అక్షాంశ రేఖాంశాలు: 14°09′58″N 77°48′40″E / 14.166°N 77.811°E / 14.166; 77.811

పుట్టపర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుట్టపర్తి
పట్టణం
ప్రశాంతి నిలయం పరిసరాలు
ప్రశాంతి నిలయం పరిసరాలు
పుట్టపర్తి is located in ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తి
పుట్టపర్తి
Coordinates: 14°09′58″N 77°48′40″E / 14.166°N 77.811°E / 14.166; 77.811
దేశంఇండియా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
Government
 • Typeపురపాలక సంఘం
విస్తీర్ణం
 • Total45.47 కి.మీ2 (17.56 చ. మై)
 • Rank89వ (A.P.)
Elevation
475 మీ (1,558 అ.)
జనాభా
 (2011)
 • Total68,000
 • జనసాంద్రత1,500/కి.మీ2 (3,900/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+05:30 (ఐ.ఎస్.టి)
పిన్
515133, 515134
ఎస్.టి.డి.కోడ్91-8555
Vehicle registrationAP–02

పుట్టపర్తి ఆంధ్ర ప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా పట్టణం, జిల్లా కేంద్రం. ఈ పట్టణానికి ఆకర్షణ సత్య సాయిబాబా ప్రశాంతి నిలయం ఆశ్రమం. ఇది సమీప పట్టణమైన ధర్మవరం నుండి 42 కి. మీ. దూరంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

పుట్టపర్తికి తొలుత ఉన్న పేరు గొల్లపాళ్యం. ఆ తరువాత దానికి వాల్మీకిపురం అనే పేరు కూడా వచ్చింది.

భౌగోళికం

[మార్చు]

ఈ పట్టణం అక్షాంశ రేఖాంశాలు 14.166N, 77.811E.

పటం
పుట్టపర్తి ప్రాంతం (OSM గతిశీల పటం)

జనగణన వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఇది 4368 ఇళ్లతో, 15088 జనాభాతో 4547 హెక్టార్లలో విస్తరించి ఉంది.[2]

పరిపాలన

[మార్చు]

పుట్టపర్తి నగర పంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

సమీప ఇంజనీరింగ్ కళాశాల అనంతపురంలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల అనంతపురంలోను, పాలీటెక్నిక్ ధర్మవరంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హిందూపురంలో ఉన్నాయి.

వైద్య సౌకర్యాలు

[మార్చు]

ఇక్కడ 220 పడకలు గల ఒక అత్యాధునిక ఆసుపత్రి ఉంది. దీనిపేరు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్

రహదారి సౌకర్యం

[మార్చు]

ఇది అనంతపురమునకు 84 కి.మీ., హిందూపురమునకు 65 కి.మీ., బెంగుళూరుకు 156 కి.మీ., హైదరాబాదుకు 472 కి.మీ. దూరములో ఉంది. సమీప జాతీయ రహదారి NH 44, కోడూరు.

రైలు సౌకర్యం

[మార్చు]

ఇక్కడి రైలు నిలయం పేరు "శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం". దీనిని 2000 నవంబరు 23న ప్రారంభించారు. ఇది ఆశ్రమమునకు దాదాపుగా 8 కి.మీ. (5 మైళ్ళు) దూరములో ఉంది. దగ్గరిలోని రైలు కూడలి 45 కి.మీ. (28 మైళ్ళు) దూరములో ఉన్న ధర్మవరం.

విమాన సౌకర్యం

[మార్చు]

ఇక్కడ శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు నిర్వహణలో శ్రీ సత్యసాయి విమానాశ్రయం ఉంది. గతంలో సాధారణ విమానాల రాకపోకలు జరిగినా, ప్రస్తుతం ఒప్పందపు విమాన ప్రయాణాలకొరకు మాత్రమే వినియోగంలో ఉంది. ఈ విమానాశ్రయం ఆశ్రమానికి 4 కి.మీ. (2.5 మైళ్ళు) దూరములో ఉంది. దగ్గరిలోని అంతర్జాతీయ విమానాశ్రయం 110 కి.మీ. (68 మైళ్ళు) దూరములో గల కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం.

భూమి వినియోగం

[మార్చు]

పుట్టపర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో 2011 జనగణన వివరాల ప్రకారం, భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 94 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 64 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2015 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 9 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 31 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 14 హెక్టార్లు
  • బంజరు భూమి: 650 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1665 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2225 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 105 హెక్టార్లు ( బావులు/బోరు బావులు)

క్రీడా సౌకర్యాలు

[మార్చు]

2006 లో స్థాపించబడిన శ్రీ సత్యసాయి అంతర్జాతీయ క్రీడా కేంద్రం (Sri Sathya Sai International Centre for Sports) లో వివిధ రకాల భవనంలోపల ఆడగలిగే ఆటల సౌకర్యాలున్నాయి. 1985 లో నిర్మింపబడిన శ్రీసత్యసాయి హిల్ వ్యూ స్టేడియం (Sri Sathya Sai Hill View Stadium) 50,000 మంది ప్రేక్షకుల సామర్ధ్యం కలిగివుంది. దీనిని ప్రధానంగా క్రికెట్ ఆటకు వాడతారు..[3]

ఉత్పత్తి

[మార్చు]

వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు

చిత్రమాలిక

[మార్చు]

ప్రముఖులు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "Sri Sathya Sai Central Trust, Prasanthi Nilayam". www.srisathyasai.org.in. Archived from the original on 2019-11-01. Retrieved 2022-06-08.

వెలుపలి లంకెలు

[మార్చు]