Jump to content

అన్నవరం

అక్షాంశ రేఖాంశాలు: 17°16′55″N 82°24′20″E / 17.28194°N 82.40556°E / 17.28194; 82.40556
వికీపీడియా నుండి
అన్నవరం
అన్నవరం దేవాలయ సముదాయంలో సౌర గడియారం
అన్నవరం దేవాలయ సముదాయంలో సౌర గడియారం
పటం
అన్నవరం is located in ఆంధ్రప్రదేశ్
అన్నవరం
అన్నవరం
అక్షాంశ రేఖాంశాలు: 17°16′55″N 82°24′20″E / 17.28194°N 82.40556°E / 17.28194; 82.40556
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ
మండలంశంఖవరం
విస్తీర్ణం3.24 కి.మీ2 (1.25 చ. మై)
జనాభా
 (2011)[1]
6,865
 • జనసాంద్రత2,100/కి.మీ2 (5,500/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,458
 • స్త్రీలు3,407
 • లింగ నిష్పత్తి985
 • నివాసాలు1,835
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533406
2011 జనగణన కోడ్587054

అన్నవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రం శంఖవరం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప నగరం తుని నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై తుని నగరం నుండి 18 కి.మీ, కాకినాడ కు 45 కి.మీ., రాజమహేంద్రవరం నుండి దాదాపుగా 80 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషను విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో ఉంది.

సుప్రసిద్ద పుణ్యక్షేత్రం

[మార్చు]

అన్నవరం, శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం అన్నవరం లోని రత్నగిరి కొండపై 1891లో నిర్మించారు. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఇచ్చట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపానది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయములో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండా కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసుకొంటూ ఉండటం ఒక ప్రత్యేకత. ఇది చూచి తీరవలసిన సుందర దృశ్యం. ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం) వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అని అంటారు.భారతదేశంలో ఇది ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

స్థలపురాణం

[మార్చు]
అన్నవరం ప్రధాన దేవాలయ దృశ్యం.
అన్నవరంలో రత్నగిరి పర్వత శ్రేణి.

స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి కొండ, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దూరు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు ఇతనికి, రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియ, మఖ నక్షత్రం, గురువారం నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారం ప్రతిష్టించి సేవించుం" అని చెప్పి మాయమయ్యారని కథనం

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1835 ఇళ్లతో, 6865 జనాభాతో 324 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3458, ఆడవారి సంఖ్య 3407. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 269 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 5. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587054[2].పిన్ కోడ్: 533406.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,187. ఇందులో పురుషుల సంఖ్య 3,147, మహిళల సంఖ్య 3,040, గ్రామంలో నివాసగృహాలు 1,366 ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల  ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల కాకినాడలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కాకినాడలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల జగ్గంపేటలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు కాకినాడలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

అన్నవరంలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. 10 మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]
అన్నవరం రైల్వే స్ఠేషను

అన్నవరంలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి.లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.జాతీయ రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం ఉంది. జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

అన్నవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 21 హెక్టార్లు
  • చెరువులు: 98 హెక్టార్లు

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

అన్నవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 55 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 4 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 264 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 145 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 119 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

అన్నవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, p. 252, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులు

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=అన్నవరం&oldid=4324004" నుండి వెలికితీశారు