భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సంస్థ
భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ (Indian Science Congress Association) భారతదేశానికి చెందిన శాస్త్రీయ సంస్థ. 1914లో కలకత్తా ప్రధానకేంద్రంగా ఏర్పడింది. దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనేది ఈ సంస్థ ఉద్దేశం. ఇది ప్రతియేటా జనవరి మొదటి వారంలో దేశం లోని ఏదేని ఒక పట్టణంలో సమావేశ మౌతుంది. మొదటి జాతీయ సైన్స్ సమావేశం 1914లో జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 2008లో జరిగిన విశాఖపట్నం సమావేశంతో కలిపి 95 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశం ఆంధ్ర ప్రదేశ్లో జరగడం ఇది 9 వ పర్యాయం.
లక్ష్యాలు
[మార్చు]- దేశంలో శాస్త్ర పురోగతికి, విస్తృతికి కృషిచేయడం,
- ప్రతి సంవత్సరం దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో సమావేశాలు నిర్వహించడం,
- శాస్త్రాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం,
- సమావేశ కార్యక్రమాన్ని, చిరు పుస్తకాలను, కార్యకలాపాలను ప్రచురించడం.
ప్రారంభం
[మార్చు]20 వ శతాబ్దపు ప్రారంభంలో బ్రిటీష్ పాలన కాలంలో రసాయన శాస్త్రవేత్తలైన జె.ఎల్.సిమన్‌సన్, పి.ఎస్.మెక్‌మోహన్ అనే ఇద్దరు బ్రిటీషర్ల చొరవ ఫలితంగా భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ రూపుదిద్దుకొంది. బ్రిటీష్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ తరహాలో భారతదేశంలోనూ ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే సంకల్పం వారిరువురినీ పురికొల్పింది. వారి కృషి ఫలితంగా ఏర్పడిన సదస్సు ఏటా సమావేశాలను నిర్వహిస్తూ 95 వసంతాలను గడిపి శతకం దిశగా దూసుకుపోతోంది.
వార్షిక సమావేశాలు
[మార్చు]ప్రతియేటా జనవరి 3న దేశంలోని ఏదో ఒక ప్రాంతంలోిది సమావేశం కావడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఈ సమావేశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తాడు. దేశ విదేశాల నుంచి అనేక శాస్త్రవేత్తలు దీనిలో పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రముఖ వ్యక్తి లేదా శాస్త్రవేత్త అధ్యక్షత వహిస్తాడు. 1914లో జరిగిన తొలి సమావేశానికి కలకత్తా (నేటి కోల్కత) విశ్వవిద్యాలయం కులపతి అశుతోష్ ముఖర్జీ అధ్యక్షత వహించాడు. 1976లో వాల్తేర్లో జరిగిన సమావేశానికి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ అధ్యక్షత వహించాడు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1947లో అధ్యక్షత వహించాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, శాంతి స్వరూప్ భట్నాగర్, మహలనోబిస్, కస్తూరీ రంగన్]], ఎం.జి.కె.మీనన్, పి.సి.రాయ్ మొదలగు ప్రముఖులు కూడా అధ్యక్షత వహించినవారే. 1973లో ఈ సమావేశపు వజ్రోత్సవ సమావేశాలు, 1988లో ప్లాటినం జూబ్లీ సమావేశాలు జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత విదేశీ శాస్త్రవేత్తల భాగస్వామ్యం పెరిగింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ మొదలగు దేశాల శాస్త్ర సంస్థలు ఈ సమావేశాలకు ప్రతినిధులను, శాస్త్రవేత్తలను పంపుచున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు
[మార్చు]95 సంవత్సరాల సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో 9 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్లో నిర్వహింపబడ్డాయి. తొలి సారిగా 1937లో హైదరాబాదులో నిర్వహింపగా, స్వాతంత్ర్యానంతరం 1954, 1967లలో మళ్ళీ హైదరాబాదే వేదిక అయింది. 1976లో విశాఖపట్నంలోనూ, 1979లో హైదరాబాదులో, 1983లో తిరుపతిలో నిర్వహించగా, 1998, 2006 మళ్ళీ హైదరాబాదులో జరిగింది. 2008లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదిక అయింది. మొత్తంపై ఆంధ్రప్రదేశ్‌లో మూడు పట్టణాలలో మాత్రమే సైన్స్ కాంగ్రెస్ సదస్సులు జరిగాయి. హైదరాబాదులో అత్యధికంగా 6 సార్లు సమావేశాలు జరగగా, విశాఖపట్నంలో 2 సార్లు, తిరుపతిలో ఒక సారి జరిగింది.
భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులు
[మార్చు]104వ సమావేశం 2017 జనవరి 3to7 ప్రవేశం: తిరుపతి {శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ} అధ్యక్షా వహించినది: నారాయణస్వామి బి
105వ సమావేశం 2018 మార్చి 16 to 20 ప్రదేశం: మణిపూర్ {ఇంపాల్ యూనివర్సిటీ} అధ్యక్షత వహించినది: అచ్యుత్ సమంత్
106 సమావేశం 2019 ప్రవేశం: పంజాబ్ {జలంధర్} అధ్యక్షత వహించినది: రంగప్ప
107 వ సమావేశం ప్రదేశం: బెంగళూరు కర్ణాటక
108 వ సమావేశం
2021 జనవరి 3 to 7
ప్రవేశం పూణే
అధ్యక్షత వహించినది: విజయలక్ష్మి సక్సేనా