Jump to content

తిరుమల పుష్కరిణి

వికీపీడియా నుండి
స్వామి పుష్కరిణి
స్వామి పుష్కరిణి

శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానంచేసి, స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం తిరుమలకొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చేవేళ, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. తారకాసురుని వధించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నదీ గమనార్హం.

స్వామి పుష్కరిణి

స్నాన పర్వసమయం

[మార్చు]
స్వామి పుష్కరిణి పగటి వెలుగులో

స్వామి పుష్కరిణి యందు ధనుర్మాసము, శుద్ధ ద్వాదశీ రోజు, అరుణోదయ కాలం నందు ఆరుఘడియలు సమయం పర్వసమయం.

పుష్కరిణిని ప్రశంసించిన మహర్షులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]