శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అష్టోత్తర శత నామ స్తోత్రాలలో లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ అష్టోత్తర శత నామ స్తోత్రం నామావళి వలె ఉంటుంది. స్తోత్రం అనేది పద్యం అయితే, నామావళి పేరు పేరునా దేవుని పిలిచినట్లు ఉంటుంది. ప్రతి నామానికి ముందు ఓమ్ అనే ప్రణవ మంత్రము, చివర నమః అనే ఆత్మ సమర్పణా చరణము ఉంటాయి. మిగిలిన దేవతల నామావళిలో ఆత్మ సమర్పణా చరణమైన నమః ఒక సారి మాత్రమే ఉంటే,లలితా అష్టోత్తరం లో నమో నమః అని రెండు పర్యాయాలు వస్తుంది.


ధ్యాన శ్లోకమ్[మార్చు]

సిన్దూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్

తారానాయక శేఖరాం స్మిత ముఖీం ఆపీన వక్షోరుహామ్

పాణిభ్యామళిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిబ్రతీం

సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామమ్బికామ్