శివాజీ (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివాజీ
జననం1977 జూన్ 30
వృత్తివ్యాఖ్యాత, నటుడు, రాజకీయ కార్యకర్త
జీవిత భాగస్వామిశ్వేతా గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తొడల్లుడు కూతురు)[1]
పిల్లలుశ్రీ, వెంకట్

శివాజీ తెలుగు సినిమా రంగానికి చెందిన ఒక నటుడు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, గొరిజవోలు అనే ఒక కుగ్రామం. మొదట బుల్లితెరపై వ్యాఖ్యాత గా పనిచేశాడు. తరువాత చిన్న పాత్రల ద్వారా పరిశ్రమ లోకి వచ్చిన శివాజీ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు. మొదట్లో ఏదైనా చిన్న ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిద్దామని హైదరాబాద్ కి వచ్చాడు. అప్పుడే కొత్తగా ప్రారంభమైన జెమినీ టీవీలో వీడియో ఎడిటర్ గా చేరాడు. కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య అక్కడే యాంకర్ గా మారాడు.

కె. రాఘవేంద్ర రావు 2000 సంవత్సరంలో తను చేయబోయే కొత్త సినిమా పరదేశి అనే సినిమా కోసం నూతన నటీనటుల కోసం స్టార్ 2000 కాంటెస్ట్ అనే ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో లయ, శివాజీ రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో నిలిచిన వారు పరదేశి సినిమాలో కనిపించిన తరువాత మరే సినిమాలలోనూ కనిపించలేదు. కానీ ఆ షో వల్ల శివాజీ గురించి పదిమందికి తెలిసింది. దాంతో నెమ్మదిగా సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.

డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు దగ్గర ఎడిట్ సూట్ లో పనిచేశాడు. అప్పుడే సినిమాలని నిశితంగా పరిశీలించడం నేర్చుకున్నాడు. శివాజీ నటించిన సినిమాల్లో మొదట విడుదలైంది. చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ అనే సినిమా.[2] కానీ తొలి అవకాశం ఇచ్చింది మాత్రం వై. వి. ఎస్. చౌదరి. ఆ సినిమా సీతారాముల కళ్యాణం చూతము రారండీ అందులో శివాజీది హీరో స్నేహితుడి పాత్ర. ఆ సినిమా కోసం ఆయన మొట్టమొదటి సారిగా విమానమెక్కి విదేశం (దుబాయ్) వెళ్ళాడు.

స్వతహాగా చిరంజీవి అభిమానియైన శివాజీ ఆయన్ను కలవాలని ఆశగా ఉండేది. ఆ కోరిక మాస్టర్ సినిమాతో తీరింది. ఈ సినిమాలో శివాజీ ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా కనిపిస్తాడు. కనీసం బూట్లు కూడా కొనుక్కోలేని పేదరికంలో ఉంటే చిరంజీవి అతన్ని ప్రోత్సహిస్తాడు. నిజజీవితంలో కూడా చిరంజీవి లాంటి పెద్ద మనసున్న వాళ్ళు తనను అలాగే ప్రోత్సహించారని వినమ్రంగా చెబుతాడు శివాజీ. హీరో అవ్వాలనే సినిమా రంగంలోకి రాలేదనీ వైవిధ్యభరితమైన ఏ పాత్ర రూపంలో అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నానని చెబుతాడు. సినిమాల్లో ఆయన తొలి సంపాదన పదిహేను వేల రూపాయలు. మాస్టర్ సినిమాకు పనిచేస్తే వచ్చిన డబ్బులవి. అందరు మధ్య తరగతి కుర్రాళ్ళలానే ఆయన ఆ డబ్బుతో వాళ్ళ అమ్మకు బంగారం కొన్నాడు.

రాజకీయాల్లో

[మార్చు]

భారతీయ జనతా పార్టీలో చేరడంతో శివాజీ రాజకీయాల్లో ప్రవేశించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత, రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించేందుకు కృషి చేసాడు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితిలో చేరి ఉద్యమించాడు. హోదా ఇవ్వనందుకు తన స్వంత పార్టీ భాజపాను విమర్శించాడు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా 2015 మే 3 న గుంటూరులో 48 గంటల నిరాహారదీక్ష చేసాడు.[3] తదనంతర కాలంలో పార్టీకి రాజీనామా చేసాడు.

2018 మార్చి 22న చేసిన ఒక పత్రికా ప్రకటనలో, ఒక జాతీయ రాజకీయ పార్టీ దక్షిణ భారతదేశంలో విస్తరించేందుకు గాను, "ఆపరేషన్ ద్రవిడ" అనే కార్యక్రమం చేపట్టిందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో "ఆపరేషన్ గరుడ"ను నిర్వహిస్తోందనీ చెప్పాడు.[4][5]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర(లు) గమనికలు
1997 మాస్టర్ శివాజీ
1998 శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి శివాజీ
ప్రేమంటే ఇదేరా శివాజీ
1999 ఫిల్మ్ నగర్
2000 యువరాజు శివాజీ
బ్రహ్మచారులు బాలు
కళాశాల సూరి
2001 ప్రియమైన నీకు రఘు
కుషీ బాబు
భార్య శంకర్
చిరంజీవులు చంటి
స్నేహితుడు బాలు
2002 ఫ్రెండ్స్
ప్రియనేస్తమా కిరణ్
చంద్రవంశం
స్నేహితులు బాలు
మనసుంటే చాలు విశాఖ
సందడే సందడి కామేష్
అద్రుష్టం పవన్
ఇంద్ర గిరి / వీర మనోహర్ రెడ్డి
శివ రామరాజు రాజు
2003 ఒట్టేసి చెపుతున్నా దిలీప్
ఆయుధం రుషేంద్ర
ఆడంటే అదో రకం కృష్ణుడు
శ్రీరామచంద్రులు చంద్ర
మిస్సమ్మ నంద గోపాల్
2004 అమ్మాయి బాగుంది శివ
శ్రీ & శ్రీమతి శైలజా కృష్ణమూర్తి కృష్ణమూర్తి
స్వరాభిషేకం చందు
కొంచెం టచ్లో వుంటే చెప్తాను కాళిదాసు
2005 మిస్టర్ ఎర్రబాబు ఎర్రా బాబూ
అదిరిందయ్య చంద్రం చంద్రం
2006 సీతారాముడు సీతారాముడు
టాటా బిర్లా మధ్యలో లైలా టాటా
రారాజు సూర్య
2007 ఆదివారం ఆడవాళ్లకు సెలవు కావాలి
సత్యభామ కృష్ణ కుమార్
నీ నవ్వే చాలు మురళీ కృష్ణ
తులసి హర్ష
భజంత్రీలు
స్టేట్ రౌడీ రాంబాబు
మంత్ర శివాజీ
2008 పెళ్లికాని ప్రసాద్ శివ ప్రసాద్
జల్సా రఘు
బ్రహ్మానందం డ్రామా కంపెనీ వాసు
మా ఆయన చంటి పిల్లాడు బుల్లబ్బాయి
ఆలయం రాజా
కౌసల్యా సుప్రజా రామ రవి
కుబేరులు శివ ప్రసాద్
2009 మస్త్ శివ
ఇందుమతి చందు
సత్యమేవ జయతే ప్రతాప్
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ సంజయ్ శాస్త్రి
18, 20 లవ్ స్టోరీ బుల్లన్న
డైరీ వంశీ
2010 ఆకాశ రామన్న జై
తాజ్ మహల్ అజయ్ / కుమార్ నిర్మాత కూడా
బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం శీను
2011 లోకమే కొత్తగా రాహుల్
ముగ్గురూ అతిధి పాత్ర
ఏమైంది నాలో మురళి
2012 అయ్యారే వెంకటేశం
ఎం బాబు లడ్డు కావాలా
2013 దాసు తిరిగింది
పవిత్ర శివ [6]
గోల గోల
2014 కమలతో నా ప్రయాణం సూర్యనారాయణ
బూచమ్మ బూచోడు కార్తీక్ [7]
చూసినోడికి చూసినంత
2015 దొరకడు
2016 సీసా
2024 కూర్మనాయకి [8]

డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా

[మార్చు]
సంవత్సరం సినిమా నటుడు గమనికలు
2002 జయం నితిన్
2002 సొంతం ఆర్యన్ రాజేష్
2003 దిల్ నితిన్ ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు
2003 సంబరం నితిన్
2008 ఉల్లాసంగ ఉత్సాహంగా యశో సాగర్
2012 పిజ్జా విజయ్ సేతుపతి తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు ఛానెల్ భాష పాత్ర గమనికలు
2018 గ్యాంగ్‌స్టార్స్ అమెజాన్ వీడియో తెలుగు సీఐ ఆంజనేయులు వెబ్ సిరీస్
2023 బిగ్ బాస్ 7 స్టార్ మా తెలుగు పోటీదారు రియాలిటీ షో
2023 నైంటీస్ ETV విన్ తెలుగు శేఖర్ వెబ్ సిరీస్[9]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (12 November 2023). "'మేము ఇలా ఉన్నామంటే మీరూ, చిరంజీవిగారే కారణం': శివాజీ సతీమణి". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  2. మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక లో ప్రచురితమైన శివాజీ ఇంటర్వ్యూ ఆధారంగా
  3. "Sivaji on hunger strike for Andhra Pradesh's special status". 14 May 2015. Archived from the original on 8 మే 2015. Retrieved 10 ఏప్రిల్ 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "సంచలన విషయాలు బయట పెట్టిన శివాజీ." 22 March 2018. Archived from the original on 22 మార్చి 2018. Retrieved 10 ఏప్రిల్ 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "శివాజీ చెప్పిన సినిమా స్టోరీ". 23 March 2018. Archived from the original on 10 ఏప్రిల్ 2018. Retrieved 10 ఏప్రిల్ 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. Archived from the original on 14 అక్టోబరు 2016. Retrieved 28 జూలై 2019.
  7. తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. Retrieved 7 August 2020.
  8. Chitrajyothy (29 June 2024). "'కూర్మనాయకి'లో శివన్నగా శివాజీ.. లుక్ అదిరింది". Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  9. Zee News Telugu (5 October 2023). "వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్‌ శివాజీ.. ఇంట్రెస్టింగ్ గా ఫ‌స్ట్ లుక్." (in ఇంగ్లీష్). Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.

బయటి లింకులు

[మార్చు]