుతున్న వ్యాసాల నాణ్యతను పరిశీలించి ప్రచురణకు అర్హమైనవి కానివాటిని తొలగించడమే మంచిదని భావిస్తున్నాను.--కె.వెంకటరమణ⇒చర్చ 15:57, 25 ఏప్రిల్ 2018 (UTC)
- కె.వెంకటరమణ గారు, మీ అభిప్రాయము సమంజసంగా ఉన్నది.JVRKPRASAD (చర్చ) 01:02, 26 ఏప్రిల్ 2018 (UTC)
- కె.వెంకటరమణ గారి సూచనతో నేను ఏకీభవిస్తున్నాను.__02:09, 26 ఏప్రిల్ 2018 (UTC)
- వెంకటరమణ గారూ, నాణ్యత లేని వ్యాసాలను ఈ వారం వ్యాసంగా పరిగణించి ఉంటే నిరభ్యంతరంగా తొలగించండి. ఎందుకు ఈ వ్యాసాన్ని పరిగణించలేదో టూకీగా రెండు వాక్యాలు రాయండి. వ్యాసాన్ని రాసినవారు, ప్రతిపాదించిన వారు తెలుసుకుంటారు.రవిచంద్ర (చర్చ) 06:16, 26 ఏప్రిల్ 2018 (UTC)
- ఈవారం వ్యాసం పరిగణనలో ప్రస్ఫుటమైన నాణ్యతా సమస్యలతో ఉన్న వ్యాసాలను విడిగా జాబితావేసి వాటిపై నిర్ణయం తీసుకునేందుకు మీకు సహాయకారిగా ఉండేందుకు క్వైరీలు నడిపే ప్రయత్నం చేస్తున్నాం. అతికొద్ది రోజుల్లో ఈ ప్రయత్నంపై అప్డేట్ ఇస్తాను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 01:26, 28 ఏప్రిల్ 2018 (UTC)
- వెంకటరమణ గారూ, నాణ్యత లేని వ్యాసాలను ఈ వారం వ్యాసంగా పరిగణించి ఉంటే నిరభ్యంతరంగా తొలగించండి. ఎందుకు ఈ వ్యాసాన్ని పరిగణించలేదో టూకీగా రెండు వాక్యాలు రాయండి. వ్యాసాన్ని రాసినవారు, ప్రతిపాదించిన వారు తెలుసుకుంటారు.రవిచంద్ర (చర్చ) 06:16, 26 ఏప్రిల్ 2018 (UTC)
2017 లో అత్యధిక వీక్షణల పట్టిక
[మార్చు]తొలిసారిగా సంవత్సరం మొత్తంలో ఎక్కువ వీక్షణలు గల పేజీలు మరియు గత సంవత్సరంలో వాటి రాంకు వివరాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/average pageviews trends/2017 లో చేర్చాను. తొలిగా విశ్లేషణ చేస్తే మొదటి పది స్థానాలలో జాతీయ స్థాయి ప్రముఖులు, తెలుగు, తెలంగాణా వున్నాయి. తెలుగు వ్యక్తులలో సినారె, పివి సింధు, కెసిఆర్ తొలిగా వున్నారు.2017లో సినారె మరణం కొంత వరకు ప్రభావితం చేసివుండవచ్చు. పివి సింధు వ్యాసం బాగుంది. కృషి చేసిన రవిచంద్ర మరి ఇతర సభ్యులకు ధన్యవాదాలు. దీనిని ఈ వారం వ్యాసంగా పరిగణించవచ్చు. విహరిణిలో తెలుగు సహాయం పేజీ 52 స్థానాలు తగ్గి 85 వ స్థానంలో వుంది. మొబైల్ వినియోగం ఎక్కువకావడంతో, మరియు విహరిణిలలో తెలుగు సమస్యలు అంతగా లేకపోవడం కారణం కావొచ్చు. 102 స్థానంలో వున్నది. మీరు చూసి మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఆసక్తిగల వారు వ్యాసాలను వర్గాల వారీగా విశ్లేషించితే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే ఆయా చర్చా పేజీలలో రాయండి.--అర్జున (చర్చ) 16:41, 27 ఏప్రిల్ 2018 (UTC)
పది సంవత్సరాలు పూర్తి చేసుకొన్న ఈ వారం వ్యాసం
[మార్చు]నా విశ్లేషణలో 2017 22 వారం తో ఈ వారం వ్యాసం శీర్షిక 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఇది తెలుగు వికీపీడియాలో మైలు రాయి. దీనికొరకు ప్రధానంగా కృషి చేసిన user:K.Venkataramana, user:కాసుబాబు, user:Arjunaraoc,user:రవిచంద్ర గార్లకు మరియు సహకరించిన సహ వికీపీడియన్లకు అభివందనలు. మరింత విశ్లేషణ కొరకు తాజా గణాంకాల విశ్లేషణ లింకు చూడవచ్చు.--అర్జున (చర్చ) 23:56, 27 ఏప్రిల్ 2018 (UTC)
- ఇది మంచి మైలురాయి. అభినందనలకు, పునస్సమీక్షకు, పరిశీలనకు ఈ మైలురాయి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. ముందుగా ఈ వారం వ్యాసాలను ఏర్చికూర్చే కృషి చేసిన వెంకటరమణ, కాసుబాబు, అర్జున, రవిచంద్ర గార్లకు, సహాయం అందించిన ఇతర సభ్యులకు ధన్యవాదాలు, అభినందనలు. అర్జున గారు చక్కని విశ్లేషణ చేసినందుకు, ఈ మైలురాయిని సముదాయం దృష్టికి తీసుకువచ్చినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇటీవలే తెవికీ ఈవారం వ్యాసాలుగా ప్రదర్శించినవాటిని కొన్ని విభాగాలుగా, ఉపవిభాగాలుగా విభజిస్తూ ఒక రీడింగ్ లిస్టు తయారుచేసి, వాటిపై పరిశీలనలు, విశ్లేషణలకు ఆహ్వానం పలికే ప్రతిపాదనా చేశాం. అంతేకాక, ఈవారం వ్యాసాలుగా ప్రదర్శించిన వ్యాసాల్లో ప్రతీ వ్యాసానికి దానిపై ఎక్కువగా కృషిచేసిన మొదటి ముగ్గురు వికీపీడియన్లనూ జాబితా వేసి వాడుకరులు ఉపయోగించుకునేందుకు వీలుగా అందించే ప్రయత్నమూ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈవారం వ్యాసాలుగా ప్రదర్శించేవాటి నాణ్యత పెంపుకు, వాటిలో మరింత సమిష్టి కృషికీ, ఈవారం వ్యాసాలకు కృషిచేయడాన్ని ఒక విలువగా నిలబెట్టేందుకు మరిన్ని ప్రయత్నాలు చేయాలని ఆలోచన. దయచేసి ఈ అంశంపై సభ్యులు స్పందించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 01:24, 28 ఏప్రిల్ 2018 (UTC)