Jump to content

తమిళనాడు

అక్షాంశ రేఖాంశాలు: 13°05′N 80°16′E / 13.09°N 80.27°E / 13.09; 80.27
వికీపీడియా నుండి
తమిళనాడు
Official logo of తమిళనాడు
Motto(s): 
Vāymaiyē vellum
(Truth alone triumphs)
Anthem: "Tamil Thai Valthu"[1]
(Invocation to Mother Tamil)
భారతదేశం లో తమిళనాడు
భారతదేశం లో తమిళనాడు
Coordinates: 13°05′N 80°16′E / 13.09°N 80.27°E / 13.09; 80.27
Country India
Formation26 జనవరి 1950
రాజధాని,
అతిపెద్ద నగరం
మద్రాస్
జిల్లాలు38
Government
 • Bodyతమిళనాడు ప్రభుత్వం
 • గవర్నర్బన్వరీలాల్ పురోహిత్
 • ముఖ్యమంత్రిఎం. కె. స్టాలిన్ (DMK)
విస్తీర్ణం
 • Total1,30,058 కి.మీ2 (50,216 చ. మై)
 • Rank10th
జనాభా
 (2011)[1]
 • Total7,21,47,030
 • Rank6వ
 • జనసాంద్రత550/కి.మీ2 (1,400/చ. మై.)
Demonyms
GDP (2020–21)
 • మొత్తంIncrease 21.72 trillion (US$270 billion)
భాషలు
 • అధికారికతమిళంl[3]
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-TN
Vehicle registrationTN
HDI (2018)Increase 0.708[4]
high · 11th
అక్షరాస్యత (2017)Increase 82.9%
^# Jana Gana Mana is the national anthem, while Invocation to Mother Tamil is the state song/anthem.
^† Established in 1773; Madras State was formed in 1950 and renamed as Tamil Nadu on 14 January 1969[5]

తమిళనాడు దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రం. దీని రాజధాని, అతిపెద్ద నగరం చెన్నై. తమిళనాడు భారత ఉపఖండంలోని దక్షిణ భాగంలో ఉంది. కేంద్రంపాలిత ప్రాంతం పుదుచ్చేరి, దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా కలిగి ఉంది. దీనికి ఉత్తరాన తూర్పు కనుమలు, నీలగిరి పర్వతాలు, మేఘమలై కొండలు, పశ్చిమాన కేరళ, తూర్పున బంగాళాఖాతం, మన్నార్ గల్ఫ్, ఆగ్నేయంలో పాక్ జలసంధి, దక్షిణాన హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్రం శ్రీలంక దేశంతో సముద్ర సరిహద్దును పంచుకుంటుంది.

ఈ ప్రాంతాన్ని చేరా, చోళ, పాండియన్ రాజులు పరిపాలించారు. వీటివలన వంటకాలు, సంస్కృతి, వాస్తుశిల్పాన్ని ప్రభావితమైంది. మైసూర్ రాజ్యం పతనం తరువాత, ఆధునిక కాలంలో బ్రిటిష్ వలసరాజ్యాల పాలన వలన చెన్నై (మద్రాస్) మెట్రోపాలిటన్ నగరంగా ఉద్భవించింది. భాషా పరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత 1956 లో ఆధునిక తమిళనాడు ఏర్పడింది. ఈ రాష్ట్రం అనేక చారిత్రాత్మక భవనాలు, బహుళ-మత తీర్థయాత్రాస్థలాలు, హిల్ స్టేషన్లు, మూడు ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నిలయం.[6][7][8]

విస్తీర్ణంలో తమిళనాడు భారతదేశంలో పదవ అతిపెద్దది. జనాభా ప్రకారం ఆరవ అతిపెద్దది. తమిళనాడు ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో రెండవ అతిపెద్దది, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) ₹ 21.6 ట్రిలియన్. తలసరి జిఎస్డిపిలో ₹ 229,000 తో దేశంలో 11వ స్థానంలో వుంది మానవ అభివృద్ధి సూచికలో ఇది అన్ని భారత రాష్ట్రాలలో 11వ స్థానంలో ఉంది. తమిళనాడు భారతదేశంలో అత్యధిక పట్టణీకరణ రాష్ట్రం, అత్యంత పారిశ్రామిక రాష్ట్రాలలో ఒకటి; ఉత్పాదక రంగ రాష్ట్ర జిడిపిలో మూడోవంతు కంటే ఎక్కువ. దీని అధికారిక భాష తమిళం, ఇది ప్రపంచంలో ఎక్కువ కాలం జీవింస్తున్నప్రాచీనభాషలలో ఒకటి.

తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు

[మార్చు]

చరిత్ర

[మార్చు]

తమిళనాడు ప్రాంత చరిత్ర 6000 సంవత్సరాలు పైగా పురాతనమైనది. సింధునదీలోయలో (హరప్పా, మొహంజొదారో) మొదట ద్రవిడుల నాగరికత పరిఢవిల్లిందనీ, తరువాత ఆర్యుల దండయాత్రల కారణంగా ద్రవిడులు దక్షిణప్రాంతానికి (ప్రస్తుత తమిళ, తెలుగు, కన్నడ, మలయాళీ ప్రాంతాలు) క్రమేపీ విస్తరించారని ఒక ప్రబలమైన వాదన. కానీ ఈ వాదనకు బలమైన వ్యతిరేకత కూడా ఉంది. ఏమయినా తమిళ సమాజం పట్ల చాలామంది అవగాహన 'ద్రావిడనాగరికత' అనే అంశం ఆధారంగా మలచబడింది.

తమిళనాడు, చుట్టుప్రక్కల ప్రాంతాలలో వేరువేరు కాలాలలో పల్లవ, చేర, చోళ, పాండ్య, చాళుక్య, విజయనగర రాజుల రాజ్యం సాగింది. దాదాపు అన్ని సమయాలలోనూ 'కొంగునాడు' (కోయంబత్తూరు, ఈరోడ్, కరూర్, సేలం ప్రాంతాలు) ఒక విశిష్టమైన స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకొంది. వ్యవసాయ ప్రధానమైన ఈ ప్రాంతాలలో ఇప్పటికీ సాంస్కృతిక విలక్షణత కనుపిస్తుంది.

క్రీస్తు పూర్వం

[మార్చు]

క్రీ.ఫూ. 6వ శతాబ్దములో మదురై, తిరునల్వేలి కేంద్రంగా కులశేఖరుడు స్థాపించిన పాండ్యరాజ్యం వర్ధిల్లింది. వారి కాలంలో గ్రీసు, రోములతో వాణిజ్య సంబంధాలు ఉండేవి. తరువాత చేర రాజులు మలబారు తీర ప్రాంతం (ఇప్పటి కేరళ) లో రాజ్యమేలారు. ఇది సైనికంగా బలమైన రాజ్యం. వారికాలంలో రోముతో వాణిజ్యం మరింత అభివృద్ధి చెందింది.

సా.శ. 1 నుండి 9వ శతాబ్దం వరకు

[మార్చు]
7వ శతాబ్దములో పల్లవులు, మహాబలిపురములో నిర్మించిన సముద్రతీర ఆలయం

1 నుండి 4 వ శతాబ్దం వరకు చోళరాజులు పాలించారు. కరికాల చోళుడు వారిలో ప్రసిద్ధుడు. ఆ కాలంలోనే కావేరి నదిపై ఆనకట్ట కట్టారు (కల్లనాయి). ఇది అప్పటి సాంకేతికత ప్రజ్ఙకు చిహ్నము.

4వ శతాబ్దం తరువాత 400 సంవత్సరాలు దక్షిణాపధమంతా పల్లవుల అధీనంలో ఉంది. మహేంద్ర వర్మ, నరసింహ వర్మ వీరిలో ప్రసిద్ధులు. ఇది దక్షిణాపథంలో శిల్పానికి స్వర్ణయుగం.

9వ శతాబ్దము నుండి 13వ శతాబ్దం వరకు

[మార్చు]

మరల 9వ శతాబ్దంలో రాజరాజచోళుని నాయకత్వంలోను, తరువాత అతని కుమారుడు రాజేంద్రచోళుని నాయకత్వంలోను చోళుల రాజ్యం బలంగా విస్తరించింది. చోళుల సామ్రాజ్యం ఒడిషా, బెంగాలు, బీహారుల వరకు విస్తరించింది. తూర్పు చాళుక్యులను, చేరరాజులను, పాండ్యరాజులను ఓడించారు. లంక, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీపాలు, సుమత్రా, జావా, మలయా, పెగూ ద్వీపాలను చోళరాజులు తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. 13వ శతాబ్దం తరువాత చోళుల పాలన అస్తమించింది.

14వ శతాబ్దం

[మార్చు]

14వ శతాబ్దంలో మరల మొదలైన పాండ్యరాజుల పాలన ఉత్తరాదినుండి 'ఖిల్జీ' దండయాత్రలవలన త్వరలోనే అంతరించింది. తరువాత దక్కన్ ప్రాంతంలో బహమనీ సుల్తానుల రాజ్యం వేళ్ళూనుకుంది. తదనంతరం హంపి కేంద్రంగా విజయనగర సామ్రాజ్యం దక్షిణాపధమంతా నడచింది. వారు (నాయకర్, నాయగన్) నాయకుల సహాయంతో ఏలిక సాగించరు. 1564లో తళ్ళికోట యద్ధంతో విజయనగరసామ్రాజ్యం అంతరించింది. తమిళనాట చాలా ప్రాంతాలు స్వతంత్ర నాయకుల అధీనంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నాయి. మదురై, తంజావూరు నాయకులు గొప్ప ఆలయాలు నిర్మింపజేశారు.

17వ శతాబ్దం

[మార్చు]

ఇక ఐరోపా వారి యుగం ఆరంభమైంది. 1609లో డచ్చివారు పులికాట్ వద్ద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. 1639లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు మద్రాసులో స్థావరం నెలకొలిపారు. స్థానిక నాయకుల మధ్య తగవులు బ్రిటిష్ వారి విస్తరణకు మంచి అవకాశమిచ్చాయి. 1760లో ఫ్రెంచివారిని వందవాసి యుద్ధం లోను, డచ్చివారిని 'తరంగంబడి' యుద్ధంలోను, తరువాత టిప్పు సుల్తానును మైసూరు యుద్ధంలోను ఓడించి, బ్రిటిష్ వారు దక్షిణభారతదేశంలో ఎదురులేని ఆధిపత్యాన్ని సాధించుకొన్నారు. అప్పటినుండి మద్రాసు ప్రెసిడెన్సీ రూపు దిద్దుకుంది.

వీరపాండ్య కట్టబొమ్మన, మారుతుస్, పులితేవన్ వంటి కొందరు పాలెగాళ్లు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీనెదిరించి వీరోచితంగా పోరాడారు గాని ప్రయోజనం లేకపోయింది.

20వ శతాబ్దం

[మార్చు]

బ్రిటిష్ రాజ్యం కాలంలో విశాలమైన మద్రాసు ప్రెసిడెన్సీలో ఇప్పటి తమిళనాడుతోబాటు ఆంధ్ర, కర్ణాటక, కేరళలలోని కొన్నిభాగాలు కలసి ఉండేవి. 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అదే మద్రాసు రాష్ట్రమైనది. భాషా ప్రాతిపదికన 1953లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంగా విభజించారు. బళ్ళారి ప్రాంతం మైసూరు రాష్ట్రంలో కలుపబడింది. 1956లో మద్రాసు రాష్ట్రంలోని పశ్చిమభాగాలు కొన్ని కేరళ, మైసూరు (ఇప్పటి కర్ణాటక) రాష్ట్రాలలో కలుపబడ్డాయి.

1968లో మద్రాసు రాష్ట్రానికి "తమిళనాడు" అని పేరు మార్చారు. తమిళ (ద్రవిడ) భాష, సంస్కృతి తమిళనాడు రాజకీయాలలో ఇప్పటికీ ప్రధానమైన అంశాలు.

రాజకీయాలు

[మార్చు]
  • లోక్ సభ నియోజక వర్గాలు: 39
  • అసెంబ్లీ నియోజక వర్గాలు: 234

1967 నుండి ప్రాంతీయ పార్టీలు తమిళనాడు రాజకీయాలలో ప్రముఖస్థానాన్ని వహిస్తున్నాయి.

1916లో ఏర్పడిన దక్షిణ భారత సంక్షేమ సంఘం (South Indian Welfare Association) క్రమంగా 'జస్టిస్ పార్టీ' గా అవతరించింది. 1944లో ఇ.వి. రామస్వామి నాయకర్ నాయకత్వంలో ఇది 'ద్రవిడకజగం' పార్టీ అయ్యింది. ఇది రాజకీయ పార్టీ కాదు. స్వతంత్ర 'ద్రవిడనాడు' సాధన వారి లక్ష్యం. అప్పటి నాయకులు అన్నాదురై, పెరియార్ ల మధ్య విభేదాల కారణంగా ఈ పార్టీ రెండుగా చీలింది.

అన్నాదురై నాయకత్వంలో 'ద్రవిడ మున్నేట్ర కజగం' (డి.యమ్.కె, DMK) పార్టీ 1956లో ఎన్నికలలోకి దిగింది. 1960 దశకంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళన సమయంలో డి.యమ్.కె బలం పుంజుకుంది. 1967లో కాంగ్రసును చిత్తుగా ఓడించి అధికారం కైవసం చేసుకుంది. 1969లో అన్నాదురై మరణించడంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు.

కరుణానిధి నాయకత్వంతో విభేదించిన సినీ నటుడు ఎమ్.జి.రామచంద్రన్ ( ఎం.జి.ఆర్, MGR)1972లో పార్టీనుండి విడిపోయి 'అఖిల భారత ద్రవిడ మున్నేట్ర కజగం' (AIADMK) స్థాపించాడు. 1977 నుండి 1987 వరకు ఎమ్.జి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1987లో ఎమ్.జి.ఆర్. మరణానంతరం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. కాని ఎమ్.జి.ఆర్. భార్య జానకి రామచంద్రన్ నాయకత్వంలోని భాగం నిలబడలేకపోయింది. జయలలిత నాయకత్వంలో ఎ.ఐ.డి.ఎమ్.కె. స్థిరపడింది.

మొత్తంమీద 1967 నుండి డి.ఎమ్.కె, ఎ.ఐ.డి.ఎమ్.కె. ఈ రెంటిలో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటున్నది.

ఐనా తమిళనాడులో కాంగ్రెస్, బి.జె.పి, కమ్యూనిస్టులు వంటి జాతీయ పార్టీలు, పి.ఎమ్.కె., ఎమ్.డి.ఎమ్.కె వంటి ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పుకోదగినంత ప్రాబల్యం కలిగి ఉన్నాయి. శ్రీ లంకలోని తమిళుల సమస్య కూడా తమిళనాడు రాజకీయాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది.

సినిమాలు

[మార్చు]

బొంబాయి (బాలీవుడ్) తరువాత చెన్నై భారతదేశంలో సినిమారంగానికి ముఖ్యమైన నిలయం. సినిమా రంగానికి సంబంధించిన సదుపాయాలు ఎక్కువగా 'కోడంబాకం' ప్రాంతంలో ఉన్నందున తమిళనాడు సినిమా రంగాన్ని 'కోలీవుడ్' అని చమత్కరిస్తారు. ఒకప్పుడు నాలుగు దక్షిణ భారత భాషలకూ మద్రాసే ప్రధాన సినిమా పరిశ్రమ కేంద్రం. ఇప్పుడు తక్కిన రాష్ట్రాలలో చిత్ర పరిశ్రమ వృద్ధి చెందునందువల్ల 'చెన్నై' ప్రాముఖ్యత కాస్త పలచబడింది. అయినా తమిళ సినీ రంగం, తెలుగు సినీ రంగం కుడి ఎడమగా ఉంటూ వస్తున్నాయి.

ఇక తమిళనాడు రాజకీయాలలో సినిమా ప్రభావం ప్రపంచంలో మరక్కడా లేనంత ప్రబలం. దాదాపు సినీపరిశ్రమ, రాజకీయ రంగం కలగలిపి ఉంటున్నాయి.

ఆర్ధిక వ్యవస్థ

[మార్చు]

భారతదేశం ఆర్థిక వ్యవస్థలో తమిళనాడు మూడవ స్థానం ఆక్రమిస్తుంది. పారిశ్రామికంగానూ, వ్యాపార పరంగానూ తమిళనాడు బహుముఖంగా అభివృద్ధి చెందింది.

వ్యవసాయం

[మార్చు]
నాగర్‌కోయిల్ దగ్గర వరిమళ్లు

వస్త్ర పరిశ్రమ

[మార్చు]

వస్త్రాలకు సంబంధించిన వ్వసాయోత్పత్తులు, యంత్రాలు, ముడి సరకులు, వస్త్రాల కర్మాగారాలు, చేనేత కార్మికులు కూడా తమిళనాడు ఆర్థికరంగంలో ముఖ్యమైన వనరులు. ఒక్క తిరుపూర్ పట్టణం నుండే 2004లో 5వేల కోట్ల విలువైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇక్కడ 7,000 దుస్తుల పరిశ్రమలు 10 లక్షల కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది.

ఉత్పత్తి పరిశ్రమలు

[మార్చు]

చెన్నై చుట్టుప్రక్కల ఇంజినీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమలు ఇతోధికంగా ఉన్నాయి. ఫోర్ద్, హ్యుండై, మిత్సుబిషి కారు ఫ్యాక్టరీలు, ఎమ్.ఆర్.ఎఫ్, టి.ఐ.సైకిల్స్, అశోక్ లేలాండ్, కల్పక్కం అణు విద్యుత్ కర్మాగారము, నైవేలి లిగ్నైట్ పరిశ్రమ, సేలం స్టీల్స్, మద్రాస్ సిమెంట్, టైటాన్ వాచెస్, తమిళనాడు పేపర్ & పల్ప్, తోలు పరిశ్రమలు - ఇవి కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు.

శివకాశి పట్టణం ముద్రణ, బాణసంచా, అగ్గిపెట్టెలు పరిశ్రమలకు భారతదేశంలో అగ్రగామి.

సమాచార సాంకేతిక, సాఫ్ట్వేర్ రంగములు

[మార్చు]
చెన్నైలోని టైడల్ పార్క్, తమిళనాడులోని అతి పెద్ద సాఫ్ట్‌వేరు పార్క్

బెంగళూరు తరువాత చెన్నై రెండవ సాఫ్ట్వేర్ కేంద్రము.

ఈ-పరిపాలన

[మార్చు]

ప్రభుత్వసేవలను కంప్యూటరీకరంచడంలో తమిళనాడు అగ్రగామి.

సామాజిక అభివృద్ధి

[మార్చు]

ఇంకా చెన్నై వైద్య, పరిశోధన, విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా ప్రాథమిక విద్యకు ప్రభుత్వధనం బాగా వినియోగింపబడుతూ ఉంది. 'బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం' అనే పధకం తమిళనాడులోనే ప్రారంభమైంది.

ఇక సామాజిక అంశాలలో వెనుకబాటు తనం కూడా కొన్ని విషయాలలో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. వాఠిలో ఒకటి - కొన్ని ప్రాంతాలలో - ఆడ శిశువులను చంపివేయడం.

జిల్లాలు

[మార్చు]

తమిళనాడు రాష్ట్రములో 30 జిల్లాలు ఉన్నాయి. ధర్మపురి జిల్లాను రెండుగా విభజించి క్రిష్ణగిరి ముఖ్యపట్టణముగా క్రిష్ణగిరి జిల్లా, 30వ జిల్లాగా యేర్పడినది.

పండగలు

[మార్చు]

పొంగల్ (సంక్రాంతి) తమిళనాట ప్రధానమైన పండుగ. ఇంకా దీపావళి, విషు (తమిళ ఉగాది), దసరా, వినాయక చవితి కూడా జరుపుకుంటారు. అలాగే మహమ్మదీయ, క్రైస్తవ పండుగలు కూడా పెద్దయెత్తున జరుపబడతాయి. తమిళనాడులో ముఖ్యమైన కుంభాభిషేకం, తైపూసం, ఆడివెల్లి వంటి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

వేలాంకిణి చర్చి, నాగూరు మసీదు లలో ఉత్సవాలలో అన్ని మతాలవారు పాలుపంచుకుంటారు.

పర్యటన

[మార్చు]

తమిళనాడు పర్యాటకులను ఎన్నోవిదాలుగా ఆకర్షిస్తుంది. పురాతన ఆలయాలు, నింగినంటే గోపురాలు, ఆధునిక నగరాలు, పల్లెటూరి జీవన విధానం, సాగర తీరాలు, పార్కులు, అడవులు, వేసవి విడుదులు, పరిశ్రమలు, సినీ స్టూడియోలు, పట్టుచీరలు, బంగారం దుకాణాలు, ఆధునిక వైద్యశాలలు - ఇలా అన్ని విధాల పర్యాటకులకూ తమిళనాడు చూడదగింది.

ముఖ్యమైన పర్యాటక స్థలాలు

[మార్చు]
గాలి మరల నేపథ్యంలో అరల్వైమోయి రైల్వే స్టేషను
కొడైకెనాల్
హోగెనక్కల్‌ జలపాతం

అవీ, ఇవీ

[మార్చు]
  • దేశంలో తమిళనాడుప్రాంతంలో మాత్రమే ఈశాన్య ఋతుపవనాలవల్ల అక్టోబరు - నవంబరు - డిసెంబరు మాసాలలో వర్షాలు పడతాయి.
  • బంగాళా ఖాతంలోని అల్పపీడనాలవల్ల పడే వర్షాలు తమిళనాడు నీటివనరులలో ముఖ్యమైనది. కాని వాటివల్ల వచ్చే తుఫానులవల్ల నష్టాలకు కూడా తమిళనాడు తరచు గురి అవుతుంటుంది.
  • 2004 డిసెంబరు 26 న వచ్చిన 'సునామీ' ఉప్పెనకు తమిళనాట తీరప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
  • కావేరీ నది జలాల వినియోగం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిరకాలంగా ఉన్న వివాదం. రెండు రాష్ట్రాల వ్యవసాయానికీ ఈ నీరు చాలా అవసరం.
  • చెన్నైలోని 'మెరీనా బీచ్' ప్రపంచంలో రెండవ పొడవైన బీచ్. కడలూరులోని 'సిల్వర్ బీచ్' మెరీనా బీచ్ తరువాత పొడవైనది.
  • ఒకప్పుడు, తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా మద్రాసులో ఉన్నపుడు, మద్రాసు వెళ్ళిన తెలుగు వారికి ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ ల ఇళ్ళు చూడడం టూర్ లో చాలా ముఖ్యమైన భాగంగా ఉండేది.

తమిళనాట తెలుగు బావుటా

[మార్చు]
  • తమిళంలో ఉన్న తిరుప్పావై తెలుగునాట విష్ణుభక్తులు పాడినట్లే తెలుగులో ఉన్న త్యాగరాయ కీర్తనలను తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సంగీత కళాకారులందరూ పాడగలరు. పొట్టి శ్రీరాములు నిరా హారదీక్ష చేసి మరణించి, తెలుగుకు గుర్తింపు తెచ్చినా, తమిళనాట ఉన్న తెలుగువారు అక్కడే ఉన్నారు తప్ప, అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి రాలేదు.క్రీస్తుపూర్వం నుంచి తెలుగు వారు తమిళ ప్రాంతాలకు వెళ్ళారు. తమిళ నాడుకు తెలుగువారి వలస సా.శ. 6వ శతాబ్దం పల్లవుల రాజ్యపాలన కాలం నుంచి ఉంది. శాతవాహనులు (క్రీ.పూ. 270) 13వ శతాబ్దంలో కాకతీయులు తమిళ నాడును పరిపాలించారు.తమిళనాట చోళ వంశం, తెలుగు రాజ్యమేలుతున్న చాళుక్య వంశం వియ్యం అందుకున్నాయి. దానితో వలసలకు ప్రోత్సాహం లభించింది. ఆ తరువాత కాకతీయుల కాలంలో తమిళనాట తెలుగు రాజ్యానికి మంచి పునాదులు ఏర్పడ్డాయి.15వ శతాబ్దం కృష్ణదేవరాయల ఏలుబడిలో 'తెలుగు వారికి స్వర్ణయుగం' అయింది. నాయక రాజులు, తంజావూరు ప్రాంతాలను పాలించి, తెలుగు సాంస్కృతిక వైభవానికి వన్నె తెచ్చే విధంగా, కవులను కళలను, కళారూపాలను పోషించి ఆదరించారు.తంజావూరును పాలించిన మరాఠా రాజ వంశీయులు 'సాహాజీ'లు కూడా తాము కవులై తెలుగులో యక్షగానాలు రచించారు.తంజావూరుసరస్వతీ గ్రంథాలయం తెలుగువారి సారస్వత భాండాగారంగా పేర్కొనవచ్చు.రెండవ 'సాహజీ' కాలంలో 1810 ప్రాంతాలలో బ్రిటీష్‌వారి సహకారంతో ఈ లైబ్రరీని దర్శించి, అందులో అప్పటికే శిథిలమై పోతున్న అనేక తాళపత్ర గ్రంథాలను నిక్షిప్తం చేశారు. దాదాపు 10 వేల సంస్కృత తాళపత్ర గ్రంథాలు, 3 వేలకు పైగా తెలుగు సాహిత్య, సంగీత గ్రంథాలు ఇందులో ఉన్నాయి. ఇది మనకు సంబంధించి ఒక 'ప్రాచీననిధి', మన సంపద . తంజావూరు 20 కి.మీ.లలో మేలట్టూరు అనే యక్షగాన నాటక కళాకారులుండే గ్రామం .అక్కడకు 20 కి.మీ.లలో తిరువయ్యూరు ఉన్నాయి. భారతదేశం గర్వించతగ్గ వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి నివసించిన ఊరు అది. అక్కడే కావేరి ఒడ్డున వారి సమాధి ఉన్నాయి.మేలట్టూరు భాగవత నాటకాలు 15వ శతాబ్ది నుంచి ప్రారంభమై, ఇప్పటి వరకు అజరామంగా నిలిచినాయి. కృష్ణదేవరాయ భార్య తిరుమలాంబ నాట్యకత్తె, మేలట్టూరు నివాసి. అందువల్ల వీరు తెలుగులోనే సాహిత్యం రూపొందించుకుని, కర్ణాటక సంగీత బాణీలో, భరతనాట్య సంప్రదాయంలో చక్కటి నాటకశైలిలో నడిచే నృత్య నాటకాలు ప్రదర్శిస్తుంటారు.అచ్యుతప్ప నాయకుడు వీరికి ఆ గ్రామం భరణంగా ఇచ్చారు.1810 ప్రాంతాలలో ఉన్న వేదం వెంకట్రాయశాస్త్రి గారిని వారి నాటకాల ఆధునీకరణకు కారణంగా చెపుతారు.ఈ నాటకాల తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి. వారిది పురాతన తెలుగు నాటకశైలి. వీరు తెలుగులో పాడతారు.రాయడం మాత్రం తమిళంలో రాస్తారు. ఈ నాటక సంప్రదాయాన్ని తమిళ ప్రభుత్వం ఆదరించలేకపోవడానికి ఒక కారణం - అవి తెలుగులో ఉండడమే! తమిళంలో మార్చడానికి వీలుపడదు. వెంకట్రామ శాస్త్రిగారి నాటకాలే కన్యాశుల్కానికి ప్రేరణ అని గురజాడవారు పేర్కొన్నారు. మగవారు ఆడవేషం వేసిన, మేలట్టూరు నాటకాలు చూసి, మధురవాణి అనే పాత్రను కన్యాశుల్కానికి నాయకుడిని చేశారు గురజాడవారు. మన సాంస్కృతిక శాఖ ఈ మేల ట్టూరును మనదిగా చేసుకోవలసిన అవసరం ఉంది.త్యాగరాజ సమాధి స్థలం తిరువయ్యూరు తెలుగు గ్రామం. 16వ శతాబ్దపు తంజావూరు సంగీత సోద రులు వెంకట మఖి, క్షేత్రయ్య ఇత్యాదులు త్యాగరాజు కాలానికి పూర్వం అచ్చమైన తెలుగు సంగీత సంప్రదాయానికి పునాదులు వేశారు. త్యాగరాజస్వామి తెలుగులో రాసి, తెలుగుభాషకు ఉన్నతిని చేకూర్చారు.ఆయనకు సరైన స్మృతి నిర్మాణాన్ని చేపట్టి, తెలుగు జాతి ఆయన ఋణం తీర్చుకోవాలి.[9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Census of india 2011" (PDF). Government of India. Archived (PDF) from the original on 13 November 2013. Retrieved 6 January 2014.
  2. "MOSPI State Domestic Product, Ministry of Statistics and Programme Implementation, Government of India". 15 March 2021. Retrieved 28 March 2021.
  3. "52nd report of the Commissioner for Linguistic Minorities in India (July 2014 to June 2015)" (PDF). Ministry of Minority Affairs (Government of India). 29 March 2016. p. 132. Archived from the original (PDF) on 25 May 2017.
  4. "Sub-national HDI – Area Database". Global Data Lab (in ఇంగ్లీష్). Institute for Management Research, Radboud University. Archived from the original on 23 September 2018. Retrieved 25 September 2018.
  5. Tamil Nadu Legislative Assembly history 2012.
  6. UNESCO 2012.
  7. Press Information Bureau releases 2012.
  8. "The Living culture of the Tamils; The UNESCO Courier: a window open on the world" (PDF). The UNESCO Courier. XXXVII (3). March 1984. Archived (PDF) from the original on 17 April 2018. Retrieved 28 May 2018.
  9. http://www.prajasakti.com/index.php?srv=10301&id=1020348&title=%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%20%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%E0%B0%9F%E0%B0%BE ---'కళామిత్ర' ఆర్‌. రవిశర్మ, 'నాటక కళ' సంపాదకులు ప్రజాశక్తి 18.12.2013

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తమిళనాడు&oldid=4371633" నుండి వెలికితీశారు