Jump to content

డియోరియా జిల్లా

వికీపీడియా నుండి
(దేవరియా జిల్లా నుండి దారిమార్పు చెందింది)
దేవరియా జిల్లా
देवरिया जिला
ఉత్తర ప్రదేశ్ పటంలో దేవరియా జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో దేవరియా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుగోరఖ్‌పూర్
ముఖ్య పట్టణం[[దేవరియా]]
విస్తీర్ణం
 • మొత్తం2,535 కి.మీ2 (979 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం30,98,637
 • జనసాంద్రత1,200/కి.మీ2 (3,200/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.53
 • లింగ నిష్పత్తిM:F 1000:1013
సగటు వార్షిక వర్షపాతం864.38 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో దేవరియా జిల్లా ఒకటి. దేవరియా పట్టణం జిల్లా ముఖ్యపట్టణం. దేవరియా జిల్లా గోరఖ్‌పూర్ డివిజన్‌లో భాగంగా ఉంది.

దేవరియాలోని శ్యామ్ మందిర్

ఆసియా

[మార్చు]

దేవరియా ప్రాంతం కోసల రాజ్యంలో భాగంగా ఉండేది. కోసల రాజ్యం ఆర్య సంప్రదాయ రాజ్యాలలో ఒకటి.

సరిహద్దు

[మార్చు]

జిల్లా సరిహద్దులో హిమాలయాలు, దక్షిణ సరిహద్దులో ష్యండిక నది, పశ్చిమ సరిహద్దులో మగధ్ రాజ్యం, తూర్పు సరిహద్దులో బీహార్ రాష్ట్రం ఉన్నాయి.పురాణాలలో ఈ ప్రదేశ ప్రస్తావన ఉంది. జిల్లాలోని పలు ప్రదేశాలలో ఆర్కియాలజీ అవశేషాలు, శిల్పాలు, నాణ్యాలు, ఇటుకలు, ఆలయాలు, బుధ్ మఠాలు కనుగొనబడ్డాయి.

పురాతన చరిత్ర ఆధారంగా ఈ నగరం గురించి రామాయణ కావ్యంలో ప్రస్తావించబడింది. రాముడు తన కుమారుడైన కుశుని కుశ్వంతి రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసాడు. అదే ప్రస్తుత ల్హుషీనగర్. మహాభారత కాలానికి ముందు ఈ ప్రాంతం మహాసుదర్శన్ మల్లు రాజ్యంలో భాగంగా ఉందని విశ్వసిస్తున్నారు. ఈ జిల్లాకు సమీపంలో దట్టమైన అరణ్యం ఉంది. ఖుషినగర్ సకలసమృద్ధితో తులతూగిందని భావిస్తున్నారు. ఈ ప్రాంతం సా.శ. 1114- 1154 మధ్యకాలంలో మయూర రాజులు, మౌర్యరాజులు, గుప్తరాజులు, బీహార్ రాజులు,, గార్వార్ రాజుల పాలనలో ఉండేది.

ఆధునిక కాలం

[మార్చు]

1946 మార్చి 16 న గోరక్‌పూర్ జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి దేవరియా జిల్లాను ఏర్పరచారు. దేవారణ్య, దేవిపురా అనే పేరు దేవరియా అయిందని భావిస్తున్నారు. జిల్లాకేంద్రం దేవరియా పేరే జిల్లా పేరుగా నిర్ణయించారు. ఇక్కడ పలు ఆలయాలు ఉన్నాయి. అందుకే ఇది దేవిపురం అయింది. జిల్లాలోని దేహ్రౌలి (రుద్రపూర్) కి చెందిన బిభూతి మణి త్రిపాఠీ నాయకత్వంలో జిల్లా ప్రజలు భారతస్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. ఆయన యువకులలో ఉత్తేజం కలిగించడానికి సుభాస్ చంద్రబోసుని ఈ జిల్లాకు ఆహ్వానించాడు. దేవరియా జిల్లా లోని ఈశాన్య ప్రాంతాన్ని వేరుచేసి 1994 మేలో కుశినగర్ జిల్లా రూపొందించారు.

భౌగోళికం

[మార్చు]

దేవరియా జిల్లా 26° 6' నుండి 27° 8' ఉత్తర అక్షాంశం, 83° 29' నుండి 84° 26' తూర్పు రేఖాంశం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులలో ఖుషినగర్, తూర్పు సరిహద్దులలో బీహార్ రాష్ట్రం లోని గోపాల్‌గంజ్, శివన్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులలో మౌ, బలియా జిల్లా జిల్లాలు, పశ్చిమ సరిహద్దులలో గోరఖ్‌పూర్ జిల్లా ఉన్నాయి..[1] జిల్లాలో ప్రధానంగా ఘఘర నది, పశ్చిమ రప్తి నది, చోటీ గందక్ నదులు ప్రవహిస్తున్నాయి.[1] జిల్లాలో అదనంగా సాలెంపూర్ బర్హజ్, భాత్పర్ రాణి వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి.

దేవరియా జిల్లా 16 బ్లాకులను కలిగి:

  • బైతల్పూర్
  • బంకత
  • బర్హజ్
  • భాగల్పూర్
  • భలుబని
  • భత్ని
  • భత్పర్ రాణి
  • దేవరియా
  • దేశాయ్ దేవరియా
  • గౌరీ బజార్
  • లర్
  • పదార్థెవ
  • రాంపూర్ కర్ఖన
  • రుద్రపూర్
  • సలెంపుర్
  • తర్కుల్వ
  • రామ్ నగర్
  • నుంఖర్
  • అహిలీపుర్

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 30,98,637, [2]
ఇది దాదాపు. మంగోలియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. లోవ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 114 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 1220 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.23%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 1014:1000, [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 73.53%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

భాషలు

[మార్చు]

జిల్లాలో తూర్పు హిందీ భాషాకుటుంబానికి చెందిన భోజ్‌పురి భాష 4,00,00,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.ఇది వ్రాయడానికి దేవనాగరి, కైతి లిపిని ఉపయోగిస్తున్నారు. [5]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Deoria". Deoria district administration. Archived from the original on 2019-08-17. Retrieved 2010-08-05.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mongolia 3,133,318 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Iowa 3,046,355
  5. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.