Jump to content

లవంగపట్ట నూనె

వికీపీడియా నుండి
(చీనా దాల్చిన నూనె నుండి దారిమార్పు చెందింది)
లవంగపట్ట నూనె
లవంగపట్ట బెరడు

లవంగపట్ట నూనె లేదా చీనా దాల్చిన నూనె ఒక ఆవశ్యక నూనె.లవంగపట్ట లేదా చైనా/చీనా దాల్చినను ఆంగ్లంలో cinnamomum cassia అంటారు.అంతేకాదు లవంగపట్ట నూనె సుగంధ తైలం కూడా. లవంగ పట్ట నూనె ఓషధ గుణాలులు పుష్కలంగా వున్న ఆవశ్యక నూనె.లవంగ పట్టను నకిలీ దాల్చిన అనికూడా అంటారు. చీనా దాల్చిన నూనెను వొంటికి రాసిన చర్మాన్ని రేగించే/ప్రేరేపించే/irritant గుణం కల్గి వున్నను జ్వరాన్ని తగ్గించుట, జీర్ణవృద్ధి కావించుట వంటి ఇతర పలు ఓషధ గుణాలు దండిగా కల్గి ఉంది.ఛీనా దాల్చిన/లవంగ పట్ట లారేసి కుటుంబానికి చెందినది.ఈ చెట్టు వృక్షశాస్త్ర పేరు సిన్నమోముమ్ కాస్సియ (Cinnamomum cassia).అంతేకాదు సిన్నమోముమ్ ఆరోమాటికం, లారస్ కాస్సియా అనికూడా అంటారు.[1]

లవంగపట్ట చెట్టు మూలస్థానం

[మార్చు]

లవంగ పట్ట /కాస్సియా జన్మస్థానం చైనా/చీనా దేశం, బర్మా. అందుకే లవంగ పట్టను చీనీస్ సిన్నమోన్ లేదా కాస్సియా బెరడు (cassia bark) అంటారు.సన్నగా వుండీ, సతత హరితమైన ఈ చెట్టు 20 మీటర్ల (65 అడుగుల వరకు) ఎత్తువరకు పెరుగును. చెట్టుకు మందమైన నునుపైన ఆకులు వుండి, చిన్నని పూలను పుష్పించును.పూలు తెల్లగా వుండును.లవంగ పట్టను/బెరడును కూరలలో, బేకరీ ఆహారపదార్థాలలో, క్యాండిస్‌లలో, మృదు పానీయాలలో సువాసన మంచి రుచి ఇచ్చుటకై చేర్చుతారు.[1]

నూనె సంగ్రహణం

[మార్చు]

లవంగపట్ట చెట్టు యొక్క ఆకులు, బెరడు చిన్నకోమ్మలు, రెమ్మలనుండి ఆవశ్యక నూనెను నీటి ఆవిరిస్వేదన /స్టీము డిస్టీలేసను పద్ధతిలో సంగ్రహిస్తారు.

నూనె

[మార్చు]

లవంగ పట్ట నూనె ఘాటైన వాసన వున్న ఆవశ్యక, సుగంధ తైలం. చెట్టు యొక్క ఆకులు, రెమ్మలు, బెరడు నుండి ఆవశ్యక నూనెను ఉత్పత్తి చేస్తారు

నూనె లోని రసాయన పదార్థాలు/సమ్మెళనాలు

[మార్చు]

నూనెలో దాదాపు 16 రకాల రసాయనాలు వున్నవి [2] చీనీస్ దాల్చిన /లవంగ పట్ట నూనెలో చాలా రకాల రసాయన సంయోగ పదార్థాలు (అల్డిహైడులు, ఆల్కహాలులు, పైనేనులు, టేర్పేనులు తదితరాలు) వున్నప్పటికి వాటిలో సిన్నమిక్ అల్డిహైడ్, సిన్నమైల్ ఆసిటెట్, బెంజాల్డిహైడ్, లినలూల్,, చావికోల్ ప్రధానమైనవి.[1] నూనెలో సిన్నమల్దిహైడ్ 75 నుండి90% వరకు వుండును.నూనెలోని మరికొన్ని రసయనాలు మెథోక్సిసినమల్డిహైడ్, ఇథైల్ సిన్నమేట్, సలిసైఅల్డిహైడ్ లు.[3] నూనెలోని కొన్ని ప్రధాన రసాయ్నాల శాతం పట్టిక[3]

వరుస సంఖ్య రసాయన పదార్థం శాతం
1 సిన్నమాల్డిహైడ్ 70-85
2 మెథోక్షి సిన్నమాల్డిహైడ్ 11%వరకు
3 సిన్నమైల్ అసిటేట్ 6%వరకు
4 బెంజాల్డిహైడ్ 1%వరకు
5 ఇథైల్ సిన్నమేట్ 0.4
6 కౌమరిన్ 0.2

నూనె భౌతిక గుణాలు

[మార్చు]

నూనె బ్రౌన్ రంగులో వుండును.రిపైండ్ చేసిన నూనె వర్ణరహితంగా వుండును.నూనె సాంద్రత నీటి కన్న కొంచెం ఎక్కువ[3]

వరుస సంఖ్య భౌతిక గుణం మితి
1 రంగు బ్రౌన్ రంగు
2 వక్రీభవన సూచిక 1.609[4]
3 సాంద్రత 1.014 – 1.040.[3]
4 ఫ్లాష్ పాయింట్ 91 °C[4]

ఉపయోగాలు

[మార్చు]
  • జ్వరం, కీళ్ళ నోప్పులు, విరేఛనాలు జలుబు, ఇన్ఫ్లూయోంజ కీళ్లవాత నొప్పులకు పని చేయును.[1]
  • దేహంలో రక్త ప్రసరణను నూనె మెరుగు పరచును.రక్తంలో ఆక్సిజన్ మంరియు ఇతర పోషకాలను దేహానికి పంపిణి ఆగుటకు సహాయపడును.[5]
  • యాంటీ వైరల్ గుణాలు వున్నందున జలుబు, దగ్గు, ఇన్ఫ్లూయోంజా వంటి ఇతర వైరల్ జబ్బులను తగ్గించును.[5]
  • యాంటిమైక్రోబియాల్, యాంటివైరల్ గుణాలున్నందున జ్వరం వలన వచ్చు సంక్రమణ వ్యాధి గుణాలను నిరోధించును, జ్వర ఉష్ణోగ్రతను తగ్గించును.[5]
  • వాయుహరమైన ఔషధముగా పనిచేయును.
  • గర్భాశయ సంబంధి అంతర్గత,, బహిర్గత రక్తస్రావాన్ని అరికట్టును.[5]
  • .లవంగం నూనెను అరోమాథెరపీలో కూడా ఉపయోగిస్తారు. ఇది మీ మానసిక ఆరోగ్యంతో పాటు అనేక ఇతర సమస్యలను దూరం చేస్తుంది. దంతాల సమస్యను తొలగించడానికి లవంగం నూనెను ఉపయోగించవచ్చు.

బయటి లింకుల వీడియోలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Cassia essential oil in aromatherapy". essentialoils.co.za. Archived from the original on 2018-02-22. Retrieved 2018-10-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Cinnamomum cassia Essential Oil Inhibits α-MSH-Induced Melanin Production and Oxidative Stress in Murine B16 Melanoma Cells" (PDF). images.biomedsearch.com. Retrieved 2018-10-16.[permanent dead link]
  3. 3.0 3.1 3.2 3.3 "Cassia Oil – Composition, Ingredients, Uses, Benefits and Production". onlyfoods.net. Archived from the original on 2018-02-14. Retrieved 2018-10-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 "Cassia oil". sigmaaldrich.com. Retrieved 2018-10-16.
  5. 5.0 5.1 5.2 5.3 "13 Surprising Benefits Of Cassia Essential Oil". organicfacts.net. Archived from the original on 2017-07-07. Retrieved 2018-10-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)