అక్షాంశ రేఖాంశాలు: 19°30′N 76°45′E / 19.500°N 76.750°E / 19.500; 76.750

పర్భణీ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్భణీ జిల్లా
परभणी जिल्हा
మహారాష్ట్ర పటంలో పర్భణీ జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో పర్భణీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనుఔరంగాబాద్
ముఖ్య పట్టణంParbhani
మండలాలు1. Parbhani, 2. Gangakhed, 3. Sonpeth, 4. Pathri, 5. Manwath, 6. Palam, 7. Sailu, 8. Jintur, 9. Purna
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Parbhani(shared with Jalna District) based on (Election Commission website)
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం6,511.58 కి.మీ2 (2,514.14 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం18,35,982[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత75.22%
 • లింగ నిష్పత్తి940
అక్షాంశ రేఖాంశాలు19°30′N 76°45′E / 19.500°N 76.750°E / 19.500; 76.750
Websiteఅధికారిక జాలస్థలి
పర్భాని నగరంలో మరాఠ్వాడా నుండి స్వాతంత్ర్య సమరయోధుల స్మారక చిహ్నం

మహారాష్ట్ర రాష్ట్రంలోని 37 జిల్లాలలో పర్భిణీ జిల్లా ఒకటి. ఇది ఒకప్పుడు " ప్రభావతీనగర్ " అని పిలువబడేది. పర్భిణీ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. పర్భిణీ జిల్లా మరాఠ్వాడా డివిజన్‌లోని 8 జిల్లాలలో ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,527,715. నగరప్రాంతంలో నివసిస్తున్న వారి సంఖ్య 31.76%.

చరిత్ర

[మార్చు]

1596 నుండి 1724 వరకు ప్రస్తుత జిల్లా ప్రాంతంలోని అధికభాగం మొఘల్ సామ్రాజ్యంలోని బేరర్ సుబా లోని పత్రి, వాశిమ్ పరగణాలలో (సర్కార్) ఉండేది. 1724లో శేఖర్‌ఖేడా యుద్ధం తరువాత ఇది హైదరాబాదు నిజాం పాలనలోకి వచ్చింది. 1956లో రాష్ట్రాల పునర్విభజన తరువాత మరాఠ్వాడాలోని ఇతర జిల్లాలతో పర్భిణీ ప్రాంతం కూడా బొంబాయి రాష్ట్రంలో భాగం అయింది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రం రూపుదిద్దుకున్న తరువాత ఇది మహారాష్ట్రలో భాగం అయింది.[2]

భౌగోళికం

[మార్చు]

జిల్లా 18.45 నుండి 20.10, ఉత్తర అక్షాంశం 76.13 నుండి 77.39 వరకు విస్తరించి ఉంది. మరాఠ్వాడా భూభాగం మొత్తం హైదరాబాదు రాజ్యంలో భాగంగా ఉండేది. 1956లో రాష్ట్రాల పునర్విభజన జరిగిన తరువాత ఇది బొంబాయి రాష్ట్రంలో భాగం అయింది. 1960 తరువాత ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో భాగం అయింది.

సరిహద్దులు

[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులో హింగోలి జిల్లా, బుల్ఢానా జిల్లా, తూర్పు సరిహద్దులో నాందేడ్ జిల్లా, హింగోలీ జిల్లా, దక్షిణ సరిహద్దులో లాతూర్ జిల్లా పశ్చిమ సరిహద్దులో బీడ్ జిల్లా, జాల్నా జిల్లా ఉన్నాయి.

ప్రయాణ వసతులు

[మార్చు]

జిల్లాకు పశ్చిమంలో రాష్ట్ర రాజధాని ముంబయి ఉంది. పర్భణీ రహదారి మార్గాలతో మహారాష్ట్ర, పొరుగున ఉన్న తెలంగాణ ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానితమై ఉంది.

రైలుమార్గం

[మార్చు]

పరధ్వాడాలో కోస్తా ఆంధ్రాను మరాఠ్వాడాతో కలిపే రైల్వే జంక్షన్ ఉంది. ఇది మరాఠ్వాడా జొన్నల భండాగారంగా పేరుపొందింది. పరధ్వాడాలో "మరాఠ్వాడా వ్యవసాయ విశ్వవిద్యాలయం " ఉంది.

విభాగాలు

[మార్చు]

జిల్లా వైశాల్యం 6250 చ.కి.మీ.

  • జిల్లాలో 9 ఉపవిభాగాలు, తాలూకాలు ఉన్నాయి : పర్భణీ, గంగాఖేడ్, సొంపెథ్, పథ్రి, మంవత్, పాలం, సెలూ, జింతూర్, పూర్ణా.

జనాభా

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం పర్భాని జిల్లాలో 1,835,982 జనాభా ఉంది,[3] ఇది కొసావో దేశానికి[4] లేదా అమెరికా రాష్ట్రమైన నెబ్రాస్కాకు[5] సమానం. ఇది భారతదేశంలో 259 వ ర్యాంకును ఇస్తుంది (మొత్తం 640 జిల్లాలలో).[3] జిల్లాలో జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 295 మంది (760 / చదరపు మైళ్ళు). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 20.18%. పర్భానీలో ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు. అక్షరాస్యత 75.22%.

జిల్లాలో

[మార్చు]

జిల్లాలో మరాఠీ, ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన అంధ్ భాష దాదాపు 1,00,000 వాడుకలో ఉన్నాయి.[6]

అంజనా పర్వతం

[మార్చు]

జిల్లా ఈశాన్యభాగంలో జింటూర్ తాలూకాలో అజంతా పర్వతశ్రేణి సాగుతూ ఉంది. వీటికి దక్షిణంలో బాలాఘాట్ పర్వతాలు ఉన్నాయి. జిల్లా సముద్రమట్టానికి 357 మీ.ఎత్తులో ఉంది.

సన్యాసుల భూమి

[మార్చు]

పర్భణి జిల్లాకు సన్యాసుల భూమి అనే పేరు ఉంది. జానాబాయి వంటి పలువురు సన్యాసులతో ఈ జిల్లాకు సంబంధం ఉంది. జిల్లాలోని బోరిలో ప్రముఖ గణిత శాస్త్రఙడు భాస్కరబట్టు జన్మించాడు. పర్భణి నగరానికి సమీపంలో ఉన్న సేలూ వద్ద సాయిబాబా 12 సంవత్సరాలు తన గురువు వద్ద నివసించాడు. సేలూకు సమీపంలోని పథారి సాయిబాబా జన్మస్థలం ఉంది. అక్కడ జరిగిన విషాద సంఘటనల తరువాత సాయిబాబా సేలూకు చేరుకుని అక్కడ బాబాసాహెబ్‌ను కలుసుకున్నాడు. జిల్లాలో గోదావరి నది ప్రవహిస్తుంది. నదీతీరం వెంట పలు ఆలయాలు ఉన్నాయి. వాటిలో ముద్గల్ వద్ద ఉన్న ముద్గలేశ్వర్ ఒకటి. దస్తాపూర్ వద్ద మరోటీ మహరాజ్ (కీర్తంకర్) నివసించాడు.

ముద్గలేశ్వర్

[మార్చు]

ముద్గలేశ్వర్ ఆలయం గోదావరి తీరంలో ఉంది. ఇది నది మధ్యభాగంలో ఉంటుంది. నదీప్రవాహం మద్యనిర్మించబడిన ఈ ఆలయం ప్రవేశద్వారంలో ఉన్న శిలాశాసనాల ఆధారంగా 900 సంవత్సరాల పూర్వం నాటిదని భావిస్తున్నారు. నదీతీరంలో ఆలయసమీపంలో నిర్మించబడిన స్నానఘట్టం 250 సంవత్సరాల పూర్వం నాటిదని భావిస్తున్నారు. నరసింహస్వామి తన భార్య మహాలక్ష్మితో ఇక్కడ శివరూపంలో ఉన్నాడని నరసింహ స్వామితో ఆలయంలో మౌద్గల్యుడు ఆయన భార్య జాబాలాబాయి ఉన్నారని భక్తులు విశ్వసిస్తున్నారు. వర్షాకాలంలో ఈ ఆలయం నీట మునుగుతుంది. భక్తులు ఈది వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయదర్శనానికి ఫిబ్రవరి - జూన్ అనువైన సమయం. ఇక్కడకు చేరడానికి పర్భిణీ, పర్లి వైద్యనాధ్ నుండి రైలు సౌకర్యం ఉంది. ఆలయనిర్వ్హణా బాధ్యతలను సాహెబ్రావ్ ముద్గల్కర్, సుభాష్రావ్ ముద్గల్కర్ వహిస్తున్నారు. ఆలయంలో అన్ని పూజలు నిర్వహించబడతాయి. నాగబలి, సుఖశాంతి పూజలు ప్రధానమైనవి. శిరాత్రి రోజు ఆలయంలో విశేష పూజలు నిర్వహించబడతాయి. గోదావరి నది మీద సరికొత్త ఆనకట్ట నిర్మించబడింది. సమీపకాలంలో ఇక్కడ దత్తాత్రేయ ఆలయం నిర్మించబడింది.

ఆలయాలు

[మార్చు]
  • పర్భణీ నగరంలో ప్రఖ్యాత పరదేశ్వరాలయం ఉంది. ఇక్కడ పాదరస శివలింగం ఉంది. మరాఠీ భాధలో పాదరసం అంటే " పారద " అని అర్ధం.
  • జైనులకు నేమగిరి పవిత్ర ప్రదేశం. ఇక్కడ భగవాన్ పరస్వంత్ అద్భుతశిల ప్రయిష్ఠించబడి ఉంది. నల్లరాతితో చెక్కబడిన ఈ శిల్పం 6 అడుగుల ఎత్తు ఉంది. ఇక్కడ భగవాన్ నేమినాధ్, భగవాన్ శాంతినాథ్‌ల అద్భుత శిల్పాలు ఉన్నాయి. ఈ ప్రదేశం శాంత్ సాయిబాబా జన్మస్థలం.
  • లోహిగ్రాం :- ఇది ఒక విహార ప్రాంతం.
  • సోనాపేట్ తాలూకాలో ఉన్న షెల్గావ్ వద్ద విష్ణాలయం ఉంది. ఇది కాశితో సమానమైన పుణ్యక్షేత్రంగా భావించబడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "Parbhani District : Census 2011 data". Retrieved 9 October 2012.
  2. "Chapter 2-History". Parbhani District Gazetteers, Government of Maharashtra. 1967.
  3. 3.0 3.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Kosovo 1,825,632 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341
  6. M. Paul Lewis, ed. (2009). "Andh: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

బయటి లింకులు

[మార్చు]