రంపచోడవరం పట్టణం
Jump to navigation
Jump to search
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీ. |
రంపచోడవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం. పిన్ కోడ్: 533288. రంపచోడవరం లో గిరిజనులు అధికంగా ఉన్నారు. వారి ఉన్నతి కొరకు ఐ.టి.డి.ఏ. నెలకొల్పబడింది.వారి గురించిన మ్యూజియం కూడా శక్తి సంస్థ సహకారంతో ఎర్పాటు చేయబడుతోంది.
రంప వాగు పక్కనే ఈ ఊరు ఉన్నది. రంప గ్రామం చోడవరం కలిపి రంపచోడవరం అయ్యింది. ఇక్కడ కొండమీద ఒక పురాతన శివాలయం ఉన్నది. అక్కడ అల్లూరి సీతారామరాజు పూజ చేసుకునేవారట. అక్కడ ఒక జలపాతం కూడ ఉన్నది, సంవత్సరం పొడుగునా ఇక్కడ నీళ్ళు వస్తూంటాయి.
రవాణా సదుపాయాలు[మార్చు]
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు. దగ్గరలో రాజమండ్రి రైలుస్టేషన్ ఉంది.