Jump to content

అమరావతి

అక్షాంశ రేఖాంశాలు: 16°30′50″N 80°30′58″E / 16.514°N 80.516°E / 16.514; 80.516
వికీపీడియా నుండి
అమరావతి
సచివాలయ భవన సముదాయం
సచివాలయ భవన సముదాయం
అమరావతి is located in ఆంధ్రప్రదేశ్
అమరావతి
అమరావతి
ఆంధ్రప్రదేశ్ పటములో అమరావతి స్థానం
Coordinates: 16°30′50″N 80°30′58″E / 16.514°N 80.516°E / 16.514; 80.516
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ జిల్లాలుగుంటూరు
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Government
 • Typeప్రాధికార సంస్థ
 • Bodyఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ
విస్తీర్ణం
 • నగరం217.23 కి.మీ2 (83.87 చ. మై)
 • Metro8,390 కి.మీ2 (3,240 చ. మై)
జనాభా
 (2011)[5]
 • నగరం1,03,000
 • జనసాంద్రత470/కి.మీ2 (1,200/చ. మై.)
 • Metro
46,87,389
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
520 xxx, 521 xxx, 522 xxx
Vehicle registrationAP07 to AP16
అధికారిక భాషలుతెలుగు
పటం
అమరావతి నగరం (నిర్మాణంలో వుంది)

అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.

చరిత్ర

[మార్చు]
అమరావతి స్తూపం
అమరావతి 3D నమూనా

సా.శ.పూ. 1వ శతాబ్దం నుండి సా.శ. 3వ శతాబ్దం వరకు భారతదేశంలో దాదాపు 60 శాతాన్ని (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్,తెలంగాణా, మహారాష్ట్ర,గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలను) పరిపాలించిన శాతవాహన సామ్రాజ్యానికి రాజధాని ధరణికోట ఈ ప్రాంతంలోనే ఉంది.

కొత్త రాజధానికి భూసేకరణ కొత్త తరహాలో అనగా ప్రధానంగా అభివృద్ధిపరచిన నగరంలో ప్లాట్లు ఇచ్చేటట్లు జరిగింది. అమలు ప్రారంభమైన 60 రోజులలో 25,000 రైతులనుండి 30,000 ఎకరాలను (121.40 చ.కిమీ.) సమీకరించారు.[6] భారత ప్రధాని నరేంద్రమోడి ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబరు 22న విజయదశమి నాడు శిలాన్యాసం (శంకుస్థాపన) చేసాడు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా భవన సముదాయానికి 2016 అక్టోబరు 28 వ తేదిన అప్పటి కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి, ఎం. వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేసాడు. 2016 జనవరి నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి శంకుస్థాపన చేసాడు. 2015 జూన్ నాటికి పరిపాలన అక్కడి నుంచి సాగించాలని భావించినా అది అక్టోబరు నాటికి సాకారమయింది.[7][8]

అభివృద్ధి సంస్థ

[మార్చు]

రాజధాని ప్రాంతపు అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (APCRDA)అభివృద్ధి సంస్థ ఏర్పాటైంది.[9][10][11] దీనిక సహాయంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ [12] ఏర్పాటైంది.

అభివృద్ధి ప్రణాళిక

[మార్చు]

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరం నిర్మాణం కోసం సింగపూర్ ఆధారిత అస్కెన్డాస్-సిన్బ్రిడ్జ్, సెంకోకార్ డెవలప్మెంట్ కన్సార్టియాన్ని ప్రారంభించింది. కొత్త రాజధాని నగరం యొక్క మౌలిక సదుపాయాలు, 7-8 సంవత్సరాల దశలో, 33,000 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయబడతాయి. హడ్కో నుండి 7,500 కోట్లు, ప్రపంచ బ్యాంకు నుండి $ 500 మిలియన్లు, భారత ప్రభుత్వం నుండి 2,500 కోట్ల రూపాయలు, వీటిలో 1,500 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. [13]

నిర్మాణంలో అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే, కర్నూలు, కడప ఫీడెర్ రోడ్ల మద్దతుతో కొనసాగుతున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుండి అమరావతికి వేగవంతమైన రహదారి ప్రవేశం కల్పిస్తుంది.[14][15] దాదాపు $ 1.8 బిలియన్ పెట్టుబడితో బిఆర్‌ఎస్‌ మెడిసిటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.[16][17] ప్రతిపాదనలు ఆర్ధిక, న్యాయ, ఆరోగ్య, క్రీడ, మాధ్యమాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి తొమ్మిది ఉప నగరాలు, నార్మన్ ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్, రిలయన్స్ గ్రూప్, NRDC- ఇండియా రూపొందించిన ప్రభుత్వ భవనాలు నగరంలోనే నిర్మిస్తారు.[18][19][20] ₹ 600 కోట్ల (US $ 83 మిలియన్), పై కేర్ సర్వీసెస్ తోటి, ఆరోగ్య సంరక్షణ 'బిపిఓ' మంగళగిరి ఐటి పార్కులో ప్రారంభించబడింది.[21][22] హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ అనే ఒక ఐటి సంస్థ ఒకకేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.[23][24]

భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్‌ రవాణా కొరకు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్ (HTT), అమరావతి, విజయవాడ నగరాలను అనుసంధానించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసింది. దీనిద్వారా ప్రయాణ కాలం ఆరు నిమిషాలకు తగ్గుతుంది.[25] సమీపంలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, తెనాలి [26] లతో అనుసంధానించబడిన అమరావతి వృత్తాకార రైలు మార్గము 105 కిలోమీటర్ల (65 మైళ్ళు) విస్తీర్ణంలో సుమారు ₹10,000 కోట్ల (US $ 1.4 బిలియన్) ఖర్చుఅంచనాతో ప్రతిపాదనలో ఉంది.[27]

పురోగతి

[మార్చు]

2019 మే నాటికి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలు మినహా మిగిలిన పనులన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. ఒకటి రెండేళ్లలో రాజధాని నగరానికి ఓ రూపం వచ్చే అవకాశం ఉందని ఇంజనీరింగ్ పనులు పర్యవేక్షిస్తున్న వారు చెప్పారు.[28] జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని వికేంద్రీకరణ విధానంతో చాలా పనులు నిలిచిపోయాయి. కరకట్టు రోడ్డుని విస్తరించడం, అమరావతి నగర సంపర్క రహదారిని ప్రధాన జాతీయరహదారికి అనుసంధానం చేసే పనిని, ఇంకా అసంపూర్తిగా వున్న నిర్మాణాలను పూర్తి చేయాలని జగన్ ఆదేశించాడు.[29]

ప్రారంభపు రాజధాని నగర పరిధి

[మార్చు]

రాజధాని నగరం 217.23 చ.కి.మీ. (83.87 చ.మై. ) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[30][31] బీజ (సీడ్) రాజధాని 16.94 చ.కి.మీ. (6.54 చ.మై.) విస్తీర్ణంలో విస్తరించింది. దీనిలో మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి లోని 31 గ్రామాలు ఉన్నాయి.[32] ఈ నగరం విజయవాడ నగరానికి నైరుతి దిశలో 12 కి.మీ (7.5 మైళ్లు), గుంటూరు నగరం ఉత్తరదిశలో 24 కి.మీ. (15 మై.) దూరములో ఉంటుంది.[1][33][34]

మండలం రాజధాని నగరంలో భాగమైన గ్రామాలు,కుగ్రామాలు
తుళ్ళూరు మండలం అబ్బరాజుపాలెం, ఐనవోలు, అనంతవరం, బోరుపాలెం, దొండపాడు,కొండరాజుపాలెం (డి-జనాభా), లింగాయపాలెం (మోగులంకపాలెం గ్రామంతో సహా), మల్కాపురం, మందడం (తాళ్ళాయపాలెం గ్రామం ప్రాంతముతో సహా), నెక్కల్లు, నేలపాడు, పిచ్చికలపాలెం, రాయపూడి, శాఖమూరు, తుళ్ళూరు , ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, వెంకటపాలెం
మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు (నీరుకొండ గ్రామ ప్రాంతములతో సహా), నవులూరు, యర్రబాలెం (బేతపూడి గ్రామ ప్రాంతముతో సహా)
తాడేపల్లి మండలం పెనుమాక,నులకపేట, డోలాస్‌నగర్, ఉండవల్లి

పరిపాలన

[మార్చు]

అమరావతిని రాజధాని ప్రాంతం అభివృద్ధి సంస్థ భవన నిర్మాణాలను, భూవినియోగ అనుమతులను నిర్వహిస్తుంది. ఇతర పరిపాలన ఈ ప్రాంతానికి సంబంధించిన జిల్లా అధికార వ్యవస్థల ద్వారా జరుగుతుంది. అన్ని ప్రభుత్వ సేవలు మన అమరావతి యాప్‌లో చేర్చబడ్డాయి.[35] ఆండ్రాయిడ్, ఐఒఎస్ స్మార్ట్ ఫోనులకొరకు యాప్‌లు [36][37] అందుబాటులో ఉన్నాయి.

మౌలిక సదుపాయలు

[మార్చు]
ప్రభుత్వ సముదాయంలో, అమరావతి ఉద్యోగుల కోసం నిర్మాణంలో ఉన్న గృహనిర్మాణ పథకం

తాత్కాలిక సచివాలయ భవనాలు నిర్మించబడ్డాయి. అమరావతిలో ప్రభుత్వోద్యోగుల కొరకు గృహనిర్మాణం చేపట్టబడింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాష్ట్ర రాజధానిలో భాగంగా ఉన్న మంగళగిరి మండలం, నవులూరు వద్ద నిర్మాణంలో ఉంది.[38][39]

భాష, మతం

[మార్చు]
అమరావతి రాజధాని ప్రాంతంలో అమరలింగేశ్వర ఆలయం

అమరావతి నివాసితులు తెలుగు మాట్లాడే ప్రజలు. తెలుగురాష్ట్ర నగర అధికారిక భాష తెలుగు. హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.[40] ముస్లింలు, క్రిస్టియన్, బౌద్ధ సమాజాలు కూడా ఉన్నాయి. అమరేశ్వర స్వామి ఆలయం, అమరావతి మహాచైత్యం అనేవి అమరావతి హెరిటేజ్ కాంప్లెక్స్ లో ఉన్నాయి.[41][42][43]

విద్య

[మార్చు]

ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీటీ- ఎపి) అమరావతిలోని క్యాంపస్‌లలో తరగతులను ప్రారంభించాయి.[44][45] అమృత విశ్వవిద్యాలయం, అమిటీ, ఇండోర్-యుకె ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (IUIH) కింగ్స్ కాలేజ్, లండన్ సహకారంతో ఇతరులు వారి క్యాంపస్ ఏర్పాటు చేసారు.[46][47][48][49]

రవాణా

[మార్చు]

రోడ్డు

[మార్చు]
సీడ్ యాక్సిస్ రహదారిపై ఒక వంతెన

పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ , విజయవాడ, ఎన్టీఆర్ బస్సు స్టేషన్ గుంటూరు నుండి ఎపిఎస్‌ఆర్‌టిసిచే అమరావతి నగరానికి బస్సు సేవలున్నాయి.[50][51] నగరంలో రెండు కొత్త డిపోలు, ఎపిఎస్‌ఆర్‌టిసి యొక్క ఉత్తర, దక్షిణాన నిర్మించబడ్డాయి.[52] ఆటో రిక్షాలు కూడా అమరావతి రాష్ట్ర రాజధాని నగర ప్రాంతంలో తక్కువ దూరానికి పనిచేస్తాయి.[53]

అమరావతి సీడ్ రాజధాని రహదారి జాతీయ రహదారి 16 నుండి ప్రధాన రాజధాని ప్రాంతాన్ని చేరుకోవటానికి ఉపయోగపడే రహదారి.[54] విజయవాడ-అమరావతి రహదారి నగరాన్ని విజయవాడతో కలుపుతుంది.[55]

రైల్వే

[మార్చు]

సమీప రైల్వే జంక్షన్లు విజయవాడ, గుంటూరులో ఉన్నాయి.

విమానయానం

[మార్చు]

దేశవ్యాప్తంగా గమ్యస్థానాలకు ఎయిర్ కనెక్టివిటీని అందించడం ద్వారా గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రాజధాని ప్రాంతానికి సేవలు అందిస్తుంది.[56]

గుర్తింపులు

[మార్చు]

రాష్ట్ర రాజధానిలో భాగంగా ఉన్న, మంగళగిరి మండలంలోని మంగళగిరి చీరలు, వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ నుండి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్‌లో ఒకటిగా నమోదు చేయబడ్డాయి.[57][58]

దర్శనీయ ప్రదేశాలు

[మార్చు]

రాజధాని వికేంద్రీకరణ వివాదం

[మార్చు]

2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం నియమించిన జియన్ఆర్ కమిటీ రాజధాని వికేంద్రీకరణను సూచించింది. దీనిలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మార్పు ప్రతిపాదించారు. దీనికి అమరావతి రాజధాని ప్రాంతం రైతులనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. రిలే నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి.[59] దీనిగురించి అధ్యయనం కోసం బిసిజి సంస్థను నియమించగా, బిసిజి నివేదిక తయారు చేసింది. దీనిపై నిర్ణయం తీసుకొనడానికి హైపవర్ కమిటీ నియామకమైంది. హైపవర్ కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. 2020 జనవరి 20 న శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లును అసంబ్లీలో ప్రవేశపెట్టాడు. ఆ తరువాత సిఆర్డిఎను రద్దు చేస్తూ అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత ప్రణాళిక, అభివృద్ధి బోర్డు బిల్లును ప్రవేశపెట్టాడు. తెలుగు దేశం సభ్యులను సస్పెండ్ చేసినతరువాత బిల్లులు ఆమోదం పొందాయి. అమరావతి ప్రాంత వాసుల వ్యతిరేకతను చల్లబరిచే ఉద్దేశంతో 10 సంవత్సరాల కౌలును 15 సంవత్సరాలకు, ఆ ప్రాంత రైతు కూలీలకు ఇచ్చే ఫించనును 2500 నుండి 5000 కు పెంచటం బిల్లులో చేర్చారు. ప్రాంత రైతుల అసెంబ్లీ ముట్టడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు[60][61] శాసనమండలిలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ ఉపసంహరణ బిల్లులపై వైకాప, తెదేపా సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. తెదేపా రూల్ 71 ను ఉపయోగించి బిల్లులను ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని చూసింది. రూల్ 71 పై చర్చ పూర్తయిన తర్వాత, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించాడు.[62] సెలెక్ట్ కమిటీ నిర్ణయానికి కనీసం మూడు నెలలు పట్టే అవకాశంవుంది. దీనిని ఎదుర్కొనటానికి శాసనసభ శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదించింది.[63] కమిటీల పూర్తి నివేదికలను గోప్యంగా ఉంచడం, అనుమానాలకు దారితీసింది.[64] జగన్ ప్రభుత్వం సమీకృత అభివృద్ధి. పరిపాలన వికేంద్రీకరణ కొరకు, అమరావతిని కేవలం శాసనరాజధానిగా పరిమితం చేసి,విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మార్పులు చేసిన చట్టానికి 2020 జూలై 31 న గవర్నరు ఆమోదముద్ర పడింది.[65]

రైతుల పోరాటం

[మార్చు]

2021 డిసెంబరు 17 నాటికి అమరావతి రాజధానిగా కొనసాగించాలని రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకత్వంలో చేస్తున్న రైతుల పోరాటానికి రెండేళ్లు పూర్తయ్యింది. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజుల పాదయాత్ర అమరావతిలో ప్రారంభమై తిరుపతిలో ముగిసింది. ముగింపు సభలో విపక్షాల నాయకులు పాల్గొని పోరాటానికి మద్ధతు పలికారు. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఈ పోరాట కాలంలో 180 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వేలమంది రైతులు పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అమరావతిని అభివృద్ధి చేయవచ్చని అన్నాడు.[66] సంవత్సరం క్రిందట పోరాటం సంవత్సరం ముగింపు సభలో కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ఉద్యమానికి మద్దతుగా మాట్లాడారు.[67]

న్యాయపోరాటం

[మార్చు]

రాజధాని వికేంద్రీకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్ల (అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టు WP 13919/2020 (AP CRDA),WP 14282/2020 (Decentralisation)), విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక ధర్మాసనాన్ని హైకోర్టు ఏర్పాటు చేసింది. దీనిలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జెకె.మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎవి.శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి వుంటారు. 2020 జనవరి 24 గురువారం నుండి ఈ ధర్మాసనం విచారణ చేపట్టింది.[68] ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.[69] తదుపరి విచారణ ఆగస్టు 14 వరకు యదాతధ స్థితి కొనసాగాలని ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి వున్న ధర్మాసనం తీర్పు ఇచ్చింది.[70]

2020 అక్టోబరు 11 నాడు జగన్ పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు.[71] ప్రధాన న్యాయమూర్తి మహేశ్వర బదిలీ అయ్యాడు.[72]

ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకొనడానికి అంగీకరించింది. ఈ మేరకు 2021 నవంబరు 22 న మూడు రాజధానుల బిల్లులను రద్దు చేసి గత కాలపు CRDA బిల్లు అమలులోకి తెచ్చే బిల్లు ఆమోదంపొందింది. అదేసమయంలో త్వరలో లోపాలు లేని మూడు రాజధానుల మెరుగైన బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించాడు.[73] ఇది ఇలా వుండగా, 2022 మార్చి 3 న, ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు ఎం. సత్యనారాయణమూర్తి, డి.వి.ఎస్.ఎస్ సోమయాజులతో కూడిన ఉన్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. దీని ముఖ్యాంశాలు:.[74]

  • రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదు.
  • రాజధానిని అభివృద్ధి చేయాలి.
  • రాజధాని ప్రాంతంలో నెలరోజులలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
  • రాజధాని నగరాన్ని ఆరు నెలలలో నిర్మించాలి.
  • రాజధాని నగరానికి భూములిచ్చిన రైతులకు మూడు నెలలలో ఒప్పందం ప్రకారం నివేశన స్థలాల ధ్రువపత్రాలు అందించడం పూర్తి చేయాలి.
  • రాజధాని నగరంలో ఏకపక్షంగా ఆర్5 జోన్ ను చేర్చడం చెల్లదు.
  • రాజధాని నగర భూములను ప్రభుత్వ ఇతర అవసరాలకు తాకట్టు పెట్టకూడదు.
  • అభివృద్ధి పనుల పురోగతిపై నివేదికలను సమర్పించాలి.
  • కార్యాలయాల తరలింపులను నిషేధిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి తీర్పు వరకు కొనసాగుతాయి.

దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) నడచుకోవాలని తెలిపింది. అంతే కాకుండా, రిట్ పిటీషన్ వేసిన 64 మంది రైతులకు వారికి ఒక్కొక్కరికి 50,000చొప్పున కోర్టుఖర్చులివ్వాలని ఆదేశించింది. ఈ తీర్పును 807 రోజులుగా ఉద్యమిస్తున్న రాజధాని ప్రాంత రైతులు స్వాగతించారు.[75]

సంబంధిత న్యాయపోరాటాలు

[మార్చు]

ఇన్ సైడర్ ట్రేడింగ్: జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు శాసనసభలలో తెలియపరచిన తరువాత, పొలాల బేరాలకు సంబంధంలేని వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ పోలీసు యంత్రాంగం విచారణ చేసి పొలాలు కొన్న కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడ్డారని వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. వారు ఆ FIR లను కొట్టివేయాలని హైకోర్టులో పిటీషన్ వేయగా 2021 జనవరి 19 న న్యాయమూర్తి చీకటి మానవేంద్రనాథ్ రాయ్ వారిపై నమోదైన FIR లను రద్దుచేస్తూ తీర్పు ఇచ్చాడు. ఇన్ సైడర్ వ్యాపారం, కంపెనీల విషయంలో షేర్లు, బాండులకు సంబంధించినదని, దానిని పొలాల వ్యాపారాలకు అన్వయించలేమని, రాజధాని ఆ పొలాల ప్రాంతంలో రాబోతున్నదని కొనేవారికి ఒకవేళ తెలిసినా అమ్మేవారికి చెప్పవలసిన అవసరంలేదని తీర్పులో పేర్కొనబడింది.[76] ఈ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ కేసు కొట్టివేసింది.[77]

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Declaration of A.P. Capital City Area–Revised orders" (PDF). Andhra Nation. Municipal Administration and Urban Development Department. 22 September 2015. Archived from the original (PDF) on 8 జూలై 2018. Retrieved 21 February 2016.
  2. "GO on enhancing capital city area". The Hindu. Vijayawada. 10 June 2015. Retrieved 15 June 2015.
  3. "Declaration of A.P. Capital City Area (Revised)". Andhra Patrika. Archived from the original on 28 September 2015. Retrieved 15 June 2015.
  4. "Andhra Pradesh Capital Region Development Authority Act, 2014" (PDF). News19. Municipal Administration and Urban Development Department. 30 December 2014. Archived from the original (PDF) on 18 February 2015. Retrieved 9 February 2015.
  5. "CRDA eyes CSR funds to push job potential in capital city". Times of India. Guntur. 1 July 2015. Retrieved 18 August 2015.
  6. Ravi, Ramakrishna Rao; Mahadevan, Subadevan (July 2018). "Pooling Land for Development in Andhra Pradesh" (PDF). Urban Solutions. Archived from the original (PDF) on 2019-03-23. Retrieved 2019-03-22.
  7. "New Andhra capital Amaravati to compete for Smart City tag". The New Indian Express. 25 May 2016. Archived from the original on 28 మే 2016. Retrieved 6 June 2016.
  8. ఖన్నా, సాక్షి. "Andhra Pradesh's New Assembly Building Ready to Handle Unruly Scenes With Ease". www.news18.com. Archived from the original on 12 ఏప్రిల్ 2018. Retrieved 12 April 2018.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "శాస్త్రోక్తంగా.. అమరావతి శంకుస్థాపన". 2015-10-24. Archived from the original on 2016-03-24. Retrieved March 24, 2016.
  10. "AP Capital Region Development Authority comes into being". The Hindu. Hyderabad. 31 December 2014. Retrieved 6 January 2015.
  11. "Andhra Pradesh releases master plan for its capital Amaravati". Business Standard. 31 December 2014. Retrieved 9 February 2015.
  12. "ADCL :: Amaravati Development Corporation Ltd". ccdmc.co.in. Archived from the original on 6 ఆగస్టు 2017. Retrieved 6 August 2017.
  13. G Naga Sridhar (2017-05-13). "Amaravati masterplan: AP to ink MoU with Singapore govt today | Business Line". Thehindubusinessline.com. Retrieved 2017-12-10.
  14. "In a big infra boost, Centre to fund Rs 29,000 crore Andhra expressway – Times of India". The Times of India. Retrieved 2 June 2017.
  15. "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
  16. "CM lays foundation stone for $1.8-bn BRS Medicity - Times of India". The Times of India. Retrieved 2017-08-16.
  17. "BRS Medicity Amaravati" (PDF). Archived from the original (PDF) on 16 ఆగస్టు 2017. Retrieved 16 August 2017.
  18. "Amaravati: How Andhra Pradesh plans to make its new capital Amaravati a world-class city - The Economic Times". Economictimes.indiatimes.com. 2017-05-21. Retrieved 2017-12-10.
  19. "Reliance Group: Reliance Group to set up 3 sports arenas in Amaravati | Amaravati News - Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 2017-12-10.
  20. "NRDC keen on opening shop in Amaravati - ANDHRA PRADESH". The Hindu. 2017-06-20. Retrieved 2017-12-10.
  21. "apit-gov-information-technology-communications-department-government-of-ap". apit.ap.gov.in. Archived from the original on 2018-04-27. Retrieved 2017-08-16.
  22. Gagan. "Southeast Asia's One of The Largest Data Centre Is Now in Andhra Pradesh". www.communicationstoday.co.in-gb. Archived from the original on 2017-08-16. Retrieved 2017-08-16.
  23. "HCL to set up IT centres in Amaravati, Vijayawada". The New Indian Express. Retrieved 2017-04-03.
  24. "HCL to set up IT centres in Amaravati, Vijayawada". -Avenue Realty. 2017-03-31. Archived from the original on 2018-07-08. Retrieved 2017-04-03.
  25. "Hyperloop Transportation Technologies | HTT". Hyperloop Transportation Technologies | HTT. 2017-09-06. Retrieved 2017-09-12. [dead link]
  26. "DPR being prepared for high-speed train to Amaravati". Retrieved 15 May 2017.
  27. Reporter, Staff. "Circular rail line for Amaravati approved". The Hindu. Retrieved 11 January 2017.
  28. వి, శంకర్. "ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చింది?". BBC News. Archived from the original on 2019-04-07. Retrieved 6 May 2019.
  29. P, Arun kumar (2021-02-08). "అమరావతిలో తిరిగి అభివృద్ధి పనులు షురూ...: జగన్ సర్కార్ కీలక నిర్ణయం". Asianet. Retrieved 2022-03-06.
  30. "How Andhra Pradesh plans to make its new capital Amaravati a world-class city".
  31. "A.P. Capital Region" (PDF). APCRDA. Government of Andhra Pradesh. p. 15. Archived from the original (PDF) on 13 September 2016. Retrieved 1 September 2016.
  32. "Capital city in Andhra Pradesh to cover 3 mandals". Deccan Chronicle. 31 December 2014. Retrieved 6 January 2015.
  33. U Sudhakar Reddy (31 October 2014). "Andhra Pradesh capital to come up on riverfront in Guntur district". Deccan Chronicle. Hyderabad. Retrieved 1 November 2014.
  34. "Economic Development Board Andhra Pradesh – Amaravati – The People's Capital". apedb.gov.in. Archived from the original on 18 మే 2017. Retrieved 3 May 2017.
  35. "Chandrababu Naidu launches 'Mana Amaravati' app for plot owners to reach out to investors". Livemint. 29 June 2017. Retrieved 29 June 2017.
  36. "mana amaravati - Apps on Google Play". play.google.com.
  37. "Mana Amaravati app". itunes.apple.com.
  38. "ACA's Mangalagiri stadium to be ready by 2018". The Hindu. Retrieved 2017-08-19.
  39. Bureau, Our (2013-07-12). "IVRCL bags orders worth Rs 1,098 crore". The Hindu Business Line. Retrieved 2017-08-19.
  40. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 25 July 2014.
  41. ":::- WELCOME TO GUNTUR DISTRICT OFFICIAL WEBSITE -:::". Archived from the original on 2017-09-24. Retrieved 2018-12-27.
  42. "Archaeological Museum, Amaravati - Archaeological Survey of India".
  43. "Buddha – Amaravati".
  44. "SRM University, AP - Amaravati". SRM University, AP - Amaravati. Retrieved 2017-08-16.
  45. "Home | VIT-AP University". www.vit.ac.in. Retrieved 2017-08-16.
  46. "Amity, SRM, VIT get nod to set up campuses in Andhra Pradesh | Press Room". mysrm.srmuniv.ac.in. Archived from the original on 2018-07-08. Retrieved 2017-02-27.
  47. "Amity University to set up campus in Amaravati | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 2018-05-12. Retrieved 2017-02-27.
  48. "Amrita University to Set Up Medical University at Amaravati, Andhra Pradesh | Amrita Vishwa Vidyapeetham (Amrita University)". www.amrita.edu. Archived from the original on 2018-07-08. Retrieved 2017-02-27.
  49. "IN THE PRESS | IUIH". www.iuih.co.uk. Archived from the original on 2018-05-10. Retrieved 2017-02-27.
  50. "Work at new Secretariat from June 27". The Hans India. Retrieved 3 May 2017.
  51. "Facelift to Guntur bus stand" (PDF). p. 2. Retrieved 12 May 2017.
  52. "APSRTC cuts losses by Rs. 116 crore".
  53. "Thullur- Vijayawada waterway a welcome convenience". The Hans India. Retrieved 2 June 2017.
  54. "AP CM to take part in Iftar party". The Hans India. 22 June 2016. Retrieved 29 June 2016.
  55. "Four-lane road to Andhra Pradesh new capital soon". The Hindu. Guntur. 6 August 2015. Retrieved 4 June 2016.
  56. "Gannavaram Airport to be named as Amaravati airport". The Hindu. Retrieved 12 January 2017.
  57. "Geographical Indication". The Hans India. 23 January 2016. Retrieved 15 May 2017.
  58. "Mangalagiri Cotton Saree | Textiles Committee (Ministry of Textiles, Government of India)". www.textilescommittee.gov.in. Archived from the original on 2017-12-10. Retrieved 2017-02-24.
  59. వి, శ్రీనివాసరావు. "రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వికేంద్రీకరణ". ప్రజాశక్తి. Archived from the original on 2019-12-28. Retrieved 28 December 2019.
  60. "చలో విశాఖ!". ఆంధ్రజ్యోతి. 2020-01-21. Archived from the original on 2020-01-21. Retrieved 2020-01-21.
  61. "రాజధాని రైతులకు వరాలు". సాక్షి. 2020-01-21.
  62. "సెలెక్టు కమిటీకి బిల్లులు". ప్రజాశక్తి. 2020-01-23.
  63. "మండలి రద్దు తీర్మానం.. కీలక పరిణామం.. వైసీపీ సర్కార్ తాజా నిర్ణయం ఏంటంటే..." ఆంధ్రజ్యోతి. 2020-01-28. Archived from the original on 2020-01-30. Retrieved 2020-01-30.
  64. "బోగస్ కమిటీలు తప్పుడు నివేదికలు". ఈనాడు. 2020-01-30.
  65. "3 రాజధానులే". ఈనాడు. Retrieved 2020-08-01.
  66. "తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు". BBC. 2021-12-17. Retrieved 2021-12-22.
  67. "మూడు రాజధానులపై రెఫరండం.. జగన్‌కు చంద్రబాబు సవాల్, సంచలన వ్యాఖ్యలు". సమయం. Retrieved 2021-01-24.
  68. "'అమరావతి' కోసం ప్రత్యేక బెంచ్‌". ప్రజాశక్తి. 2020-01-23.
  69. "రాజధాని తరలింపు నిర్ణయంపై హైకోర్టు తీవ్ర హెచ్చరిక". ఆంధ్రజ్యోతి. 2020-01-24. Archived from the original on 2020-01-30. Retrieved 2020-01-30.
  70. "14 వరకు ఎక్కడివక్కడే". ఈనాడు. 2020-08-05. Retrieved 2020-08-05.
  71. "వైఎస్ జగన్: సుప్రీంకోర్టు జడ్జిపై ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి". బిబిసి. Retrieved 2021-01-24.
  72. "హైకోర్టు ప్రతిష్ఠను పెంచేశా". ఈనాడు. Retrieved 2021-01-24.
  73. "మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ఓ పెద్ద ఎత్తుగడ.. ఇదీ తెరవెనుక కథ". BBC. 2021-11-22. Retrieved 2021-12-22.
  74. "Amaravati: రాజధాని అమరావతే". ఈనాడు. 2022-03-04. Retrieved 2022-03-04.
  75. "ఎప్పుడేంజరిగింది". ఈనాడు. 2022-03-04. Retrieved 2022-03-04.
  76. "Breaking-"Cannot Criminalize Private Sale Transactions": Andhra Pradesh High Court Quashes A Batch Of FIRs In Amaravati 'Insider Trading' Case". Live Law. Retrieved 2021-01-23.
  77. ""లావాదేవీలన్నీ ప్రైవేటువే అయినపుడు.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎక్కడిది?"". ఈనాడు. 2021-07-21. Retrieved 2021-07-21.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమరావతి&oldid=4357798" నుండి వెలికితీశారు