1924
Appearance
1924 గ్రెగోరియన్ కాలెండరు లీపు సంవత్సరం.
సంవత్సరాలు: | 1921 1922 1923 - 1924 - 1925 1926 1927 |
దశాబ్దాలు: | 1900లు 1910లు 1920లు 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మే 4: 8వ వేసవి ఒలింపిక్ క్రీడలు పారిస్‌లో ప్రారంభమయ్యాయి.
- మే 7: అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్‌చే బంధించబడ్డాడు.
జననాలు
[మార్చు]- జనవరి 10: ధూళిపూడి ఆంజనేయులు, ఆంగ్ల రచయిత, సంపాదకులు. (మ.1998)
- జనవరి 16: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు. ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (మ. 2015)
- జనవరి 22: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛిత్రకారుడు. (మ.2012)
- మార్చి 5 : గణపతిరాజు అచ్యుతరామరాజు, న్యాయవాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారులు. (మ.2004)
- ఏప్రిల్ 8: కుమార్ గంధర్వ, సంగీత విద్వాంసుడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు. (మ.1992)
- మే 12: షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు (మ.1999)
- మే 25: అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)
- జూన్ 2: పర్సా సత్యనారాయణ, కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (మ.2015)
- జూన్ 3: ఎం.కరుణానిధి, తమిళనాడు ముఖ్యమంత్రి.
- జూన్ 8: డి.రామలింగం, రచయిత. (మ.1993)
- జూన్ 11: అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (మ.2002)
- జూన్ 15: ద్వారం భావనారాయణ రావు, ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు. (మ.2000)
- జూన్ 24: చతుర్వేదుల నరసింహశాస్త్రి, అమరేంద్ర కలం పేరుతో ప్రసిద్ధులైన సాహిత్యవేత్త. (మ.1991)
- జూలై 3: మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు. (మ.1993)
- జూలై 3: సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (మ.1999)
- జూలై 13: హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (మ.2006)
- జూలై 16: తేళ్ల లక్ష్మీకాంతమ్మ, ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు. (మ. 2007)
- జూలై 19: కె.సి.శివశంకరన్, "శంకర్"గా సుపరిచితుడైన చిత్రకారుడు. (మ.2020)
- ఆగష్టు 2: మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (మ.2014)
- ఆగష్టు 15: మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (మ.2011)
- ఆగష్టు 22: సి.మాధవరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
- ఆగష్టు 23: రాబర్ట్ సోలో, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- సెప్టెంబరు 3: కావూరి పూర్ణచంద్రరావు అష్టావధాని, గ్రంథరచయిత.
- సెప్టెంబరు 4: కె.వి.రఘునాథరెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.2002)
- సెప్టెంబరు 19: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2001)
- సెప్టెంబరు 20: అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు నటుడు, నిర్మాత. (మ.2014)
- సెప్టెంబరు 25: ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (మ.2015)
- అక్టోబరు 3: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (మ.1994)
- అక్టోబరు 23: ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (మ.2015)
- అక్టోబరు 23: కె. ఎల్. నరసింహారావు, నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు. (మ.2003)
- అక్టోబర్ 28: సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (మ.1996)
- నవంబర్ 9: కాళీపట్నం రామారావు, సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయులు.
- నవంబర్ 11: తెన్నేటి విద్వాన్, రచయిత,సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2015)
- నవంబర్ 14: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (మ.2000)
- నవంబర్ 18: ఆవంత్స సోమసుందర్, అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు, రచయిత.
- నవంబర్ 24: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు. (మ. 1992)
- డిసెంబర్ 24: మహమ్మద్ రఫీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (మ.1980)
- డిసెంబర్ 24: సి.కృష్ణవేణి, తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత.
- డిసెంబర్ 25: అటల్ బిహారీ వాజపేయి, భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి.
- తేదీ వివరాలు తెలియనివి
- : నర్రా రాఘవ రెడ్డి, కమ్యూనిస్టు యోధుడు, ఆరు సార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి. (మ.2015)
- : సి.కృష్ణవేణి, తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత.
- : షేక్ అబ్దుల్లా రవూఫ్, నక్సల్బరి కేంద్ర కమిటీ నాయకుడు. (మ.2014)
మరణాలు
[మార్చు]- జనవరి 21: రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త లెనిన్
- ఫిబ్రవరి 3: అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్.
- మే 7: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)
- జూలై 13: ఆల్ఫ్రెడ్ మార్షల్, బ్రిటీషు ఆర్థిక శాస్త్రవేత్త (జ.1842)
- డిసెంబర్ 24: గరికిపర్తి కోటయ్య దేవర, సంగీత విద్వాంసుడు, ఆంధ్రగాయక పితామహుడు అనే బిరుదును పొందినవాడు. (జ.1864)
పురస్కారాలు
[మార్చు]స్థాపితాలు
[మార్చు]- 1924 సంవత్సరంలో దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు మద్రాసు కేంద్రంగా భారతి అనే సాహిత్య పత్రికను నడిపించారు.