Jump to content

హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
(హెచ్‌ఎండీఏ నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
హెచ్‌ఎండీఏ లోగో
సంస్థ వివరాలు
స్థాపన 2008
Preceding agency హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
అధికార పరిధి
జాబితా
ప్రధానకార్యాలయం హైదరాబాదు, తెలంగాణ
17°21′57″N 78°28′33″E / 17.36583°N 78.47583°E / 17.36583; 78.47583
వార్షిక బడ్జెట్ 54.5236 బిలియన్
సంబంధిత మంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, (ముఖ్యమంత్రి/చైర్మన్)
కల్వకుంట్ల తారక రామారావు, (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి)
కార్యనిర్వాహకులు అరవింద్‌ కుమార్‌, ఐఏఎస్, (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, నగర కమీషనర్)
బి. ఆనంద్ మోహన్, (PD-ORRi/c)
రామ్‌కిషన్, (కార్యదర్శి)
Parent agency పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
Child agency హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ

హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగర అభివృద్ధి ప్రణాళిక సంస్థ. ఇది 7,257 కిమీ (2,802 చదరపు మైళ్ళు) విస్తీర్ణం పరిధిలోవున్న హైదరాబాద్ జిల్లా, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాలు, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్ధిపేట జిల్లాలతో కూడిన హైదరాబాద్ మహానగర ప్రాంతాన్ని నిర్వహిస్తుంది.[1][2] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా), హైదరాబాదు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ (హడా), సైబరాబాదు అభివృద్ధి సంస్థ (సిడిఎ), బుద్ధ పూర్ణిమా ప్రాజెక్ట్ సంస్థ (బిపిపిఎ) వంటి సంస్థలను 2008లో విలీనం చేసి ఈ హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు.

అధికార పరిధి

[మార్చు]

7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాలను కలిగివున్న ఈ మహానగర ప్రాంతంలో హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఉంది. ఇందులో 175 గ్రామాలు, 31 గ్రామాలతో కూడిన 12 ముస్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఉన్నాయి.

క్రమసంఖ్య జిల్లా మండలాలు మొత్తం మండలాలు
1 హైదరాబాదు జిల్లా మొత్తం జిల్లా 16
2 మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా మొత్తం జిల్లా - ఘటకేసర్, శామీర్‌పేట, మేడ్చెల్, ఉప్పల్, కీసర, కుత్బుల్లాపూర్, మేడిపల్లి, బాచుపల్లి, దుండిగల్, కాప్రా, బాలానగర్, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, అల్వాల్ 14
3 రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, కందుకూర్, మహేశ్వరం, మంచాల్, మొయినాబాదు, రాజేంద్ర నగర్, సరూర్‌నగర్‌, షాబాద్, శంషాబాదు, శంకర్‌పల్లి, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, ఫరూఖ్‌నగర్, గండిపేట్, కొత్తూరు, నందిగామ, శేరిలింగపల్లి 20
4 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, రామాచంద్రాపురం, సంగారెడ్డి, అమీనాపూర్, గుమ్మడిదల, జిన్నారం, కంది, హత్నూర 8
5 మెదక్ జిల్లా మనోహరబాద్, నర్సాపూర్, శివంపేట, తూఫ్రాన్ 4
6 సిద్ధిపేట జిల్లా మర్కూక్, ములుగు, వర్గల్ 3
7 యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి 5

విధులు - బాధ్యతలు

[మార్చు]
  1. హైదరాబాదు మహానగర ప్రాంతంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ, ప్రచారం, భద్రత మొదలైన అంశాల ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతాయి.
  2. హైదరాబాదు మహానగర నీటి సరఫరా & మురుగునీటి శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రసార శాఖ, తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ వంటి సంస్థల సమన్వయంతో హైదరాబాదు మహానగర పరిధిలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థల అభివృద్ధికై అనేక కార్యకలాపాలను చేస్తుంది.

ఔటర్ రింగ్ రోడ్డు

[మార్చు]

ఈ సంస్థ 6696 కోట్ల రూపాలయ ఖర్చుతో ఔటర్ రింగ్ రోడ్‌ను నిర్మించింది. 2005లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2018, మే నెలలో పూర్తయింది.[3]

లాజిస్టిక్ పార్కులు

[మార్చు]

నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించడం, మెరుగైన ప్రయాణ సదుపాయాలను కల్పించి, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరులకు దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఔటర్ రింగు రోడ్డు చుట్టూ బాటసింగారం, మంగల్‌పల్లి దగ్గర లాజిస్టిక్ పార్కులను ఏర్పాటుచేయబడ్డాయి.[4]

అభివృద్ధి పన్ను

[మార్చు]

కొత్తగా నిర్మితమవతున్న ప్రాంతాలలో భవనాల నిర్మాణం కోసం బిల్డర్ల చెల్లించే అభివృద్ధి ఛార్జీలో హైదరాబాదు మహానగర అభివృద్ధి పనులకోసం 50 శాతం పెరుగుదలను ప్రభుత్వం ఆమోదించింది.[5]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "HMDA Districts and Villages" (PDF). Hyderabad Metropolitan Development Authority. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 13 జనవరి 2020.
  2. "About HMDA". Hyderabad Metropolitan Development Authority. Archived from the original on 8 ఫిబ్రవరి 2015. Retrieved 13 జనవరి 2020.
  3. "Archived copy". Archived from the original on 6 డిసెంబరు 2010. Retrieved 13 జనవరి 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. నమస్తే తెలంగాణ, హైదారాబాదు వార్తలు (4 December 2019). "పీపీపీ ప్రాజెక్టులపై హెచ్‌ఎండీఏ నజర్". ntnews.com. Archived from the original on 13 జనవరి 2020. Retrieved 13 January 2020.
  5. "Hyderabad Metropolitan Development Authority hikes development charges". The Times of India. 13 July 2012. Retrieved 13 January 2020.

ఇతర లంకెలు

[మార్చు]